Friday, 29 September 2017

దేవీనవరాత్రులు అలంకార విశేషాలు



Title
matter



దేవీనవరాత్రులు
భక్తితో దణ్ణం పెట్టుకుంటే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం.



మొదటిరోజు: స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.



నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి. ఈరోజు పఠించవలసిన 
శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్‌

భావం : ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!

ఫలమ్‌ : ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.



రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం.

దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా, పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది.

శ్లోకం : దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా!

భావం :  వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను  స్ఫటికమాలను ధరించి  జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ!

అర్చన, సందర్శన ఫలమ్‌ : ఉన్నతవిద్య, విశేషజ్ఞాన  సంపదలు చేకూరతాయి.

నివేదన  : కట్టెపొంగలి, దధ్యోదనం



శ్రీ గాయత్రీ అలంకారం దేవీనవరాత్రులు
సర్వతత్వ మయీం వందే గాయత్రీం వేదమాతరం అంటే సకల మంత్రాలకూ, అనుష్ఠానాలకూ, ఉపనిషత్తులకూ మూలం గాయత్రీదేవే.  శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. పంచభూతాలకూ ప్రతీకగా పంచముఖాలతో అమ్మవారు దర్శనమిస్తుంది.

న గాయత్య్రాః పరో మంత్రం
న మాతుః పరదైవతం
అంటే గాయత్రీ మంత్రాన్ని మించిన గొప్ప మంత్రం లేదు. అమ్మను మించిన దైవం లేదు అని అర్థం. కనుక గాయత్రీ రూపంలో అమ్మవారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను సందర్శించినట్లే.

ఫలమ్‌ : మంత్రసిద్ధి,
వృత్తి : ఉద్యోగాలలో ఉన్నత స్థానం.
నివేదన : గుడాన్నం (బెల్లం  పరమాన్నం)

శ్లోకం: యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత
నమస్తస్మై నమస్తస్మై నమస్తస్మై నమో నమః

భావం: ఓ జగజ్జననీ! సకల చరాచర జగత్తుయందు మాతృ
మూర్తిగా నిలిచి ఉన్న నీకు శతదా సహస్రకోటి నమస్సులు. 



నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి.

ఫలమ్‌: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి.

నివేదన : అప్పాలు,  షడ్రసోపేత  మహానైవేద్యం (ఓపిక లేనివారు  స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా  నివేదించవచ్చు)

శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి

భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ!



ఐదో రోజు లలితాత్రిపురసుందరీదేవి అలంకారం
శరన్నవరాత్రి ఉత్సవాల ఐదోరోజున ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి శ్రీలలితా త్రిపురసుందరిగా భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితాదేవి. ఈమెకే లలితాత్రిపురసుందరి  అని నామాంతరం ఉంది. శ్రీవిద్యోపాసనకులకు ఈ తల్లి ముఖ్యదేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో శ్రీచక్ర అధిష్టానశక్తిగా ఉంటుంది. పంచదశాక్షరి మంత్రానికి కూడా ఈమే అధిష్టానదేవత. సకల లోకాలకు అతీతమైన కుసుమకోమల రూపంలో చెరుకుగడ, విల్లు, పాశం, అంకుశాలను ధరించి ఇరువైపులా లక్ష్మీ, సరస్వతులు వీస్తుండగా భక్తులకు ప్రసన్నురాలై వరాలను అనుగ్రహిస్తుంది. సృష్టి, స్థితి, లయ కార్యాలకు ఈమె అనుగ్రహం తప్పనిసరి.

నిత్యం ఈమెను పూజించిన ముత్తయిదువులు అఖండ మాంగల్య సౌభాగ్యం పొందుతారు. సకల సంపదలు ఈ తల్లి అనుగ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి. శ్రీచక్రాన్ని అర్చించి, కుంకుమ పూజ చేయడం ద్వారా ఈ తల్లి ప్రసన్నురాలవుతుంది. ఇంద్రకీలాద్రిపై ఆదిశంకరులు శ్రీచక్రాన్ని స్వయంగా ప్రతిష్టించి, ఇక్కడ నిత్యం కుంకుమపూజ జరిగేలా ఆదేశించారు. అంతకుపూర్వం ఉగ్రస్వరూపిణిగా ఉన్న కనకదుర్గాదేవి నాటినుంచి శాంతరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తోంది. లలితాదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజున లలితా సహస్రనామ పారాయణ వీలైనన్ని సార్లు చేయాలి. అలాగే లలితా అష్టోత్తరం, స్తోత్రాలు, పంచరత్నాలు పఠించాలి.

మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి.
నివేదన: అమ్మకు గారెలు నివేదన చేయాలి. సువాసినులకు పూజచేసి,  మంగళద్రవ్యాలు అందించాలి.
ఫలం: దారిద్య్ర దుఃఖం తొలగి, సకల శుభాలు, ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయి.



ఆరో రోజు మహాలక్ష్మీదేవి అలంకారం
రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ వరద ముద్రలు ప్రదర్శిస్తూ  పులా గజరాజు సేవిస్తున్న తేజోమూర్తిగా శరన్నవరాత్రుల్లో ఆరోరోజున కనకదుర్గాదేవి భక్తులను మహాలక్ష్మీ అవతారంలో అనుగ్రహిస్తుంది. ఈ తల్లి సర్వమంగళకారిణి, సకల సౌభాగ్యప్రదాయిని, ఆనంద సంధాయిని. నిత్యం ప్రసన్నవదనంతో ఉంటుంది. అష్టలక్ష్ముల సమష్టిరూపంగా, సకల జీవకోటిలో, ప్రకృతిలో నిండి ఉన్న సకల లక్ష్మీస్వరూపంగా ఈమెను శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా’ అని చండీసప్తశతి చెబుతోంది.

డోలాసురుడనే రాక్షస సంహారం చేసిన శక్తిస్వరూపం ఈ దేవత. శక్తిత్రయంలో ఈమె మధ్యలో ఉంటుంది.  ఎరుపురంగు పూలతో అర్చించి, లక్ష్మీస్తోత్రం పారాయణ చేస్తే శీఘ్రఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మీ ప్రీతిగా పూర్ణాలు నివేదన చేయాలి. సువాసినులకు షోడశోపచారాలతో అర్చించి, శక్తికొద్దీ మంగళద్రవ్యాలు అందించాలి.
మంత్రం: ‘ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్షై్మ్య నమోనమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి
నైవేద్యం: పూర్ణాలు   
ఫలితం: సకలైశ్వర్య సిద్ధి.



ఏడవ రోజు శ్రీ మహాసరస్వతీ దేవి
ఈరోజు దుర్గమ్మ ధవళవస్త్రధారిణిౖయె సంగీత రస స్వరూపమైన మరాళ వాహనంపై తారాహారాలు కంఠాభరణాలుగా ధరించి జ్ఞానాధిష్ఠాన దేవత, వాగ్దేవిౖయెన శ్రీ మహాసరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన దుర్గాదేవిని చదువులతల్లి అయిన సరస్వతీదేవి రూపంలో అలంకరించటం విశేషం. శ్రీ సరస్వతీదేవి రూపంలో దుర్గమ్మను దర్శించుకుంటే విశేష జ్ఞాన సంపద కలుగుతుందని ప్రతీతి.

శ్లోకం : యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా
నమస్తస్మై నమస్తస్మై నమస్త్మై నమో నమః

భావం : సృష్టిలోని సమస్త జీవులయందు బుద్ధి రూపంలో ప్రకాశిస్తున్న ఓ జగన్మాతా నీకు మొక్కెదన్‌.
నివేదన : జీడిపప్పు, కొబ్బరి పులిహోర
ఫలమ్‌: బుద్ధి కుశలత, జ్ఞానసంపద, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు.



ఎనిమిదవ రోజు మహిషాసురమర్దిని
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున దుర్గాదేవి శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో ఇది ఆఖరి రోజు. దీనికే దుర్గాష్టమి అనే పేరు వాడుకలో ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం కోసం సకల దేవీ, దేవతల శక్తి స్వరూపంగా ఈ తల్లి ఆవిర్భవించింది. ఇది అత్యుగ్రరూపం. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. ఈ అవతారంలో అమ్మ సింహవాహనాన్ని అధిష్టించి ఉంటుంది. ఒక చేత త్రిశూలాన్ని ధరించి, మహిషుడిని సంహరిస్తున్న రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుంది. ఈ మూర్తిని ఉపాసించడం ద్వారా సకల భయాలు, శత్రుపీడ, రోగాలు దూరమవుతాయి.

విశ్వశాంతి కలుగుతుంది. శత్రువిజయాన్ని కాంక్షించేవారు ఈ తల్లిని ఉపాసించాలి. ఈ తల్లిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది. ఈరోజున చండీ సప్తశతీ పారాయణ, హోమం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
మంత్రం: ‘ఓం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా’ అనే మంత్రాన్ని జపించడం మంచిది.
నైవేద్యం: గారెలు, పులిహోర, పొంగలి



కనకదుర్గాదేవి
లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం.

శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ
సర్వశక్తి సమన్వితే!
భయేభ్యః ప్రాహివో దేవి
దుర్గేదేవి నమోస్తుతే!!

భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు.
ఫలమ్‌: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు.
నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం

మహిషాసురమర్దిని
బ్రహ్మ వరప్రసాదం చేత అరివీర భయంకరుడై ముల్లోకాలనూ గడగడలాడిస్తున్న మహిషాసురుణ్ణి సంహరించడానికి ముక్కోటి దేవతలనూ, మూడులోకాలనూ కాపాడేందుకు ముక్కోటి దేవతల ఆయుధ తేజస్సును గ్రహించి మహాశక్తి స్వరూపిణిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించినట్టుగా పురాణాలు తెలుపుతున్నాయి. లోకకంటకులైన ఎందరో రాక్షసులను సంహరించిన మహిషాసురమర్దిని అలంకరణలో దుర్గాదేవిని దర్శిస్తే అమ్మ అనుగ్రహంతో గ్రహబాధలు తొలగుతాయని ప్రతీతి.

శ్లోకం
దుర్గేస్మృతా హరసిభీతిమశేష జంతో స్వస్థైః స్మతామతి మతీం శుభాం దదాసి
దారిద్య్ర దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్తా
భావం: అమ్మా! నీ స్మరణ మాత్రం చేత మా భీతిని, భయాలను తొలగించి శుభాలను కలిగించి దారిద్య్రాన్ని, దుఃఖాలను కరుణతో తొలగిస్తూ తల్లిగా లాలించి పాలించే ఓ కరుణామయీ నిన్ను ఆర్ద్రతతో వేడుకుంటున్నాను.
నివేదన: నువ్వులు, బెల్లమన్నం
ఫలమ్‌: దీర్ఘరోగాలనుండి విముక్తులవుతారు. వ్యాపార లావాదేవీలయందు చిక్కులు తొలగిపోతాయి.



దానవత్వంపై దైవత్వం విజయం
పండగ
దుష్ట రాక్షసులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు జరుపుకునే పండుగే విజయదశమి.ఒక్కరూ విడిగా చేయలేని పనిని ఐకమత్యంగా, అందరి శక్తినీ ఒక్కచోట చేర్చితే ఎంతటి క్లిష్టమైన పనినైనా సాధించవచ్చని చెప్పే పండుగ ఇది. నిశ్చల చిత్తంతో అమ్మను పూజిస్తే అభీష్టాలు నెరవేరుతాయి. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి, ఆమెను ఆరాధించడమంటే ప్రకృతిని ఆరాధించడమే.
ఒక్కరోజు పూజతో సంవత్సర ఫలం
దసరా పర్వదినాలలో సింహవాహిని అయిన అమ్మవారిని షోడశోపచారాలతో అర్చించడం వల్ల సంవత్సరమంతా పూజించిన ఫలం దక్కుతుంది. తొమ్మిది రోజులు పూజించలేనివారు ఐదు రోజులు, అదీ వీలుకాని వారు మూడు రోజులు, అదీ కుదరని వారు కనీసం ఒక్కరోజయినా సరే ఆ దివ్యమంగళస్వరూపాన్ని దర్శనం చేసుకుని తీరాలి. అలా చేయడం వల్ల పాపాలన్నీ పటాపంచలవడంతోపాటు శత్రుజయం కలుగుతుంది. సకల శుభాలూ చేకూరతాయి. ఇక విజయదశమినాడు శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) దర్శించుకుని, ‘‘శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శనం’’ అని స్తుతించాలి. జమ్మిని పెద్దలకు ఇచ్చి ఆశీస్సులందుకోవాలి.
చెడుపై మంచి సాధించిన విజయం
దానవత్వంపై దైవత్వం సాధించిన విజయానికి చిహ్నంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం పోరాటం చేయడానికి దానవులు లేరు. కానీ మనం పోరాడి తీరవలసిన శత్రువులు మనలోనే ఉన్నారు. మనలోని దుర్గుణాతో పోరాడి విజయం సాధిద్దాం.
జమ్మిని ఎందుకు పూజిస్తారు?
శమీవృక్షానికీ, విజయ దశమికీ అవినాభావ సంబంధం ఉంది. శమీవృక్ష నీడ, శమీవృక్షపు గాలులు విజయ సోపానాలని నమ్మకం. శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు శమీవృక్షం కలపతోనే కుటీరం నిర్మించుకున్నాడని చెబుతారు. శమీవృక్షం విశిష్ఠతను పాండవులకు శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పి, వారి ఆయుధాలను ఆ వృక్షం మీద దాయడం వల్ల కలిగే శుభఫలితాలను వివరించడం వల్ల పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ దివ్యాస్త్రాలను జమ్మిచెట్టుపైనే దాచారు. అందుకే
శమీపూజ చేయడం, రైతులు, వివిధ వృత్తులవారు, కళాకారులు వారి వారి పనిముట్లను పూజించడం ఆచారం. తెలంగాణలో జమ్మిని బంగారం అంటారు. జమ్మి బంగారాన్ని అందరికీ పంచి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అలాగే... అమ్మవారి విజయవార్తను దేవతలు కొందరు పాలపిట్ట రూపంలో భూలోకానికి వచ్చి చాటిచెప్పారట. అందుకే ఆ రోజు పాలపిట్ట దర్శనం శుభప్రదం.  
రావణ దహనం ఎందుకు చేస్తారు?
మహర్నవమినాడు శ్రీరామచంద్రుడు దేవిని ధ్యానించి రావణ సంహారం చేయగా దేవతలు పరమానందభరితులై దేవీపూజ చేశారు. నాటినుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీనవరాత్రులను, పదవరోజున విజయదశమినీ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాముడు రావణుని మీదకు దండు వెడలి, విజయం సాధించిన దినం విజయ దశమే. రావణ కుంభకర్ణమేఘనాథులను సంహరించినందుకు గుర్తుగా కొన్ని ప్రాంతాలలో వారి దిష్టిబొమ్మలను టపాసులతో పేల్చేడం లేదా దహనం చేయడాన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారు.



Title
matter



Title
matter



Title
matter



Title
matter

Saturday, 23 September 2017

ప్రహ్లాదుడు

ప్రహ్లాదుడు
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనీ, జన్మతః వచ్చేదే సంస్కారమనీ, పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలవాడే మనిషనీ, జ్ఞానం, ప్రేమ కలగలిసిన సహృదయతకు ప్రతిరూపమనీ ఉదహరిస్తే, నిరూపణగా సంకల్పిస్తే ఎంతటి గొప్పతనం మన మనోఫలకంపై కదలాడుతుంది. చైతన్యం అంటేనే అత్యంత ప్రశస్తమైంది.ప్రపంచమంతా వెలుగును పంచేది. అటువంటి చైతన్యం విశేష చైతన్యమై భువిపై జన్మిస్తే అవని పులకించిపోతుంది. ఇక కేవలం అనుభూతితోనే అనంతాన్నీ, దాని తత్తాన్నీ తెలుసుకొని అఖండ ప్రజ్ఞానానికి ప్రతిరూపమైతే ఆ మహత్తును తెలుసుకోవడం మనతరమవుతుందా! అంటే ఒక్కసారి అనుభూతికి లోనవ్వడంటూ ప్రశాంతంగా సలహానిచ్చే ప్రహ్లాదుడు కళ్ళముందు కదులాడుతాడు. లోకంలోని ప్రశాంతతనూ, తృప్తి అనే దాని నిర్వచనాన్నీ తనలో ఇముడ్చుకున్న గొప్పవ్యక్తి ప్రహ్లాదుడు. ఈతని చరితమే విశేష చైతన్యం, నిండైన మానవత్వం. అసలైన పరిపూర్ణత్వం.
-ప్రమద్వర

హిరణ్యకశిపుని నలుగురు కొడుకులలో ఉత్తముడు ప్రహ్లాదుడు. రాక్షసజాతిలో జన్మించిన ఆణిముత్యం. మంచితనానికి నిలువెత్తు నిదర్శనం. వినయం, ఆదరణ, ప్రేమ, స్నేహం, జ్ఞానం, చక్కని రూపం లాంటివెన్నో ఉన్నా అణువంతైనా గర్వం లేదు ప్రహ్లాదునిలో. ప్రహ్లాదుడు పరిహాసానికైనా అబద్ధమాడని సత్యవ్రతుడు. శ్రీహరి పట్ల అతను పొందిన అనుభూతి ముందు ప్రపంచమంతా చాలా చిన్నదిగా కనిపించేదతనికి. రాక్షసుని ఇంట పుట్టిన ప్రహ్లాదునికి మంచి గుణాలెలా వచ్చాయో, జీవన తత్వం ఎలా బోధపడిందో ఎవరికీ అర్థం కాలేదు. ఒకప్పుడు దానవులకు రారాజైన హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నాడు. ఆ అవకాశం చూసుకొని ఇంద్రుడు అతని రాజ్యంపై దండెత్తి, రాక్షసులను హతమార్చి హిరణ్యకశిపుని భార్యను బంధించి తీసుకెళ్తున్నాడు. దారిలో నారదుడు ఇంద్రున్ని వారించి ఈమె కడుపులో పెరుగుతున్నది హరిభక్తుడు. హిరణ్యకశిపుని చావుకు కారణమైనవాడు, అతన్ని ఏ ఆయుధాలూ చంపలేవు. కనుక ఆమెను విడిచి పెట్టమంటాడు. నారదుడు హిరణ్యకశిపుని భార్య లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఓదార్చి ప్రతి రోజూ ఎన్నెన్నో నైతిక, ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను ప్రస్తావించేవాడు. అలా అమ్మ కడుపులో నుంచే నారదుని వల్ల సమస్తం తెలుసుకున్నాడు కనుకనే ప్రహ్లాదుడు పుట్టుకతోనే ఉన్నతమైన ఆలోచనాతత్వంలో విరాజిల్లాడు.

రాక్షస లక్షణాలేవీ ప్రహ్లాదునిలో కనపడక పోయేసరికి కంగారుపడిన హిరణ్యకశిపుడు శుక్రాచార్యుని దగ్గర చదువు నేర్చుకోమని పంపిస్తే నేర్చిన శాస్త్రాలన్నీ బతుకడానికనీ చదువుల్లోని మర్మం తెలుసుకుంటే వాటితో పనిలేదని అంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు మాట్లాడే ప్రతిమాటా మేకులా గుచ్చుకుంటుంది. దానవ వైఖరిని స్మరిస్తూ వీడే దానవవంశాన్ని నాశనం చేస్తాడని అనుకొని కఠినమైన శిక్షలు విధిస్తాడు. కన్నతండ్రే తనను అర్థం చేసుకోక కఠినమైన శిక్షలు వేయమని పురమాయిస్తే ఏ మాత్రం భయం, బాధ లేవు ప్రహ్లాదునిలో, అంతులేని ఆనందం తప్ప. శ్రీహరే అంతా చూసుకుంటాడన్న విశ్వాసం అది. తాను నమ్మినదే తనకు రక్షగా భావించి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు ప్రహ్లాదుడు.


ఏనుగుతో తొక్కించినా, భయంకరమైన నాగుపాములతో కరిపించినా, ఎగిసిపడే మంటల్లోకి తోసేసినా, భీకర సముద్రంలో ముంచేసినా, విషం పెట్టినా, ఎత్తయిన కొండలపై నుంచి దొర్లించినా, మండు టెండలో నిలబెట్టినా, కుండపోత వానలో వదిలేసినా, మంచుగడ్డలపై పడుకోబెట్టినా, ఎడతెగని గాలికి ఎదురు నడిపించినా, గోతిలో పాతిపెట్టినా, అన్నం, నీళ్ళు లేకుండా చేసినా, గదలతో, కొరడాలతో కొట్టించినా ప్రహ్లాదుని చిరునవ్వు చెరుగలేదు. అతని మనస్సు శరీరం మాత్రం బాధింపబడలేదు. చివరికి ప్రహ్లాదుని మనఃసంకల్పమే నృసింహావతారంగా వచ్చి హిరణ్యకశిపుని సంహరించింది.

ప్రహ్లాదునిలో ఎంతటి ధైర్యం, నిశ్చయం ఉంటే తప్ప ఇన్నింటినీ తట్టుకొని నిలబడగలుగుతాడు. తన పుట్టుక అర్థం తెలుసుకున్నవాడు గనుకనే ఎటువంటి పరిస్థితులెదురైనా తన నిశ్చయాన్ని వదులలేదు. ప్రహ్లాదుడు చెప్పిన జీవన సత్యాలు, విరక్తినీ, విముక్తినీ మాత్రమే వెల్లడిస్తాయంటే పొరపాటే. వాస్తవాలనూ, విలువలనూ, విషయ పరిజ్ఞానాన్నీ తెలియపరచి జీవితం సార్థకమయ్యేందుకు దోహదం చేస్తాయి. జీవన దృక్పథం తెలుసుకుంటే జీవితాన్ని కాక, బంధంగా ప్రేమించగలమని తెలియజెప్పిన ప్రహ్లాదుని నిశ్చితి, ఉన్నతి అత్యున్నతం.ప్రహ్లాదుడు చెప్పిన విషయాలు మనిషిలోని వివేకాన్ని తట్టిలేపుతాయి. లేదు, కాదు అనుకునే వ్యతిరేక భావనే మన వైఫల్యానికి కారణమనీ, రక్షణేకానరాని వారికి రక్షణగా, దిక్కులేనివారికి దిక్సూచిలా, బలహీనులకు బలంగా, బలవంతులకు తేజస్సుగా సదా మనలోనే ఉన్న అంతర్యామినిని తెలుసుకుంటే లోకంలో దుఃఖానికి తావు లేదని చెప్పిన మాటలు జీవన సత్యాలుగా మిగిలిపోయాయి. మనిషిలోని అరిషడ్వర్గాలే మనకు శత్రువులనీ, వాటిని జయిస్తే ప్రపంచమంతా జయించినట్లేననీ, వివేకంతో కర్మబంధాల నుంచి తప్పుకోవాలే గానీ వివాదాలతో కాదనీ, అంతటా అన్నింటా ఉన్న తత్వాన్ని తెలుసుకుంటే ప్రపంచమంతా తెలుసుకున్నట్లే ప్రపంచమే నీవనే సత్యం తెలుసుకున్నట్లనీ వెల్లడించిన ప్రహ్లాదుని తత్వవివేచన ఎంతో గొప్పది, ఉన్నతమైంది. అంధకారం, అజ్ఞానం, అహంకారాలను మనిషిలోంచి తరిమికొడితేనే అసలైన జీవన దృక్పథం ప్రహ్లాదుడి వల్ల మనకు తెలిసివస్తుంది. మన సంకల్పం, నిశ్చయం, తత్వం సత్యభూషితమైతే కష్టాలు, దుఃఖాలు మనిషిని ఏమీ చేయలేవనేది ప్రహ్లాదుని ద్వారా తేట తెల్లమైంది.

Monday, 18 September 2017

శిష్యవాత్సల్యం


Sakshi

బిడ్డలు మంచివారయినా, చెడ్డవారయినా ఆస్తిని మాత్రం తల్లిదండ్రులు వారికే ఇస్తారు. కానీ గురువొక్కడే తన శిష్యులకు ఇస్తాడు. గురువుగారి శరీరం పడిపోయిన తరువాత ఆయన ఆస్తి – అంటే రామాయణం, భారతం, భాగవతం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రబోధం, అనుష్ఠానం, ధర్మం... ఇవన్నీ నమ్ముకున్న శిష్యుడికి వెళ్ళిపోతాయి. యోగ్యుడు కాకపోతే కొడుక్కు కూడా వెళ్ళవు. తనని అంటిపెట్టుకుని తిరిగాడు కాబట్టి అంతటి గొప్పవిద్యను గురువు శిష్యుడికి ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తియై పరమేశ్వరుడి అనుగ్రహం కూడా శిష్యుడికి ఇప్పించగలడు.

వైష్ణవ సంప్రదాయంలో ‘‘యథోక్తకారీ’’ అని ఒక అద్భుత విశేషం ఉంది. కాంచీపురంలోని ఒక దేవాలయంలో విష్ణుపెరుమాళ్‌ శేషశయనం మీద ఉంటాడు. ఈ సంప్రదాయానికి చెందిన ఆళ్వారుల్లో ఒకరయిన భక్తిసారులు విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. బ్రహ్మచారిగా ఉన్న అలాంటి భక్తిసారులను ఒక దంపతుల జంట సేవిస్తూ ఉండేది. ఆయనకు తెచ్చిన ఆవుపాలు ఆయన తాగగా మిగిలినవి ప్రసాదంగా సేవిస్తూ ఉండేవారు. వారికి కణికణ్ణన్‌ అని ఒక కుమారుడు పుట్టాడు.

అదే దేవాలయంలో వృద్ధురాలయిన ఒక గూనిస్త్రీ రోజంతా తుడిచి కడిగి వెళ్ళిపోతూ ఉండేది. అది చూసిన కణికణ్ణన్‌ ఆమెకు గూని లేకపోతే మరింత ఎక్కువ సేవచేసేది కదా అనుకుని గురువుగారివంక చూసాడు. ఆయన అనుగ్రహం పొందిన శిష్యుడు వెళ్ళి ఆమె గూనిని ముట్టుకోగానే ఆమె వైకల్యం పోయి నవయవ్వనంతో చక్కటి సౌందర్యవతిగా మారిపోయింది. వృద్ధుడయిన ఆ దేశపు రాజుకు ఈ విషయం తెలిసి కణికణ్ణన్‌ను పిలిపించి తన వృద్ధాప్యాన్ని కూడా తొలగించమన్నాడు. గూనిస్త్రీలో వచ్చిన మార్పు తన గొప్పదనం వల్ల కాదనీ, కేవలం తన గురువుగారి అనుగ్రహం వల్లమాత్రమే సాధ్యమైందని ఎంత చెప్పినా వినకుండా రాజు కణికణ్ణన్‌కు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు.


కణికణ్ణన్‌ నేరుగా గురువుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి దేశం విడిచి వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే భక్తిసారులు లేచి శేషశయనం మీద ఉన్న స్వామివారిని ఉద్దేశించి ‘‘కణికణ్ణన్‌వెళ్ళి పోతున్నాడు’’ అన్నాడు. అంతే చెప్పాడు. స్వామివారు దిగ్గున లేచి ‘కణికణ్ణన్‌ ఎక్కడికెడితే మనమూ అక్కడికే వెడదాం పద’ అంటూ ముందుకు నడిచాడు. కణికణ్ణన్‌ముందు, ఆయన వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆ రాత్రికి పాలార్‌నది ఒడ్డున బస చేశారు.

విష్ణువు వక్షస్థలంలో కొలువై ఉండే లక్ష్మి కూడా కాంచీపురాన్ని వదిలిపెట్టడంతో ’నగరేషు కాంచి’గా పేరొందిన ఆ నగరం వెలవెలాపోయి ప్రజలు గగ్గోలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రాజు పరుగున వెళ్ళి క్షమించమంటూ స్వామివారి పాదాలమీద పడ్డాడు.’నా భక్తుడు రమ్మంటే ఆయన వెంట వచ్చేసాను’ అంటూ స్వామి భక్తిసారులను చూపాడు. భక్తిసారుల దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు రాజు. కణికణ్ణన్‌ వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుసరించానంతే అన్నాడు భక్తిసారులు. రాజువెళ్ళి ఆయనను అర్థించగా కరుణించిన కణికణ్ణన్‌’తప్పు ఒప్పుకున్నావుగా చాలు, పద’ అని కంచివైపు తిరుగుముఖం పట్టాడు. భక్తిసారులు చూసి ’కణికణ్ణన్‌ వెళ్ళిపోతున్నాడు’ అని చెప్పడంతో స్వామివారు అలాగే అంటూ బయల్దేరారు.

ముందు కణికణ్ణన్, వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామివారు తిరిగి కంచి దేవాలయానికి చేరుకున్నారు. ‘యథా ఉక్తకారీ’ అంటే ఎలా గురువుగారు చెప్పారో అలా చేసిన పరమాత్ముడు’ అని–అదే ఇప్పుడు కంచిలో ఉన్న యథోక్తకారి దేవాలయం. గురువుకు ఉండే శిష్య వాత్సల్యం పరమేశ్వరుడిని కూడా శాసిస్తుందని చెప్పడానికి ఈ దేవాలయం ఒక నిదర్శనంగా కనబడుతుంది.

Wednesday, 13 September 2017

Stories From The Mahabharata





Fascinating Stories from
The Mahabharata

The Mahabharata was, according to a legend, first recited by a seer, Vyasa (who was also the Pandavas’ actual grandfather), to Ganesha, who wrote down the story. Ganesha, however, agreed to write it down only if Vyasa never paused during his recitation. Vyasa agreed, saying that Ganesha would jot down his words only after understanding them completely.

We all are aware of the basic facts of the Mahabharata – we know about the animosity between the five sons of Pandu, and the hundred sons of Dhritrashtra. We are aware of how this hatred played an important role in the game of dice between the two parties, and how, consequently, the Pandavas lost their land and their common wife, Draupadi, to the Kauravas. After being in exile for 13 years, when the Pandavas returned, Duryodhan refused to give them back half of their land, which they were entitled to. This called for war. It was during this famous Kurukshetra war that Lord Krishna gave his ethical lecture to Arjuna, which we know as the Bhagwad Gita. After winning this Great War, the Pandavas, out of remorse and guilt of killing their own relatives, embarked on the ‘Great Journey’ to the Polar Mountains where all but Yudhisthira, who made it to the Gate of Heaven, died on the way.

But there is more to the story than just that. These are facts that we have been told over time. There are stories, or rather excerpts, from the epic, that most of us are unaware of. So, we enlisted some of these lesser known tales from the Mahabharata.


  1. Hiranyaksha, Hiraeyakasipu; Ravana, Kumbhakarana; and Sisupala, Dantavakara – all were the reincarnations of brothers Vijaya and Jaya, who were at once the gatekeepers of Lord Vishnu’s abode!

    There is a story in the Mahabharata which connects three epics – the Mahabharata, the Ramayana and the Bhakt Prahladh – in a wonderful way.

    According to this story, once, Vijaya and Jaya, the gatekeepers of Lord Vishnu’s abode (Vaikuntha Lok) were cursed by the four Kumaras of Brahma when the latter were mistaken for being children (kumaras looked like children due to the strength of their tapas!) and were not allowed to meet Narayana. In accordance to the curse, the gatekeepers had to give up their divinity and live as mortals on earth. The news of the curse fell on Narayana’s ears, and he felt sorry for his gatekeepers. He also apologised to the Kumaras and assured Jaya and Vijaya that he will do something to reciprocate.

    Narayana put forth two options: they could either be born seven times as His devotees, or three times as His enemies on Earth. Since seven lives was a greater time span, which the two brothers could not bear, they chose the latter.

    In the first birth as enemy to Vishnu, they were born as Hiranyaksha and Hiraeyakasipu who were killed by Varaha and Narasimha (both avatars of Vishnu). In the next Treta Yuga, the two brothers were born as Ravana and Kumbhakaran, and were killed by Rama, avatar of Vishnu. In the Dwapara Yuga, the brothers were born as Sisupala and Dantavakara, and were killed by Krishna, avatar of Vishnu. Hence, with each life, they moved closer and closer to their God.

  2. The Mahabharata war could have been averted, if only Duryodhan had listened to the Gita.

    Krishna had tried to narrate the Bhagwad Gita to Duryodhan, but he had refused to listen, saying that he already knew right from wrong. He argued that there was some force within him that did not allow him to choose the right path. Had he listened to Krishna’s words, the entire war could have been averted.

  3. Draupadi was, in fact, Goddess Durga’s avatar.

    Once, Bhima saw Yudhistira washing Draupadi’s feet in her chambers, and complained to Krishna, not knowing that Draupadi was actually Goddess Durga’s avatar. Krishna took him to the jungle and asked him to sit quietly on a tree top and witness what happens below.

    Late in the night, Bhima saw that Draupadi, as Goddess Durga, was asking for Bhima’s blood in her empty bowl, since he had entered her chambers despite being forbidden from entering. Bhima, scared to death, narrated the entire story to his mother, Kunti. Kunti then asked Draupadi never to hurt Bhima. Being a mortal, Draupadi had to promise her and in the act, she bit her lip hesitantly. Kunti wiped off the blood from her lips with the edge of her cloth and promised her that Bhima will fill the bowl for her. This did happen, when Bhima killed Dushashan for humiliating Draupadi and filled her bowl with the blood from Dushashan’s chest.

  4. One of the Pandavas already knew that the war was coming.

    Pandu’s dying wish was that his sons should eat his flesh after his death to gain knowledge and experiences. Sahadev devoured three pieces and became the greatest astrologer, who could foresee events. But he could not tell anyone about the war, because it would bring about his death.

  5. How Shakuni, Dhritarashtra’s brother-in-law, became the reason for his downfall.

    Dhritarashtra’s wife Gandhari had been cursed that her first husband would die, which led to her family secretly getting her married to a goat, and later killing it. She then married Dhritarashtra. When he got to know about this several years later, Dhritarashtra put the entire Gandhara family, King Subala and his hundred own sons in prison to die. They were only given a bowl of rice to eat. King Subala, who wanted to take revenge on Dhritrashtra, advised everyone in prison to give their food to his youngest son, Shakuni, so that he becomes strong enough to fight Dhritarashtra. He also convinced Dhritarashtra that Shakuni can be a guide for his hundred sons, thus asking him to release Shakuni.

    Before dying, Subala asked Shakuni to make a dice from his backbone with such powerful magic that it could spin the requested number; he also broke one of Shakuni’s bones from the leg so that it reminds him of the pain his family went through before dying. And this is how Shakuni became the reason for Dhritarashtra and his dynasty’s downfall.

  6. Bhishma’s five powerful arrows could have helped the Kauravas win the war.

    Duryodhan was certain that Bhishma was not fighting to his full abilities due to his bias for the Pandavas. After accusing him of this, Bhishma created five powerful arrows and promised that he would slay the five brothers at one go the very next day. Doubting this, Duryodhan took the five arrows to use them on the Pandavas himself.

    Krishna got to know about this and advised Arjuna to go and ask Duryodhana for those arrows, as the boon that Duryodhana had granted him once, when Arjuna had saved his life. Duryodhana had to comply with his request and unwillingly, parted with the arrows. When Duryodhana asked Bhishma to create five more arrows, he refused, saying that he had used his lifelong merit to create them and thus, they could not be recreated. Duryodhana thus lost his only chance of winning the war.

  7. Krishna and Arjuna fought against one another in a battle once.

    It began with Gayan, the gandharva, flying his chariot impulsively and close to Dwarka, where Krishna resided. He flew so close to Krishna that Krishna fell down and Gayan did not even apologise for his reckless behaviour. Krishna, furious, vowed to hunt him down and kill him. Gayan, scared, ran to Brahma and Mahesh for help, but they asked him to apologise to Krishna instead. Naradmuni then asked him to reach out to Arjuna, Krishna’s close friend, to seek help. After much convincing and manipulation by Naradmuni, Arjuna agreed to help Gayan, albeit reluctantly. When Krishna and Arjuna meet for battle, Brahma stopped them and found a solution. He asked Arjuna to hand over Gayan to Krishna, who then killed Gayan.

    Krishna then told Arjuna that war was near, and he should be prepared to fight even his own brothers and relatives; this battle was meant to prepare Arjuna to fight for the Kurukshetra war.

  8. All of the Pandavas were extremely powerful; and each of them had their strengths.

    Nakul and Yudhishtira had great powers. Nakul could ride a horse so fast that he could never get wet in heavy rain. It is said that he travelled with such great speed that he could dodge rain drops between successive falling drops. And Yudhishtira was said to have so much power that if he got angry, everything within his line of sight burnt.

  9. Ramayana & Mahabharata don’t overlap for just once. There was an incident when Krishna saved Arjuna’s life at the Rama Setu in presence of Hanumana.

    Krishna once told Arjuna that Rama was the greatest warrior ever – even better than him. When visiting Rameshwaram, seeing the Nala Setu, a doubt arose in Arjuna’s mind. He wondered why Rama, who was supposedly the greatest warrior, needed the Vanara Sena to create the Setu, when he could have just created a bridge with arrows using his powers.

    Hanuman found Arjuna engaged in such doubts and went up to him, disguised as an aged Vanara. He explained to Arjuna that the bridge of arrows would not be able to withstand the weight of the Vanars. Challenging Hanuman, Arjuna said that he would create such a bridge and if the Vanara could walk on it, he would win. Otherwise, he would burn in the bridge of arrows. After building the bridge with his powers, he asked the Vanara to walk on it. Hanuman uttered the name of Rama, and merely kept his tail on the bridge. The bridge collapsed.

    Keeping his word, Arjuna burnt the bridge and turned to walk in it. That very moment, Krishna appeared in the form of a saint and asked them to perform the task again, with him as a witness. But this time, the bridge did not crumble. When they turned around, they saw that the saint was supporting the foundation of the bridge with his shoulders bleeding. In the saint, Hanuman saw Rama and Arjuna saw Krishna. Krishna hugged Hanuman and thanked him for what all that he had done for him.


  10. The most powerful warrior in the Mahabharata was a mere spectator.

    The battle of Kurukshetra was viewed from atop a mountain by Barbarik, whose head was placed on the mountain. Just how did his head end up there?

    Barbarik, Bhima’s grandson and Ghatotkacha’s son, was a brave warrior who was blessed by Lord Shiva and bestowed with three powerful arrows and a special bow from Lord Agni. The power possessed by Barbarik was such that he could kill anyone he wished using just one of those arrows. Krishna tested this virtue of the arrows and found it to be true. This scared him, because this inherent power would prevent him from saving the Pandavas on the battlefield; Barbarik’s arrows could easily destroy any or all of them without Krishna’s knowledge.

    Krishna, therefore, asked Barbarik which side he would be on. Barbarik had earlier promised his mother that he would side with the weaker army, and therefore, to that extent, replied that since the Pandavas have a smaller army, he would be on their side. But here, Krishna explained the paradox of the situation: given the fact that Barbarik was so powerful, whichever side he chooses will only weaken the other side and he will have to take the latter’s side, eventually oscillating between the two sides and destroying everyone but himself. Thus, Krishna asked him for his head so that his involvement in the war could be avoided. Before giving his head to Krishna, Barbarik expressed his desire to view the war, leading to Krishna placing Barbarik’s head atop a mountain overlooking the battlefield.

Editor’s note: While the author and the editors involved with this story have went to great lengths to verify the actuality of these incidents, epics like the Mahabharata and the Ramayana are themselves so conflicted in the popular culture and in the media that it is almost impossible to thoroughly verify such lesser-known stories. Having said that, we find these stories fascinating, amazing and of value for our readers, and hence we cosidered important to share them with you.



Abhimanyu

Why did Shri Krishna allow Abhimanyu's death in the Mahabharata?

Who was Abhimanyu?
Abhimanyu’s death was perhaps the event that affected most of us who all grew up watching the Mahabharata on television. Abhimanyu was born to Arjuna and Subhadra and was the nephew of Lord Krishna. At the time of his death at a tender age in the battle of Kurukshetra, he was married princess Uttara of the Matsya Kingdom.

Why did Abhimanyu die?
To many of us, his death seemed unfair. Why kill him? Why couldn’t Lord Krishna who guided Arjuna, Abhimanyu’s father to victory in the battle, save him? He did not need to die at such a tender age, so brutally? Or did he?

Abhimanyu and the Chakravyuha
Like the Pandavas, Abhimanyu was trained in all forms of warfare by Lord Krishna himself and even Arjuna. He was later trained by Pradyumna, son of Krishna. He had learned the art of breaking into the Chakravhyuha when he was his mother, Subhadra’s womb. However, he did not hear the entire information, i.e. how to get out of the battle formation – the Chakravyuha.

Conversation between Arjuna and Subhadra
In the womb, Abhimanyu heard the conversation about the Chakravyuha from Arjuna, his father when he was narrating the same to his mother, Subhadra. He heard the conversation up until the art of breaking into the Chakravyuha was discussed. Unfortunately, he did not get any further information on how to destroy the formation once inside. This is because Lord Krishna interrupted Arjuna and took him away.

Dronacharya's strategy to end the Pandavas
On the thirteenth day, Droncharya, the supreme teacher of the Kaurava clan had planned to divert Arjuna and Krishna away to chase a smaller part of their army that was sent towards Dwarka. At the same time, 90% of their remaining army regrouped in a humungous discuss formation, i.e. chakravyuha. This would cause great loss to the Pandavas. Also, if the Kaurava army continued at the pace at which they were heading, there would be no Pandava army left by sunset.

Why Krishna let Abhimanyu die...
But as a mentor, friend, and guide to Arjuna, definitely, Lord Krishna could help save Abhimanyu? Yes, he could but he did not. Here is why – it is said that Abhimanyu was the reincarnation of Varchas, the son of the Moon god. When the Moon God agreed for his son to be incarnated on earth by the devas, he put a condition – his son would remain on earth only for 16 years as he could not bear to be separated from him any longer. Hence, this was to be the lifespan of Abhimanyu.

Krishna's plan for Abhimanyu
Abhimanyu’s life longevity was known to Shri Krishna. Hence, he allowed Abhimanyu to hear the conversation between Arjuna and Subhadra up until entering or breaking into the Padma Vyuha or Chakravyuha. Also, before understanding the strategy required to destroy and oust the Chakravyuha, Krishna called Arjuna away. Hence, Abhimanyu had no knowledge of this.

Why Abhimanyu had to die...
Abhimanyu’s death was inevitable but also necessary. This is because Shri Krishna needed Arjuna to be full of fire for vengeance to fight the Kauravas. Arjuna was confused as he did not want to fight his own cousins. He did not want to fight his own elders and gurus. Hence, this was Shri Krishna’s master plan.

Jayadrathan's role in Abhimanyu's death
When Abhimanyu entered the Chakravyuha, Jayadrathan the ruler of Sindh, blocked the entry so that no other Pandava could enter the formation. He had been humiliated by the Pandavas earlier. He performed severe penance and sought Shiva’s boon due to which he could stall any army single-handed but without Arjuna and Krishna only. Hence, he trapped Abhimanyu.

Abhimanyu's death
However, Abhimanyu caused great destruction to the Kaurava army before sacrificing himself. He defeated Drona, Kripa, Ashwatthama, Duryodhana, Salya, Dussasana, Bhurisrava. He also killed Duryodhana’s son Lakshmana, Salya’s son Rukmaratha, Kritavarma’s son Matrikavata and many more. Now only Karna could overpower Abhimanyu. However, he could do so by depriving the young warrior of weapons, the bow, and arrow. In the end Abhimanyu was killed brutally.

Turning point in favor of Pandavas
Enraged by his son’s brutal death, Arjuna killed Jayadrathan with his heavenly arrow. As planned, Shri Krishna knew that Abhimanyu’s death would act as a turning point in the war and it would be in the Pandava’s favor. Up until Abhimanyu’s death, the Pandava’s did not fight with full strength. Also, by killing Abhimanyu, the Kauravas committed a major breath in the ethics and code of the Mahabharata war.

Enmity between Abhimanyu and Shri Krishna
In different version and tales of mythology, Abhimanyu’s death was associated to Shri Krishna’s enmity with him in his previous birth. He was then Abhikasura, a demon. Abhikasura was connected to Raja Kansa who was the evil uncle of Shri Krishna. As an asura, he left no stone unturned to wreak havoc on Krishna.

Story of Abhimanyu's birth
When Shri Krishna defeated and killed Kansa, Abhikasura vowed to kill Krishna. However, Krishna, being the almighty himself, was aware of Abhikasura’s plans and wove a magic around him. The demon was transformed into an insect and locked in a box. When Subhadra was married to Arjuna, the box was accidently opened and the insect entered Subhadra’s womb. This is how Abhimanyu was born.

Arjuna's sorrow over Abhimayu
Krishna was aware of this and hence, he prepared the grounds for Abhimanyu’s death. The Chakravyuha led to forming the perfect plan. Arjuna blamed Krishna for his son’s death but when Krishna narrated the reincarnation story of Abhikasura, Arjuna understood that Krishna had to let the evil source die.