Friday, 8 July 2011

Ramayanam Titbits


రామావతారం ఎలా అంతమయ్యింది? 
యమునికీ, రామునికి సంభాషణ జరుగునప్పుడు హనుమకి ద్వారమునకు కాపలాదారుగా ఉండమంటారు. ఎవరయినా లోపలికి వచ్చినచో వారికి శిరచ్ఛేదము చేయమని యముడు రాముని కోరతాడు. రాముడు అలానే అజ్ఞాపిస్తాడు. అయితే, హనుమ దూర్వాసుని శాపం వలన రాముడు, రామరాజ్యం వినాశనమవ్వడం కన్నా తన శిరసు ఖండించుకోవడం మేలని లోపలికి వచ్చేస్తాడు. యముడు అన్న మాట ప్రకారం హనుమకి శిరఛ్చేదన చేయమని రామునితో అనగా దుఃఖితుడైన రామునితో అతని గురువు వశిస్టుడు ఓ మాట అంటాడు. నీకు ఎంతో ప్రీతిపాత్రుడైన ఈ హనుమను ఈ రాజ్యము నుండి, నీ దర్శనము నుండి దూరము చేసిన అది అతనికి శిరచ్ఛేదముతో సమానమగునని వశిస్టుడు చెప్పిన పిదప రాముడు హనుమని తనకు దూరముగా పొమ్మని ఆజ్ఞాపించెననీ హనుమ రామాజ్ఞ శిరోధార్యంగా దాల్చి అక్కడి నుండి నిష్క్రమించెనని, ఆనక రాముడు తన అనుజుల సహితంగా సరయూ నదిలోకి ప్రవేశించి తన అవతారం చాలించెను అని నాకు తెలిసిన భాగము.

వానరులలో రాముడికంటే ముందు జన్మించిన వారెవరు?
రామాయణం బాలకాండ 17 వ సర్గ ఆధారణ్గా జాంబవంతుడు రామావతారం కంటే ముందుగానే జన్మించినట్లు తెలియుచున్నది. రామావతారం అయిన తదుపరి బ్రహ్మగారి ప్రేరణతో వివిధ దేవతల అంశల ప్రభావంగా వాలి, సుగ్రీవ, నల, హనుమంత మొదలగు వారు పుట్టిరి. దీనిని బట్టి వానరులలో రాముల వారికంటే ముందు జన్మించినది కేవలం జాంబవంతుడే.

అంజనేయుడి తండ్రి ఎవరు?
అంజనాదేవి, వానర రాజు అయిన కేసరిల యొక్క పుత్రుడు అంజనేయస్వామి. అంజనాదేవి సంతానం కోసం వేంకటాచలం (ప్రస్తుత తిరుపతి కొండ) మీద తపస్సు చేయగా శివుని ఆజ్ఞతో వాయుదేవుడు శివతేజమును అంజనాదేవి గర్భమున ప్రవేశపెట్టెను. అందుకే అంజనేయస్వామి శివాంశ, వాయుపుత్రుడు, కేసరినందనుడుగా పిలువబడుతాడు.

Thursday, 16 June 2011

మహాభారతంలో మనకు తెలిసినది ఎంత?

మహాభారతం.

ఈ పదం వినగానే మనకి గుర్తుకువచ్చేది పాండవులు, కౌరవులు, కృష్ణుడు. ఇంకా ఒక భయంకరమైన యుద్ధం.
ఇంతకంటే చాలా మందికి ఎక్కువగా తెలియదు.
అసలు భారతం ఎవరు రాసారు? మనకి తెలిసిన భారతం అదేనా?
మనకి తెల్సి మనం వింటున్న భారతం రాసింది వ్యాసుడు.
కాదు.
వినాయకుడు రాసాడు.
కాని అది చెప్పింది మాత్రం వ్యాసుడే.
ఇంతకీ అసలు ఈ వ్యాసుడు ఎవరు?

వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయన. ఇతని తల్లి ఒక జాలరి, తండ్రి పరాశరుడు. పరాశరుడు వశిష్ఠుడుని(సప్త ఋషులలో ఒకరు) మనుమడు. ఈ సప్త ఋషులు మొదట వేదం విన్న వారు. ఈ కృష్ణ ద్వైపయనకు వేద వ్యాసుడుని(వేదాలు విభజించి రాసాడు కాబట్టి)కూడా పేరు.

ఈ మహాభారతంలో ఉన్నవారంతా వ్యాసుని మనుమలే. ఈ భారతం మొత్తం అరవై భాగాలుగా ఉండేదంట. అందులో ఒక భాగం మనకు తెలిసింది, అదీ వ్యాసుని శిష్యుడు వైసంపాయన ద్వారా తెలిసింది. మొత్తం కథ అనగా వ్యాసుడు వినాయకుడికి చెప్పింది ఎవరికి తెలియదు ఈ ఒక్క భాగం తప్ప.

అది ఎలా అంటే వైసంపాయన ఈ కథ జనమేజయుని యజ్ఞస్థలిలో చెప్పాడు. ఈ జనమేజయుడు పాండవ మధ్యముడు అర్జునుని మునిమనవడు. ఇలా చెప్పేటప్పుడు రోమహర్షణ అనే అతను విని తన కొడుకు ఉగ్రస్రావుడుకి వర్ణించాడు. అతడు నైమిష అరణ్యములో ఉన్నశౌనకాది మునులకి చెప్పాడు.
వ్యాసుడు భారతాన్ని తన కొడుకు శుకుడుకి కూడా చెప్పాడు. ఇది శుకుడు పరీక్షిత్తుడికి చెప్పాడు. వ్యాసుని శిష్యులలో జైమిని అనే శిష్యుడు కూడా గురువు దగ్గర ఈ కథ విన్నాడు..కాని తనకి సందేహాలు ఎక్కువ ఉండేవి.తన సందేహాలను నివృత్తి చేసుకుందాము అనుకున్నాడు కాని ఆ సమయానికి వ్యాస మహర్షి లేడు. జైమిని మార్కండేయుని దగ్గరకు వెళ్ళాడు. కాని మార్కండేయుడు మౌన వ్రతంలో ఉన్నాడు. అప్పుడు మార్కండేయుని శిష్యులు జైమినిని ఒక నాలుగు పక్షులు ఉన్నాయి వాటి దగ్గరకు వెళ్ళు అవి చెప్తాయి అని పంపుతారు.(అవి ఏమీ పక్షులో నాకు తెలియదు.) ఈ నాలుగు పక్షుల దగ్గరికి ఎందుకు పంపారు? ఎందుకంటే ఇవి కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాయంట. అది ఎలా అంటే యుద్ధస్థలిలో వీటి తల్లి అలా ఎగురుతూ వెళుతుంటే ఒక బాణం వచ్చి ఈ పక్షికి తగులుతుంది. అలా తగిలినప్పుడు దీని కడుపులో ఉన్న నాలుగు గుడ్డులు కింద పడ్డాయంట. (కింద పడితే పగలవా అనొద్దు). అవి ఎందుకు పగలలేదంటే అది ఆ యుద్ద భూమి మొత్తం రక్తంతో నిండి ఉండీ పగలలేదు అని. అలా పడ్డ గుడ్డుల మీద ఒక ఏనుగు గంట పడి, అంటే వాటికి తగలకుండా ఆ గుడ్డులు కాపాడబడ్డాయి అని. యుద్ధం అయిపోయినాకా కొందరు ఋషులు గంట కింద ఉన్న పక్షులని చూసి ఇవి మనుషుల కంటే యుద్ధం గురుంచి ఎక్కువ తెలుసుకున్నాయి అని వీటికి వాక్కు ప్రసాదించారని వినికిడి. ఈ పక్షులు జైమిని సందేహాలని చాలా వరకు తీర్చి ఇంక ఎవరికి తెలియనివి కూడా చెప్పాయి.

అసలు వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు 'జయ' అది కాస్త అలా నలుగురికి పాకుతూ 'విజయ' అయ్యింది.అలా అలా అయ్యి మొత్తానికి 'భారతం' అని పేరు తెచ్చుకుంది.(భారతం అని ఎందుకు వచ్చింది అంటే భారత వంశానికి సంబందించిన వారి గురుంచి కాబట్టి)

అసురులమీద దేవతలదే పై చేయి ఉండాలని ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి స్వర్గలోకంలో. వీటిని జరిపించే బాధ్యత బృహస్పతిది. అతని భార్య తార, ఆ యజ్ఞాల సమయంలో అతనితో లేకుంటే ఆ యజ్ఞాలకి ఫలమే ఉండదు. ఎప్పుడూ పూజలలో ఉండే బృహస్పతి మీద చిరాకు పుట్టి ఒకరోజు తార చంద్రునితో వెళ్ళిపోతుంది. బృహస్పతి దేవతలా రాజైన ఇంద్రుని వద్దకు వెళ్లి ఈ యజ్ఞాలు ఫలించాలి అంటే నా భార్యనీ నాకు ఇప్పించు అని అంటాడు. యజ్ఞ ఫలం లేకుంటే భూలోకం కూడా అతలాకుతలం అవుతుందని ఇంద్రుడు తారనీ బృహస్పతి దగ్గరకు వచేయ్యమని ఆజ్ఞాపిస్తాడు. ఇంక తారకి తప్పక బృహస్పతి దగ్గరకు వస్తుంది. కాని అప్పటికే తార కడుపుతో ఉంటుంది. దానికి బృహస్పతి, చంద్రుడు ఇద్దరు ఆ పుట్టబోయే వానికి తండ్రి అని చెప్పుకుంటారు. తార ఏమీ చెప్పక మౌనంగా ఉంటె కడుపులోని బిడ్డ తన తండ్రి ఎవరో తనకి తెలియాలని తారని అడుగుతుంది. ఆ కడుపులోని బిడ్డ అడిగిన ప్రశ్నకు దేవతలంత హర్షించి అతనికి బుధుడు అని పిలుస్తారు. ఆ బిడ్డ అడిగిన ప్రశ్నకి జవాబుగా తార నీవు చంద్రుని కుమారుడివి అని. అది విన్న బృహస్పతి కోపంతో ఆ బిడ్డ ఆడా మగ కాని వాడిగా ఉంటాడని శపిస్తాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడవుతాడు.

ఒకరోజు తార బుధుడునీ అడుగుతుంది పెళ్లి చేసుకుంటావ అని. దానికి బుధుడు నన్నెవరు చేసుకుంటారు. భర్తగాన లెక భార్యగాన? అప్పుడు అతని తల్లి తార..అతని తండ్రి శాపానికి ఏదో ఒక కారణం ఉండకుండా ఉండదు. ఎవరో ఒకరు దొరుకుతారు చూడు అని.

ఒక రోజు బుధుడు ఇల అనే ఆమెను చూసి ప్రేమిస్తాడు. అసలు ఈ ఇల ఎవరు?

ఇలా ఒకప్పుడు సుద్యుమ్న, మను రాజు కొడుకు. ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు ఆ అడవిలో శివుడు శక్తితో ఉన్నప్పుడు శక్తి కోరిక మేరకు అంటే.. శక్తి ఆ సమయంలో ఏ మొగ జంతువు కాని, మొగ మనిషి కాని ఆ అడవిలో ఉండకూడదు అంటే శివుడు అనుగ్రహం వల్ల ఆ అడవిలో అన్ని మొగ జంతువులు, పక్షులు అలా ఆడవిగా మారిపోయాయి. ఆ సమయంలోనే సుద్యుమ్న అక్కడే ఉండటం చేత ఆడామేగా మారిపోయాడు. అతడు వెళ్లి శక్తి సారాను కోరినప్పుడు. ఆ తల్లి బయపడకు, శివుని మంత్రం నుండి నేను ఏమీ చెయ్యలేను కాని నీకు ఆ శాపం మారుస్తాను అని. చంద్రుడు తగ్గినప్పుడు నీవు స్త్రీ లాగా, పెరిగినప్పుడు పురుషునిలా ఉంటావు అని వరం ప్రసాదించింది.

అలా ఏ ఇల బుధుడుకి భార్యగా అయ్యింది. ఇద్దరికీ చాలా మంది కొడుకులు పుట్టారు. వీలందరూ చంద్రవంశీయులు అని పిలవబడ్డారు.(వీళ్ళు బుధుని పిల్లలు. బుధుడు అసలు తండ్రి చంద్రుడు. అందుకే చంద్రవంశీయులు పిలవబడ్డారు)

ఇలకు, బుధునికి పుత్రుడుగా జన్మించిన వాడు పురూరవుడు. చంద్రవంశంలో ప్రసిద్ధుడైనవాడు. ఒకనాడు పురూరవుడు జలకాలడుతున్న ఊర్వశినీ చూసి ఇష్టపడ్డాడు. తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. ఇతనితో జీవించడానికి ఊర్వశి రెండు షరతులు పెట్టింది.ఒకటి తనతో తప్ప మరెప్పుడూ అతడు ఎవరికి నగ్నంగా కనబడకూడదు. రెండవది తను పెంచుకుంటున్న మేకలను కాపాడాలి అన్నది. ఈ రెండింటికీ పురూరవుడు ఒప్పుకున్నాడు. వారిద్దరూ ఎన్నో ఏళ్ళు సుఖంగా జీవించారు. చాలా మంది పిల్లలని కన్నారు. ఇల ఉంటె ఊర్వశి లేకపోతే ఇంద్రసభలో ఏమీ అంతగా లేకపోయేసరికి, ఇంద్రుడు ఆమెను తీసుకురావటానికి ఉపాయం చెప్పి, ఇద్దరు గంధర్వులను వాళ్ళదగ్గరికి పంపిస్తాడు.ఆ గంధర్వులు ఒక రాత్రిపూట పురూరవుడు ఊర్వశితో నిద్రిస్తుండగా , ఊర్వశి మేకలను తీసుకొని పారిపోయారు. అది గమనించిన ఊర్వశి పురూరవుడితో మేకలను ఎవరో తీస్కేల్తున్నారు నా మేకలు నాకు తెచ్చి ఇవ్వు. నా షరతులకి ఒప్పుకున్నావు వాటిని కాపాడలేవా అని అతడిని పంపింది. వెంటనే బట్టలు కూడా వేసుకోకుండానే ఆ మేకలను తీసుకురావడానికి పరుగెత్తాడు పురూరవుడు. రెండు షరతులలో విఫలం అయ్యాడు అని ఊర్వశి అతడిని వదిలి వెళ్ళిపోయింది. తరువాత కొందరు అంటారు పురూరవుడు పిచ్చివాడై ..అలా తిరుగుత ఏడుస్తూ ఉన్నాడని...కొందరు గందర్వుడుల మారాడు ఊర్వశి వెంట సంగీత కచేరీలు చేస్తూ ఉంటాడు అని.

విశ్లేషణ..
అప్స అనగా నీరు. అప్సరనీ జల దేవత అని కూడా అనొచ్చు. ఏ జలం భూమికి స్వర్గం నుండి వస్తుంది(వర్షం లాగా). మళ్లి కొన్ని రోజులకి స్వర్గానికి వెళ్ళిపోతుంది(ఆవిరి లాగా). జలం వల్ల జీవం వస్తుంది. పైన చెప్పిన దానిలో అదే ఉంది. అప్సర అంటే ఊర్వశి(జలం), పురూరవుడు మనిషి (మనిషి నీటి కోసం పడే ఆరాటం). మళ్ళీ ఆకాశానికి(ఇంద్రుడు) వెళ్ళిపోతుంది జలం ఆవిరిలాగా.

ఊర్వశి ఇల షరతులు ఎందుకు పెట్టింది అయినా వాటికి పురూరవుడు ఎందుకు ఒప్పుకున్నాడు?

మన సమాజంలో(ఇప్పుడు కాదు పూర్వం) స్త్రీకి ఒక ముఖ్యమైన స్థానం కల్పించారు. తన భర్తని తను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ వల్లే పురుషుడు వంశం పెంచి తన పూర్వికుల పాపాలను పోగ్గోట్టుతాడు.

123

Friday, 10 June 2011

కృష్ణుడి శిరోవేదన!

అది ద్వారకలోని శ్రీకృష్ణమందిరం. రుక్మిణీ సత్యభామలు ఎందుకో తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నారదులవారు కృష్ణభగవానుడిని చూడటానికని వచ్చారు.

రుక్మిణీ సత్యభామలు ఏడుస్తూ వెళ్లి ఆయన పాదాలముందు ప్రణమిల్లారు.

‘‘లెండమ్మ! లెండి... ఎందుకిలా ఉన్నారో చెప్పండి. మీకేం భయం లేదు. నేనున్నానుగా’’ అంటూ అనునయంగా అడిగారు.

‘‘ఏం చెప్పమంటారు స్వామీ! మా నాథుడు భరించలేనంతటి శిరోవేదనతో బాధపడుతున్నారు. దయచేసి తరుణోపాయం సెలవివ్వండి’’ అన్నారు.

‘‘నారాయణ నారాయణ! అది మామూలు తలనొప్పి కాదు. బహుశా శత్రువులెవరో చేయించిన ప్రయోగం అయి ఉంటుంది.   నిజమైన భక్తులు ఎవరైనా, తమ పాదధూళిని మంచి నీటితో కలిపి ఆయనతో తాగిస్తే సరి.’’ అన్నాడు నారదుడు.

ఆ మాటలు వింటూనే, ‘‘రామ రామ! జగాలనేలే ఆ స్వామికి మా పాదధూళి కలిపిన నీటిని ఇవ్వడమా? సర్వపాపాలూ మమ్మల్ని చుట్టుకోవూ?’’’అంటూ గట్టిగా చెవులు మూసుకున్నారు.

కృష్ణుడు మూలుగుతూనే, ‘‘పోనీ, రేపల్లెకు వెళ్లి గోపికలకు విషయం తెలియజెప్పి రండి.’’అంటూ మూలుగులు అధికం చేశాడు.

నారదుడు వెంటనే రేపల్లె వెళ్లాడు.

ఆయన్ని చూస్తూనే గోపికలందరూ ‘‘స్వామీ! మా కృష్ణయ్య కుశలమేనా’’ అంటూ అడిగారు.

నారదుడు విచారంగా ముఖం పెట్టి, ‘‘ఏం చెప్పమంటారమ్మా! కృష్ణుడు అమితమైన తలనొప్పితో బాధపడుతున్నాడు. అది తగ్గాలంటే ఎవరైనా భక్తులు తమ పాదధూళిని మంచినీటిలో కలిపి, దానిని కృష్ణుడిచేత తాగించాలి’’ అని చెప్పాడు.

ఆ మాటలు వింటూనే ఓ గోపిక తన పాదధూళిని తీసి దానిని అక్కడ ఉంచింది. తక్కిన గోపికలందరూ కూడా తమ పాదధూళిని తీసి అక్కడ వేశారు. అంతా కలిపి ఒక గుట్టలా తయారైంది. 

దానిని జాగ్రత్తగా తీసి మూటగట్టుకున్నాడు నారదుడు.

‘‘దీనితో కృష్ణుడి శిరోవేదన తగ్గిపోతుంది. కానీ మీరందరికీ రౌరవాది నరక బాధలు తప్పవు మరి’’ అన్నాడు నారదుడు. 

‘‘మా కన్నయ్య తలనొప్పి తగ్గిపోతే మాకదే చాలు స్వామీ!’’ అన్నారు అందరూ ముక్తకంఠంతో. 

మెచ్చుకోలుగా వారివైపు చూస్తూ నారదుడు ఆకాశమార్గాన వెళ్లి జరిగినదంతా చెబుతూ కృష్ణుడి ముందు ఆ మూటను ఉంచాడు. కృష్ణుడు మూటవిప్పి ఎంతో ప్రియంగా ఆ ధూళిని తలకు రాసుకుని నొప్పి తగ్గిపోయిందంటూ ఆనందంగా లేచి కూర్చున్నాడు. 

అప్పటివరకూ తమకన్నా ఎక్కువ ఏముందని కృష్ణుడు ఆ గొల్లపడుచుల వెంటపడుతున్నాడు అనుకుంటున్న రుక్మిణీ సత్యభామా సిగ్గుతో తలలు వంచుకున్నారు.