Sunday, 30 August 2015

గాయత్రి మంత్రం

గాయత్రి మంత్రం
ఓం భూర్భువస్సువః తథ్స వితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ || ఇదే గాయత్రి మంత్రం.

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం, పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.
గాయత్రి చంధసాం మాత. అంటే అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి.
తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది. 24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు. ఈ మంత్రాన్ని క్షించేవారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు.అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని.

గాయత్రి మంత్రం మీద జరుగినవి,జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని,ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగట్లేదంటే అతిశయొక్తి కాదు.గాయత్రి మంత్రాన్ని నియమంగా, పట్టుదలతో, శాస్త్రం చెప్పిన రీతిలో,సరైన స్వరంతో చేస్తే సౌరశక్తికి 1లక్ష రెట్ల శక్తి జపించేవారికి కలుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ఈ మంత్రంలో ఉన్న 24 అక్షరాలు మన శరీరంలో ఉన్న 72000 నాడులను ప్రేరేపిస్తాయని,మన ముఖ భాగంలోని కదలికలతో మన శరీరంలో ఉన్న 6 చక్రాలను ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది.

పాండ్య అనే ఒక డాక్టరు,ఈ మంత్రం యొక్క శక్తిమీద పరిశోధనకు తన వృతిని కూడా త్యాగం చేసి మన దేశంలో గత 40సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.ఆయన మాటల్లొ చెప్పాలి అంటే లక్షలమంది ఈ గాయత్రిమంత్రాన్ని ఒకే సమయంలో జపిస్తే,ఆ ప్రాంతంలో ఆ జపం వల్ల పుట్టే ద్వని తరంగానికి(సౌండ్ వెవ్ కి)ఉన్న శక్తి,అతి పెద్ద అణువినాశనం(న్యూక్లియర్ హొలొకాస్ట్)నుండి ప్రజలను రక్షిస్తుంది.ఇంకా చెప్పాలి అంటే ఇది అణుబాంబుల రెడియేషన్ శక్తిని కూడా నిర్వీర్యం చేసి,సమస్త ప్రపంచాన్ని రక్షిస్తుంది.భారతీయులకున్న గొప్ప ఆస్తి గాయత్రి మంత్రమని,అది ప్రతి భారతీయుడు జపించడం చేత ఈ దేశరక్షణకు ఉపయోగపడుతుందని పాండ్య గారు వివరిస్తారు.

హెల్డేన్ అనే శాస్త్రవేత్త గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలోని అన్ని లెబరెటరీల తలుపుల మీద చెక్కించాలి అన్నారు.

గొప్ప కార్యాలను కూడా ఈ మంత్ర జపం చేత సాధించవచ్చని మహాయోగి శ్రీ అరబిందొగారి మాట.

గాయత్రి మంత్రమే ఈ భారత దేశాన్ని మేల్కొలిపింది.ఇది చదవడానికి చాలా సులువుగా ఉంటుందని రవింద్రనాధ్ ఠాగూర్ అన్నారు.

దీని మీద జపాన్ లో కూడా పరిశోధనలు జరిగాయి.

వేదకాలంలో అందరికి ఉపనయనం ఉండేది(అసలు కులవ్యవస్థ లేనేలేదు,వేదంలో ఎక్కడ కుల ప్రస్తావన లేదు).స్త్రీలు కూడా గాయత్రి జపం చేసేవారు.సీత దేవి ఆశోకవనంలో ఉన్న సమయంలో కూడా దగ్గర్లొ ఉన్న చెరువులో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసేది అని వాల్మికి రామాయణంలొ కనిపిస్తుంది.స్త్రీలు గాయత్రి జపం చేయకూడదని,ఉపననయం అందరికి ఉండదు అన్నవి కల్పితాలు మాత్రమే.కాలక్రమంలో ఏర్పడాయి.అందరు ఉపనయనం చేసుకొని గాయత్రి జపం చేయాలని వేదం చేప్తొంది.

మనం మన దేశంలో కులాల పేరుతో కొట్టుకుచస్తున్నాం.విదేశీయులు మన గ్రంధాలను ఎత్తుకుపొయి పరిశోధించి పెటెంట్ హక్కులు పొందుతున్నారు.అందుకు ఉదాహరణ ఈ గాయత్రి మత్రమే.దీని మీద పరిశోధించి ఈ మంత్రం మీద "పెటెంట్ హక్కులు" పొందింది ఒక జర్మన్ కంపెని.

ఈ గాయత్రి మంత్రం గురించి,ఆని మీద జరిపిన పరిశోధనలు,వాటి ఫలితాల గురించి మరింతవిపులంగా తరువాత చెప్పుకుందాం.

యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

స్త్రీలకు, సమాజంలోని కొన్ని వర్ణాలకు ఉపనయనం చేసే ఆచారం ఇప్పుడు లేదు.మరి వారికి ఎటువంటి మార్గం లేదా?.....ఉంది.పైన చెప్పబడ్డ శ్లోకం.గాయత్రి మంత్ర శక్తికి సమానమైనా శక్తితో,అదే అర్ధంతో మన శాస్త్రం ప్రసాదించినది ఆ శ్లోకం.ఆసక్తి ఉన్నవారు ఆ శ్లోకాన్ని రోజు నియమంగా చదవండి.భవిష్యత్తులొనైనా అందరు మన ధర్మం గురించి తెలుసుకొని,అందరు ఉపనయనం చేసుకొని, గాయత్రి ఉపాసన చేస్తారని ఆశిద్దాం.

ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||


Friday, 28 August 2015

శ్రీ మహాభారతం రచన






ఊ కొడతావా..! ఊరుకోమంటావా..!!

పంచమవేదంగా భావించే మహాభారతాన్ని వ్యాసుడు రాసే క్రమంలో చిన్న గమ్మత్తు జరిగింది. మహాకావ్య రచనకు పూనుకున్న వ్యాసుడు.. తను శ్లోకాలు చెబుతుంటే ఎవరైనా రాస్తే అనువుగా ఉంటుందని అనుకున్నాడట.

అందుకు విఘ్నేశ్వరుడే సరైనవాడని భావించి.. మహాభారతం తను చెబుతుంటే రాసి పెట్టాలని కోరతాడు వ్యాసుడు.

అందుకు సరేనన్న గణపతి.. చిన్న మెలిక పెడతాడు

ఒక్కసారి రాయడం మొదలుపెడితే తన గంటం ఆగదని, తను శ్లోకం రాసేసి ఊ అనగానే మరో శ్లోకం చెప్పాలని షరతు విధిస్తాడు. లేకపోతే అక్కడితో రాయడం ఆపేస్తానని చెబుతాడు.

ఏకదంతుడి ఆంతర్యం గ్రహించిన వ్యాసుడు అందుకు ఒప్పుకుంటూనే గణపతికీ ఓ పరీక్ష పెడతాడు. తను చెప్పిన శ్లోకం తాత్పర్యం అర్థమైతే గానీ అక్షరబద్ధం చేయరాదని.. లేకపోతే తనూ ఆ రోజుకు శ్లోకాలు చెప్పడం ఆపేస్తానని సెలవిస్తాడు.

ఈ రెండు ఒప్పందాల అయ్యాక.. ఇద్దరూ కావ్యరచనకు సిద్ధమవుతారు. వ్యాసుడు శ్లోకాలు చెబుతుండటం.. విఘ్నేశ్వరుడు ఊ కొడుతూ రాసేయడం.. ఇదే తంతు.

విఘ్నేశ్వరుడి వేగానికి కళ్లెం వేయడానికి ఒక కఠినమైన శ్లోకం వదిలేవాడు బాదరాయణుడు. దాన్ని అర్థం చేసుకోవడంలో కాస్త ఆలస్యమై.. గణపతి ఊ కొట్టడం ఆపేయడంతో.. ‘ఈ రోజుకు ఇక్కడితో ముగిద్దామా గజాననా’ అంటూ వేద వ్యాసుడు ఊపిరి పీల్చుకునేవాడు.

ఇలా సాగింది మహాభారత రచన.


Tuesday, 25 August 2015

అష్టాదశ శక్తి పీఠాలు2



అష్టాదశ శక్తిపీఠాలు
శ్రీ భ్రమరాంబికాదేవి
ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి ‘శక్తి’ భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు.


శ్రీ గిరిజా దేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీ తీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృ దేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

శ్రీ ఏకవీరా దేవి
శ్రీ ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి - అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపుపై కప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుఖా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు.

శ్రీ మహంకాళీ దేవి
ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర నది. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమి నుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇది అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని గర్‌ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికా మాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు. పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్‌ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరిట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్‌ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహా భారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్య యుగానికి చెందినదని చెబుతుంటారు. హర్ష వర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత చాలాకాలానికి గ్వాలియర్‌ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు. సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని, నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం
ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం:
కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలుస్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనకివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

కామరూపిణి
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడు రోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

అస్సాం గౌహతి సమీపంలోని నీలాచల పర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి, నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

శ్రీ మాణిక్యాంబా దేవి:
రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమేశురాణి
పాలయమాం గోదావరి తటవాసినీ – శక్తి స్వరూపిణీ

దేశంలోని అష్ట్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తి పీఠంగా కొనియాడబడుతున్న శ్రీ మాణిక్యాంబా దేవి. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని పురాణ ప్రసిద్ధి గాంచిన భీమేశ్వరాలయ ప్రాంగణంలో కొలువైవున్నది. దక్షుడు యాగం చేసిన ప్రదేశం కాబట్టి ఈ గ్రామం ద్రాక్షారామం అయ్యింది. సతీదేవి కణత భాగం పడిన చోటు ఈ పీఠం. ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడుగా, మాణిక్యాంబదేవితో ఒకేసారి స్వయం ప్రతిష్ట పొందిన ప్రదేశం ద్రాక్షారామం. ఈ ప్రాంతం త్రిలింగ దేశంలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం ఈ మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ దేశం అంటారు. మిగతా శక్తి పీఠ క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత ఉంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరో చోట వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవిని శ్రీచక్ర యంత్రం పై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి, అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరగడం ఈ క్షేత్ర విశిష్టత. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఇది ఒక మహిమాన్విత ప్రాంతంగా విరాజల్లుతుంది. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చేబుతారు. అంతేకాక ఈ శివాలయం పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ కాశి అని మరో పేరు వుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి నేరుగా ద్రాక్షారామంకు బస్సు సర్వీసులు వున్నాయి. యాత్రికుల విడిది కోసం దేవస్థానం కాటేజీలు, టూరిజం శాఖ అతిథి గృహం, పైండా జమిందారు సత్రం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు, కుంకుమ పూజ, లక్ష కుంకుమార్చన ఈ క్షేత్రంలో జరిగే ప్రత్యేక పూజలు. శ్రీచక్ర యంత్రంపై అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల దేవికి ప్రత్యేక అవతార రూప అలంకరణలు ఉండవు.

శ్రీ విశాలాక్షీదేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసింది విశాలాక్షి పీఠం.

అయోధ్య, మధుర, హరిద్వార్‌, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్త మోక్ష ప్రదాయికాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా, మహావిష్ణువు కాశీలో శివ లింగపూజలో ఉండటం గమనిస్తాడు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుందని మహావిష్ణువుచే తెలుసుకుని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించసాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా, సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేధయాగాలు చేశాడు. ఈ దశాశ్వ మేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీ వైష్ణవీ దేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పించుకుని, అతని తంత్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అని పిలుస్తారు.

త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరములో దండయాత్రకు బయలుదేరేముందు జగన్మాతను ప్రార్ధించగా జగన్మాత సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాల్లో ప్రత్యక్షమై ఆయన పూజలందుకున్నట్లు చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పూజలందుకున్న ఆ జగన్మాత ద్వాపరయుగంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి జమ్ము ప్రాంతాల్లోని అడవుల్లో కొలువుదీరినట్లు చెప్పబడుతుంది. ఈ విధంగా త్రేతాయుగం, ద్వాపరయుగంలో పూజలందుకున్న ఈ అమ్మవారు కలియుగంలో కొలువుదీరడాన్ని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎత్తయిన పర్వత శ్రేణులు, వాటిపైన ఆకాశన్నంటే వివిధ వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రకృతి శోభ మధ్య త్రికూట పర్వతం పైన "శ్రీ వైష్ణవీ దేవి" ఆలయం ఉంది. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ వైష్ణవదేవీ యాత్ర కత్రా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడినుంది ఆలయం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు సాధారణంగా కాలినడకనే వెళతారు. ఈ దారిలో వాహనాలు వెళ్ళలేవు. నడవలేని వారికి , వృద్ధులకు గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. కత్రాకు కొంత దూరంలో ’భూమికా మందిరం ’ ఉంది.

ఇక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్‍లో భక్తులు దర్శనానికి వెళ్ళేముండు తమ పేర్లను నమోదు చేసుకోని రసీదు పొందాలి. ఆ రసీదు ఉన్నవారే దర్శనానికి అర్హులు. ప్రయాణ మార్గంలో కత్రా నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే "దక్షిణ దర్వాజా" ఉంది. ఇక్కడి నుండి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి "దర్సన దర్వాజా" అని కూడా పేరు. దీనిని దాటిన తర్వాత "బాణ్ గంగా" ఉంది. వైష్ణవీదేవి బాణం వేయగా అక్కడ ఉన్న రాయి నుండి గంగ ఉద్భవించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెపుతారు.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

మ‌ల‌య‌ప్ప స్వామి

తిరుమ‌ల‌లో మ‌ల‌య‌ప్ప స్వామిని ఉత్స‌వ‌మూర్తిగా ఊరేగించిన విశేషాలు త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తుంటాయి. ఇంత‌కీ ఎవ‌రీ మ‌ల‌య‌ప్ప స్వామి! ఆ పేరు ఎలా వ‌చ్చింది! అస‌లు ఉత్స‌వ మూర్తి అంటే ఎవ‌రు! అన్న విశేషాలు...

ధ్రువ‌బేర‌:
తిరుమ‌ల గ‌ర్భాల‌యంలో ఉన్న మూల‌విరాట్టుని `ధ్రువ బేర‌` అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్ర‌తిమ అని అర్థం. ఈ మూల‌విరాట్టుని ఉన్న చోట నుంచి క‌ద‌ల్చరాదు కాబ‌ట్టి ఆ పేరు వ‌చ్చింది. మ‌రి గ‌ర్భాల‌యం వెలుప‌ల శ్రీనివాసునికి సేవ‌లు చేసేందుకు, క‌ళ్యాణోత్స‌వం త‌దిత‌ర ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు, ఊరేగించేందుకు ఒక అంశ ఉండాలి క‌దా! అదే ఉత్స‌వ బేర‌! తిరుమ‌ల‌లో శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు, ఉత్స‌వమూర్తిగా వెలుగొందుతున్నారు. మూల‌విరాట్టుకి జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ ఈ ఉత్స‌వ‌బేర ప్ర‌తినిథిగా ఉంటుంది కాబ‌ట్టి, ఈ స్వామివారిని మూల‌విరాట్టుతో స‌మానంగా భావిస్తారు.

చ‌రిత్ర‌:
ఒక‌ప్ప‌డు ఉత్స‌వాల కోసం ఉగ్ర‌శ్రీనివాసుని మూర్తిని వినియోగించేవార‌ట‌. అయితే ఒకానొక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంలో, స్వామివారి ఊరేగింపు జ‌రిగే స‌మ‌యంలో చుట్టుప‌క్క‌ల మంట‌లు చెల‌రేగాయి. ఎందుకిలా జ‌రిగిందా అని భ‌క్తులు, అర్చ‌కులు ఆందోళ‌న‌ప‌డుతుండ‌గా ఒక భ‌క్తుని ద్వారా స్వామివారు త‌న సందేశాన్ని వినిపించాడ‌ని అంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మ‌రో సౌమ్య‌మైన మూర్తిని ఉత్స‌వాల కోసం వినియోగించ‌మ‌న్న‌దే ఆ సందేశం. ఒక కొండ వంగి ఉండే ప్ర‌దేశంలో ఆ మూర్తి క‌నిపిస్తుంద‌ని కూడా స్వామివారు తెలియ‌చేశార‌ట‌. ఆ సందేశాన్ని అనుస‌రించి భ‌క్తులు నూత‌న ఉత్స‌వ మూర్తి కోసం వెత‌క‌సాగారు. అలా వారికి ఒకచోట శ్రీదేవిభూదేవి స‌హిత వేంక‌టేశ్వ‌రుని విగ్ర‌హాలు ల‌భించాయి. ఈ స్వామివారికి త‌మిళంలో `మ‌లై కునియ నిన్ర పెరుమాళ్‌` (త‌ల‌వంచిన ప‌ర్వతం మీద కొలువైన స్వామి) అన్న పేరుని స్థిర‌ప‌రిచారు. కాల‌క్ర‌మంలో అదే మ‌ల‌య‌ప్పస్వామిగా మారింది.

రూపం:
మ‌ల‌య‌ప్ప స్వామి విగ్ర‌హం పంచ‌లోహాల‌తో రూపొందింది. తామ‌ర‌పూవు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎత్తున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని రూపం అది. శంఖుచ‌క్రాల‌తోనూ, వ‌ర‌ద‌హ‌స్తంతోనూ స్వామివారి దివ్య‌మంగ‌ళ రూపం ఉంటుంది. ఈ విగ్ర‌హానికి కుడివైపున శ్రీదేవి, ఎడ‌మ‌వైపు భూదేవి అమ్మ‌వార్ల విగ్ర‌హాలు ఉంటాయి. ఈ రెండు విగ్ర‌హాలూ ఒకేలా ఉంటాయి. కాక‌పోతే భంగిమ‌లు అటుదిటుగా ఉంటాయంతే! మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రూ ఎక్కువ‌త‌క్కువ కాదు క‌దా! శ్రీదేవిభూదేవి విగ్ర‌హాలు కూడా వేంక‌టేశ్వ‌రుని విగ్ర‌హంతో పాటుగానే స్వ‌యంభువులుగా దొరికాయ‌ని అంటారు. ఈ విగ్ర‌హాలు దొరికిన కోన‌ని ఇప్ప‌టికీ మ‌ల‌య‌ప్ప కోన‌గా పిలుస్తున్నారు. దాదాపు 700 సంవ‌త్స‌రాల‌కు పూర్వ‌మే లిఖించిన ఒక శాస‌నంలో ఈ విగ్ర‌హాల ప్ర‌స‌క్తి ఉన్న‌ది.

సేవ‌లు:
శ్రీవారికి భ‌క్తులు జ‌రుపుకొనే క‌ళ్యాణోత్స‌వాల‌లో మ‌ల‌య‌ప్ప స్వామివారినే వినియోగిస్తారు. సాయంవేళ జ‌రిగే స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌లోనూ స్వామివారే కొలువుంటారు. స్వామివారికి జ‌రిగే కొన్ని అభిషేకాల‌లో కూడా ఉత్స‌వ‌మూర్తికి భాగం ఉంటుంది. పుష్క‌రిణిలో జ‌రిగే తెప్పోత్స‌వం కూడా మ‌ల‌య‌ప్ప స్వామివారికే నిర్వ‌హిస్తారు. ఇక ప‌ద్మావ‌తి ప‌రిణ‌యం, బ్ర‌హ్మోత్స‌వాల వంటి ఉత్స‌వాల సంద‌ర్భంగా మ‌ల‌య‌ప్ప స్వామివారు గ‌జ‌, అశ్వ‌, గ‌రుడ‌, శేష త‌దిత‌ర వాహ‌నాల‌లో వైభవంగా ఊరేగుతూ భ‌క్తుల‌కు ఆశీస్సుల‌ను అందిస్తారు.

Monday, 24 August 2015

సైంధవుడు

సైంధవుడు

సింధుదేశాధిపతి, దుర్యోధనునకు బావమరిది, నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సల భర్త.

స్త్రీలోలుడైన వీడు ద్రౌపదిని బలాత్కారంగా ఎత్తికొనిపోగా, పాండవులు వీనిని పరాభవించి, తేజో వధకావించి వదిలారు. దీనికి ప్రతీకారంగా వాడు గంగానదీ తీరాన బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి పార్వతీపతిని మెప్పించి పార్థుడు లేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించే వరాన్ని పొందాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుని వధకు కారణభూతుడయ్యాడు.

ముగియవలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని సైంధవుడని నేటికీ పిలుస్తారు.

పూర్తికావలసిన పనిని ముందుకు సాగనీయకుండ గట్టిగ అడ్డుకొను వ్యక్తిని లోకము సైంధవుడని పిలుస్తున్నది. ఈ అడ్డుపడు స్వభావం వీనిలో ఎలా కలిగింది? దీని పర్యవసానం ఏమిటో, మనం కవిత్రయ విరచితమహాభారతం చదివితే గగుర్పాటు కలిగించే ఉత్కంఠభరిత సన్నివేశాలను దర్శించగలం.

సైంధవుడు సింధుదేశాధిపతి. దుర్యోధనునకు బావమరిది. నూరుమంది సోదరులకు ఒక్కగానొక్క చెల్లెలైన దుస్సలకు భర్త.
సప్తవ్యసనాలలోని, వెలది (స్త్రీ వ్యామోహం) వలన, వావివరుసలు తెలియక ప్రవర్తించిన దుర్మార్గుడు వీడు.

ఆనాడు పద్మవ్యూహమున సైంధవుడొక్కడే సవ్యసాచిని తప్ప తక్కిన పాండవులను, సాత్యకిని, ద్రుష్టద్యుమ్నుని, పెక్కుమంది సైనికులను అడ్డుకొనగలుగుట ఎవరికైన ఆశ్చర్యము కలిగించు అంశమే. అంతకు ముందతడు పాండవులచే పొందిన అవమానము, పరమేశ్వరుని ప్రార్థించి సాధించిన విశేషములతని చేత అంత పని చేయించినవి.

ఒకనాడు పాండవులు తృణబిందుడి ఆశ్రమంలో ధౌమ్యుడిని, ద్రౌపదిని ఉంచి, వేటకు వెళ్లారు. ఆ సమయంలో సైంధవుడు సాల్వకన్యను వివాహమాడే నిమిత్తమై ఆ వైపు నుండి ససైన్యుడై తరలి వెళ్తున్నాడు. ఆశ్రమద్వారంలో నిలిచి ఉన్న ద్రౌపదిని చూశాడు.

"నీలపయోదమండలము నిశ్చలలీల వెలుంగ జేయుచుం గ్రాలెడు వాలు గ్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలితదేహకాంతి పటలంబున జేసి వెలుంగ జేయు నబ్బాల వినీలకుంతవిభాసిని జూచి సవిస్మయాత్ముడై"

-నల్లని మబ్బుల గుంపును దేదీప్యమానంగా వెలుగొందజేసే క్రొత్త విద్యుల్లతవలె ఆ అడవినంతటిని తన శరీరప్రభల చేత ప్రకాశింపజేస్తున్న లేజవరాలు, నల్లని ముంగురులు గల ద్రౌపదిని చూచి సైంధవుడు మనస్సులో మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు.

సైంధవుడు మదనాతురుడై రథం దిగి ద్రౌపది ఆశ్రమంలో ప్రవేశించి ఆమెను పలుకరించాడు. ఆమె అతిథిమర్యాదలు చేసింది. సైంధవుడామెను వలపుగొన్న మాటలతో పలుకరించి తన వెంట రమ్మని అనుచితమాడాడు. ఆమె తనకు చెల్లెలని కూడా భావించకుండా కామాంధకారంతో మాట్లాడి, ఆమెను బలాత్కారంగా ఎత్తుకుని రథం మీద బయలుదేరాడు. ద్రౌపది ధౌమ్యుని పిలుస్తూ ఆక్రోశించింది.

అడవి నుండి తిరిగి వచ్చిన పాండవులు, ధౌమ్యుని వల్ల విషయం తెలుసుకుని సైంధవుడి మీదకు లంఘించారు. సంకుల సమరం సాగింది.
సైంధవుడు ద్రౌపదిని నేల దిగవిడిచి రథం తోలుకుని పలాయనం చిత్తగించాడు. భీమార్జునులు ఆ దుర్మార్గుని విడిచిపెట్టదలచలేదు. వారతనిని వెన్నంటి తరిమిపట్టుకొన్నారు. భీముడు సైంధవుడిని,

"ఒడలెల్ల బిండి కూడుగ బొడిచి యెగయనెత్తి త్రిప్పి భూస్థలి మీదన్
బడవైచి యురము మొగమును నడిచెను వడముడి తలప్రహార కుశలుడై"

భీముడు జయద్రథుడిని (సైంధవుడిని) లొంగదీసి శరీరాన్నంతటినీ మెత్తగా అయ్యేటట్లు దెబ్బలు కొట్టి పైకి లేవనెత్తి గిరగిర తిప్పి, తిరిగి భూమిపై పడవేసి అరచేతితో వక్షాన్ని, ముఖాన్ని మోదాడు.

"వాడియైన కత్తి వాతియమ్మున గొని పగతు శిరము చెక్క లెగయగొరిగి నరుల కెల్ల జూడ నవ్వగునట్లుగా గలయ నైదు గూకటులనొనర్చె"

-పదనుగల కత్తి అంచుగల బాణంతో భీముడు జయద్రథుడి తల పీతోలు లేచిపోయేటట్లుగా గొరిగి, చూచేవారు అపహసించేటట్లుగా ఐదు శిఖలుగా నిలిపాడు.

సైంధవుడి చేతులు వెనుకకు విరిచికట్టి తెచ్చి ధర్మజు సమక్షంలో ఉంచి, ఇతడే పాండవు దాసుడు అని నివేదించాడు. పిదప ధర్మరాజు సైంధవునితో-

"ఎట్టి కష్టుడైన నిట్టి పాపముసేయ నెత్తికొనునే ధరణి నీవు దక్క నరుగు మింక నేమి యందుము నిన్ను, నింద్రియ విలోలు, నల్పు, ధృతివిహీనున్"

-ఎట్టి దుష్టుడు అయినా ఇటువంటి నీచపు పనికి (పరదారను అపహరించేందుకు) పూనుకొంటాడా? నీవంటి అల్పుడు మాత్రమె అట్టి నీచకృత్యానికి ఒడిగట్టుతాడు. నీవంటి అల్పుడిని, ఇంద్రియవివశుడిని, ధైర్యవిహీనుడిని ఏమని నిందించలం. ఇక నీవు ఇచ్ఛవచ్చినట్లు పొమ్ము అని విడిచి పుచ్చారు పాండవులు.

పాండవులు అతడి తేజోవధ చేసి వదిలారు. మానసికంగా, ఆధ్యాత్మికంగా జయద్రథుడు దీనుడైనాడు. అతడు సిగ్గుతో తల దించుకుని, గంగానది సముద్రాన్ని కలిసే పుణ్యతీర్థం వద్దకు వెళ్లి, ఏకదీక్షతో తన పాదం బొటనవ్రేలు మాత్రమే భూమిపై నిలిపి, పార్వతీపతిని మనస్సులో ధ్యానిస్తూ ఘోరతపం చేశాడు. శివుడనుగ్రహించి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మన్నాడు. సైంధవుడు పాండవులైదుగురను ససైన్యంగా ఓడించే వరం కోరాడు. శివుడది అసాధ్యమని పేర్కొన్నాడు. అర్జునుని జయించడం తనకే కష్టతరమని పేర్కొన్నాడు. పార్థుడులేనప్పుడు మిగిలిన పాండవులను ఒకనాటి యుద్ధంలో నిలువరించగలిగే వరాన్ని ప్రసాదించి, అంతర్థానమైనాడు. సైంధవుడు తిరిగి సింధుదేశానికి వెళ్లాడు. ఆ సమయము కొరకు వేయికన్నులతో వేచి ఉన్నాడు.

కురుసంగ్రామం ప్రారంభమైంది. ద్రోణపర్వంలో ద్రోణుని చేత పద్మవ్యూహరచన జరిగింది. ఆ దినం తన అవమానం తీరు తరుణము, శత్రువుల ప్రియపుత్రుడు, పరాక్రమవంతుడైన అభిమన్యుకుమారుడు అంతమొందు సమయము, తన బలము, పరమేశ్వరవరము సఫలత నొందనున్న క్షణము, అన్నింటిని మించి పాండవులను జయించానన్న పేరువచ్చు ముహూర్తము, ఆనాటి సైంధవ విజృంభణము వెనుక అంత మనస్తత్వము దాగియున్నది.

పాండవులలో పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించే నేర్పు అర్జునునకు, శ్రీకృష్ణునకే ఉన్నది. అభిమన్యుడికి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి ప్రవేశించటం తెలుసు గాని, విజయవంతంగా తిరిగి రావటం తెలియదు. వ్యూహంలో ప్రవేశించటం పాండవవీరులకు శక్యం కాలేదు. అప్పుడు ధర్మరాజు, భీమాదులను వెంటబెట్టుకుని అభిమన్యుడి వద్దకు వెళ్లి, పార్థగోవిందుల ప్రశంసలు పొందుమని కోరాడు. భీమాదులందరూ వ్యూహంలో ప్రవేశించి దానిని ధ్వంసం చేయగలరని ధైర్యం చెప్పాడు. అభిమన్యుడు తనకు దొరికిన అవకాశం వినియోగించదలచాడు.

పద్మవ్యూహం ఛేదించిన అభిమన్యుడి వెంట, భీమాదులు మోహరంలో ప్రవేశించి, సైన్యాన్ని ఉరుమాడటం మొదలుపెట్టారు. వారికి సైంధవుడు అడ్డం పడ్డాడు. శివుడి వరం ఆనాడు సైంధవునికి అనుకూలమైనది.

పాండవులెంతో భయంకరంగా పోరాడినా సైంధవుని దాటి ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు. అభిమన్యుడు వెనుకాడకుండా ముందుకు చొచ్చుకుపోయే కొద్దీ పాండవ సహాయం అందకపోవటంతో ఒంటరివాడయ్యాడు. అతని చేతిలో విల్లమ్ములుండగా జయించటం కష్టమని ద్రోణాచార్యుడు చెప్పగా, సుయోధనుడు, కౌరవవీరులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి, అన్యాయంగా అతడిని చంపటానికి ఏకమయ్యారు.

లోతైన నీటిలో దిగిన గజాన్ని బోయలు దయమాలి కొట్టి చంపినట్లు, వీరులందరూ అభిమన్యుడిని చుట్టుముట్టి ఆయుధాలతో కొట్టి చంపారు.

అరివీరభయంకరంగా యుద్ధం చేసిన అభిమన్యుడు నేలకొరిగాడు.
రక్తసిక్తమైన ఆ నేల మీద పడివున్న అభిమన్యుడు యోగనిద్రలో ఉన్న విష్ణువు వలె వెలుగొందాడు. "పెక్కండ్రు గూడి ఇమ్మెయి నొక్కని జంపుట అధర్మ మోహో" అని దిక్కులు పిక్కటిల్లేటట్లు భూతసమూహాలు కేకలు వేశాయి.

అభిమన్యుడి మరణానికి శోకించని మనిషి లేడు. అతడి పరాక్రమాన్ని కీర్తించని వీరుడు లేడు. ధర్మరాజు శోకం కట్టలు తెగిపోయింది.
సాయంకాలం సవ్యసాచి శిబిరానికి తిరిగి వచ్చాడు. విషయం తెలుసుకుని ప్రియపుత్రుడి కొరకు విలపించి విలపించి కారణం తెలుసుకోగోరాడు.
ధర్మరాజు జరిగినదంతా వివరంగా చెప్పాడు. అభిమన్యుడికి భీమాదుల సహాయం అందకపోవటానికి సైంధవుడు అడ్డగించటమే కారణమని స్పష్టం చేశాడు. అర్జునుడు సైంధవకృత్యానికి మండిపడి అతనిని చంపుతానని భయంకర శపథం చేశాడు.

"అనిమిషదైత్యకింపురుషు లాదిగ నెవ్వరు వచ్చి కాచినం, దునుముదు నెల్లి సైంధవుని, దోయజమిత్రుడు గ్రుంకకుండుమున్న, నరవరేణ్య, యిత్తెరగు నాకొనరింపగరాక యున్న నే ననలము సొచ్చువాడ నృపులందరు జూడగ గాండీవంబుతోన్"

ధర్మరాజా! దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలైన ఎవరు వచ్చి కాపాడినా, రేపు సూర్యుడు అస్తమించే లోపల ఆ సైంధవుడిని సంహరిస్తాను. అట్లా చేయకపోతే రాజులంతా చూస్తూ ఉండగానే గాండీవంతో సహా అగ్నిలోకి దూకుతాను.

అర్జునుడి ప్రతిజ్ఞ అందరికీ ముఖ్యాంశమై నిలిచింది. పాండవ శిబిరంలో, కౌరవస్కంధావారంలో ప్రకంపనలు కలిగించింది. సైంధవుడు ప్రాణభయంతో గజగజలాడిపోయి పారిపోవ ప్రయత్నించాడు. ద్రోణాదులది క్షత్రియధర్మం కాదని, తమ రక్షణలో తనకెట్టి కీడు రానీయమని మాట ఇచ్చి మోహరంలో నడుమ భద్రంగా రక్షించటానికి నిశ్చయించారు.

అర్జునుడు తన ప్రతిజ్ఞ ఏ విధంగానైనా సఫలమయ్యేట్లు వరమిమ్మని శ్రీకృష్ణుని ప్రార్థించాడు. గోవిందుడు విజయం తథ్యమని అభయమిచ్చాడు.

యుద్ధం భీకరంగా సాగింది. సూర్యుడు పడమటి కొండపైకి చేరబోతున్నాడు, కృష్ణుడు అర్జునునితో జాగ్రత్త వహించుమని మాయాతిమిరంతో సూర్యబింబాన్ని కప్పివేశాడు. సూర్యుడస్తమించాడని కౌరవవీరులు ఉప్పొంగిపోయారు. సైంధవుడు తల ఎత్తి పడమర వైపు ఆశ్చర్యంతో చూస్తూ నిలిచాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అర్జునుడు ఆ అదనెరిగి వాడి బాణంతో సైంధవుడి తలను తెగ నరికాడు. దానిని క్రింద పడకుండా ఆకాశంలోనే చిత్రవిచిత్రబాణ విద్యానైపుణ్యంతో నిలుపుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు మాయాతిమిరం తొలగించాడు. సూర్యుడస్తమించకుండానే సైంధవుడిని చంపి, అర్జునుడు తన శపథాన్ని నిలుపుకొన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి నిర్దేశంతో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి సైంధవశిరాన్ని అతని తండ్రి అయిన వృద్ధక్షత్రుడి ఒళ్లో పడేటట్లు చేశాడు. అతడా శిరస్సును నేల మీద పడవేశాడు. వెంటనే వృద్ధక్షత్రుడి శిరస్సు వేయి ముక్కలైపోయింది. సైంధవుడి శిరం ఎవరివలన నేలమీద పడుతుందో, అతడి శిరస్సు వేయి ముక్కలౌతుందని వృద్ధక్షత్రుడి శాపమే ఉన్నది. అతడి శాపంతోనే అతడిని దండింపజేసి, అర్జునుడికి ఆ కీడు కలుగకుండా శ్రీకృష్ణుడు చాతుర్యంతో రక్షించాడు.

స్త్రీపర్వంలో సైంధవుని భార్య దుస్సల హృదయవిదారక రోదన రణభూమి శ్మశానంలో కనబడుతుంది. ధృతరాష్ట్ర మహారాజు కోడళ్లు, కన్నీరుమున్నీరౌతూ, వారి వారి భర్తలను, అన్నదమ్ములను గుర్తిస్తూ కాకులు పొడచుకొని తింటున్న వారి శవాలను చూచి తూలిపోతున్నారు. ముక్కలైన దేహభాగాలను కలిపి తమ వారి ఆకారాలను కూర్చుకొని వనితలు భోరుమని విలపిస్తున్నారు. ఇటువంటి దారుణ దృశ్యాలను చూడటానికి బ్రతికి ఉన్న నేను పూర్వజన్మలో ఎంతటి పాపం చేశానో అని గాంధారి బావురుమన్నది. (వ్యాసమహర్షి గాంధారికి దివ్యదృష్టి ప్రసాదించాడు).

వందమంది కుమారుల గర్భశోక మొకవైపు, ఉన్న ఒక్క కుమార్తె విధవ కావటం మరోవైపు, ఆమెను నిలువునా క్రుంగదీశాయి. స్త్రీపర్వంలోని స్త్రీల శోక ముపశమింపజేయ ఎవరికి సాధ్యం? భర్త కళేబరాన్ని గుర్తించలేక పిచ్చిదానివలె శ్మశాన రణభూమిలో తిరుగుతున్న దుస్సలను ఓదార్చ నెవరితరం? కారణం వృద్ధక్షత్రుని ఒడిలో పడ్డ సైంధవుని తలను ఎవరు తేగలరు? దాని చోటు ఒక్క పాశుపతాస్త్రానికే ఎరుక. ఆ రహస్యాన్ని ఎరిగినవాడు శ్రీకృష్ణుడు. అందుకే ఆమె కోపం ఆయనపై కట్టలు తెంచుకున్నది. తుదకు యాదవనాశ శాపకారణంగా పరిణమించింది.

భాగవత విశేషాలు

  1. అష్టాదశ పురాణాలు వ్యాస భగవానుడే వ్రాశాడు.
  2. పరీక్షిత్తు అసలు నామధేయం విష్ణురాతుడు. కలిపురుషుడి వేడుకోలుకు కరిగిపోయి అతను జూదశాలల యందు, మధుశాలల యందు, వ్యభిచారుల యందు, జంతు వధ్యశాలల యందు, బంగారమందు ఉండవచ్చని అభయం ఇస్తాడు. కలి పురుషుడు పరీక్షిత్తు కిరీటంలో ప్రవేశించి, అతని బుద్ధిని పెడత్రోవ పట్టించి, ధ్యానమగ్నుడైన శమీక మహర్షి మెడలో చనిపోయిన త్రాచు పామును వేలాడదీసేలా చేస్తాడు.
  3. కురుక్షేత్ర యుద్ధకాలంలో విదురుడు తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు.
  4. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులలో హిరణ్యకశిపుడు పెద్దవాడు. తన కొడుకులిద్దరూ విష్ణువు చేతిలో మరణిస్తారని దితికి ముందే తెలుసు. ఆయన భయంతోనే వాళ్ళను వంద సంవత్సరాలు గర్భంలో దాచుకుంటుందామె.
  5. అనుహ్లాదుడు, సమ్హ్లాదుడు, హ్లాదుడు ప్రహ్లాదుని సోదరులు.
  6. ప్రహ్లాదుని మనవడు రాహువు. అతని తల్లి సింహిక. అమృతం పంచే సమయంలో రాహువు మారువేషంలో దేవతల వరుసలో కూర్చున్నాడని మోహినీ అవతారమెత్తిన విష్ణువుకు ముందే తెలుసు. అయినా వరుసలో కూర్చున్నవాడిని లేపడం ధర్మం కాదు కాబట్టి, అతను అమృతం తాగిన వెంటనే, అది గొంతు దిగక ముందే అతని శిరస్సుని ఉత్తరిస్తాడు. అయితే అమృతం మింగిన శిరస్సు అమరత్వం పొందింది కాబట్టి గ్రహస్థితిని కల్పిస్తారు.

  7. గజేంద్రుని భార్యలు పది లక్షల కోట్ల ఆడేనుగులు. గజేంద్రుడు వేయి సంవత్సరాల పాటూ మొసలిపట్టులో ఉండి పోరాడుతాడు. ఆ తర్వాత ఓపిక సన్నగిల్లి విష్ణువుని శరణు వేడితే, ఆయన ఆఘమేఘాల పై వచ్చి రక్షిస్తాడు.
  8. వృత్తాసురుని కంఠాన్ని వజ్రాయుధంతో కొయ్యటానికి ఇంద్రునికి దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది.
  9. నముచి అనే రాక్షసుడు అటు తడి, ఇటు పోడి కాని వస్తువు ద్వారా మరణించాలని కోరుకుంటే, దేవేంద్రుడు సముద్రపు నురగలో వజ్రాయుధం ముంచి అతన్ని సంహరిస్తాడు.
  10. బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి.
  11. దుర్వాసో మహర్షి భార్య కందళియే కదళీ వృక్షం (అరటి చెట్టు) గా రూపుదాల్చింది. ఆమె ఔర్వుడనే మహర్షి కూతురు. తలబిరుసు ఎక్కువ. ఆమె విషయం ముందే చెప్పి దుర్వాసో మహర్షికిచ్చి వివాహం జరిపిస్తాడు ఔర్వుడు. చాలా కాలం ఆమె ప్రవర్తన భరించిన దుర్వాసో మహర్షి ఒక రోజు ఆమె చెప్పిన పని చెయ్యకపోయేసరికి ఆగ్రహించి భస్మీపటలం చేస్తాడు. విషయం తెలుసుకున్న ఔర్వుడు కోపించి ఒక రాజర్షి ( అంబరీషుడు) చేతిలో ఘోరావమానం పొందుతావని శాపమిస్తాడు. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడిన దుర్వాసో మహర్షి ఆమె వృక్షంగా జన్మించి అమృతతుల్యమైన ఫలాలిస్తుంది వరమిస్తాడు.
  12. కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు. దేవాసుర సంగ్రామంలో అతన్ని సుదర్శన చక్రంతో సంహరిస్తాడు శ్రీమహావిష్ణువు. అసుర గురువు శుక్రాచార్యుడు మృతసంజీవనీ విద్యతో అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. రోషిల్లిన కాలనేమి, తీవ్రమైన తపస్సు చేసి విష్ణువు చేతిలో కానీ, ఇతర ఏ దేవతల చేతిలో కానీ మరణం కలగకుండా బ్రహ్మ దగ్గర వరం పొందుతాడు. కంసుడిగా జన్మిస్తాడు. అతను కోరుకున్నది విష్ణువు చేతిలో కానీ ఇతర ఏ దేవతల చేతగానీ మరణం సంప్రాప్తించకూడదని. అందుకు తగ్గట్టుగానే భగవంతుడు విష్ణు రూపంలో అతన్ని పరిమార్చకుండా, కృష్ణావతారం ఎత్తి అతన్ని నిర్జిస్తాడు.
  13. కంసుడు మహాపరాక్రమశాలి. తను యువరాజవగానే దిగ్విజయ యాత్ర ప్రారంభించి అన్ని దేశాలూ గెలుస్తాడు. యాత్రలో భాగంగా జరాసంధుని రాజధాని చేరుకున్నప్పుడు, అతను కువలయపీడం అనే మత్తగజాన్ని కంసునిపై పురిగొల్పుతాడు. కంసుడు రెండు చేతులతో దాన్ని ఒడిసిపట్టి గిరగిరా త్రిప్పి అది జరాసంధుని సభాప్రాంగణంలో పడేలా విసిరేస్తాడు. జారాసంధుడు అతని బలపరాక్రమాలకి ముగ్ధుడై తన కూతుళ్ళైన అస్థి, ప్రాప్తిలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. అస్థి మొహం ఎప్పుడూ ఇంకాసేపట్లలో తుమ్మబోయేలా ఉంటే, తుమ్మిన తర్వత మొహం ఎలా ఉంటుందో ప్రాప్తి మొహం అలా ఉంటుంది.
  14. కంసుడు ఆ తర్వాత చాణూర ముష్టికాదులను ఓడించి వారిని తన అనుచరులుగా మార్చుకుంటాడు. అదే ఊపులో వానరుడైన ద్విందుడుని, ఋష్యమూక పర్వతంపై నివశిస్తున్న కేశి ని ఓడించి వారితో సఖ్యం ఏర్పరుచుకుంటాడు. ఆ తర్వాత మహేంద్రపర్వతం వెళ్ళి పరశురాముని కవ్విస్తే, ఆయన తన ధనస్సు అతనికిచ్చి ఎక్కుపెట్టమంటాడు. కంసుడు అలవోకగా ఆ ధనువు చేతబట్టి ఎక్కుపెడితే, ఆ ధనస్సుని అతనికే ఇచ్చివేసి, మహావిష్ణువు పరిపూర్ణావతారం అతని అంతఃపురానికి వచ్చి దాన్ని తిరిగి ఎక్కుపెట్టగలదని, ఆ అవతారం చేతిలో మరణం తధ్యమని చెబుతాడు.
  15. ప్రజాపతి సుతపుడు, అతని భార్య పృష్ణి పన్నెండు వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి మహావిష్ణువునే కొడుకునుగా పొందే వరం పొందుతారు. మూడు జన్మలలో వారి కొడుకై జన్మించి వారిని తరింపచేస్తాడు నారాయణుడు. మొదట సుతపుడు-పృష్ణి దంపతులకు పృష్ణిగర్భుడిగా, తర్వాత అదితి,కశ్యపులకు వామనుడిగా, పిదప దేవకీ వసుదేవులకు శ్రీ కృష్ణుడిగా జన్మిస్తాడు.
  16. కంసుని చేత వధింపబడిన ఆరుగురు దేవకి వసుదేవ పుత్రులకు ఒక శాపముంది. వారు గతంలో మరీచి, ఊర్ణాదేవి అనే ఋషి దంపతుల పిల్లలు. ఒకసారి సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసి నవ్వటంతో రాక్షసులై పుట్టండని ఆయన శపిస్తాడు. అలా మొదట కాలనేమి (కంసుని పూర్వజన్మ) పుత్రులుగా జన్మిస్తారు. తర్వాత హిరణ్యకశిపుని తనయులుగా పుడతారు. ఆ జన్మలో గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి దీర్ఘాయువును వరంగా పొందుతారు. తనకులేని దీర్ఘాయువు తన కొడుకులు పోందటంతో హిరణ్యకశిపుడు ఆగ్రహించి మీరంతా దీర్ఘనిద్రలో ఉండి చనిపోతారని, పూర్వజన్మలో మీ తండ్రే రాబోయే జన్మలో మిమ్మల్ని చంపుతాడని శపిస్తాడు.
  17. త్రివిక్రముడైన వామనమూర్తి పాదాలను బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడుగగా ఉద్భవించినదే గంగానది.
  18. విశ్వరూపున్ని చంపిన ఇంద్రుడుకి బ్రహ్మహత్యామహాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని భూమి, వృక్షాలు, నీరు, స్త్రీలు పంచుకుంటారు. అందుకే భూమ్మీద కొంతభాగం ఎడారిగా నిర్మానుష్యంగా ఉంటుంది. వృక్షాలు స్రవించే ద్రవాలను (కల్లు వగైరా) త్రాగరాదని, బుడగలు నురగతో నిండిన నీరు నిరుపయోగమని, ఋతుమతియైన స్త్రీలని అంటరాదని పెద్దలు చెబుతారు. తన పాపాన్ని పంచుకున్నందుకు ప్రతిగా ఇంద్రుడు, త్రవ్విన ప్రతి గుంత తనంతట తనే పూడుకుపోతుందని భూమికి, కొమ్మలు నరికేసినా మళ్ళీ చివురిస్తాయని వృక్షాలకు, కలిసిన ప్రతి వస్తువు పెరుగుతుందని నీటీకి, అపరిమితమైన క్రీడాసక్తిని కలిగి ఉంటారని స్త్రీలకు వరాలిస్తాడు.
  19. వృత్తాసురుడు పూర్వజన్మలో చిత్రకేతుడనే రాజు. విష్ణుభక్తుడైన ఆయన, ఒకనాడు దివ్యవిమానంలో లోకాలన్నీ సంచరిస్తూ, కైలాసంలో ప్రమదగణాలన్నీ పరివేష్టించి ఉండగా సతీదేవిని ఆలింగనం చేసుకున్న పరమశివున్ని చూసి విరగబడి నవ్వుతాడు. సతీదేవి ఆగ్రహించి అతన్ని అసురుడవై పుట్టమని శపిస్తుంది.
  20. ఇక్ష్వాపు వంశీయుడైన యువనాశ్వుడనే మహారాజు సంతానప్రాప్తి కోసం ఇంద్రుని గూర్చి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం పరిసమాప్తమయ్యాక మంత్రించిన పుణ్యజలాన్ని ప్రమాదవశాత్తూ మింగి గర్భం దాలుస్తాడు. అతని ఉదరం చీల్చుకొని పుట్టినవాడే మాంధాత. పుట్టగానే గ్రుక్కపట్టి ఏడ్చిన ఇతనికి ఇంద్రుడే స్వయంగా అమృతం తినిపిస్తాడు. మాంధాత షట్చక్రవర్తులలో ఒకడు.
  21. అత్రి మహర్షి ఆనందబాష్పముల నుండి ఉద్భవించినవాడు చంద్రుడు.
  22. చంద్రవంశానికి ఆద్యుడు పూరూరవుడు. ఇతను ఇళ-బుధు (గ్రహం) ల కుమారుడు. సూర్యవంశపు మూలపురుషుడైన శ్రాద్ధదేవుని కూతురు ఇళ. ఆమెను వశిష్టుడు తపోశక్తితో పురుషునిగా మార్చి సుద్యుమ్నుడని నామకరణం చేస్తాడు. సుద్యుమ్నుడు ఒకనాడు వేటకు వెళ్ళి నిషిద్ధప్రాంతంలో కాలుమ్రోపి శాపవశాత్తూ మళ్ళీ స్త్రీగా మారిపోతాడు. వశిష్టుని ప్రార్థనకు పరమశివుడు కరిగిపోయి సుద్యుమ్నుడు ఒక నెల స్త్రీగా మరొకనెల పురుషునిగా బ్రతుకుతూ జీవితం కొనసాగిస్తాడని వరమిస్తాడు. అలా సుద్యుమ్నుడు స్త్రీగా ఉన్న సమయంలోనే చంద్రుని కుమారుడైన బుధునితో కలిసి పురూరవునికి జన్మనిస్తాడు.
  23. ప్రజాపతి ద్రోణుడు, ఆయన భార్య ధర, బ్రహ్మ అజ్ఞానుసారం నందుడు,యశోదగా జన్మిస్తారు.
  24. ఉగ్రసేన మహారాజు భార్య, సఖులతో కలిసి వనవిహారం చేస్తూంటే ద్రమిళుడనే గంధర్వుడు ఆమెను చూసి మోహిస్తాడు. ఉగ్రసేనుడి రూపం ధరించి ఆమెను ఏకాంతంలో కలుసుకుంటాడు. ఆమె గర్భవతౌవుతుంది. ఆలస్యంగా విషయం తెలుసుకొని కోపంతో, తనకు పుట్టబొయే బిడ్డ రాక్షసుడవుతాడని శపిస్తుంది. ద్రమిళుడు, ఆ బిడ్డ తనవారి చేతనే ద్వేషింపబడుతాడని ప్రతిశాపం యిస్తాడు. అలా పుట్టినవాడే కంసుడు. ఈ రహస్యాన్ని నారద మహర్షి అతనికి తెలియజేస్తాడు.
  25. వసుదేవునికి దేవకి కాకుండా ఇంకో ఆర్గురు భార్యలున్నారు. వారిలో రోహిణి ఒకతె. దేవకీదేవి గర్భాన ఏడవ కుమారుడిగా జన్మించిన బలరామున్ని విష్ణువు రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెడ్తాడు. అలాగే వసుదేవునికి ఐదుగురు అక్కచెళ్ళెళ్ళు. వారిలో కుంతీదేవి ఒకతె. ఆమె శ్రీకృష్ణునికి స్వయానా మేనత్త.
  26. ఏడేళ్ళ వయసులో ఏడు రోజుల పాటూ గోవర్ధనగిరిని తన చిటికెనవ్రేలి పై మోస్తాడు బాలకృష్ణుడు. అలా గోవులను కాచినందుకే 'గోవిందు'డౌతాడు.
  27. కుబేరుడు మెల్లకన్ను కలవాడు. పార్వతిదేవి సౌందర్యం చూసి క్షణకాలం మనస్సు చలించటంతో మెల్లకన్ను పొందుతాడు.
  28. నలకూబర, మణిగ్రీవులు కుబేరుని పుత్రులు. గంధర్వకాంతలతో కలిసి మధువు సేవిస్తూ వివస్త్రులై ఒళ్ళుపై తెలియకుండా ఆకాశగంగలో స్నానం చేస్తూంటే, ఆ దారెంట వెళ్తున్న నారద మహర్షి కనిపిస్తాడు. గంధర్వ స్త్రీలంతా హడావుడిగా బట్టలు కట్టుకొని ఆయనకు భయభక్తులతో నమస్కరిస్తే, వీరిద్దరూ గర్వాంధకారంతో ఏమీ పట్టనట్లు దిసమొలతో నిలబడి, మిన్నకుండిపోతారు. నారదుడు ఆగ్రహించి వారిని వంద దివ్య సంవత్సరాలపాటూ మద్దిచెట్లై పడుండమని శపిస్తాడు. కృష్ణావతారంలో భగవంతుడు నడుముకి రోకలి కట్టుకొని ఈ మద్దిచేట్ల మధ్యలోనే వెళ్ళి వాటిని పడద్రోసి వారికి శాపవిమోచనం కలిగిస్తాడు.
  29. బృందావనంలోని యమునా నదిలో సౌభరి అనే ఋషి నిలబడి గొప్ప తపస్సు చేసుకునేవాడు. ఆ నదిలోని ఒక మగచేపను ఒక గ్రద్ద చంపి తినటంతో చేపలన్నీ వెళ్ళి మునితో తమ బాధను చెప్పుకుంటాయి. ఆయన జాలిపడి, గరుత్మంతుడితో సహా ఏ పక్షైనా మరోసారి ఇటువైపు వస్తే మరణం తధ్యమని శపిస్తాడు.
  30. రమణక ద్వీపంలో నివసించే పాములకు గరుత్మంతుడికీ మధ్య ఒక ఒప్పందం ఉంది. గరుత్మంతుడు పాములనన్నిటినీ ఇష్టం వచ్చినట్లు ఆరగించకుండా నెల నెలా ఒక కుటుంబం పెట్టే బలి ఆహారాన్ని మాత్రమే పుచ్చుకోవాలని ఒడంబడిక చేసుకుంటారు. తన వంతు వచ్చినప్పుడు కాళీయుడు ఆ ఒప్పందాన్ని ధిక్కరించి విషం క్రక్కుతూ గరుత్మంతుడిపై దాడి చేస్తాడు. ఆయన దాన్ని తరుముకుంటూ వెళ్తాడు. కాళీయుడు భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోకాలన్నితిరిగి తిరిగీ చివరకి అధోలోకాలకి వెళ్ళి అనంతుడి కాళ్ళపై పడితే, ఆయన బృందావనంలోని యమునా నదిలో దాక్కుంటే గరుత్మంతుడు ఏమీ చెయ్యలేడని సలహా ఇస్తాడు.అలా కాళీయుడు యమునానది చేరుకొని తన మహోగ్ర విషంతో అందులోని జీవజాలాన్ని నాశనం చేసి స్థిర నివాసం ఏర్పరుచుకుంటాడు. కృష్ణుడు అతని పీచమణచి, తిరిగి రమణకద్వీపం వెళ్ళిపొమ్మని, తలపై తన పాదముద్రలున్నాయి కనుక గరుడుడు ఏమీ చెయ్యడని అభయమిస్తాడు.
  31. రామావతారంలో గర్భవతియైన సీతమ్మను పరిత్యజించటానికి ప్రధానకారణమైన చాకలివాడిని కృష్ణావతారంలో అంతమొందిస్తాడు మహావిష్ణువు. గతజన్మ వాసనలవల్ల ద్వాపరయుగంలో కూడా చాకలిగా జన్మించిన అతను, కంసుని దగ్గర సేవకుడిగా పనిచేస్తూ బ్రతుకు వెళ్ళదీస్తుంటాడు. ధనుర్యాగం కోసం మధురానగరం వచ్చిన బలరామకృష్ణులు, వీధులలో కలయతిరుగుతూ కంసుని పట్టువస్త్రాలు మోసుకెళ్తున్న అతన్ని చూస్తారు. అతని వద్దనున్న మూటలోంచి కొన్ని పట్టువస్త్రాలు తమకూ కట్టుకోవటానికి ఇవ్వమని అడుగుతారు. చాకలివాడు ఆ బట్టలు ఇవ్వకపోగా 'పాలు పెరుగుతిని క్రొవ్వుతో కొట్టుకుంటున్న గొల్లవార' ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో, యుగాలు మారినా ఇతని ఆలోచనా ధోరణి మారలేదని గ్రహించిన కృష్ణుడు ఒక్క పిడికిలిపోటుతో అతన్ని యమపురికి పంపిస్తాడు.
  32. పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి పుట్టినదే పాంచజన్యమనే శంఖం.గురువైన సాందీపుని కుమారున్ని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు ఆ రాక్షసుని చంపి శంఖాన్ని తీసుకుంటాడు.
  33. వరాహమూర్తిగా ఉన్నకాలంలో మహావిష్ణువు భూదేవికి పలు వరాలిస్తాడు.భూమిపుజ అలా వచ్చిన వరమే.అలాగే పుస్తకం నేల మీద పెడితే చదువు సిద్ధించకూడదని, శంఖం నేల మీద పెడితే మంగళం జరుగరాదని, తులసిని పువ్వులని నేల మీద పెడితే దేవతలు వారి ఇంట పూజలు స్వీకరించరాదని, శివలింగం నేలపెట్టిన ఇంట దేవతలు నివసించరాదని భూదేవి వరాలు కోరుతుంది.
  34. నరకాసురుని భార్య పేరు చతుర్దశి.
  35. నరకాసురుడు చెరపట్టిన 16100 మంది కన్యలను 16100 రూపాలతో ఏకకాలంలో వివాహం చేసుకుంటాడు కృష్ణ పరమాత్ముడు. ప్రతి భార్యతోను 10 మంది పిల్లలు కలిగారు. వీళ్ళ పిల్లలు, మనవళ్ళకు చదువు చెప్పడానికి నియమించిన గురువుల సంఖ్య మూడు కోట్ల ఎనభైవేల ఒక వంద.
  36. రుక్మిణిదేవి అన్న రుక్మిని బలరాముడు చంపేస్తాడు. పాచికలాడి పలుమార్లు బలరామున్ని ఓడించి పకపకా నవ్వుతాడు రుక్మి. బలరాముడు పట్టుదలగా ఆడి గెలిచినా ఒప్పుకోక, ' గొల్లవార' ని అవహేళన చెయ్యటంతో ఆయన ఆగ్రహించి అతన్ని పరలోకం పంపిస్తాడు.
  37. మన్మథుడు ఒక్క రతీదేవికి తప్ప మిగతా వారెవ్వరికీ కనిపించడు.అతను అనంగుడు.
  38. బలిచక్రవర్తికి నూర్గురు కుమారులు. వాళ్ళలో పెద్దవాడు శివభక్తుడైన బాణాసురుడు.
  39. ద్వివిదుడు నరకాసురుని మిత్రుడు. ఇతను వానరరాజైన సుగ్రీవుని మంత్రి మైందుని తమ్ముడు. అయినా యుగప్రభావం వల్ల తన మిత్రుని చంపిన కృష్ణుడిపై పగబట్టి యాదవ గ్రామాలను, నగరాలను ధ్వంసం చేస్తాడు. రైవతక పర్వతం పైనున్న బలరాముడు కొంతసేపు ఉపేక్షించి ఇక లాభం లేదని అతన్ని సంహరిస్తాడు.
  40. జాంబవతి-కృష్ణుల కొడుకు సాంబుడు. అతను దుర్యోధనుడి కూతురైన లక్షణ స్వయంవరానికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకువెళ్తూంటే కౌరవులంతా దాడి చేస్తారు. అతని శౌర్యప్రతాపాగ్నికి తట్టుకోలేక అందరు చుట్టిముట్టి, కట్టడి చేసి బంధిస్తారు. శాంతిప్రియుడైన బలరాముడు కృష్ణుడికి నచ్చజెప్పి హస్తినాపురం వెళ్ళి వారిని వదిలేయమని హితుల ద్వారా చెప్పి పంపిస్తాడు. దుర్యోధనుడు పెడచెవిన పెడతాడు. బలరాముడు ఆగ్రహించి,' హస్తినాపురాన్ని యమునా నదిలో కలిపేస్తా' నని తన నాగలి భూమిలో గ్రుచ్చి నగరం మొత్తాన్ని పైకి లేపేసరికి అందరూ హాహాకారాలు చేస్తారు. దుర్యోధనుడు కాళ్ళబేరానికొచ్చి యువదంపతులను విడిచిపెడతాడు.

కర్ణాభిమన్యుల జన్మరహస్యం,ఏకలవ్యుని మరణం ఇతర విశేషాలు

ఇతిహాసం అంటే 'ఇది ఇలాగే జరిగిందని' అర్థం. పంచమవేదమైన మహాభారతం ఎన్నో అద్భుతమైన గాథలకు మారుపేరు. భారతంలో లేనిది ఎక్కడా లేదు, ఎప్పుడూ జరుగబోదు కూడా. పూర్వం దేవలోకంలో నాలుగువేదాలని ఒక వైపు, మహాభారతాన్ని ఒక వైపు వేసి తూస్తే, త్రాసు భారతం వైపే మొగ్గిందట. అటువంటి మహోన్నతమైన గ్రంథంలోంచి కొన్ని విశేషాలు ఇక్కడ.

1. మహాభారతం వ్రాయడానికి వేదవ్యాసునికి మూడేళ్ళు పట్టింది.
2. వేదాలను నాలుగు భాగాలుగా విభజించినందువలన వ్యాసునికా పేరు వచ్చింది. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు (నల్లగా ఉంటాడు,ద్వీపంలో పుట్టినవాడు).
3. అమృతం కోసం గరుత్మంతుడు అమృతభాండం ఉంచిన దర్భలను ఆబగా నాకి పాముల నాలుకలు రెండవుతాయి.
4. యాగశాలకున్న వాస్తుదోషం కారణంగా సర్పయాగం ఆగిపోతుందని యాగారంభానికి ముందే లోహితుడనే వాస్తుశాస్త్ర నిపుణుడు జనమేజయున్ని హెచ్చరిస్తాడు.
5. బ్రాహ్మణులు కల్లు త్రాగరాదని, త్రాగితే నరకప్రాప్తి తథ్యమని శుక్రాచార్యులు శాపమిస్తాడు.
6. కులాంతర వివాహాలు ఆనాడే ఉన్నాయి. యయాతి క్షత్రియుడు. దేవయాని బ్రాహ్మణ కన్య.'బ్రాహ్మణులు క్షత్రియ కన్యలను వివాహమాడవచ్చు కానీ,రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడరాద 'ని యయాతి అంటే శుక్రాచార్యులు అతని సందేహాన్ని తీర్చి వారిద్దరి వివాహానికి ధర్మబద్ధతను కల్పిస్తాడు.
7. శకుంతలకు దుర్వాస మహర్షి శాపమివ్వటం, దుష్యంతుడు ఆమెను మరచిపోవటం, జాలర్లు తెచ్చిన ఉంగరం చూసి అతనికి అంతా గుర్తుకు రావటం..ఇదంతా మహాకవి కాళిదాసు కల్పనా వైచిత్ర్యం. వ్యాస భారతంలో కథ వేరు. అసలు దుర్వాస మహర్షి ప్రస్తావనే లేదు. దుష్యంతుడు ప్రజాపవాదుకి భయపడి నిండు సభలో శకుంతల ఎవరో తెలియనట్లు నటిస్తే, ఆకాశవాణి వారి వివాహాన్ని గురుంచి సభికులందరికీ చెబుతుంది.దుష్యంతుడు అప్పుడు అంగీకరిస్తాడు.
8. దుష్యంతుని కుమారుడు భరతుడు. అతనికి పుట్టిన కొడుకులెవ్వరు ప్రయోజకులు కాకపోవటంతో, ఆగ్రహించి భరతుడే వారందరినే చంపి, గొప్ప యాగం చేసి, భరధ్వాజుని ద్వారా భూమన్యుడనే కొడుకుని పొందుతాడు.
9. మహాభారతం ఒక విధంగా దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధం అనుకోవచ్చు. అమృతం పొందిన దేవతలకు ఎదురొడ్డి నిలువలేక దైత్యులు, దానవులు భూప్రపంచంలో వివిధ రూపాలతో జన్మించి తమ ఆధిక్యాన్ని నిరూపించుకుంటూంటే దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి భూభారం తగ్గించటానికి దేవతలు కూడా మానవజన్మలెత్తుతారు.
ధృతరాష్ట్రుడు - హంస అనే గంధర్వుడు
పాండురాజు - వాయుదేవుని అంశ
కుంతి,మాద్రి -సిద్ధి, ధృతి
గాంధారి - మతి
విదురుడు - యమధర్మరాజు
ద్రోణుడు - బృహస్పతి
కృపాచార్యుడు - ఏకాదశరుద్రుల అవతారం
ద్రుపదుడు,విరాటుడు - వాయుదేవుని అంశ

దుర్యోధనుడు - కలిపురుషుని అంశ
దుర్యోధనుడి సోదరులు 99 మంది - రాక్షసులు
శకుని - ద్వాపరయుగాంశ సంభూతుడు
అశ్వత్థామ - రుద్రుడు,యముడు, కామ క్రోధాంశ సంభూతుడు
శల్యుడు - ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుడు
శిఖండి -గుహ్యకుడనే రాక్షసుడు
ధృష్టద్యుమ్నుడు - అగ్ని అంశ
ద్రౌపది తనయులు - విశ్వులు

కంసుడు - కాలనేమి అనే రాక్షసుడు
పదహారువేల మంది గోపికలు - అప్సరసలు
జరాసంధుడు - దానవులలో మొదటివాడు విప్రచిత్తి
రుక్మి (రుక్మిణీదేవి అన్న) - క్రోధుని కుమారుడు
సాత్యకి (శ్రీకృష్ణుని తమ్ముడు)- మరుత్తులు

10. కర్ణుడు పూర్వజన్మలో సహస్రకవచుడనే రాక్షసుడు. నరనారాయణులు అతనితో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి 999 కవచాలు చేధిస్తారు. మిగిలిన ఒక్క కవచంతో అతను పారిపోయి సూర్యునిలో దాక్కుంటాడు. నరనారాయణులే కృష్ణార్జునులుగా జన్మిస్తారు.
11. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి చీల్చి ఇంద్రునికి దానం చేస్తాడు కాబట్టి అతనికి కర్ణుడనే పేరు వచ్చింది. దుర్యోధనుని ప్రాపకం పొందేనాటికే అతనికి కవచ కుండలాలు లేవు. దానమిచ్చేశాడు. మన సినిమాలలో, సీరియల్స్ లో దుర్యోధనుడి చెంత వున్న కర్ణున్ని కవచ కుండలాలలో చూపించి, యుద్ధసమయంలో అతను వాటిని ఇంద్రునికి దానం చేసినట్లు చూపిస్తారు.
12. పెళ్ళికి ముందే గాంధారి శివుని గూర్చి తపస్సు చేసి నూటొక్క పిల్లల్ని కనే వరం పొందుతుంది.
13. గాంధారి, ఆమె చెల్లెళ్ళు పదిమందితో కలిపి ధృతరాష్ట్రునికి వందమంది భార్యలు.
14. అభిమన్యుడు చంద్రుని కుమారుడైన వర్ఛస్సు అంశతో జన్మించినవాడు. కుమారుని విడిచి ఉండలేని చంద్రుడు అతనికి పదహారోయేడు కలిగినవెంటనే తిరిగివచ్చేయాలని షరతు విధిస్తాడు . తత్పలితంగా అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణిస్తాడు.
15. కర్ణుడు సైతం ద్రోణాచార్యుడి వద్ద కొంతకాలం విద్యనభ్యసించాడు. కురుపాండవుల అస్త్రవిద్యాప్రదర్శనం కంటే ముందు అతనెవరో ద్రోణుడికి తెలుసు.
16. ఏకలవ్యుడు శ్రీకృష్ణుడి పినతండ్రైన దేవశ్రవుని(వసుదేవుని తమ్ముడు)కుమారుడు.క్రోధుని కుమారులలో ఒకరి అంశతో జన్మించినవాడు. జరాసంధుని సైన్యాధిపతైన హిరణ్యధ్వజుడనే నిషాదరాజు ఇతన్ని పెంచుకుంటాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకెళుతున్నప్పుడు, అడ్డుపడి జరాసంధుని తరపున పోరాడి అతని చేతిలో ప్రాణాలు కోల్పోతాడు.
17. హిడింబ అసలు పేరు కమలపాలిక.
18. ఘటోత్కచుడికి నెత్తిన జుట్టు లేదు. బోర్లించిన కుండలా బట్టతలతో ఉంటాడు కాబట్టే అతనికా పేరు.

Saturday, 22 August 2015

వినాయకుడు

విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.
  1. మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ, విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.
  2. గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.
  3. వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు. వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.
  4. విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.
  5. వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .
  6. ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.
  7. విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు.కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .
  8. గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.
  9. గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.
  10. భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.
  11. శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది. దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. అలా కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.
  12. ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).
  13. గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).

కురుపాండవుల తదుపరి జన్మలు

కురుపాండవులకు తదుపరి జన్మలున్నాయా? భవిష్య పురాణం ఉందనే చెబుతోంది.
 


కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు చేరుకొంది. అటు పాండవ శిబిరంలోనూ ఇటు కౌరవ శిబిరంలోనూ యోధాగ్రేసరులందరో అసువులు బాశారు. కౌరవులు పరాజితులై పాండవులు విజేతలయ్యారు. యుద్ధం చివరి రోజైన పద్దెనిమిదవ రోజు సాయంత్రం, జరిగిన నష్టాన్ని తలచుకొని శ్రీకృష్ణుడు కాలస్వరూపుడైన పరమేశ్వరున్ని స్తుతించాడు. పాండవులకు రక్షణగా ఉండమని ప్రార్థించాడు.

నమ:శాంతాయ రుద్రాయ భూతేశాయ కపర్దినే
కాలకర్త్రే జగద్భర్త్రే పాపహర్త్రే నమోనమ:
పాండవాన్రక్ష భవన్మద్భక్తాన్ భూతభీరుకాన్

రుద్రుడు సంతుష్టుడై త్రిశూలం దాల్చి నందిని అధిరోహించి పాండవ శిబిరానికి కాపలాగా వచ్చాడు. శ్రీకృష్ణుడు సెలవు తీసుకొని గజస నగరానికి వెళ్ళిపోయాడు. తొడ విరిగిపోయి నెత్తుటిమడుగులో పడి ఉన్న దుర్యోధనుని చేత సర్వసైన్యాధ్యక్షునిగా నియమింపబడ్డ అశ్వత్థామ, కుంతిభోజుడు, కృపాచార్యుడు శతృసంహారం కోసం రాత్రి పూట పాండవ శిబిరానికి రహస్యంగా వస్తారు. రక్షకుడిగా సాక్షాత్తు రుద్రుడే నిలబడివుండటం చూసి నివ్వెరపోతారు. అశ్వత్థామ పరిపరివిధాలా పరమేశ్వరున్ని ప్రార్థించి దివ్యఖడ్గాన్ని పొందుతాడు. పరమేశ్వరుడు మార్గానికి అడ్డు తొలగి దారినిస్తాడు. అశ్వత్థామ రెట్టించిన ఉత్సాహంతో శిబిరాల్లోకి దూరి నిద్రిస్తున్న ఉపపాండవులను (పాండవ కుమారులు ఐదుమంది) పాండవులుగా భ్రమించి తన దివ్యఖడ్గానికి బలిస్తాడు. ధృష్టధ్యుమ్నాదులను పరలోకానికి పంపుతాడు. కార్యం ముగిశాక దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి ఈ విషయాన్ని చెవిన వేస్తాడు. శాత్రవ సంహారం జరిగిందన్న సంతృప్తితో రారాజు మరణిస్తాడు.

కుపితులైన పాండవులు దీనికంతటికి పరమేశ్వరుడే కారణమని అతన్ని నిందించి శస్త్రప్రయోగం చేస్తారు. ప్రయోగించిన ప్రతి ఆయుధం శివుడిలో ఐక్యమైపోతుంది. 

ఆగ్రహం చల్లారని పాండవులు తన మీద పడి పిడిగుద్దులు గుద్దితే పరమేశ్వరుడు కోపించి "మీరు కృష్ణ భక్తులు గనుక మిమ్మల్ని చంపగలిగీ సహించి రక్షించాను. పునర్జన్మలెత్తి ఈ నేరానికి శిక్షను అనుభవించండి" అని శపిస్తాడు. 
పాండవులు పశ్చాత్తాపం చెంది హరిని హరున్ని ఇద్దరినీ స్తోత్రం చేస్తారు. భక్తసులభుడైన పరమేశ్వరుడు శాంతించి ఏం వరం కావాలో కోరుకొమ్మంటాడు. శరీరంలో ఐక్యమైన ఆయుధాలు శస్త్రాలు తిరిగి పాండవులకు ప్రసాదించ వలసిందిగా కోరుకుంటాడు శ్రీకృష్ణుడు. 
పరమేశ్వరుడు ఆ వరాన్ని ప్రసాదించి త్వరపడి వారిని శపించానని ఆయినా తన వాక్కు వృధా కాదు కనుక వివిధ నామధేయాలతో పాండవులు పునర్జన్మలెత్తి పాపఫలం అనుభవిస్తారని చెబుతాడు.

ఆ ప్రకారం..

ధర్మరాజు బలఖానిగా
భీముడు వీరణుడిగా
అర్జునుడు బ్రహ్మానందుడిగా
నకులుడు లక్షణుడిగా
సహదేవుడు దేవసింహునిగా
ధృతరాష్ట్రుడు పృథ్వీరాజు గా
అతని కుమార్తె వేల గా ద్రౌపది
ఆమె అన్న తారకుడిగా కర్ణుడు
జయసింహుడనే పేరుతో శ్రీకృష్ణుడు మళ్ళీ జన్మిస్తారు.

రాక్రమవంతుడైన పృథ్వీరాజ్ చౌహాన్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఢిల్లీ -అజ్మీర్‌లను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేసిన ఆఖరి హైందవరాజు, రాజపుత్ర యోధుడు అతను. అతని భార్య సంయుక్త. వారిద్దరి ప్రేమ, పరిణయం చాంద్‌బార్దాయ్ వ్రాసిన 'పృథ్వీరాజ రాసో ' సాక్షిగా జగద్వితం. మహమ్మదీయుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పిగొట్టి తుదకు మళ్ళీ అదే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన పృథ్వీరాజ్ ధీరోద్ధాత్తత గురుంచి రకరకాల గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భవిష్యపురాణంలోనూ ఈ చారిత్రక పురుషుడి ప్రస్తావన ఉంది.


భవిష్యపురాణం ప్రకారం ఇంద్రప్రస్థాన్ని పరిపాలిస్తున్న అనంగపాలుడనే రాజుకు చంద్రకాంతి, కీర్తిమాలిని అని ఇద్దరు కూతుళ్ళు. చంద్రకాంతిని కన్యాకుబ్జాన్ని ఏలుతున్న రాష్ట్రపాలుని వంశీయునికిచ్చి పెళ్ళి చేస్తే, కీర్తిమాలినిని చవహని వంశస్థుడైన సొమేశ్వరునికిచ్చి వివాహం జరిపిస్తాడు.చంద్రకాంతికి జయచంద్రుడు, రత్నభానుడనే పిల్లలు కలుగుతారు. కీర్తిమాలినికి ముగ్గురు పిల్లలు పుడతారు -ధుందుకారుడు,కృష్ణకుమారుడు, పృథ్వీరాజు. వీళ్ళలో పృథ్వీరాజుది ధృతరాష్ట్రుని అంశ. అమిత బలపరాక్రమాలు కలవాడు. పన్నెండేళ్ళ ప్రాయంలోనే సింహంపై స్వారీ చేస్తాడు. మనవడి శౌర్య సంపత్తికి మెచ్చిన తాత అనంగపాలుడు అతన్ని దత్తత్త తీసుకొని రాజ్యాన్ని కట్టబెట్టి హిమాలయాలకు వెళ్ళిపోతాడు.

సోదరులిద్దరూ తనకు శతృవులని భావించిన పృథ్వీరాజు, తాత పరమపదించగానే వాళ్ళను రాజ్యం నుండి వెళ్ళగొడతాడు.వాళ్ళు తమ తమ మంత్రులని వెంటబెట్టుకొని కన్యాకుబ్జాన్ని పాలిస్తున్న జయచంద్రున్ని శరణు వేడుతారు.అతడు ఆభయమిచ్చి ఆశ్రయం కల్పిస్తాడు. జయచంద్రునికి అగమ, మలన అని ఇద్దరు చెల్లెళ్ళు. అగమను పృథ్వీరాజుకిస్తారు. మలనను ధుంధుకారుని మంత్రైన ప్రద్యోతనునికిచ్చి పెళ్ళి జరిపిస్తాడు. పృథ్వీరాజు కొత్త దుర్గాన్ని నిర్మించి దాని గుమ్మాన్ని ఎత్తిస్తాడు. ఆ గుమ్మం భాగ్యప్రదాత అని భావించి దానికి దేహలి అని నామకరణం చేస్తాడు (అదే నేటి ఢిల్లీ). కొంతకాలానికి ' తాత ఆస్తిలో తనకూ భాగముందని, తన భాగం తనకు వదిలిపెట్ట ' మని వర్తమానం పంపుతాడు జయచంద్రుడు. పృథ్వీరాజు తిరస్కరిస్తాడు. వైరం మొదలవుతుంది.

జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడు (ఇతని కొడుకే నకులాంశ సంభూతుడు లక్షణుడు) పృథ్విరాజు పాలనలో ఉన్న కొంత ప్రాంతాన్ని హస్తగతం చేసుకుంటాడు. జయచంద్రునికి పిల్లలు కలుగరు. దాసీదాని మీద మనసు పడి ఆమె ద్వారా సంయుక్త అనే పుత్రికకు తండ్రవుతాడు. ఆమె యుక్తవయస్సుకు రాగానే స్వయంవరం ప్రకటిస్తాడు. పృథ్వీరాజు ధైర్యసాహసాలు విన్న ఆమె స్వయంవర మంటపంలో అతని బంగారు ప్రతిమను పుష్పమాలాంకృతం చేస్తుంది. ధైర్యముంటే వచ్చి తీసుకెళ్ళమని పృథ్వీరాజుకు సవాలు విసురుతాడు జయచంద్రుడు. పృథ్విరాజు ససైన్యంతో వచ్చి సంయుక్తను తీసుకెళ్తాడు. హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రత్నభానుడు నిహతుడవుతాడు.

పృథ్వీరాజు లక్ష చండీయాగం చేస్తే దేవి ప్రసన్నురాలై కౌరవుల అంశతో కుమారులను, ద్రౌపది అంశతో కూతురును అనుగ్రహిస్తుంది. అయితే వీరు సంయుక్త ద్వారా కలిగిన సంతానమో మరెవరి ద్వారా కలిగిన సంతానమో తెలియదు.కూతురు పుట్టగానే భూమి కంపించి, రక్తమాంస వర్షం కురిసి, ఆకాశం నుంచి చండిక వికటాట్టహాసం చేస్తుంది.ఆమె పేరు ఏల. పన్నెండేళ్ళ ప్రాయంలో ఆమె తండ్రిని పిలిచి మండపంలో రక్తధారలతో తనకు అభిషేకం చేయించేవాడు, ద్రౌపది నామధేయంతో నగలను సమర్పించేవాడు తనకు నాథుడవుతాడని చెబుతుంది. పృథ్వీరాజు ఆ విధంగా శాసనం వ్రాయించి, కర్ణాంశ సంజాతుడైన తన కొడుకు తారకునిచ్చి, ఒక లక్ష సైన్యంతో దేశం మీదకు పంపుతాడు. రాజులందరూ వెనుకంజ వేస్తే అర్జునాంశ సంజాతుడైన బ్రహ్మానందుడు అందుకు సంసిద్ధుడౌతాడు.(ఇతను మలన కుమారుడు.ఇతని స్నేహితుడు కృష్ణుని అంశలో పుట్టిన జయసింహుడు). వివాహానికి ఎక్కడెక్కడి రాజులూ సైన్యంతో వస్తే పృథ్వీరాజు ఆశ్చర్యపోయి వారికి శిబిరాలు ఏర్పాటు చేస్తాడు. వివాహమైన వెంటనే తారకాదులు చెలరేగి యుద్ధం చేస్తే జయసింహుడు ఖడ్గధారియై దూకి తన వారిని ఆదుకుంటాడు.సకలవిద్యాపారంగతుడైన పృథ్వీరాజు రెండవ కురుక్షేత్ర యుద్ధంలో (రెండవ తైరైను యుద్ధంలో) మహమ్మదు ఘోరీ చేతిలో అపజయం పాలై మరణిస్తాడని,అంతటితో అతని వంశం క్రమంగా అంతరిస్తుందని, నకులాంశ సంభూతుడైన లక్షణుడు కూడా ఈ యుద్ధంలో మరణిస్తాడని భవిష్య పురాణం తెలియజేస్తోంది.

పురాణాల్లో ఇలా ఉంటే చరిత్రకారుల భాష్యం మరోలా ఉంది. అనంగపాలుడనే తాత పృథ్వీరాజుకున్నా, ఆ తాతయ్య కూతుళ్ళ పేర్లు మాత్రం రూపసుందరి, కమలాదేవి. సోమేశ్వరరాజు (తండ్రి పేరు సరిపోయింది) -కమలాదేవిల తనయుడు పృథ్వీరాజ్ చౌహాన్. పృథ అనే చెల్లేలు మాత్రం ఉంది.చిత్తోడ్ రాజైన సమర్‌సింగ్ ఈమె భర్త . రెండవ తైరైను యుద్ధంలో అన్నయ్య ఓడిపోవటం, భర్త, కన్నకొడుకూ వీరమరణం పొందటంతో అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. పృథ్వీరాజుకు హరిరాజనే సోదరుడున్నట్లు కొంత సమాచారముంది. పృథ్వీరాజు మరణాంతరం, అతని కుమారుడైన గోవిందరాజుని అజ్మీర్ సామంత రాజుగా ప్రకటిస్తారు ముసల్మానులు. హరిరాజు అతన్ని పడగొట్టి రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు. తురుష్కులపై తిరుగుబాటు చేసి కొంతమేర సఫలీకృతుడై చివరికి పరాజితుడై ఆత్మార్పణ చేసుకుంటాడు. పృథ్వీరాజుకు చాలామంది సంతానమున్నట్లు, వీరిలో కొందరు ఇస్లాం మతం పుచ్చుకున్నట్లు కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు గానీ ఎక్కడా ఏల తారకుడిల ప్రస్తావన లేదు. అలాగే జయచంద్రుడు - పృథ్వీరాజ్ అన్నదమ్ములన్న విషయం రూఢియైనా , జయచంద్రుని తమ్ముడైన రత్నభానుడి విషయంలో సమాచారం లేదు. సంయుక్త జననంలోనూ స్పష్టత లేదు.

భవిష్యపురాణంలో వివాస్పద అంశాలు చాలా ఉన్నాయి. ఏది వ్యాసకృతమో, ఏది ఇతరుల కల్పనో తెలియదు. వాటిలో పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర ఒకటి. ధృతరాష్ట్రాంశతో జన్మించిన పృథ్వీరాజు వరుసకు అన్నకూతురైన సంయుక్తను లేవదీసుకొని వివాహమాడటం ఏమిటో అంతుపట్టకుండా ఉంది. జయసింహుని లీలలు, చరిత్ర దాదాపుగా శ్రీకృష్ణుని చరిత్రను పోలివున్నాయి. ఇంతటి ప్రఖ్యాతి వహించిన రాజు నిజంగా పృథ్వీరాజు కాలంలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు.నకులాంశతోనూ, కర్ణాంశతోను ద్రౌపద్యాంశతోనూ పుట్టిన వాళ్ళు, ఇతర దివ్యాంశ సంభూతులు అనామకులుగా మరణించటమేమిటో అర్థం కాకుండా ఉంది. ఏ ప్రయోజనమూ నెరవేరనప్పుడు మహాత్ములు మళ్ళీ పుట్టడం దేనికి? ఇన్ని సందేహాల మధ్య అసలు భవిష్యపురాణంలో పేర్కొన్న పృథ్వీరాజు, మాములు జనానికి తెలిసిన పృథ్వీరాజు ఒక్కరేనా అన్న అనుమానం కలుగక మానదు.

శివపురాణం నుంచి కొన్ని విశేషాలు

శివపురాణం నుంచి కొన్ని విశేషాలు

  1. పార్వతీదేవి విష్ణువు చెల్లెలు. అందుకే ఆయనలా నల్లగా ఉంటుంది. లక్ష్మీదేవి బ్రహ్మదేవుని చెల్లెలు. ఎర్రగా ఉంటుంది. సరస్వతి శివుని చెల్లెలు. తెల్లగా ఉంటుంది.
  2. సత్యము, శౌచము, తపస్సు, దయ నాలుగు పాదాలుగా ఉంటాయి.
  3. శివ కుటుంబంలో ఐదవవాడు చండీశ్వరుడు. చండీశ్వర స్థానంలో చిటికె మాత్రమే వెయ్యాలి. శివప్రసాదంలో మిగిలినదాన్ని ముందు చండీశ్వరుడు తింటాడు. ఆయనకు అర్పించిన తర్వాతే భక్తులు ఆరగించాలి.
  4. నవనందులుగా నందీశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశాలు ఆంధ్ర దేశంలో ఉన్నాయి.
  5. విభూతి పెట్టుకున్నవాళ్ళంతా శైవులు కారు. విభూతి వైదికం. ఎవరైనా భస్మారాధరన చెయ్యవచ్చు. నుదుటి రాతను సైతం మార్చే శక్తి భస్మకుంది. స్నానం చేస్తే తడి విభూతిని పెట్టుకోవాలి. మూడు వ్రేళ్ళతో బూడిద పెట్టుకోరాదు. స్నానం చెయ్యనప్పుడు పొడి విభూతిని లలాటం మీద పూసుకొని వెళ్ళవచ్చు. మృగముద్ర పట్టి బూడిద పెట్టుకోవలి. ఆవు పేడను బాగా కాల్చి పొడి చేసి తయారు చేసిన బూడిద, యజ్ఞంలో ధర్భలను కాల్చి చేసిన బూడిద శ్రేష్ఠమైనవి.
  6. తల్లిదండ్రులకి రోజుకి ఒక్కసారి మాత్రమే నమస్కారం చెయ్యాలి. శివాలయంలో నాలుగైదు సార్లు నమస్కారం చెయ్యాలి. సన్యాసికి నాలుగు మార్లు నమస్కారం చెయ్యలి. ఆలయంలో తప్పకుండా కోర్కెలు కోరాలి.
  7. శివుడికి పునః ప్రతిష్ఠ లేదు. శివలింగం అరిగిపోయి ఎంత చిన్నదైపోయినా దాన్నే పూజిస్తారు.
  8. ఈ బ్రహ్మాండంలో సృష్టింపబడ్డ మొట్ట మొదటి పట్టణం - కాశీ నగరం. ప్రపంచమంతా లయమయ్యే సమయంలో కూడా మునిగిపోని ఎకైక నగరం కాశీ. వారణ, అశి అనే రెండు నదులు కలిసి ప్రవహించటం వలన అది వారణాశి అయ్యింది. విష్ణువు చెమటలో తడిసి మునిగిపోయిన భూమి కాశి.
  9. కేదారేశ్వర లింగస్వరూపాన్ని దర్శించిన వారికి మోక్షం తధ్యం. నేరుగా కన్నుతో లింగాన్ని దర్శించకుండా ఒక రాగి కంకణంలో నుంచి చూడాలి.
  10. మేరు పర్వతం చుట్టూ నవగ్రహాలు ప్రదక్షిణ చేస్తూంటాయి.
  11. నారద మహర్షి శాపం కారణంగా శ్రీమహావిష్ణువు రామావతారంలో భార్యావియోగం పొందవలసి వస్తుంది. ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించిన నారదుడు, మన్మథున్ని కూడా జయించానని గొప్పలు పోవటంతో ఆయన్ను పరీక్షించటానికి మహావిష్ణువు ఒక నాటకమాడుతాడు. తన మాయతో కాశీరాజు కూతురుగా జగదేక మోహనాంగిని సృష్టించి, నారదుని కళ్ళలో ఆమె పడేలా చేస్తాడు. ఆమె అందానికి వివశుడైన నారదుడు, ఆమెను ఎలాగైనా పొందాలని నిశ్చయించుకుంటాడు. ఆమె జాతకం పరిశీలించి హరియే ఆమె భర్తవుతాడని గ్రహించి, విష్ణువును ప్రార్థించి, తనను హరిలాగే చెయ్యమంటాడు. హరి అంటే కోతి అని మరొక అర్థం కూడా ఉంది. నారాయణుడు చిరునవ్వుతో అంగీకరించి నారదున్ని తనలా మార్చివేసి ముఖాన్ని మాత్రం కోతిలా చేసేస్తాడు. కాశీరాజు కూతురు స్వయంవరానికి అట్టహాసంగా వెళ్ళిన నారదుడు, ఆమె తనను కాకుండా అసలు శ్రీమహావిష్ణువును పెళ్ళాడటంతో ముందు తెల్లబోయి తర్వాత నవ్వులపాలవుతాడు. మానవ జన్మనెత్తి భార్యావియోగం అనుభవించాలని విష్ణువుని ఆగ్రహంతో శపిస్తాడు.

ఉత్తరకాండ నుంచి జనక మహారాజు జన్మ వృత్తాంతం ఇతర విశేషాలు



  1. శ్రీరామ పట్టాభిషేకం జరిగిన తర్వాతే రామాయణ రచన ప్రారంభిస్తారు వాల్మీకి. 
  2. రావణపత్ని మండోదరికి ఇద్దరు సోదరులు -మాయావి,దుందుభి.
  3. కుంభకర్ణుడి భార్య వజ్రజ్వాల. విభీషణుడి పత్ని సరమ, పుత్రిక అనల. ఇద్దరూ లంకలో ఉండగా సీతాదేవికి ధైర్య వచనాలు చెప్పి స్వస్థత చేకూరుస్తారు.
  4. కుంభకర్ణుడి సౌకర్యార్థం రావణుడు నిర్మించిన మందిరం మూడు యోజనాల పొడవు, ఒక యోజనం వెడల్పుతో ఉండేది . ఒక యోజనం పదిహేను కిలోమీటర్లకు సమానం.
  5. రావణుడి దుష్కృత్యాలను భరించలేకపోయిన అతని అన్న కుబేరుడు, తమ్ముడికి హితబోధ చేసి సరిదిద్దాలనే ఉద్దేశ్యంతో రాయబారిని పంపుతాడు. రావణుడు ఆగ్రహంతో ఊగిపోయి రాయబారి శిరస్సు ఖండించి, అతని శరీరాన్ని రాక్షసులకు విందు చేసి అన్నపై, ముల్లోకాలపై దండయాత్రకు బయలుదేరుతాడు.
  6. కుబేరున్ని ఓడించి పుష్పక విమానాన్ని దొంగలించి అందులో తిరిగి వెళ్తున్న దశకంఠుడు అకస్మాత్తుగా విమానం ఓ చోట ఆగిపోయి కదలకుండా మొరాయించేసరికి ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పరమశివుడు కేళీవిలాసంలో ఉంటాడని,అందుకే ఆ వైపుగా ఎవ్వరినీ అనుమతించరని నందీశ్వరుని ద్వారా తెలుసుకుంటాడు. అయినా అహంకారదర్పంతో తన మార్గానికి అడ్డొచ్చిన కైలాస పర్వతాన్ని పెకలించి పారేస్తానని పిచ్చి ప్రేలాపనలు చేసి కైలాసాన్నే కదిలించబోగా పరమశివుడు తన కాలి బొటనవ్రేలితో అతన్ని అదిమిపెట్టి గర్వభంగం కలిగిస్తాడు. బరువు మొయ్యలేక దశకంఠుడు వెయ్యి సంవత్సరాల పాటూ అరుస్తూ శివ స్తోత్రాలు వల్లిస్తాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై అతనికి వెయ్యి సంవత్సరాల ఆయుష్షును తిరిగి ప్రసాదించి, చంద్రహాసమనే దివ్య ఖడ్గాన్ని కానుకగా ఇస్తాడు.
  7. రావణుడి ధాటికి భయపడిపోయి ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు పక్షులుగా జంతువులుగా మారిపోయి తప్పించుకుంటారు. ఇంద్రుడు నెమలిగా మారిపోతే, యముడు కాకిగా, వరుణుడు హంసగా, కుబేరుడు తొండగా మారిపోయి దాక్కుంటారు. ఆపదలో ఆదుకొన్నందుకు ప్రతిగా ఆయా పక్షి, జంతు సంతతికి వరాలిస్తారు దేవతలు. నెమలికి సర్పభయం లేకుండా దేవేంద్రుడు వరం ఇస్తాడు. తన ఒంటిపైనున్న వేయి కన్నులే నెమలి పింఛానికి వస్తాయని, వర్షాగమనానికి ముందు నెమలి పురి విప్పి నాట్యం చేస్తుందని వరమిస్తాడు. కాకికి ఏం తిన్నా ఏం కాదని, ఇతరులు చంపితే తప్ప దానికి చావు లేదని, దాని ద్వారానే పితరులకి ఆహారం అందుతుందని వరమిస్తాడు యముడు. వరుణుడు హంసలకు తెలుపు రంగును ప్రసాదించి, నిత్యం నీళ్ళలో ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు. కుబేరుడు తొండకు బంగారు వర్ణాన్ని వరంగా ప్రసాదిస్తాడు.
  8. మేఘనాథుడు (ఇంద్రజిత్) మండోదరీ-రావణుల ప్రథమ సంతానం. శౌర్యపరాక్రమాలలో తండ్రిని మించిన తనయుడు. శివున్ని ప్రసన్నం చేసుకొని భూమ్యాకాశాలలో ఎక్కడైనా సంచరించగల రథాన్ని, తామసి అనే మాయా విద్యను వరంగా పొందుతాడు. దేవేంద్రున్నే బంధించి బ్రహ్మ వచ్చి బ్రతిమాలితే విడిచిపెడుతూ మరిన్ని వరాలు పొందుతాడు. యుద్ధానికి బయలుదేరే ముందు ప్రతి సారీ యజ్ఞం చేయటం, ఆ యజ్ఞకుండంలోంచి వచ్చిన రథాన్ని అధిరోహించి శాత్రవ సంహారం చెయ్యటం అతనికలవాటు. యజ్ఞం చేస్తున్నప్పుడు మధ్యలో ఆయుధం పట్టరాదనే నియమం ఉంది. యజ్ఞం నిర్విఘ్నంగా పుర్తయ్యి రథాన్ని ఎక్కాడా, ఇక తనకు పరాజయమన్న మాటే లేదు. లక్ష్మణుడు యాగాన్ని ధ్వంసం చెయ్యటంతో ఇంద్రజిత్ యాగ సామగ్రినే విసురుతూ అస్త్రాలు ప్రయోగించి అవి నిష్ఫలమవ్వటంతో అవతలివాడు మాములువ్యక్తి కాదని గ్రహించి, రావణుడికి హితబోధ చేసి విఫలుడై చివరికి యుద్ధభూమిలో వీరమరణం పొందుతాడు.
  9. వాలి, సుగ్రీవులకు తల్లిదండ్రీ ఇద్దరూ ఋక్షరజస్సనే వానరమే. ఒకప్పుడు బ్రహ్మదేవుడు యోగదీక్షలో ఉండగా ఆయన కళ్ళ నుండి జారిపడ్డ అశ్రుకణమే వానర రూపం దాల్చి ఋక్షరజస్సుగా పిలవబడ్డాడు. ఈ ఋక్షరజస్సే ఒకానొక సందర్భంలో స్త్రీమూర్తిగా మారిపోయి ఇంద్రుని ద్వారా వాలిని, సూర్యుని ద్వారా సుగ్రీవున్ని పిల్లలుగా పొంది మళ్ళీ పురుషాకృతిని పొందుతాడు.
  10. బాల్యంలో తన అల్లరి చేష్టలతో ఆశ్రమవాసులను విసిగిస్తూండటంతో మహర్షులు కోపించి ఇతరులు గుర్తు చేస్తే తప్ప స్వశక్తి గుర్తుకురాదని హనుమంతున్ని శపిస్తారు.
  11. ఇక్ష్వాకు మహారాజుకు నూర్గురు కుమారులు. వారిలో చివరివాడు పరమ అయోగ్యుడు. అతని పేరు దండుడు. ఇక్ష్వాకు మాహారాజు వాడిని వింధ్య పర్వత ప్రాంతానికి రాజును చేసి శుక్రాచార్యులను గురువుగా నియమిస్తాడు. మూర్ఖుడైన దండుడు గురువు గారు ఆశ్రమంలో లేని సమయంలో ఆయన కుతురైన అరజను బలవంతంగా వశపరచుకొని ఆ పిమ్మట తన దారిన తను వెళ్ళిపోతాడు. జరిగిన ఘోరం గ్రహించిన శుక్రాచార్యులు ఏడు రోజుల్లోగా మట్టి వాన కురిసి దండుని రాజ్యం సర్వనాశనమవుతుందని శపిస్తాడు. అలా అప్పుడు సర్వనాశనమైన ప్రాంతమే నేటి దండకారణ్యం.
  12. పట్టాభిషేకానంతరం పుష్పక విమానాన్ని కుబేరుని వద్దకు పంపించేస్తాడు శ్రీరాముడు. అయితే ఆ విమానం తన వద్దనుండటం కన్నా శ్రీరాముని వద్దనుండటమే శ్రేష్ఠం అని భావించిన కుబేరుడు విమానాన్ని మళ్ళీ రాముడి వద్దకే తిప్పి పంపుతాడు.
  13. శ్రీరామ పట్టాభిషేకం అయ్యాక కొద్ది రొజులు అయోధ్యలో గడిపి సుగ్రీవుడితో కలిసి కిష్కింధ కు వెళ్ళిపోతాడు హనుమంతుడు. తిరిగి అశ్వమేధయాగ సమయంలో శ్రీరాముడు కబురంపగా వానర రాజైన సుగ్రీవుడు, అతని బృందంతో అయోధ్య వస్తాడు. మన సినిమాలలో చూపించినట్లుగా పట్టాభిషేకమయ్యాక శాశ్వతంగా అయోధ్యలో శ్రీరాముడి వద్దనే ఉండిపోడు.
  14. లక్ష్మణుడు సీతాదేవిని అడవులలో వదిలివెళ్ళినప్పటికీ గంగా నది ఆవలి గట్టుపై నిలబడి వాల్మీకి మహర్షి వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళేంత వరకు వేచి చూస్తాడు. తర్వాతే భారమైన హృదయంతో మంత్రి సుమంత్రుని వెంట అయోధ్యకు తిరుగు ప్రయాణమవుతాడు. శ్రీరాముడి జాతకంలో తరచూ భార్యావియోగం ఉందనే విషయం తనకు, దశరథ మహారాజుకు దుర్వాస మహర్షి ద్వారా అంతకు పూర్వమే తెలుసునని, ఇది ఒకప్పుడు భృగు మహర్షి విష్ణువుకిచ్చిన శాపఫలమేనని చెప్పి లక్ష్మణున్ని ఊరడిస్తాడు సుమంత్రుడు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో తన నిజనామధేయంతోనే రక్షణ పొందుతుంది. ఆమె శ్రీరాముని ధర్మపత్ని సీత అని ఆశ్రమవాసులందరికీ తెలుసు.
  15. సీతాదేవి తండ్రియైన జనక మహారాజు అయోనిజుడు. పూర్వం నిమి అనే ఇక్ష్వాకు వంశ మహారాజు ఒక గొప్ప యాగం తలపెట్టి వశిష్ఠ మహర్షిని ఋత్విక్కుగా ఆహ్వానించబోతే ఆ మహర్షి తానిప్పుడు దేవేంద్రుడు నిర్వహించే యాగంలో ఉన్నానని, యాగం పరిసమాప్తమయిన వెంటనే వస్తానని చెబుతాడు. అంత వరకు వేచి ఉండలేక నిమి చక్రవర్తి తన యాగాన్ని గౌతమునితో నిర్వహిస్తాడు. యాగం జరుగుతూండగా వచ్చిన వశిష్ఠుడు తన స్థానంలో మరొకరు యాగాన్ని నిర్వహించటం గమనించి కోపోద్రిక్తుడై నిమి చక్రవర్తి శరీరం చైతన్యం కోల్పోయి జడత్వం పొందాలని శపిస్తాడు. నిమి చక్రవర్తి కుడా అదే ప్రతిశాపం వశిష్ఠునికిచ్చి గాలిలోనే యాగదీక్ష పూర్తిచేసి తన పూర్వశరీరంలో ఉండటం కంటే సకల ప్రాణుల కంటిరెప్పల పై ఉండాలని దేవతలను వరం వేడుకుంటాడు. అలా ప్రాణుల కళ్ళు విశ్రాంతి కోరుకున్నప్పుడు ఆయన కారణంగానే కంటిరెప్పలు మూసుకుంటాయి (అందుకే నిమేషము అన్నారు. దేవతల కంటిరెప్పలు కొట్టుకోవు. కాబట్టి వాళ్ళు అనిమిషులు). వారసుడి కోసం నిమి దేహాన్ని మథిస్తే పుట్టిన పిల్లవాడే జనక మహారాజు. శరీర మథనం వల్ల నిలబడిన రాజ్యం కాబట్టి ఆయన రాజ్యం మిథిలా నగరమయ్యింది.
  16. రావణుడి పినతల్లి కూతురు కుంభీనసి. ఆమె భర్త మధువనే రాక్షసుడు. రావణాదులు లంకలో లేని సమయంలో అతని సోదరియైన కుంభీనసిని అపహరించి రాక్షస వివాహం చేసుకుంటాడు మధువు. రావణుడికి విషయం తెలిసి మధువుని చంపబోతే, కుంభీనసి పతిభిక్ష కోరుతుంది. అప్పటికే స్వంత చెల్లెలైన శూర్పణఖకు పతీ వియోగం కలిగించి పాపం మూటగట్టుకున్న రావణుడు మరొకమారు అలాంటి కార్యమే చేయడం ఇష్టంలేక తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు. మధువు తన అపూర్వమైన భక్తిప్రపత్తులతో పరమేశ్వరున్ని మెప్పించి ఆయన శులాన్ని పొంది, అది చేతనున్నంత వరకు తనకు,తన కొడుకు లవణాసురునికి చావు లేకుండా వరం పొందుతాడు. లవణాసురుడు వరగర్వంతో కన్నూ మిన్నూ కానక ప్రవర్తిస్తూంటే మహర్షులంతా వచ్చి ప్రభువైన శ్రీరామునికి మొరపెట్టుకుంటారు. శ్రీరాముని కనిష్ఠ సోదరుడైన శతృఘ్నుడు సమరోత్సాహియై ముందుకు వచ్చి అన్నగారి నుంచి దివ్యాస్త్రం సాయంగా పొంది లవణాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతని చేతిలో శూలం లేని క్షణంలో నిర్జించి విజయాన్ని సాధిస్తాడు. అలా ఒకప్పుడు లవణాసురుడు పాలించిన నగరమే ఇప్పటి మధురా నగరం. లవణాసుర వధ తర్వాత శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు.


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

రామాయణం
  1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
  2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
  3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
  4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
  5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
  6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
  7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
  8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
  9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
  10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
  11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
  12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
  13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
  14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
  15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
  16. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
  17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
  18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
  19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
  20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
  21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
  22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
  23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
  24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు
  25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
  26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
  27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
  28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
  29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి  30  మైళ్ళ దూరంలోని బితూర్.
  30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
  31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
  32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
  33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్
 భాగవతం, మహాభారతం
  1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
  2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
  3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
  4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
  5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
  6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
  7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
  8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
  9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
  10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
  11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
  12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.
  13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.
  14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
  15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.
  16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
  17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
  18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
  19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.
  20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
  21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
  22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
  23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
  24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
  25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
  26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
  27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
  28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
  29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
  30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
  31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
  32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
  33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
  34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
  35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
  36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) - ఆల్వార్, గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
  37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
  38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
  39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
  40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
  41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
  42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.
  43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.
  44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు

వాల్మీకి ఉత్తరకాండకు, మన లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి. వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.
  1. శూర్పణఖ విభీషణుడికి అక్క.
  2. రావణ, కుంభకర్ణ, శూర్పణఖా, విభీషణులు కన్యాపుత్రులు.
  3. మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు ('భూకైలాస్' గుర్తొచ్చిందా).
  4. రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.
  5. సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.
  6. శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.
  7. యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.
  8. ఒక్క చాకలే కాదు, అయోధ్యా ప్రజలందరూ 'రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ 'ని కారుకూతలు కూస్తారు.
  9. కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా.
  10. రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో. అయోధ్యలో కాదు.
  11. కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి, 'మీ తల్లిని వెంటబెట్టుకొని రండి' అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా,కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.
  12. సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధయాగాలు పూర్తి చేస్తాడు.

Tuesday, 18 August 2015

Lord Vishnu and His Incarnations with Darwin Evolution Theory

Lord Vishnu and his Incarnations :-

Science really exist at the time of our ancestors itself. But I believe that the way of teaching is different from now. It was well explained in a story than on paper, relating to human science and psychology. We never forget what we learn from parents in childhood and we never forget a beautiful story as well. The same way beautiful stories were added to our belief and science is integrated to it by our ancestors. So that they can be remembered for ever. In that case Charles Darwin had re-concluded the evolution stages after many eras on our existing science. Lets see how beautifully science is integrated in our mythology.




Lord Vishnu is the one among the Thrimurthi’s and is the supreme god of Vaishnavism. Lord Vishnu is the creator and destroyer of all existences. He is the one who supports, preserves, sustains and governs the universe. Lord Vishnu is described as having four arms holding lotus flower in lower left hand, Kaumodaki gada in lower right hand, Panchajanya Sankha in the upper left hand and Sudarshana chakra in upper right hand. On the ocean of milk, Lord reclines and rests on Ananta Shesha( king of serpent deities, commonly shown with thousand heads). Goddess Lakshmi is his wife.

Most of the time, good and evil forces are evenly matched in the world. But at times, the balance is destroyed and evil demons get the upper hand. Often in response to a request by the other gods, Vishnu then incarnates in a human form to set the balance right again. Lord Vishnu has 10 Incarnations and though there are 24 Avatar’s as per Shrimad Bhagavatam , only ten are worshipped directly. Among these Avatar’s 9 occurred and one will be taking place in future as Lord Kalki.


Ten Incarnations of Lord Vishnu are:
  1. Matsya: The Incarnation of Lord as large fish to kill Damanaka for saving Vedas and also Manu from a great flood that submerges the entire earth.

  2. Kurma: In this Incarnation Lord helps Devas and Asuras to churn the ocean for nectar of Immortality.

  3. Varaha: Lord Takes the form of Boar to save earth and kill Hiranyaksha.

  4. Narasimha: Lord rescues his devotee Prahalad and defeats the Asura King Hiranyakashapa in the form of half lion and half human.

  5. Vamana: Lord as a dwarf grows into a giant to save the world from Asura King Bali.

  6. Parashurama: "Rama of the battle axe", a sage who appeared in the Treta Yuga. He killed Kartavirya’s army and clan and then killed all the ksatriyas 21 times.

  7. Shri Rama: The prince and king of Ayodhya who killed Demon King Raavan.
  8. Shri Krishna: the eighth avatar of Vishnu. Together with his brother Balaram an avatar of Serpentine his dearest servant.
  9. Budha: The ninth avatar of Vishnu. Prince of wisdom from Kapilavastu.
  10. Kalki: the tenth Avatar of Vishnu and said to be the harbinger of the end Kali Yuga.


Other Incarnations:


  • Adi Purush Avatar ( Incarnation of Pre-eminent man):
    Lord Vishnu took his first incarnation as the pre-eminent man, with a desire to commence creation. This first incarnation of Lord Vishnu was full of all the sixteen Kalas (Supernatural powers).
    Lord Brahma manifested from the navel of Lord Vishnu in his (Lord Vishnu) state of Yoganidra (deep meditation). The creation as well as the expansion of the creation commenced from the organs of Lord Brahma. The first incarnation of Lord Vishnu is all-powerful, which can be seen only by the yogins and sages who have attained divine knowledge. This incarnation is also the indestructible seed from which all the other incarnations manifest themselves. During the time of final annihilation of the world, every creation merges into him.
  • The EternalYouths:
    Sanatkumar was the 'Manasputra' (born by a wish) of Lord Brahma. Throughout his life, he maintained celibacy; and engaged himself in the performance of tremendous penance. He was the one from whom the Brahmins got the inspiration regarding the values and importance of penance and Celibacy.
  • Narada Avatar:
    Lord Vishnu took his fourth incarnation as Narada. Narada by becoming a 'Devarishi' among all the sages, achieved liberation from all of his Karma's (action). Narada was the one who gave discourses to the Vaishnavas (followers of Lord Vishnu) on 'Pancharatra Tantra'.
    Lord Vishnu in his incarnation as Narada, showed that, the devotion is the best mean of getting liberated from all the bondages of 'Karma's'. He also said that a devotee of Lord Vishnu is the supreme among the devotees in the same way as Devarishi Narada among the Sages.

  • Nara-Narayana Avatar:
    Lord Vishnu took his fifth incarnation as sage Nara-Narayan by taking a birth from the womb of a woman named 'Kala'. He performed a tremendous penance by going to Badri and Kedar. He showed the importance Penance (Labour), and also that nothing can be achieved in this world without it.
  • Kapila Avatar:
    Lord Vishnu's Sixth incarnation was as sage Kapila. The objective of this incarnation was to compile all the divine knowledge that had been destroyed. He was the profounder of Sankhya Shastra (rationalism) which helped the Brahmins, who had forgotten their duties to rectify their mistakes. He also gave discourse to his own mother.
  • Dattatraya Avatar:
    Lord Vishnu's Seventh incarnation was as Dattatraya. He was born to Ansuya and his father was Sage Atri. He was the one who had given Spiritual Knowledge to King Alarka and Prahlada. He had twenty four teachers. He believed that in the world, a man can learn from each and every thing, so he accepted twenty-four objects like water, bird, air, an unmarried girl, and even a prostitute etc.

  • Yagya Avatar:
    Lord Vishnu in his eighth incarnation as Yagya was born to Prajapati and Akuti. He had rescued a 'Devagana' (celestial and supernatural being) named Yama and also the Manvantar named as 'Swayambhuva'. The main thrust of his teaching was based on the values of helpfulness and protecting each other during the time of crisis.
  • Rishab Avatar:
    Lord Vishnu in his ninth incarnation as Rishabh Dev was born to king Nabhi and Marudevi. His mother Marudevi was the daughter of Indra. He attained that state of Paramhansa (an ascetic of highest order who has controlled his anger) which is an uphill task. He was given the title of 'Jin' which means a ' a knower'. His followers are known as Jains.
  • Prithu Avatar:
    Lord Vishnu in his tenth incarnation as 'Prithu' came into existence after the body of King 'Vena'. Lord Vishnu took this incarnation as per the wishes of the sages. The earth had concealed all the vegetation's within her and as a result the whole land had become barren. To protect the humanity, Lord Vishnu took incarnation as Prithu by milking the cow (earth). This is considered that as a very supreme incarnation, because the earth has remained full of vegetation's after that.
  • Dhanvantari Avatar:
    Lord Vishnu took his thirteenth incarnation as Dhanvantari. He manifested from the ocean holding a vessel filled with ambrosia. He was the profounder of medicinal science.
  • Mohini Avatar:  
    Lord Vishnu in his fourteenth incarnation as a most enchanting woman enchanted the demons by his beautiful appearance of a woman, and took away the pot filled up with ambrosia from them and gave it to the deities. The deities were thus protected from the demons.
    In Another story Lord Vishnu in the Mohini Avatar gives birth to Lord Ayyappa swamy. For the complete story follow the link


  • Hayagreeva Avatar:
    Once Lord Brahma becoming tired of his creative activities, wanted to rest. The night of the Brahma was approaching. Because of his tiredness Lord Brahma yawned. All the four Vedas came out from his opened mouth. A demon who used to live near him in disguise, abducted the Vedas. Lord Vishnu took his sixteenth incarnation as Hayagreeva to protect the Vedas. In this incarnation his face resembled that of a horse and the rest of his body resembled that of Sri Narayan with all of his four hands. He killed the demon and protected the Vedas.
  • Vyas Avatar:
    Lord Vishnu took his nineteenth incarnation as Sage Vyasa by taking birth from the womb of 'Satyavati'. His father was sage Parashar. He made the division of Veda, and made extension of its branches. He also wrote eighteen Mahapuranas and the Mahabharata.
  • Balaram Avatar:

Balrama is considered to be the twenty-first incarnation of Lord Vishnu. In this incarnation he killed Pralambasura the demon and he killed many more demons.


Birth of Lord Vishnu


The Vedas say, Vishnu wasn’t born, from Vishnu, Brahma is born and in Maha Upanisad it is said that Lord Shiva was born from the forehead of the Supreme Lord. Thus the Vedas say that is the Supreme Lord, the Creator of Brahma and Shiva, who is to be worshiped.

           Narayanah paro devas, Tasmaj jatas caturmukhah
           Tasmad rudro ‘bhavad devah, Sa ca sarva- jnatam gath

“Narayan/Visnu is the Supreme Personality of Godhead and from him Brahma was born, from whom Shiva was born” .

Lord never left his devotees in difficulties, few known examples apart from Incarnations are:

Gajendra Moksha:

Once upon a time there lived an elephant in deep forest Rtumata which was created by varuna. This forest was situated in the mountains of Trikuta in ancient India. It is a devotee of Lord Vishnu. It fells thirsty on a day and goes in search of water. When Gajendra gets into the water, and it becomes a potential cause of his death.

Gajendra and his herd of elephants have a good time enjoying the cool water when the crocodile suddenly attacks Gajendra and caughts him by leg. The struggle between elephant and crocodile lasts for several thousands of years. Gajendra tried for a long time to escape from the crocodile's clutches. All his family, relatives and friends gathered around to help him, but in vain. The crocodile wouldn't simply let go. When they realised that ‘death’ has come close to Gajendra, they left him alone. He trumpeted in pain and helplessness until he was hoarse. As the struggle was seemingly endless and when the last drop of energy was also sapped, Gajendra called to god Vishnu to save him with Gajendra sthuthi, holding a lotus up in the air as an offering.



Hearing to the devotees call, Lord Vishnu rushes to the scene leaving everything behind. On seeing the lord, that mighty elephant lifts the lotus with its trunk. Lord becomes angry and cuts the head of the crocodile with his sudarshana chakra. Lord explains that Gajendra is king Indradyumna, a vishnu devotee who gets cursed from sage agastya in its previous birth and the crocodile is Gandharva king HuHu who got cursed by sage Devala for pulling his leg while praying Lord Surya. Both of them gets MOKSHA from the lord.

Evolution theory in Dashavatar:


In the evolution chronology, life evolved in the waters and thus the first form of life is an aquatic animal i.e. the fish which is Matsya Avatar. Lord Vishnu took the form of a huge fish in his first Incarnation. This was followed by the form which could survive both in land and water, which is depicted through a turtle (Kurma Avatar), which can survive both in land and water. In the Kurma incarnation Lord Vishnu takes the form of a great tortoise to support churning of the primordial ocean with the mountain, to beget the elixir of immortality. Evolution from Pisces to Amphibians is also what Darwin had proposed. Around the time amphibians evolved, tectonic movements and upheavals of great landmasses were recorded. The churning of the ocean can be seen to symbolise this movement giving rise to new landmasses. At the end of this massive upheaval of earth, mountain ranges such as the Himalayas, Andes, and the Alps were supposed to have come into existence. These mountains later made way for dense forests and rivers which became the source of survival of fast evolving species on earth.
Please note that Darwin’s theory had many intermediate stages of evolution, which is not found in the dashavatar . Instead of the stages of reptiles and birds from amphibians, the dashavatar straightaway evolves to the mammals from the stage of the amphibians giving us the next avatar of Varaha,the wild boar. In the Varaha Avatar Lord Vishnu is seen fighting and eliminating the demon in the oceans, to rescue the abducted land maiden (Bhu-devi) for the benefit of people.
Many scholars have found strange coincidence with the scientific finding that more than about 70 million years ago, the Indian land mass had torn itself from the Antarctic and moved north to join the Eurasian land mass, thus lifting up the Himalayan fold mountains. The tropical forests of the western Himalayan ranges, fed by the great river systems of Indus and Ganges later facilitated the evolution of pre-human species. They further surmise that the conquest of the demon by a wild boar could symbolically signify the end of dominance of giant reptiles (dinosaurs?) and the emergence of mammals as the leaders of life forms.
Once the mammal had evolved, the next stage of evolution was a form of human beings who resembled animals both in looks and in behaviour. This takes us the next avatar of Narasimha, where Lord Vishnu is described as a form of half lion and half man. 
From this stage was evolved a slightly smarter and intelligent species of mammals, i.e. the monkey clan who were short but intelligent. This brings us to the next avatar, of the Vamana Avatar (the dwarf man).

The first five avatars are the symbols of Darwin’s biological evolution theory. The sequence may well represent the forms of fishes, amphibians (reptiles), mammals, advanced primates (hominids) and finally the thinking man respectively. If we look deep and go through the stories in details, they all give hints of the physical evolution of man. However, the next five avatars show the cultural evolution of man.