Friday, 12 May 2017

Women of Mahabharata

Beautiful Women of Mahabharata

Mahabharata is one of the most renowned epics of India.There are some exemplary women characters in Mahabharata who are the epitome of courage, elegance, beauty and intelligence. Even in today’s world, these women characters can be taken as ideal examples as to how a woman must lead her life with courage.

These women were ahead of their time and were bold enough to put forth their voices against the male-dominating society. These characters teach us some of the greatest lessons in life of how to be outspoken, courageous, faithful, devoted, etc.

Here are the list of most beautiful women of the epic Mahabharata. 


Urvashi 

Urvashi was a beautiful nymph in Indra’s “Darbaar” and was among the most beautiful women of Mahabharata. She loved Arjuna and tried to allure him with her charm. However, when Arjuna refused her advances, she became furious and cursed Arjuna that he would be devoid of his manhood. Urvashi was the most fearless woman during that period who frankly expressed her desires to a man. Although, there were many beautiful women in Mahabharata like Kunti, Ganga, Ulupi, Subhadra, Gandhari and Satyavati, nobody comes close to Urvashi. She was epitome of beauty, prejudice and pride. A deadly combination.

Draupadi 

Even the sage Vyasa went into a rapture describing her extraordinary beauty. It was the only time he described his heroine in such detail. “Eye-ravishing Panchali, black and-half-smiling eyes, entrancing and radiant with rather haughty glow … Soft eye-lashes; standing tall, with well formed swelling breasts; narrow waist like the middle of the sacred Vedi; ”

Kunti
Kunti was also among the most beautiful women of Mahabharata. She had a child before her marriage, so she was believed to be quite advanced during that epoch. Karna, was her son and Sun God was his father. However, it was in a very young age that Kunti called upon the Sun God in a playful mind and was blessed with a son. Later she realised that it may be a disgrace for her and her family. So she discarded her child and let him float in a river by putting him in a basket.

Ganga
Ganga is one of the most beautiful women of Mahabharata. She was King Shantanu’s first wife. Her mesmerizing beauty allured the King and he proposed Ganga. She accepted Shantanu’s proposal on 3 conditions; first, he would never ask about where she hails from; second, the King would never ask her anything about her actions, no matter how good or bad they are and would always be by her side, regardless of anything. The third and last condition was, if he breaks any of the above 2 conditions, she would leave him at once.

Satyavati 

Queen Satyavati, also known as Matsyakanya is considered one of the prettiest woman of Mahabharata era. It was her beauty which could woo the King Shantanu. King Shantanu, after his wife Ganga left him taking his eighth son (Bheeshma) before drowning his seven sons into Gange river (a different story), was left all alone and living a lower life. But once he met Satyavati, he became very happy and proposed her.

Gandhari
Gandhari was King Subala’s daughter and when she was young she worshipped Lord Shiva. She was blessed by Shiva to have one hundred sons. Later, she was married to Dhritarashtra who was blind and when Gandhari came to know this, she also blind-folded herself. She was one among the 9 most beautiful women of Mahabharata who sacrificed herself willingly to be blind-folded throughout her lifetime for her life partner. Due to this decision, she had acquired power and knowledge. It was said that her gaze was extremely powerful and she had called for her first born son Duryodhana to come in the natural form during the war of Kurukshetra so that she could remove the blindfold and see him and protect him from any harm.

Ulupi 

Ulupi was a beautiful Naga princess who was obsessed with Arjuna and wanted to marry him. She kidnapped Arjuna after intoxicating him with some strong potions and then proposed to him.

Amba 

Amba was the eldest princess and the daughter of king of Kashi who fell in love with Salva, the king of Saubala and during her swayamwara she decided to put varmala in his neck. However, she was kidnapped by bhishma along with her two younger sisters Ambika and Ambalika to marry them to his newphew, Vichitravirya.

Subhadra 

Subhadra was the sister of Balarama and Sri Krishna. She was also one of the most beautiful women of Mahabharata. Arjuna was besotted by Subhadra’s beauty and wanted to marry her. Krishna advised Arjuna to abduct her because Balarama wanted her to get married to his favourite pupil “Duryodhana” and Krishna was against this.

Chitrangada
Chitrangada was the beautiful daughter of Chitravahana, who was the King of Manipur. Arjuna was besotted by her beauty and was determined to marry her. He asked the King for her hand. Chitravahana had no sons, so he accepted Arjuna’s proposal on one condition that if he marries Chitrangada, he must give her son to the King to inherit his kingdom.


Every woman in Mahabharata, makes an entry as some man’s Mother, Wife, Daughter or Sister. She does not enjoy the individual identity of a Kind Queen/ Brave warrior / Great Disciple / Wise Teacher.

Who was the most beautiful woman in Mahabharata?
Beauty is in the eye of the beholder!!

There were many beauties in the Mahabharata.
Ganga and Satyavati captured the heart of Shantanu.
Kunti and Madri kept Pandu occupied.
Panchali enthralled all who beheld her.
Rukshmani and Satyabhama were ageless beauties who captured the heart of shri Krushna.


There were others at the time including Gandhari, Hidamba, Ulupi, Usha, Uttara, Urvashi, Subhadra etc who were all great beauties in their own time and in their own places and amongst their own people.

Main thing is none of these women were silent or weak.  They were all ladies with great personality and self confidence.

రామాయణంలో రావణుని పాత్ర



మన భారతదేశంలో రామాయణం చదవని వారు కాని, వినని వారు కానీ ఉండరనటంలో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే, ఆ మహా కావ్యం మన సంస్కృతిలో మన నరనరాలలో జీర్ణించుకుని పోయింది. ఎవరైన ఒక సద్గుణవంతుడు మనకి కనపడితే శ్రీ రాముడితో పోలుస్తు ఉంటాము. శ్రీ రాముని గుణాలను వాల్మీకి అంత గొప్పగా వర్ణించారు. ఐతే ప్రతినాయకుడైన రావణాసురుడిని కూడా అదే రీతిలో పొగిడారు. రాముని గురించి గాని ఆయన గొప్పదనాన్ని గురించి గానీ వర్ణించ నవసరం లేదు. అవి అందరికీ తెలిసిన సంగతులు. రామాయణంలోని ప్రతి నాయకుడైన రావణ బ్రహ్మ గురించి కొంచము ముచ్చటిద్దాం.

రావణ బ్రహ్మ జననం:
భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా, వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాపవిమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.


కృతయుగము:హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
త్రేతాయుగము:రావణాసురుడు, కుంభకర్ణుడు
ద్వాపరయుగము:శిశుపాలుడు, దంతవక్ర్తుడు

ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణము, బ్రహ్మఖండం నందు రామేశ్వర సేతు మాహాత్మ్యం నందు చెప్పబడింది.

బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్రవసుకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్రవసు మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకొనమని అంటుంది. విశ్రవసు విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.

రావణాసురుడి తండ్రి వైపు నుండి- తాత పులస్త్యుడు, అతని తండ్రి బ్రహ్మ.
రావణాసురుని తల్లి వైపు నుండి- తాత మల్యవుడు, అమ్మమ్మ తాటకి.
రావణాసురుడి మామ మారీచుడు.
రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. వారు 1. కుబేరుడు, 2. విభీషణుడు, 3. కుంభకర్ణుడు, 4. ఖరుడు, 5. దూషణుడు, 6. అహిరావణుడు (ఇతనినే మైరావణుడు అనికూడా అంటారు). 7. కుంభిని (సోదరి, లవణాసురిని తల్లి), 8. శూర్పణక. (సోదరి).

రావణ బ్రహ్మ పాతాళ రాజ పుత్రిక ఐన మండోదరిని వివాహమాడాడు. వీరికి ఎడుగురు సంతానం. వారు 1. ఇంద్రజిత్తు, 2. ప్రహస్తుడు, 3. అతికాయుడు, 4. అక్షయకుమారుడు, 5. దేవాంతకుడు, 6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

రావణ బ్రహ్మ గుణగణాలు:
"రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై ఉన్నాడు."

అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు "ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!"

రావణాసురుని శివభక్తి అనుపమానం. అందుకు ఆయన రచించిన శివతాండవ స్తోత్రమే నిదర్శనం. కైలాసవాసుని తన భక్తితో మెప్పించిన పరమ భక్తునిగా అగ్రస్తానంలో నిలిచాడు. తమ పరాక్రమంతో, యుద్ధనీతితో ముల్లోకాలని జయించి తన ఏలుబడికి తెచ్చుకున్నాడు. రావణుని గొప్పతనాన్ని చాటే ఎన్నో కథలు ప్రచుర్యంలో ఉన్నాయి.

ఒక కథ ప్రకారం, రామ రావణ యుధ్ధానికి ముందు ఒక క్షత్రియుడిగా రాముడు చేయదలచిన క్రతువులు నిర్వహించుటకు కిష్కింధలో బ్రాహ్మణుడు దొరకని సమయంలో రావణుడు (తను బ్రాహ్మణుడు కావటంతో) తను స్వయంగా రాముడితో ఆ క్రతువులు నిర్వహింపచేసాడని అంటారు.

ఇంకొక కథ ప్రకారం రామ రావణ యుద్ధకాలంలో ఒకసారి లక్ష్మణుడు తనకు యుధ్ధ నీతిని నేర్పమని రాముని కోరుతాడు. అప్పుడూ రాముడు తనకంటే రావణాసురుడె అందుకు అర్హుడని అతని వద్దకి వెళ్ళి నేర్చుకోమని చెపుతాడు. అందుకు ఆశ్చర్య పడిన లక్ష్మణుడు శత్రువు వద్దకి వెళ్ళినచో చంపివేస్తాడనే అనుమానం వ్యక్తం చేస్తాడు. అందుకు రాముడు రావణుడు అటువంటివాడు కాదు అని నచ్చ చెప్పి పంపుతాడు. లంకకు చేరిన విద్యార్ధి ఐన లక్షణుడిని సకల మర్యాదలతో ఆహ్వానించి పూర్తిగా యుధ్ధనీతిని భోదించి వెనక్కి పంపుతాడని కథ.

ఇటువంటి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఐతే ఇవన్ని కట్టు కథలనీ, వాల్మీకి రామాయణం మాత్రమే నిజమైన కథ అని చాలా మంది వాదిస్తారు. నిజానిజాలు మనకి తెలియవు.

సీతాపహరణం:
ఇంత గొప్ప భక్తుడు, మంత్రవేత్త, మహావీరుడైన రావణుడు సీతని దొంగతనంగా ఎత్తుకుపోవటం మనకి కొంత ఆశ్చర్యం గానే ఉంటుంది. ఐతే ఎలా ఎత్తుకుపోయాడు అనే విషయం పైన కూడా కొన్ని కథలు మనకి వినిపిస్తాయి.

రావణుడు భిక్ష అడిగినప్పుడు సీత లక్షణుడు గీచిన గీటు దాటి భిక్ష వేయపోతుంది. అప్పుడు బ్రాహ్మణవేషంలో వచ్చిన రావణుడు తన నిజ స్వరూపం చూపిస్తాడు. అందుకు భయపడిన సీత అక్కడే మూర్చపోతుంది. అలా క్రిందపడిన సీతని రావణుడు తన పుష్పక విమానంలో తీసుకుని వెళ్తాడు. ఐతే, ఆ సమయంలో సీతను అతను తాక లేదనీ, ఆమె పడి ఉన్న స్థలాన్ని భూమితో సహా పెకళించి తీసుకుని వెళ్ళాడని ఒక కథ. అందుకు కారణం లేకపోలేదు. ఒకానొక సమయంలో రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ, రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.

ఇంతకు చెప్పేది ఏమంటే అన్ని తెలిసిన రావణుడు తన పూర్వజన్మ రహస్యం తెలుసుకోలేక పోయాడా? సీత తన మృత్యుకారకురాలని తెలుసుకోలేకపోయాడా? లేక తెలిసే తొందరగా విష్ణు సాయిద్యం పొందటానికి ఆ విధంగా చేసాడా?

నేను ఇంటరులో ఉండగా ఒక మంచి పుస్తకం చదివా. పుస్తకం పేరు, రచయిత ఎవరో సరిగా గుర్తులేదు. కాని, అందులో రావణపాత్ర చిత్రీకరణ చాల అద్భుతంగా చేసారు. కథ ప్రకారం రావణునికి తన జన్మ రహస్యం తెలుసు, సీత తన మృత్యు కారకురాలని తెలుసు. ఐనా, శాపవిమోచనం కోసమే అతను సీతను అపహరించినట్లు చూపించారు.

ఈ విధంగా రావణాసురిని కథలు చాలానే ఉన్నాయి. చాలావరకు అవి అతని గొప్పతనాన్ని, శక్తినీ, భక్తిని సూచిస్తాయి. కానీ, ఇవన్ని రాముని గుణగణాల ముందు వెలవెల పోయాయి. సీతాపహరణం అనే చర్యతో మహానాయకుడు కావలసిన రావణుడు, ప్రతినాయకుడైపోయాడు. ఆ తప్పిదమే రావణుని మిగిలిన సద్గుణాలన్నిటిని కప్పివేసింది.

ఇక కాసేపు రామాయణం ఒక కావ్యం కాకుండా ఒక నిజ సంఘటనగా తీసుకుంటే:
పాశ్చాత్య చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం రామాయణం ఒక యదార్ధ సంఘటన అని, రామ రావణ యుధ్ధం పూర్వకాలం ఆర్యులకి, అప్పటి భరతఖండ వాసులైన రావణుడికి మధ్య జరిగిన యుద్ధంగా వర్ణిస్తున్నారు. దైత్యులు అనే వారే నిజమైన భరతఖండ వాసులనీ, ఆర్యులు తూర్పు దిక్కుగా ప్రవేశించి, అన్ని రాజ్యాలు జయిస్తూ వచ్చారని ఒక సిధ్ధాంతం. ఇప్ాడు. రావణుడి పాదాల చెంత కూర్చుని, ఆయన సలహాలను స్వీకరించమని రాముడు తెలిపాడు.



రామాయణంలో లంకాధిపతి రావణుడు సీతను అపహరించి అశోకవనంలో బంధించాడు. రావణుడు తన భార్యను అపహరించిన విషయం తెలుసుకున్న రాముడు అతడితో యుద్ధం చేసి సంహరించాడు. అయితే లంకేశుని పతనం వెనుకు కేవలం సీత ఒక్కతే కాదు మరో ముగ్గురు మహిళల శాపం కూడా ఉంది. ఒకసారి స్వర్గానికి వెళ్లిన రావణుడు దేవ నర్తకి రంభను చూసి మోహించి తనతో లంకకు రాకపోతే చంపుతానని బెదిరించాడు. ఈ మాటలు విన్న కుబేరుడి తనయుడు, రంభ భర్త నళకువర రావణుడుని శపించాడు. మహిళను అవమానించిన నీ పతనం వారితో తథ్యమని అన్నాడు.

అలాగే మండోదరి సోదరి, తన మరదలు మాయను పొందుకోరతాడు. దీనికి ఆమె అంగీకరించకపోతే బలవంతంగా అనుభవించాలని చూస్తాడు. దీంతో మాయ ఆగ్రహించి ఓ మహిళ వల్ల నీ పతనమయ్యే రోజు దగ్గరపడిందని శపించింది. అటవీ ప్రాంతంలో ఒక అందమైన యువరాణి తనకు మంచి భర్తను ప్రసాదించమని విష్ణువు ప్రార్థిస్తుండగా రావణుడు తన పుష్పక విమానంపై ఆమెను బలవంతంగా లంకకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె ప్రాణత్యాగానికి పాల్పడింది. అంతేకాదు ఓ స్త్రీ వల్లే నీవు మరణిస్తావని శపించి ప్రాణాలు కోల్పోయింది.

రావణుడు కుబేరుడికి సవతి సోదరుడు. అందుకే రావణుడు పాలనలో లంక సిరిసంపదలతో తులతూగింది. లంకలో ప్రజలను కూడా అదృష్టం వరించింది. రావణాసురుడు తాత బ్రహ్మదేవుడు. బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన ప్రజాపతి పులస్త్యుని కుమారుడు విశ్రావసు. ఆ విశ్రావసు కుమారుడే రావణుడు. అందుకు అతడిని రావణబ్రహ్మ అని రామాయణంలో పేర్కొన్నారు. లంకను చేరుకోడానికి రాముడు వానర సేనతో కలిసి నిర్మించిన వంతెనకు రావణుడే పూజచేశాడు... అంతేకాదు వంతెన పూర్తయిన తర్వాత రాముడిని విజయీభవ అంటూ దీవించాడు.

రావణుడు శివుడు వరంతో పది తలలను పొందాడని అంటారు. అయితే రావణుడికి తన తల్లి ఇచ్చిన ఓ కంఠాభరణం వల్లే ప్రతిబింబాలు ఏర్పడి పది తలలుగా కనిపించాయని కొందరు అంటారు. బలి చక్రవర్తితో భయంకరమైన యుద్ధం చేసిన రావణుడు అతడి చేతిలో ఓడిపోయి, ఆరు మాసాలు చెరసాలలో ఉన్నాడు. రావణుడి దగ్గర రాజధర్మం గురించి తెలుసుకోమని రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని పంపాడు. రావణుడి పాదాల చెంత కూర్చుని, ఆయన సలహాలను స్వీకరించమని రాముడు తెలిపాడు.


ఇంద్రజిత్తు

ఇంద్రజిత్తు రావణాసురుడికి మండోదరికి జన్మించిన కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాదుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. ఇంద్రజిత్తు యొక్క సంగ్రామ చాతుర్యాన్ని వాల్మీకి మహర్షి రామాయణం యుద్ధకాండలో వర్ణిస్తారు.

రామ రావణుల మధ్య జరిగిన మహాయుద్ధములో ఇంద్రజిత్తు చురుకైన పాత్రను పోషించాడు. ఇంద్రజిత్తు ఆ యుద్ధములో రామలక్ష్మణులను నాగపాశముతో బంధించాడు. అయితే గరుడుడు వారిని నాగాపాశమునుండి విడిపించాడు. ఇంద్రజిత్తు ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు. ఆ యజ్ఞమహిమ వలన ఈయనను యుద్ధంలో ఓడించటం ఎవరివల్లా సాధ్యంకాదు. ఆ యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు.

ఇంద్రజిత్తు ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల) ను వివాహమాడినాడు. కొందరు ఆదిశేషుడు లక్షణ అంశ అని భావిస్తారు. ఈ విధముగా ఇంద్రజిత్తు లక్ష్మణుని అల్లుడని చెప్పవచ్చు. ప్రమీల నాగకన్య.

సనకసనందాదులు

సనకసనందాదులు లేదా సనత్ కుమారులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు. ధర్మప్రజాపతి పుత్రులు. వీరితల్లి హింస. సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పం వలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు. సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సు చేస్తూ కాలం గడిపారు. బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.

భాగవత పురాణం 12 మంది మహా భక్తులు పేర్కొనబడ్డారు. వీరు జీవన్ముక్తులైనా విష్ణువు భక్తులై దేశ సంచారులుగా భగత్సేవచేస్తూ జీవిస్తారు. అందరిలోకి పెద్దవారైనా సనత్ కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తుంటారు. వీరు హిందూ పురాణాలో విశిష్టమైన పాత్ర పోషించారు.

ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనకసనందాదులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను "భూలోకంలో అరిషడ్వర్గాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు - శత్రువులు ఆరుగురు) లోనయ్యే జన్మలు పొందుదురు గాక అని శపించారు. జయ విజయులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.

కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
త్రేతాయుగములో రావణాసురుడు, కుంభకర్ణుడు
ద్వాపరయుగము
లో మందు శిశుపాలుడు, దంతవక్ర్తుడు

పులస్త్య మహర్షి

విష్ణుమూర్తి నాభికమలము నుంచి ఉద్భవించిన బ్రహ్మ దేముడు సృష్టి కార్యం చేయటానికి తన శరీరము నుంచి కొంతమందిని సృష్టించాడు. వారినే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. అలాంటి మానస పుత్రులలో పులస్త్యుడు ఒకరు. ఈయన బ్రహ్మదేముడి కుడి చెవి నుంచి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారాయణుడి మీద మక్కువతో నిరంతరం తపస్సులో మునిగి ఉండేవాడు.

పులస్త్యుడి భార్య పేరు హవిర్భువ, ఈమె కర్దమ ప్రజాపతి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూపంగా వీరికి అగస్త్య మహర్షి పుడతారు. పెద్ద కుమారుడు అగస్త్యుడు కూడా గొప్ప మహర్షి. అగస్త్యుడు పుట్టాకా పులస్త్యుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్లి తపస్సులో లీనమైపోతాడు.ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుకి భగ్నం కలిగించటానికే వారిద్దరూ అక్కడికి వచ్చారని అనుకొన్న పులస్త్యుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడనుంచి పారిపోతారు.

ఈ శాపం గురించి తెలియని తృణబిందు రాజర్షి అనే రాజు కుమార్తె ఇద్విద ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి దగ్గరకి వెళ్లి విషయాన్ని చెపుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్త్యుడి దగ్గరకి వచ్చి తన కూతురిని పెళ్లి చేసుకోమని అభ్యర్దిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్త్యుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి విశ్రవసు అనే కుమారుడు పుడతాడు. ఈ విశ్రవసువే రాక్షసులనందరినీ పుట్టించాడని అంటారు. ఇతని కొడుకులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణక మరియు కుబేరుడు. ఈ  విధంగా చూస్తే పులస్త్యుడు రావణాసురునికి తాతగారు అవుతారన్న మాట.

ఒకసారి పరాశరుడు రాక్షసుల మీద కోపంతో సత్రయాగం చేస్తున్న సమయంలో అగస్త్యుడు వచ్చి ఆ యాగాన్ని ఆపమని ఆదేశిస్తాడు. అపుడు పరాశరుడు వెంటనే ఆ సత్రయాగాన్ని ఆపుతాడు. ఇది చూసిన పులస్త్యుడు పరాశరుడు అంత కోపంలో ఉండి కూడా యాగాన్ని వెంటనే ఆపినందుకు ఆనందించి వరం కోరుకోమని అంటాడు. దానికి పరాశరుడు తన మనస్సు ఎల్లప్పుడూ వేదపురాణాల మీద ఉండాలని, తను వేదశాస్త్రాల్లో గొప్ప ప్రతిభ కలిగి ఉండాలని కోరుకుంటాడు. దానికి తథాస్తు అంటాడు పులస్త్యుడు.

అలాగే భీష్ముడు ఒకసారి గంగా నదీ తీరంలో పితృకర్మలు చేస్తూ ఉండగా పులస్త్యుడు అక్కడికి వస్తాడు. భీష్ముడు అతనిని భక్తితో పూజిస్తాడు. దానికి సంతసించిన పులస్త్యుడు ఏమైనా సందేహాలుంటే అడగమని అంటాడు. దానికి భీష్ముడు తీర్థయాత్రల వల్ల కలిగే ఫలితాలని చెప్పమని కోరుతాడు. దానికి సమాదానంగా పులస్త్యుడు భీష్మా! గర్వం, కోపం, ప్రతిఫలాన్ని ఆశించకుండా  ఉండటం, తక్కువగా తినటం, నిజాలనే మాట్లాడటం, ఎప్పుడూ సంతోషంగా ఉండటం, మంచి పనులనే చేయటం, ఇలాంటివన్నీ చేసేవారు ఎటువంటి తీర్థయాత్రలు చేయకపోయినా దానికి మించిన ఫలితం లబిస్తుందని చెపుతాడు.

ఈ మద్య కాలంలోనే శ్రీలంకలో జరిగిన తవ్వకాలలో 11 అడుగుల ఎత్తు ఉన్న పులస్త్యుని విగ్రహం ఒకటి బయట పడింది. రావణాసురునికి తాతగారైన పులస్త్యుడి విగ్రహం బయటపడటం అక్కడి ప్రజలకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ విధంగా బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుడు జీవించినంత కాలం వేదనిష్టా పరాయణుడై, ఎల్లప్పుడూ నారాయణుని స్మరిస్తూ చివరికి అతనిలోనే ఐక్యమైపోతాడు. ఇదండీ పులస్త్యుని చరిత్ర.


..కళ్యాణి

సంపాతి - జటాయువు

గరుత్మంతడి సోదరుడు అయిన అనూరుడికి వారసులు సంపాతి, జటాయువు. ఇద్దరూ అన్నదమ్ములు.. భారీ దేహాలతో విశేషమైన బలం కలిగి ఉండేవారు. అన్నదమ్ములిద్దరూ ఆత్మీయతతో మెలిగేవారు. ఇద్దరూ కలిసి గగన మార్గంలో హాయిగా సంచరించేవారు. ఒకానొక రోజున ఇద్దరి మధ్యా చిన్న పంతం వచ్చింది. ‘నేను బలవంతుండనంటే.. నేను బలవంతుడననే..’ తగువులాట మొదలైంది. ఎవరు బలవంతులో తేల్చుకుందా మనుకున్నారు.

‘సూర్యోదయం మొదలు.. సూర్యాస్తమయం వరకు రవి బింబంతో ఎవరు ప్రయాణిస్తారో వారు బలవంతులు’ అని పందెం పెట్టుకున్నారు.

అనుకున్నట్టుగానే.. సూర్యోదయం అవ్వడంతోనే ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. పోటాపోటీగా ఒకరిని మించి మరొకరు ఎత్తుకు వెళ్లారు. మిట్టమధ్యాహ్నం అయ్యేసరికి.. సూర్యతాపం విపరీతంగా పెరిగిపోయింది. ఆ వేడికి తాళలేక.. జటాయువు ఎగరలేకపోయాడు.

‘అన్నయ్యా! ఎండ వేడిమికి నేను ఎగరలేకపోతున్నా! పడిపోయేలా ఉన్నాను.’ అని దీనంగా అన్నాడు 
జటాయువు

సొమ్మసిల్లి కింద పడిపోతున్న తమ్ముడిని కాపాడేందుకు సంపాతి ప్రయత్నించాడు. తన రెక్కలను తమ్ముడికి అడ్డం పెట్టి.. శక్తినంతా కూడదీసుకుని ఎగరసాగాడు. భానుడి భగభగలకు సంపాతి రెక్కలు కాలిపోయాయి.

రెక్కలు పోవడంతో.. ఎగరలేక సంపాతి అక్కడ్నుంచి నేలకూలిపోయాడు.

రెక్కలున్న జటాయువు గాలి వేగానికి మరో చోటికి కొట్టుకుపోయి నేల మీద పడిపోయాడు.

ఇలా విడిపోయిన జటాయువు, సంపాతి మళ్లీ జీవితకాలంలో కలుసుకోలేకపోయారు.

పరిస్థితులను అంచనా వేయకుండా.. బల ప్రదర్శనకు దిగితే.. ఫలితం ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది సంపాతి-జటాయువుల కథ. బుద్ధి బలాన్ని, శారీరక బలాన్ని మంచికి ఉపయోగించాలి కానీ, ప్రదర్శన కోసం కాదని వీరి వృత్తాంతం తెలియజేస్తుంది.




చరితార్థులు సంపాతి, జటాయువు

సకల ప్రాణికోటికీ కర్మ సిద్ధాంతాల ప్రకారం జన్మలు ఆదేశించబడతాయంటారు. ప్రతి పుట్టుకకూ అర్థం, పరమార్థం ఉంటాయంటారు. కానీ అందులో కొన్ని జీవితాలు సహజంగా జనిస్తాయి. మంచికోసం పోరాడి ప్రాణాలు కోల్పోయి మట్టిలో కలిసిపోతాయి. చరిత్ర పుటల్లో మాత్రం చరితార్థత పొంది సుస్థిరంగా నిలిచిపోతాయి. మానవీయ సాధనలో ఉన్నత శిఖరాన్నే అధిరోహిస్తాయి. లోకకళ్యాణ కార్యంలో తమవంతు బాధ్యతను నిర్వర్తించామనే తృప్తితో జీవితాల్నే త్యాగం చేసిన మహానుభావులెందరో.. వారిలో చరితార్థులు సంపాతీ జటాయువులు.

రామకథలో పక్షిజాతికి చెందిన మహాబలవంతులూ, భారీ శరీరంగల ధీరులు, మంచితనం కలిగిన మానసులు, ధర్మం ఎరిగిన బుద్ధులు సంపాతీ; జటాయువులు. ప్రజాపతి కశ్యపుని వంశంలో జన్మించిన వీరు మహాపక్షిరాజులై శ్వేనీ - అరుణుల సంతానమైనారు. ఉత్తమ వంశంలో జన్మించిన సంపాతీ, జటాయువులు అత్యంత శక్తివంతులు, అంతే ధర్మపరివర్తనులు. ఒకసారి వీరిద్దరి మధ్య ఎవరు బలవంతులమనే స్పర్ధ ఏర్పడి సూర్యునికి దగ్గరగా ఎవరుముందు చేరుకుంటారో చూద్దామని బయలుదేరుతారు. సూర్యుడి ప్రతాపం తెలియక కాదు. స్పర్థలోని ఉత్సాహం వారిని అంతటి సాహసానికి ప్రేరేపింపజేసింది. అలా సంపాతీ, జటాయువులు సూర్యునికి దగ్గరగా చేరుకునేంతలో సూర్యుని వేడి తాళలేక జటాయువు బాధ పడుతుంటే చూడలేక సంపాతి తన రెక్కలను సూర్యునికి అడ్డుగా పెడతాడు. అప్పటికే కళ్ళు మసకబారి జటాయువు తన జన్మస్థానంలోనే పడిపోతాడు. సంపాతి తన రెక్కలు పూర్తిగా కాలిపోగా నిస్సహాయుడై వింధ్యపర్వతంపై పడిపోతాడు. అలా చిన్ననాడే సంపాతీ జటాయువులు అనుకోకుండానే విడిపోతారు. చివరిదాకా కలుసుకోనే కలుసుకోరు. కానీ వారి సంకల్పం, లక్ష్యం మాత్రం వారికి తెలియకుండానే ఒక్కటై వారిద్దరినీ మానసికంగా ఏకం చేసిందనే చెప్పాలి. రామకార్యంలో వీరిద్దరి పాత్ర కీలకమై దిశానిర్దేశమై అమోఘమైన రూపమై అద్భుతమైన త్యాగమై నిలిచిపోతుంది.

సీతను రావణుడు అపహరించుకొనిపోయే సమయంలో రావణునితో జటాయువు పలికిన మాటలు, పోరాడిన తీరు ధర్మనిరతియై అన్యాయాన్ని సహించని ధీరత్వమయ్యాయి. జటాయువు రావణునితో రావణా! రాముడు లేని సమయంలో అతని ధర్మపత్నిని తీసుకెళ్ళడం రాజధర్మం కాదు. రాజులెవరూ శాస్త్ర విరుద్ధమైన ధర్మార్థకామాలని కోరరు. ఎందుకంటే ఆ మూడింటికీ రాజే ఆధారం, ఆదర్శం. సీతమ్మ అగ్నిగా మారి నీ వంశాన్నే కాల్చేయగలదు. రాముడి కోపాగ్నికీ నువ్వు భస్మంకాక తప్పదు. పిరికివాడిలా ఎవరూలేని సమయంలో సీతను తీసుకెళుతున్నావు. వీరులెవరూ ఇలాంటి పనులు చేయరు అని చెప్పి అరవై వేల సంవత్సరాల వృద్ధావస్థలో, ఎటువంటి ఆయుధాలు లేక, తన గోళ్ళూ రెక్కలే ఆధారంగా చేసుకొని రావణునితో భీకరపోరాటం చేస్తాడు జటాయువు. అతని హితబోధ రుచించని రావణుడు కోపంతో జటాయువు రెక్కలు, కాళ్ళు నరికేయగా నేలకొరుగుతాడు. రామునికి సీత జాడ తెలపాలని రాముడొచ్చేదాకా ప్రాణాల్ని నిలుపుకుంటాడు. సీతను వెదుకుతున్న రామునికి సీతను రావణుడెత్తుకెళ్ళాడనీ, రావణుడు వింద ముహూర్తంలో సీతను తీసుకెళ్ళాడనీ, ఆ ముహూర్తంలో పోయిన ధనం, లక్ష్మీ తిరిగి భద్రంగా యజమానికే చేరుతాయనీ ధైర్యం చెప్పి రాముని ఒడిలో ప్రాణాలు వదులుతాడు. తనతండ్రి స్నేహితుడైన జటాయువు తనకూ తండ్రి లాంటివాడేనని అంతిమ సంస్కారం చేస్తాడు రాముడు.

సీతాన్వేషణలో సుగ్రీవాజ్ఞతో అలుపెరుగక శ్రమిస్తున్న వానరులకు నిరాశ ఆవహిస్తుంది. ప్రాయోపవేశానికీ సిద్ధపడ్డ వానరులను చూసి ఆహారం దొరికిందని ఆనందపడతాడు సంపాతి. ఇంతలో వారి మాటల్లో జటాయువు చనిపోయాడనీ, సీతమ్మ జాడకోసమే వారంతా తపిస్తున్నారనీ తెలుసుకొని రెక్కలు లేని తనను వింధ్య పర్వతంపై నుండి కిందకు దింపమని వానరులను కోరుతాడు. సీతాపహరణం, రావణుడి చేతిలో జటాయువు మరణం, రామ సుగ్రీవుల మైత్రి, సీతాన్వేషణ గురించి వివరంగా తెలుసుకున్న సంపాతి తన సోదరున్ని చంపిన రావణున్ని అనేక విధాలుగా దూషించి, నూరు సంవత్సరాలుగా ఈ రామకార్యం కోసమే ఎదురుచూస్తున్నాననీ, నిశాకర మహర్షి చెప్పినట్టుగా రామకార్యంలో భాగమై వానరులకు సీత జాడను తెలియపరిస్తే తన రెక్కలు తిరిగి వస్తాయనీ వానరులతో అంటాడు సంపాతి.సీతను ఎత్తుకెళ్లింది రావణుడే. అతను వీశ్రవసుడి కొడుకు. అతని నగరం లంక. అది విశ్వకర్మ నిర్మించిన మహానగరం. సముద్రం ఆవల సరిగ్గా నూరు యోజనాల దూరంలో ఉందది. సీత అక్కడే ఉంది. దివ్యనేత్రం నా వరం. లంకలో ఉన్న సీత నాకు కనిపిస్తుంది. ఆకాశమార్గంలో వెళ్ళి సీతను చూసి రామునికి చెప్పండి. ఇక రామబాణమే మాట్లాడుతుంది. రాక్షసుల నాశనం ప్రారంభమవుతుందని వానరులతో చెబుతుండగానే సంపాతికి తిరిగి రెక్కలొస్తాయి.

శబరి

శబరి మతంగమహర్షి శిష్యురాలు. సిద్ధయోగిని.శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో కలసి నీ ఆశ్రమానికి వస్తాడు అన్న గురువు ఆదేశాన్ని తలదాల్చి మతంగముని ఆశ్రమంలోనే రాముని కోసం ఎదురు చూస్తూ ఉండి పోయిన రామ భక్తురాలు.ఎదురు చూస్తూనే వృద్ధురాలై పోయింది. రామచంద్రుడు వచ్చాడు. కుశల ప్రశ్నల అనంతరం అర్ఘ్య పాద్య ఆచమనీయాలు సమర్పించి, ఆయన కోసం ఎంతో కాలం నుంచి సేకరిస్తున్న పండ్లు ఫలాలను అందించింది. రాముని అనుజ్ఞతో యోగాగ్నిలో ప్రవేశించి, మహా యోగులు పొందే సాయుజ్యాన్ని పొందింది శబరి.

రామలక్ష్మణులు వస్తున్నారని తెలిసిన శబరి వారికి ఎదురు వెళ్లి సంప్రదాయ బద్దంగా అర్ఘ్యపాద్యాదు లందించి, రామ లక్ష్మణులు సేద తీరిన తరువాత మా గురువులు చెప్పినప్పటి నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావేమిటని చనువుగా ప్రశ్నిస్తుంది. రాముని కోసం ఎంతో కాలంగా సంపాదించి, భద్ర పరచిన ఫల, మూలాదులను ఆయనకు అర్పించింది.

దశాబ్దాల తరబడి అదే ప్రాంతంలో జీవిస్తోంది కాబట్టి ఏజాతి పండు ఎలా ఉంటుందో, ఏచెట్టు పండు ఎటువంటిదో తెలుసుకోగల నైపుణ్యం శబరికుంది. అందుకనే మంచి పండ్లను పరీక్షించి రాముని కందించింది శబరి. ఇది వాల్మీకం. అంటే “ఎంగిలి విందు” ప్రస్తావన వాల్మీకంలో లేదు. కాని “శబరి” పేరుతో కావ్యాలు రచించిన వారందరు కూడ ఎంగిలి విందు చేయించిన వారే కాని వాల్మీకిని అనుసరించిన వారు ఒక్కరు లేరు. మరి ఈ ప్రస్తావన ఎక్కడనుంచి వచ్చింది. పద్మపురాణం లో మనకు ఈ విందు ప్రస్తావన కన్పిస్తోంది.

పద్మపురాణ భాగంలో “ పరీక్ష్య, పరిభక్ష్య,పశ్చాన్నివేదయామాస” అని ఉన్న భాగాన్ని పరిశీలిస్తే శబరి కంద మూల ఫలాల మాధుర్యాన్ని పరీక్షించి భక్షించిన అనంతరమే రాఘవునికి సమర్పించిందనేది స్పష్టమౌతోంది.

శబరి వాగులోకి పండి ఒరిగిన చెట్ల ఫలాలు శబరి నీటిచే స్పృశించబడుతున్నాయి . ఆ పండ్లను రామలక్ష్మణులు స్వీకరించారు కాబట్టి శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడుతిన్నాడని జానపదకథలుగా పాడుకుంటున్నారని కొందరి వాదన.

శబరి పూర్వజన్మ వృత్తాంతం కంబరామాయణంలో కన్పిస్తోంది.
శబరి పూర్వ జన్మలో మాలిని అనే గంథర్వకన్య. గందర్వరాజైన చిత్రకవకుని ఏకైకపుత్రిక. వీతిహోత్రుని పరిణయమాడింది. భర్త యజ్ఞయాగాదులలో మునిగియుండగా ఈమె కల్మాషుడనే బోయవానితో సంబధం పెట్టుకోగా కోపించిన వీతి హోత్రుడు ఈమెను శబరవనిత గా జన్మించమని శపించాడు. రామచంద్రుని దర్శనానంతరం ఆ మహనీయుని ఆశీస్సులతో తిరిగి మాలినిగా మారిపోయి భర్తతో గంధర్వ లోకాన్ని చేరింది. అని కంబరామాయణం శబరి పూర్వ చరిత్రను ప్రస్తావించినా తెలుగు కవులెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. తులసీ ధాసు వాల్మీకి మార్గంలోనే పయనించాడు.




Rama traveled Places in Ramayana





Rama traveled Places in Ramayana?
Rama walked Places according to Ramayana?


The route followed by Rama included following places :

  1. Ayodhya: Ayodhya is on the southern banks of the river Sarayu, where Rama was born. It is now situated in the Lucknow-Varanasi rail route. When Rama decided to go to the forest acceding to the demands of Kaikeyi, Rama, Sita, and Lakshmana were driven by Sumantra (the prime minister of Dasharatha) in a chariot down south to the banks of the river Ganga. Sumantra was persuaded by Rama to return to Ayodhya and attend to the king. The northern bank of Ganga was the southern border of Kosala kingdom. Guha was the ruler of the Nishada Kingdom. He ferried the three to the southern bank of Ganga, at Rama’s request, in his boat.

  2. Prayag: After crossing the river Ganga, the trio reached (by foot) the holy confluence of Ganga and Yamuna at Prayag (also known as Triveni Sangam). They arrived at the hermitage of sage Bharadwaj, who counseled them to seek the area near the mountain of Chitrakuta, about 10 leagues (1 league= 3 miles) from PrayAg, for a peaceful stay. They crossed the river Yamuna on a raft and walked for 2 days to reach Chitrakuta.

  3. Chitrakuta: River Malayavathi flows at the foothills of the mountain Chitrakuta. Lakshmana built a modest hermitage on the banks of the river for them to reside. Life in the sylvan setting was peaceful. It is here that Bharata came from Ayodhya after learning 3 of the circumstances surrounding Rama’s life in exile. After failing to exhort Rama to return to Ayodhya he got Rama’s footwear to be placed on the throne while he would run a caretaker government for the next 14 years. The demons had an outpost at Janasthana, not far from Chitrakuta and they caused problems for the sages. The sages decided to leave that area and that decision encouraged Rama too to seek another place for his exile.

  4. Dandakaranya: This is a vast swath of territory covering the region south of the Vindhya mountain range (covering portions of Uttar Pradesh, Madhya Pradesh, Gujarat, Maharashtra, and Andhra Pradesh). Its geographical limits were Vindhya Mountains to the north, Krishna River in the south, and the mouth of Godavari River in the east. It was named for a son of Ikshvaku (ancestor of Rama) named Danda, who was banished there. The trio started moving deep into the forest and visited the hermitage of Atri and sought his blessings. The wife of Atri, Anasuya gave a gift of jewelry to Sita. It was this collection of jewelry that Sita used to drop in Kishkindha, on the way to Lanka, while Ravana carried her in the aerial car. There were many sages living in various parts of the forest. The trio kept moving from place to place, spending a month, a season, or a year at each hermitage. A period of 10 years rolled by peacefully during such transit. After visiting the sages Sarabhanga and Suteekshna, they went to visit sage Agasthya who directed them to spend the rest of the exile in a place called panchavaTi, two Yojanas down south (1 Yojana = 9 miles) on the northern banks of the river Godavari.

  5. Panchavati: Panchavati means five (Pancha) banyan (vata) trees. This is the place where Lakshmana built a bamboo cottage in a tranquil area for Rama and Sita to reside. At this site Surpanaka (Ravana’s sister) came to entice Rama failing which she got disfigured by Lakshmana. Her brothers, Khara and Dhushana, who came to her defense along with a bunch of other demons were defeated and killed by Rama and Lakshmana. The aftermath of this brought Ravana into the scene with a wicked plan to abduct Sita. The plan was for Ravana’s uncle Mareecha to assume the form of a golden deer to entice Sita, lure Rama in pursuit of it, and draw Lakshmana too away from the scene at which time Ravana would swoop in to carry Sita away.

  6. Kishkindha: After Sita was carried away by Ravana, Rama and Lakshmana wandered all over and reached Kishkindha, a mountain range in the Tungabhadra river valley. The Vijayanagar Empire of the 14th-16th centuries covered this region. VAli, the older brother of Sugreeva, ruled this region when Rama and Lakshmana arrived there. Sugreeva, shunned by VAli as a result of a misunderstanding, took refuge in the mountain called Rishyamuka parvatham. This is said to be located near the PampA Lake in the Tungabhadra river valley. It is here that Rama was served by the pious lady Sabari who attained salvation (moksham) after waiting for 12 years for Rama’s arrival and serving him delicious fruits when he came. This is also where Rama and Lakshmana struck friendship with Sugreeva and Hanuman who would aid them (after Rama killed Vali and anointed Sugreeva in the throne) with their monkey brigade to fight Ravana.

  7. Rameswaram and Dhanushkodi: After Hanuman located Sita in Lanka, Rama and Lakshmana, arrived at the southeastern tip of the land and Rama marked the place with his bow (dhanush) from where they would launch the expedition to Lanka by building a bridge (Rama setu) with rocks and trees, uprooted by the monkeys, to the northern tip of Lanka.

  8. RamSetu: The bridge to Lanka known as Rama sEtu was supposedly constructed by the monkey brigade from Dhanushkodi to the northern tip of Lanka over a region of shallow waters interrupted by sandy elevations known as shoals in the narrow straits between India and Sri Lanka. This stretch of limestone shoals between Rameswaram and the Mannar island in Sri Lanka was called Adam’s Bridge by the British. That name probably came from an Islamic legend which described the travel of Adam through that pathway to reach Sri Lanka to do penance on a peak now called Adam’s Peak. It is not difficult to visualize that such a makeshift bridge (much along the lines of the modern pontoon bridge) spanning a distance of 20 miles could be constructed with rocks and trees if the waters were shallow in that area. To add credence to such a structure NASA spacecraft Gemini-11 took some photographs from space of the said region which indicated the extensive stretch of sandy spots separated by water between the two lands. It is important to note that NASA did not conclude nor deny that it is a non-natural bridge. The satellite map only indicated the extended stretch of shoals. In addition, thousands of years ago (when Rama was supposed to have lived) the water gap between India and Lanka could have been a more sandy and a shorter span than it is now, facilitating the bridge work with the help of monkeys using rocks and trees. Marco Polo, the 13th century Venetian traveler described this area in his diaries as setabundRameswara (bridge constructed at Rameswaram).

  9. Lanka: Once Rama and Lakshmana crossed into Lanka with the monkey brigade, then a peace overture was initiated by Rama which failed. Thereupon war was declared. The actual duration of the war is not known but estimated to have lasted just 13 days from the start. The beautiful city of Lanka (supposedly built by Kubera) was destroyed. (It is likely that the old fortified city of Lanka was near the northern tip of the current island nation of Srilanka). Ravana and his associates (except for Vibhishana) were killed. At the end of the war Rama offered the throne of Lanka to Vibhishana and returned to Ayodhya in the aerial car of Ravana in time to take over the reign of the Kosala kingdom at the end of his 14-year exile.




రామాయణంలోని అంశాలను కళ్లకు కట్టే పుణ్యక్షేత్రాలు


రామాయణం ఒక ఇతిహాసం, మహా కావ్యం. రామాయణంలో చెప్పబడిన ఘట్టాలు జరిగిన ప్రదేశాలు ఎన్నో భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. అక్కడి ఆలయాలు అపారమైన భక్తివిశ్వాసాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సాక్షాత్తూ ఆ శ్రీ రాముడు నడయాడిన ప్రదేశాలు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి.

మనం పవిత్రంగా భావించే చాలా ప్రాంతాలు ఆయా ప్రత్యేకతలే కాకుండా.. పురాణ గాధలతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని పురాతన కట్టడాలు చాలా విశిష్టతను కలిగి ఉంటాయి. అయితే రామాయణంతో ముడిపడిన కొన్ని పవిత్ర స్థలాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సీతారాములు అడుగుపెట్టిన ఎన్నో ప్రాంతాలు ఇప్పటికి చిరస్మరణీయంగా మిగిలాయి.

భారతీయులు చాలా ప్రాంతాలను పవిత్ర, పుణ్య స్థలాలుగా భావిస్తారు. కానీ వాటి వెనక రామాయణ విశేషాలు ఉన్న విషయం అందరికీ తెలియకపోవచ్చు. ఇంతకీ రామాయణంతో ముడిపడిన పవిత్ర పుణ్యక్షేత్రాలు, వాటి విశేషాలేంటో చూద్దాం..

నాసిక్
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో నాసిక్ ఒకటి. ఇది ముంబైకి 187 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరణ్యవాసానికి వెళ్లినప్పుడు శ్రీరామ చంద్రుడు నాసిక్ లో కొన్ని రోజులు నివసించారు. రావణుడు సీతను అపహరించింది కూడా ఇక్కడి నుంచే. అంతేకాదు రావణుడి సోదరి సూర్పనక ముక్కును లక్ష్మణుడు కోసినది కూడా ఇక్కడే. అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరు వచ్చింది.

కుంభమేళా
నాసిక్ లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. నాసిక్ లో రామకుండ అనేది ప్రధాన తీర్థయాత్ర స్థలం. ఇక్కడ రాముడు, సీత స్నానాలు చేసేవాళ్లని అందుకే దీన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఇందులో ఎముకలు ఈజీగా కలిసిపోతాయి.. అందుకే ఇందులో చనిపోయిన వాళ్ల అస్థికలు కలుపుతారు. కాబట్టి దీన్ని అస్థి విలయ తీర్థ అని కూడా పిలుస్తారు.

నాసిక్ లో దశరథ మహారాజు అంత్యక్రియలు
శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు అంత్యక్రియలు కూడా ఇక్కడే నిర్వహించినట్లు ప్రస్తావన ఉంది. అంతేకాదు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొందరు ప్రముఖుల అంతిమ సంస్కారాలు ఇక్కడే జరిగాయి.

రామేశ్వరం
రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు రామాయంతో ముడిపడి ఉన్నాయి. రామేశ్వరంలోపలికి వెళ్లాలంటే ఇక్కడ ఉన్న బ్రిడ్జి దాటాల్సి ఉంటుంది. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేనతో కలిసి ఈ బ్రిడ్జ్ దాటడానికి రాళ్లు వేసివెళ్లినది ఇక్కడే. దీన్ని లక్ష్మణ తీర్థ, రామ తీర్థ అని పిలుస్తారు. బాణాలను గ్రౌండ్ లోకి విసిరిన ప్రాంతాన్ని కోడి తీర్థ అని, రాముడు తన జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించిన ట్యాంక్ ని జట తీర్థ అంటారు.

హంపి 

విజయనగర సామ్రాజ్యానికి రాజధాని హంపి. విజయనగర సామ్రాజ్యానికి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది సైన్యం ఉండేది. అయితే రాముడికి హంపికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? ఉంది. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారి కలిసిన ప్రాంతం. అలాగే పార్వతి తన భర్త అయిన శివున్ని కలిసినది కూడా ఇక్కడే.

కిష్కింద
హంపి నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉంది అనేగుడి. ఇక్కడ తుంగబద్ర నది ప్రవహిస్తుంది. అయితే ఈ ప్రాంతానికి పురాణగాధ ఉందని స్థానికులు నమ్ముతారు. అదే రాముడు హనుమంతుడు, సుగ్రీవుడిని కలిసిన కిష్కిందగా భావిస్తారు. రామాయణంలో ప్రస్థావించిన రిష్ ముఖ్ పర్వతం హంపికి దగ్గరలోనే ఉంది.

కిష్కంద - పురాతన ప్రాంతం 

కిష్కందను సుగ్రీవుడు, బాలీ పాలించారు. వీళ్లద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ఆ తర్వాత సుగ్రీవుడు మాతాంగ పర్వత కొండపై నివసిస్తాడు. ఇది చాలా ఫేమస్ వ్యూ పాయింట్. రావణుడు సీతను అపహరించుకుని వెళ్లాక.. రామలక్ష్మణులు సుగ్రీవుడు, హనుమంతుడిని ఇక్కడే కలుస్తారు.

బాలీ 

బాలీని రాముడు చంపి.. తన సామ్రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తారు. సీతను వెతకడానికి హనుమంతుడు వెళ్లినప్పుడు రాముడు మాల్యావంట కొండపై నివసిస్తాడు. ఇది కంప్లి సమీపంలో ఉన్న విరూపాక్ష ఆలయం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే ఉన్న రంగనాథ ఆలయంలో శ్రీరాముడి పెద్ద విగ్రహం ఉంటుంది.

విరూపాక్ష ఆలయం 

విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం మధ్యలో తుంగభద్ర నటి ప్రవహిస్తుంటుంది. ఇక్కడే సుగ్రీవుడు సీతమ్మ తల్లి ఆభరణాలను దాచిపెడతారు. ఇక్కడ సీతాదేవి ఆభరణాలు పెట్టినట్టు గుర్తులు కూడా కనిపిస్తాయి.

రామాలయం 

కర్ణాటక సమీపంలో ఉన్న హజర రామా టెంపుల్ చాలా ప్రసిద్ధమైనది. 15వ శతాబ్ధంలో ఈ ఆలయంలో రామాయణానికి సంబంధించిన ఎన్నో శిల్పాలు, చిత్రాలు ఇక్కడ కనిపిస్తాయి. రామాయణ ఇతిహాసాన్ని శిల్పాల రూపంలో ఇక్కడ గోడలపై మలిచారు. అయితే ఇప్పడు అవి కనుమరుగైపోయాయి.

గుహ
విరూపాక్ష ఆలయం, విఠలాలయం మధ్య ప్రవహించే తుంగభద్ర నదికి సమీపంలో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడే సుగ్రీవుడు సీతాదేవి ఆభరణాలు దాచిపెట్టిన ప్లేస్ ని పెయింటింగ్ ద్వారా వివరించాడట.

కోదండరామ ఆలయం 

కోదండరామ ఆలయంలో సీతా, రామ లక్ష్మణుల పెద్ద పెద్ద విగ్రహాలున్నాయి. ఇది స్నానాల ఘాట్ కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడే సుగ్రీవుడిని వానర రాజుగా రాముడు ప్రకటించారు.

విఠల ఆలయం 

తుంగభద్ర నదికి దక్షిణవైపుగా ఉంది విఠల ఆలయం. ఇక్కడ సంగీత స్వరాలు వినిపించే స్థంభాలు ఉండటం చాలా విశేషం. ఈ ఆలయం హంపిలోనే అత్యంత ప్రత్యేకమైనది. దీనికి దగ్గరలోని మాతాంగ కొండపై వీరభద్ర ఆలయం ఉంది. అక్కడే శ్రీరాముడు నివసించాడు.

చిత్రకూట 

ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ్ బార్డర్ లో ఉంది చిత్రకూట. 14 ఏళ్ల వనవాసం సమయంలో ఇక్కడ ఉన్న అడవిలో సీతారాములు నివసించారు. 14ఏళ్ల వనవాసం సమయంలో 11 ఏళ్లు ఇక్కడే నివసించారు సీతారాములు.

సంబంధం 

రాముడి సోదరుడు భరతుడు చిత్రకూటకు వచ్చి.. తన అన్నను అయోధ్యకు తిరిగిరావాలని కోరాడు. అయితే తండ్రి మాట తప్పనని ఇక్కడే ఉంటానని తెలిపాడు రాముడు.

పంచవటి 

హిందూ పురాణాల ప్రకారం రామాయణంలో పంచవటిని ప్రస్తావించారు. పంచవటి అనేది దండకారణ్యంలో ఒక ప్రాంతం. ఇక్కడే శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో కలిసి నివసించడానికి ఇల్లు నిర్మించుకున్నాడు. పంచవటి అంటే ఐదు మర్రిచెట్టు ఒకే చోట ఉండటం అని అర్థం.

రామ్ కుండ్ 

ఈ తీర్థం హిందువులకు చాలా పవిత్రమైనది. ఇక్కడ ఎవరైతే మునుగుతారో వాళ్ల కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. నాసిక్ లో నివసించిన సమయంలో రాముడు ఈ తీర్థంలోనే స్నానం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే గోదావరి నది వరుణి, తరుణి అనే రెండు నదులతో కలుస్తుంది. ఇలా మూడు నదులు కలవడాన్ని త్రివేణి సంగమం అంటాం.

సీతాదేవి లవకుశలకు జన్మనిచ్చిన స్థలం 

బితూర్ బితూర్ అనే ప్రదేశం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశంలోనే వాల్మీకి ఆశ్రమం ఉంది. అంతే కాక సీతా దేవి లవకుశలను జన్మనిచ్చిన ప్రదేశం గా అభివర్ణిస్తారు. ఇక్కడే సీతాదేవి భూదేవిలో ఐక్యమైనది.

సీతారాములు నడిచిన ప్రాంతం 

ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో భద్రాచలం ఒక చిన్న గ్రామం. రాముడు తన వనవాసం సమయంలో సీతా, లక్ష్మణులతో కలిసి ఇక్కడ కొంత కాలం నివసించాడు. ఈ ప్రదేశంలో సీతా రామ లక్ష్మణులు నడియాడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.

ముక్తిదాం ఆలయం 

ముక్తిదాం ఆలయం నాసిక్ రోడ్ లో ఉంది. ఈ ఆలయ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. వైట్ మార్బుల్ తో దీన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 18 అధ్యయాల భగవద్గీతతో కూడిన బొమ్మలు ఉన్నాయి. అలాగే 12 జ్యోతిర్లింగాల విగ్రహాలున్నాయి.

కలరామ్ టెంపుల్ 

ఇది రామాలయం. కలరామ్ అంటే నలుపు రాముడు అని అర్థం. ఈ ఆలయాన్ని ప్రతి యేటా వేలాది మంది సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న 70 అడుగుల బ్లాక్ స్టోన్ స్ర్టక్చర్ చూడటానికే ప్రజలు ఆసక్తిచూపుతుంటారు.

సీతమ్మ దాహం తీర్చిన రాముడు 

సీతమ్మవారి దాహాన్ని రాముడు తీర్చిన ప్రదేశంగా చెప్పబడుతుంది కడపజిల్లా ఒంటిమిట్ట. ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామున్ని సీతను లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరిక ప్రకారం శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని పురాణం చెబుతోంది.

సీతారాములు సంచరించిన రామగిరి 

ఖమ్మం జిల్లా రామగిరిలోనూ సీతారాముల ఆనవాళ్లున్నాయి. వనవాసం సమయంలో శ్రీరాముడు రామగిరిపై కొంతకాలం కుటీరం ఏర్పరుచుకుని సీతా లక్ష్మణులతో ఉన్నారని స్థానికులు చెబుతారు. సీతారామలక్ష్మణులు సంచరించినట్లు కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఒక బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరించిన కొలనుతోపాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా ఉంది.

త్రయంభకేశ్వర్ 

ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో త్రయంభకేశ్వర్ ఒకటి. అంతేకాదు 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఇక్కడ ఉండటం విశేసం. నాసిక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఈ ఆలయం దర్శించిన తర్వాత మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

సోమేశ్వరాలయం 

శివుడు, హనుమంతుడి ఆలయాల్లో ఇది కూడా పురాతనమైనది. నాసిక్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. గోదావరి నది పైన ఈ ఆలయం ఉంది.

రామ్ సేత్ ఫోర్ట్ 

రామ్ సేత్ ఫోర్ట్ నాసిక్ కి 10 కిలోమీటర్ల దూరంలో పిండోరి గ్రామానికి దగ్గరలో ఉంది. పురాణాల ప్రకారం రాముడు ఇక్కడే సేద తీరేవాడని తెలుస్తోంది.

కపలేశ్వర ఆలయం 

నాసిక్ లో ఉన్న పురాతన ఆలయాల్లో కలపేశ్వర ఆలయం ఒకటి. ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ నంది ఉండదు. అదే ఇక్కడి ప్రత్యేకత.



పురాణ విజ్ఞానం


1. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఏ పర్వతంపై కొన్నాళ్లు నివాసమున్నారు?
చిత్రకూట పర్వతం
2. వాలి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి సుగ్రీవుడు ఏ పర్వతంపై తలదాచుకున్నాడు?
రుష్యమూక పర్వతం
3. సీతాన్వేషణ కోసం లంకకేగిన ఆంజనేయుడు ఏ పర్వతం నుంచి సముద్ర లంఘనం చేశాడు?
మహేంద్రగిరి
4. సముద్రం దాటుతున్న ఆంజనేయుడికి ఆతిథ్యమిచ్చిన పర్వతం ఏది?
మైనాక పర్వతం
5. సముద్రం దాటిన ఆంజనేయుడు లంకలోని ఏ పర్వతంపై మొదట కాలుమోపాడు?
లంబగిరి




ఋష్యమూక పర్వతము

కిష్కింధకు సమీపమునగల ఒక పర్వతము పేరు ఋష్యమూకము. ఋష్యములు అను ఒక జాతి జింకలు మౌనముగా తిరుగుచుండుటచే దానికి ఋష్యమూకము అను పేరు ఏర్పడినది. దీనిపై మతంగమహర్షి తపస్సు చేసుకొనుచుండెడి వాడు. వాలి దుందుభియను రాక్షసుని చంపి అతని శరీరమును ఎగురవేయగా ఆ రక్తము వచ్చి, మతంగ మహర్షి పై బడెను. అందులకు కుపితుడై ఆ మహాముని వాలి ఈ పర్వతముపై అడుగుపెట్టినచో మృతుడగుగాక! అని అతనిని శపించెను. కనుక వాలి ఆ కొండ మీదికి రాజాలడు. అందు వలననే వాలికి భయపడిన సుగ్రీవుడు తల దాచుకొనుటకై ఈ పర్వతమును ఆశ్రయించెను.




1. రావణ బ్రహ్మ తండ్రి పేరు?

విశ్రవసు బ్రహ్మ
2. రావణాసురుడి భార్య అయిన మండోదరి తండ్రి ఎవరు?
మయాసురుడు
3. రావణ పుత్రుడైన ఇంద్రజితకు గల మరోపేరు?
మేఘనాథుడు
4. యుద్ధానికి బయల్దేరే ముందు ఇంద్రజిత ఏ హోమం చేసేవాడు?
నికుంభల
5. ఇంద్రజిత భార్య పేరు ఏమిటి?
సులోచన


ప్రత్యంగిరా : 
ప్రత్యంగిరా విద్య అనేది త్రిప్పి కొట్టే విద్య. పర ప్రయోగములను త్రిప్పి కొట్టుట కొరకు, శత్రువుల మీద ప్రయోగములు చేయుట కొరకు, భూత, ప్రేత ఇతర అన్ని దుష్ట శక్తులను, మరియు కొన్ని రోగములను పార ద్రోలుటకు దీనిని ప్రయోగించేదరు. దుష్ట గ్రహ, పిశాచ, రోగ భాధా నివారణ కోరకు ప్రత్యంగిరా హోమము చేయ బడును. ఏ శత్రువు ఎంతటి ప్రయోగము చేసినా దానిని నివారించటమే గాక తిరిగి వెళ్లి పంపిన వానినే చంపి వేసే లక్షణం ఈ విద్యలో కలదు.. ఇతర దేవతలను పూజించినట్లు గాదు ఈ దేవత పూజ. దీనికి గాను ప్రత్యేకమైన కల్పము కూడా వున్నది. భాగవతంలో కాశీ రాజు శ్రీకృష్ణుని మీద అభిచారిక హోమము చేయించి, కృత్యను ప్రయోగిస్తాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు అభిచారిక హోమము చేయించి, పాండవుల మీదకు మంత్ర ప్రయోగముతో కృత్యను పంపుతాడు. ఇలా చాలా చోట్ల ఈ ప్రయోగములు వున్నవి. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో 'కృత్య'గానూ దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు)లోని అయ్యావరే అడవిలో నికుంభిలగానూ... ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక. నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.




































రామాయణం గురించి కొన్ని అద్భుత విషయాలు

రామాయణం ఒక భూగోళ శాస్త్రము. సీత జాడకోసం వెతకడానికి వెళుతున్న వానరులకు సుగ్రీవుడు వింధ్య పర్వతం నాకు నలు దిక్కులా ఏమేమి విశేషాలున్నాయో, ఎటు వైపు ఏ నదులు, దేశాలు, ఏ ఏ సముద్రాలున్నాయో నిశితంగా వివరిస్తాడు. రామాయణ కాలం నాటి భూగోళ రూపు రేఖలు నేటికి కొన్ని మారినప్పటికీ మనం నేటికీ కొన్ని అన్వయిన్చుకోవచ్చును. అంతే కాక ఇప్పట్లోలాగా ఉపగ్రహాలు, గూగుల్ మ్యాపులు లేకుండా ఎంత ఖచ్చితంగా భూగోళ వివరాలను ఎలా వివరించాగలిగాడో ఒక సారి ఆలోచించండి. ఒకసారి అప్పుడు సుగ్రీవుడు చెప్పిన వివరాలు అవలోకించండి.

తూర్పు దిక్కునకు వినతుడి ఆధ్వర్యంలో వానర సైన్యాన్ని పంపుతూ అటు వైపు వివరాలిలా చెబుతాడు:
ముఖ్యమైన నదులు : గంగ, సరయు, కౌశికి, యమునా నది, యామునగిరి , సరస్వతి , సింధు;
నగరాలు : బ్రహ్మమాల  విదేహ, మాళవ, కాశి, కోసల, మగధ నగరాలు, పుండ్ర, అంగ,
అవి దాటాక సముద్రములో గల పర్వతములు, వాటి మధ్య ద్వీపములు, ( నేటి మన భారత దేశ ఈశాన్య రాష్ట్రాలను ఒకసారి పరికించండి)
తరువాత శిశిరము అను పర్వతము పిమ్మట సముద్రము (Andaman Sea)
యవద్వీపము, సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపం, - బంగారు వెండికు నెలవైనవి (Burma, Laos, ఇతరత్రా) ఇక్కడ చేపలను పచ్చిగా తింటారు. కొన్ని నేడు సముద్ర గర్భంలో కలిసిపోయి ఉండవచ్చును.
తరువాత శోననదము, అటుపై నల్లగా వుండే ఇక్షు సముద్రం ( నేడు ఒక సారి చూడండి ముదురు ఆకుపచ్చ రంగులో – సుమారు నలుపు రంగులో కనబడుతుంది South China Sea )
అటుపై లోహితము, మధు సముద్రము (East China Sea)
తరువాత శాల్మలీ ద్వీపము (Taiwan)
ఋషభము అని పర్వతము
మధుర జలధి (Sea of Japan [also known as East Sea] )
ఔర్వుడు వలన హయముఖము (అగ్నిశిఖరం) (Korea)
13 యోజనాల దూరంలో బంగారు పర్వతము – జాత రూప శిలము
ఉదయాద్రి (Land of Rising sun ) (Japan )
తరువాత క్షీరోదము అను సముద్రము (North Pacific Ocean)
అక్కడ వరకు మాత్రమె అతను చెప్పగలిగాడు.

దక్షిణ దిక్కుకు అంగదుడు, హనుమంతుడు వంటి వీరులను పంపుతూ అక్కడి వివరాలిలా చెబుతాడు.
నదులు : గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద , మహాభాగా
దేశాలు : మేఖల, ఉత్కళ, దశార్ణ , అవంతి, విదార్ధ, మూషిక, వంగ, కాలింగ, కౌశిక దండకారణ్యం, గోదావరి పాయఆంద్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ, మలయ పర్వతం అటుపై కావేరి,
పాండ్య దేశానంతరం మహా సముద్రం (Bay of Bengal) దానిలో మహేంద్రగిరి అటుపై 100 యోజనాల దూరంలో లంక
మరొక 100 యోజనాల దూరంలో పుష్పితకము (Australia) , అటుపై 14 యోజనాల దూరంలో సూర్యవంతము (New Zealand) ,విఅడుత్యము , కుంజరము, భోగవతి ,వృషభ పర్వతము (Antarctica)
అది దాటాక భూమి సరిహద్దు

పశ్చిమ దిక్కుకు సుషేణుడు
వున్న రాజ్యాలు : సౌరాష్ట్ర, బాహ్లిక, శూరా, భీమ, అటుపై మరుభూమి మిట్ట నెలలు ( ఎడారులు ) Afghanistan తరువాత సముద్రము
మురచీ, అవంతి , అటుపై సింధు నదము (మనలను సింధు నాగరికత పేరుతో నేడు ఆంగ్లేయులు హిందూ అని పిలుస్తున్నారు), అటుపై హేమగిరి, పారియాత్రము, చక్రవంతము – కొండ
60 యోజనాల దూరంలో వరాహగిరి – ప్రాగ్జోతిష పురము (భారతంలో చెప్పిన ప్రాగ్జోతిష్ పురము వేరు), సర్వ సౌవర్ణ పర్వతము, మరి కొన్ని పర్వతాలు
మేరు పర్వతము ( ఇతః పూర్వం మనము ముచ్చటించుకున్న మేరు పర్వతం మన భూగోళానికి రిఫరెన్స్ గా వున్న పాయింట్)
10000 యోజనాల దూరంలో అస్తాద్రి ( United Kingdom) (రవి అస్తమించని దేశం )
తరువాత సరిహద్దు

ఉత్తర దిక్కుకు శతవాలి
ముందుగా హిమవత్పర్వతము అటుపై మ్లేచ్చ దేశములు, పులిందులు, ఇంద్రప్రస్థ, Tankana, చీనా, పరమ చీనా,(నేటి China), కాల ప్రవతము (Kazakstan ), హేమగర్భము (Mongolia) సుదర్శనము
దేవసాఖ శైలము అటు పై శూన్య ప్రదేశము (Russia) తరువాత తెల్లని హిమంతో కూడుకున్న పర్వతము – కైలాసము, అటుపై క్రౌన్చగిరి, ఇంకా హిమం తో వున్నా మరి కొన్ని పర్వతాలు (Russia)
లవణ సముద్రము ( కార సి), సోమగిరి (Bolshevik) పిమ్మట సరిహద్దు
అంతకు మునుపు టపాలలో మనకున్న టెక్టోనిక్ ప్లేట్ లు కదులుతున్నాయని ప్రస్తావించడం జరిగింది. కాలగర్భంలో ఎన్నో భౌగోళిక మార్పులు జరిగాయి. కొన్ని ఖండాలకు ఖండాలు సముద్ర గర్భంలో కాలిపోయాయి, కొత్తవి వెలికి వచ్చాయి. కానీ కొన్ని మార్పు లేకుండా వున్నాయి.

ఇక్కడ మనం గమనించ వలసినది ఏమిటంటే ఇంత టెక్నాలజీ లేకుండా ఎప్పుడో రచించ బడిన రామాయణంలో ఇంత ప్రస్ఫుటంగా భౌగోళిక వివరాలు పొందు పరచబడి వున్నాయి.
ఎవరన్నారండి మన వాజ్మయం పుక్కిట పురాణాలు అని.

రామాయణంలో స్త్రీ పాత్రలు









రామాయణంలో స్త్రీ పాత్రలు



భారతీయ సంస్కృతికి ఆకరములు అనదగిన మహాభారత, రామాయణాది కావ్యాలలో రామాయణం ఒక విశిష్ట గ్రంథం. హిందువులకు భగవద్గీత మాదిరి ఇది కూడా ఒక ప్రమాణ గ్రంథం. చతుర్విధ పురుషార్థాలను బోధిస్తుంది కనుక దీనిని ఇతిహాసం అనీ, వాల్మీకి చేత వ్రాయబడింది కనుక ఆదికావ్యమనీ అంటారు. ఈ గ్రంథం శ్రీరాముని చరిత్రను చెబుతున్నది కనుక రామాయణం అనీ, సీత చరిత్రను వర్ణిస్తుంది కనుక సీతాయాశ్చరితమని, రావణుని వధ గురించి చెబుతున్నది కనుక పౌలస్త్యవధ అనీ పిలువబడుతున్నది. ఈ కావ్యంలో అనేక దేవ, మానవ, వానర, రాక్షస పాత్రలు ఉన్నాయి. వాటిలోని స్త్రీ పాత్రలకు సంబంధించిన వివరాలు:

  1. అంజన - కుంజరుని కుమారై వానర స్త్రీ. కేసరి భార్య. ఆంజనేయుని తల్లి.
  2. అనసూయ - అత్రి మహర్షి భార్య. సీతకు పతివ్రతాధర్మాలను బోధించింది.
  3. అరుంధతి - వశిష్ట మహర్షి భార్య.
  4. అహల్య - గౌతముని భార్య. పతివ్రత. రాముని పాదము సోకగానే శాప విముక్త అయ్యింది.
  5. ఊర్మిళ - లక్ష్మణుని భార్య, జనక మహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె నిద్రిస్తూ ఉందిట.
  6. కైకసి - రావణుడు మరియు కుంభకర్ణుల తల్లి.
  7. కైకేయి - దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.
  8. కౌసల్య - దశరథుని మొదటి భార్య. రాముని తల్లి.
  9. ఛాయాగ్రాహిణి - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.
  10. జంఝాట
  11. తాటకి - మారీచ, సుబాహువుల తల్లి. రాక్షసి.
  12. తార - వాలి భార్య. అంగదుని తల్లి. వాలి మరణానంతరం అతని తమ్ముడు సుగ్రీవుడు ఈమెను పెళ్లాడాడు.
  13. త్రిజట - రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకతె.
  14. ధన్యమాలిని - రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.
  15. నల - విభీషణుని కుమార్తె.
  16. మండోదరి - రావణుడి భార్య. ఇంద్రజిత్తు, మేఘనాథుల తల్లి.
  17. మంథర - కైకేయి చెలికత్తె. కైకేయికి దుర్బోద చేసి రాముడు అరణ్యవాసం చేయడానికి కారకురాలు అయ్యింది.
  18. మాండవి - కుశధ్వజుని కుమార్తె. భరతుని భార్య.
  19. రేణుకాదేవి - జమదగ్ని భార్య. పరశురాముని తల్లి.
  20. లంకిణి - లంకను కాపలాగా ఉన్న ఒక రాక్షసి .
  21. వేదవతి - సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు.
  22. శబరి - రాముని భక్తురాలు. సిద్ధయోగిని. మతంగమహర్షి శిష్యురాలు. రాముని రాకకై ఎదురు చూసిన వృద్ధురాలు.
  23. శాంత - దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.
  24. శూర్పణఖ - రావణుని చెల్లెలు. రాముని వనవాస కాలంలో అతనిపై మోజుపడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేశాడు.
  25. శ్రుతకీర్తి - కుశద్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య.
  26. సరమ - విభీషణుని భార్య.
  27. సింహిక - హనుమంతుని చేత సంహరింపబడిన రాక్షసి.
  28. సునయన - జనక మహారాజు భార్య.
  29. సుమిత్ర - దశరథుని భార్య. లక్ష్మణ,శత్రుఘ్నుల తల్లి.
  30. సురస - నాగమాత. హనుమంతునిచే ఓటమి పాలయ్యింది.
  31. సులోచన - ఇంద్రజిత్తు భార్య
  32. సీత - జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులో లభించింది. రాముని భార్య.




Monday, 8 May 2017

ఏడుకొండలవాడి సప్తగిరుల గాథలు

శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి ముఖ్యామ్‌
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదన్తి
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌

శేషాద్రి, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, వృషాద్రి, వృషభాద్రి అనే ఏడుకొండల సమాహారమే తిరుమల దివ్యక్షేత్రం. అందువల్లే ఇక్కడ కొలువైన స్వామిని, ఏడుకొండల వాడని, సప్తగిరీశుడని పిలుస్తుంటారు. ఏడుకొండల పేరుతో శ్రీశైలపతి, శేషాచలపతి, గరుడా చలపతి, వేంకటా చలపతి, నారాయణుడు, వృషాచలపతి, వృషభాద్రిపతి అని కూడా అంటారు. తిరుమలేశుడు ఇలా ఎన్ని పేర్లున్నా ఏడుకొండల వాడా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. భక్తులు ఏడుకొండల వాడా, వేంకట రమణా గోవిందా గోవిందా.. అని ఆర్తిగా పిలుస్తారు. స్వామివారు వెల్లకిలా పడుకొని వున్న ఆకృతిలో కనిపించే, స్వామివారు వేంచేసి వున్న, స్వామికి ఇష్టమైన ఏడుకొండలను గురించి క్లుప్తంగా తెలుసుకొందాం.

శేషాద్రి
ఈ కొండను పరిశీలనగా చూస్తే శ్రీ మహావిష్ణువు పాన్పు అయిన ఆదిశేషుని ఆకారంలో వుంటుంది. ఆదిశేషుడు శ్రీమహావిష్ణువుకి పాన్పుగా, పీఠంగా, గొడుగుగా సేవిస్తూ ఉంటాడు. ఒకానొకప్పుడు ఈ ఆదిశేషునికి, వాయుదేవునికి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వివాదం ఏర్పడి 'నీకు శక్తి ఉంటే నన్ను కదల్చు' అంటూ ఆదిశేషుడు వేంకటాచలాన్ని చుట్టుకుంటాడు. వాయుదేవుడు పర్వతాన్ని చుట్టుకున్న ఆదిశేషుణ్ణి బలంగా విసరివేయగా పర్వతంతో పాటు ఇక్కడ వచ్చి పడతాడు. ఓడిపోయిన కారణంగా చింతతో ఉన్న ఆదిశేషుణ్ణి శ్రీనివాసుడు ఓదారుస్తూ నిన్ను నేను ఆభరణంగా ధరిస్తానని, ఈ క్షేత్రం నీ పేరుతో ప్రసిద్ధి చెందేలా వరమిస్తానని ఊరడించాడు. ఆనాటి నుండి ఇది శేషాచలం అనీ శేషాద్రి అనే పేర్ల ను పొందడమే గాక, శ్రీనివాసుడు శేషాచలపతి నామధేయంతో నాగాభరణుడై విలసిల్లుతున్నాడు.

గరుడాద్రి
సహజసిద్ధంగా గరుడ ఆకారంలో ఏర్పడిన కొండ ఇది. శ్రీమహావిష్ణువు హిరణ్యాక్షుని ఆదివరాహరూపంతో సంహ రించి భూదేవిని రక్షించిన పిదప గరుత్మం తుని పిలిచి శ్రీవైకుంఠానికి వెళ్లి తన క్రీడాద్రిని తెమ్మని ఆదేశిస్తాడు. గరుత్మంతుడు తెచ్చినం దువల్లే ఇది గరుడాచలం అని, గరుడాద్రి అని ప్రసిద్ధి పొందింది.

వేంకటాద్రి
వేం అనగా సమస్త పాపాలను, కట: దహించునది అనగా పాపరాశులను భస్మం చేసేది కనుక ఈ దివ్యక్షేత్రాన్ని వేంకటాచలం అని పిలుస్తున్నారు. వేం అమృతత్వాన్ని, కట: ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నందువల్ల కూడా ఈ క్షేత్రం వేంకటాద్రి అని కూడ పేరు పొందింది. అందువల్లే స్వామి వేంకటేశ్వరుడనే పేరు పొందాడు.

నారాయణాద్రి
పూర్వం ఒకానొకప్పుడు నారాయ ణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణీ తీరాన తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన వేంకటాచలపతి వరం కోరుకొమ్మని చెప్పగా నారాయణుడు ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ధి పొందాలనీ, అందులో శ్రీనివాసుడు ప్రత్యక్షంగా భక్తులకు దర్శనమివ్వాలనీ ప్రార్ధిస్తాడు. ఆ భక్తుని కోరిక మేరకు ఈ పర్వతం నారాయణాద్రి అనీ, నారాయణాచలం అని పేరు పొందింది.

వృషాద్రి
వృషాద్రి, వృషభాద్రి రెండు సమానార్ధకాలుగా స్వీకరించి వృషభాసుర వృత్తాంతం వల్ల ఆ పేర్లు ఏర్పడ్డాయని కొందరు అంటారు. ప్రత్యేకంగా వృషాద్రి అనే పేరుతో కూడా ఈ పర్వతం ప్రసిద్ధి పొందింది. వృషమనగా ధర్మం. ధర్మదేవత తన అభివృద్ధికై ఈ పర్వతంపై తపస్సు చేసినందువల్ల వృషాద్రి అని పేరు కలిగింది.

వృషభాద్రి
పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై విశృంఖలంగా సంచరించేవాడు. దుష్టుడై లోక కంటకుడుగా విహరిస్తున్న వృషభుడు కిరాత వేషధారియైన శ్రీహరితో యుద్ధా నికి తలపడ్డాడు. ఆ ఘోర యుద్ధంలో చిట్టచివరకు శ్రీనివాసుడు సుదర్శన చక్రాన్ని వానిపై ప్రయోగించాడు. ఎదురులేని సుదర్శనాయుధంతో తనకు చావు తప్పదని భావించిన వృషభుడు శ్రీమహావిష్ణువును ఇలా ప్రార్థించాడు.

ఆద్య ప్రభృతి చాయం వై గిరి రుచ్ఛిత శేఖర:
మదాఖ్యయా ప్రధాం యాతు వృషభాచల ఇత్యపి.


పరంధామా నన్ను సంపూర్తిగా క్షమించవలసింది. పర మాత్మా! నీ చేతిలో అందులోను నీ సుదర్శన చక్రా యుధంతో మరణించడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. కాని నాదొక కోరిక. నా ఈ చివరి కోరికను తీర్చగల కరుణా మయుడవు నీవు. ఇక్కడే ఈ పర్వతం మీదే వెలసి నీవు వుంటావు కదా. మరి నీవు ఉన్న ఈ పర్వతం వృషభాచలం అని నా పేరుతో ప్రసిద్ధమగునట్లు అనుగ్రహించవలసింది. అంటూ కన్నుల నిండుగా నీళ్లు కారుతుండగా భక్తి ప్రపత్తులతో శరణువేడుతూ అభ్యర్ధించాడు. వృషభాసురుని ప్రార్ధనను ఆల కించిన భగవానుడు వృషభాసురా! నీవు కోరినట్లుగా అవుతుంది. నేటి నుంచి ఈ పర్వతం వృషభాద్రి పేరుతో ప్రసిద్ధి పొందుతుంది. అంటూ తన సుదర్శన చక్రంతో రాక్షసుని వధించాడని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది.

అంజనాద్రి
త్రేతాయుగం నాటి గాథ ఇది. కేసరి అనే వానర రాజు ఉండేవాడు. ఆయన భార్య అంజనాదేవి. ఈమెకు సంతానం లేనందువల్ల చింతిస్తూ మాతంగు ముని దగ్గరికి వెళ్లి, తన బాధను వెళ్లబోసుకుంది. వెంటనే మాతంగుడు ఆలోచించి ఇలా అన్నాడు.

'అమ్మా పంపానదికి తూర్పు దిక్కున ఐదువందల యోజనాల దూరంలో నారసింహక్షేత్రం ఉంది. దానికి దక్షిణ దిక్కునే నారాయణగిరి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామి పుష్కరిణి అనే పవిత్రమైన తీర్ధాజలం వెలసివుంది. ఆ కోనేటికి ఉత్తర దిక్కున ఒక క్రోశం దూరంలో ఆకాశగంగ అనే పవిత్ర తీర్ధం నెలకొని వుంది. అందులో ప్రతి దినం స్నానం చేస్తూ పన్నెండేళ్లపాటు తపస్సు చేస్తూ ఉండు. నీకు తప్పక గుణవంతుడు, శ్రేష్టుడు, అనంత బలశాలి, సర్వలోక ప్రసిద్ధుడు అయిన పుత్రుడు కలుగుతాడు' అంటూ ఆశీర్వదించి పంపాడు.

మాతంగ ముని ఆదేశానుసారం అంజనాదేవి వేంకటాచల క్షేత్రాన్ని చేరుకుని స్వామి పుష్కరిణిలో స్నానం చేసింది. ఆ పుష్కరిణీ తీరంలో ఉండే అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి, ఆ పక్కనే వున్న శ్రీవరాహస్వామిని దర్శించింది. పిదప ఆకాశగంగ తీర్ధానికి చేరుకుని, అక్కడ ఉపవాస దీక్షతో వ్రతమాచరించింది. ఇలా ఒక సంవత్సరం గడిచిన తర్వాత, వాయుదేవుడు ప్రతిరోజూ ఒక ఫలాన్ని ఆమె చేతిలో ఉంచుతుండగా ఆమె దానిని తింటూ తపస్సు కొనసాగిస్తూ వుంది. ఒకానొక రోజు వీర్యంతో నిండిన ఫలాన్ని వాయుదేవుడు అంజనాదేవికి ప్రసాదించినాడు. ఆమె యధాప్రకారంగా ఆకలితో ఆ ఫలాన్ని ఆర గించగా గర్భవతి అయింది. పది మాసాల తర్వాత ఆమెకు పుత్రుడు కలిగాడు. అతడే ఆంజనేయుడు. హనుంతుడు అనే పేర్లతో జగత్ప్రసిద్ధుడై చిరంజీవిగా వెలిసినాడు. అందువల్లే ఈ పర్వతం అంజనశైలం అనీ, అంజనాద్రి అని, అంజనాచలం అనీ ప్రసిద్ధిని పొందింది.

ఇలా ప్రసిద్ధమైన ఈ ఏడు పేర్లతో ఆయా ఆకారాలతో ఏడు కొండలు ఏర్పడినందువల్ల ఈ దివ్యక్షేత్రం సప్తగిరి శైలమనీ, ఏడుకొండల క్షేత్రమనీ పేరొందింది.

Sunday, 7 May 2017

"అది పెద్దల సభా కాదు, వారు పెద్దలూ కారు"



"అది పెద్దల సభా కాదు, వారు పెద్దలూ కారు"


(1)

"పెద్దలందరూ విచ్చేస్తారు. ఆ పెద్దల కోసం వెంటనే ఒక సభను నిర్మించవయ్యా విదురా" అన్నాడు ధృతరాష్ట్రుడు.
"మన పెద్దలు నిర్మించిన సభ ఇప్పటికే ఉంది కదా అన్నా? మరలా ఒక క్రొత్త సభ దేనికి?"
"పిల్లలు ముచ్చట పడుతున్నారు. పాండవులను పిలిచి వారితో ఆ సభలో జూదమాడుతారట."
"అన్నా, ఇదేం బాగులేదు. దీనివల్ల గృహకలహాలు చెలరేగుతాయి. సర్వనాశనం కలుగుతుంది. ఈ సభా నిర్మాణమనే ఆలోచననూ, జూదమనే ఆలోచననూ విరమించుకోండి".
"ముందు నువు ఎక్కువగా ఆలోచించకు. నా ఆజ్ఞను పాటించు."
"చిత్తం."

(2)

తోరణస్ఫటికం అనే ఆ పెద్దల సభకు చిన్నా పెద్దా అందరూ విచ్చేశారు. జూదం మొదలుపెట్టడానికి పెద్దాయన ధృతరాష్ట్రుడు అనుమతించాడు. ఆ పెద్దల మధ్య మేము మహాక్షత్రియవంశసంజాతులము అనే ఆభిజాత్యం కలిగిన మహారాజులు జూదం ఆడటం మొదలుపెట్టారు. దుర్యోధనుడు గెలుస్తున్నకొద్దీ కౌరవులు ఉత్సాహంగా కేకలు వేస్తూ ఓడుతున్న పాండవులను గేలిచేయడం మొదలుపెట్టారు.
"రాజా! నా మాట విని ఇంతటితో జూదం ఆపమని చెప్పండి. మీరు జూదానికి ముందు కూడా ధనికులేగాని, దరిద్రులు కాదు కదా? ఈ జూదం వినోదం కోసం కాక వికృతానందంకోసం సాగుతున్నట్టనిపిస్తోంది" అన్నాడు విదురుడు.
"ఏమయ్యో, విదురా! నిన్నెవడడిగాడని సలహాలు చెబుతున్నావ్? నువ్వు మా పక్కలో పాములాంటివాడివి. నిన్ను మా దగ్గర పెట్టుకొనడం కూడా పాపమే. నువ్వు మాకేం అవసరం లేదు. మాకేం బోధించాల్సిన అవసరం లేదు." అని గర్జించాడు దుర్యోధనుడు.
"సరే, ఆయన మాటలు పట్టించుకోవద్దు. మనం జూదం కొనసాగిద్దాం." అన్నాడు.
చిన్నాన్న అంతటివాడినే పేరుపెట్టి బెదిరించిన దుర్యోధనుడిని చూసి అంతా భయపడి నోరుమూసుకున్నారు.
క్రమంగా ధర్మరాజు తన తమ్ములను ఓడిపోయాడు. తనను ఓడిపోయాడు. ద్రౌపదిని కూడా పందెం పెట్టాల్సిందేనన్నాడు శకుని.
సరేనన్నాడు ఆ మహా ధర్మాత్ముడు.
సభ మొత్తం ఛీఛీఛీ అనే మాటలతో ప్రతిధ్వనించిపోయింది.
విదురుని మొహం వాలిపోయింది.
భీష్మద్రోణ కృపాచార్యుల వంటి పెద్దలకు కంపరమెత్తి ఏమీ చేయలేని నిస్సహాయతతో సిగ్గుతో వంటినిండా చెమటపట్టింది. ఆ పెద్దలలో ఆనందించినవాడు ఒక్క ధృతరాష్ట్రుడే. గుడ్డివాడైన అతడు అప్పుడే ఆ పందెం కూడా గెలిచేశామనుకున్నాడు పాపం.
శకుని పాచికలు వేశాడు.
"మేమే గెలిచాం" అని గొంతెత్తి అరిచాడు. కౌరవుల అరుపులు కేకలతో సభ దద్ధరిల్లిపోయింది.

(3)

దుర్యోధనుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
"ఓయ్, విదురా! ఇపుడు ద్రౌపది మా దాసి. నువ్వు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి మా భవనం ఊడ్పించు. పో. పోయి తీసుకురా." అన్నాడు.
"నీకు పోయే కాలం వచ్చింది" అని విదురుడు తిరస్కరించాడు.
దుర్యోధనుడు ప్రాతికామిని పంపించాడు.
అతడు కాసేవయాక వెనుదిరిగి వచ్చి "వాడెవడో దుర్యోధనుడు పిలవడమేమిటి, నేను రావడమేమిటి? సభలో పెద్దలను ధర్మమేమిటో అడిగిరా?" అని ద్రౌపది పంపింది అని చెప్పాడు.
తాము పెద్దలమని సభలో ఎవ్వరూ అనుకున్నట్టు లేదు. ఎవరూ నోరెత్తలేదు.
"ఓయ్ ప్రాతికామీ! ఆమెను ఆమాట పెద్దలసభకే వచ్చి అడగమను. ధర్మమేమిటో ఇక్కడకే వచ్చి తేల్చుకోమను. ఫో!" అని కసిరాడు దుర్యోధనుడు.
ప్రాతికామి దుర్యోధనుడి మాటలను పట్టించుకోకుండా మళ్లీ పెద్దలసభనే అడిగాడు: "ద్రౌపది ప్రశ్నకు నన్నేం సమాధానం చెప్పమంటారు?"
వాడి నిర్లక్ష్యానికి దుర్యోధనుడికి ఒళ్లు మండింది.
"దుశ్శాసనా! ఈ పిరికివెధవను పక్కకు నెట్టి నువ్వెళ్లి ద్రౌపదిని లాక్కురాపో. ఓడిపోయిన బానిసలు ఈ పాండవులు మనల్నేం చేయగలరు?" అన్నాడు.
నేను రజస్వలను, ఏకవస్త్రను. ఈ స్థితిలో నన్ను సభకు రమ్మనడం న్యాయం కాదు అని ద్రౌపది బ్రతిమలాడినా దుశ్శాసనుడు తన తల్లి ముందే ద్రౌపది జుట్టుపట్టుకొని, నువు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా రావలసిందే అని దుర్భాషలాడుతూ ఆమెను పెద్దలసభకు ఈడ్చుకుపోయాడు.
భరతమహారాజవంశానికి కోడలై వచ్చిన స్త్రీకి ఆ దుర్భరావమానం కలగడం ఆ సభ కళ్లారా చూసింది.
"సభలోని పెద్దలు ధర్మం చెప్పండి. ధర్మరాజు నన్నోడి తన్నోడెనా? తన్నోడి నన్నోడెనా?" అని ద్రౌపది పెద్దలను సూటిగా అడిగింది.
పెద్దలమని కూర్చున్నవారు నోరు పెగిల్చి మాటాడకపోయేసరికి చిన్నవాడైనా వికర్ణుడు లేచి ద్రౌపదిని ధర్మరాజు పందెంలో పెట్టడం అధర్మమని ఘోషించాడు.
సభలో జనాలు అతనిని మెచ్చుకున్నారు.
కర్ణుడికి అతని మీద కోపమొచ్చింది.
"ఇంతమంది పెద్దవారికి తెలియని ధర్మం పిల్లకాకివి, నీకు తెలిసిందా? నోరుమూసుకో." అన్నాడు.
"దుశ్శాసనా! వీడి మాటలకేం గాని, ముందు ద్రౌపది వస్త్రాలు ఊడబెరుకు" అన్నాడు.
ఆ మాత్రం ప్రోత్సాహం లభించేసరికి దుశ్శాసనుడికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. వికటాట్టహాసం చేస్తూ ఆ పని చేయబోయాడు. కాని సభలోని పెద్దలెవరికీ ఇది తప్పు, అలా చేయవద్దు అనడానికి కూడా మాటలు రాలేదు. ఇంతలో దుశ్శాసనుడికి గర్వభంగమైంది. కృష్ణుడు ద్రౌపదీమానసంరక్షణం చేశాడు.
అంత పని చేయబోయిన దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం త్రాగుతానంటూ భీముడు భీకరప్రతిజ్ఞ చేశాడు.
ద్రౌపది ప్రశ్నకు సమాధానం చెప్పమని విదురుడు సభను కోరాడు.
ధర్మరాజే సమాధానం చెప్పాలి అని భీష్ముడు తప్పించుకున్నాడు.
"నువ్వే చెప్పాలట! చెప్పవయ్యా మరి!" అని దుర్యోధనుడు హేళనగా అంటూ తన తొడను ప్రదర్శించాడు.
ధర్మరాజు ఊ అనగానే ద్రౌపదిని అక్కడ కూర్చోబెట్టుకుంటాను అన్నట్టుగా.
భీముడికి మండిపోయింది.
"ఉరే! యుద్ధంలో ఆ తొడను విరగ్గొడతాను చూడరా!" అంటూ మరో భయంకరప్రతిజ్ఞ చేశాడు.

(4)

పదమూడు సంవత్సరాలు గడిచాయి.
మా రాజ్యాన్ని మాకిచ్చేయండి. లేకపోతే ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అంటూ పాండవులు కౌరవులకు సందేశం పంపారు.
ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు.
"విదురా! వచ్చి రెండు మంచి మాటలు చెప్పిపో" అని కబురు పంపాడు.
విదురుడు వచ్చాడు. "రాజా! నీ కొడుకులు చస్తారేమోననే భయంతో నీకు నిద్రపట్టడం లేదు. కనీసం ఇప్పుడైనా నా మాట విని, పాండవులకు వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసెయ్. వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దు. నీ కొడుకులను కాపాడుకో" అన్నాడు.
"అంతమంది పెద్దల ఎదుట సభలో జరిగినది అన్యాయమెలా అవుతుంది?" అన్నాడు ధృతరాష్ట్రుడు.
"అది సభా కాదు, అక్కడున్నవారు పెద్దలూ కాదు" అన్నాడు విదురుడు.
"అలా పిలిపించుకునే హక్కు వారెవరికీ లేదు" అనేశాడు.

న సా సభా యత్ర న సంతి వృద్ధాః
న సా వృద్దా యే న వదంతి ధర్మమ్।
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి
న తత్ సత్యం యత్ ఛలేనాభ్యుపేతమ్।।


పెద్దలు లేని సభ సభే కాదు.
ధర్మం చెప్పని పెద్దలు పెద్దలే కాదు.
సత్యం లేని ధర్మం ధర్మమే కాదు.
మోసంతో కూడినది (పదిమంది పలికినా) సత్యం కానే కాదు.

(మహాభారతం.5.35.58)
అని వివరించి,
"కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః। సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః।। 
పాపమైనా పుణ్యమైనా చేసినవాడు, చేయించినవాడు, చేయడానికి అనుమతించినవాడు, బాగా చేశారని మెచ్చుకున్నవాడు సమానభాగస్థులు. అందరూ ఎవరి ఫలం వారు అనుభవించి తీరుతారు" అని చెప్పాడు.

(5)

భీముడు అన్నంతపనీ చేశాడు. యుద్ధంలో దుశ్శాసనుణ్ణి ఓడించి పడగొట్టాడు.
"ఏరా? నిరపరాధి అయిన ద్రౌపదిని ఈ చేత్తోనే కదరా ఈడ్చావు?" అని, ఆ చేతిని కసిగా విరిచేశాడు. ఆ చేత్తోనే అతని చెంపలను వాయించాడు. అతని రొమ్ము చీల్చి రక్తం త్రాగాడు.
ఆ భీకరదృశ్యం చూసి "భీముడెంత క్రూరుడు!" అని అపుడు చాలామంది రొమ్ము బాదుకున్నారు.
వారెవరికీ "పెద్దలసభలో" దుశ్శాసనుడు చేసిన వెధవపనులు గుర్తుకురాలేదు!
యుద్ధంలోనే కర్ణుడి రథం నేలలో క్రుంగిపోయింది.
"అర్జునా! కాసేపు ఆగు! బాణాలు వేయకు! నేను అసహాయస్థితిలో ఉన్నాను." అన్నాడు.
మునుపు ద్రౌపది అసహాయస్థితిలో ఉండగా "పెద్దలసభలో" అందరి ఎదుట ద్రౌపది వంటిమీదున్న బట్టలను తాను లాగివేయమని చెప్పిన తన దుర్మార్గపు మాటలు తనకే గుర్తురాలేదు ఆ పెద్దమనిషికి! అప్పుడు ద్రౌపదిని రక్షించిన కృష్ణుడే ఇప్పుడు అర్జునునిచేత నిర్దాక్షిణ్యంగా శిక్ష విధింపజేశాడు.
శకుని తల సహదేవుని బాణం దెబ్బకు మొండెం నుండి వేరై క్రిందపడింది. జూదం కోసం పెద్దలసభ నిర్మాణానికి ప్రేరకుడైనవాడు నేలకూలిపోయాడు.
ఎందరు ఎన్నిరకాలుగా చెప్పినా వినకుండా పరమమూర్ఖంగా యుద్ధానికి దిగి, తనవారందరినీ కోల్పోయిన దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు.
బయటకు వచ్చి యుద్ధం చేయమంటే "నాకు రాజ్యం మీద ఆసక్తి పోయింది. నేను వనవాసం చేస్తాను. రాజ్యం నువే తీసుకో." అని మొదలు పెట్టాడు.
"మేము అడిగినప్పుడు ఇవ్వకుండా ఇంతమంది చావడానికి కారణమై ఇప్పుడు ధర్మపన్నాలు చెప్పకు." అన్నమీదట బయటకొచ్చాడు.
భీముడితో యుద్ధంలో తొడలు విరగగొట్టించుకున్నాడు.
గదాయుద్ధంలో అలా చేయరాదని కొందరు భీముడిని నిందించారే గాని, అసలు దుర్యోధనుడు తన తొడ చూపి ద్రౌపదికి అసభ్యంగా సైగ చేసిన విషయం వారికి గుర్తుకురాలేదు!
మొత్తానికి అలా అపుడెపుడో పెద్దల సభలో జరిగిన అన్యాయానికి తగిన ప్రతికారం జరిగింది.

(6)

ఆనాటి ద్రౌపది మనకాలం నాటి ప్రజాస్వామ్యం. ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేయబోతే కృష్ణుడు కాపాడాడు. ఈనాడు రాజ్యాంగవిరుద్ధంగా, ప్రజాస్వామ్యపు విలువలను కాలరాస్తూ ఉన్న అభినవకౌరవులనుండి దాన్ని కాపాడేందుకు ఎవరు దిగివస్తారో? ప్రజాస్వామ్యానికి నాథులు ప్రజలే. రాబోయే యుద్ధంలో (ఎన్నికలలో) జరిగిన పరాభవానికి తగిన ప్రతికారం చేసేందుకు సన్నద్ధులు కావాలి.