బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. అయితే ఇవి పైన పడితే దోషనివారణకు కంచి క్షేత్రం వరదరాజపెరుమాళ్ ఆలయంలోని బంగారుబల్లి, వెండి బల్లిని తాకాలి. వీటిని తాకితే ఆ దోషాలు వెళ్లిపోతాయని పెద్దలు చెబుతారు. దీనికి సంబంధించిన పురాణగాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యులుగా ఉన్న బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా వ్యాప్తిలో వుంది.
Thursday, 19 January 2017
Wednesday, 11 January 2017
నచికేతుడు - యముడు
వేదాంతాలుగా పేరొందిన ఉపనిషత్తుల్లో అక్కడక్కడా కొన్ని కథలు కనిపిస్తుంటాయి. వాటిలో సత్యకామజాబాలి, నచికేతుని కథలకు చాలా ప్రాధాన్యం ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని జాబాలి చెబితే, అన్నమాటకు కట్టుబడాలని నచికేతుని కథ తెలియజేస్తుంది.
నచికేతుని కథ కఠోపనిషత్తులో కనిపిస్తుంది. నచికేతుని తండ్రి పేరు వాజశ్రవుడు. అతడు గౌతముని వంశానికి చెందిన బ్రాహ్మణుడు. వాజశ్రవుడు ఒకసారి విశ్వజిత అనే యాగాన్ని సంకల్పించాడు. యాగం పూర్తయిన తర్వాత దానాలు చేయడం మొదలు పెట్టాడు. చిన్నపిల్లవాడైన నచికేతుడు తండ్రి దగ్గరకు వెళ్లి, ‘నాన్నా.. మరి నన్నెవరికి దానం చేస్తావు..?’ అని పదే పదే అడగసాగాడు. విసిగెత్తిన వాజశ్రవుడు పొరపాటున ‘నిన్ను యముడికి దానం చేశాను పో..’ అంటాడు.
తండ్రి మాట ప్రకారం తనకు తాను యమునికి అర్పించుకునేందుకు బయల్దేరాడు. తండ్రి ఎంత వారించినా వినకుండా యమలోకానికి వెళతాడు. కానీ, అక్కడ నచికేతుడికి యముని దర్శనం కలగదు. మనుషుల పాపపుణ్యాలు లెక్కకడుతూ, ఆయుష్షు తీరిన వారి ప్రాణాలను హరిస్తూ యముడు క్షణం తీరిక లేకుండా ఉంటాడు. మూడు రోజుల తర్వాత యమలోకం ద్వారం దగ్గర ఉన్న నచికేతుడిని గమనిస్తాడు యముడు.
బాలుడ్ని చూసి ‘ఇక్కడ నీకేం పని’ అని అడుగుతాడు యముడు. తండ్రి మాటను నిలబెట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు నచికేతుడు. ‘నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం కుదరదంటాడు యముడు. నచికేతుడి సత్యనిష్ఠకు ముచ్చటపడిన యముడు ఏదైనా కోరుకోమని అంటాడు.
అప్పుడు నచికేతుడు ‘మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు..?’ అని అడుగుతాడు. ఓ బాలకుడు మరణ రహస్యం తెలపాల్సిందిగా అడగడంతో యముడికి ఆశ్చర్యం కలుగుతుంది. ‘నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. జనన మరణాల చట్రం అనేది జ్ఞానులకే అంతుచిక్కని రహస్యం’ అని అంటూ.. మరేదైనా కోరుకోమని అడుగుతాడు. కానీ, నచికేతుడు పట్టిన పట్టు విడువడు. తనకు ఆత్మ తత్వాన్ని తెలపాల్సిందిగా కోరుతాడు.
ఆ బాలుడి పట్టుదలను మెచ్చిన యముడు.. ‘మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా.. అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలు చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను తీర్చుకోలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు..?’ అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత నచికేతుడు యముడి ఆజ్ఞ మేరకు తిరిగి ఇంటికి వెళ్లిపోతాడు. ఆత్మజ్ఞానం గురించి యముడికీ, నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది.
ధర్మసూక్ష్మం
పూర్వం త్రేత, ద్వాపరయుగాల సంధిలో ప్రజలు చేసిన పాపాల వల్ల వర్షాలు లేక పన్నెండేళ్ళపాటు కరువు సంభవించింది. భూమి బీటలు వారింది. ఏరులూ, చెరువులూ, కుంటలూ ఎండిపోయాయి. వ్యవసాయపు పనులు మందగించాయి. చెట్లూ, లతలూ వసివాడిపోయాయి. పశువులు మేత లేక చచ్చిపోయాయి. రాజులు ధర్మం తప్పి ప్రజల ధనధాన్యాల్ని లాక్కున్నారు. యాగాలూ, దేవతార్చనలూ కుంటుపడ్డాయి. వర్ణాశ్రమ ధర్మాలు తప్పిపోయాయి. తినటానికి తిండి లేక జనులంతా మలమల మాడసాగారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలతో ఘోరంగా ఉంది.
ఆ సమయంలో ఒకసారి విశ్వామిత్ర ఆకలికి ఓర్చుకోలేక, తిండి కోసం యాచించి, ఎక్కడా దొరకక ఆకలిదప్పులతో తల్లడిల్లి పోయాడు. కొంచెం దూరం అలాగే వెళ్ళేసరికి అక్కడ కొన్ని పూరిగుడిసెలు కన్పించాయి. చుట్టూరా పశువుల ఎముకలు గుట్టలు! కుక్కల పుర్రెలు! పరమ అసహ్యంగా వుంది. దుర్గంధం ముక్కు బ్రద్ధలు చేస్తోంది. అక్కడికి వచ్చేసరికి విశ్వామిత్రుడిలో అడుగుతీసి అడుగువేసే శక్తి కూడా పోయింది. కుప్పకూలిపోయాడు.
"అయ్యో! ప్రాణం పోయేటట్టుంది! ఎలాగైనా ప్రాణం నిలుపుకోవడం పరమధర్మం. ఇప్పుడు ఏం ఉపాయం ఉంది?" అని ఆలోచించటం మొదలుపెట్టాడు.
అటూ ఇటూ గాలించి చూసేసరికి అప్పుడే చర్మం ఒలిచి, గాలికి ఆరబెట్టిన కుక్కమాంసం కనిపించింది. విశ్వామిత్రుడికి ప్రాణం లేచివచ్చింది. కానీ మళ్ళీ అంతలోనే విచారం కలిగింది.
"ఇది తప్ప ప్రాణాల్ని రక్షించుకోటానికి గత్యంతరం లేదిప్పుడు. ఇది కూడా అపహరించి తినవలసిన దుర్గతి పట్టింది! ప్రాణం కాపాడుకునేందుకు వేరే ఉపాయమేదీ లేనప్పుడు దొంగతనం చేయడం, నీచులధనం ఆశించటం తప్పు కాదన్నారు. ఇదే మంచి అదను. అర్ధర్రాతి సమయం! అందరూ నిద్రపోతున్నారు." అనుకుని నిస్సత్తువగా పాకుతూ వెళ్ళి ఆ కుక్కమాంసం పట్టుకుని లాగాడు విశ్వామిత్రుడు. అక్కడకు దగ్గరలోనే పడుకున్న బోయవాడు అలికిడికి నిద్రలేచాడు. విశ్వామిత్రుణ్ణి చూశాడు.
"ఎవడురా నువ్వు. నేను నిద్రపోతున్నాననుకుని మాంసం దొంగిలిస్తున్నావా? నీ ప్రాణాలు తీస్తాను వుండు" అని ముని మీదకు వచ్చాడు వాడు.
విశ్వామిత్రుడు గడగడలాడిపోయాడు. "నేను విశ్వామిత్రుణ్ణి " అన్నాడు హీనస్వరంతో.
కిరాతుడు అదిరి పడ్డాడు. భయపడిపోయాడు. కన్నీరు కారుస్తూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు.
"మహాత్మా! ఎవరో అనుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడాను. తప్పు క్షమించండి! అయినా స్వామీ ఎందుకిలా చేస్తున్నారు? దీని అంతరార్ధమేమిటి?" అని వినయంగా అడిగాడు.
నాయనా! ఆకలితో శరీరం దహించుకుపోతుంది. పాపమని తెలిసి కూడా గత్యంతరం లేక ప్రాణం రక్షించుకోడానికి ఈ కుక్క మాంసం దొంగిలించబోయాను" అన్నాడు విశ్వామిత్రుడు.
"అయ్యో! మృగాలన్నిటిలో నీచమైనది కుక్క. దీని మాంసం తిని ధర్మహాని ఎందుకు తెచ్చుకుంటారు? మరో మార్గం వెతుక్కోండి మహాత్మా" అన్నాడు బోయ.
"ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏం చేసినా ధర్మమే! అదీగాక సర్వభక్షకుడైన అగ్నిహోత్రుడు నాలో వున్నాడు. అగ్నిస్పర్శతో సర్వదోషాలూ నశిస్తాయి. బతికివుంటే తపస్సు వల్లా విద్యవల్లా పాపం పోగొట్టుకుంటాను. ఈ మాంసం ఇప్పుడు నా ప్రాణాధారం. నువ్వెన్ని చెప్పినా తినక మానను" అన్నాడు.
"ఇది చాలా నీచం స్వామీ!" అన్నాడు కిరాతుడు మళ్ళీ.
"అగస్త్యుడు రాక్షస మాంసం తిన్నాడు. అంతమాత్రంచేత ఆయన తేజస్సూ, పెంపూ నశించాయా? నా ఆత్మ బ్రహ్మజ్ఞానం కలది. అందుచేత నేను ఈ మాంసం తినడం వల్ల నాకు ఏ పాపమూ అంటదు. నువ్వు మాత్రం నాకు అడ్డు రాకు" అన్నాడు విశ్వామిత్రుడు.
"అయ్యా! మాంసం పోతుందనే చింతేలుదు నాకు. ఈ పనివల్ల మీకు తేజోహాని కలుగుతుందని దిగులుగా ఉంది" అన్నాడు బోయ.
"నాయనా! నీకు నా మీద దయ అనేది వుంటే ఈ మాంసాన్ని నువ్వే నాకు ఆహారంగా ఇచ్చి ప్రాణాలు నిలబెట్టి పుణ్యం కట్టుకో. దానివల్ల నాకు దొంగతనం చెయ్యవలసిన అవసరమూ ఉండదు" అన్నాడు ముని.
"అయ్యా! మహిమాన్విత పుణ్యదీప్తుడవు నువ్వు. నీచుడైన నాదగ్గరనుంచి ఏదైనా యాచించటం. నాకు భయంగా వుంది స్వామీ! మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి" అంటూ బోయ కుక్కమాంసం ఇచ్చేశాడు.
దాన్ని తిని ప్రాణం నిలుపుకుని వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు.
తరువాత ఇంద్రుడు కరువుతీరేలా వర్షించాడు. విశ్వామిత్రుడు నియమంతో తపస్సు చేసి తన దోషాన్ని పోగొట్టుకున్నాడు.
కనుక ఆపద సమయాలలో అనుసరించతగిన ధర్మాలు సాధారణ ధర్మాలకు భిన్నంగా వుంటాయని తెలుసుకోవాలి.

వీరులకు ఉత్తమ లోక ప్రాప్తి.
ధర్మరాజు " పితామహా యుద్ధంలో వీర మరణం చెందిన వారికి ఎలాంటి లోకములు ప్రాప్తిస్తాయి ? " అని అడిగాడు.
భీష్ముడు అంబరీష ఇంద్రుల మధ్య ఈ విషయంలో జరిగిన సంవాదం వినిపించాడు " ధర్మనందనా ! పూర్వం అంబరీషుడు అనే మహారాజు ఎన్నో యజ్ఞ యాగాదులు చేసి పుణ్యం సంపాదించి మరణానంతరం స్వర్గలోకం వెళ్ళాడు. స్వర్గలోకంలో తన దగ్గర పరిచారకుడు సుదేవుడు ఉజ్వలమైన విమానం ఎక్కి తిరగడం చూసి దేవేంద్రుడిని చూసి " దేవేంద్రా ! నా దగ్గర పరిచారకుడు ఎటు వంటి యజ్ఞయాగములు చెయ్యకనే ఎలా నా కంటే అధికంగా స్వర్గసుఖములు అనుభవిస్తున్నాడు " అని అడిగాడు.
ఇంద్రుడు " సుదేవుడిని గురించి ఇలా చెప్పాడు " పూర్వం శృతశృంగుడు అనే రాక్షసునికి సదముడు, వదముడు, దముడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు నీ మీద దండెత్తినప్పుడు నీవు సుదేవుడిని వారితో యుద్ధం చెయ్యడానికి పంపుతూ " వస్తే విజయంతో రా లేకుంటే ప్రాణంతో తిరిగి రాకు " అని చెప్పావు. వారి గురించి చారుల వలన తెలుసుకున్న సుదేవుడు వారి మాయోపాయములను గురించి తెలుసుకుని వారిని జయించడం సాధ్యం కాని పని అని తలచి సైన్యమును వెనుకకు పంపి శివుని స్మరించి తన తలను శివుడికి అర్పించడానికి ఉద్యుక్తుడై కత్తి పైకెత్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై " మహావీరా! నీ వంటి వాడికి ఇది తగదు. ఎందుకిలా చేస్తున్నావు " అని అడిగాడు.
సుదేవుడు " శంకరా ! శత్రువు బలం ముందు నా పరాక్రమం పనికిరాదని తెలుసుకుని జననష్టం కావడం ఇష్ట పడక ఇలా చేసాను " అన్నాడు.
అప్పుడు శివుడు అతడికి దివ్యరధమును, దివ్యధనస్సును, దివ్యమైన అంబుల పొదిని ఇచ్చి ఏ మాత్రం కాలు కింద పెట్టకుండా శత్రుసంహారం చెయ్యమని చెప్పాడు. సుదేవుడు ఉత్సాహంగా వెళ్ళి సదుముడు, దముడిని యుద్ధంలో సంహరించాడు. సోదరుల మరణానికి కోపోద్రేకుడైన విదముడిని ఎదుర్కోవాలని శివుడు చెప్పిన మాట మరచి రధము దిగి విదముడిని ఎదుర్కొని ఒకరిని ఒకరు కత్తితో నరిక్కుని ఇద్దరూ చనిపోయారు. రాక్షససైన్యం చెదిరి పోయింది నీకు విజయం చేకూరింది. ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా వీర మరణానికి సాటి రావు " అని ఇంద్రుడు అంబరీషుడికి చెప్పాడని " భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.
ధర్మనందనా ! ఒక సారి జనకుడికి ప్రత్యర్ధుడికి యుద్ధం సంభవించింది. అప్పుడు జనకుడు తన సైన్యముతో " మహా వీరులారా ! మీకు వీరమరణం చెందిన వారికి ప్రాప్తించే సకల సుఖాలకు స్థానమైన స్వర్గం కావాలా ! లేక పిరికి వారికి కలిగే నరకం కావాలా !"అని అడిగాడు. జనకుని అంతర్యం తెలుసుకున్న వీరులు ప్రాణాలకు తెగించి పోరాడి జనకునికి విజయం సాధించి పెట్టారు. కనుక ధర్మనందనా ! వీరుడికి స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి " అని భీష్ముడు చెప్పాడు.

జనమేజయుడు
సూర్యవంశ ప్రభువుల్లో పరీక్షిత్తు మహారాజు గొప్పవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఆయనకు వేటంటే చాలా ఇష్టం. ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. జంతువులను వేటాడి అలసిపోయాడు. బాగా దప్పికయింది. మంచినీటి మడుగుకోసం వెతుకుతూంటే శమీక మహర్షి అశ్రమం కనిపించింది.
లోపలికి వెళ్ళి " దాహంగా ఉంది. తాగేందుకు మంచినీళ్ళు కావాలి." అని అడిగాడు.
మహర్షి ధ్యానసమాధిలో ఉండడం వలన ఆశ్రమం లోపలికి ఎవరు వచ్చింది కూడా ఆయనకు తెలీలేదు. అందుకని సమాధానమివ్వలేదు.
శమీకుడి మౌనాన్ని పరీక్షిత్తు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ మహర్షి కింత అహంకారమా అనుకుని చచ్చిన పాము నొకదాన్ని ఆయన మెడలో వేశాడు.
అది తెలిసి కోపించిన శమీకుని కొడుకు శృంగి " తపోనిష్ఠలో ఉన్న నా తండ్రిపైకి ఎవరైతే పామును వేశారో వాళ్ళు సర్పరాజు తక్షకుడి కాటుతో ఏడు రోజుల్లోగా మరణిస్తారు." అని తీవ్రంగా శపించాడు.
శృంగి దేవీభక్తుడు. అతని మాటకు తిరుగులేకుండా పోయింది. తక్షకుడి కాటుతో పరీక్షిత్తు మరణించాడు.
అప్పటికి మహారజు కుమారుడు జనమేజయుడు చిన్నవాడు. మంత్రులే మహరాజుకు అంతిమసంస్కారం చేశారు. రోజులు గడుస్తున్నాయి. జనమేజయుడికి యుక్తవయస్సు వచ్చింది. మంచి ముహుర్తాన రాజ్యపాలన స్వీకరించాడు. అనతికాలంలోనే సమర్థుడైన రాజుగా పేరు పొందాడు. కాశీరాజు సువర్ణవర్మకు జనమేజయుణ్ణి గురించి విన్నప్పటినుంచీ అతన్ని తన అల్లుడుగా చేసుకోవాలని కోరికగా ఉండేది. సువర్ణవర్మ కుమార్తె వపుష్టకు కూడా జనమేజయుడే భర్త కావాలని ఉండేది. అనుకున్నట్టే జరిగింది. జనమేజయుడికీ, వపుష్టకీ ముల్లోకాలూ మురిసిపోయేలా వైభవంగా పెళ్ళి జరిగింది.
ఒకసారి జనమేజయుడు కొలువుతీరి వుండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి, పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి, బంగారుపళ్ళెంలో అయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు.
రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు. అ తరువాత వాళ్ళమధ్య చాలాసేపు కుశల ప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిత్తుమహారాజు ఎలా మరణించిందీ చెప్పాడు ఉత్తాంకుడు. రాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. సర్పాలన్నిటినీ సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.
"పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టుపెట్టిండి." అని అజ్ఞ జారీ చేశాడు.
అంతటితో ఆగక ఋత్విక్కులందర్నీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండని అడిగాడు. సర్పయాగం చెయ్యమని వాళ్ళంతా సలహా యిచ్చారు. క్షణాలమీద యగానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి.
ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆద్వర్యం వహించారు.
సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు. యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి అశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు. ఈ సంగతి ఋత్విక్కులకు తెలీక అసలైన శత్రువు తక్షకుడు చావునుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు. తన చెల్లెలు జరత్కారుప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు.
తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారుమహర్షిని పెళ్ళాడినందువల్ల జరత్కారుప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ భాద్యతను తన కొడుకు ఆస్తీకుడికి అప్పగించింది. అతను యాగం జరిగేచోటికి బయలుదేరాడు. తక్షకుడి జాడ తెలీక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతీ పట్టణంలో ఇంద్రుడితోపాటు సగం సింహాసనాన్ని అధిష్టించి ఉన్నాడు. అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది.
"ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా?'' అనుకుని ఇంద్రుడూ, ఇంద్రసింహాసనమూ, తక్షకుడూ అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు. ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడూ, తక్షకుడూ నిలువెల్లా వణికిపోయారు.
అదే సమయానికి ఆస్తీకుడు యాగశాలను చేరుకున్నాడు. యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తీకుడికి జనమేజయుడు ఉచితరీతిన మర్యాదలు చేసి, "కార్యార్థులై వచ్చినట్టున్నారు. నావల్ల కాదగిన సహాయమేమిటో చెప్పండి. తప్పకుండా చేస్తాను." అన్నాడు వినయంగా.
"సర్పయాగాన్ని తక్షణమే నిలుపుచెయ్యాలి".
జనమేజయుడు నిశ్చేశ్టుడయ్యాడు. అయినా ఆడినమాట తప్పడానికి వీల్లేదు. తనవల్ల కాదగిన సాయమేదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవల్సిందే.
"సర్పయాగం ఆగిపోయింది".
యాగంలో మృతిచెందిన పాములన్నిటికీ ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తీకుడు.
"జీవహింసకు మించిన పాపం లేదు. మనస్సులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్షాకార్పణ్యాలు నిండిన మనస్సులోకి వెలుగు చొరబడదు. బుద్ధినీ, అంతరంగాన్నీ విశాలం చేసుకో." అని ఆస్తీకుడు జనమేజయుడికి ఉపదేశించాడు.
జనమేజయుడికి జ్ఞానోదయమైంది. జనమేజయుడు సర్పయాగం నిలుపుచేసిన తరువాత అశ్వమేధయాగం చేశాడు.
వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమేజయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు. "నీ తండ్రిని నీకు చూపిస్తానుండమ"ని స్వర్గంలో ఉన్న పరీక్షిత్తుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు. అంతే!! పరీక్షిత్తు మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమేజయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
జనమేజయుడి ఆనందానికి అవధుల్లేవు. వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు. తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెనువెంటనే అంతర్హితుడయ్యాడు. వ్యాసమహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదీ జనమేజయుడి కథ.
ఈ జనమేజయుడికే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసాక దాదాపు ముప్ఫయి ఆరేళ్ళు పాండవులు రాజ్యపాలన చేశారు. అనంతరం పరీక్షిత్తుకి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. పరీక్షిత్తు సుమారు అరవై సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఆ తరువాత జనమేజయుడు పరిపాలించాడు.

విధి బలీయం...
జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు, అభిమన్యుడి మనుమడు. ఓ సర్పం మూలంగా తన తండ్రి మరణించడంతో యావత్తూ సర్పజాతినే నిర్మూలించేందుకు సర్పయాగం చేయించి, చరిత్రకెక్కినవాడు. అటువంటి జనమేజయుడు ఒకసారి వ్యాసమహర్షిని సందర్శించాడు.
భక్తితో ఆయనకు నమస్కరించి, ‘‘మహామునీ, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందని మీకు ముందే తెలుసుకదా, ఎంతో తపశ్శక్తి సంపన్నులైన మీరు అది తెలిసి ఉండి కూడా, ఆ సంగ్రామాన్ని ఎందుకు ఆపలేకపోయారు? మీరు ఆపి ఉంటే ఎంతో జననష్టం, ధనష్టం తప్పి ఉండేది కదా?’’ అని అడిగాడు.
అందుకు వ్యాసులవారు నవ్వుతూ ‘‘జనమేజయా! విధి ఎంతో బలీయమైనది. దానిని ఎవరూ తప్పించలేరు. ఆ మాటకొస్తే శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడు కదా! ఆయనే యుద్ధాన్ని నివారించలేకపోయాడు కదా’’ అన్నాడు.
కాని, జనమేజయుడు మాత్రం ‘‘మీరు చెబితే ధర్మరాజు తప్పక విని ఉండేవాడు, దుర్యోధనుడు కూడా సంధికి ఒప్పుకునేవాడు, సమర్థులై ఉండీ మీరు చూస్తూ ఊరుకున్నారు. జరగబోయేదాని గురించి నాకు గనక ముందుగా తెలిసి ఉంటే, నేను దానిని తప్పక నివారించి ఉండేవాడిని.’’ అంటూ వ్యాసుడిని తూలనాడాడు.
విసిగిపోయిన వ్యాసుడు ‘‘సరే, నీకో సంగతి చెబుతాను. జాగ్రత్తగా విను. నీవు పొరపాటున కూడా ఉత్తరం వైపున ఉన్న అరణ్యానికి వెళ్లకు. వెళ్లినా, అక్కడ నీకు కనిపించిన అడవిపందిని వేటాడకు. ఒకవేళ వేటాడినా, అప్సరసగా మారిన ఆ పందిని వివాహమాడకు. వివాహమాడినా, మేలుజాతి గుర్రాలను కొనకు. ఒకవేళ కొన్నా, ఆమెతో కలసి యజ్ఞం చేయకు. చేసినా, వయసులో ఉన్న రుత్విజులను నియమించకు... అలా చేస్తే నీకు ఎన్నో కష్టనష్టాలు కలుగుతాయి.’’ అని హెచ్చరించాడు.
సరేనంటూ వ్యాసుడికి నమస్కరించి, అక్కడినుంచి వెళ్లిపోయాడు జనమేజయుడు ఇది జరిగి చాలా ఏళ్లు గడవడంతో రాజ్యపాలనలో పడి, తనకు, వ్యాసమునికీ మధ్య జరిగిన సంభాషణను పూర్తిగా మరచిపోతాడు. తర్వాత కొంతకాలానికి జనమేజయుడికి తన రాజ్యప్రజలు ఓ అడవిపంది వల్ల పంటనష్టం, ప్రాణనష్టం జరిగి తంటాలు పడుతున్న విషయం తెలుస్తుంది.
ఆ పంది తన రాజ్యానికి ఉత్తర దిక్కునే ఉన్న అడవినుంచి వస్తోందని తెలిసి వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ తనకు కనిపించిన అడవిపంది మీద బాణాల వర్షం కురిపించి, దానిని సంహరిస్తాడు. అప్పుడు ఆ అడవిపంది కాస్తా ఓ అందమైన అమ్మాయిగా మారుతుంది. తాను ఓ అప్సరసనని, శాపవశాన ఇలా అడవిపందిగా మారానని, తనను వివాహం చేసుకోమని బలవంతం చేస్తుంది. రాజు ఆమెను పెళ్లాడి, రాజ్యానికి తీసుకెళతాడు. అప్పుడు గుర్తొస్తుంది జనమేజయునికి తాను వ్యాసునికిచ్చిన మాట. కానీ, చేసేదేమీలేక మిన్నకుండిపోతాడు. ఆ తర్వాత మరికొద్దికాలానికి మేలుజాతి అశ్వమొకటి బేరానికి వస్తే బోలెడంత ధనమిచ్చి దానిని కొంటాడు.
సకల శుభలక్షణాలున్న ఆ అశ్వం ఉంది కాబట్టి అశ్వమేధయాగం చేయమని చాలామంది సలహా ఇస్తారు. దాంతో జనమేజయుడు అశ్వమేధయాగం ఆరంభిస్తాడు. కనీసం ఇక్కడైనా జాగ్రత్తగా ఉందామని బాగా అనుభవజ్ఞులైన వృద్ధ రుత్విజులను యాగానికి ఆహ్వానిస్తాడు. తీరా ముహూర్తం సమీపించాక వారిలో కొందరు జబ్బుపడి రాలేకపోవడంతో విధిలేక కొందరు యువ రుత్విజులను నియమిస్తాడు. యజ్ఞం జరిగే సమయానికి జనమేజయుడి భార్య అక్కడకు వచ్చి, తన మేలిముసుగు తీసి, ఆ రుత్విజులను చూసి అందంగా నవ్వుతుంది. దాంతో మనసు చలించిన రుత్విజులు యాగం మీద దృష్టి పెట్టలేక మంత్రాలు తప్పుగా చదువుతూ, యాగప్రక్రియను కూడా తప్పుగా జరిపిస్తారు. యాగం లోపభూయిష్టంగా జరగడంతో, యాగకర్త అయిన జనమేజయునికి కుష్టువ్యాధి వస్తుంది. రాజ్యాన్ని కోల్పోతాడు. అప్పుడు పశ్చాత్తాపంతో కంట తడిపెడుతూ, విధి ఎంత బలీయమైనదో కదా అని వేదవ్యాసుని తలచుకుని బాధపడతాడు జనమేజయుడు.

రాముడా? రామ నామమా?
రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యానగరానికి విచ్చేసిన రాముడు ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పాలన సాగిస్తున్నాడు. ప్రతిరోజూ సభ ఏర్పాటు చేయడం, ఆ సభకు సామాన్యప్రజానీకంతో సహా పెద్దలు, మునులు విచ్చేసి ధార్మిక విషయాల మీద చర్చలు చేయడం నిత్యకృత్యం.
ఓ రోజు అలాగే సభ జరుగుతోంది. ఆ సభకు నారద, వశిష్ట, విశ్వామిత్రులు కూడా విచ్చేశారు. ముందుగా నారద మహర్షి సభలో ఒక సందేహం లాంటి ప్రశ్నను సంధించాడు. భగవంతుడు గొప్పవాడా, భగవంతుడి నామం గొప్పదా అన్నదే ఆ సందేహం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం అందరూ మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో తర్జన భర్జనలు చేశారు. ఆఖరికి వశిష్ట విశ్వామిత్రులకు కూడా సరైన సమాధానం ఇదీ అంటూ ఇదమిత్థంగా తేల్చి చెప్పడం సాధ్యం కాలేదు. దాంతో అందరూ కలసి నారదుణ్ణే అడిగారు, ‘ఆ ప్రశ్నకు సమాధానం మీరే చెప్పండి మహర్షీ!’ అని.
‘‘రాముని కన్నా, రామనామమే గొప్పది. ఇందులో సందేహించవలసిన పనిలేదు.’’ అని చెప్పాడు నారదుడు. ‘‘కావాలంటే నిరూపిస్తాను’’ అంటూ హనుమను పిలిచి, ‘‘హనుమా! సభానంతరం నువ్వు ఒక్క విశ్వామిత్రుడికి తప్ప సభలోని అందరికీ నమస్కారం చేయి’’ అని చెవిలో చెప్పాడు.
సరేనన్నాడు హనుమ.
సభముగిశాక నారదుడు చెప్పినట్లుగానే హనుమ సభలోని పెద్దలందరికీ భక్తి గౌరవాలతో వినయంగా నమస్కరించాడు. విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయనకు నమస్కరించ కుండానే వెనుదిరిగాడు.
కాసేపయ్యాక నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘చూశావా విశ్వామిత్రా, ఆ హనుమకు ఎంత పొగరో! అందరికీ నమస్కరించి, నిన్ను మాత్రం విస్మరించాడు.’‘ అన్నాడు రెచ్చగొడుతున్నట్లుగా.
విశ్వామిత్రుడు కోపంతో మండిపడ్డాడు. రాముడి వద్దకెళ్లి, ‘‘రామా! మదాంధుడైన ఆ హనుమను రేపు సూర్యాస్తమయంలోగా సంహరించు! ఇది నా ఆజ్ఞ.’’ అన్నాడు.
ఆ మాటలకు నిర్ఘాంతపోయాడు రాముడు. ‘‘ఎంతటి విపత్కర పరిస్థితి! నాకు ఎంతో ఇష్టుడైన హనుమను నా చేతులతో నేను చంపుకోవడమా!? అదీ నిష్కారణంగా! చంపనంటే గురువాజ్ఞ మీరినట్లవుతుంది. ఇప్పుడేమిటి దారి?’’ అంటూ తలపట్టుకు కూర్చున్నాడు.
ఈలోగా హనుమను రాముడు చంపబోతున్నాడనే వార్త క్షణాలలో రాజ్యమంతా వ్యాపించింది. ఈ వింత సంఘటన గురించి ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకోసాగారు.
హనుమ వెంటనే నారదుడి వద్దకెళ్లాడు. ‘‘మహర్షీ మీ మాట వినే కదా, నేను ఈ పని చేశాను. దానికి ఇంతటి దారుణమైన శిక్షా?’’అని వాపోయాడు.
అందుకు నారదుడు ‘‘నీకేం భయం లేదు హనుమా! నేనున్నాను కదా, నువ్వు ఒక పని చెయ్యి, సూర్యోదయానికన్నా ముందే సరయూనదిలో స్నానం చేసి, ‘శ్రీరామ జయరామ జయజయ రామ’ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా చలించకు’’ అని చెప్పాడు.
నారదుడు చెప్పిన విధంగానే హనుమ తెల్లారేలోగా సరయూనదిలో స్నానం చేసి, భక్తిశ్రద్ధలతో నారదుడు చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు. తెల్లవారగానే ఏం జరుగుతుందో చూడాలన్న ఆసక్తితో నగర ప్రజలంతా గుంపులు గుంపులుగా సరయూనది ఒడ్డుకు చేరుకోసాగారు.
రాముడు ఒకసారి తన ప్రేమపూర్వక నయనాలతో తనకెంతో ఆప్తుడు, నమ్మిన బంటు, సఖుడు అయిన హనుమను చూస్తూ, నదిలో నడుము లోతు నీటిలో నిలిచి, రామమంత్రాన్ని తదేక దీక్షతో పఠిస్తున్న హనుమపై బాణాన్ని వదిలాడు. ఆశ్చర్యం! ఆ బాణం హనుమను ఏమీ చెయ్యలేకపోయింది. అలా సంధ్యా సమయం వరకు నిర్విరామంగా బాణాలు వదులుతూనే ఉన్నాడు రాముడు. ఆ బాణాలన్నీ ఒక్కొక్కటిగా నేలరాలిపోతున్నాయి కానీ, హనుమకు మాత్రం కించిత్తు కూడా హాని కలగడంలేదు. ఇలా లాభం లేదనుకుని చివరకు బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు రాముడు. దాంతో ప్రకృతి మొత్తం కంపించిపోసాగింది. ప్రజలంతా హాహాకారాలు చేయసాగారు.
ఇంతలో నారదుడు విశ్వామిత్రుని వద్దకెళ్లి, ‘‘మహర్షీ! చూశారా, రామ నామ మహిమ ఎంత గొప్పదో! ఆ మహిమకు రాముడు కూడా తలవంచక తప్పడం లేదు. బ్రహ్మాస్త్రం గనక నిర్వీర్యం అయిపోయిందంటే ఎన్నో ఉత్పాతాలు జరుగుతాయి. అన్నింటికీ మించి అది నీకూ, నీ శిష్యుడికీ కూడా ఎంతో అవమానకరం. హనుమ నీకు నమస్కరించకపోతే ఏమైంది చెప్పు. నీవే ఇక ఈ అస్త్రప్రయోగం చాలించమని నీ శిష్యుడికి చెప్పు’’ అని సలహా ఇచ్చాడు.
విశ్వామిత్రుడు ‘‘ఇక ఆపు రామా!’’ అనడంతో రాముడు ధనుర్బాణాలు కిందపడవేసి, హనుమను ప్రేమతో కౌగలించుకున్నాడు.

Subscribe to:
Posts (Atom)