Monday, 30 November 2015

అశ్వినీ దేవతలు


అశ్వినీ దేవతలు పురాణ పురుషులు మరియు కవలలు. వీరు సూర్యునికి, ఛాయాదేవికి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావము వలన నకులుడు మరియు సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.

పురాణ కథనం
అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రధాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రధానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రధానికి చక్రాలూ మూడే. సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆరథంలో ఓకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.

హవిర్భాగం పొందుట
అశ్వినీదేవతలు దేవతలైనా వారికి యజ్ఞయాగాదులలో భాగం ఉండేది కాదు. వృద్దుడైన చ్యవనమహర్షికి సందర్భానుసారంగా యవ్వనవతియైన సుకన్య భార్యగా లభించింది. సుకన్య భర్తను భక్తి శ్రద్ధలతో సేవించగా ఆమె సేవలకు తృప్తి చెందిన చ్యవనమహర్షి ఆమెను సంతోషపెట్టడానికి యవ్వనం కావాలని అనిపించింది. అనుకోకుండా వారింటికి విచ్చేసిన అశ్వినీ దేవతలకు ఆయన తనకు యవ్వనం ప్రసాదించమని కోరాడు. బదులుగా వారికి యజ్ఞయాగాదులలో హవిర్భాగం ఇప్పించగలనని చెప్పాడు.

ఋగ్వేదం
అశ్వినీ దేవతలు పేరిట నక్ష్త్రములు కలవు. కాని అవి వారి అనంతరము వారి పేరిట పెట్టబడిన జ్ఞాపక చిహ్నములని గుర్తించవలెను. మిథున రాసి లోని కేస్టర్‌, పోలక్స్ అనే నక్షత్రాల జంటకీ అశ్వినులకీ పోలికలు ఉన్నాయి
అశ్వినిలు నాటి దేవ ప్రజాసమూహమునకు, అనగా ప్రాచీనార్యజాతికి వైద్యులుగా, ఓడలతో వ్యాపారము జేయువారుగా ఉండి ప్రజాసేవ చేయుచుండునత్లు ఋగ్వేదమున ఈ క్రింద దృష్టాంతరమున కనబడుచున్నది.&
వీరు పశువైద్యము గూడ చేయుచుండిరి.
శయుడను ఋషియొక్క గోవు ఈనలేని స్థితిలో నుండగా, వీరు దానిని ఈనినటకు సాయపడిరి.
రేభుడు, నందనడని ఋషులను రాక్షసులు బడద్రోయగా వారిని రక్షించిరి.
ఇట్లే తుభ్యుడు, అంతకుడు అను వారలను గూడ రక్షించిరి.
పరావృజుడను ఋషికి కాళ్ళు పోగా నూతనముగ నిర్మించిరి.
ౠజాశ్వుడను వానికి అంధత్వమురాగా, నాతని కన్నులు బాగుచేసి దృష్టి వచ్చునట్లు చేసిరి.
ఖేలుని భార్యయగు విశ్వలాయువతికి యుద్ధమునందు కాళ్ళు విరిగిపోగా, లోహపు కాళ్ళు ఏర్పరిచిరి.
కణ్వపుత్రుడగు పృధుమహారాజునకు మంచి గుర్రములను ఇచ్చి పేరొందిరి.
అత్రి ఋషిని రక్కసులు గొంపోయి యొక యంత్రగృహమున బడవేసి వేధించుచుండగా, ఆతనిని చెరనుండి విడిపించిరి.
శయుడు, శర్యుడు, శర్యాతుడను వారలకు కావలసిన సాయములిచ్చిరి.
విమదుని భార్యను, భుజ్యుని, అద్రిగుని, ఋతస్తుపను, సుభరను, కుత్సుని, తుర్వీచిని, దభీతిని, ధ్వసంతిని, పురషంతిని, చ్యవనుని రక్షించిరి. అనగా వీరందరికిని వైద్యము చేసిరి అనుటయే. ఇందులో భుజ్యుడు సముద్రమున ఓడలో నుండి మునిగిపోవుచున్నపుడు వీరు కాపాడిరట. చ్యరనుకి నూత్న యవ్వనము వచ్చునట్లు చేసిరట.
కక్షివంతుడను వాని కూతురు ఘోషకు కుష్టురోగమును కుదుర్చిరి.
వృషదుని కుమారుడు చెవుడుచే బాధ పడుచుండగా, దానిని నయముచేసిరి.
కణ్వఋషి కన్నులు కానరాక ఉండగా బాగుచేసి దృష్టివచ్చునట్లు చేసిరి.
వేదుడను రాజును శత్రువులు యుద్ధమున బాధించునపుడు ఆతనిని రక్షించిరి.

ఈ దృష్టాంతములను బట్టి అశ్వినిలు శరీరధారులైన పూర్వకాలపు దేవజాతి అనబడు నరులలో పుట్టి పేరొందిన వారైనట్లు స్పష్టము. కాని ఈ కార్యములు మొదట అశ్వినిలిరువురే చేసిరని అనజాలము. వారి సంతతి వారందరును కొన్నాళ్ళవరకు అశ్వినులనియే పిలువబడినట్లు గ్రహించినచో కాల వ్యత్యాసము లేకుండపోవును. ఎందువలన అనగా, పైన పేర్కొనిన వారందరును ఒకే కాలపు మానవులనుటకు వీలులేదు.

ఈ అశ్వనిలు మొదట కంచర గాడిదలపై ఎక్కి తిరుగుచుండిరట. తరువాత ఋభువులను వడ్రంగులు వీరికొక రధమును చెక్కి బహూకరింపగా, దానిపై కూర్చొండి తిరుగుచుండిరి. ఈ రధమునకు క్రమముగా ఎడ్లు, గుర్రములు, మొసళ్ళు, కట్టినట్లు కొన్ని ఋక్కులలో కలదు. సముద్రముపై ప్రయాణముచేసి తర్వాత రధమెక్కి ఆకాలపు ప్రజలకు సాయపడుటకై వీరు వచ్చుచున్నట్లు కొన్ని ఋక్కులలో కలదు. అందువలన వీరు పలు దేశములు తిరుగుచుండిరైరి.

ఋగ్వేదము 1వ మండలములోని 16వ అనువాకము 112 మొదలు 117 వరకు గల సూక్తములు పై విషయములను తెలుపుచున్నవి.

Thursday, 26 November 2015

Stories From The Ramayanam

15 Hidden Stories From The Ramayanam That You Probably Have Never Heard Before!

Valmiki, who was once a robber, wrote the Ramayanam: One of the greatest Hindu epic that imparts lessons on being an ideal human being. One of the core foundations of the Hindu culture, Ramayanam was first passed by Valmiki to the sons of Lord Ram, and has been since passed on to the generations that have come. We have all heard about Ram’s exile of 14 years, and Ravan’s kidnapping of Sita, and Ram’s eventually victory over the Evil with the help of his army of monkeys, but there’s so much more to this legendary epic, and today we bring you some of the most hidden stories from the Ramayanam. Here we go…

  1. King Dashratha had one more child. And here’s how Ram and his brothers were born.
    Before Ram and his brothers were born, King Dashratha and his first wife Kaushalya had a daughter named Shanta. Kaushalya’s elder sister Vershini and her husband Raja Rompad (who was a great friend of Raja Dashratha as they studied in same Ashram) had no offspring. Once, when Vershini was in Ayodhya, she joked around asking for a child, to which Dashratha promised her she can adopt his daughter, Shanta. As the promise of ‘Raghukul’ had to be kept, Shanta was adopted by Raja Rompad, the king of Angdesh.

    One fine day, when Shanta was grown up to be an adult and was now a very beautiful woman, she was in a conversation with Raja Rompad. At this time, a Brahmin came to visit King Rompad requesting help for cultivation during the monsoon. Busy in the conversation with his adopted daughter Shanta, Raja Rompad ignored the Brahmin who left the kingdom. Lord Indra, the God of rains, was offended because a Brahmin devotee of his was insulted. Lord Indra decided to punish Rompad and hence, it did not rain in the coming monsoon.

    To get free from this curse, Raja Rompad called a Rishi, Rishi Rishyasringa, to perform a Yagna asking the Lords for rains, which succeeded. To pay honour to the Rishi, King Dashratha and King Rompad decided to marry-off Shanta to Rishyasringa.

    As Dahsratha had no heir yet, he then called Rishyasringa to perform a Yagna for him too, after which the God of Fire gave a dessert to Dashratha for his wives to consume, eating which: Ram and his brothers were born.

  2. The interesting story behind the 10 heads of Ravan: who in fact was an extraordinary Veena Player and a staunch devotee of Lord Shiva.
    Considered the antagonist of the epic, Ravan, factually, was a great follower of Shiva, an inordinate scholar, an excellent ruler and a maestro of Veena. Attaining education, Ravan underwent a colossal penance to please Lord Shiva on the banks of river Narmada. Willing to please the Lord, Ravan axed his head. Each time that happened, the head grew back, which continued 10 times, pleasing Shiva. Shiva thus granted 10 heads to Ravan that he sacrificed. These 10 heads indicate the six shastras and the four vedas that Ravan mastered.

    After winning over Lanka, Ravan again went to meet Shiva in Kailash, where he was denied entry by Nandi-Shiva’s gatekeeper. Annoyed, Ravan teased him and hence a furious Nandi cursed him that his Lanka would be destroyed by a monkey! To prove his devotedness to Shiva, Ravan tried to lift Kailash. Angry Shiva placed a toe on the hill and Ravan’s hand crushed beneath it, so painfully that his cry shook the world.

    To please Shiva now, Ravan plucked out his nerves and played Shiva’s praise to which Shiva released him and gifted him a sword and gave him the name Ravan, which means “the one with terrifying roar”.

  3. Laxman did not sleep for the entire 14 years of Ram’s exile! Urmila, his wife, made a huge sacrifice to make this possible.
    Urmila, the wife of Laxman, was ready to accompany him when he was leaving for exile with Ram, but he forced her to stay home. When in forest, Laxman wanted to protect Ram and Sita day and night and wanted to defeat sleep. He thus approached the Goddess of Sleep – Nindra – and asked her to overlook him for the next 14 years. Nindra commanded that someone else must sleep on his behalf to create balance, and Laxman asked her to consider his wife Urmila for this. Nindra went to the Ayodhya Palace and asked Urmaila if she would take up Laxman’s sleep, which she gladly did.
    Urmila slept for 14 years, till the day of Ram’s coronation, and had it not been for her, Laxman would never have been able to slay Meghnath as Megnath was granted a boon that he could only be killed by Gudakesh: the one who defeated sleep!

  4. Ram is the reincarnation of Vishnu, but who are his brothers reincarnations of?
    As Ram is considered an incarnation of Vishnu, Bharat and Shatrughan are considered to be his Sudarshan-Chakra and Conch-Shell, while Laxman is considered to be his Shesh-Naag, Vishnu’s seat in Vaikunth (adobe of Vishnu or Brahmalok). As Earth rests on Shesh-Naag’s head, whenever Adi Shesh is angered, the Earth shakes. When in the courtroom of Janak (father of Sita), during Sita’s ‘swayamvar’, nobody could lift the bow of Shiva, Janak got upset and declared that the Earth is now devoid of strong men. This angered Laxman so much that the Earth started to tremble.
    Laxman was later born as Balram, the elder brother of Lord Krishna. Laxman had complained that since he is born as the younger brother, he has to obey all commands of Ram and thus, his wish to be the elder brother was fulfilled when he was born as Balram.

  5. A promise of Ram became the cause of Laxman’s death.
    After Sita was consumed by Mother Earth, Ram knew that his duties on Earth were over and he decided to return back to Vaikunth, but that couldn’t be accomplished as Hanuman won’t allow Yam, the God of Death to meet Ram.
    To distract Hanuman, Ram threw his ring in the underworld (Paatal) and asked Hanuman to procure it. Ram then invited Yam, but he put forth a condition that the conversation between them must remain unrevealed and if anyone intercepts the conversation, Ram would kill the person. Ram asked Laxman to guard the gate to ensure no one came in to intercept the meeting of Lord Ram and Yam.
    In the meantime, angry sage Durvasa came in to meet Ram only to be halted by Laxman. Angry Durvasa warned that he would curse Ayodhya if not allowed to meet Lord Ram. Seeing the situation, Laxman decided to go and talk to Ram and hence intercepted the meeting. After this incident, to fulfil his brother’s promise, Laxman went to Saryu and gave up his life.
    Laxman’s death before Ram’s was necessary as the Shesh-Naag (the seat of Vishnu) that was Laxman had to return first, before Vishnu returned to Vaikunth. Vishnu here was Lord Ram.

  6. Here’s how Hanuman got the name “Bajrangbali”.
    After the Ram Rajya was established, once when Sita was applying vermilion (kumkum) to her forehead, a curious Hanumam asked her the reason for this. Sita explained that it was a ritual that would result into a longer and a healthier life for Ram. Enthusiast Hanuman, as big a devotee of Lord Ram he was, went on and covered his entire body with kumkum and hence turned completely orange! Bajrang means orange and hence came the name: Bajrangbali!

  7. Once, Ram issued a death sentence to Hanuman and a war between the two started! *whoa*
    After Lord Ram became the King, once, when the court was adjourned, Narada – known for creating disharmony between Ram and Hanuman – asked Hanuman to greet all sages except Vishwamitra, since he was a King once. Hanuman did so but that did not affect Vishwamitra.
    Narada went on and instigated Vishwamitra, which boomed up his anger so much that he went to Ram and asked him to punish Hanuman to death. Vishmamitra being Ram’s guru, Ram could not ignore his command and punished Hanuman to death by arrows. Next day in the field, the statement was to be executed, but all arrows failed to do any harm to Hanuman as he kept chanting Ram!
    Since Ram had to abide by his Guru’s word, he decided to use the Brahmastra. To the surprise of all, Hanuman’s chants of Ram even failed the most powerful Brahmastra! Seeing this, Narada went to Vishwamitra and confessed his mistake, stopping the war!

  8. Bali of Ramayanam became the reason for the death of Lord Krishna from the Mahabharata!
    Bali, the elder brother of Sugreev, known for his strength, had a boon that whosoever engaged in a combat with him would lose half of his strength to Bali. Invincible Bali was challenged once by Ravan for a combat. Enraged Bali, grabbed Ravan by his head and took him round the world, making Ravan accept his defeat.
    Bali, when took over Sugreev’s wife and the kingdom of Kishkinda forcefully, Sugreev fled the kingdom and met Hanuman in the woods for help. In the interim, Ram killed a demon named Kadambh in the forest while searching for Sita and a curse-free Kadambh now asked Ram to meet Sugreev to help him from Bali.
    Ram decided to execute Bali after meeting Sugreev.
    Ram shot Bali from behind the tree, and Bali alleged that Ram had betrayed him as he didn’t challenge Bali for a combat. To this, Ram explained that if a man ill-behaves a woman, it is the duty of a righteous man to punish him. Ram then promised Bali that in his next life, he would become the reason of Vishnu’s death and thus take revenge of this incident.
    Bali was later reborn as Jara, the hunter, who was the reason of Krishna’s death in the Dwapar Yug!

  9. Had it not been for Soorpnakha, there wouldn’t have been any Ramayana. And here’s why Soorpnakha became the sole catalyst of the Battle of Lanka.
    Many accounts of the Ramayana, except that of Valmiki, suggest that Soorpnakha, the sister of Ravan, had no romantic interest in Ram. Valmiki’s account suggests that Soorpnakha, or Minaxi, approached Ram because she had a romantic interest in him, but was rejected as Ram was committed to Sita. Soorpnakha also approached Laxman but Laxman too rejected her. Seeking revenge, Soorpnakha enticed Ravan to capture Sita, which he did, triggering the Battle of Lanka.
    Other accounts however suggest that Soorpnakha, who was first married to Dushtabuddhi Rakasha, enticed Ravan to kidnap Sita to seek revenge for her husband’s death. Dushtabuddhi maintained good relations with Ravan until he started demanding more power: this resulted into Ravan killing Dushtabuddhi. Deeply disturbed by the death of her husband, it is said that Soorpnakha realised Ram could well be the only person to be powerful enough to kill Ravan, and thus got her nose chopped from Laxman (by proposing her) and then enticing Ravan to abduct Sita.
    Despite Ravan’s family’s reservations and fears, considering Ram’s power, Ravan did abduct Sita causing the Battle of Lanka. It is thus believed that Soorpnakha played a pivotal role in making of the Ramayanam and her absence would have ensured no such story to come into existence!

  10. Kuber, the Lord of Wealth, was the stepbrother of Ravana and the actual ruler of Lanka. Ravana fought Kuber to then conquer Lanka!
    Lord Brahma produced ten Prajapatis, or mind-born sons when he created the Universe. These ten were the father of the human race and one of them was Sage Pulatsya, the father of Vishrava. Vishrava – a sagacious scholar, mesmerised Rishi Bhardwaj so much that he offered his daughter Ilavida to Vishrava for marriage. Ilavida gave Vishrava a son, Kuber, the Lord of Wealth.
    An asura Sumali and Tataka, decided that their daughter Kaiseki should marry the most virtuous man and hence they planned a meeting of Kaiseki and Vishrava. He fell in love with her and fathered Ravan and his brothers. Hence, Ravan was a Brahmasura.
    Vishwakarma, the architect of Universe, created Lanka for Shiva; and Vishrava later asked it from Shiva as a dakshina. Vishrava’s son Kuber then inherited Lanka and shared all his wealth his half-brothers including Ravan. However, after getting all kinds of booms from Brahma, Ravan considered himself the most powerful of the lot and demanded entire Lanka from Kuber. When Kuber did not pay heed to his demands, Ravan fought Kuber and conquered Lanka.
    Later, after killing Ravan, and returning to Rameshwar, Lord Ram created the Shiva Temple so as to reimburse his sin of Brahmanhatya.

  11. How Lord Ram affected the tail of Squirrels.
    While creating the bridge to get to Lanka, a squirrel was helping the monkeys headed by Nal and Neel (trained by Vishawakarma). Seeing a squirrel carry beach sand for the Setu (the bridge from the tip of India to Sri Lanka), some monkeys started laughing! Upset squirrel went and sat near Ram. Acknowledging the tiny creature’s dedication, Ram cuddled its back and hence ever since, squirrels carry white stripes as the finger signs of Ram!

  12. The final victory over Ravan was made possible by Bali’s Son’s ill-treating of Mandodari, the wife of Ravan.
    When only Ravan was left to battle with Ram and his army of monkeys, Ravan organised a Yagna for his victory. The caveat was: Ravan could not leave the Yagna. Knowing this, Ram asked Angada, the son of Bali, to head a group of monkeys to impure and extinguish the Yagna.
    Reaching the palace of Ravana, Angada and his group created mayhem but Ravana was indifferent to this. In order to grab Ravan’s attention, and make him leave the Yagna, Angad then pulled Mandodari’s hair in front of Ravan. When Ravan still continued to focus on the Yagna, pleasing the Gods, Mandodari pleaded Ravan to help her and she taunted to Ravan mentioning what Ram was doing for his wife! This made Ravan leave the Yagna, and Angad and his group fled the palace as their purpose was done.

  13. Lord Indra’s jealousy cursed Kumbhakaran with his sleeping pattern!
    Once brothers Ravan, Vibhishan and Kumbhakaran were asked for a boon they wanted by Brahma. Indra, on the other hand, was jealous of Kumbhakaran’s wit and valour and thought that Kumbhakaran would ask for Indra’s Indrasan – the Kingdom of Heavens. Fearing this, Indra requested Goddess Saraswati to tie Kumbhakaran’s tongue, compelling him to ask for eternal Nindrasan. Brahma granted Kumbhakaran the boon of eternal sleep.
    Seeing this, Ravan requested Brahma to undo this as it was really a curse. Brahma did undo it, but he decided that Kumbhakaran would sleep for half a year and then wake up the rest of the year – during which he ate eternally. During the Battle of Lanka, Kumbhakaran was asleep and was walked over by a thousand elephant as that was the only way he could have woken up!

  14. Hanuman also created his version of Ramayan – which was supposedly a superior version compared to that of Valmiki’s – but Hanuman destroyed it!
    After the war when Hanuman went to Himalaya for continuing his reverence of Lord Ram, Hanuman etched his version of Ram’s tale on the walls of Himalayas with his nails.
    When Maharshi Valmiki visited Hanuman to show his version of Ramayana, he saw the walls and felt sad as Valmiki believed that Hanuman’s Ramayana was superior and that his arduously created version of the Ramayanam would remain unnoticed. Realising this, Hanuman discarded his version. Taken aback, Valmiki said he would love to be reborn to sing the glory of Hanuman!

  15. The first letter of every 1000th Shloka of the Ramayana together make up the Gayatri Mantra!
    There are 24 letters in the Gayatri Mantra and there are 24,000 Shlokas in the Valmiki Ramayana. The first letter of every 1000th Shloka together of the Ramayanam forms the Gayatri Mantra, making this revered mantra the essence of the epic. While the Gayatri Mantra has been actually first mentioned in the Rig Veda, it has gained significance thanks to the Ramayana.

    Editor’s note: There have been numerous, conflicting versions of the Ramayana, each with certain modification, told over centuries in different languages and forms across the nation. In this story, while most of the facts have been derived from the Valmiki Ramayana, there are some taken via citations of other versions of the Ramayana. The author and the editors involved with the story have ensured that every fact stated here holds enough significance in literary context to be considered a fact, but if one was to compare this story of compilation of different stories of the Ramayana with a particular version of the Ramayana, one may find some conflicting information. Our sources include the Valmiki Ramayana, this Wikipedia Page and further related linked Wikipedia pages, and this Quora thread. Note that this is an informational story and it is not intended to hurt the sentiments or question the ideals of any religion, sect, community or person.

Wednesday, 18 November 2015

దశవతారలు

వేదనుద్దరతే జగన్నివహతే
భూగోలముద్విభ్రతే దైత్యం ధారయతే
బలిం చలయతే క్షత్ర క్షయం కుర్వతే
పౌలస్త్యం జయతే హలం కలయతే
కారుణ్య మాతన్వతే మ్లేచన్ ముర్చయతే
దశకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః


వేదాలను ఉద్దరించడానికి మత్స్యావతారం,
భూభారం మోయడానికి కూర్మావతారం,
భూమిని హిరణ్యాక్షుని నుండి రక్షించడానికి వరాహావతారం,
హిరణ్యకశిపుని సంహారానికి నరసింహావతారం,
బలిచక్రవర్తి ఆహంకారం అణచడానికి వామనావతారం,
దుష్టులు మాధమతులు అయిన క్షత్రియ సంహారం కోసం పరశారమవతరం,
పౌలస్తుని పది తలల ఖండించటానికి శ్రీ రామావతారం,
కృషితో నాస్తి దుర్బిక్షమనే సందేసమివ్వడానికి హలయుదుడై బలరమావతరం,
సత్యాహింసల ప్రచారానికి బుద్దవతారం,
కలిపురుషునికి వశమైన ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి కల్కి అవతారం దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం.

చైత్రశుద్ద తదియ అపర్హనమున మత్స్యావతారం;
వైశాఖ పూర్ణిమ సాయంకాలం కూర్మావతారం;
భాద్రపద శుద్ధ తదియ మద్యాహ్నం వరాహావతారం;
వైశాఖ శుద్ధ చతుర్దశి సాయంకాలం నరసింహావతారం;
భాద్రపద శుద్ధ ద్వాదశి మద్యాహ్నం వామనావతారం;
వైశాఖ శుద్ధ తదియ మద్యాహ్నం పరశురామావతారం ;
చైత్రశుద్ద నవమి మద్యాహ్నం శ్రీ రామావతారం ;
శ్రవణ బహుళ అష్టమి అర్థరాత్రి కృష్ణావతారం;
ఆశ్వయుజ శుద్ధ దశమి సాయంకాలవేళ బుద్దవతారం;
శ్రావణ శుద్ధ షష్టి సాయంకాలం,కల్క్యవతారం.

ఈ జయంతులను పర్వదినాలుగా జరుపుకొను ఆచారం ఉన్న వారు అవతార కలవ్యాప్తిని అనుసరించి తిథి నిర్ణయించుకోగలరు. అట్లే ఉపాసకులు అంతకు ముందు తాము అనుసరించిన అర్చన, ఉపవాస, పూజాదికారాలు ఆయ తిథులలో జరిపించుకోగలరు. శ్రీరామా ,శ్రీ కృష్ణ,శ్రీ నృసింహ జయంతులు ఇట్టివే !!


మన్వంతరము





మన్వంతరము

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది. భాగవతం అష్టమ స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.


మన్వంతరాల పేర్లు

  1. స్వాయంభువ మన్వంతరము
  2. స్వారోచిష మన్వంతరము
  3. ఉత్తమ మన్వంతరము
  4. తామస మన్వంతరము
  5. రైవత మన్వంతరము
  6. చాక్షుష మన్వంతరము
  7. వైవస్వత మన్వంతరము
  8. సూర్యసావర్ణి మన్వంతరము
  9. దక్షసావర్ణి మన్వంతరము
  10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
  11. ధర్మసావర్ణి మన్వంతరము
  12. భద్రసావర్ణి మన్వంతరము
  13. దేవసావర్ణి మన్వంతరము
  14. ఇంద్రసావర్ణి మన్వంతరము

ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక రాత్రి 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక దివారాత్రము (ఒక రోజు) 864,00,00,000 2,40,00,000
బ్రహ్మకు ఒక సంవత్సరము 311040,00,00,000 864,00,00,000

ముఖ్య సంఘటనలు

స్వాయంభువ మన్వంతరము
మనువు – స్వాయంభువు.
భగవంతుని అవతారాలు – కపిలుడు, యజ్ఞుడు – దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది వడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.
మనుపుత్రులు – ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు
సప్తర్షులు – మరీచి ప్రముఖులు
ఇంద్రుడు – యజ్ఞుడు
సురలు – యామాదులు
ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము

స్వారోచిష మన్వంతరము
మనువు – అగ్ని కొడుకు స్వారోచిషుడు.
మనువు పుత్రులు – ద్యుమంతుడు, సుషేణుడు, రోచిష్మంతుడు
భగవంతుని అవతారాలు – విభువు – వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
సప్తర్షులు – ఊర్జస్తంభాదులు
ఇంద్రుడు – రోచనుడు
సురలు – తుషితాదులు
సురత చక్రవర్తి వృత్తాంతము

ఉత్తమ మన్వంతరము
మనువు – ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
మనువు పుత్రులు – భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
భగవంతుని అవతారాలు – సత్య సేనుడు – ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
సప్తర్షులు – ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
ఇంద్రుడు – సత్యజితుడు
సురలు – సత్యదేవ శృతభద్రులు

తామస మన్వంతరము
మనువు – ఉత్తముని సోదరుడు తామసుడు.
మనువు పుత్రులు – వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
భగవంతుని అవతారాలు – హరి – హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
సప్తర్షులు – జ్యోతిర్వ్యోమాదులు
ఇంద్రుడు – త్రిశిఖుడు
సురలు – విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు

రైవత మన్వంతరము
మనువు – తామసుని సోదరుడు రైవతుడు
మనువు పుత్రులు – అర్జున ప్రతినింద్యాదులు
భగవంతుని అవతారాలు – వైకుంఠుడు – శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
సప్తర్షులు – హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
ఇంద్రుడు – విభుడు
సురలు – భూత దయాదులు

చాక్షుష మన్వంతరము
మనువు – చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
మనువు పుత్రులు – పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు – అజితుడు, కూర్మావతారం – వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
సప్తర్షులు – హవిష్మ దీరకాదులు
ఇంద్రుడు – మంత్రద్యుమ్నుడు
సురలు – ఆప్యాదులు

వైవస్వత మన్వంతరము
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
మనువు – వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
మనువు పుత్రులు – ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
భగవంతుని అవతారాలు – కశ్యపునకు అదితి యందు వామనుడుగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
సప్తర్షులు – కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
ఇంద్రుడు – పురందరుడు
సురలు – వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు

(సూర్య) సావర్ణి మన్వంతరము
రాబోయే మన్వంతరము
మనువు – సావర్ణి – విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
మనువు పుత్రులు – నిర్మోహ విరజస్కాదులు
భగవంతుని అవతారాలు – సార్వభౌముడు – వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
సప్తర్షులు – గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
ఇంద్రుడు – విరోచన సుతుడైన బలి
సురలు – సుతపసులు, విజులు, అమృత ప్రభులు

దక్షసావర్ణి మన్వంతరము
మనువు – వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
మనువు పుత్రులు – ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
భగవంతుని అవతారాలు – (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
సప్తర్షులు – ద్యుతిమంతాదులు
ఇంద్రుడు – అద్భుతుడు
సురలు – పరమరీచి గర్గాదులు

బ్రహ్మసావర్ణి మన్వంతరము
మనువు – ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
భగవంతుని అవతారాలు – భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
సప్తర్షులు – హవిష్మంతుడు మున్నగువారు
ఇంద్రుడు – శంభుడు
సురలు – విభుదాదులు

ధర్మసావర్ణి మన్వంతరము
మనువు – ధర్మసావర్ణి
మనువు పుత్రులు – సత్య ధర్మాదులు పదిమంది.
భగవంతుని అవతారాలు – సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
సప్తర్షులు – అరుణాదులు
ఇంద్రుడు – వైధృతుడు
సురలు – విహంగమాదులు

భద్రసావర్ణి మన్వంతరము
మనువు – భద్ర సావర్ణి
మనువు పుత్రులు – దేవసుతాదులు
భగవంతుని అవతారాలు – సత్య తాపసుడు – సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
సప్తర్షులు – తపోమూర్త్యాదులు
ఇంద్రుడు – ఋతధాముడు
సురలు – పరితారులు

దేవసావర్ణి మన్వంతరము
మనువు – దేవసావర్ణి
మనువు పుత్రులు – విచిత్ర సేనాదులు
భగవంతుని అవతారాలు – దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
సప్తర్షులు – నిర్మోహ తత్వదర్శనాదులు
ఇంద్రుడు – దివస్పతి
సురలు – సుకర్మాదులు

ఇంద్రసావర్ణి మన్వంతరము
మనువు – ఇంద్ర సావర్ణి
మనువు పుత్రులు – గంభీరాదులు
భగవంతుని అవతారాలు – సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
సప్తర్షులు – అగ్నిబాహ్యాదులు
ఇంద్రుడు – శుచి
సురలు – పవిత్రాదులు

చతుర్యుగాలు

హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగముగా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.
యుగాలు, మహా యుగము
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

యుగాదులు
కృత యుగాది – కార్తీక శుద్ధ నవమి
త్రేతా యుగాది – వైశాఖ శుద్ధ తదియ
ద్వాపర యుగాది – మాఘ బహుళ అమావాస్య
కలి యుగాది – భాద్రపద బహుళ త్రయోదశి

యుగాల మధ్య జరిగిన ఒక కథ
భాగవతం ఏకాదశ స్కందము నుండి: ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో – సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, “నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణ వాఙ్మయం ఆవిర్భావం
“పురాణ” శబ్దానికి “పూర్వ కాల కథా విశేషం” అన్న అర్ధం నిరూఢమై ఉంది. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికే ఈ వాఙ్మయం ప్రస్తుతం లభిస్తున్న రూపు సంతరించుకొంది కాని వేదవాఙ్మయ కాలానికే దీని మౌలిక రూపం ఏర్పడి ఉండాలి. యజ్ఞసమయంలో ఋక్సామచ్ఛందాలతో పాటు ఉచ్చిష్ట రూపమై పురాణం ఆవిర్భవించిందని అధర్వణ వేదంలో తొలిసారిగా ప్రస్తావింపబడింది. శతపథ బ్రాహ్మణం, బృహదారణ్యకోపనిషత్తు, గోపథ బ్రాహ్మణం వంటి గ్రంధాలలో పురాణ ప్రశంసలున్నాయి. ఆదికాలంలో ఇది వేదాధ్యయనానికి ఒక సాంగ సాధన ప్రక్రియగా ఉండేదని, కాలక్రమంలో ప్రత్యేక శాఖగా పరిణమించి మతసాహిత్యంగా రూపుదిద్దుకొందని విమర్శకుల ఊహ. సుదీర్ఘ కాలం జరిగే యజ్ఞయాగాది కార్యాల సమయంలో నడుమ నడుమ విరాళ వేళలలో ఇష్ట కధా వినోదంగా ఇది మొదలై ఉండవచ్చును. ఆ యజ్ఞాలు చేసే రాజుల వంశాల చరిత్రను, యజ్ఞానికి లక్ష్యమైన దేతల కధలను ఇలా చెబుతూ ఉండవచ్చును. మొదటి కాలంలో బహుశా యఙ్నాన్ని నిర్వహించే పండితులే ఈ కధాకాలక్షేపం జరిపి ఉండవచ్చును కాని ఇది ప్రధాన కార్యక్రమం కాదు గనుక క్రమంగా సూత పౌరాణికులకు (క్షత్రియునకు బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన సంతానం) ఈ విధి సంక్రమించి ఉండవచ్చును. ఇలాంటి ఐతిహ్యం వాయు బ్రహ్మాండ విష్ణు పురాణాలలో కనిపిస్తుంది

వ్యాస మహర్షి పురాణ సంహితను నిర్మించి తన సూత శిష్యుడు రోమహర్షునికి ఉపదేశించాడు. అతడు దానిని భాగాలుగా చేసి సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంశపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే ఆరుగురు శిష్యులకు బోధించాడు. వీరిలో అకృతవర్ణుడు, సావర్ణి, కాశ్యప శాంశపాయనులు వేరువేరుగా మూడు పురాణ సంహితలను రూపొందించారు. రోమహర్షుని మాతృకతో కలిసి ఈ గ్రంధజాతమంతా పురాణ వాఙ్మయానికి మూలమయింది. ఈ విధంగా పరిశీలిస్తే అప్పటి యాఙ్ఞికులైన బ్రాహ్మణుల అధీనంలో ఉన్నవాఙ్మయాన్ని వ్యాసుడు విషయ క్రమం ప్రకారం పునర్వ్వస్థీకరించి, కాలానుగుణంగా అవుసరమైన మార్పులతో లోకులకు తెలియజేయమని బ్రాహ్మణేతరులైన సూతులకు అప్పగించాడు. ఆపస్తంభ ధర్మ సూత్రాలలోని ప్రస్తావనల ఆధారంగా క్రీ.పూ. 600-300నాటికే పురాణ వాఙ్మయం ఒక ప్రత్యేక శాఖగా రూపుదిద్దుకొందని, కాలానుగుణంగా ఉపదేశికుల బోధలను సంతరించుకొంటూ క్రీ.శ. 12వ శతాబ్దివరకూ మార్పులు చెందుతూ వచ్చిందని ఊహించవచ్చును

ప్రణవం వేదాలు పురాణాల పుట్టుక
పురాణాలు ప్రణవం నుండి పుట్టాయని సంస్కృత భాగవతంలోని పన్నెండవ స్కందం చెప్తుంది. బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో ఆయన హృదయగృహ నుండి ఒక అనాహత శబ్ధం వెలువడింది. ఆ శబ్ధంలో నుండి అ కార ఉకార మకార శబ్ధాలు కూడిన ఓంకారశబ్ధం ఆవిర్భవించింది. “అ” నుండి “హ” వరకు గల అక్షరాలు ఆశబ్ధంనుండి ఉద్భవించాయి. ఓంకారం సకల మంత్రాలకు బీజాక్షరం అయింది. ఓంకారం నుండి నాలుగు వేదాలను ఉద్భవించాయి. ఆ ‘అ’కార, ‘ఉ’కార ‘మ’కారములనుండి సత్వ,రజో,తమో అనే త్రిగుణాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనే చతుర్వేదాలు, భూ॰భువ॰సువ॰ అనే త్రిలోకాలు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు జనించాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు చతుర్వేదాలను వెలువరించి తనకుమారులైన మరీచి తదితరులకిచ్చాడు. వారు తమ కుమారులైన కశ్యపుడు తదితరులకు ఇచ్చారు. అలా వేదాలు పరంపరాగతంగా సాగిపోతూ ఉన్నాయి.

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి
పురాణం లక్షణాలు
ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం
సర్గశ్చప్రతిసర్గశ్చ వంశః మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.
సర్గము – సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేది
ప్రతి సర్గము – సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)
వంశము – పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుట
మన్వంతరము – ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుట
వంశాలచరిత్ర
భాగవతంలో పురాణ లక్షణాలు పది చెప్పబడ్డాయి
సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ
వంశో వంశానుచరితం సంస్థాహేతు రపాశ్రయ
దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు:
అనగా సర్గము (సృష్టి), ప్రతిసర్గము (ప్రళయము), వృత్తి (వ్యాపారము), రక్షా (పరిపాలవ), అంతరము (మన్వాదుల కాలము), వంశము (వంశాదుల విషయము), వంశానుచరితము (సూర్య, చంద్ర వంశస్థుల కధనాలు), సంస్థా (స్థితి), హేతువు (కారణము), అపాశ్రయము (ఆశ్రయ విషయాలు) అనే పదీ పురాణ లక్షణాలు. కొంతమంది ఇలా పది లక్షణాలున్నవి మహాపురాణాలని, ఐదు లక్షణాలున్నవి పురాణాలని వర్గీకరిస్తున్నారు.

పురాణాల విభజన
పురాణాల పేర్లు చెప్పే శ్లోకం
సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.
మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
“మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
“భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
“బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
“వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ — అగ్ని పురాణం
నా — నారద పురాణం
పద్ — పద్మ పురాణం
లిం — లింగ పురాణం
గ — గరుడ పురాణం
కూ — కూర్మ పురాణం
స్కా — స్కాంద పురాణం

అష్టాదశ పురాణములలో శ్లోకాలు
బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణం – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణం – నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం – విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణం – నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం – భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం – కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం – శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం – వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం – పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణం – బ్రహ్మదేవుని రచన – 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం – శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం – శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం – శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం – బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.


దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.
వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే


ఇలాంటిదే మరొక శ్లోకం
బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు – సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు – రాజస గుణాన్ని
శైవ పురాణాలు – తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం


ఉపపురాణాలు
ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా ఉన్నాయి.అష్టాదశ పురాణాలు కాకుండా ఉన్న ఉపపురాణాలు
సనత్కుమారీయము
నారసింహము
స్కాందము (కుమారస్వామి చే చెప్పబడినది)
శివ ధర్మము (నందికేశ్వరుడి చేత చెప్పబడినది)
నారదీయము(దూర్వాసునిచే చెప్పబడినది)
కాపిలము
వామనము
బ్రహ్మాండ పురాణము (శుక్రచార్యులచే చెప్పబడినది)
వారుణము
కాలకము
మహేశ్వరము
సాంబము
సౌరము
మారీచము
భార్గవపురాణము (పరాశరునిచేత చెప్పబడినది)
కార్తీకపురాణం (స్కందపురాణంలో అంతర్భాగంగా చెప్పబడింది)





వేదాలు



ప్రపంచంలో అధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి పోయినపుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలిగింది. తపోసంపన్నులైన భారతీయ ఋషులు, ”సమస్తమైన అంధకారానికి అతీతమైన సూర్య దీప్తితో ప్రకాశించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను సాక్షాత్కరించుకొన్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వలన మాత్రమే మానవుడు మృత్యువుకు అతీతుడవుతాడు. ఈ జనన మరణ వలయం నుండి తప్పించుకోవడానికి మరో మార్గం లేదు.” అని భూలోకవాసులను గురించి మాత్రమే కాక, పరలోకవాసులను సైతం ఆహ్వానించారు. ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఋషుల దివ్యానుభూతుల సమాహారమే వేదాలు.

లోకంలో అతి ప్రాచీనమైన గ్రంథాలు ఈ వేదాలే! ఇవి ఎప్పుడు ఆవిష్కరింపబడ్డాయో ఎవరికీ తెలీదు. ఇవి ఎనిమిది లేక తొమ్మిది వేల ఏళ్ళ మునుపటివి. కానీ నేటికీ అవి నిత్యనూతనంగానే ఉన్నాయి. అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలను తదనంతర కాలంలో వ్యాసమహర్షి నాలుగు భాగాలుగా క్రోడీకరించారు. అవే ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. ప్రతీ వేదమూ మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది. అవి సంహిత (దేవతా ప్రార్థనలు), బ్రాహ్మణం (యాగ వివరాలు), ఆరణ్యకం (ఉపనిషత్తులు, చరమ సత్యాన్ని గురించిన విచారణ).

“ఋగ్వేదం(వేదాలు)”
మన హిందూమతానికి ఆధారభూతాలు వేదాలు. ఇవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు.
మనము మొదట ఋగ్వేదం గురించి క్లుప్తంగా తెలుసుకొందాము.
ఋగ్వేదం దేవతాస్తుతి పరాలైన మంత్రాల సమూహము. ఋగ్వేదంఅనగా దేవతలని కుడా చెప్పవచ్చు. ఇందులో ముఖ్యమైన దేవతలు ౩౩ మంది. వీరికి సామాన్య మానవులవలె శరీరాలు ఉన్నవి. ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు, మిత్రుడు మరియు అగ్ని ఇందులో ప్రముఖంగా కనిపించే దేవతలు.

ఋగ్వేద ఆశయము:
మన అందరి ఆశయాలు ఒకటిగా ఉండాలనియు అందరి హృదయాలు, ఆలోచనలు మంచివిగా ఉండాలనియు ఒక సత్యమార్గమున నడవాలని, అందరు ఒక్కటే అని ఏకత్వము భోదిస్తుంది. ఇదే ఋగ్వేదములోని ప్రధాన ఆశయము. అందరు ఒక్కటే, అందరు భగవంతుని అంశలే, శక్తులే. అందరియందు ఉన్నా ఆత్మస్వరుపుడు ఒక్కడే, భేదములు ఉండరాదు అని శాసించునది. ఇలాంటి విశాలభావాన్ని మరిచి, భేదములు అభివృద్ధి చేసుకొనిసంకుచిత జీవనం గడుపుతున్నారు. ఆనాడు సంకుసితమును కూలద్రోసి విశాలత్వమును,ఏకత్వమును చాటినదిఋగ్వేదము.

నాలుగు వేదాలలోను ఋగ్వేదము అత్యంత పురాతనమైన గ్రంథము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది. ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది. వేదాలలో ఋగ్వేదం మొదటిది. ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది. యజుర్వేదం మానవులకు, సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది. శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు. ఋగ్వేదం పద్యరూపంలో ఉంటుంది. ఋక్కులలో ఐదు రుక్కులను ప్రధానంగా చెప్పబడ్డాయి.1 శాకల, 2 వాష్కల, 3 అశ్వలాయన, 4 మండూకాయన, 5 శాంఖ్యాయన. వీటిలో శాంఖ్యాయన, మండూకాయన, వాష్కల లభ్యం కాలేదు. ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి. ఒకటి అష్టకాలు వాటిలో అధ్యాయాలు వాటిలో వర్గాలు ఉంటాయి. రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది. మండలాలలో అనువాకాలూ వాటిలో సూక్తులుగా విభజింపబడ్డాయి. మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్ధాలు వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని భావన.

ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాధలుగా వర్ణించబడ్డాయి. ఋగ్వేదం అనేక స్త్రోత్రాలు ఉన్నాయి. ఋగ్వేదంలోని దశమ సూక్తంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది. ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించింది. ఋగ్వేదం కామితార్ధాలను తీర్చే వేదం. వర్షాలు పడాలంటే పర్జస్య పఠించాలని సూచింప బడింది. జూదం ఆడకూడదని అనేక సూక్తాలు బోధించాయి. కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది. శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది.”అనోభద్రా క్రతవో యంతు విశ్వత॰”అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుషులను చేస్తుందని విశ్వసిస్తున్నారు.

ఋగ్వేదం విజ్ఞానం
ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వనిసూక్తంలో అశ్వనిదేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి.ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వనీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుపకాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది.దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు మొందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి ‘ప్రవర్ణ’అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది.ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.


ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో వ్ద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శృధి శృతకర్ణ వహ్నిభి లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంలో గర్భయో ఆపాం ,గర్బోవనానాం గర్భశ్చస్తాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం,గణం గణం,గణినం మొదలన శబ్ధాలతో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.

ఋగ్వేదంలోని విశేషాలు
ఋగ్వేదం పది మండలాలుగా విభజింపబడింది. ఇందులో 10,622 పద్యాలు, 1,53,326 కావ్యాలు, 4,32,00 పదాలు ఉన్నాయట. ఇందులో మొదటి యేడు మండలాలు పరబ్రహ్మమును అగ్ని అనే పేరుతోను, పదవ మండలంలో ఇంద్రునిగాను, మిగిలిన గీతములు బ్రహ్మమును విశ్వేదేవతలుగాను స్తుతిస్తున్నాయి. ఎనిమిదవ, తొమ్మిదవ మండలాలలో ముఖ్యమైన గీతములలో పరబ్రహ్మము వర్ణన ఉంది. 8వ మండలంలో 92 గీతములు, 9వ మండలంలో 114 గీతములు ఉన్నాయి. వీటిలో కొన్ని సోమతలను గురించి ప్రార్ధిస్తున్నాయి. మొత్తానికి పదవ మండలంలో నూటికి పైగా అనువాకాలున్నాయి. వీటిలో ఆ గీతములను రచించిన ఋషుల పేర్లు, అవి ఉద్దేశించిన దేవతలు, స్తుతికి కారణం ఉన్నాయి. ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయారణ్యకము, ఐతరేయోపనిషత్తు, కౌషీతకి ఉపనిషత్తు ముఖ్యమైనవి.
మండలాల సంఖ్య 10.
అష్టకాల సంఖ్య 8.
అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8.
అధ్యాయాలసంఖ్య 64.
ఋగ్వేదంలో ఋక్కుల సంఖ్య 10,170.
సూక్తాల సంఖ్య 1028.
వర్గాల సంఖ్య 2006.

యజుర్వేదం
వేదం అనగా (‘విద్’ అనే ధాతువు నుండి) ‘జ్ఞానం’ అని అర్ధం. యజుర్వేదం అంటే యాగాలు ఎలాచేయాలో చెప్పేది. యాగము, బలి, దానము మొదలైనవాటిని ఆచరించేటపుడు ఋత్విక్కులు[పురోహితులు] చెప్పే మంత్రాలు [పద్యాలు] యజుర్వేదంలో ఉన్నాయి.
యజ్ఞాలలో యజుర్వేదాన్ని అనిష్టించేవారికి “అధ్వర్యులు” అని పేరు. కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితయందలి 7 అష్టకాలలో [కాండాలు]44పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 651 అనువాకములు, 2198 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ బ్రాహ్మణం (పరాయితం)3అష్టకాలలో [కాండాలు]38పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 378 అనువాకములు, 1841 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ ఆరణ్యకం 2 విభగాలు ఆరణ్యకం 5, ఉపనిషత్ 5,పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి. 290 అనువాకములు, 621 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. మొత్తం 82పన్నాలు [అధ్యాయాలు]ఉన్నాయి.1279 అనువాకములు, 4620 పనసలు (ప్రకరణములు) ఉన్నాయి. తైత్తరీయ కృష్ణ యజుర్వేదం లో సంహిత బ్రాహ్మణం కలగలసి (కలగాపులగంగా)ఉండటం వలన, అధ్యయినం, సమన్వయం, ప్రయోగం,కష్టతరం కావటం వలన యాజ్ఞవల్క్య మహర్షి శుక్ల యజుస్సులను దర్శించారు.

సంహితయందలి 40 అధ్యాయాలలో స్తోత్రాలున్నాయి. అందులో 286 అనువాకములు, 1987 ప్రకరణములు ఉన్నాయి. యజుర్వేద స్తోత్రాలలో ప్రజాపతి, పరమేష్ఠి, నారాయణుడు, బృహస్పతి, ఇంద్రుడు, వరుణుడు, అశ్విని మొదలైన దేవతల స్తుతులున్నాయి. ఈ స్తోత్రములకు కర్తలు వసిష్ఠుడు, వామదేవుడు, విశ్వామిత్రుడు. యజుర్వేదంలో ప్రాణహింస మంచిది కాదని చెప్పబడింది. బలులు నిషిద్ధమని శతపథ బ్రాహ్మణంలో ఉంది. కాలక్రమంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము (వాజసనేయ సంహిత) , శుక్ల యజుర్వేదము (తైత్తరీయ సంహిత) అని రెండుభాగాలుగా విభజింపబడింది. శుక్ల యజుర్వేదానికి “ఉదాత్తము”, “అనుదాత్తము” అనే రెండు స్వరాలున్నాయి. కృష్ణయజుర్వేదానికి “ఉదాత్తము”, “అనుదాత్తము”, “స్వరితము”, “ప్రచయము” అనే నాలుగు స్వరాలున్నాయి. శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావింపబడుతున్నది.

సామవేదము
చతుర్వేదాలలో ఒకటి సామవేదము (సంస్కృతం: सामवेद). సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది.

వేదాల మధ్య సంబంధం
వేదాలలో మూడు విధాలైన మంత్రాలున్నాయి – ఋక్కులు, యజుస్సులు, సామములు. ప్రత్యేమైన ఛందస్సులో ఉన్న పద్య శ్లోకం ఋక్. వచన రూపంలో (ఛందస్సు లేకుండా) ఉన్నను యజుస్సులు. గానానికి అనుగుణమైన పద్యశ్లోకం సామము. ఒకే శ్లోకం ఋక్కుగాను లేదా సాముగాను వివిధ సందర్భాలలో ప్రస్తావింపబడవచ్చును. ఋగ్వేదంలో అధ్యయన బద్ధమైన ఋక్కులున్నాయి. యజ్ఞాలలో ఉచ్ఛరింపబడే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. ఇవి కొన్ని యజుర్మంత్రాలు మరియు కొన్న ఋగ్వేదమంత్రాలు. సామవేదంలో సామములున్నాయి. అధర్వణ వేదంలో ప్రధానంగా ఋక్కులు, కొన్ని యజుస్సులు ఉన్నాయి.
v
1895లో రాల్ఫ్ గ్రిఫిత్ ప్రచురించిన సామవేదం ఆంగ్లానువాదం పీఠికలో ఇలా వ్రాశాడు వేదాల క్రమంలో మూడవదిగా చెప్పబడే “సామవేదం” లేదా “పవిత్ర గానాల వేదం” ఋగ్వేదం తరువాతి ముఖ్యస్థానాన్ని కలిగి ఉంది. ఇందులో ముఖ్యాంశం యజ్ఞాలలో ఉద్గాత గానం చేసే స్తోత్రాలు. ఋగ్వేదం లోని వివిధ స్తోత్రాలను, శ్లోకాలను ఇందులో తిరిగి అమర్చినట్లుగా అనిపిస్తున్నది. ఈ అమరిక క్రమానికి మూల ఋగ్వేదంలోని క్రమంతో సంబంధం లేదు. యజ్ఞయాగాది కార్యాలలో ఉపయోగపడేందుకు వీలుగా వినియోగం బట్టి ఇలా అమర్చినట్లున్నారు. ఇలా పునర్వవస్థీకరించిన సామములు కొన్ని (ప్రస్తుతం మనకు లభిస్తున్న) మూల ఋగ్వేదంలోని శ్లోకాలకు యధాతధం కాగా మరి కొన్ని సామములు గణనీయంగా మార్పు చెందినట్లున్నాయి. మరి కొన్ని సామములు ప్రస్తుతం లభించే ఋగ్వేద పాఠం కంటే పురాతనమైనవిగా అనిపిస్తాయి. గానం చేసేటప్పుడు ఈ శ్లోకాలను ఉచ్ఛారణాపరంగా ప్రత్యేకమైన విధానంలో గానం చేయాలి.

సామవేద గానాలను ఎప్పుడు సంకలనం చేశారో ఊహించడం సాధ్యం కావడంలేదు.
సామవేదంలో 1875 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ప్రత్యేకమైన ఛందస్సు ఉంది. సామవేదంలోని 1875 మంత్రాలలో చాలావరకు ఋగ్వేద సంహితలో ఉన్న 10,552 మంత్రాలలోనుండి యధాతధంగా తీసుకొనబడ్డాయి. ఈ సారూప్యం పాఠానికి మాత్రమే వర్తిస్తుంది. ఉచ్ఛారణా విధానం మాత్రం సామవేదంలో వేరుగా ఉంటుంది. భగవద్గీత 10-22 లో “వేదములలో నేను సామమును” అని కృష్ణుడు చెప్పడాన్ని బట్టి సామవేదానికి ఉన్న ప్రాముఖ్యతను ఊహించవచ్చును.

సామవేదం శాఖలు
సామవేద సంహితకు మూడు శాఖలున్నాయి. వాటిలో కౌతుమీయ శాఖ గుజరాత్‌లో ప్రాచుర్యంలో ఉన్నది. జైమినీయ శాఖ కర్ణాటక ప్రాంతంలోను, రాహయణీయ శాఖ మహారాష్ట్ర ప్రాంతంలోను ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటిలో కౌతుమీయ, రాహయనీయ శాఖలలో మంత్రాలు, ఉచ్ఛారణావిధానం ఒకటే కాని మంత్రాల క్రమంలో తేడా ఉంది. జైమినీయ శాఖలో 1693 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. కాని ఇందులో ఎక్కువ గానాలు (3681) ఉన్నాయి. సామవేదం ఒక్కొక్క అధ్యాయంలోను ఋగ్వేదంలోని ఒక్కొక్క మండలంనుండి మంత్రాలు గ్రహించబడ్డాయి. ఒక్కొక్క అధ్యాయం ఒకో దేవత గురించి ఒకో ఛందస్సులో కీర్తిస్తుంది. ఉదాహరణకు సామవేదం మొదటి అధ్యాయంలో 11 మంత్రాలున్నాయి. వీటిలో 10 మంత్రాలు ఋగ్వేదంలోనివే. 11వ సామవేద మంత్రం మాత్రం ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలో పేర్కొన్న దేవతల పేర్లే సామవేదంలో పేర్కొనబడ్డాయి. కాని “పవమాన సోముడు” గురించిన స్తోత్రాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి.

అధర్వణ వేదం (సంస్కృతం: अथर्ववेद,)
హిందూ మతంలో పవిత్ర గ్రంథాలైన చతుర్వేదాలలో నాలుగవది. అధర్వణ ఋషి పేరు మీదుగా దీనికాపేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం ఇది రెండు వర్గాల ఋషులచే సంకలనం చేయబడింది. ఒకటి అధర్వణులు, రెండు అంగీరసులు. అందుకనే దీని ప్రాచీన నామం అధర్వాంగీరస వేదం. ఋగ్వేదంలానే ఇది కూడా స్త్రోత్రాల చే కూర్చబడింది కానీ ఇందులో కొన్ని మంత్ర విద్య కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి.

ఇందులో ఆత్మలు, ప్రేతాత్మలు, మొదలైన వాటిని గురించి వివరించబడి ఉంటాయి కాబట్టి అధర్వణ వేదాన్ని చాలామంది గుప్త విజ్ఞానంగా భావిస్తారు. ఇందులో వేదకాలంలో సామాన్య మానవులు ఎలా ఉండేవారన్న విషయాలు కూడా ఉటంకించబడ్డాయి.

వైద్యశాస్త్రాన్ని గురించిన మొట్టమొదటి ప్రస్తావన ఇందులోనే ఉంది . రోగాలకు కారణమయ్యే క్రిమి కీటకాదుల వంటి జీవుల గురించిన సమాచారం కూడా ఇందులో పొందుపరచబడి ఉంది. ఇందులో యుద్ధ విద్యల గురించి కూడా సమాచారం కలదు. ముఖ్యంగా బాణాలకు విషం పూయడం, విషపు వలలను తయారు చేయడం, శత్రు సైనికులను రోగపీడితుల్ని చేసే క్రిమి కీటకాదుల ప్రయోగం మొదలైన విషయాలు వివరించబడ్డాయి.

ప్రేమని ఎట్లా పంచాలో తెలిపేది రామాయణం

రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం. ఎవరికో తోచక వ్రాసిన కథనో లేక నవలనో కాదు. చతుర్ముఖ బ్రహ్మ యుద్దానంతరం జరిగిన సన్నివేశాలని జరిగినవి జరిగినట్లు తెలిసేలా వాల్మీకికి వరం ఇచ్చాడు. ఆదృష్టాన్ని వాడి వాల్మీకి “ హసితం భాషితం చైవ గతిర్యాయశ్చ చేష్టితం ” ఎవరు నవ్వినా, ఏమి మాట్లాడినా, కదలినా, ఏది అనుకున్నా, ప్రతి స్పందనని ఉన్నది ఉన్నట్టు చూసి జరిగినదాన్ని జరిగినట్లు వ్రాసాడు. అట్లా ఎలా సాధ్యం అని అనిపిస్తుంది, అంటే ఈ నాడు ఏదో చేయ్యి చూసి లేక పుట్టిన సమయం బట్టి జరిగిన విషయాలు చెప్పగలిగేవారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇలాంటి విషయాలని గుర్తించేప్పుడు మనకు తోచినట్లు కొన్నింటిని మనం మనకు ఊహిస్తుంటాం, పొరపాటు అక్కడే వస్తుంది.

ఒకసారి ఇంగ్లీషు దొరవారు ఒక గ్రామాన్ని పరిశీలన చేయడానికి వచ్చాడు, ఒక చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. ప్రక్కనే బట్టలని ఉడికిస్తూ, ఒక్కోటి తీసి బండకేసి కొడుతూ ఉతుకుతున్నాడు. ఇంగ్లీషు దొరవారు కొంతసేపు గమనించి ఒక నిర్ణయానికి వచ్చాడు, అసలు ఈ దేశం వారికి బుద్ది లేదు ఒక బండను పగల గొట్టాలంటే బట్టలతో కొడుతున్నారు, అట్లా పగలక పోతే ఆ బట్టను వేడి చెసి మరీ ప్రయత్నిస్తున్నారు. అని తనకు తోచిన అవగాహనకి వచ్చేసాడు. అట్లానే సింధూలోయ నాగరికథని గూర్చి అట్లానే నిర్ణయించి చెప్పారు. సింధూ నది చుట్టు ప్రక్కన చిన్న చిన్న గొడలు కట్టి ఉంటాయి, వాటిని వారు వర్షపు నీరుని ఎక్కడికక్కడ నిలువ చేయడానికి కట్టినవి. కానీ వారు అవి ఆత్మ రక్షణకి ఏర్పాటు చేసుకున్న బంకర్లు అని తేల్చి చెప్పారు. పాశ్చాత్యులకి ఎప్పుడూ అవే ఆలోచనలు, ఎప్పుడు ఒకరి పై దాడి చేద్దామా అని. మన భారతీయమైన సంప్రదాయం అట్లా ఉండదు, అవసరమైతే ఒకరి సుఖం కోసం మన జీవితాన్ని ఇచ్చేసే మానవ మనస్తత్వం. రాక్షస ప్రవృత్తి కాదు. మన దేశం పై దాడి చేసి పాలించిన మొఘలాయీల విషయం తెలుసుకుంటే అర్థం అవుతుంది. రాజ్యం కొరకు తన సోదరుడిని చంపించడానికి వెనకాడలేదు ఔరంగజేబు.

శ్రీ రామాయణం మానవత్వం అంటే ఎట్లా ఉండాలో అడుగడుగున నిరూపిస్తుంది. ఎవరెవరు ఏమేమి చేసారో అన్నీ పనులలో మానవత్వం పరిమళిస్తుంది. ఈ జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎట్లా పంచాలో కావాలి. అయోధ్యకాండలో తండ్రి రామచంద్రునికి రాజ్యం ఇవ్వాలని అనుకున్నాడు కానీ తల్లి భరతునికి ఇవ్వాలని కోరింది. ఈ విషయం కైకమ్మ రామచంద్రునితో చెబుతుంటే, తండ్రిగారు అంత సంకోచించాల్సింది ఏముంది, ఇది చెప్పడానికి ఇందులో అంత సందేహించాల్సిన అవసరం ఏముంది కనక, రామా అడవికి వెళ్ళు అని ఒక్క మాట చెబితే చాలు, “రాజ్యంవా వనవాసోవా వనవాసో మహోదయః ” నాకు రాజ్యమైతేనేమి వనవాసమైతేనేమి రెండూ తండ్రి గారివే అని సంతోషంతో వనానికి వెళ్తా అని రాముడు చెప్పాడు.

చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు తన వెంట లక్షల మంది సైన్యంతో రాముడిని వెతుకుతూ వస్తున్నాడు. అంత మంది వచ్చేసరికి అడవిలో జంతువులు, పక్షులు చెల్ల చెదురు అవుతున్నాయి. అది గమనించి ఎవరైనా వేటకు వచ్చారా లేక ఏదైన యాత్ర జరుగుతుందా అని రాముడు లక్ష్మణ స్వామిని చెట్టు ఎక్కి చూడమన్నాడు. లక్ష్మణుడు చెట్టు ఎక్కి ద్వజాన్ని చూసి ఇంకేముంది వనవాసం అయ్యాక తిరిగి రాజ్యం ఇవ్వడం ఇష్టంలేక మన పై దాడికి వచ్చాడు భరతుడు, ధనస్సును సిద్దం చేసుకో, సీతమ్మను దాచి పెట్టు అంటూ కేకలు వేసాడు. రాముడు లక్ష్మణుడితో భయం ఎందుకు అని అన్నాడు. ఒక దానిపై అత్యాశ పెంచుకున్నప్పుడు, దాన్ని దూరం చేస్తారేమోనని భయం వేస్తుంది కానీ అసలు ఆశ లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుంది. భరతుని గురించి నాకు తెలుసు, ఒక వేల భరతునికి రాజ్యం కావాలనే ఆశ ఉంది అని నీవు అనుకుంటే ఒక పని చేస్తా, భరతుడు వచ్చాక నాతో పాటు వసవాసానికి భరతుడిని రమ్మంటా, నీవు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. వెంటనే తల దించుకొని నోరు ఎత్తలేదు లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడికి రాజ్యంపై ఆశ కాదు, రాముడిపై ప్రేమాతిశయం. మనం చుట్టూ ఉన్న వారితో ఎట్లా ప్రవర్తించాలో తెలుపుతుంది రామాయణం, అందుకే దాన్ని ఇతిహాస శ్రేష్టం అని అంటారు.

సంపూర్ణ రామాయణం

దశరథనందన శ్రీ రామ నమో అయోధ్యవాసి శ్రీ రామ నమో నీలమేఘశ్యామ శ్రీ రామ నమో జానకినాథా శ్రీ రామ నమో హనుమత్సేవిత శ్రీ రామ నమో వాలీమర్దన శ్రీ రామ నమో కోదండపాణి శ్రీ రామ నమో రావణ సమ్హార శ్రీ రామ నమో కారుణ్య హృదయా శ్రీ రామ నమో భక్త వత్సలా శ్రీ రామ నమో

దాశరథుని ప్రియమైన కుమారుడు, నీలమేఘ శ్యాముడు, సీతా దేవికి భర్త, భక్తుడైన హనుమంతునిచే సేవింపబడు వాడు, వాలిని వధించిన వాడు, చేతిలో కోదండాన్ని ధరించిన వాడు, దశ కంఠుడైన రావణుని సమ్హరించిన వాడు, దయా హృదయం కల వాడు, భక్త వత్సలుదు అయిన శ్రీ రామ చంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను.

రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కష్టసాధ్యమైన పనులు కూడా సుళువుగా చేయగలిగిన సామర్థ్యం వస్తుంది. 

108 నామాల్లో సంపూర్ణ రామాయణం
‘శ్రీ నమ రామయణం’గా ప్రసిద్ధమైన ఈ సంకీర్థనలో కేవలం 108 నామాల్లోని మొత్తం రామాయణం ఇమిడి ఉంది.

బాలకాండ 
1. శుద్ధబ్రహ్మ పరాత్పర రామ 2. కాలత్మక పరమేశ్వర రామ 3. శేషతల్ప సుఖ నిద్రిత రామ 4. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 5. చండకిరణకుల మండన రామ 6. శ్రీ అద్దశరథ నందన రామ 7. కౌసల్య సుఖవర్దన రామ 8. విశ్వామిత్ర ప్రియ ధన రామ 9. ఘోర తాటకా ఘాతక రామ 10. మారీచాది నిపాతక రామ 11. కౌశిక సుఖ సంరక్షక రామ 12. శ్రీ మదహల్యోద్ధారక రామ 13. గౌతమ ముని సంపూజిత రామ 14. సుర మునివర గణ సంస్తుత రామ 15. నావిక ధావిత మృదు పద రామ 16. మిథిలా పురజన మోహక రామ 17. విదేహ మానస రంజక రామ 18. త్ర్యంబక కార్ముక భంజక రామ 19. సీతార్పిత వరమాలిక రామ 20. కృత వైవాహిక కొతుక రామ 21. భార్గవ దర్ప వినాశక రామ 22. శ్రీ మదయోధ్యా పాలక రామ ||శుద్ధ బ్రహ్మ||

అయోధ్యా కాండ
23. అగణిత గుణగణ భూషిత రామ 24. అవనీ తనయా కామిత రామ 25. రాకా చంద్ర సమానన రామ 26. పితృ వాక్యాశ్రిత కనన రామ 27. ప్రియ గమ వినివేదిత పద రామ 28. తత్ క్షాలిత నిజ మృదుపద రామ 29. భరద్వాజ ముఖానందక రామ 30. చిత్ర కూటాద్రి నికేతన రామ 31. దశరథ సంతత చింతిత రామ 32. కైకేయీ తనయార్థిత రామ 33. విరచిత నిజ పితృ కర్మక రామ 34. భరతార్పిత నిజ పాదుక రామ ||శుద్ధ బ్రహ్మ||

అరణ్య కాండ
35. దండక వనజన పావన రామ 36. దుష్ట విరాధ వినాశన రామ 37. శరభంగ సుతీక్ష్ణార్చిత రామ 38. అగస్త్యానుగ్రహ వర్ధిత రామ 39. గృధ్రాధిప సంసేవిత రామ 40. పంచవటీ తట సుస్థిత రామ 41. శూర్పణఖార్తి విధాయక రామ 42. ఖర దూషణ ముఖ సూదక రామ 43. సీతా ప్రియ హరిణానుగ రామ 44. మారీచార్తి కృదాశుగ రామ 45. వినష్ట సీతాన్వేషక రామ 46. గృధ్రాధిప గతి దాయక రామ 47. శబరీ దత్త ఫలాశన రామ 48. కబంధ బాహు చ్ఛేదన రామ

కిష్కింఢా కాండ
49. హనుమత్సేవిత నిజపద రామ 50. నత సుగ్రీవాభిష్టద రామ 51. గర్విత వాలి సమ్హారక రామ 52. వానరదూత ప్రేషక రామ 53. హితకర లక్ష్మణ సమ్యుత రామ

సుందర కాండ
54. కపివర సంతత సంస్మృత రామ 55. తద్గతి విష్ణు ధ్వంసక రామ 56. సీతా ప్రాణాధారక రామ 57. దుష్ట దశానన దుషిత రామ 58. శిష్ట హనూమ ద్భూషిత రామ 59. సీతా వేదిత కాకావన రామ 60. కృత చూడామణి దర్శన రామ 61. లపివర వచనాశ్వాసిత రామ

యుద్ధ కాండ
62. రావణ నిధన ప్రస్థిత రామ 63. వానరసైన్య సమావృత రామ 64. శోషిత సరిదీశార్ధిత రామ 65. విభీషణాభయ దాయక రామ 66. పర్వతసేతు నిబంధక రామ 67. కుంభకర్ణ శిరచ్చేదక రామ 68. రాక్షససంఘ విమర్దక రామ 69. అహి మహి రావణ చారణ రాం 70. సమ్హృత దశముఖ రావణ రామ 71. విధి భవ ముఖ సుర సంస్తుత రామ 72. ఖస్థిత దశరథ వీక్షిత రామ 73. సీతాదర్శన మోదిత రామ 74. అభిషిక్త విభీషణ నత రామ 75. పుష్పక యానారోహణ రామ 76. భరద్వాజాభినిషేవణ రామ 77. భరత ప్రాణ ప్రియకర రామ 78. సాకేత పురీ భూషణ రామ 79. సకల స్వీయ సమానత రామ 80. రత్నలసత్పీఠాస్థిత రామ 81. పట్టాభిషేకాలంకృత రామ 82. పార్థివకుల సమ్మానిత రామ 83. విభీషణార్పిత రంగక రామ 84. కీశకులానుగ్రహకర రామ 85. సకల జీవ సమ్రఖ్సక రామ
86. సమస్త లోకాధారక రామ

ఉత్తర కాండ
87. ఆగత మునిగణ సంస్తుత రామ
88. విశ్రుత దశకంఠోద్భవ రామ
89. సీతాలింగన నిర్వృత రామ
90. నీతి సురక్షిత జనపద రామ
91. విపిన త్యాజిత జనకజ రామ
92. కారిత లవణాసురవధ రామ
93. స్వర్గత శంభుక సంస్తుత రామ
94. స్వతనయ కుశలవ నందిత రామ
95. అశ్వమేధ క్రతు దీక్షిత రామ
96. కాలావేదిత సురపద రామ
97. ఆయోధ్యక జన ముక్తిద రామ
98. విధిముఖ విబుధానందక రామ
99. తేజోమయ నిజరూపక రామ
100. సంసృతి బంధ విమోచక రామ
101. ధర్మస్థాపన తత్పర రామ
102. భక్తిపరాయణ ముక్తిద రామ
103. సర్వచరాచర పాలక రామ
104. సర్వభవామయ వారక రామ
105. వైకుంఠాలయ సంస్థిత రామ
106. నిత్యానంద పదస్థిత రామ
107. రామ రామ జయ రాజా రామ
108. రామ రామ జయ సీతా రామ
“సర్వేజనా సుఖినోభవంతు -లోకా సమస్తా సుఖినోభవంతు”.

రామయణకాలంలో ప్రజల జీవనవిధానం

నేటికీ మనకు రామరాజ్యం ఆదర్శప్రాయం. ఆ కోదండరాముని రాజ్యంలో ప్రజా జీవస్దితిగతులు ఎలా ఉండేవన్నది ఆసస్తికరం.

అవిచ్చిన్నంగా సాగిపోతుండే భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకునేందుకు, భారత రామాయణ గ్రంధాల పఠనం అత్యంతావస్యకం. ఆనాటి భారతీయ సంప్రదాయాలు, రాజకీయ, సాంఘిక పరస్దితులు ఆ గ్రంధాలలో సజీవంగా చిత్రించబడ్డాయి. సాధారణ ప్రజల ఆచార వ్యవహారాలే ఏ సంఘ సంస్కృతినైనా ప్రతిబింబిస్తాయి. ఈ సిద్దాంతాం ఆధారంగా రామాయాణ కాలంనాటి సంఘ పరిస్ధితులను పరిశీలిస్తే, ధర్మానుగుణమైన రాజ్యాంగం ద్వారా నీతి నియమాలతో నియతమైన ఆ కాలంనాటి సాంఘీక వ్యవస్థలో సదాచారాలకు పెద్దపీట అన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే రామాయణ కాలం నాటి కొన్ని ఆచారాలు భారతీయులందరికీ నేటికీ ఆదర్శప్రాయాలు.

ఆ రోజుల్లో అతిది సత్కారానికి అత్యున్నతమైన స్థానం ఉండేది. గృహస్థ నిర్వహించాల్సిన పంచ యజ్ఞాలలో అతిథి సత్కారం కూడా చేర్చబడింది. సత్కరించే వారి శక్తిని, హోదానుబట్టి అవసరమైన మార్పులు జరిగేవి. సర్వ సామాన్య పరిస్థితులలో అర్ఘ్యపాద్యాలు, మధుపర్కం, గోవు, ఆసనం తప్పకుండా సమర్పించేవారు. అతిథులను స్వాగతించిన తరువాత కుశల ప్రశ్నలు ఉండేవి. ఉదాహరణకు తనకు స్వాగతం పలికిన సబరిని రాముడు ఇలా కుశలప్రశ్నలను వేసాడు. ‘తపస్వినీ! అన్ని విఘ్నాలను జయించావు కదూ! తపస్సు వర్దిల్లుతున్నది కదూ! కోపం, ఆహారం చెప్పుచేతల్లోనే ఉన్నట్లే కదూ! నియమాలను నిర్వహిస్తూన్నావు కదూ! మనసుకు సుఖం, శాంతి కలుగుతున్నాయి కదూ. మధురభాషిణీ! నీ గురుశుశ్రూష ఫలించింది కదూ!’

కలుసుకున్నవారు పెద్దవారైతే నమస్కరించడం, సమవయస్కులైతే కౌగలించుకోవడం, చిన్నవారైతే అభినందనలను స్వీకరించడం జరుగుతుండేది. పిల్లలు బయలుదేరేముందుపెద్దల ఆజ్ఞను తీసుకోవడం మరచిపోయేవారు కాదు, తల్లిదండ్రులు, పురోహితులు, పెద్దలు మంత్రపూర్వకంగా పిల్లలను ఆశీర్వదించే వారు. స్నేహితులపై కనబరిచే ఆత్మీయతకు అనుగుణంగా ఒకరితో ఒకరు సెలవు తీసుకునే సమయంలో తిరిగి కనిపిపిచండి, తిరిగి కలవడానికే సెలవు పుచ్చుకుమ్తున్నాం, తిరిగి రావడానికే సెలవు తీసుకొంది అనే మాటలను సంస్కృతంలో చెప్పేవారు సెలవు అనే మాటను అనాగరికంగా, అనుచితంగా భావించేవారు. ప్రజలు రాజులను ఎంత గౌరవంగా చూసుకునేవారో, అంటే గౌరవంగా రాజులు ప్రజలను కూడా చూసుకునేవారు. దశరథ మహారాజు తనకు నమస్కరించిన సభాసదులను చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసేవాడు. రావణుడు సైతం తనపాదాలను స్పృశించిన సభాసదులను సముచితరీటిన ఆదరించాడు. తన సేనాదిపతులను చేతులు జోడించి పలుకరించేవాడు.

రాజభవనంలో రాజుల దర్శనానికి వచ్చేవారేవరైనా సరే, ముందుగా ద్వారపాలకుని ద్వారా విషయం తెలియబరచడం తప్పనిసరిగా ఉండేది. వారు అనుమతించిన తరువాతే దర్శనం లభించేది. తండ్రిగారి అంత:పురంలోకి తండ్రి దర్శనానికై రాముడు కూడ వర్తమానాన్ని పంపుకోవలసి వచ్చింది. అయితే సుమంత్రుని వంటి వయోవృద్ధులకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ఆశ్రమాలలో నివసించే గురువులను దర్శించేందుకు పోయినప్పుడు కూడా వర్తమానం పంపడం ఆచారంగా ఉండేది. అంత:పుర వ్యవహారాలలో పట్టపురాణి ప్రధాన స్థానం వహించేది. ఆకాలంనాటి సంభోధనా పధ్ధతిఎంతో ఆత్మీయంగా ఉండేది.

ఆనాటి వస్త్రాభరణ అలంకారాలుఆనాటి ప్రజల రకరకాల వస్తాలంకరణలతో, ఆభరణ అలంకారాలతో విలసిల్లుతుండేవారు. ఆకాలంలో సైనికులు సైతం చిత్ర విచిత్రమయిన వస్త్రధారణ పట్ల అమితమయిన శ్రద్ధను చూపించేవారు. నగిషీ చేసిన వస్త్రాలను ధరించడం బాగా వాడుకలో ఉండేది. బంగారు జలతారు పట్టు పీతాంబరాలు, రత్నాలు పొదిగిన రత్నాంబ్రాలు, రామాయణంలో వర్ణించబడ్డాయి. నాటి మానవ జీవితంలోనే కాక, భావాలలో, లోకోక్తులలో వస్త్ర ప్రశంస కనుబడుతుంటుంది. కౌశేయాలు, అంటే పట్టువస్త్రములు బాగా వాడుకలో ఉండేవి. అందుకే సీతను ఎన్నో ఘట్టాలలో కౌశేయవాశిని అని పిలువడం జరిగింది.

ప్రత్తినూలుతో, జనపనారతో తయారుచేసిన వస్త్రములను గురించి తక్కువగా ప్రస్తావించబడింది. జనపనారను జనపనారను ంచ జనపనారతో తయారుచేసిన తాళ్ళు పెనువేసుకునేందుకు ఎక్కువగా ఉపయోగించేవారు. లంకలో హనుమంతుని జనుపనారతోనే బంధించారు. అయన తోకకు ప్రత్తినూలు బట్టల పాత పీలికలు చుట్టబడినాయి. సంనబట్టలకు సూక్ష్మవస్త్రములని, విలువగల వస్త్రములకు మహార్హవస్త్రములని, జలతారు, అమ్చుబట్టలకు సంవీత వస్త్రములని పేర్లుండేవి. అలాగే పంచెలను వసనము, అంశుకము, అర అనే పేర్లతో పిలిచేవారు.

తలపాగకు ఉష్ణీషం అని పేరు. విద్యార్థులు దోవాతిని ధరించేవారు. పైపంచెను ధరించేవారు కాదు. మారీచినితో ప్రప్రధమంగా రాముడు పోరాడినపుడు ఏకవస్త్రధరుడే. ఇక, గృహస్తులు పంచేకట్టుకుని, ఉత్తరీయాన్ని కూడా ధరించేవారు. ఇంచుమించు ఈనాటి కండువావంటిది. యుద్ధమో లేక కాయకష్టం చేయాల్సి వచ్చినపుడు, ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకునేవయు. సాధారణంగా స్త్రీలు పట్టుచీరలనే కట్టుకునేవారు. పురుషుల్లా ఉత్తరీయం వేసుకున్నపటికీ, ఆ వేసుకోవడం వేరుగా ఉండేది. రంగువస్త్రములను విరివిగా ధరించేవారు. అప్పుడు కుట్టు వస్త్రములు లేకపోయినప్పటికీ,కుట్టుపని తెలిసి ఉండకపోలేదు. రామాయణంలో సూదికి ‘సూచీ’ అనే పదం, దర్జీకి ‘తున్నవాయ’ అనే పదం ప్రయోగించబడింది. రాజసేవకులు ధరించిన కంచుకాలు ఇంచుమించు పోడుగుకోట్ల వంటివే.

ఆరోజుల్లో కళాశక్తిసంగీతం ఆ నాటి ప్రజలజీవితాలలో అవిభాజ్యమైన ఒక అంశంగా ఉంది. అందరూ సంగీతాన్ని ఆదరించేవారు. పట్టణాలలో రథాల గరగర ధ్వనితోపాటు, సంగీతవాయిద్యాల శ్రావ్యసంగీతం వినిపిస్తుంది. రాజులజీవితాలు సంగీత మాధుర్యంలో మునకలు వేసేవి. దశరధుడు, రాముడు, భరతుడ, రావణుడు సూర్యోదయం కాగానే వాద్యాల మధురధ్వనులు, వందిమాగధుల స్తుతులతో మేలుకోలుపబడేవారు. రావణుడు తర దర్బారుకు సహస్త్ర శంఖ, కాహాళ, తూర్య ధ్వనులతో వచ్చేవాడు. వనవాసం నుంచి రాముడు అయోధ్యకు వేంచేసినపుడు గాయకులూ శంఖాలు,దుందుభి నాదాలతో స్వాగతం పలికారు.

ప్రాచీనకాలంలో యుద్దసమయాలలో కూడా సంగీతం ఉండేది. యద్ద సంగీతాన్ని ‘యుద్ధగాంధర్వం’ అని పిలిచేవారు. ఇక యుద్ధాలు లేనప్పుడు సేనలు వాద్య సంగీతంలో తలమునకలయ్యేవి. సైనికులకి భేరినాదం యుద్ధ ఆహ్వా సూచకంగా పరిగణింపబడేది. ఆనాటి వాద్యాలలో వీణ అత్యధిక ప్రాచుర్యాన్ని పొందింది. సంగీతంతో పాటు నృత్యం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. రాముని వివాహమహోత్సవంలో అప్సరసలు నృత్యం చేయగా, గంధర్వులు మధురగీతాలను ఆలపించేవారు.

ఆయన జన్మదినం, రాజ్యాభిషేక సమయాలలో కూడా ఇలాంటి ఏర్పాట్లే జరిగాయి. పట్టణాలలో ఉద్యానవనాలు నిర్మించబడేవి. స్త్రీపురుషులు క్రీడావినోదార్ధం ఉద్యాన వనాలకు వెళ్ళేవారు. ఇక లంకలో అశోకవనం రావణునికి ప్రీతిపాత్రమైనది. ఆవనాన్ని చూసినపుడు ఇంద్రియ నిగ్రహంగల ఆంజనేయుడు కూడా ముగ్ధుడయ్యాడు. అంత:పురాలతో పాటు రాణులు విశ్రాంతి వినోదాల నిమిత్తం ఉద్యానవనాలను నిర్మించేవారు. అవి ప్రమాద వనాలని పిలువబడేవి. ఊరికి దూరంగా క్రీడాస్థలాలు నిర్మింపబడేవి.

విద్యావికాసంసంఘంలో నిరర్క్షరాస్యతను దూరం చేసి మంచి నాగరికతను పెంపొందించడానికి ప్రాచీనకాలపు విద్య యొక్క ముఖ్యోద్దేశం. విద్యార్థులు పరిశుభ్రత, వినమ్రత, విధేయత, సత్ర్పవర్తన తదితర గుణాలపై విద్య మళ్లించేది. భారతీయ సంస్కృతికి మూలభూత సిద్ధాంతమైన మతము, నీటి ఆనాటి విద్యలలో ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండేవి. నాటి విద్యావ్యవస్థలో వేదవేదాంగాములు, కర్మకాండల పరిజ్ఞానం అని వార్యంగా ఉండేది.

రామయణకాలంలోని ప్రారంభ శ్లోకాలలో వాల్మీకి నారదునితో తన కావ్యనాయకుడు శరీరం, మనస్సు, ఆత్మలలో పరిష్కృత గుణాలను కలిగినవాడై ఉండాలని విన్నవించాడు. వాల్మీకి దృష్టిలో ఆదర్శపురుషుడు – గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, పరోపకారి, సత్యభాషి, ద్రుడప్రతిజ్ఞగలవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, క్రోధాన్ని జయించువాడు, భూతదయగాలవాడు, యుద్ధంలో అజేయుడై ఉండాలి. నారదుని దృష్టిలో రాముడే పై గుణాలను కలిగినవాడు. ఆ యుగంలో రాముడు సర్వోత్తమమైన విద్యలను పొందిన రాజకుమారుడు. అయినప్పటికి అన్యులను తక్కువగా భావించేవాడు కాదు. పౌరకార్యాలను నిర్వర్తిస్తూ ప్రజల సుఖదు:ఖాలలో పాలుపంచుకునేవాడు. ఆనాటి విద్యావంతలు తమ సాంఘిక కర్తవ్యాలను పాటించేందుకు ఋణానిత్రీణి అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. దీనినిబట్టి ఈలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేవఋణం, ఋషి ఋణం , పితృఋణం అనే మూడు ఋణాలను తీర్చుకోవలసి ఉంది. యజ్ఞాల అనుష్టానం, శాస్త్ర అధ్యయనం, సంతానోత్పత్తి ద్వారా మనిషి ఈ ఋణాలనుంచి విముక్తుడవుతున్నాడు.

ఒక యుగంలోని వాజ్మయం ఆనాటి సంఘానికి అద్దం వంటిది. ఆనాటి వాజ్మయానికి చరమ నిదర్శనం వాల్మీకి రామాయణమే. వాజ్మయంలో జీవిత విశ్లేషణ, జీవితపు గొప్పదనం, జీవితపు అభివ్యక్తీకరణం ప్రతి పాదింపబడిన శ్రేష్టకావ్యం రామాయణం. వాజ్మయంలో ఒక కొత్తకోలబద్దను, నూతన ఆదర్శాలను నెలకొల్పినందు వల్లనే రామాయణం ఆదర్శ కావ్యమైంది. వేదాలలోని పురాతనవాదం, బ్రాహ్మణాలలోని రహస్యవాదం, ఉపనిషత్తులలోని అద్యాత్మవాదం, సూత్రాలలోని సంక్షేపవాదం తరువాత ప్రజలు రామాయణానికి స్వాగతం పలికారు. సరళమైన కతాప్రవాహం, భావాల మార్మిక ప్రకటీకరణం, సంగీత నాద సౌందర్యం – ఈ మూడింటి మనోహరమైన సమ్మేళనమే రామాయణ కావ్యం. రాముని జీవితాన్ని గురించి వాల్మీకి రచించిన రసమధుర మహాకావ్యం రామాయణం. ధర్మానుయాయులగు హిందూజాతి అస్తిత్వం ఒక ప్రత్యెక విలువగా ఉన్నంతకాలం రామాయణం ఎల్లప్పూడు భారతీయుల సభ్యత, గోప్పదన్నాన్ని, దాని సౌరభాన్ని నలుదిక్కులా విరజిమ్ముతుంది. ఆమధ్య, దేశంలో ఆధ్యాత్మిక విషయాశక్తి తగ్గడంలో రామకథకు మూలమయిన రామాయణ పఠనం తగ్గి, నాటి ఉదాత్త విషయాలు మరుగునపడిపోయాయి. అయితే, ప్రస్తుత యువతకు మన సాంస్కృతిక వారసత్వం పట్ల ఆసక్తి పెరుగుతుండటం ముదావహం. యువతకు మన పురాణాల పట్ల అనురక్తి కలుగుతుండటం ఒక శుభ పరిణామం. అది భవిష్యతరాలకు మన పెట్టుబడి వంటిదనేచెప్పాల్సి ఉంటుంది.

వాల్మీకి రామాయణానికీ – వ్యవహార రామాయణానికీ గల తేడాలు

నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుందామనే ఈ పయత్నం.
  • దశరథ మాహారాజుకు మొత్తం 353 భార్యలు.
  • దశరథుడికి కైకంటే చాలా ఇష్టం. పట్టమహిషైన శ్రీరాముని తల్లి కౌసల్య కంటే కైకంటేనే ఆయనకు ప్రీతి. కౌసల్య పట్ల ఆయనకు ఉదాసీన భావం ఉండేది. రాణివాసంలో కైక మాటలకే ప్రాధాన్యత.
  • .
  • దశరథ మహారాజు అశ్వమేధయాగం నిర్వర్తించి తరువాత పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు. ఆ సమయంలో రావణుడు మరొక యజ్ఞదీక్షలో ఉంటాడు. అందుకే దశరథుని యాగాశ్వాన్ని పట్టుకోకుండా వదిలేస్తాడు.
  • తన వంశంలో పుట్టినవాడి చేతిలో మరణం తప్పదని ఇక్ష్వాకు వంశీయుడైన అనరణ్యుడు రావణున్ని శపిస్తాడు. రాముడు అదే వంశంలో పుడతాడు.
  • రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురిని పన్నెండు నెలలు(మాములుగా అయితే పది నెలలు) మోసి కంటారు కౌసల్య, కైకేయి, సుమిత్ర.
  • బలపరాక్రమాలలో లక్ష్మణుడు రాముని తరువాతివాడు. భరతుడు వయసులో పెద్దవాడైన భుజబలంలో మాత్రం శతృఘ్నుడుకి సముడు.
  • క్షీరసాగరమథనంలో ధన్వంతరి తరువాత ఉద్భవించిన వారు 60కోట్ల మంది అప్సరసలు. వీరిని ఎవ్వరూ వివాహమాడరు. సంచార వృత్తి కలిగి వుంటారు. వీరి తర్వాత పుట్టినవి వారుణి(మద్యం), కౌస్తుభం.
  • అహల్య వృత్తాంతం భిన్నంగా ఉంది. అహల్య అంటే ఎటువంటి వంకరలేని అందమైన స్త్రీ. ఆమె భర్త గౌతమ మహర్షి. ఆయన ఇంద్రపదవికి కావల్సిన సర్వవిజ్ఞానం పొందాక, ఆయన్ని పరీక్షించడానికి, నిజంగా కామక్రోధమదమాత్సర్యాలను జయించాడా అని కనుక్కోవడానికి ఇంద్రుడొక పథకం వేస్తాడు. ఆ ప్రకారం గౌతమునిలా వేషం ధరించి అహల్య చెంతకు వస్తాడు. అయితే తన పాతివ్రత్య బలంతో వచ్చినది ఇంద్రుడని గ్రహిస్తుంది అహల్య. ఇంద్రుడు ఆశ్చర్యపోయి ఆమెతో కలవాలన్న తన కోర్కె తెలియజేస్తాడు. ఇక్కడ కలవటం అంటే మోక్షమివ్వటం అని అర్థం. శారీరక కలయిక కాదు. మోక్షమన్న మాట వినగానే క్షణకాలం పాటు ఆలోచిస్తుంది అహల్య. ఆమె మనస్సును క్షణకాలం చంచలం చెయ్యగలిగానే అనుకుని దేవేంద్రుడు నవ్వుతాడు. అహల్యకు అప్పుడు సత్యం బోధపడి ‘నువ్వు వెళ్ళిపో’ అని వేడుకుంటుంది. ఈ లోగా గౌతముడు అక్కడి వచ్చి పొరబడి, అవేశంతో ఇద్దరినీ శపిస్తాడు. ఆ విధంగా ఆయనకు ఇంద్రపదవి దూరమవుతుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఎవరికీ కనబడకుండా కేవలం గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వెయ్యి సంవత్సరాలు బ్రతకాలని గౌతముడు ఆమెను శపిస్తాడు. అంతేకానీ రాయివి కమ్మని శాపం ఇవ్వడు. అలాగే ఇంద్రుడున్ని వృషణహీనుడవుతావని శపిస్తాడు.
  • శివధనుర్భంగం చేసి రాముడు సీతను వివాహమాడినప్పుడు మిగతా రాజకుమారులెవ్వరు అక్కడ లేరు. సీత కూడా విజయమాలతో నిల్చొని సిగ్గుపడుతూ సిద్ధంగా లేదు. సీతా స్వయంవరం అంతకు ముందే చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఎంతోమంది ప్రయత్నించి విఫలులయ్యారు. ఇంకొంత మంది యుద్ధానికి వస్తే వారిని జనకుడు ఓడించి పంపాడు. అలా కొంతకాలం గడిచాక విశ్వామిత్ర సహితులై రామ లక్ష్మణులు మిథిలా నగరం వస్తారు. రాముడు ధనువునెక్కు పెట్టి విరిచేస్తాడు.
  • రావణుడు సీతాస్వయంవరానికి రాలేదు. శివధనువును ఎక్కుపెట్టటం అపచారమనే భావంతో అతను మిన్నకుండిపోయాడని తెలుస్తోంది. తన తరువాత మరెవ్వరూ ఆ ధనువును ఎక్కపెట్టరాదనే శ్రీరాముడు దాన్ని విరిచేస్తాడు.
  • వివాహమయ్యేనాటికి రాముని వయస్సు పన్నెండేళ్ళు. సీత వయసు ఐదేళ్ళు.
  • పరశురామ గర్వభంగం సీతారాములు అయోధ్యకు వెళ్తూండగా మార్గమధ్యంలో జరుగుతుంది. జనకుడి రాజమందిరంలో కాదు.
  • శ్రీరామున్ని వనవాసం చెయ్యమన్నందుకు ఆగ్రహించి లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ కైకను వధించటానికి కత్తి దూయరు. లక్ష్మణుడు ఆమె పరోక్షంలో ఆమెను, తండ్రిని నానామాటలంటాడు. భరతుడు తల్లిని మందలిస్తాడు. శతృఘ్నుడు మాత్రం మంధరను పాదతాడనం చేసి, భరతుడు వారిస్తే విడిచిపెడతాడు.
  • వనవాసానికి వెళ్ళేనాటికి సీతారాముల వయస్సు 18,25.
  • దశరథుడు మరణించాక ఆయన దేహాన్ని పన్నెండురోజుల పాటూ తైలద్రోణంలో నిల్వ చేస్తారు. అంత్యక్రియలు చెయ్యడానికి కుమారులెవ్వరు అందుబాటులో లేకపోవటంతో భరత శతృఘ్నులు అయోధ్య వచ్చేవరకు శవం కుళ్ళి పోకుండా ఈ ఏర్పాట్లు చేస్తారు.
  • నాస్తికవాదం రామాయణ కాలంలో కూడా ఉంది. రామున్ని అయోధ్యకు రప్పించటానికి భరతుడు సకల పరివారంతో వెళ్ళినప్పుడు జాబాలి అనే దశరథుని మంత్రి ‘ఎవరు తండ్రి, ఎవరు తల్లి’ అంటూ నాస్తికవాదం చేస్తాడు. దీన్ని శ్రీరాముడు నిరసించి,’మీ వంటి వారిని నా తండ్రి ఎలా కొలువులో పెట్టుకున్నారో’ అంటాడు.
  • ముక్కు చెవులు కోయబడ్డ శూర్పణఖ తన గోడు సోదరులైన ఖరదూషణాదులకు విన్నవించుకుంటుంది. ఆగ్రహంతో ససైన్యంగా వచ్చిన వారిని శ్రీరాముడు యమపురికి పంపిస్తాడు. అకంపనుడనే దూత ఈ సంగతంతా రావణుడికి చెప్పి, సీతాదేవి సౌందర్యం గురుంచి వివరించి, రామున్ని నిలువరించాలంటే సీతను అపహరించాలని ఉపాయం ఇస్తాడు. వాడి మాటలు విని రావణుడు వెళ్ళి మారీచున్ని కలుస్తాడు. మారీచుడు అతనికి హితబోధ చేసి పంపించేస్తాడు. శూర్పణఖ లంక వెళ్ళి రావణున్ని రెచ్చగొడుతుంది.
  • జన బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న లక్ష్మణరేఖ గురుంచి వాల్మీకి రామాయణంలో లేదు. లక్ష్మణుడు అటువంటి రేఖ ఏదీ గీయడు
  • రావణుడు ఎడమ చేత్తో సీత జుట్టుపట్టుకొని, కుడి చేత్తో ఆమెను ఎత్తుకొని పిశాచాల్లాంటి గాడిదలు పూంచిన రథంలో ఆమెను కూర్చోబెట్టి లంకకు తీసుకుపోతాడు.
  • రావణుడితో తలపడక ముందే జటాయువు సీతారామలక్ష్మణులకు పరిచయం అవుతాడు. వారు పంచవటికి విచ్చేసినప్పుడు జాటయువు తనను తాను పరిచయం చేసుకుంటాడు.
  • వాలి మహాబలవంతుడు. తనతో యుద్ధానికి సిద్ధపడిన రావణున్ని సైతం ఓడించి పంపిన పరాక్రమశాలి. అతనితో ఎవరు ముఖాముఖి తలపడినా వారి బలంలో సగం వాలికి చెందేటట్లు వరం ఉంది. చెట్టు చాటు నుంచి వాలిని వధించటానికి గల కారణాల్లో ఇదొకటి.
  • కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవి(అవతార్ గుర్తొచ్చిందా). అవి ఎక్కడబడితే అక్కడ వాలి విశ్రాంతి తీసుకున్నప్పుడు అపార ప్రాణనష్టం జరుగుతూండటంతో ఇంద్రుడు వాటి రెక్కలు కత్తరించివేస్తాడు.
  • అశోకవనంలో అన్నపానీయాలు ముట్టని సీతాదేవికి రహస్యంగా అమృతం యిస్తూ రక్షిస్తాడు ఇంద్రుడు.
  • రావణుడు మారువేషంలో వచ్చి రాముడికి యుద్ధ ముహూర్తం నిర్ణయించడు. శ్రీరాముడే యుద్ధముహూర్తం నిర్ణయించి లంకకు బయలుదేరుతాడు.
  • యుద్ధారంభానికి ముందే కుంభకర్ణుడు నిండుసభకు వచ్చి రావణుడికి హితబోధ చేస్తాడు.
  • రావణుడి ఉదరంలో అమృతభాండం ఉన్నట్లు, విభీషణుడి సలహాతోనో మరొకరి సలహాతోనో దాన్ని పగలగొట్టి, రావణున్ని సంహరించినట్లు ఇందులో లేదు. అగస్త్య మహర్షి సలహా మేరకు శ్రీరాముడు, సూర్యున్ని ధ్యానించి బాణ ప్రయోగం చేసి రావణుడి గుండె చీలుస్తాడు.

వాల్మీకి ఉత్తరకాండకు, లవకుశ సినిమాకు గల తేడాలు .
వాల్మీకి ఉత్తరకాండకు, మన ఎంటీవోడి లవకుశ సినిమాకు చాలా తేడాలున్నాయి. వాటితో పాటూ రావణుడి గురుంచి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ పొందుపరిచాను.
  • శూర్పణఖ విభీషణుడికి అక్క.
  • రావణ,కుంభకర్ణ,శూర్పణఖా,విభీషణులు కన్యాపుత్రులు.
  • మయుని కూతురు మండోదరి. ఆయన కోరిక మేరకే రావణుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మామా అల్లుళ్ళకు యుద్ధం జరగదు( ‘భూకైలాస్’ గుర్తొచ్చిందా).
  • రావణుడు అంటే కైలాసాన్ని ఎత్తలేక బాధతో రావాలు చేసినవాడని(అరచినవాడని) అర్థం. అతని అసలు నామధేయం దశకంఠుడు.
  • సీతాదేవి రావణుడి ఇంటి దగ్గర పుట్టదు. ఆమె మొదట దొరికేది జనక మహారాజుకే.
  • శూర్పణఖ భర్తను రావణుడే చంపేస్తాడు. అయితే అది అనుకోకుండా జరుగుతుంది.
  • యమధర్మరాజుకి రావణుడికి యుద్ధం జరుగుతుంది. యముడు ఆగ్రహించి యమదండం విసరబోతాడు. యమదండానికి ఎటువంటివారినైనా సంహరించే శక్తి ఉంది. అలాగే రావణుడికి మానవుల చేతిలో తప్ప అన్యుల చేతిలో చావు లేదు. బ్రహ్మ కలుగచేసుకొని యమున్ని వారించి, అతని చేత యుద్ధాన్ని విరమింపచేసి తను ఇచ్చిన రెండు వరాలలో ఏదీ నిష్ఫలమవకుండా చూస్తాడు.
  • ఒక్క చాకలే కాదు అయోధ్యా ప్రజలందరూ ‘రావణుడి చెరలో ఎంతోకాలం గడిపిన సీతను రాముడు తెచ్చి ఏలుకున్నాడ ‘ని కారుకూతలు కూస్తారు.
  • కుశలవులు (కుశుడు పెద్దవాడు) జన్మించినప్పుడు శతృఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలోనే ఉంటాడు. సీతాదేవిని పరామర్శిస్తాడు కూడా. లవణాసురున్ని అంతమొందించటానికి వెళ్తూ వాల్మీకి ఆశ్రమంలో ఆగుతాడు.
  • రాముడు అశ్వమేధయాగం తలపెట్టినది నైమిశారణ్యంలో అయోధ్యలో కాదు.
  • కుశలవులకు రాముడికి/రామసైన్యానికి మధ్య ఎటువంటి యుద్ధం జరుగదు. వారిద్దరూ యాగాశ్వాన్ని పట్టి బంధించటం అన్నది కూడా జరుగదు. అశ్వమేధయాగం సంధర్భంగా విచ్చేసిన కుశలవులు రామకథ రమ్యంగా గానం చేస్తుంటే, రాముడికి అనుమానం వచ్చి,’మీ తల్లిని వెంటబెట్టుకొని రండి ‘ అంటాడు. మరుసటి రోజు వాల్మీకి సీతా, కుశలవులతో వచ్చి సీత పాతివ్రత్యాన్ని శ్లాఘిస్తాడు. యాగానికి హాజరైన జనులందరి ముందూ తన పాతివ్రత్యాన్ని మళ్ళీ నిరూపించుకోవాలని శ్రీరాముడు సీతను కోరుతాడు. ఆ తరువాత జరిగేది మీకు తెలిసిందే.
  • సీత పృథ్విలో ఐక్యమైన తరువాత కూడా రాముడు చాలాకాలం రాజ్యం చేస్తాడు. పదివేల అశ్వమేధ యాగాలు పూర్తి చేస్తాడు.

రామాయణం - 2


ముని రక్షణ కోసం రాముని ప్రతిజ్ఞ

భరతుడు రాముడి వద్దకి వచ్చి పాదుకలని తీసుకొని రాజ్యానికి వెళ్ళాక, ఈ ప్రాంతం రాముడు ఉన్నాడని అందరికి తెలిసిపోయింది పైగా అయోధ్యకి అది దగ్గరగా ఉంది, ఎదో ఒక పనితో ప్రజలు వస్తూ పోతూ ఉంటారని రాముడు క్రమంగా దండకారణ్యం లోనికి వెళ్ళిపోతారు. అక్కడి నుండి నుండి రాముడు హనుమ సుగ్రీవులని కలిసేంతవరకు అది అరణ్యకాండ. అప్పుడు ఆయన ఎంతమందో ఋషులని ఆశ్రయించాడు, ఒక్కో ఋషికి ఆశ్రమం ఉండేది.
రాముడు ఒక మనిషిగా మంచిగా బ్రతకటం ఎలానో చూపడానికి తాను ఎన్నో ఆచరించి చూపాడు. మహనీయులని దర్శించాలి అని మనకు చెప్పేందుకు, రాముడు తాను అడవికి వెళ్ళినప్పుడు ఋషులని దర్శించడం తన కర్తవ్యం అని అనుకొని వెళ్ళేవాడు. రాముడు అరణ్యంలో మొదట శరభంగుడు అనే ఋషిని దర్శించాడు. శరభంగుని వైభవం ఎంత గొప్పదంటే, రామచంద్రుడు ఆయన ఆశ్రమాన్ని దర్శించే ముందు పై నుండి రథంలో ఇంద్రుడు వచ్చి సంప్రదించాడు. అట్లా తను శరభంగుడు అనే ఋషి వద్దకి వెళ్ళాడు. ఆ ఋషి మృత్యువుని కూడా తన చేతిలో పెట్టుకున్న మహనీయుడు. ఆయన ఉన్నంతకాలం ఆయన ఆశ్రమాన్ని ఏ రాక్షసుడూ ఏమి చేసేవాడు కాదట. కానీ తన తర్వాత ఆశ్రమాన్ని ఎట్లా కాపాడు కోవడం అని చింతించేవాడట. శాపం పెట్టి రాక్షసులను చంపేవారు కాదు ఎందుకంటే తపస్ శక్తి అనేది అతి విలువైనది. మామూలుగా పెద్దల వద్దకి వెళ్ళేప్పుడు వట్టి చేతులతో పోకూడదు అనేది నియమం. వారికి అవసరమైనదేదో ఇవ్వాలి. మామూలుగా ఋషుల వద్దకి వెళ్ళితే సమిదలు తీసుకు వెళ్ళేవారు, కానీ ఆ ఋషికి ఏమి ఇస్తే ఆనందపడుతాడు అని ఆలోచించి, వారికి కష్టం కల్గించే విరాధుడిని సంహరించి ఆ వార్తను శరభంగుడికి అర్పించాడు. అందుకు శరభంగుడు తాను ఆర్జించుకున్న పుణ్యాలని రాముడికి ఇచ్చి తన దేహాన్ని పరిత్యజించి, ఊర్థ్వలోకాని వెళ్ళాడు.  అట్లా ఇందులో ఎన్నో విషయాలు శ్రీరాముడు చూపించాడు, పెద్దలను దర్శించుకోవాలి, అట్లా వారిని దర్శించేందుకు వెళ్తే ఎదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, ఆ తీసుకుపోయేది ఏదో ఒకటి కాక వారు ఇష్టపడేది తీసుకు వెళ్ళాలి, అంతేకాక తాను అడవికి వచ్చినదే రాక్షస నిర్మూలన కనుక తన ధర్మాన్ని పాఠించాడు. అట్లా సామాన్య ధర్మం, రాజ ధర్మం, వైధిక ధర్మం అన్నీ పాటించి చూపాడు రాముడు. ఆతరువాత సుతీక్షణుడిని దర్శించాడు. ఆపై అగస్త్యుడిని దర్శించాడు. రామునికి కావల్సిన ధనస్సుని, భాణాలని అగస్త్యుడే ఇచ్చాడు. తరువాత యుద్దంలో రాముడు అలసిపోతే విజయం కలగడానికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. అగస్త్యుడిని దర్శించాక క్రమంగా పంచవటి వచ్చాడు. ఆ మధ్యలో ఒక్కో ఋషి ఆశ్రమాలలో రెండు రోజులు గడిపేవాడు, అట్లా సుమారు పది సంవత్సరాలు గడిచాయి. అట్లా వారు పంచవటికి చేరుకున్నారు. 
అక్కడ కుటీరం వేసుకున్నారు. అక్కడ ఒక గ్రద్ద కనిపించింది. ఆ గద్ద పేరు జటాయువు, దశరథుని మిత్రుడు అని తెలిసింది. రామునికి ఒక వాగ్దానాన్ని చేసింది. ఇక్కడ మీరు హాయిగా సంచరించండి. ఎప్పుడైనా మీరిద్దరూ వనంలోకి వెళ్ళాల్సి వస్తే నేను సీతమ్మకు కాపలా ఉంటాను అని చెప్పింది. లక్ష్మణుడు మంచి కుటీరం నిర్మించాడు. రామచంద్రుడు కుటీరంలో ప్రవేశిస్తుంటే ఋషులంతా అక్కడికి వచ్చారు. ఎందరో ఋషులు ఉండేవారు దండకారణ్యంలో, వారితో పాటు రాక్షసులు ఎందరో ఉండేవారు. మేం నీ రాజ్యంలో ఉన్నాం, తమని రాక్షసుల భారి నుండి కాపాడాలి అని కోరారు. ఆయన సిగ్గుపడ్డాడు, ఆయన వచ్చిందే ఋషుల రక్షణకి అని, రక్షణ చేయటంలో జరిగిన కాల విలంబనకి క్షమాపన కోరాడు. అప్పుడు సీతమ్మ రాముడిని ఒక పరిక్ష పెట్టి చూస్తుంది. ఇంతకాలం మనం బాగానే ఉన్నాం, మన వద్దకి రాక్షసులు రాలేదు, ఇంత మంది ఋషులకి వాగ్దానం చేస్తున్నావు, మనం లేని పోని ఆపదలను తెచ్చుకుంటున్నామేమో అని, మన చుట్టూ ఉన్న వస్తువుల ప్రభావం మనపై పడుతుంది అనేది రామునికి చెప్పాలని ఆమె ఒక కథ చెబుతుంది. అనగనగా ఒక మహానుహావుడు తపస్సు చేసుకొని బాగుపడాలని అడవికి వెళ్ళాడు. ఎవరైనా తపస్సు చేస్తున్నారంటే ఇంద్రునికి భయం. ఏదో ఒకలా తపస్సుని భంగం చేయాలని తను ఒక ఉపాయం చేసాడు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఒక సిపాయి వేశం వేసుకొని కత్తిని ఆయన పక్కన పెట్టి దీన్ని కాపాడండి నేను రేపు వచ్చి తీసుకుంటా, నన్ను శత్రువులు తరుముతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. తపస్సు ముగించి లేచి చూసాక ఆయనకు కొంత కొంత జ్ఞప్తికి వచ్చింది, ఎవరో అరువుగా పెట్టి వెళ్ళారని. ఆరోజునుండి ఆకత్తిని ప్రక్కనే పెట్టుకొని తపస్సు చేసుకొనే వాడు. ఉందో లేదో అని మధ్య మధ్యలో చేయితో తాకి చూసుకునే వాడు. అలాచేస్తే తన తపస్సు భంగం అవుతుందని భావించి దాన్ని తన ఒడిలో పెట్టుకొనే వాడు. ఇటూ అటు వెళ్ళినప్పుడు తన వెంట తీసుకొని వెళ్ళేవాడు. అది పాడు అయిపోతుందేమోనని, దాన్ని మధ్య మధ్య వాడుతూ ఉండాలి అని దర్బలు, సమిదలు కోయడానికి వాడేవాడు. అది ఎప్పుడూ చేతులో ఉండటంతో, ఇదివరకు అక్కడ ఉన్న జంతువులు ఆయనని ఏమని అనేవి కావు, చేతిలో ఏదో ఉన్నది చూసి, ఏమైనా చేస్తాడేమోనని ఎదురు తిరిగేవి, ఒక్క సారి కత్తితో అదురుతూ చివరికి జీవహింస కూడా చేయడం మొదలు పెట్టాడు. తపస్సు అంతా పోయి హింసాప్రవృత్తి ఏర్పడిపోయింది. కత్తి తామసిక వస్తువు దాని ప్రభావం మనపై ఉంటుంది. అందుకే సాత్విక వస్తువులు, సాత్విక వాతావరణం, సాత్వికంగా ఉన్న మూర్తిని ఆరాధన మనం ఏర్పరుచుకోవాలి. రామా! మనం ముని వృత్తి గడపడానికి వచ్చాం, మనకు ఈ భాణాలు ఎందుకు అని అడిగింది. ఇది తగునా అని అడిగింది సీతమ్మ. రామచంద్రుడు ఆమాట విన్నాక రాముడు ఒక ప్రతిజ్ఞచేసాడు. అసలు మనం వచ్చింది అసలు కార్యం రక్షణ చేయడానికి, ముని వృత్తి ఒక చిన్న భాగం. ఋషి రక్షణకి ఆటంకం ఏర్పడితే అసలు నేను నా ప్రాణాలనైనా వదిలేస్తా, నా ప్రాణాల కన్నా ఎక్కువైన నిన్ను వదిలేయడానికి వెనుకాడను. చివరికి లక్ష్మణుడినైనా  వదిలేయడానికి వెనుకాడను. సీతమ్మకు చాల సంతోషపడింది, ఆయన ప్రతిజ్ఞని స్థిరపరచటానికి ఆమే చేసిన పరిక్ష.

రాముని శాంత స్వభావానికి పరిక్ష
కైకమ్మ వరం కోరేప్పుడు నేరుగా దండకారణ్యానికి రాముడు వెళ్ళాలని కోరింది. అసలు ఇక్కడికి వస్తే తప్ప ఋషుల భాదలు తెలియవు, రాక్షస నిర్మూలన జరగాలంటే అక్కడి రాక తప్పదు. అసలు కైకమ్మ కోరిన వరం వల్లే రామచంద్రుడు గొప్పవాడు కాగలిగాడు. అందుకే రామునికి కైకమ్మ అంటే అంత ప్రేమ. ఒక సారి రాముడు చల్లని నీటిలో స్నానం చేస్తూ పాపం భరతుడు సుకుమారంగా పెరిగినవాడు, నిష్కారణంగా ఆయన పై వచ్చిన నిందలవల్ల మనలాగే నారబట్టలు ధరించి, కందమూలాలు తింటూ ఎంత కష్టపడుతున్నాడు చూడు అని లక్ష్మణుడితో అన్నాడు. భరతుడు అర్థరాత్రి సరయూ నదికి వెళ్ళి స్నానం చేసేవాడట. అందరు ఉండే సమయంలో వెళ్తే ఇదిగో ఈయనే రాముడిని వనానికి పంపినది అని తనను అంటారని కాదు, అనవసరంగా వారు తమ మనసుని భాద పెట్టుకుంటారేమోనని. అంత సున్నిత హృదయం కలవాడు భరతుడు. రాముని ఎడబాటుని తట్టుకోలేక, తాపం తొలగించుకోవడానికి చల్లటి నీరు ఉండే సమయం అర్థరాత్రి, ఆసమయం చూసి వెళ్ళేవాడు. లక్ష్మణుడు రామునితో అసలు భరతుడు, మనం ఇలా కష్టపడి బ్రతకడానికి కారణం కైకమ్మే కదా కారణం అని కోపంతో లేచాడు. వెంటనే రాముడు కోపడ్డాడు.

ఆమె కనక వనానికి పంపకుంటే ఋషులని సేవించుకొనే అవకాశమే లేకుండేది. దశరథుడు చేయకుండా వదిలిన పనులు తనకు చేసే అవకాశం ఇచ్చింది ఆవిడే కదా. అసలు దశరథ మహారాజు యొక్క రాజ్యం భూమండలం అంతా ఉండాల్సినది, రాక్షసుల పాలై చిన్నదై పోయింది. పేరుకే ఆయన చక్రవర్తి. కొంత భాగం వాలి, కొంత భాగం కరధూషణాదులు, ఒకవైపు రావణుడు పాలిస్తున్నాడు. రాముడు వనానికి వచ్చాకే తిరిగి రాజ్యం పూర్తిగా చేతికి వచ్చింది. అట్లా చూస్తే అసలు కైకమ్మ ఆయన రాజ్యన్ని పెంచింది కానీ ఆయనకు రాజ్యం లేకుండా చేయలేదు. ఆమెను ఆనాడు ఎంత మంది తిట్టారో, మంత్రులు, ప్రజలు ఎంతమంది ఏమి అనుకున్నా ఆమె చెదరకుండా ఉండ గలిగింది. సీతమ్మను కూడా నార చీరలు ధరించాల్సిందే అని కచ్చితంగా చెప్పింది, వశిష్టులవారు నచ్చజెప్పి సీతమ్మను శాసించే అధికారం నీకు లేదు అని చెప్పాడు కనక సీతమ్మ పట్టు వస్త్రాలతోనే వనవాసం చేసింది. దశరథుడు రాముని వెంట సైన్యాన్ని పంపుతా అని శాసనం చేస్తే, నాకొడుకు ఏం పాలించడానికి ఏమి మిగిలింది, సైన్యాన్ని పంపడానికి వీలు లేదు అని అడ్డు చెప్పింది. కొంత కూడా మొహమాట పడలేదు. ఆమె అంత గట్టిగా నిలిచింది కనకనే చక్రవర్తి అని పేరు రామునికి సార్తకం అయ్యింది. అంత ఉపకార స్మృతి రామునికి కైకమ్మపై ఉండేది, మనకు ఎన్ని ఆటంకాలు కలిగినట్లు అనిపించినా, అది మన మంచికి అని భావించాలి. అది కలిగించినవారి యందు కూడా ఉపకార స్మృతి ఉండాలి. రామునికి వందల అపకారాలు చేసినా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకొనేవాడు కాదు. అందుకోసమే కైకమ్మను ఒక్క మాట అననిచ్చేవాడు కాదు.

రాముడు శాంత మూర్తి, కోపం ఎప్పుడూ కనిపించదు ఆయనలో, అట్లాంటి వాడు అసలు రావణుడిని చంపుతాడా లేదా అనేది దేవతలకు ఎంతో బెంగ ఉండేది. మొదట్లో విశ్వామిత్రుడికి ప్రేరణ కలిగించారు. రాకుమారుడు కదా ఆయన వెంట నడిచి వెళ్ళాలంటే విసుక్కుంటాడేమోనని చూసారు. సుమారు పదిహేను రోజులు నడిచారు, కానీ ఏమాత్రం విసుగు లేదు ఆయనలో. ఆరు రోజులు నిద్రలేకుండా కాపలా కాచాడు, కొంచం విసుగు ఆయన ముఖంలో కనిపించలేదు. కైంకమ్మచే వరాలు కోరించినా ఎట్లాంటి భాద ఆయనలో లేదు. ఇలాంటి మనిషి రావణుడిని ఎట్లా చంపుతాడు అని బెంగ దెవతలకి. ఏం చేస్తే రామునికి కోపం వస్తుంది అని ఒక ప్రయత్నం చేసారు, సీతమ్మను కష్టపెడితే కోపం వస్తుందేమోని, ఇంద్రుని కుమారుడైన జయంత్రునికి కాకి వేశం వేసి సీతమ్మను పొడిచిరా అని ఉసిగొలిపారు. రామచంద్రుడు సీతమ్మ ఒడిన విశ్రాంతి తీసుకుంటున్న సమయాన, కాకిరూపంలో వచ్చి ఆమెను పొడిచాడు, ఆమె రక్తం ఆయనపై పడింది, లేచి చూసాడు. అప్పుడు కోపం వచ్చింది. వెంటనే ఒక గడ్డిపోచని బ్రహ్మాస్త్రం చేసి వేస్తే, అది వాని వెంట తరుముతుంటే వాడు ముల్లోకాలు తిరిగి చివరికి సీతమ్మ కాల్లపై పడితే అప్పుడు క్షమించాడు. సీతమ్మని భాద పెడితే రామునికి కోపం వస్తుంది అని దేవతలు గుర్తించారు. అట్లా సీతమ్మను రావణుడు ఏడిపిస్తే రాముడు తప్పకుండా రావణుడిని వదలడు అని ఒక ఉపాయం తయారు చేసుకున్నారు. సూర్పణక అక్కడికి విహారానికి వచ్చేట్టు చేసాడు. అంత చేసినా అసలు రామునికి రావణాసురుడి మీద కూడా కోపం లేదు, వాడు బాగుపడతాడేమోనని చివరిదాకా చూసాడు.

ఇది మానవుడంటే. అట్లా ఆచరించగలమా. జీవితంలో ఎన్ని కష్టాలు ఏర్పడితే అంత తట్టుకొనే శక్తి పెరుగుతుంది. అందుకు కష్టం కలిగించిన వారిని ఉపకారం అని భావించగలమా! ప్రతి చర్యకు రెండు ఫలాలు ఉంటాయి, దాన్ని మనకు అనుకూలంగా చేసుకోగలిగితే మనం చరిత్రలో నిలవగలం. అట్లా చూపడానికే రామాయణం.

వాలి సుగ్రీవులు అన్నదమ్ములు వానరవీరులు. వీరి పాత్రలు రామాయణం కిష్కింధకాండములో వస్తాయి. కబంధుడు చేతులను శ్రీరామ చంద్రమూర్తి నరికేశాక కబంధుడు శాప విమోచనము పొంది రామా నీకు స్నేహితుడు అవసరము అందువలన నీవు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి తో మైత్రి చేసుకొ అని చెబుతాడు ఆవిధంగా అరణ్యకాండ ముగుస్తుంది కిష్కిందకాండము ప్రారంభిం అవుతుంది. సుగ్రీవుడి పాత్ర కూడా అప్పుడే ప్రారంభం అవుతుంది.
విషయ సూచిక :
1 వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం
2 వాలి సుగ్రీవుల వైరం, రామునితో మైత్రి
3 వాలి మరణం, సుగ్రీవుని రాజ్యాభిషేకం
4 సీతాన్వేషణ
5 యుద్ధం
6 విజయం

వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం
వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం యుద్ధకాండము లొ చెప్పబడుతుంది. సుగ్రీవుడు కుంభకర్ణుడు మీదకు యుద్ధానికి వెళ్తుండగా కుంభకర్ణుడు ఒరే సుగ్రీవా నీగురించి నాకు తెలియదనుకొంటున్నావా? అని కుంభకర్ణుడు అన్న మాటలు వృత్తంతంగా వాల్మీకి మహర్షి మనకు రామాయణంలొ అందిస్తారు. వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఓరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలొ స్నానం చేస్తాడు, ఆ తటాకమునకు ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరస గా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశం లొ సూర్యుడు , ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగంలొను, కంఠభాగం లొను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములొ బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగంలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు. ఈ విషయాన్ని కుంభకర్ణుడు సుగ్రీవుడితో పలికిన మాటలు.

వాలి సుగ్రీవుల వైరం, రామునితో మైత్రి
రామాయణంలో అరణ్య కాండ చివరి భాగంలో సుగ్రీవుని పాత్ర పరిచయమౌతుంది. సుగ్రీవుడు గొప్ప వీరుడు, ధర్మపరుడు, నిరంకుశుడు, కొంత చాపల్యం కలిగినవాడు, మిత్ర ధర్మానికి కట్టుబడినవాడుగా రామాయణంలో కనిపిస్తాడు. సుగ్రీవుడు దురదృష్టవశాన తనకంటే చాలా బలవంతుడైన అన్న వాలి క్రోధానికి గురై మరణభయంతో ఋష్యమూక పర్వతంపై బ్రతుకుతూ ఉన్నాడు.

సీతాపహరణంతో హతాశులైన రామలక్ష్మణులు సీతను వెతుకసాగారు. మతంగాశ్రమం సమీపంలో వారికి కబంధుడనే మహాకాయుడైన ఒక రాక్షసుడు ఎదురుపడ్డాడు. అతడు శాపవశాన రాక్షసుడైన గంధర్వుడు. రామలక్ష్మణులు వాడి శరీరాన్ని తగులబెట్టారు. అప్పుడు కబంధుడు సకలాభరుణుడైన గంధర్వుడై హంసల విమానంలో ఆకాశానికి వెళుతూ – “రామా! ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. నీకిప్పుడు ఒక మిత్రుని అవుసరం ఉంది. నీవు సుగ్రీవునితో స్నేహం చేసుకొంటే సీతను వెదకడంలో అతను నీకు సహాయపడతాడు. అతను కూడా నీలాగే భార్యా వియోగంతో దుర్దశాపన్నుడై ఉన్నాడు. ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుని కలుసుకోవచ్చు. అతని స్నేహంతో రాక్షసులనందరినీ సంహరించి నీ జీవితేశ్వరిని పొందగలవు” అని చెప్పాడు.

మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు. హనుమంతుడు బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.

రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింధ రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు. విధేయుడు. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒకమాసం గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా అభిషేకం చేశారు. వాలి తిరిగివచ్చి సుగ్రీవుడిని నిందించి దండించాడు. అతని భార్య రుమను చేబట్టి సుగ్రీవుని రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.

దీనుడైన సుగ్రీవుని కధ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాలను గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.

దేశాన్ని పరిపాలించే రాజులు తమ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలి అనేది వారి భాద్యత. దాన్ని విస్మరిస్తే జరిగే ఉపద్రవాలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి శ్రీరామాయణం నిదర్శనం. దశరథ మహారాజుకి సరిపడే శక్తి ఉన్నా, తన రాజ్యాన్ని మొత్తం కాపాడుకోలేదు. తన భాద్యత మరచి చివరికి తన ప్రాణాలే కోల్పోయాడు. తన కోడలికి కూడా రక్షణ లేని స్థితి ఏర్పడింది. పరిపాలకులు బలహీనులైతే లోకానికి రక్షణ ఉండదు.

రాముడు వనవాసం వెళ్ళాక, దశరథుడు మరణించాడు. రాజులేకుండా రాజ్యం ఉండకూడదు అని వెంటనే భరతుడిని పిలిపించాడు వశిష్టుడు. రాజు లేని రాజ్యం అరాచకం. రాజులేని రాజ్యంలో ప్రజలు ఎట్లా ఉంటారో వివరించాడు. ఒకరిని ఒకరు గౌరవించరు. ఎవరికి ఎవరు సొంతం కారు. అంటే ఇతడు ఈమెకు భర్త, ఈమె ఇతనికి భార్య అనే వ్యవస్త ఉండదు. పెద్దలను పిల్లలు గౌరవించరు. నియంత్రించే వ్యక్తులు ఉండరు కనక ఒకరిని ఒకరు దోచుకొని తింటారు. రాజు లేని రాజ్యంలో ప్రతి ఒక్కడూ తృప్తిలేని ఎలుకలవలె దొరికినంత దోచుకొని దాచుకుంటారు. దశరథుడు చేసిన దానికి పరిణామం తన ప్రాణాలు కోల్పోవడం, తన కొడుకుని అడవిపాలు చేయడం, తన కోడలికి రక్షణ లేకుండా అవడం. అందుకే రాముడు ఆవ్యవస్తను సంస్కరించాలి అనుకున్నాడు.

వనానికి వెళ్ళినప్పుడు ఋషులు తమను రక్షించమని కోరితే, ఎందుకు మనకు ఇవన్నీ అని సీతమ్మ అంటే, నేను అవసరమైతే నిన్నైనా వదిలేస్తా కానీ తనను ఆశ్రయించి బ్రతికే వారిని తప్పక రక్షిస్తా అని ప్రతిజ్ఞచేసాడు. కేవలం అనడం కాదు, అవసరం వచ్చినప్పుడు సీతను గర్భవతిగా ఉన్నప్పుడు వదిలాడు కూడా.

రామచంద్రుడు కబంధుడిని సంహరించి, శభరిని దర్శించాడు. కబంధుడు దేహాన్ని వదిలి, అద్భుతమైన గంధర్వ దేహాన్ని ధరించి నీవు సీతకై అన్వేషిస్తున్నావు సీతమ్మను చూపించే మంచి మిత్రుడు దొరుకుతాడు, ఆయన కూడా రాజ్యాన్ని వదిలి ఋషిముఖ పర్వతంపై బ్రతుకుతున్నాడు. ఈ భూమిపై ఆయనకు సుపరిచితం కానీ ప్రాంతం లేదు, అతడు నీకు కావల్సిన సేవ అందిస్తాడు అని చెప్పి వెళ్ళాడు. కనుక అది బహుషా దేవతా కార్యమై ఉంటుంది అని సుగ్రీవుని దుఃఖం తనది అనుకున్నాడు. సుగ్రీవుడి తన కష్టాలను చెప్పుకున్నాడు. అతనికి సహాయం చేయడం న్యాయమే అని అనిపించింది. వెళ్ళి వాలితో యుద్దం చేయమని చెప్పాడు. నేను వెనక నుండి సంహరిస్తా అని చెప్పాడు.

సుగ్రీవుడు వాలి గొప్పతనాన్ని చెప్పాడు. దుందిభి అనే వాడు ఒకసారి సముద్రంతో కుస్తీ పట్టడానికి వచ్చాడు. నాతో వద్దు వెళ్ళి హిమాలయం వద్దకు వెళ్ళమని చెప్పాడు సముద్రుడు. హిమాలయం వద్దకు వెళ్ళి అడిగాడు, నాపై ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు, నాతో వద్దు, వాలి అనే వాడు ఉంటాడు. కావలిస్తే అతనితో కుస్తీ పట్టు అని చెప్పాడు. కయ్యానికి వాలి వద్దకు వచ్చాడు. అప్పుడు వాలి ఎత్తేస్తే ఇక యోజనం ఎత్తు ఎగిరి క్రింద పడి ప్రాణం కోల్పోయాడు. వాడి దేహం అక్కడ పడి ఉంది, దాన్ని చూపించాడు. రాముడు తన కాలుతో ఒక్క సారి తాకాడు, పది యోజనాలు ఎగిరి పడింది. వాలి మరొక పని చేసేవాడు, అక్కడ ఉన్న సాలవృక్షాలను కదల్చేవాడు అని అక్కడ ఉన్న ఏడు వృక్షాలను చూపించాడు. రాముడు తన భాణం వేసాడు అది ఆ ఏడు చెట్లని తొలగించి తిరిగి రామున్ని చేరింది. అప్పుడు సుగ్రీవునికి నమ్మకం కల్గింది.

వాలితో యుద్దానికి వెళ్ళమని చెప్పాడు. సుగ్రీవుడు వాలితో దెబ్బలు తిన్నాడు, వాలి ఎక్కడానికి వీలు లేని ఋషిముఖ పర్వతం వైపు పరుగెత్తి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అప్పుడు రామచంద్రుడు వచ్చాడు, సుగ్రీవునికి కోపం వచ్చింది, హాయిగా బ్రతుకుతున్న తనకు చావుదెబ్బలు తినిపించావు అని దబాయించాడు. రాముడు అప్పుడు నీకు వాలికి తేడా తెలియలేదు, వాలి అనుకొని నిన్నేక్కడైనా కొట్టేస్తానేమోనని భయపడ్డాను అని చెప్పాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. వాలికి రాజ్య సుఖాలు ఉన్నాయి, బలిసి ఉన్నాడు. సుగ్రీవుడు రాజ్యం లేక, సుఖాలు లేక చిక్కి పోయి ఉన్నాడు. సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం వైపు పరుగెత్తుతున్నా గుర్తించలేక పోయాడా రాముడు అనేది నమ్మలెం. తరువాత సుగ్రీవునితో రాముడు చెప్పాడు, నీకు వాలికి ఉన్న తేడాని గుర్తించలేక పోయాను, ఎదైనా గుర్తింపు వేసుకుంటే తప్పక రక్షిస్తా అని చెప్పాడు. లక్ష్మణుడి ద్వారా ఒక మాల ఆయన మెడలో వేయించాడు. లక్ష్మణుడు గుర్తు వేసాక అప్పుడు రక్షణ లభిస్తుంది అని సుగ్రీవునికి అప్పుడు అనిపించింది. సుగ్రీవునికి పాలకునిగా పాటించాల్సిన నియమాలు తెలియని వాడు. మొదట రామచంద్రుడిని హనుమంతుని ద్వారా పిలిపించుకొని కలిసినప్పుడు లక్ష్మణ స్వామితో మాట్లాడలేదు రామునికి ఒక ఆసనం వేసి తనూ కూర్చున్నాడు, ప్రక్కనే ఉన్న లక్ష్మణ స్వామిని పట్టించుకోలేదు. హనుమంతుడు ఇది గుర్తించి తను ఒక చందనపు కట్టెను వేసి ఆదరించాడు. సుగ్రీవునికి తన వద్దకి వచ్చిన వ్యక్తులని ఆదరించాలని తెలియదు. అందుకే బుద్ది చెప్పాల్సి వచ్చింది. లక్ష్మణునిచే అలంకృతుడు అయ్యాక, అంటే రామానుజుని గుర్తు పడ్డాకే రక్షణ ఎంటో చూపించాడు. ఒక్క భాణంతోనే వాలిని నేలకోర్చాడు.

రాముడు చెట్టు చాటునుండి వాలిని కొట్టాడు. దాన్ని ఆనాడు అందరూ ధర్మం అని ఒప్పుకున్నారు. కానీ ఈనాటికి కొందరికి అది జీర్ణం కాని విషయం. వాలి రామునితో నీవు ధర్మాత్ముడవని విన్నాను, కానీ నన్ను ఇలా చాటు నుండి చంపి నీ వంశానికి మచ్చ తెచ్చుకున్నావు అని అన్నాడు. అదికూడా ఏమి చేతకాని నా తమ్ముడిని రక్షించావు, నన్నే కనక నీవు సహాయం అడిగి ఉంటే రావణాసురుడిని నీ కాల్ల ముందర పడేసేవాడిని, నా శక్తి గురించి తెలియదా. పరిపాలకునికి ఉండాల్సిన నియమాలు నీకు తెలియవు. ఈ భూమంతా ఈక్ష్వాకు వంశానికి చెందినది. ఆ ఈక్ష్వాకు రాజుకు ప్రతినిదిగా వచ్చాము. ఇక్కడి వ్యవస్తను చక్కబెట్టడానికి వచ్చాం. నీవు చేసిన దోశానికి ఫలం వధించడమే. ఎట్లా శిక్షించాలి అనేది సంబంధం లేని విషయం. ఇక సహాయం విషయానికి వస్తే ఒకరి సహాయం తీసుకోవడం అనేది రామచంద్రునికి అవసరం లేదు అని చెప్పాడు. ఈ విషయం సుగ్రీవునికి కూడా చెప్పాడు విభీషణున్ని రక్షించే సమయంలో. అట్లా చేయాలని అనుకోవడంలేదు, నీకు గౌరవం కట్ట బెట్టాలనేది నా కోరిక. అట్లా వాలితో నీ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. చక్రవర్తి వద్ద నుండి వచ్చిన ప్రతినిదులం, సుగ్రీవుడు వచ్చి తన భాద్యతని చూపించాడు. మమ్మల్ని వచ్చి స్వాగతించే భాద్యత తెలియని నీకు పరిపాలించే అర్హత లేదు అని చెప్పాడు రాముడు.

అప్పుడు వాలి అడిగాడు, రామా మేము జంతువులం. తిన తగని జంతువులం, అట్లాంటి నన్ను చాటు నుండి సంహరించావు ఇది న్యాయమేనా అని, నన్ను ఎందుకు హతమార్చావు, నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా అని వాలి శ్రీరాముడిని అడిగాడు. అందుకు శ్రీరాముడు నేను వైరం ఉంది అని చేయట్లేదు, నీవు చేసింది అధర్మం కనక దాన్ని సరి దిద్దడాని కోసం చేసాను. జంతువును కదా అట్లా నన్ను వెనకనుండి చంపవచ్చా, ఇదేమైనా న్యాయమా అని అడిగాడు. జంతువువు కనుకనే అట్లా చంపాను, ఏదైనా జంతువును వేటాడాలంటే ఒక జంతువును ఎరగా పెట్టాలి, అట్లా నేను సుగ్రీవుడిని పెట్టి నిన్ను చంపాను. నీవు ఇక్కడి వ్యవస్తను పాటించలేదు కనక ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. అందుకు వాలి అంగీకరించాడు. తమ్ముడు అంటే కొడుకు సమానం, అతడి భార్య బిడ్డతో సమానం అట్లాంటి తమ్ముడి భార్యను బంధించడం తప్పు అని చెప్పాడు. ఇది ఘోరమైన అపరాదం మా రాజ్యం ప్రకారం. అందుకు వాలి తన తప్పుని అంగీకరించాడు, తన కుమారుడైన అంగదుడిని మంచిగా చూసుకోవాలని కోరుకున్నాడు. అట్లా సుగ్రీవుడితో సఖ్యం చేసుకున్నాడు కనక సుగ్రీవుడిని కాపాడాడు. సుగ్రీవునికి ఏది అనుకూలమో అది చేసాడు. అందుకే వాలిని సంహరించడం అనేది రామునికి దోశం కాలేదు, ఆయన ధర్మాత్ముడని సమాజం గుర్తించింది. నింద వచ్చినా పరిపాలకుడు ఎవరిని వారి వారి హద్దులలో ఉంచాలి అని తెలిసినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయన మూర్తీభవించిన ధర్మం అని చెబుతారు. ఇది చేయాలా వద్దా ? తగునా కాదా ? అని ఇలా మనకు జీవితంలో ఎన్నో విషయాలు ఎదురవుతుంటాయి. శ్రీరామచంద్రుడు వాలితో ఒక మాట అన్నాడు, నిన్ను చంపినందుకు నాకు మనస్సులో అయ్యో పాపం అని కొంత కూడా అనిపించడం లేదు. ఇదే మొదటి ప్రమాణం అని చెప్పాడు. ఏదైనా చేయాలంటే అది మనకు నచ్చినదైతే మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకుంటాం, కానీ చాలా చోట్ల మన మనస్సు చెప్పినదాన్ని ఒప్పుకోం. ఇది మన ప్రవృత్తి. ఆమనస్సును మనం ధర్మానికి కట్టుబడేలా చేసుకోవాలి. శ్రీరాముని చరిత్రను మన ముందు పెట్టుకోగలిగితే మనం ఏది తగినదిగా స్వీకరించాలి, దేన్ని తగనిదిగా వదలాలి అనేది తెలుస్తుంది. రాముడు వాలిని సంహరించాక వానరుల రాజ్యాన్ని తాను తీసుకోలేదు, అందుకే సుగ్రీవుడు రామునికి దాసుడైపోయాడు. రావణాసురుడిని సంహరించాక ఆరాజ్యాన్ని విభీషణునికి ఉచ్చాడు, అలా అందించినందుకు విభీషణుడు దాసుడై పోయాడు. అట్లా రామ రాజ్యం అయ్యింది. ఒకరిని అణిచివేయకూడదు. సమాజం అన్నాక అన్ని రకాల జాతులు ఉంటాయి. ఎన్నో మతాలు, కులాలు ఉంటాయి. ఎవరు వారి ధర్మాన్ని పాటించుకోవాలి. ఇతర ధర్మాలను గౌరవించాలి. అందుకే మనం చేసే వైధిక కార్యాలు లోకం మొత్తం బాగుకోసం. అట్లా మన మనస్సును మనం సంస్కరించుకోవాలి.

సుగ్రీవునికి రాజ్యం అప్పగించాక, వర్షాకాలం అయ్యేసరికి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఆతరువాత సీతకోసం వెతకడానికి బయలుదేరుదాం అని చెప్పాడు. వనవాస నియమం ప్రకారం రాముడు కొండగుహల్లో గడిపాడు. కనీసం ఒక్క సారి వెళ్ళి పలకరించలేదు సుగ్రీవుడు. తన భాద్యతలను పూర్తిగా మరచిపోయాడు. అప్పుడు రాముడు తిరిగి భాద్యతలను గుర్తుచేయాల్సి వచ్చింది. సుగ్రీవా! వాలి వెళ్ళిన దారి ఇంకా మూసివేయలేదు, తెరిచి అట్లే పెట్టాను, నిన్ను ముందు వెనక కొందరిని కలిపి మర్యాదగా పంపాల్సి ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరించాడు. హనుమంతుడు, అంగదుడు, లక్ష్మణుడు వెళ్ళి చెప్పాక సుగ్రీవుడు తన భాద్యత గుర్తించాడు.

లోకంలో మనం ప్రవర్తించేప్పుడు మన హక్కుకు ముందు మన భాద్యత ఎమిటో తెలుసుకోవాలి. వాలి, సుగ్రీవులు ఇద్దరూ వారి వారి హక్కు ఏమిటో తెలుసుకున్నారు కానీ భాద్యత ఏమిటో తెలుసుకోలేదు. రామచంద్రుడు విభీషణుడిని ఎట్లా రక్షించాలో అని అడిగితే, రక్షించాలా వద్దా అని తన సలహా చెప్పాడు సుగ్రీవుడు. అందుకే చివర హనుమంతుడిని అడిగితే, నేను గొప్ప చదుకుకున్నవాడినని కాదు, నేను మీకు చెప్పగలిగిన వాడిని కాదు, కానీ మీరు అడిగినప్పుడు చెప్పాల్సిన భాద్యత ఉంది కనక చెబుతున్నా అని చెప్పాడు. అశ్రయించినవాడిని తప్పక రక్షించి తీరాలి అని చెప్పాడు. వాడు శత్రువైనా సరే, మన ప్రాణాలకు హాని అయినా సరే రక్షించి తీరాలి. ఇది భాద్యత అంటే. హక్కులు తరువాత విషయం. భాద్యతలు సవ్యంగా నెరవేర్చుకోవడం కోసం హక్కులు తెలియాలి. మానవుడిగా మనకు కొన్ని భాద్యతలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నవారిని గౌరవించాలి, ప్రకృతిని గౌరవించాలి. ఇది మన భాద్యత. వాలి తన భాద్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. సుగ్రీవుడు తన భాద్యత విస్మరించాడు కనుక దండన పొందాడు. హనుమంతుడు తన భాద్యత గుర్తించాడు కనక రాముని విశ్వాస పాత్రుడైనాడు. మనిషి అట్లా భాద్యతని గుర్తించి బ్రతికితే సరియైన రక్షణకి యోగ్యుడవుతాడు. కిష్కింద కాండలో వాలి సుగ్రీవుల కథలో రాముడు నిరూపించాడు.

సీతాన్వేషణ
రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు. ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని యశస్సును పొందడానికి కారణభూతుడైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. – అని హితం పలికాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుని పిలిచి, అన్ని దిశలనుండీ వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు. కాలసర్ప సదృశమైన ధనుస్సు ధరించి క్రోధారుణ నేత్రుడై వచ్చిన లక్ష్మణుని పట్ల వినయంతో తార, సుగ్రీవుడు ఆ రామానుజుని ప్రసన్నం చేసుకొన్నారు. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.

సుగ్రీవుని ఆజ్ఞపై వినతుడనే వానరులు నలుదిక్కులకూ సీతా మాత అన్వేషణకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు సుషేణుడు, అన్ని దిశలలో వెళ్ళేవారికీ వారు వెతక వలసిన స్థలాలను, తీసికొనవలసిన జాగ్రత్తలను సుగ్రీవుడు వివరించి చెప్పాడు. ఒక మాసం లోపు అన్వేషణ పూర్తి కావాలనీ, సీతమ్మ జాడ తెలిపినవారికి తనతో సమానంగా రాజ్య భోగాలు కల్పిస్తాననీ మాట ఇచ్చాడు. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

సుగ్రీవుని భౌగోళిక జ్ఞానం రాముని ఆశ్చర్య చకితుని చేసింది. దానికి కారణం అడిగాడు. తాను వాలి వలన భయంతో ప్రాణాలు రక్షించుకోవడానికి భూమండలమంతా తిరిగినందువలన ఆ విధంగా లోక పరిచయం అయ్యిందని సుగ్రీవుడు చెప్పాడు. ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత కానరాలేదని చింతాక్రాంతులై మనవి చేశారు.

తన సైన్యాన్ని నాలుగు దిక్కులకి పంపిం రామ కార్యానికి ఉద్యుక్తుడు అయ్యాడు. సీతమ్మను అన్వేషించడానికి సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుడు భాగాలు చేసి, నాలుగు దిక్కులకి ఎంతవరకు వెళ్ళవచ్చు, ఆ వెళ్ళే మార్గంలో ఏమేమి ఉంటాయి, అక్కడ ఎట్లా ప్రవర్తించాలి అనే విషయాలని చెప్పి పంపాడు. ముఖ్యంగా దక్షిణ దిక్కుకి వెళ్ళే హనుమంతునికి శ్రీరామ చంద్రుడు తన నామంతో ఉండే అంగుళికాన్ని ఇచ్చి, నీవల్ల ఈ పని జరుగుతుంది అని ఆశీర్వదించి పంపాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళినవారు సముద్రం వరకు చేరుతారు. అంతవరకు కిష్కింద కాండ.

సుందర కాండ

సుందరం అంటే ఏమిటి ?

హనుమంతుడు లంక చేరి సీతమ్మను దర్శించి నేను రాముడు పంపిన అసలైన దూతను అని విషయాన్ని నిరూపించడానికి రాముడు ఇచ్చిన అంగుళికాన్ని సీతమ్మకు చూపిస్తాడు. ఆ సన్నివేశం ఆమె ప్రాణాలకి శక్తి నింపేట్టుగా చేసింది. ఆపై సీతమ్మ తన చూడామణిని హనుమకు ఇచ్చి పంపింది. అది చూస్తే రామునికి తన తండ్రి జనకుడు, దశరథ మహారాజు మరియూ నేను గుర్తుకు వస్తాను అని చెప్పింది. ఈ విషయాలను తెలిపేదే సుందర కాండ. మరి సుందరం అని దీనికి ఎట్లా పేరు వచ్చింది ? సుందరం అంటే ఏమిటి ?
సుందరం అంటే ఏమిటి ?
రామాయణంలోని సుండరకాండ ఎవరి సౌందర్యాన్ని చెబుతుంది. మన పూర్వ ఆచార్యులు దానికి అందమైన వివరణ ఇచ్చారు. నిజానికి పైకి కనిపించే అందాలు అసలైన అందాలు కావు. మన శరీరాన్ని తీసుకుంటే వయసులో ఉన్నంత వరకు అందంగా ఉంటుంది, కాస్త వయస్సు ఎక్కువయ్యాక ఎంత ప్రయత్నించినా అసలు రూపాన్ని దాచలేం. అందం అంటే అదేనా ? అందం అనేది ఒక సాపేక్షికమైనది. ఒకరికి అందం అనిపించింది మరొకరికి అనిపించక పోవచ్చు. అందుకే కాకి పిల్ల కాకికి ముద్దు అని సామెత చెబుతారు. కానీ మన పెద్దలు ఆనందమే అందం అని చెప్పారు. ఏది ఆనందాన్ని ఇస్తుందో అదే అందం, ఎవరికి వారికి. అయితే ఒక్కొక్కరికి వేరుగా కాకుండా, అందరికి సామాన్యేనా ఏది అందమైనది? ఏది ఆనంద దాయకమైనది ? శ్రీకృష్ణదేవరాయలు ఒకనాడు తన మనవడిని ఒడిలో కూర్చోబెట్టుకుకొని ఉండగా సభలో ఆయనకు ఒక సందేహం కలిగిందట. మనిషికి అత్యంత ప్రీతి తమమైనది ఏది, ఏది ఎక్కువ ఆనందదాయకమైనది అని. సభలో అందరిని అడిగారట, అక్కడ ఆయన ఒల్లో మనవడు ఉన్నాడని చూసి మనిషికి ప్రేమ మనవడిపై ఉంటుంది అని చెప్పారట. ప్రక్కనే తెనాలి రామను అడిగీతే ఎవరి దేహం వారికి ప్రీతి తమం అని చెప్పాడట. ఇకపై అందరూ చెప్పారట తల్లికి బిడ్డపై ఉన్న ప్రేమ కంటే మించింది ఏది లేదు అని. ఎందుకంటే తన శరీరాన్ని లెక్క చేయకుండా కంటుంది సంతానాన్ని. ఏమోయ్ రామా నీసమాధానం అని మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామని అడిగితే,  శరీరానికి అనుకూలం ఉన్నంతవరకే ఆప్రేమ దానికి మించి దేహంపైనే అందరికి ప్రేమ అని చెప్పాడు. మరి నిరూపించు అని చెప్పాడట. ఒక పెద్ద పాత్రలో ఒక తల్లి కోతిని, పిల్ల కోతిని ఉంచి, కొద్దికొద్దిగా నీళ్ళు పోయించాడు. ఆ తల్లి కోతి పిల్ల కోతికి ఏ అపాయం కాకుండా తన చేతితో ఎత్తి పట్టుకొని రక్షిస్తోందట. ఆ నీరు తన నోటి వరకు వచ్చాయి, ఇకపై కొన్ని నీరు పోయగా తన ముక్కు వరకు రాగానే, చివరికి తన ఉనికికే ప్రమాధం ఏర్పడగానే ఆ పిల్ల కోతిని క్రిందకు లాగి దానిపై ఎక్కి నిలుచుందట. మనుష్యులకైనా అంతే దేహంమీదే ప్రేమ.గొప్ప గొప్ప వేదాంతులు కూడా తమ తమ శరీరాలను కాపాడుకోవాల్సిన అవసరం వస్తే ధర్మాన్ని ప్రక్కన పెట్టేస్తారు. ముందు దేహమే లేకుండా పోతే ఎట్లా, మంచో చెడో పరిహారమో తర్వాత దేహం అనేది అవసరం కదా మొదట దేనికైనా.

కానీ కొందరు మహానుభావులు ఆ శరీరానికి సుఃఖాలు తగ్గించి ఎంతో కష్టపడి ఈ శరీరానికి లోన ఒకటి ఉంది అంటూ దాని కోసం అన్వేషణ ప్రారంభించారు. అట్లాంటి మహానుభావులు అట్లాంటి తత్వాని గురించి వివరించారు, దానికే అత్మ తత్వం అని పేరు. 'నేను' అని చెబుతున్నామే, అదే ఆత్మ. ఆ ఆత్మకి ఏది వ్యతిరేఖంగా కాకుండా మనం జీవనం కొనసాగిస్తుంటాం. మనిషికి దాని గురించి తెలిస్తే అసలు ఆనందాన్ని ఇచ్చేది 'ఆత్మ' అని తెలుస్తుంది. ఈ ఆత్మ ఎక్కడిది ? ఎలా వచ్చింది ఈ శరీరం లోనికి. తెలిసి ఎవరూ రాలేదు. ఈ జీవుడిని వెనకాతల ఒకడు ప్రేరేపించువాడొకడున్నాడు. ఈ జీవుడిని శరీరం అంతటా వ్యాపించేట్టు చేస్తుంటాడు, వాడుంటేనే ఈ శరీరానికి ఒక లెక్క, లేకుంటే శవం అని అంటారు. వ్యాపించి పనిచేయించుకొనువాడు కనక ఆత్మ అని పేరు పెట్టారు. ఇలాంటి ఆత్మ అనేది ప్రతి ప్రాణి కోటిలో ఉంది. మరి వీటన్నింటిని కలిపి నడిపించే శక్తి ఎక్కడ ఉంటుంది. మనం ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఒక పద్దతి ప్రకారం నడుస్తున్నాయి. విటిని నడిపేది ఎవరు ? ఇన్నింటిలోనూ వ్యాపించి ఉన్న వాడిని పరమాత్మ అని పేరు. ఇన్నింటిలో నడిపించేది, అది నీలో కూడా ఉండి నడిపేది. అంటే ఆత్మకు కూడా వెనకాతల ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది మన బుద్దుకి అందేది కాదు. శాస్త్రం చదివి తెలుసుకోవాల్సిందే. ఇంద్రియాలకి గోచరించేది కాదు, అంతకంటే సూక్ష్మం కనుక. శాస్త్రాల్లో ఆవెనకాతల ఉన్న పరమాత్మ దయామయుడని, కరుణామయుడని, ఈ ఆత్మని ఉద్దరించాలని అనుకుంటాడు కనుకనే మనల్ని ఈ శరీరంలో పెట్టాడు. దాన్నే జీవితం అని అంటారు. జీవితం అంటే జీవుడు శరీరంతో సాగించే ప్రయాణానికి జీవితం అని పేరు.

ఇలా మనం ఎన్నో శరీరాల్లోంచి ప్రయాణం సాగించాం. అయితే ఈ జీవితం ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. కష్టాలు కలగ కుండా ఉండాలని మనం కోరుకుంటాం. సుఃఖాలు కలగాలని కోరుకుంటాం. కానీ మనం అనుకున్నట్టు జరగటం లేదు. అట్లా మనం దుఖాలకు కారణం వీడు, వాడు అని ఒకరిపై వేసి చెబుతుంటాం. నిజానికి ఈ జీవితం మనకి అనుకూలంగా ఉండేట్టు చేసుకోనేందుకు, మళ్ళీ తిరిగు దుఖ భూయిష్టమైన దేహాలలోకి వెళ్ళకుండా ఉండే స్థితి ఏమిటో తెలిస్తేనే అది తెలివి అని అంటారు. మిగతా విషయాలను తెలివి అని అనరు. మిగతావి జ్ఞానం అని అనటానికి వీలు లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక 26 విషయాలు చెబుతూ, ఇవి కాక మిగతావి అన్నీ అజ్ఞానాలే అని చెప్పాడు. మనకు ఎన్నో జరుగుతుంటాయి, ఒకరిపై నిందారోపన చేయకూడదు. మనల్ని మనం ఒకరితో పోల్చుకొని భగవంతుడు నాకు ఇలా చేసాడు అని నిందిస్తుంటాం. భగవంతుడు నిష్పాక్షికుడు. అందరిని సమానంగానే చూస్తాడు. ఇప్పుడు మనం చూసే తేడాలన్నీ మనం మనం చేసుకున్నవే. ఇది మొదట అంగీకరించాలి. స్వీకరించిన వాటిని సక్రమంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి. భగవంతుని మీద విశ్వాసంతోటి అర్పణం కావాలి. మనల్ని భగవంతుని వైపు నడిపించగల జ్ఞానిని ఆశ్రయించాలి. అప్పుడు మనకు తిరిగి ఇక్కడికి రావల్సిన స్థిని ఏర్పడుతుంది. అది ఆనందం అంటే, అది సుందరం అంటే.

ఉదాసీన స్థితి నుండి కర్తవ్య దిశగా హనుమ

అజ్ఞానపుటంధకారంలో జీవితంలో అడుగువేసే మానవునికి రకరకాల సమస్యల వలయాలని ఛేదించుకుంటూ ముందుకు సాగాల్సిన కర్తవ్యపరాయణుడైన ఒక మానవునికి సుందరకాండ ఒక నిదర్శణం. మనిషికి ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే ముందర మనోధైర్యపు లోపమే అనర్థాలకి మూలకారణం అవుతూ ఉంటుంది. మనిషిలో ఈ రకమైన నిర్లిక్తమైన మనస్స్థితి, ఒక ఉదాసీనమైన ప్రవృత్తి, ఇది అన్ని రకాల అనర్థాలకి మూలకారణం అవుతుంది. దాన్ని దూరం చెయ్యాలి. దాన్ని వదలాలి.  మనోదైర్యం ఒక్కటి ఏర్పడినట్లయితే అన్ని రకాల అవరోధాలని మనం అతిక్రమించి ముందుకు సాగగలిగినట్లే.
సీతాన్వేషణ చేయటం కోసం వెళ్ళిన హనుమ ఆయన లంకకి చేరాడు. అంతటా వెతికాడు. నేనే వెతకగలను అనే ఒక రకమైనటువంటి గర్వం ఒక రకమైన అహంకారం. ఎందుకంటే వంద యోజనాల సాగరం దాటివచ్చాడాయే! దేవతలంతా ఆకాశం నుండి చూసి " ఓ దుష్కరం కృతవాన్" అని నాలుగు సార్లు ఆయన్ని గట్టిగా పొగిడేసేటప్పటికి ఆయన నిజంగా నేను ఎంత గొప్ప పని చేసాను అనుకున్నాడు. ఆయనకి కొంచెం గర్వం పెరిగింది. సాగరతీరం లో బయలుదేరేటప్పుడు "యథా రాఘవం నిర్ముక్త:శరః గచ్చేత్" అని తాను ప్రారంభంఅయ్యాడు. రాముడి వదిలిన బాణం వెళ్ళినట్లుగానే నేను వెళతాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అవసరమేలేదు అని అనుకుంటూ వెళ్ళినటువంటి ఆ హనుమ, అక్కడి దాకా వెళ్ళినతరువాత, వీళ్ళందరి పొగడ్తలు విని నేనే ఇంత గొప్ప పని చేసాను అని కొంచెం గర్విస్తూ, ఆయన సీతకోసం అన్వేషణ ప్రారంభం చేసాడు. ఎందరినో చూశాడు. ఎన్నో స్థానాలు వెతికాడు. ఎక్కడా సీతమ్మ కనిపించలేదు. తెల్లవారితే తిరిగి తాను తన స్థానానికి వెళ్ళైపోవాలి. ఇక్కడ చూస్తే ఎక్కడా కూడా సీతమ్మ జాడయే కనిపించటం లేదు. లోపల, బయట వెతకని చోటంటూ లేకుండా వెతికేసాడాయన. అయితే ఆ అశోకవనాన్ని మాత్రం తాను స్పృశించనేలేదు. మిగిలినటువంటి అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. అన్నిటినీ కూడా వెతికి వెతికి,ఎక్కడా కూడా ఏమి కనిపించలేదు. ఎక్కడ ఉంటుంది సీతమ్మ?
ఇంకాసేపటిలో తెల్లవారబోతుంది. ఒక గోడ మీద తాను కూర్చున్నాడు.  సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం ఇచ్చిన కాలమా దాటిపోయింది కనుక వెళితే ఆయన ఎలాగూ ప్రాణాలు తీసివేస్తాడు. కాక నేను సీతని చూడకుండా వెన్నక్కి వెడితే  నా రాక కోసం ఎదురుచూసేవారందరు కూడా ప్రాణాలు వదిలివేస్తారు సీత కనిపించలేదని. మేం అక్కడికి వెళితే సుగ్రీవుడు ప్రాణం తీస్తాడు.ఆయన ప్రాణం పోతుంది. ఆయన ప్రాణం పోతే రాముడి ప్రాణం పోతుంది. . రాముడి ప్రాణం పోతే భరతుని ప్రాణం పోతుంది. అయోధ్యాపుర జనుల ప్రాణాలు పోతాయి. నేనొక్కడిని వెళితే కదా ఇంతమంది ప్రాణాలు కోల్పోయేది? కనుక నేను అక్కడికి వెళ్ళకుండా  ఈ సమాచారం ఇవ్వకుండా ఇక్కడే ప్రాణాలు వదిలివేసినప్పటికిని ఏం పెద్ద దోషం లేదు. కనుక నేనాత్మహత్య చేసుకుంటాను. ఇక్కడ ఉండిపోవటానికి అయితే వీలు లేదు కదా! వాళ్ళందరినీ వదిలి ఉండలేను. వెళ్ళి తగిన సమాచారం ఇవ్వలేను. కనుక నాకు కేవలం ఆత్మహత్య మాత్రమే శరణ్యం అనుకున్నాడు.
ఇంతతెలివైనటువంటి హనుమంతుడు కూడాను. నవ వ్యాకరణ పండితుడంటారు. చతుశ్శాస్త్ర పండితుడంటారు. నాలుగు వేదములనూ కూడా తాను అధ్యయనం చేసిన మహనీయుడని రాముడి చేత పొగడ్త పొంది మహనీయుడైనటువంటి హనుమంతుడంతటి వాడికే తనలో కలిగినటువంటి కాస్త అహంకారం, కాస్త గర్వం, అది తగునో తగదో తెలియనటువంటి ఆలోచనలలోకి ఆయన్ని ముంచెత్తేసింది. ఇక ఎందుకు ప్రాణం తీసేసుకుందాం అని అనుకుంటూ ఉన్న సమయంలో అతనికే, బుద్ధిమంతుడు కదా! ఒకరు చెప్పక్కరలేకుండానే సహజంగానే మళ్ళీ జ్ఞానం కలుగుతుంది. అహంకారం తగ్గుతుంది. తాను పెద్దల దగ్గర శిరస్సు వంచాలనేటటువంటి జ్ఞానం పెరుగుతుంది. అలానే హనుమంతుడికి కుడా "ఒక్కసారి నేను  ఏ సీత కోసం వెతుకుతున్నానో ఆ సీతనే ప్రార్థిస్తాను. రామచంద్రుడిని ప్రార్థిస్తాను" అంటూ గతంలో తాను చేసినటువంటి అన్ని రకములైనటువంటి ప్రార్థనలని కూడా ఒక ప్రక్కన నిలిపి, తాను ఆ వేళ సీతమ్మ కోసం ప్రార్థన చేసాడు. "నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై" జనకాత్మజ అయినటువంటి సీతకి నమస్కారం అంటూ ఆయన సీతారాముల సన్నిధానంలో చేసినటువంటి ఆ నమస్సు యొక్క ఫలితంగా అంత వరకూ తాను అన్నీ చూసాననుకున్నవాడు తను ఒక ప్రక్కకి తిరగగానే అశోకవనం కనిపించింది. చెట్టు కనిపించింది. చెట్టు కింద సీతమ్మ కనిపించింది. కొన్ని గుర్తులతోటి "ఈవిడ సీతే" అని నిర్ణయం చేసుకున్నాడు.
అయితే ఆ రకంగా హనుమంతుడంతటివాడికే అయినా కొంచెం అహంకారపు పాలు ఏర్పడగానే తను యుక్తాయుక్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకునేటంతవరకు వెళ్ళిపోయాడు అని అంటే అతనిలో ఒక రకమైన క్లీబత ఏర్పడిపోయింది అతనిలో ఒక రకమైనటువంటి హృదయదౌర్భల్యం ఏర్పడిపోయింది అని అంటే ఇక సామాన్యులైనటువంటి మన లాంటి వాళ్ళకి ఏమిటి కనుక ఏం చెప్పాలి కనుక? ఈ సన్నివేశం మనకు స్పూర్తి దాయకం. ఎక్కడెక్కడ ఏ ఏ సన్నివేశాల్లో మనోదౌర్భల్యం కలుగుతుందో, అలాంటి చోటల్లా మనం శ్రీకృష్ణుని పాదలకి నమస్కారం లేదా శ్రీ రాముని పాదాలకి నమస్కారం అని మనం ఆ రకమైన ఒక ధైర్యాన్ని నిర్మాణం చేసుకోగలిగినట్లయితే మనలోకి హృదయదౌర్బల్యం చేరదు. కర్తవ్యపాలన మనం చేసుకోగలుగుతాం. 

సీత దుఖానికి కారణం ఎవరు ?

సీతమ్మ లంకా నగరంలో ఉంది. వందల మంది రాక్షస స్త్రీలు హింసిస్తున్నారు. మాటలతో, చేతలతో నిరంతరం అమెను హింసిస్తూ ఉన్నారు. అట్లాంటి సీతమ్మను చూడటానికి హనుమంతుడు వెళ్ళాడు. ఆ హనుమంతుని చూడగానే సీతమ్మ మొదట ఒక ప్రశ్న వేసింది. ఒక కాకి నన్ను పొడిచిందని కోపగించి గడ్డి పోచను తీసి అస్త్రంగా మార్చి వదిలాడు రాముడు. ఒక కాకి చేసిన చిన్న ఇబ్బందికి అంత చేసాడు, కానీ రావణాసురుడు పదినెలలుగా ఇంట హింస చేయిస్తున్నాడు, చేతకాని వాడు కాదు రాముడు,  ఒకరు కాదు రామ లక్ష్మణులు ఇద్దరూ సమర్థులే. వారి అస్త్ర శస్త్రాలకు తిరుగులేదు. ఎదురుగా ఉండ నవసరంలేదు వారు అనుకుంటే ఒక్కసారి రావణుడిని చంపిపాడ వేయగలరు. ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారు. అని ముందు రామ లక్ష్మణులని దూశించింది.

రామ లక్ష్మణుల చేతకాని తనం వల్లనో లేక వారి అశ్రద్దతో సీత లంకానగరంలో ప్రవేశించిందా ? సీతకు కలిగిన దుఖాలకు కారణం ఎవరు. మొదట సీత ఈ విషయం అంగీకరించలేదు. కానీ తరువాత తానే తన తప్పును ఒప్పుకుంది. "మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి నసంశయః" ఇది రామ లక్ష్మణుల తప్పు కాదు, నేను చేసుకున్నదే అని అంగీకరించింది. మొదట బంగారు లేడిని చూసి ఇలాంటివి ప్రపంచంలో ఉండవు. దాని నోట్లొంచి మంటలు వస్తున్నాయి, ఇతరమైన జంతువులు భయపడి పారిపోతున్నాయి. బంగారపు చాయ కలిగి ఉండవు, అని లక్ష్మణ స్వామి చెప్పాడు. ఇది తప్పని సరి మారీచుని మాయ అయి ఉంటుంది, వద్దు మనకి అని రాముడు చెప్పాడు. కానీ సీతమ్మ వినలేదు. ఒకవేల రాక్షసుడైతే సంహరించు, ప్రాణాలతో దొరికినా, లేక ప్రాణాలు లేక దొరికినా దాని చర్మాన్ని మనం అయోధ్యకు మన వనవాస జ్ఞాపికగా తీసుకుపోదాం అని చెప్పింది. వద్దు అని ఎంతచెప్పినా, రాముడిని నిర్భందించి పంపింది. రాముడు వెళ్ళాక ఆలేడిని చంపగానే హే లక్ష్మణా, హే సీతా అంటూ మారీచుడు అరిచాడు.

ఆమాటలు విన్న సీతమ్మ, లక్ష్మణ స్వామిని వెళ్ళమని చెప్పింది, ఆయన వెళ్ళనంటే నానా మాటలు అన్నది. రాముడు లేనిది చూసి నన్ను పొందాలని అనుకుంటున్నావా అని చాలా రకాలుగా కృరమైన మాటలు అనే సరికి లక్ష్మణ స్వామి తట్టుకోలేక వెళ్ళాడు. లక్ష్మణ స్వామిని నిర్భందించి పంపింది. రావణాసుడు వచ్చి ఆమెను ఎత్తుకు పోయాడు. రావణాసుడు భిక్షకుడిగా వచ్చాడు. ఆ వచ్చినవాడు ఆమె అందాన్ని పొగిడాడు, అమె గురించి అడిగాడు. ఉన్న విషయాలు అన్ని చెప్పింది. తెలియని వారికి అలా చెప్పవచ్చా. అప్పుడైనా తప్పించుకోనే ప్రయత్నం ఆమె చేయలేదు. సీతమ్మకు ఏర్పడ్డ దుఖాలకు కారణం తనే. అయితే ఈ విషయం మొదట ఒప్పుకోక పోయినా, తరువాత హనుమంతుని ముందు అంగీకరించింది. నా తప్పే అని రామ లక్ష్మణులతో చెప్పని సందేశం హనుమంతునితో పంపింది.

సీతమ్మ తన దోశాన్ని అంగీకరించి, రామచంద్రునికి శరణాగతి చేసింది. ఆ శరణాగతి నేరుగా కాక హనుమ ద్వారా చేసి, ఆయన హనుమ ద్వారా పంపిన చిహ్నాన్ని పొంది, రాముడి వల్ల తప్ప మరొకరి వల్ల రక్షణ వద్దు అని తన సంసిద్దతని చెప్పింది. హనుమంతుడు నేనే తీసుకువెళ్తా అని చెప్పినా, రాముడే రావాలి అని చెప్పింది. సీతమ్మ అట్లా చేసిన ఆత్మార్పణమే రాముడు రావడానికి, రావణుడిని చంపి ఆమెను స్వీకరించడానికి కారణమైంది. అది సుందర కాండ తెలిపేది. 

ఆత్మ సౌందర్యాన్ని తెలిపేది సుందర కాండ

సుందర కాండ తెలిపేది సీతమ్మ కథనే అయినా మన జీవితానికి అతుకుతుంది. సీతమ్మ లంకలో ఉంది. లంక నూరు యోజనాల దూరంలో ఉంది. అతి లోక సుందరమైన నగరం. విశ్వకర్మ నిర్మాణం చేసాడు. అంత అందమైన నగరానికి పాలకుడు రావణాసురుడు. లోకాలని ఏడిపించే వ్యక్తి. రజో గుణనికి నిలువు రూపం. అయితే ఆయనకు ఇద్దరు సోదరులు. ఒకడు కుంభకర్ణుడు, తామసికుడు. మరొక సోదరుడు విభీషణుడు పరమ సాత్వికుడు. ఈ రావణాసురుడు పది తలలు కలవాడు. పది తలలతో ఉంటాడు. లంకానగరంలో సీతమ్మతో పాటు ఎందరో ఆడవారిని నిర్భందించాడు. వారందరూ భయానికో లేక వేరే గతి లేక రావణుడితో ఉండిపోయారు. సీతమ్మ అలా చేయలేదు, రాముడు రావాల్సి వచ్చింది. ఇది లంకానగర చరిత్ర.

ఆ సీత లోపలి ఆత్మ అని చెబుతారు. జనకుడు యజ్ఞం కోసం  క్షేత్రాన్ని దున్నినప్పుడు సీత లభించింది. అట్లానే మనం శరీరం అనే క్షేత్రాన్ని సాధన చేయగా ఆత్మ అనేది లభిస్తుంది. సీత ఎట్లా అయితే పుట్టలేదో, ఈ ఆత్మకు జన్మ లేదు. ఆ లభించిన సీతను ఎవరికి అర్పించాలో తెలియక జనకుడు ధనస్సును వంపినవాడికి అర్పిస్తా అని చెపాడు. ధనస్సు రామునికి వంగింది కనుక సీతను రామునికి ఇచ్చి వివాహం చేసాడు. మనం సాధన చేయగా లభించిన ఆత్మను ఎవరికి అర్పించాలి అంటే, ధనస్సు ఓంకారానికి గుర్తు, ఓంకారం ఎవరికి వంగునో వానికే అర్పించాలి. ఓంకారం తెలిపేది పరమాత్మకు కనుక ఈ ఆత్మ పరమాత్మకు మాత్రమే చెందినది.

పరమాత్మ అందరిని ఆనందింపజేస్తాడు కనుక ఆయన రమయతి - రామ అని పేరు. రాముడిని చూసి పురుషులు కూడా మోహించేంత సౌందర్యం ఉన్న రాముడు సీతకు వశుడై ఉన్నప్పటికీ, ఆమె బంగారు లేడిని తెచ్చివ్వమని చెప్పింది. దేవుడు ప్రక్కగా ఉండగ మనం మరొకటి కోరాల్సిన అవసరం ఉండదు, అందుకే గోదాదేవి "ఉన్నై అరుతిత్తు వందోం" మేం నిన్ను కోరి వచ్చాం అని చెబుతుంది. ఇది మనం అడగ గలగాలి. దయ వల్ల భగవంతుడు మనం క్షుద్రమైనవి  కోరినా ఇచ్చే ప్రయత్నం చేస్తాడు, కానీ మనకు హితం చెప్పే గురువులు ఉంటారు, వారు మనం ఏది కోరతగునో చెబుతుంటారు. కానీ మనం వారిని కూడా లెక్క చెయ్యం. సీతమ్మకు లక్ష్మణ స్వామి హితం చెప్పినా, ఆమె ఆయనను కూడా దూరం పంపింది. అందుకే సీతమ్మ రావణాసురుడి చెరలో పడినట్లే మనం కూడా అట్లానే శరీరం అనే లంకలో పడి ఉన్నాం.

లంకా నగరం ఎంత అందంగా ఉండేదో, మన శరీరం అనేది ఒక అందమైన పురం. సీతని రావణాసురుడు హింసించినట్లే, మన ఆత్మపై ఆదిపత్యం చూపేది మన మనస్సు. మనస్సుకు రావణుడు అని పేరు. రావణాసురుడికి పది తలలున్నట్లే, ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు  మొత్తం పది ఇంద్రియాలను నియంత్రించేది మనస్సు. రావణుడు మన మనస్సు యొక్క రజో గుణానికి గుర్తు. రావణుడికి కుంభకర్ణుడు, విభీషణుడు అనే సోదరులున్నట్లే, మనస్సుకు తమస్సు, సాత్వికం అనే గుణాలు ఉంటాయి. దైవాన్ని గురించి, ధర్మాన్ని గురించి విభీషణుడు హితం చెప్పినట్లే, అప్పుడప్పుడు మనస్సుకు సాత్విక ప్రవృత్తి ఉంటుంది కానీ రజో గుణం దాన్ని అణిచివేస్తుంది. ఎట్లాంటి జ్ఞానం లేక పడి నిద్రపోయే స్థితిని తమోగుణం అని అంటారు, ఇది కుంభకర్ణుడు దీనికి గుర్తు. ఏది చూసినా నాకోసమే అనేదే రజో గుణం, రావణుడు దానికి గుర్తు. రజో గుణం పెరిగి చివరికి దేవుడికి చెందినదాన్ని కూడా నాకు కావాలి అన్నప్పుడు రాముడు రావాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త దేవుల్లని పుట్టిస్తున్నారు. ఇది ప్రమాధకరమైన స్థితి. ప్రపంచాన్ని మన ఆధీనంలోకి రావాలని అనుకుంటున్నాం, అది ప్రమాధకరం. సీత తను చేసిన తప్పువాలే రావణుడి చెరలో పడ్డట్లే, మనం కూడా భగవంతునితో అనందాన్ని అనుభవించేవాళ్ళం ఒకనాడు కానీ మనం చేసుకున్న స్వయంకృత అపరాదం వల్ల మనం ఈ శరీరంలోకి వచ్చాం. లంకలో పడ్డ సీత బయట పడాలని అనుకుంది. ఆ లంక వంద యోజనాల దూరం ఉంది. అట్లానే శరీరానికి వంద ఏండ్ల ఆయుపరిమితి ఉంది.

సీతమ్మతో పాటు ఉన్న కొందరు రావణుడిని లొంగిపోయారు, అట్లా లోకంలో ఎందరో బద్ద జీవులు సంసారంలో ఉండిపోతున్నారు. అయితే సీతమ్మ రాముడే రావాలి అని అనుకున్నట్లు, కొందరు ముముక్షువులు భగవంతునికోసం ఎదురు చూస్తుంటారు. రాముడు మొదట హనుమంతుడిని ఒక ముద్రిక ఇచ్చి పంపి మార్గాన్ని సుగమనం చేసాడు. అయితే భగవంతుడు నేరుగా రాడు, మొదట ఒక గురువుని మన కోసం పంపి మనకి మార్గాన్ని చూపిస్తాడు. ఈ శరీరమనే లంకలో పడి ఉన్న మనం మనస్సనే రావణుడికి లొంగక రాముడికే శరణాగతి చేస్తే అప్పుడు రాముడు పంపిన హనుమవలె ఒక ఆచార్యుడు మన వద్దకు వస్తాడు. భగవంతుని గురించి చెప్పగలిగిన వాడు హనుమ, సదాచార్యుడు మనకు భగవంతుని గురించి వర్ణిస్తాడు, భగవంతుడు అనుగ్రహించిన చిహ్నాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం మన అంగీకారం తెలియజేయాలి, ఒకరిపై దోశాన్ని పెట్టక మనం స్థితికి కారణం మనమే అని గుర్తించి, రాముడే కాపాడాలని కోరాలి. హనుమంతుడు వెళ్ళి రాముడు వచ్చి సీతమ్మకు చెర నుండి బయట పడేట్టు చేసాడు.

అట్లా హనుమ ద్వారా జరిగిన కాండ కనుక ఆత్మ ఎందుకు ఈ చిక్కులో పడింది అని తెలియజేసేది, ఇందులోంచి విడిపించేది ఎవరు, ఇక్కడినుండి చేరాల్సిన చోటేది అనే జ్ఞానాన్ని ఇస్తుంది ఈ కాండ. అది అసలైన జ్ఞానం. మిగతావి కొంతసేపు ఉండే ఆనందాలే, భగవంతుడిని చేరితే మాత్రమే వస్తుంది. గురువు మనకు ఈ సంసారాన్ని దాటి తరింపజేసే ఉపకారం చేస్తే మనకు అసలైన ఆనందాన్ని కలిగించినట్లు అవుతుంది. ఆత్మ సౌందర్యం, శరణాగతిచేయించే ఆచార్య సౌందర్యం, భగవంతుని సౌందర్యం అన్నింటిని తెలిపేది కనుక ఈ కాండకు సుందర కాండ అని పేరు.

యుద్ద కాండ

శరణాగతి గొప్పతనం

హనుమంతుడు సీతను వెతికి సీతమ్మ సమాచారాన్ని రామునికి అందిస్తాడు. ఆతరువాత సముద్రాన్ని ఎట్లా దాటాలి అని సముద్రతీరానికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో విభీషణుడు వస్తాడు. రావణాసురుడి పరివారంలో ఒకడు, అసలు ఆ వంశంలో తప్పి పుట్టాడు. ఈ విషయం వాళ్ళే అనుకొనే వారు. వారి సోదరి సూర్పణక రామ చంద్రుడిని కలిసినప్పుడు తన గురించి తెలుపుతూ లోకాన్ని ఏడిపించే రావణాసురుడి చెల్లెలిని అని చెప్పింది. నాకు మరొక అన్న కుంభకర్ణుడు ఉన్నాడు, నిద్ర పోతూ ఉంటాడు అని చెప్పింది. మరొకడు పొరపాటున మా వంశంలో పుట్టాడు విభీషణుడు 'నతు రాక్షస చేష్టితః విభీషణః ధర్మాత్మ' అని చెప్పింది. ఎప్పుడు ధర్మాన్ని ఆచరించేవాడు, అది మా వంశ ఆచారం కాదు అని చెప్పింది. అయినా తాను ఉన్న చోట శ్రేయస్సును కలిగించాలి అని కోరుకునేవాడు విభీషణుడు. అవకాశం దొరికినప్పుడల్లా రావణాసురుడి చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడాడు. సీతమ్మను జాగ్రత్తగా తిరిగి రామచంద్రునికి ఇవ్వు, అది నీకూ నీ కులానికి మంచిది అని చెప్పాడు. అనేక సార్లు చెపాడు. సామాన్యంగా మంచి చెప్పేవాళ్ళంటే పడదు, మన దోశాలను ప్రోత్సహించేవాళ్ళంటేనే మనకు ఇష్టం. నీకు దేవతలే పెద్ద లెక్క లేదు, మానవులు, కోతులు పెద్ద లెక్కనా అని అందరూ రావణాసురుడికి ఎప్పుడూ తన చుట్టూ చేరి చెప్పేవారు. విభీషణుడిని అవమానించి పంపారు. రావణా నేను వెళ్ళి పోతున్నాను అని 'సులభా పురుషం రాజన్ సతతా ప్రియ వాదినః' మనకి ఇష్టమైనట్టుగా మాట్లాడే వారు మన చుట్టూ ఉంటారు, కానీ వారు మనల్ని బాగుచేస్తారో నాశనం చేస్తారో తెలియదు. కానీ మన బాగుకోరే వారు దొరకడం చాలా కష్టం, వారు మన బాగు కోసం చెప్పిన మాటలు 'అప్రియతు పత్యస్య' చేదుగా పత్యం వలె అని పిస్తాయి, అని చెప్పి తనతో పాటు నలుగురు మిత్రులను తీసుకొని బయలుదేరాడు.
 
రామచంద్రుడు ఉండే సముద్ర తీరానికి చేరాడు. ఆయన రాక్షస కులంలో పుట్టినప్పటికీ రామచంద్రునికి శరణాగతి చేయాలని వచ్చాడు. సుగ్రీవునికి తన కోరికను విన్నపించాడు. పెద్దలను ఆశ్రయించేప్పుడు నేరుగా కాక వారి పరివారం ద్వారా ఆశ్రయించాలి అని తెలిసిన యోగ్యుడు. సుగ్రీవునికి ఆశ్రయం ఇద్దామని అనిపించలేదు. చివరికి రామచంద్రుడు వారందిరిని మెప్పించి నేను తప్పక రక్షించి తీరుతా అని ప్రతిజ్ఞచేసి వద్దు అని వాదులాడిన సుగ్రీవుడిని పంపి పిలిపించుకున్నాడు. విభీషణుడిని తన సోదరునిగా అంగీకరించాడు. రామ చంద్రుడు విభీషణుడిని కలిసాక తను కాపాడటానికి ఇంతమందిని ఒప్పించేసరికి నిన్ను ఆకాశంలోనే ఉంచాల్సి వచ్చింది అని "లోచనాభ్యాం పిభర్ణివా" తన కంటి చూపు తోనే ఒక్కసారి తాకేస్తున్నడా అన్నటు చూసాడట. అయితే విభీషణుడిని యుద్దంలో అవసరం వస్తాడేమోనని స్వీకరించాడా అంటే, అలా చేసి ఉంటే తను అంత దగ్గర చేయాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ ఆయనను తన ఆప్తుడిగా స్వీకరించాడు. ప్రక్కన లక్ష్మణస్వామి, సుగ్రీవుడు ప్రక్కన ఉన్నా సముద్రం ఎట్లా దాటాలో విభీషణుడినే అడిగాడు. విభీషణుడు చాలా అమాయకుడు. ఆయన తను రామునికి ఎట్లాంటి సహాయం చేసినవాడు కాదు, పెద్ద పలుకుబడి ఉన్నవాడు కాదు. అక్కడ తరిమేస్తే నిలవ నీడ లేక వచ్చినవాడు, తను రామునికి శరణాగతి చేస్తే వెంటనే ఫలితం పొందాడు. రాముడు ప్రసన్నం కావడానికి రామున్ని ఆశ్రయించడం అనేది ముఖ్యం తన విషయంలో, అందుకే శరణాగతి ఎంత గొప్పది అని చెప్పి తాను ఎట్లా అయితే రక్షణ పొందాడో రామున్ని కూడా సముద్రానికి శరణాగతి చేయమని సలహా ఇచ్చాడు. సముద్రుడు రాముడు చేసే శరణాగతికి అర్హుడా కాదా అని కూడా చూడలేదు. విభీషణుడి మాట వెంటనే విన్నాడు. ఇది రామునికి విభీషణుడి యందలి ప్రేమ. శరణాగతి ఎవరు చేసినా ఫలిస్తుంది అని చెబుతారు. భరతుడు చేసిన శరణాగతి పద్నాలుగు ఏండ్ల తరువాత ఫలించింది, కానీ విభీషణుడికి వెంటనే ఫలితం లభించింది.

 
భగవంతుడిని ఆశ్రయించడానికి  పెద్ద కొండలు ఎత్తాల్సిన అవసరం లేదు, యోగాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు, మనం ఒక్కసారి మనస్సులో భగవంతుడు నాకు అనుకూలుడు అని అనుకుంటే చాలు. భగవంతుడు తప్ప మరొకడు ఉద్దరించేవాడు లేడు అని ముందు గ్రహించాలి. భగవంతుడికి శరణాగతి చేస్తున్నా అని నోరు తెరిచి చెప్పాలి. భగవంతునికి ఆమాత్రం తెలియదా అని అనుకుటాం. కానీ ఆ భగవంతుడు మనకు మనస్సును ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. వాటిని మనం ఆయన కోసం వాడాలి, భగవంతుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని చెప్పాలి. "రాఘవం శరణం గతః" అని ఆ మాట విభీషణుడు అన్నాడు. రాముడి ముందర, సుగ్రీవాదుల ముందర వ్యక్తం చేసాడు. నేను రావణుడు తరువాత పుట్టిన నీచుడిని అని చెప్పాడు. రామచంద్రుడు తన హృదయానికి హృదయంగా స్వీకరించాడు. సముద్రుడికి శరణాగతి చేయాలో వద్దో ఆలోచించలేదు. శరణాగతి చేసాడు, అట్లా మూడు రోజులు వేచి చూసాడు. సముద్రం స్పందించలేదు, వెంటనే లక్ష్మణుడితో ఇలాంటి వానికి తల వంచడం తప్పు, ఇలాంటి సముద్రం అనేది ఒకటి ఉంటుంది అనేదే లేకుండా చేస్తా అని అస్త్రాలని తీసాడు. వెంటనే సముద్రుడు వచ్చాడు. మర్యాదలు పెట్టినవాడిని నివ్వూ, నీవు నాకు శరణాగతి చేయడం ఏమిటి అని సముద్రుడు చెప్పాడు. కావాలంటే నాలో ఉన్న లొసుగులు చెబుతా అని మీలో నలుడు చేతితో దేన్ని తాకి సముద్రంలో వేసినా తేలుతుంది, కనుక ఆ నలుడితో సేతువును నిర్మించుకోండి అని సలహ ఇచ్చాడు. అప్పుడు కొండలు, చెట్లు, రాల్లు అన్నింటిని నలుడు స్పృశించి వేస్తే సేతువు తయారు అయ్యింది.
 
 
మనది రాముడిని విశ్వసించిన జాతి కనక, నీదైన లోకానికి క్షేమం కలిగేట్టు చేసుకో అని విన్నపించుకుందాం.