Tuesday, 29 March 2016

మోక్షం





మోక్షాలు నాలుగు!

ఈ భూమిపై పుట్టిన వ్యక్తి లక్ష్యమేమిటి? ఒక వేళ ఈ లక్ష్యం మోక్షమే అయితే అది ఎన్ని రకాలు? దానిని ఎలా చేరుకోవాలి? లాంటి ప్రశ్నలు అనేకం కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం...

మనకు పారలౌకికము, పారమార్థికం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలుంటాయి.

పారలౌకికమంటే మనం ఉండే ఈ లోకం కంటే గొప్పదైన మరో లోకానికి సంబంధించినది అని అర్థం. అంటే ఆ లోకానికి చెందిన జీవులే కావచ్చు. లేక వస్తువులు కావచ్చు. ఉదాహరణకు కర్ణాటకలోని మేల్కోటేలోని పెరుమాళ్లకు ఒక వజ్రకిరీటం ఉంది. దానిని అరవభాషలో వైరముడి అంటారు. అనిరుద్ధుడనే వ్యూహరూపి యొక్క కిరీటమట. ఇది కొన్ని కారణముల చేత ప్రస్తుతం ఇక్కడుంది. ఇది ఈ లోకానికి కాక ఇతర గొప్ప లోకాలకి సంబంధించినదే కదా! కనుకనే దీనిని పారలౌకికము అంటారు. సాధారణంగా ఈ పదాన్ని పరమపదమునకు సంబంధించిన అనే దానికి పర్యాయంగా వాడతారు.

పారమార్థికం అంటే మనం పొందే అన్ని రకాల ప్రయోజనాలలో ఏ ప్రయోజనం చిట్టచివరదో, ఏ ప్రయోజనం పొందితే ఇక సమస్తమూ పొందినట్లే అవుతుందో అట్టి ఉత్కృష్టతమమైన ప్రయోజనానికే పరమార్థమని పేరు. అట్టి పరమార్థాన్ని గురించిన విషయాలను పారమార్థికములంటారు. దానికి సంబంధించిన బుద్ధిని పారమార్థికబుద్ధి అంటాం. పరమార్థాన్ని తెలిపే గ్రంథాలను పారమార్థిక శాస్త్రాలంటాం.

ఇక పారలౌకికంగా మనకు మోక్షం అనేది చాలా ముఖ్యమైన అంశం. దీనిని మన శాస్త్రాల్లో నాలుగు రకాలుగా పేర్కొంటారు. అవి: 

మొదటిది సాలోక్యం. అంటే పరమాత్మ ఉండే లోకాన్ని చేరటం.
రెండోది సారూప్యం. అంటే పరమాత్మతో సమానంగా రూపాన్ని ధరించడం.
మూడోది సామీప్యం. పరమాత్మ ఉండే ఆసన సమీపానికి చేరడం.
నాలుగోది సాయుజ్యం. అంటే జీవుడు తన అనుభవాలతో సమాన గుణానుభవాలను పొందటం.

ఈ నాలుగింటినీ చేరుకోవడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను కూడా మన శాస్త్రాలు సవివరంగా చెబుతున్నాయి. ఒకప్పుడు మన వేదరాశి 1134 శాఖలుగా లభించేది. ఇన్ని శాఖలను గ్రహించటం అందరికీ కష్టం కాబట్టి శ్రీవ్యాసభగవానుడు వీటిని నాలుగు ప్రధాన భాగాలుగా విడదీశాడు. ఇవి ఋక్శాఖ, యజుశ్శాఖ, సామశాఖ, అధర్వశాఖ. ఆ తర్వాత వీటిని మరి కొన్ని శాఖలుగా విడదీశారు. వీటిలో అన్ని శాఖలూ ముఖ్యమైనవే. మానవుడిని మోక్షం దారిలో నడిపించేవే!


-శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి



Thursday, 24 March 2016

హిందూ సంస్కృతీ, సంప్రదాయాలు FULL

అన్ని మతములలోను దేవుడు, దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి కాని మూలము, అర్ధము, పరమార్ధము ఒక్కటే. దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు. అది ఒక నమ్మకము మాత్రమే. పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతిలో ఉండే భీబస్తవాలు ... ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండా, వానలన నుండి బయపడి అప్రయత్నముగా "అమ్మో, నాన్నో " అని అరిచేవాడు. చనిపోయిన అమ్మ, నాన్నలను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు. ఆ ధైర్యంతోనే జీవము గడిపేవాడు. రక్షణ కోసము ఏ చెట్టునో, రాయినో, పుట్టానో ఆశ్రయించేవాడు. తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రకరకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి. (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను... మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున.

ఇక్కడ మనము -భగవద్గీత (Bhagavadgeetha)- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకిందాం .--

భారతావని పుణ్యభూమి. ఎందరో మహాను భావులు జన్మించి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన పవిత్రస్థలం. ఆధ్యాత్మికత మన జాతిరకం. భగవ త్తత్వానికి, తలమానికంగా, ఎన్నో వేదాలు, ఉపని షత్తుల వంటి మహోన్నత, అతి పవిత్ర, గ్రంథా లకు పుట్టినిల్లు ఈ పుడమి.
వీటిలో సర్వ ఉపనిషత్తులలో శ్రేష్ఠమైనది, సత్య మైన బ్రహ్మ విద్య, అతి గొప్పదైన యోగశాస్త్రం, త్యాగమును, జ్ఞానమును బోధించునదే భగవద్గీత.

భగవద్గీత సాక్షాత్‌ భగవంతుడగు శ్రీకృష్ణునిచే స్థిరముగా నాటబడి, వేదవ్యాస మహర్షి చేత పెంచబడిన కల్పతరువు. గీతాశాస్త్రం అతి ముఖ్య మైన శాస్త్రం. అందుకే అనేక సందర్భాలలో స్వామి సుందరచైతన్యానంద ఇలా అంటారు- 'విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణు లల్లో అమూల్యమైనది భగవద్గీత.

స్వయముగా భగవానుడగు నారాయణునిచే అర్జునునకు బోధించినదియు, సనాతన రుషిపుంగ వుడగు వ్యాస భగవానునిచే మహాభారత మధ్య మున చేర్చబడినదియూ, పదునెనిమిది అధ్యాయా లతో శోభించుచూ, అద్వైతామృతమును వర్షిం చుచూ, భవరోగమును రూపు మాపు నట్టిదే భగవద్గీత.

మానవుని మహనీయునిగా మార్చగల అద్భుతశక్తి గల భగవద్గీతను ఒక పుస్తకం అనే కంటే 'ఒక అపారమైన దేదీప్యమానమైన వెలుగులను కల్గి, విజ్ఞానములనెడి కిరణములను ప్రసరింపచేసే ఒక దివ్యజ్యోతి అనుటయే సబబు. అందుకే గీతకు ఇంత వ్యాప్తి లభించింది.
భగవద్భక్తితో గీతాపఠనం, పాఠనం, విచారణం, శ్రవణం చేయు మానవుని సర్వపాపములు నశించి, జ్ఞానసిద్ధిని పొంది, జీవన్ముక్తిని చేరుకుం టున్నాడు.

అంతేగాక భగవద్గీత ఏ ఒక్క మతానికో సొంత మైన ఆధ్యాత్మిక గ్రంథం కాదు. అన్ని మతస్థులు, భూపాలుర నుండి గోపాలుర వరకూ పండితుల నుండి పామరుల వరకూ, ఉన్నత జాతుల నుండి నిమ్నజాతుల వరకూ, చివరకూ, స్త్రీలైనా, పురుషులైనా, బాలలైనా, వృద్ధులైనా, మనుష్య మాత్రులెవరైనా ఈ మహామృత పానం చేయ వచ్చు. ఇంతటి విశాలార్థం అగాధ భావం, సమ త్వమున్న గ్రంథం అన్యం లేదన్న అతిశయోక్తి కాదు. అందుకే కాబోలు శంకరాచార్యుల నుండి సామాన్యుల వరకూ అందరూ గీతాపఠనం నందు ఆసక్తి కలిగి ఉన్నారు.

శ్రీ వర సిద్ది వినాయకుడు ...కాణిపాకం

చిత్తూరు జిల్లాలో ఎందరో దేవుళ్ళు దేవతలు వెలసియున్నారు.ప్రస్తుతము `కాణిపాకంగా పిలువబడుతున్న గ్రామము పూర్వము విహారపురి అని పిలువబడేది. ఈ గ్రామము, పరిసర ప్రదేశములు, దివ్యభవములతోను, ప్రకృతి రమణీయకతతోను వింత వింత అందాలతో కళ కళలాడుతూ దేవతలను సైతం తన్మయులై చేసివి. అందుకే దేవతల పురిలో (గ్రామములో) విహరిస్తూ వుండేవారు. కాబట్టి దానికి విహరపురి అని పేరు వచ్చింది. ఇప్పటికి ఈ ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. ఈ విహార పురికి ప్రక్కగా ఒక నది ప్రవహిస్తుంది.

పూర్వం ఒకప్పుడు శంఖుడు, లిఖితుడు అను అన్నదమ్ములు ఇక్కడ స్వయంభువుగా వెలసియున్న శ్రీ వరసిద్ది వినాయకుడుని మహిమలను విని, ఆ స్వామిని చూచుటకు ఎంతో దూరం నుండి కాలి నడకన బయలుదేరారు. చాలా దూరం నుండి వస్తూండడం చేత తాము తెచ్చుకొన్న ఆహారం అయిపోయింది. అన్నదమ్ములు ఇద్దరు అలసిపోయారు. వారికీ ఆకలి బాగా ఎక్కువ బాధిస్తుంది. అయిన వారు పట్టుదలగా నడుస్తూనే వున్నారు. విరు నడచి వచ్చు దారిలో వారికీ ఒక మామిడి పండ్ల తోట కనిపించింది. చెట్ల నిండా కాయలు ఆరముగ్గి వేలాడుతున్నాయి. తమ్ముడైన లిఖితుడు చిన్న వయస్సు కావడం చేత ఆకలికి తట్టు కోలేకపోతున్నాడు. చెట్టు నుండి ఒక పండును కోసుకొని తింటానని అన్నయైన శంఖుని అడిగాడు. అ తోటకు సంబందించిన వ్యక్తులు ఎవ్వరు ఆ ప్రాంతంలో వారికీ కనిపించలేదు .యజమానిని అడగకుండా ఏ వస్తువును తీసుకొన్న అది దొంగతనము అవుతుందని, కావున మామిడి పండును కోయరాదని ఇక చేరవలసిన కాణిపాక ప్రదేశము (విహార పురి) దగ్గరలోనే వుందని తమ్మునికి నచ్చ చెప్పాడు. తమ్ముడైన లికితుడు ఆకలికి తట్టుకోలేక పోతున్నాడు. అన్న మాటలను పెడ చెవిన పెట్టి తమ్ముడు మామిడి చెట్టు నుండి ఒక పండును కోసుకొని తిన్నాడు.

తను చెప్పుతున్న వినిపించుకోక ధర్మ విరుద్దంగా ప్రవర్తించిన తమ్ముడిని శంఖుడు తిన్నగా అ ఊరి రాజు వద్దకు తీసుకువెళ్లి తన తమ్ముడు ఎవరిదో అయిన తోటలోని మామిడి చెట్టు నుండి వారి అనుమతి లేకుండా ఒక పండును కోసుకొని తిన్నాడని, అది దొంగతనము అని పించుకొంటుందని, కావున తన తమ్ముడిని శిక్షించే రాజుతో ఫిర్యాదు చేస్తాడు.రాజు లిఖితుని రెండుచేతులను నరికి వేయమని భటులను ఆజ్ఞ పిస్తాడు. రాజ భటులు లిఖితుని రెండు చేతులను నరికి వేస్తారు. చిన్న తప్పు చేసిన తన తమ్ముడికి రాజు ఇంత ఘోరమైన శిక్షా వేస్తాడని శంఖుడు అనుకోలేదు.ఎంతో భాదపడ్డాడు. అయినా ఇక చేయగలిగేది ఏమిలేదు అని అక్కడ నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు శ్రీ వర సిద్ది వినాయకుని తలుచుకొంటూ ఆ స్వామిని దర్శించడానికి బయలు దేరారు. వెళ్ళునది దైవ దర్శనముకు అందుచే శంఖు,లిఖితులు స్వామివారికీ ప్రక్కన ప్రవహించు నదిలో స్నానం చేసి దేవుని దర్శించాలని అ నదిలోకి అన్నదమ్ములు ఇద్దరు దిగారునదిలో వారుస్నానముకు మునిగినంతనే లిఖితునకు నరుక బడిన చేతులు పూర్వంలాగే వచ్చేశాయి. వారి ఆనందానికి అవధులు లేవు. నదిలో మునిగినంతనే పోయిన రెండు చేతులు తిరిగి వచ్చినవి కనుక ఆనాటి నుండి ఆ నదికి `భాహుదా` అనే పేరు స్తిరపడిపోయింది. నాటి నుండి ఆ అన్నదమ్ములు ఇద్దరు వినాయక స్వామి వారి మహత్యంను కీర్తిస్తూ ప్రచారం చేస్తూ జీవించారు.

అట్లు కొంతకాలం జరిగాక బహుదా నది వరదలు మొదలగు ప్రకృతి విలయ తాండవం వల్ల స్వామి వారి విగ్రహం భూమిలో నిక్షిప్తం అయింది. ఆనాడు దానిని ఉద్దరించే వారు లేకపోవడం చేత వినాయక స్వామి చాలా కాలం భూమిలో మరుగున పడి పోయాడు. కాలక్రమంలో అ ప్రాంతం తిరిగి సస్యశామలం అయి పండ్ల తోటలతోను, పచ్చని ఫైరు పంటలతోను శోభాయమానంగా తయారు అయిoది.

పుట్టుకతోనే ఒకరు గ్రుడ్డి, ఒకరు చెవిటి, ఒకరు మూగ అయిన ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామమునకు ఎక్కడినుండో వచ్చి స్తిరపడ్డారు. వారు ముగ్గురు ఒకరికొకరు సాయం చేసుకొంటూ కలిసి జీవించేవారు.వారు ఆ గ్రామంలో కొంత భూమిని సేకరించికొని అందులో ఒక నుయ్యిని త్రవ్వుకొని ఆ నీటితో మిగిలిన భూమిలో వ్యవసాయం చేసుకొంటూ వుండేవారు.అలా కొంతకాలం జరిగాక విహార పురిలో కరువు ఏర్పడింది. వానలు లేకనేల భిటలువారింది. రైతులు,ప్రజలు పంటలకే కాదు. త్రాగు నీటికి కూడా చాలా భాదపడవలసి వచ్చింది. బహుదా నది ఎండి పోయిoది.అంటూ రోగాలు ప్రబలాయి.ప్రజలు ఆకులూ, అలములు తిని బ్రతకవలసిన పరిస్టితి ఏర్పడింది. ఇక అ వికలాంగుల పరిస్టితి మరి దయనీయంగా మారింది.

ఒకనాడు అ ముగ్గురు వికలాంగులు తమ పొలంలోని నూతిని మరికొంచెము లోతు చేయడం మంచిదని తలచి అందుకు నడుం కట్టారు. వారు ముగ్గురు బావిని త్రవ్వగా త్రవ్వగా కొంత తడి తగిలింది.నీరు కొద్ది కొద్దిగా ఉరుతోంది. బావిలో నుండి నీటిని ఫైకి తీయడానికి ఒక కుండకు తాడు కట్టి కుండను వదిలారు.అది పగిలి పోయిoది.మళ్ళి మరొక కుండను వదిలారు.అది కుడా పగిలిపొయింది.అలా చాలా కుండలు పగిలిపోవడంతో బావిలోపల ఏదో ఒక రాయి ఉన్నట్లు ఉంది దానిని తొలగిస్తే ఇట్ల కుండలు పగిలి పోకుండా వుండటమే కాక మరికొంత నీరు ఉరుతోందని బావించి రాతిని పెకలించేందుకు చెవిటి,మూగ వారిద్దరూ బావిలోకి దిగారు. అట్లుఅడ్డు పడిన రాతిని పగులకొట్టి పూర్తిగా పెల్లగించాలనికొని వారు గునపంతో పదే పదే పోడవ సాగారు. త్రవ్వు తున్నఆ ప్రదేశంలో గునపం పడిన చోటు నుండి ఖంగు మనే శబ్దం వచ్చింది.

అట్లు వారు మూడు సార్లు ప్రయత్న్నం చేయగామూడు సార్లు ఈ విధంగా శబ్దం వచ్చి చివరి దెబ్బతో చిన్న రాతి ముక్క లాంటి భాగం విరిగి అవతల పడింది. అంతే అ ముక్క పగిలిన చోటు నుండి రక్తం యగ చిమ్మింది. అట్ల రక్తం యగ జిమ్మడానికి కారణం అక్కడున్న స్వయంభు వినాయకుని తల వెనుక భాగం చిట్లి ముక్క ఎగిరి పడడమే,ఆ రక్తం ఏక ధారగా కారుతూనే వుంది.ఎంతకు ఆగటం లేదు.

ఆ రక్తం అలా యాగజిమ్మడంతో ఒడ్డున వున్న గ్రుడ్డివాడు, బావిలోపల ఉన్న మూగవాడు, చెవిటి వాడు కుడా ఆ రక్తంతో తడిసారు. అట్లు వారు రక్తంతో తడియగానే మూగ వాడికి మాటలు గ్రుడ్డివాడికి ద్రుష్టి, చెవిటివానికి శ్రావణ శక్తి లబించాయి. ఆ ప్రభావంతో ముగ్గురి అంగవైకల్య్యం తొలగిపోవడంతో అది దైవకృపయే అని ఆనందంతో భక్తి పరవశులైవారు. ఆ దైవమూర్తి నుండి వెలువడే రక్త ప్రవాహంఆగకపోవడంతో దానిని వారించడానికి వారు చేయు ప్రయత్నములు ఫలించక పోవడంతోచూపు వచ్చిన గ్రుడ్డి వాడు విహారపురి రాజు వద్దకు పరుగున పోయి జరిగిదిఅంత పూస గ్రుచ్చి నట్లు రాజుకు వివరించాడు. ఈ విషయంను విన్న రాజులో ఆనందం,భయాందోళనలు కలిగి మనసు వికలం అయిoది.

ఆ సంఘటన జరిగిన ముందు రాత్రి రాజుకు వినాయక స్వామి విగ్రహం కలలో కన్పించడం, ఇపుడు నిజంగా ఇలా దర్శనం ఇవ్వడం రాజుకు ఆశ్చర్యం, ఆనందం కలిగింది. స్వామి తల నుండి వచ్చు చున్న రక్త ప్రవాహం ఆగటం లేదని తెలిసి కొనిన విహారపురి రాజు తన అంతః పురకాంతలతోను, సమస్త దండనాయకులతో, దాసదాసి పరివారముతో బయలు దేరి వర సిద్ది వినాయకుడు ఆవిర్భవించిన స్టలానికి చేరుకొన్నారు. విషయం తెలిసిన ప్రజలు గుంపులు గుంపులుగా రాజు వెంట అక్కడకు చేరుకొన్నారు. బావి దగ్గరకు చేరిన ఆ ప్రజా సముహంలోని భక్తి భావానికి అవధులు లేవు. కొబ్బరికాయలు, పత్ర పుష్పములు, కర్పూరాది పూజ ద్రవ్యములతో అపరమిత భక్తితో ఆ వినాయకస్వామిని పూజిస్తూ పలు విధాలుగా కీర్తించారు. శ్రోత్రనామాలు గానం చేసారు. భజనలు, అర్చనలు, నైవేద్యములు, సాష్టాంగ దండ ప్రణామాలతో తమ తప్పు మన్నించి స్వస్థరూపమున పొందుమని ప్రాద్దించారు. అయినా రక్తధార ఆగటం లేదు. స్వామికి కొబ్బరి ఇష్టమని కొబ్బిరి కాయలు కొట్టి ఆ నీటితో స్వామిని అభిషేకించారు. ఆ భక్తులు సమర్పించిన స్వచ్చమైన కొబ్బరినీరు బావి నుండి పొంగి పొరలి బావి చుట్టూ గల ఆ కాణి భూమిలో పారింది. అంతకుముందు అంగ వికులులుగా నున్న ఆ ముగ్గరుకు చెందిన భూమి (కాణి మాగాణి =1.3 ఎకరాలు) అంతట కొబ్బరి నీరు పారడం చేత ఆ ప్రాంతానికి కాణిపారకం అని పేరు వచ్చింది. అదే మాట కాలక్రమంలో `కాణిపాకం` గా మారి స్టిర పడింది.(తమిళ సంప్రదాయంలో గ్రామాల పెర్ర్లు చివర పాకం, బాకం వంటి పదాలు ఉండడం తెలిసిందే కదా). ఈ విధంగా చిత్తూర్ జిల్లాలోని విహార పురిలో (ప్రస్తుత కాణిపాకం) శ్రీ వర సిద్ది వినాయకుడు స్వయంభువుగా తిరిగి ప్రకటింపబడ్డాడు.ఆనాటి నుండి వివిధ రాజుల ప్రజల సేవలతో ఆ క్షేత్రం అభివృద్ధి చెందింది.



మనకు మన పురాణ కథలు గాని, భ్రాహ్మణులు గాని, మనం చేసిన దోషాలు తొలగించుకోవడానికి గణేశారాధన మంచిదని చెబుతుంటారు. అవును. వాళ్ళు చెప్పేది నిజమే. మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే గణేశారాధన చేయాల్సిందే. ఇప్పుడు మనం ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం.

సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.
చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.
కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.
బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి.
గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.
శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.
శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.
రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.
కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.
ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.
పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.
పాలరాయితో చేసిన గణపతిఅని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.
స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.




శివ ప్రదక్షిణ విధి



శ్లో:-ధ్వజాత్ పృష్టం - పృష్టాత్ పృష్టమ్,
పృష్టాత్ పృష్టం - పృష్టాత్ ధ్వజమ్.

భావము:-
శివాలయములో ధ్వజ స్తంభము నుండి ఆలయము వెనుక శివుని పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి నడచు కొనుచు మరల ఆ పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి మరల నడచుకొనుచు పృష్ట భాగము వరకు వెళ్ళి, అక్కడి నుండి వెను తిరిగి ధ్వజ స్తంభము వరకు వెళ్ళ వలెను అని శ్లోక భావము.

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

నందీశ్వరుని వద్ద ప్రారంభించి - కుడిచేతి వైపు చండీశ్వరుని చేరి - అక్కడనుండి మళ్లీ వెనుకకు ( నందీశ్వరుని మీదుగా )సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి నందీశ్వరుని- నేరుగా చండీశ్వరుని వద్దకు వెళ్లి - అక్కడ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) సోమసూత్రం చేరి - మళ్లీ వెనుదిరిగి ( నందీశ్వరుని మీదుగా ) చండీశ్వరుని చేరి - వెనుదిరిగి నందీశ్వరుని వద్దకు చేరుకుంటే ఒక "శివ ప్రదక్షిణ" పూర్తి చేసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. దాటితే నరకంలో పడి పతనమౌతనమవడం తథ్యం.కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు.

శివునికి ఏ అభిషేకం వలన ఏం ఫలితములు ?



1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును
4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును
8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము
16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18.ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 .ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 .నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21.కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 .నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 .మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 .పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.


శివ‌రాత్రి రోజు త‌ప్పని స‌రిగా చేయాల్సిన‌వి..!
మ‌హా శివ‌రాత్రి. అంటే సాక్షాత్తు ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజే ప‌ర‌మేశ్వరుడు మ‌హా లింగ రూపంలో ఆవిర్భవించాడ‌ని చెబుతారు. అంత‌టి విశిష్టమైన రోజున ఆచ‌రించాల్సిన విధి విధానాల్ని నిగ‌మ శాస్త్రములు వివ‌రిస్తున్నాయి. ఆగ‌మం అంటే దైవిక క్రియ‌లు అని అర్థం. నిగ‌మ శాస్త్రములు అంటే మాన‌వుడు ఆచ‌రించాల్సిన విధులు అని అర్థం.

మ‌హా శివ‌రాత్రి వేకువ జామునేనిద్ర లేవటం ఉత్తమం. మాఘ మాసంలో సూర్యోద‌యానికి ముందే స్నానం ఆచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా, కుద‌ర‌క పోయినా క‌నీసం శివ‌రాత్రి అయినా వేకువ జామునే నిద్ర లేచి స్నానం ఆచ‌రిస్తే మేలు. సూర్యోద‌యానికి ముందు రెండు గంట‌ల పాటు బ్రాహ్మీ ముహుర్తం అని చెబుతారు. (సుమారుగా) ఈ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అందుచేత ఈ స‌మ‌యంలో స్నానాదికాలు పూర్తి చేసి ఇష్ట్ దేవ‌త‌ల్ని పూజించాలి.ఈ రోజున ప‌ర‌మేశ్వరుడ్ని బిళ్వ ద‌ళాల‌తో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యముల‌తో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అంద‌ర‌కి తెలిసిన‌దే. అందుచేత ప‌ర‌మేశ్వరుడ్ని వివిధ ర‌కాల ద్రవ్యముల‌తో అభిషేకం, అర్చన చేయిస్తే ఉత్త మ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూదితో అభిషేకం చెప్పుకోద‌గిన‌ది.
ఈ రోజున ఉప‌వాసం చేయ‌టం ఆన‌వాయితీ. చాలామంది రోజంతా అంటే మ‌ర్నాడు సూర్యోద‌యం దాకా ఉప‌వాసం ఉంటారు. లేని ప‌క్షంలో రెండు ర‌కాలుగా ఉప‌వాసం చేస్తారు. అంటే ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి, రాత్రి న‌క్షత్ర ద‌ర్శనం త‌ర్వాత భుజిస్తారు. దీన్ని న‌క్తం అని పిలుస్తారు. లేదంటే ప‌గ‌టి పూట ఆహారం తీసుకొని రాత్రంతా ఉప‌వాసం ఉంటారు. దీన్ని ఏక‌భుక్తం అంటారు. ఇందులో ఏ విధానం మేలు అన్నది ఎవ‌రికి వారు ఆలోచించుకోవాలి. మొత్తం ఉప‌వాసం ఉండ‌టం శ్రేయోదాయకం. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చే చాన్సు ఉన్నందున ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లతో న‌డిపించ‌వ‌చ్చు.
ఇక‌, శివ‌రాత్రి ప్రాశ‌స్త్యం అంతా రాత్రి స‌మ‌యంలోనే ఉంటుంది. ఈ రాత్రి భ‌జ‌న‌లు, పారాయ‌ణాల‌తో జాగారం చేస్తే ఎంతోమేలు. స‌దా శివ‌న్నామ స్మర‌ణ చేయ‌టం ఉత్తమం. అర్థ రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం, అర్చన‌లు చేయించాలి. ఇది ఎంతో విలువైన స‌మ‌యం కాబ‌ట్టి ప‌ర‌మేశ్వరుడ్ని పూజించి ఆయ‌న కృప‌కు పాత్రుల‌వ‌దాం.

వారణాసి

భారతదేశంలో వుండే అతి ప్రాచీన నగరాలలో కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వుంది. బ్రిటీష్ పరిపాలకులు దీనిని బెనారస్ అనే పేరుతో పిలుచుకునేవారు.

ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేసుకోవడం వల్ల... మనం పుట్టుకనుండి చేసిన సర్వపాపాలు నశించి, పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు.. ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు. ఈ వారణాసి ప్రాంతంలో అన్యమతాలవారు, ఎక్కువ జనావాసం గల నగరాలలో ఒకటి.

ఎంతో పవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వర లింగం ఈ వారణాసి ప్రాంతంలో వుంది. ఈ నగరంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన చిహ్నాలు దర్శనం ఇస్తాయి. ఈ ప్రాంతంలోనే బౌద్ధునికి సంబంధించిన సారనాత్ క్షేత్రం కూడా వుంది. కాబట్టి ఇక్కడ బౌద్ధులు, జౌనులు తరచూ సందర్శించడానికి వస్తుంటారు. ఇక్కడ హిందూ దేవాలయాలు చాలానే కొలువున్నాయి.

చరిత్ర :
పౌరాణిక గాధల సారాంశం ప్రకారం..... సుమారు 5000 సంవత్సరాల క్రితం వారణాసి నగరాన్ని శివుడు స్థాపించాడు. హిందువులకు ఎంతో పవిత్రమైన ఏడు మహానగరాలలో ఈ వారణాసి ఒకటి. ఈ నగరానికి సంబంధించి ఋగ్వేదం, రామాయణం, స్కాంద పురాణం, మహాభారతం వంటి ఇతిహాసాలలో కూడా అన్ని విషయాలు వివరించబడ్డాయి. 18వ శతాబ్దంలో ఒక ప్రత్యేకమైన రాజ్యంగా ఏర్పడిన తరువాత బ్రిటీష్ వారు దీనిని ఒక వాణిజ్యం కేంద్రంగా మలుచుకున్నారు.

పురాణ కథనాలు :
కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య మరియు బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు. ఆరంభకాల పూరాతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత మరియు తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్ధంలో 23వ జైనగురువు మరియు ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ



శ్రీశైలంచరిత్ర



ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున మహాలింగం శ్రీశైలం మహాక్షేత్రంలో పూజలందుకుంటోంది. దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు. అష్టాదశ మహాశక్తి పీఠాలలో శ్రీశైల భ్రమరాంబిక శక్తిపీఠం రెండవది.

శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీ కృష్ణదేవరాయలు తదితర రాజులు ఎంతోమంది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. దేవాలయం నాలుగు దిక్కుల ఎత్తైన గోపురాలు, చుట్టూ అతిపెద్ద ఖాళీస్థలం, లెక్కలేనన్ని ఆలయాలతో అలరారుతోంది. దేవాలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న నంది కొమ్ముల మధ్యలో నుండి శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్నాకే భక్తులు తిరుగు ప్రయాణమవుతారు.

శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.

ఈ దేవాలయం చాలా పెద్దది. దేవాలయం చుట్టూ ఎన్నో శివలింగాలు ఉన్నాయి. బయట వృద్ధ మల్లికార్జునుడు, గర్భగుడి వెనుక పాండవుల చేత ప్రతిష్టించబడినవని చెప్పబడే శివలింగాలున్నాయి. మిగతా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా తడిసి మోపెడు ఖర్చవుతుందనే భక్తులు శ్రీశైలం వెళ్తే మాత్రం తక్కువ ఖర్చుతో తిరిగి రావచ్చంటారు.

శ్రీశైలం - పురాణ గాథ

శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.

ఆనాటి శిల్పకళావైభవాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే ఈ ఆలయ ప్రాకారాలన్నీ అలనాటి పురాణ గాథలను, చారిత్రాత్మక విశేషాలను స్ఫురణకుతెచ్చి ఆధ్యాత్మికానందాన్ని పెంచుతాయి. గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టు మహాలింగం చాలా చిన్నది. దీనికి శిరస్సు తాకించి దర్శించుకుంటారు. దీనికి ఇతిహాసంలో మరోకథ ప్రచారంలో ఉంది.

త్రేతాయుగంలో రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగ ప్రతిష్టచేసి, మిగిలిన పాపప్రక్షాళనార్థమై నారదుని సలహాపై శివదర్శనానికి బయలుదేరుతాడు. అపుడు శివుడు శ్రీపర్వతం మీదున్నాడు.

ఈ విషయాన్ని నారదుడు రామునికి చెవిలోవేశాడు. వెనువెంటనే రాముడు నీ దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీదున్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదనే తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిబిరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడినుంచి శివుడ్ని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని ధరించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా, మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలందుకుంటున్న మల్లికార్జున లింగం. శివదర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటినుంచి నేటివరకూ శిఖరేశ్వరంనుంచి మల్లికార్జునిని చూసే సాంప్రదాయం కొనసాగుతోంది. స్వామివారి ప్రధానాలయంలో సప్తముత్వికలు, మనోహర కుండం, బ్రహ్మకుండం, విష్ణుకుండం, నవబ్రహ్మాలయాలు ఉన్నాయి. పంచపాండవులు ప్రతిష్టించిన లింగాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి.

సాక్షాత్తు ఆదిగురువు శంకరాచార్యులవారు తపస్సుచేసిన పవిత్ర స్థలం పాలధార, పంచధారలు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంలోనే శంకరాచార్యులవారు ‘శివానంద’, ‘సౌందర్యలహరి’లను రచించినట్లు చెబుతారు. శ్రీశైల ప్రధానాలయానికి తూర్పున రెండు కిలోమీటర్లు దూరంలో సాక్షిగణపతి ఆలయముంది. దట్టమైన అడవిలో ఎత్తయిన కొండలతో, అందమైన లోయలతో గలగలపారే జలధారలతో అలరారుతున్న సుందర ప్రదేశం భీముని కొలను శ్రీమల్లికార్జునస్వామి ఆలయంనుంచి హఠకేశ్వరం చేరుకుని, అక్కడినుంచి కుడివైపున అడవి దారిలో రెండు కిలోమీటర్లు ప్రయాణించి కైలాస ద్వారం చేరుకోవాలి. కైలాస ద్వారం నుంచి మెట్లదారిలో దిగితే వచ్చే లోయ ప్రాంతమే భీముని కొలను. ఈ మెట్లను రెడ్డిరాజులు
శ్రీశైలానికి గల ప్రాచీనమైన నాలుగు కాలిబాట మార్గాలలో భీముని కొలను దారే ఎంతో ప్రసిద్ధి చెందింది. ‘అలాగే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే’ అంటే శిఖర దర్శనం ద్వారా శ్రీశైల నాధుడ్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదట. శిఖరేశ్వరానికి కింది భాగంలో వీరశంకరాలయం ఉంది. ఒకప్పుడు శ్రీశైల మహాక్షేత్రపు పరిధిలో సుమారు వందకు పైగా మఠాలుండేవని అంచనా. ఈ మఠాలన్నీ ప్రధానాలయానికి వాయువ్య దిశలో చోటుచేసుకున్నాయి. క్రీ.శ.9-10 దశాబ్దాలనుంచి 15వ శతాబ్దంవరకు ఈ మఠాలు ఆలయానికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడం ప్రధానపాత్రను పోషించాయి.

శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి త్రికరణశుద్ధిగా అర్చించినంత మాత్రాన సర్వయజ్ఞాలు చేసిన ఫలాన్ని, సర్వతీర్థాలు సేవించిన ఫలాన్ని అనాయాసంగా పొందవచ్చని సాక్షాత్తు పరమేశ్వరుడు, పార్వతిదేవికి చెప్పినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఈ క్షేత్ర దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. హైద్రాబాద్‌నుంచి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీశైలంలో భోజన వసతి సదుపాయాలు మెండుగా వున్నాయి.
మల్లికార్జున నామ ప్రశస్తి:
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ!నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు: పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

గోపూజ.....గోవును పూజించడం

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్లకొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి,ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి.

ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి.

సూర్యుడికి - గొధుమలు,
చంద్రునికి- వడ్లు,
కుజునికి-కందులు,
బుధునికి-పెసలు,
గురునికి- శనగలు,
శుక్రునికి-బొబ్బర్లు,
శనికి-నువ్వులు,
రాహువుకి-మినుములు,
కేతువుకి-ఉలవలు ఇష్టమైన ధాన్యాలు.

శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమ

చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం
శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను.

సాలె పురుగు - శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది.

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను. అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు, పుష్పములు, బిల్వదళములుతెచ్చి, పాము సమర్పించిన మణులను త్రోసివేసి, తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను. మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు, పుష్పములు పెట్టియుండుట గాంచెను. అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి, తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు, ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది. ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను. అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను. ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను. ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది. ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ, తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది


శ్రీ కాళహస్తిలొ శ్రీ జ్ఞాన ప్రసునాoభికాదేవి
పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రములను భోదించి నిశ్చల చిత్తంతో జపింపవలయుననెను. జపము సేయునప్పుడు ఆమెకు మందబుద్ది ఆవరించి నియమం విస్మరించెను.అపుడు శివుడు కోపించి ఆమెను భూమిఫై మానస్త్రీగా అవుతావని శపించెను.అపుడామే శాపవిమోచనకై శివుని ప్రాద్దింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పుజించమని అనతిచ్చెను.పార్వతి దేవి నారదుని సాయంతో భూమికివచ్చి ఘోర తపంబాచరించెను.శివుడు ప్రతక్ష్యమయ్యేను.ఆమెను తన అర్ధాంగమున అర్ధనారిశ్వరత్వమున నిలుపుకొనెను.అప్పటి నుండి ఆమె జ్ఞానప్రసూనాంభిక అను పేరుతో శ్రీ కాళహస్తిశ్వరస్వామి వారి సన్నిధ్యమున వెలసినది.ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞానప్రదిప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనంబాయను పేరు సార్దక నామమై విరాజిల్లుతుంది.

వాయులింగం
పంచభూత లింగములో శ్రీకాళహస్తిశ్వర లింగం వాయులింగంగా ప్రఖ్యాతి గాంచినది. కంచిలో ఎకంబరేశ్వరుడు, ప్రుద్విలింగంగా, తిరుచ్చిరాప్పల్ల మధ్య తిరువానైక్కావాల్ లేక శ్రీరంగంకు దగ్గరలోని జంబుకేశ్వరమున జల లింగం, అరుణచలంలో తేజో లింగం, శ్రీకాళహస్తిలో వాయు లింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా వెలసినవి ప్రతీతి. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలోనే యుండి మహాయోగులకు స్పర్సమాత్రమునే గ్రహింపదగి యుండిడివాడట.త్రేతాయుగంలో స్వర్ణరూపం,ద్వారప యుగంలో రజత రుపంను,ప్రస్తుత కలియుగంలో శ్వేత శిలా రూపమును పొంది తన సహజ వాయుతత్వ నిదర్సనముగా గర్బలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపముల రెండిటిని ఎల్లప్పుడూ చలింప చేయుచుండుట గమనింపదగినవి.

గోపురములు
ఈ అలయంకు నాలుగు దిక్కులలోను గోపురములు కలవు.ఇవిగాక రాజగోప్రురము సుమారు 120 అడుగుల ఎత్తుగలది ఒకటి కలదు.దీనిని శ్రీ కృష్ణదేవరాయలు 1516 లో కట్టించినట్లు శాసన ప్రమాణం కలదు.స్వామివారి గ్రామోత్సవంకు పోవునప్పుడు ఈ గోపురం నుండే వచ్చును.ఆలయం జేరుకోనుటకు ముందు తేరు విధి కెదురుగా నుండు భిక్షాల గోపురం నుండియే వచ్చును.జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిక్షాలు దీనిని కట్టించినట్లు చెప్పబడింది.ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగినట్లు చెప్పబడుతుంది.ఈ గోపర నిర్మాణం యాదవ నరసింహ రాయల కాలంలో జరిగి నట్లు చెప్పుదురు.

తుర్ఫువైపున ఆలయప్రవేశద్వారముగా బాలజ్ఞానంబ గోపురం కలదు. ఉత్తరం వైపునున్న గోపురంను సూర్య పుష్కరిణి, కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి. స్వామి వారి అభిషేకమునకు, వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి, కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకంనకు,వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి నుండియే తీసుకోని పోబడును. ఈ గోపురము నుండి సువర్ణ ముఖినదికి పోవచ్చును. దక్షిణ వైపునున్న గోపురం ద్వార కన్నప గుడికి, బ్రహ్మగుడికి పోవచ్చును.

ఈ దేవాలయ పూజా విధానము-ఉత్సవములు
ఈ దేవాలయమును వైదిక- అగము విధానములో పంచకాల పూజలు జరుగును.ఉదయం నుండి మధ్యాహం వరకు మూడు సార్లు అభిషేకములు సాయంత్రం సమయ ప్రదోషకాలమును ఒక అభిషేకము స్వామి అమ్మవార్లకు జరుగును. ఇచ్చటి గురుకులు(పూజారులు) బరద్వాజముని వంశియులైన భరద్వాజ గోత్రికులు,స్టానం వారు,ఇచ్చట శివరాత్రికి పదిరోజులు బ్రహ్మోత్సవము ముఖ్యమైనవి.మరియు దసరా రోజులలో అమ్మవారి ఉత్సవం వేశేషం గడించింది.ఇవిగాక ఏటేట రెండుసార్లు గిరి ప్రదక్షణము,జనవరి నేలలో కనుమ పండుగ రోజున మరియు శివరాత్రి అయిన నాలుగోవ రోజున జరుగును.

పంచారామాలు

ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము.

పంచారామాల పుట్టుక

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి ఒక కథ ఇలా ఉన్నది. క్షీరసాగర మధనం లో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలొ త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్టించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ట చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్దికెక్కినవి.

స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.

శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
‍ ‍ ‍ ‍ ‍ ‍ - స్కాందము

తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.

దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు

ఇవన్నీ దేవతలు ప్రతిష్టించినవేనని స్థలపురాణం చెపుతొంది.

అమరారామము
గుంటూరు జిల్లాలో గుంటూరు కు 35 కి.మీ. దూరంలో అమరావతి క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు అమరేశ్వరుడు, అమ్మ వారు బాలచాముండి. క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. ఇక్కడ స్పటిక లింగం ఎత్తు 16 అడుగులు. శివలింగం చుట్టూ రెండు అంతస్తులుంటాయి. అభిషేకాదులు రెండవ అంతస్తులో చేస్తారు. అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారం లో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్ధివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోలలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపుర సుందరీదేవి ఆలయాలు, కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు, నవగ్రహ మంటపం, యజ్ఞశాలలు ఉన్నాయి. మూడోప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు సూర్యుడి ఆలయాలు ఉన్నాయి.

దక్షారామము

తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది.
ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులులక్ష్మీనారాయణులు
శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.

సోమారామము
పశ్చిమ గోదావరి భీమవరం (గునిపూడి) లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు (కోటీశ్వరుడు) అమ్మ వారు రాజరాజేశ్వరి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావస్య రోజున గోధుము వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవాు పెఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.

కుమారభీమారామము
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపం లో ఈ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి.

ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ఈయనే దక్షరామ దేవాలయాన్నీ నిర్మించినది. అందుకె ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై షుమారు 922 వరకు సాగింది.

కుమరారామ శ్రీ భీమేశ్వరస్వామి వేంచెసి ఉన్న భీమవరం గ్రామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో ఒక భాగం (అక్షాంశము 17 02' ఉ, రేఖాంశము 82 12' తూ). ఇది పూర్వం ఛాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేస్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది.

క్షీరారామము
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఈ క్షేత్రం ఉన్నది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్టించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపే పడతాయి.

ఏక బిల్వం శివార్పణం

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.

ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థితి ,లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.
"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటఒ చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశాన్య భాగం లో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!

హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !

తులసి

మూలికలలో మహారాణి తులసి. తులసి అనే సంస్కృత పదం. తులసి అంటే సాటిలేనిది అని అర్థం. "యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ " అని శాస్త్రాల్లో చెప్పబడింది.

తులసి మొక్క మధ్య భాగంలో అంటే కాండం నుంచి సమస్త దేవీదేవతలు అగ్రభాగమందు నాల్గువేదాలు, మూలస్థానమందు సర్వతీర్థాలు నివాసముంటాయి. అటువంటి తులసికి నమస్కరిస్తున్నానన్నదే పై శ్లోకం అర్థం.

మన జీవన విధానానికి ప్రకృతి ఆలంబన. ప్రకృతిలో ముడిపడి సాగే జీవనసరళిలోని పురాణగాథలలో అంతర్లీనంగా ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. పురాణగాథలో ముడిపడిన జీవనశైలిలోని ఆచార వ్యవహారాలన్నీ మానవ జీవన వికాసానికి తోడ్పడతాయి.

తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసి, లక్ష్మితులసితో పాటు రామతులసి, అడవితులసి, నేలతులసి, మరువకతులసి, రుద్రజడతులసి, కర్పూరతులసి ఇలా ఎన్నో రకాలున్నాయి. కర్పూరతులసి తైలాన్ని ఓషధీయుత టాయ్‌లెట్స్ సాధనాల తయారీలో విరివిగా వాడతారు. ఈ నూనెను చెవినొప్పికి, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎక్కువగా వాడతారు.

శ్వాస అవరోధ రుగ్మతలను నయం చేయడానికి రామతులసిని ముందుగా వాడతారు. మలేరియాను రామతులసి నయం చేస్తుంది. అజీర్ణం, తలనొప్పి, హిస్టీరియా, నిద్రలేమి, కలరా వంటివి నయం చేయడానికి తులసిలో మందు ఉంది. రుగ్మతల్ని నయం చేసే గుణాలుగల తులసి మూలికల్లో మహారాణిగా శతబ్దాల తరబడి ప్రసిద్ధి గాంచినది.

సులభంగా పారాయణం చేయగల నవగ్రహ శ్లోకం: తాత్పర్యం

Picture
గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు.

ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు. రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి. నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.

నవగ్రహ శ్లోకం:
నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


ప్రతి పదార్ధం:
నమః= నమస్కారం;
సూర్యాయ= సూర్య గ్రహమునకు;
చంద్రాయ= చంద్రగ్రహమునకు;
మంగళాయ= మంగళ గ్రహమునకు;
చ= మరియు;
గురుః= గురు గ్రహానికి;
శుక్రః= శుక్ర గ్రహానికి;
శనిభ్యః= శని గ్రహమునకు;
రాహుః= రాహువునకు;
కేతవః= కేతువునకు;
నమః= నమస్కారము.

తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు.

పంచలింగాలు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.
శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.
హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.
వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.
వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.
శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.
కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.
మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా

కుబేరుడు

సిరి సంపదలకు, నవ నిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు, లోకపాలకుడు, ధనదుడు, ధనాధిపతి, యక్షరాజు, రాక్షసాధిపతి, భూతేశుడు, గుహ్యకాధిపతి, కిన్నెరరాజు, మయురాజు, నరరాజు. అథర్వణ వేదం ప్రకారం ఈయన గుహ్యాధిపుడు కూడా! కుబేరుడు అనగా అవలక్షణమయిన (లేదా అవలక్షణాలున్న) శరీరము కలవాడు (బేరము అంటే శరీరము) అని అర్థము. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద కుండ వంటి పొట్టతో, మూడు కాళ్ళు, ఒకే కన్ను, ఎనిమిది పళ్ళతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మణులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందనీ, మీసం, గడ్డంకలిగి ఉంటాడనీ, దంతాలు బయటకి వచ్చి (వినాయకుని దంతాల వలె) ఉంటాయనీ ఉంది. అదే విధముగా, శ్రీ శివ, మత్స్య, స్కాంద పురాణాల ప్రకారం, కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది. కైలాసం వద్దన ఉండే అలకానగరం కుబేరుని నివాస స్థలం.
ఈయన జనన సంబంధిత విషయాలు శ్రీ శివ పురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకి చెప్తున్నట్టు వస్తుంది. ఆ ప్రకారంగా, పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు – సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేద, వేదాంగాలు, శాస్త్ర, పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురువుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతను చెడు సావాసాల వలన జూదమునకు బానిసయ్యి, ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లయిన సోమిదమ్మకి ఇవన్నీ తెలిసినా గారాబంతో మందలించకపోగా, భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్య కలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడయినా కొడుకు గురించి భార్యను వాకబు చేస్తే, ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్య పెట్టేది. దానితో గుణనిధికి అడ్డు, అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగిలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంట పడటం, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయటం, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పటంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నదీ తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ, భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్లి, కొడుకు చెడు సావాసాలకు లోనయిన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరూ కూడా తనకి తల దాచుకోవటానికి సహకరించలేదు. చెంతనే ఉన్న గౌతమీ నది దాటి ప్రక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి, తమ శక్తి కొలదీ జాగారాలు చేసి, మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక, ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకుని తిందామని గర్భ గుడిలోనికి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక, తన పైవస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, నందీశ్వరుని మీద పడి, తల పగిలి చనిపోతాడు. ఊరి నుండీ పారిపోతూ పవిత్రమయిన గౌతమీ స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించటం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే “జన్మానికో శివరాత్రి” అంటారు.

ఇదిలా ఉండగా, పులస్త్యుడు అనే బ్రహ్మర్షి ధర్మాన్ని గ్రహించాలన్న ఆసక్తితో, మేరు పర్వతానికి అతి చేరువలో ఉండే తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళి, అక్కడ తనకనువయిన ఒక చోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. ఆ ఆశ్రమ పరిసరాలు ఎంతో రమణీయమయిన ప్రకృతి శోభతో విలసిల్లుతూ ఉండేవి. అందుకే దేవతాంగనలు, అప్సరసలు, నాగకన్యలు అక్కడకి వెళ్ళి తమ ఆటపాటలతో కాలం గడిపి వెళ్ళిపోయేవారు. వీటి వలన పులస్త్యునికి తపోభంగం కలిగేది. దానితో ఆగ్రహించిన ఆయన, తన కంట పడిన కన్య గర్భవతి అవుతుందని శపించి తపస్సులో మునిగిపోతాడు. ఈ శాపం గురించి తెలిసినవారెవరూ అక్కడికి వెళ్ళేవారు కాదు. ఒకనాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె అయినటువంటి మానిని అక్కడికి వెళ్ళటం, గర్భం దాల్చటం జరగటంతో తన కుమార్తెను స్వీకరించమని తృణబిందుడు పులస్త్యుని అడుగగా దయతో ఆమెను స్వీకరించి, ఆమె సేవలకి మెచ్చి, తనతో సమానమయిన జ్ఞానం, శక్తి ఉన్న పుత్రుడు పుడతాడని ఆశీర్వదిస్తాడు. అలా పుట్టినవాడే విశ్రవుడు (వేదాధ్యాయమును విన్నవాడు అని అర్థం). విశ్రవుడు (ఇతనిని విశ్రవ బ్రహ్మ అని కూడా పిలుస్తారు) తన తండ్రితో అన్ని విషయాల్లోనూ సమానుడై, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. యుక్త వయస్కుడైన విశ్రవునికి, భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణినిచ్చి వివాహం జరిపించారు. వీరిరువురికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే (విశ్రవుని కుమారుడు) కుబేరుడు.

కుబేరుడు చిన్నతనం నుండీ శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి మరియు పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే, రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి (మాలి, సుమాలి, మాల్యవంతుడు) ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మ వర్తనుడు. నర్మద అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకా నగర పాలకులయిన ముగ్గురూ ఈ ముగ్గురినీ అనగా మాల్యవంతుడు – సుందరినీ (వీరి కుమారులు – వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త మరియు కుమార్తె – నల), సుమాలి – కేతుమతిని (వీరి కుమారులు – ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రద, ప్రక్వత, భాసకర్ణ మరియు కుమార్తెలు – వేక, పుష్పోల్కత, కైకసి, కంభినది) మరియు మాలి – వసుతినీ (వీరి కుమారులు – అనల, అనిల, అహ, సంపతి) వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా, మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు.
అటువంటి రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క “కుంభ”స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట!

రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని “అపర కుబేరులు” అంటారు.

మణిమాణిక్యాలు, నిధులు, సంపదలతో నిండి వుండే ఈ అలకాపురం 100 యోజనాల పొడవు, 70 యోజనాల వెడల్పు కలిగి, కల్పవృక్షం నుండీ వీచే చల్లని గాలితో పరిమళ భరితంగా ఉంటుంది. అక్కడ తుంబురులు, గంధర్వ కన్యలు గానం చేస్తుంటే, రంభ, చిత్రసేన, మిశ్రకేశి, మేనక, సహజన్య, ఊర్వశి, శౌరభేయి, బుల్బుద, లత, మొదలగు ఎంతోమంది అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. మణిభద్రుడు, గంధకుడు, గజకర్ణుడు, హేమనేత్రుడు, హాలకక్షుడు, మొదలయినవారు కుబేరుని కొలువులో ముఖ్యమయిన వారు. కుబేరుని ప్రధాన సహాయకుడు విరూపాక్షుడు. శివుడు నిత్యం దర్శించే ప్రదేశము ఈ అలకానగరం అంటూ ఆ నగర శోభని మహాభారతంలో నారదుడు ధర్మరాజుకి చెప్తున్నట్టు వస్తుంది.
కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు, ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతా దేవిని బంధించిన రావణునితో పర స్త్రీని గౌరవంగా చూడాలనీ, చెడు ఉద్దేశ్యంతో చూడరాదనీ, సీతమ్మని విడిచి పెట్టమనీ హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకానగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు ఐమూలగా చూడగా, ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకునిపోవటం, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయటం, తద్వారా తన కన్ను పింగళ వర్ణం లోనికి మారిపోవటం వలన తనకి ఆ పేరు వచ్చిందనీ, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందనీ, తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దనీ వ్రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే “కళ్ళు పోతాయి” అంటారు. తన ప్రియమిత్రుడయిన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశ్యము లేదని జరిగిన సంఘటనను వివరించి, అమ్మవారిని అనుగ్రహించమని అనునయించటంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకనే కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నదిగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు.
కుబేరుని భార్య చిత్ర రేఖి (కానీ మహాభారతంలోని ఆదిపర్వం ప్రకారం, కుబేరుని భార్య పేరు భద్ర), పుత్రులు – పాంచాలికుడు, మణిగ్రీవుడు, నలకూబరుడు మరియు పుత్రిక – మీనాక్షి. వీరిలో మణిగ్రీవుడు, నలకూబరుడు భాగవతం ద్వారా మనందరికీ సుపరిచితులే (నారద మహాముని శాపం వలన వారిరువురూ మద్ది చెట్లై ఉంటే శ్రీకృష్ణుడు వారికి శాప విమోచనం కలిగిస్తాడు). ముఖ్యంగా చెప్పుకోవలసిన వ్యక్తి పాంచాలికుడు. తండ్రయిన కుబేరుని లాగానే ఇతను కూడా శివ భక్తి కలవాడు, శివునికి ప్రీతి పాత్రుడు. దక్ష యజ్ఞంలో తనకి జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సతీ దేవి అగ్నికి ఆహుతయ్యింది. ఈ విషయం తెలిసిన పరమ శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేసినా, భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె దూరమవటాన్ని తట్టుకోలేక దుఃఖంతో అంతా సంచరిస్తున్నాడు. అటువంటి సమయంలో మన్మధుడు ఈశ్వరుని మీదకు “ఉన్మాదనాస్త్రాన్ని” ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వలన విపరీతమయిన విరహ తాపానికి గురవుతూ, ఆ బాధ తట్టుకోలేక యమునా నదిలోనికి దిగుతాడు. ఈ వేడి జ్వాలలు ఆ నదిని దహించివేస్తాయి. దానితో ఆ నదీ జలం నల్లగా మారిపోవటంతో యమునా నదికి “కాళింది” అనే పేరు వచ్చింది. కానీ శివుని విరహ తాపం మాత్రం తీరటం లేదు. ఇంతలో మన్మధుడు “సంతాపనాస్త్రాన్ని” వేస్తాడు. ఈ అస్త్ర ప్రభావంతో మరింతగా బాధపడుతూ అగ్ని జ్వాలల్లాంటి నిట్టూర్పులను విడుస్తూ ప్రపంచాన్నంతా తాపంతో ముంచెత్తాడు. ఈ సారి మన్మధుడు “విజృంభణాస్త్రాన్ని” ప్రయోగించేసరికి శివుడు మరింత ఉన్మత్తుడై తిరగసాగాడు.
ఆ సమయంలో శివునికి కుబేరుని కుమారుడయిన పాంచాలికుడు కనిపిస్తాడు. వెంటనే అతని వద్దకు వెళ్ళి సహాయం కోరతాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, తనకి వచ్చిన అదృష్టావకాశానికి పొంగిపోతూ ఆజ్ఞాపించమంటాడు. దానితో తన బాధను పాంచాలికునికి వివరించి, తన మీద ప్రయోగింపబడిన మూడు (ఉన్మాదన, సంతాపన, విజృంభణ) అస్త్రాల వేడినీ తీసుకోమని కోరతాడు. మహా శివుడే తట్టుకోలేని వేడిని తాను మాత్రం ఎలా తట్టుకోగలడు? వాటిని తీసుకుంటే ఆ అస్త్రాల ప్రభావానికి తన జీవితమే నాశనమయిపోతుంది అని తెలిసినా కూడా అడిగినది పరమేశ్వరుడు కనుక నిస్సంకోచంగా, దైవాజ్ఞను ఆచరించి తీరాలి అనే ఆశయంతో ఆ మూడు అస్త్రాల వేడినీ తాను తీసుకుని శివునికి ఉపశమనం కలిగిస్తాడు. అతని భక్తికి, చిత్తశుద్ధికి మెచ్చిన శివుడు ఎంతో ఆనందించి ఆ వేడి పాంచాలికుడిని బాధించకుండా వరం ప్రసాదించి, మహోన్నతమైన దైవత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు నుండీ పాంచాలికుడు కాలింజరానికి ఉత్తర భాగంలో, హిమవత్పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశంలో పాంచాలికేశ్వరుడిగా కొలువవుతాడనీ, చైత్ర మాసంలో ఈయనని చూసినా, విగ్రహాన్ని ముట్టుకున్నా, భక్తిగా స్మరించుకున్నవారు ఎవరయినా (చిన్న/పెద్ద, ఆడ/మగ భేదం లేకుండా) ఉన్మత్తులు అవుతారని చెప్తాడు. అయితే ఈ ఉన్మత్తత వ్యాధిలాగానో, అగ్నిలాగానో బాధించకుండా నాట్యగానాలలో, వాద్య సంగీతాలలో నేర్పుతో పాటు చతురోక్తులు విసరటం వంటి కళలలో అత్యున్నత స్థానానికి చేరి తిరుగులేని వారిగా ఉంటారని, అదే వారు అనుభవించే ఉన్మత్తమనీ వివరిస్తాడు. ఆ విధంగా పాంచాలికుడు కళాకారులకి ఆరాధ్య దైవంగా మారి, తనను కొలిచిన వారందరికీ వరాలనిచ్చే శక్తిని పొందాడనీ వామన పురాణం వివరిస్తోంది.
ఎంతోమంది అదృష్ట చిహ్నంగా, సిరిసంపదలనొసగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే “లాఫింగ్ బుద్ధ” మన కుబేరుడే అని చాలా మంది నమ్మకం. కుబేరుని పూజించిన వారికి ఆర్ధిక ఇబ్బందులు తొలగి, వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే, కుబేరుని ప్రతిమ కానీ, కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరయినా కానుకగా ఇచ్చినది మనం తీసుకుని పూజిస్తే విశేషమయిన ఫలితం ఉంటుందని నమ్మిక. ధన త్రయోదశి నాడు కుబేర పూజలు, కుబేర వ్రతాలు, మొ., ఈ మధ్యన మనం ఎక్కువగా చూస్తున్నా, నిత్యం మనకి తెలిసో, తెలియకుండానో కుబేరుడిని మంత్రపుష్పం చదివేటప్పుడు స్మరిస్తూనే ఉంటాం.

“రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే
నమోవయంవై శ్రవణాయ కుర్మహే
సమే కామాన్ కామ కామాయ మహ్యం
కామేశ్వరోవై శ్రవణో దదాతు
కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయ నమః “
హిందువులే కాక, బౌద్ధ, జైన మతాల వారు కూడా అధికంగా పూజించే, నమ్మే దైవం కుబేరుడు. బౌద్ధులు ఈయనని వైశ్రవణుడు లేదా జంభాలుడు అని పిలుస్తారు. శ్రీ శివ పురాణం ప్రకారం, కుబేరుడి అసలు పేరు వైశ్రవణుడే! జైనులు ఈయనని సర్వానుభూతి అంటారు. టిబెటియన్లు మరియు జపనీయుల ప్రకారం ప్రపంచాన్ని నలుదిక్కులా పాలించే రాజులలో కుబేరుడు ఒకడు. బౌద్ధుల ప్రకారం ఈయన చేతిలో ఎల్లప్పుడూ బంగారు నాణెములు కల ఒక సంచీ కానీ వజ్రములను, మణులను వెదజల్లు ముంగీస కానీ ఉంటాయి. అదే విధంగా, మరొక చేతిలో ఎల్లప్పుడూ నిమ్మకాయ (జంబీరము) ఉండటం వలననే ఈయనకి జంభాలుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. అగ్ని పురాణం ప్రకారం, ఈయన ఆయుధం గద, వాహనం నరుడు (మనిషి). దీని ద్వారా మనిషి డబ్బుకి, ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కనుక మనిషి మనీ కి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా వుంటూ, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆశిద్దాం.

“ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేరః ప్రచోదయాత్”

శ్రీ లక్ష్మీ కుబేరపూజ

ఐశ్వర్యానికి అధిపతియైన కుబేరుని భక్తితో పూజించుకునేవారికి సకల సంపదలతోపాటు ఆయురారోగ్యభాగ్యాలు కలుగుతాయి.

పసుపుకుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపండ్లను సేకరించుకోవాలి. ఉదయాన్నే తలంటిస్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి.

ముందుగా శ్రీ లక్ష్మీ కుబేరస్వామివార్ల చిత్ర పటాన్ని పీటపై పెట్టి, దానిని పసుపుకుంకుమలతో అలంకరించాలి. ఆ పటానికి ముందు అరటిఆకును పరచి, దానిపై నవధాన్యాలను పోసి, పలచగా సర్ది, దానిమధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి. ఆ నీటిలో కాస్తంత పసుపు కలపాలి. తర్వాత చెంబులో మామిడాకులను నిలిపి, వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి. అనంతరం పూజాద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి. అనంతరం పసుపుముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని, అరటి ఆకుపై కుడిప్రక్కన అమర్చాలి. పసుపుముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమను పెట్టి దీపారాధన చేసి, వినాయక ప్రార్ధన చేయాలి. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి.

సరసిజ నిలయే, సరోజహస్తే
ధవళ తమాంశుక గంధమాల్యశోభే
భగవతి, హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

అని స్తోత్రం చేసిన తర్వాత,

ఓం దనద సౌభాగ్య లక్ష్మీకుబేర
వైశ్రవణాయ మమకార్య సిద్ధిం కురుస్వాహా

అనే మంత్రాన్నిస్తోత్రం చేయాలి.

ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాణి వెలిగించి, ధూపం వేసి, ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపజేయాలి. పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప, కర్పూరహారతిని ఇస్తూ గంట మ్రోగించాలి. అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను, తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి

అష్టాదశ శక్తి పీఠాలు

హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .
అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2.కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3.శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7.మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8.ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10.పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11.గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12.మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13.కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14.మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15.సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16.వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17.మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.




ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ?

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.
2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.
3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.
4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.
5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.
6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.
7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.
10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హర ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.
12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. నికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .


అంజనాదేవి జీవిత చరిత్ర

పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు.. ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడా తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది. దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సును భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు.
అప్పుడు ఇంద్రుడు తన రాజ్యంలో వున్న ‘‘పుంజికస్థల’’ అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి, పంపిస్తాడు. మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ చేసేదేమీలేక అతని తపమును భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తన అందాచందాలతో, నృత్యగీతాలతో ఆ మహర్షి తపస్సును భంగం కలిగిస్తుంది. తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను.. ‘‘నువ్వు వానర యోనియందు జన్మించుగాక’’ అని శపిస్తాడు.
అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ.. వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి.. ‘‘నువ్వు ఎప్పుడు ఏ రూపంలో ధరించాలని అనుకుంటావో.. అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు’’ అని వరాన్ని ప్రసాదిస్తాడు.


కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం మేరకు ఆ పుంజికస్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. ఆమెకు నచ్చిన విధంగా యదేచ్ఛగా సంచరించేందుకు కూడా అవకాశం లభించింది. ఈమే ‘‘అంజనాదేవి’’. ఈమె వానర రాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్నివిధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు.
ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు ఒక వాయువుతరంగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్పృజించినట్లుగా అనిపిస్తుంది. దానికి ఆమె కోపంతో.. ‘‘నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను’’ అని చెబుతుంది.
అందుకు సమాధానంగా వాయుదేవుడు.. ‘‘దేవీ! నేను వాయుదేవుడిని. నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు.. బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తానరు. ఎవరు అతనిని తిరస్కరించేవారు వుండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ.. ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు’’ అని చెబుతాడు. తరువాత కేసరీదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వాయుదేవుడు చెప్పిన విధంగా.. శంకరుని అంశతో అంజనాదేవికి శ్రీమత్ వైశాఖ బహుళ దశమినాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు అవతరిస్తాడు.

ఆంజనేయస్వామిని చూసి జడుసుకున్న శనీశ్వరుడు!

దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.

శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.

ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.

కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.

అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.

అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

కృష్ణుడి తల పైన " నెమలి పించం " ఎందుకుంటుంది ?

కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు. అన్ని వేల మంది తో కేవలం సరససల్లాపాలు మాత్రమె చేసాడు. అల్లరి చేసాడు, అల్లరి పెట్టాడు. అంతవరకే కానీ ఏ నాడు ఆయన అతిక్రమించలేదు. గోపికలు కృష్ణుల మద్య ఉన్నది ఒక పవిత్రమైన చెలిమి మాత్రమే. కృష్ణుడు భోగి గా కనిపించే యోగి.

ఇక నెమలి విషయానికి వస్తే ప్రపంచంలో సంభోగం చెయ్యని జీవి ఇది. అత్యంత పవిత్రమైన జీవి కనుకే మన దేశానికిజాతీయ పక్షిగా ప్రకటించబడుతుంది. పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా శ్రీ కృష్ణుడు అత్యంత పవిత్రుడు. అందుకే నెమలి పించం తలపై ఉండి శ్రీ కృష్ణ భగవానుడి పవిత్రతను తెలియజేస్తుంది.

గోపికలు ఉన్నా అత్యంత పవిత్రుడు అనే కంటే అసలు విషయం ఏంటంటే.. కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారి. అంటే స్కలనం అనేది ఎరుగడు. నెమలి పరవశించినపుడు మగనెమలి అశ్రు ధారను ఆడ నెమలి మింగితే అది పునరుత్పత్తిని పొందగలదట. అంతేకాని అవి సంభోగించవు. అందుకే కృష్ణుడు తల పై నెమలీక ధరిస్తాడు. మరో ముఖ్య విషయం. పిల్లన గోవిని గోవిందుని పెదవుల వద్ద స్థానం ఎలా సంపాదించావని ఒక మహర్షి అడిగాడట. అప్పుడు పిల్లనగ్రోవి ఇలా చెప్పిందట. ఇలా చూడు నాలో ఏముందని అడిగిందట. నాలో ఏమీ లేదు. ఏ కల్మషమూలేదు. ఏ కోరికలూ లేవు.. ఈ కామ, క్రోధ,లాభ, మోహ , మధ, మాత్సర్యాధి హరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటే జీవితం చక్కని స్వరంలా సాగిపోతుంది. తనదంటూ ఏదీ కోరని వారినే దేవుడు తన మధుకలశాల వద్ద ఉంచుకుంటాడని చెప్పిందట పిల్లనగ్రోవి.

శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?

సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది


దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ... ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది.

సాయిబాబా హారతి అర్థాలతో ..

ఆరతి సాయి బాబా, సౌఖ్య దాతార జీవ చరణా రాజాతాళీ
ధ్యావా దాసాన్ విసావా, భక్తా విసావా ఆరతి సాయి బాబా

బాబా నీకు ఆరతి చేస్తున్నాము. జీవులందరికీ సంతోషము నొసగి, నీ పాద రేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు నిచ్చే నీకు ఆరతి చేస్తున్నాము.

జాళుని యానంగా స్వ స్వరూపీ రాహే దంగా
ముముక్షు జన దావీ నిజ డోలా శ్రీరంగ, డోలా శ్రీరంగ
ఆరతి సాయి బాబా

కోరికలను దహింప జేసి, తనను తాను తెలుసుకొన గోరే వారికి, మోక్షమును పొందే మార్గము బోధించి, తమ కళ్ళతో తాము విష్ణువుని (శ్రీరంగని) చూడ గలిగెట్లు చేసిన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

జయా మనీ జైసా భావ, తయా తైసా అనుభవ
దావిసీ దయాఘనా, ఐసీ తుఝీ హీ మావా, తుఝీ హీ మావా,
ఆరతి సాయి బాబా

ఎవరెవరికెంత నమ్మకము, భక్తి ఉన్నదో, వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే, ఓ దయామయా నీవు చూపే మార్గము అదే ఓ దయామయా, నీకు ఆరతి చేస్తున్నాము. (దీనికి సామ్యం గా అన్నమాచార్యులు కూడా ఇలా చెప్పారు: "ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమె నీవు, అంతరాంతరము లెంచి చూడ పిందంటే నిప్పటి అన్నట్లు" అని.)

తుమచే నామ ధ్యాతా, హరే సంస్కృతి వ్యథా
అగాధ తవ కరణీ, మార్గ దావిసీ అనాథ, దావిసీ అనాథ,
ఆరతి సాయి బాబా

నీ నామ స్మరణము ఈతి బాధలను హరిస్తుంది. నీ చర్యలు అగాధమంత లోతైనవి (అంతు పట్టనివి). అవి అనాథలకు దారి చూపుతాయి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

కలియుగీ అవతార సద్గుణ పరబ్రహ్మ సాచారా
అవతీర్ణ ఝాలాసే, స్వామి దత్తా దిగంబర, దత్తా దిగంబర,
ఆరతి సాయి బాబా

ఈ కలియుగంలో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి. నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి. బాబా నీకు ఆరతి చేస్తున్నాము. (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి పత్నియైన అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి మూడు తలలు గల దత్తాత్రేయునిగా జన్మించాడు)

ఆఠా దివాసా గురువారీ, భక్త కరీతి వారీ,
ప్రభుపద పహావాయా భవభయ నివారీ,
ఆరతి సాయి బాబా

ప్రతి గురు వారం భక్తులు షిరిడీ వచ్చి ఈ ప్రభువు చరణములను దర్శించుకుని, తమ ఇహలోక భయమును పోగొట్టు కొందురు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

మాఝా నిజ ద్రవ్యఠేవ, తవ చరణరజ సేవ
మాగణే హేచి ఆతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా,
ఆరతి సాయి బాబా

నాకు కావలసిన సంపద అంతా నీ పాద సేవ చేయడమే. ఓ! ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

ఇచ్చితా దీన చాతక నిర్మల తోయ నిజ సూఖ
పాజవే మాధవాయ సంభళ అపూళిభాక, అపూళిభాక
ఆరతి సాయి బాబా

చాతక పక్షి ఎలా అయితే నిర్మలమైన నీరు త్రాగాలను కుంటుందో, ఓ! ప్రభూ, నాకు జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ప్రసాదించు. సాయి బాబా నీకు ఆరతి చేస్తున్నాము.

సాయి సచ్చరిత్ర పారాయణ నియమావళి

బాబాకి సంబంధించిన రచనలన్నిటా సాయి సచ్చరిత్రే గొప్పది. సచ్చరిత్రను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు, బోధనలు, నీతుల్ని ఆకళింపు చేసుకోవడం. ఆకళింపు చేసుకుని మనల్ని మనం సంస్కరించుకోవడం. తన పట్ల పరిపూర్ణమైన శ్రద్ధనూ, విశ్వాసంతో కూడిన భక్తినే బాబా భక్తుల నుంచి ఆశిస్తారు. నిరంతరం తనని జపించే వారిని సప్తసముద్రాలూ దాటిస్తానని, వారి కష్టాలు కడతేరుస్తానని స్వయంగా బాబాయే చెప్పారు. అటువంటి బాబా సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించక తప్పదు.

* పారాయణం ప్రారంభించే రోజు శుచిగా తలస్నానం చేయాలి.
* పారాయణం చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. పారాయణకి ఆటంకం కలిగించే ఎలాంటి వస్తువుల్నీ (సెల్ ఫోన్, రేడియో వగైరా) దగ్గర ఉంచుకోకూడదు.
* సచ్చరిత్ర పారాయణానికి కులమతాలు లేవు. వయో భేదాలు లేవు. లింగభేదం లేదు. ఎవరయినా దీనిని పారాయణం చేయొచ్చు.
* కడతేరని సమస్యలతో బాధపడేవారు సాయి సచ్చరిత్రను వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఫలితం ఉంటుండు.
* పారాయణాన్ని పొద్దున్నే ప్రారంభించాలి. ప్రత్యేక సంకల్పంతో పారాయణం చేయదలిస్తే ఆ వ్యక్తి పేరుపై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్కరోజులో పారాయణాన్ని పూర్తీ చేయాలి.
* గురుపోర్నామి, విజయదశమి, శ్రీరామనవమి, దత్తజయంతి బాబాకి ఇష్టమయిన రోజులు. ఈ రోజుల్లో సచ్చరిత్ర పారాయణ చేయడం అనుకూలిస్తుంది.
* పారాయణానికి ముందు యథాశక్తి బాబాకి నైవేద్యం పెట్టాలి. అలాగే మనలోని అహంకారాన్ని, అసూయద్వేషాలను పక్కన పెట్టాలి.
* బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్టించుకుని సచ్చరిత్రను పారాయణం చేస్తే అభీష్టాలు ఇట్టే నెరవేరుతాయి.
* పారాయణం అనంతరం సచ్చరిత్రను దానం చేయాలి. వారి చేత కూడా సచ్చరిత్రను పారాయణం చేయించగలిగితే అంతకన్నా మించింది లేదు.

అయ్యప్ప దీక్ష నియమావళి

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :-

1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.
2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.
3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.
4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.
5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 41 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.
6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.
7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.
8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.
9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.
10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.
11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.
12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా 'మాతా' అని పిలవాలి.
13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.
14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.
15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.
16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.
17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.
18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.
19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.
20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.
21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.
22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.
23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.




అయ్యప్ప స్వామిని ను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య ( విష్ణువు), అప్ప ( శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు.
మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ.
క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది.

అదే సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పందళ దేశాధీశుడు, గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు. సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచిన రాజశేఖరుడు ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడ ఎంతగానో ఆనందిస్తుంది. ఆయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషము వలన ఏడాది తిరిగే సరికి రాజశేఖరుని భార్య మగబిడ్డను ప్రసవిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని మరికొందరు 'అప్పా అని మరికొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసురాగానే మహారాజు కొడుకులిద్దర్నీ గురుకులానికి పంపిస్తాడు. రాజ గురువు అయ్యప్పను అవతారపురుషునిగా గుర్తిస్తాడు. అయినా అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులం లో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికి అది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పిస్తుంది. నేవెళ్ళీ తీసుకు వస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప.

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వలదని మణికంఠుడు తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. అందుకు నియమం ఏమంటే తానొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయం శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిరనివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలందుకొంటున్నాడని భక్తుల విశ్వాసం.
స్వామియే శరణం అయ్యప్ప !




శబరిమలై ఆలయము :
ఈ ఆలయము ఇదు శాస్త్రాలయాల తో ప్రసిద్ధిచెందినది . అరణ్యాల మధ్య లో శబరిమలైకి ఎదురుగా ఉన్న" పొన్నంబల " మేడలో అయ్యప్ప స్వామి " జీవన్ముక్తుని " గా ఉంటాడు .
శబరిమలై


శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం.

దేవాలయ నిర్మాణము

అంతట అయ్యప్ప ఈ పర్వతముపై కల అయ్యప్పస్వామి దేవాలయము భారతదేశ ప్రసిద్ది చెందిన, అధిక జనసమ్మర్ధం కలిగిన దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయమునకు మాలధారణ చేసుకొని నలుభైఒక్క రోజు నియమాలను పాటించిన భక్తులు కార్తీకమాసం మరియు సంక్రాంతి సమయాలలో విపరీతంగా వస్తారు.

నిత్య పూజా క్రమంలో గాని, దేవాలయానికి వెళ్ళి గాని అయ్యప్పను దర్శించుకోవడం ద్వారా గాని అయ్యప్పను పూజించడం సాధారణంగా ఇతర దేవుళ్ళ పూజలాగానే ఉంటుంది. అయితే దీక్ష తీసుకొని అయ్యప్ప దర్శనం కోసం వెళ్ళడానికి కఠినమైన నియమాలను అనుసరిస్తూ ప్రతిదినమూ చేసే భజన పూజాది కార్యక్రమాలలో కొంత వైశిష్ట్యం కనిపిస్తుంది.
దీక్ష, మాల, నియమాలు

భక్తులు కార్తీకమాసం నుండి దాధాపు మార్గశిర పుష్య మాసాల వరకు దృఢమైన నియమాలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూపమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు ఝామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసిమాల, నుదుట విభుదిపై గంధం బొట్టు ధరిస్తారు. దినంలో అధిక భాగం పూజ భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటికనేల మీద పడుకొంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణాలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలతో గడుపుతారు. ఇలా అయ్యప్ప స్వామి దీక్షకు ఒక స్పష్టమైన, కొంత క్లిష్టమైన విధానం రూపు దిద్దుకొంది.

దీక్ష తీసుకోవాలనుకొనే భక్తుడు గురుస్వామి వద్దనుండి ఉపదేశంతో మాలను ధరిస్తాడు. మాలా ధారణ అనంతరం తన మనస్సునూ, శరీరాన్ని భగవంతునికి అంకితం చేయాలి. అందరినీ భగవంతుని రూపాలుగా భావించాలి. అయ్యప్ప శరణు ఘోషను విడువకూడదు. నిత్యం భజన కార్యక్రమంలో పాల్గొనాలి.
భజన
పడిపూజ
హరివరాసనం
అయ్యప్ప పూజ చివరిలో "హరివరాసనం" లేదా "శ్రీ హరిహరాత్మజాష్టకం"గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసేముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోను, ఉత్సవాలలోను, పూజలలోను పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని "కుంబకుడి కులతూర్ అయ్యర్" రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940, 50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి. ఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్యప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో "ఈశ్వరన్ నంబూద్రి" అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమీనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినపుడు చింతించిన ఈశ్వరన్ నంబూద్రి ఆరోజు ఆలయం మూసివేసే సమయంలో "హరివరాసనం" స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.

హరవరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క రాత్రిదీపం మాత్రం ఉంచుతారు. ఈ శ్లోకం నిద్రపోయేముందు అయ్యప్పకు జోలవంటిది. శ్లోకం అయిన తరువాత నమస్కారం చేయవద్దని, "స్వామి శరణు" అని చెప్పుకోవద్దని చెబుతారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి. మొదటి శ్లోకం -

హరివరాసనమ్ విశ్వమోహనమ్
హరిదధీశ్వరమ్ ఆరాధ్యపాదుకమ్
అరివిమర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే

శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా
శరణమయ్యప్పా స్వామి శరణమయ్యప్పా

శబరిమల యాత్ర :
దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమలై యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మద్య కేంద్రీకృతమై ఉంటుంది.ఇక్కడికి యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ (నవంబర్ 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మళయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.

ఎరుమేలి
శబరిమలై యాత్ర "ఎరుమేలి"తో మొదలవుతుంది. ఎరుమేలిలో "వావరు స్వామి"ని భక్తులు దర్శించుకొంటారు. (అయ్యప్ప పులిపాలకోసం అడవికి వెళ్ళినపుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. "నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకొంటారు" అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్తుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే) దర్శనానంతరం భక్తులు వావరుస్వామి చుట్టూ రకరకాల వేషధారణతో "పేటై తులాల" అనే నాట్యం చేస్తారు. (మహిషితో యుద్ధం చేసేటపుడు అయ్యప్ప చేసిన తాండవం పేరు "పేటై తులాల"). ఈ ఎరుమేలి వద్ద ఉన్న "ధర్మశాస్త" ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారియై ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను "కన్నెమూల గణపతి" అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు.

పాదయాత్ర
ఇక్కడినుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు రెండు మార్గాలున్నాయి. "పెద్ద పాదం" అనేది కొండలమధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది ఎనభై కిలోమీటర్ల దారి. దారిలో పెరుర్‌తోడు, కాలైకట్టి అనే స్థలాలున్నాయి. (మహిషితో అయ్యప్పస్వామి యుద్ధం చేస్తుండగా కాలైకట్టివద్దనుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట). ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది (మహిషి కార్చిన కన్నీరు నదీరూపమైందట) ఉంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నదినుండి ఒక రాయిని తీసుకు వెళతారు. ఆ రాతిని "కళిద ముకుంద" (మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు) వద్ద పడవేస్తారు. తరువాత యాత్ర ముందుకు సాగి పెరియానపట్టమ్, చెరియానపట్టమ్ అనే స్థలాలగుండా పంబ నది చేరుకొంటుంది. అక్కడే "పంబ" అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడినుండి స్వామి సన్నిధానానికి ఏడు కిలోమీటర్ల దూరం.

చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి ఏడు కిలోమీటర్లు మాత్రం కాళినడకన వెళ్ళాలి.

సన్నిధానం
భక్తులు పంబానదిలో స్నానం చేసి "ఇరుముడి"ని తలపై పెట్టుకొని అయ్యప్ప శరణు ఘోషతో "నీలిమలై" అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్నెస్వాములు (తొలిసారి దీక్ష తీసుకొన్నవారు) తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో "శరమ్ గుత్తి" అనే చోట ఉంచుతారు. ఇక్కడినుండి అయ్యప్ప సన్నిధానంకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది.

సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను "పదునెట్టాంబడి" అంటారు. 40 రోజులు దీక్ష తీసుకొని ఇరుముడి ధరించినవారు మాత్రమే ఈ మెట్లు ఎక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కధనం. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి, 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆళయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట.

సన్నిధానంలో "పానవట్టం"పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణం అయ్యప్ప స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని. ఒంపు తిరిగిన ఎడమచేయి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు




అయ్యప్ప స్వామి
ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు), అప్ప శివుడు) అని పేర్ల సంగమం తో 'అయ్యప్ప' నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శశబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు

జనన కారణము :
అయ్యప్ప జననము సరిగా ఎవరికీ తెలీదు . ఎన్నో కధలలో కొన్నింటిని మతపెద్దలు ప్రచారములో పెట్టేరు .
1.క్షీరసాగరమధనం అనంతరం దేవతల కు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు.
2. భస్మాసురుడు అనే రాఖసుడు శివుని కై తపస్సు చేసి ... తానూ ఎవరి తలపై చేసి వేస్తే వారు భస్మము అయిపోయేతట్లు వారము పొంది ... తాను పొందిన వరకు పనిచేయునది , లేనిది పరీక్ష నిమిత్తము శివుని తలపై నే చేయి వేయుటకు పూనుకొనగా చావు భయము తో శివుడు పారిపోయి గురివింద గింజ లో దాక్కోనెను . శివుని రక్షించే కార్యములో విష్ణువు 'మోహినీ ' రూపము ఎత్తి భస్మాసుర వధ గావించెను .
ఏది ఏమైనా ... వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవుల కు, వైష్ణవుల కు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. అయ్యప స్వామి . ఇలా హరి హరులకు బిడ్డ పుట్టుటకు కారణముంది . మహిష ను సంహరించాదానికే ... ఈ మహిష ఎవరు ? .

పూర్వము త్రిమూర్తుల అంశ తో జన్మించిన దత్తాత్రేయుడు .. ఆ త్రిమూర్తుల భార్యలైన - సరస్వతి ,లక్ష్మీ , పార్వతి ల అంశతో జన్మించిన 'లీలావతి'ని పెళ్లి చేసుకుంటాడు . లోకోద్ధారణ ముగిశాక అవతారము చాలిద్దామని దత్తాత్రేయుల వారు అంటే ... మరికొంతకాలము ఇక్కడే సుఖిద్దామని భార్య కోరగా , దత్తు నకు కోపము వచ్చి" మహిషి " గా జన్మించమని శపిస్తాడు . శక్తి స్వరుపిని అయిన లీలావతి భర్తను "మహిష " గా పుట్టుడురుగాక అని ప్రతి శాపముతో ఇద్దరు ... రంబాసురుడు అనే రాక్షసుడు కి యక్షకి దత్తుడు మహిషాసురుడు గాను , కరంబాసురుడు అనే రాక్షసుడుకి లీలావతి మహిషి గాను జన్మించిరి . మహిసాసుర మర్దిని తో (దుర్గాదేవి ) మహిసాసురుడు చనిపోగా మహిష తపమాచరించి బ్రహ్మ వద్ద ఎన్నో వరాలు పొంది చివరికి చావు ఉండకూడదని వారము అడుగుతుంది . పుట్టిన వానికి గిట్టక తప్పదు ... అని ఇంకో వారము కోరుకోమంటాడు బ్రహ్మ . హరి హర సుతుని చేతిలో తప్ప మరెవరి చేతి లో చావు లేకుండా వరము కోరిననది . హరి హరులు వివాహమాడారు గదా .. వారికి బిడ్డ పుట్టాడనే తెలివితో కోరుకున్నదీ వరము . తీరా అయ్యప్ప జన్మతో మహిష మరణిస్తుంది .
మహిషి వధ

అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు.

అయ్యప్ప చరితము :
హరి హర పుత్రుడైన అయ్యప్ప పందల రాజ్యాన్ని పాలించే "రాజషేఖరపాన్ద్యుడు "నకు పంపానదీ తీరాన లభిస్తాడు . సర్పం నీడన పవళించి ఉన్న అతనికి " మణికంఠుడు " అని పేరు పెట్టి విద్యా బుద్దులు నేర్పిస్తాడు .

మనికంటుడు అనగా మన అయ్యప్ప స్వామి .. గురుకులం లో చదువుకునే రోజుల్లో వారి గురువు ఎడల్ అత్యంత భక్తీ శ్రద్దలతో వుండేవాడు . సాక్షాత్తు భగవంతుడైనప్పటికీ గురువు ద్వార సకల విద్యలు నేర్చుకున్నాడు . అయితే గురుదక్షిణగా గురువు కోరికపై అంధుడు , ముగావాడైన ఆయన పుత్రునికి మాట , ద్రుష్టి ప్రసాదించి తన గురుభక్తిని చాటుకున్నాడు . ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్న "వానరుడనే " బందిపోటు దొంగను ఓడించి అతనికి దివ్యత్వాన్ని బోధించాడు .

తండ్రి అప్పజేప్పబోయిన సింహాసనాన్ని త్యజిస్తాడు మనికంటుడు . ఆయన కోరికమేర తను బాణం వేసిన చోట ఓ ఆలయం నిర్మించి ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు తండ్రి . అదే శబరిమల ఆలయము . అందులో మనికంటుడు అయ్యప్ప స్వామి గా అవతరిచాడు .

ఎవరైతే నియమ నిష్టలతో సేవించి "పదునేట్టాంపడి " నెక్కి దర్శిస్తారో వారికి ఆయురారోగ్య ఇష్వర్యాలను పర్సాదిస్తాడు . మాటలు రాణి వారికి మాటలు వచ్చే మహిమాన్వితమైన ప్రదేశమిది . చూపులేనివారికి చూపునిచ్చే కన్నుల పండువైన ప్రదేశమిది . భగవంమహిమ కలిగిన శబరిమలై లో గల దివ్య ఔషధాల వనములికా పరిమళ ప్రభావం తో కూడిన ప్రాణవాయువును పీల్చగానే ఎంతటి అనారోగ్యమైనా చక్కబడుతుంది . సంతానము , సౌభాగ్యము , ఆరోగ్యము , ఐశ్వర్యము మొదలైన కోరిన వరాలనిచ్చే స్వామి అయ్యప్ప .

పిల్లలను దృష్టిదోషాలనుంచి కాపాడే శ్లోకం

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి?

తిరుమల నంబి స్వామి వారికి అభిషేకం చేసి, కిందకి దిగి రోజూ రామానుజా చార్యుల వారికి రామాయణం చెప్పేవారు. మళ్లి సాయంత్రం కొండ ఎక్కేవారు. దీని వల్ల స్వామి వారి దర్శనం ప్రొద్దున్న & సాయంత్రం మాత్రమే అవుతోందని బాధ పడేవారు. వేంకటేశ్వర స్వామి వారు ఆయన కలలో కనబడి ఏమని అభయం ఇచ్చారంటే - నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్సనం చేసుకోవచ్చు అని. మనం కొండని కాలి మార్గం గుండా వెళ్ళే ముందు అలిపిరిలో శ్రీవారి పాదములు అని కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి. ఎంతో గొప్ప మహానుభావుడాయన

సప్తగిరులు

శైలం, శేషశైలం, గరుడాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి -- అనేవి. పేర్లు ఏదైనా - ఒకే పర్వత సముదాయం
ఇది. యుగాభేదాలతో, వ్యక్తుల పేర్లతో, భక్తుల పేర్లతో, ఈ పర్వతశ్రే ణికి ఏడు పేర్లు ఏర్పడ్డాయి. ఇవేకాక
చింతామణి, జ్ఞానాద్రి, ఆనందాద్రి, అంజనాద్రి, నీలాద్రి, వరాహాద్రి, వైకుంఠాద్రి, -- ఇలా
ఎన్నో సార్థకమైన పేర్లున్నాయి. బ్రహ్మాండపురాణం ఈ పర్వతాలకు 20 పేర్లు పేర్కొనింది.

(1) శ్రీశైలం - శ్రీదేవికి నివాసమై -- భక్తులకు సకల సంపదలు ప్రసాదిస్తుంది కనుక.
(2) శేషశైలం - ఆదిశేషుడే పర్వతంగా రూపొందిన పర్వతం.
(3) గరుడాద్రి - వరాహస్వామి ఆజ్ఞపై గరుత్మంతుడు వైకుంఠం నుండి తెచ్చినందున - గరుడాద్రి.
(4) వేంకటాద్రి - వేం = పాపాలను, కటః = దహింప చేసేది. పాప నాశకమైనది.
వేం = అమ్రుతత్వాన్నీ, కటః = ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కనుక - వెంకటాచలం.
(5) నారాయణాద్రి = మునుపు 'నారాయణ' అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి, విష్ణుదేవున్ని ప్రత్యక్షం చేసుకొని, '
ఈ క్షేత్రం తన పేరుతో ప్రసిద్ది పొందాలని అర్థించాడు. స్వామి అనుగ్రహించాడు. -- అందువల్ల నారాయణాద్రి.
సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నివసించి ఉండే స్థానం కనుకనూ నారాయణాద్రి.
(6) వృషభాద్రి - వృషభుడనే శివభక్తుడు శబర వేషంతో ఉన్న శ్రీనివాసునితో యుద్ధం చేసాడు. స్వామి సుధార్శనాయుధంతో అతన్ని సంహరించాడు. మరణిస్తూ అతడు 'ఈ పర్వతం తన పేరుతో ప్రసిద్ధికి రావాలని' కోరాడు కనుక వృషభాద్రి. మరొకటి వృషభుడనే రాక్షసుడు స్వామివారితో యుద్దంచేసి, చక్రాయుధంతో హతుడై మరణిస్తూ 'ఈ పర్వతం తన పేరుతో ఉందా' లని కోరాడు. కనుక వృషభాద్రి.
(7) వృషాద్రి - వృష మంటే ధర్మం. ధర్మ దేవత తన అభివృద్ధికై ఈ పర్వతం పై తపస్సు చేసినందున -- వృషాద్రి.

సుప్రభాతంలో "శ్రీశేషశైల ..... తవ సుప్రభాతం" శ్లోకం ఈ సప్తగిరులను ప్రస్తుతించింది.
20 నామాలను స్మరించే శ్లోకాలు -- బ్రహ్మాండ పురాణం - శ్రీ వెంకటేశ్వర మాహాత్మ్యం - 1 అధ్యాయం 21 నుంచి 23 శ్లోకాలు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

కలియుగ వైకుంఠం
తిరుపతి అందాలు
గోవిందునిలీలలు!
కపిల తీర్ధాలు
సర్వపాప హరణాలు!
అలిపిరి ప్రభలు
భక్తికి వెలుగులు!
కాలినడకన భక్తులు
శ్రీ వేంకటేషుకై మొక్కులు!
శంఖ చక్రాలు
విశ్వానికి రక్షాకవచాలు!
మోకాళ్ళ పర్వతం మెట్లు
భక్తుల బంగారు భవిష్యత్ కు సోపానాలు!
తిరుమల గిరులు
కలియుగ సిరులు!
వైకుంఠ ప్రవేశద్వారాలు
మోక్షానికి ముఖద్వారాలు !
కన్నులారా గాంచితి నా వేంకటేశ్వరుని నిజదర్శనం
ఎన్నో జన్మజన్మల చేసుకున్న పుణ్యఫలం!!!

తిరుమలలో వెలిసిన ప్రాచీన తీర్థాలు

మన భారతదేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే... మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని తిరుమల ప్రాంతంలో ఎన్నీ తీర్థస్థానాలు కొలువై వున్నాయి. ఈ తీర్థస్థానాలు మనహిందూ దేవతలకు సంబంధించిన కొన్ని పురాణగాధలను రూపుదిద్దుకుని వున్నాయి.

1. పాండవ తీర్థం : పాండవులు, కౌరవుల మధ్య జరిగిన ఘోరమైన కురుక్షేత్ర సంగ్రామం తరువాత... పాండవులు తాము చేసిన బ్రహ్మహత్య పాపాలను పోగొట్టుకోవడానికి అభిషేక స్నానాలను ఆచరించారు. అనంతరం ఆ క్షేత్రపాలకునిని పూజించి, శ్రీనివాసునుని దర్శించుకున్నారు. ఆనాడు పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్లే దీనికి పాండవతీర్థం అనే పేరు వచ్చింది. ఈ తీర్థం తిరుమల దేవాలయానికి ఉత్తరదిశలో వుంది.

2. సనకనందన తీర్థం : పూర్వం సకననందనాదులు సిద్ధిప్రాప్తి కోసం ఈ ప్రాంతంలో ఘోరమైన తపస్సును ఆచరించారు. దాంతో వారిపేరు మీదుగా ఇక్కడ తీర్థస్థలం వెలిసింది. ఇందులో మార్గశిక శుక్లపక్ష ద్వాదశినాడు స్నానం చేస్తే సిద్ధి పొందుతారని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తూ వుంటారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో వుంటుంది.

3. కుమారధార తీర్థము : ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంటుంది. మాఘపౌర్ణమినాడు ఇందులో స్నానమాచరిస్తే సంతానం ప్రాప్తితోపాటు... సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది.

4. తుంబుర తీర్థం : ఈ తీర్థం ఆలయానికి ఆరుమైళ్ల దూరంలో వుంది. పూర్వం ఇందులోనే తుంబురు నాదమహర్షి ఘోరమైన తపమును ఆచరించారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతోపాటు గతంలో చేసిన సకలపాపాలన్నీ దూరమవుతాయి.

5. నాగతీర్థం : శ్రీహరి దేవాలయం నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఈ తీర్థం కనువిందు చేస్తుంది. పెళ్ళికాని కన్యలు ఇందులో భక్తిశ్రద్ధలతో స్నానాలు చేస్తే.. సకల సద్గుణాలు కలిగిన ఉత్తమ భర్తను పొందుతారు.

6. చక్రతీర్థం : భారతయుద్ధం ముగిసిన అనంతరం శ్రీహరి చక్రం మహాపాతకాలకు గురికావడం వల్ల... ఆయన తన సుదర్శన చక్రాన్ని ఈ తీర్థంలో స్నానం చేయించారు. అటువంటి పుణ్యతీర్థంలో ఎవరైనా స్నానం చేస్తే.. వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు పూర్తిగా తొలిగిపోయి... పుణ్యపవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థం వుంటుంది.

7. జాబాలి తీర్థం : పూర్వం జాబాలి అనే మహర్షి ఈ తీర్థంలో ఘోరమైన తపస్సు చేసి తరించారు. ఈ తీర్థంలో స్నానం చేస్తే భూతప్రేత పిశాచాలు తొలగిపోవడంతోపాటు మనోవాంఛ కూడా సిద్ధిస్తుంది. ఇక్కడే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా వుంది. హథీరాంజీ మఠాధిపతుల అధీనంలో వున్న ఈ ఆలయానికి... వారు నిత్యం స్వామివారికి నైవేద్య ఆరాధనలు ఇస్తారు.

8. బాలతీర్థము : ఈ తీర్థంలో స్నానం చేస్తే వృద్ధులు సైతం బాలురు శక్తిని పొందుతారని విశ్వాసం. అయితే ఇది సృష్టికి అవరోధం కావడంతో జలం కూడా కనిపించకుండా శిలలో మూసివేయబడింది. నాగతీర్థం నుంచి రెండువందల గజాల దూరంలోనే ఈ తీర్థం వుంటుంది.

9. వైకుంఠ తీర్థం : కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో వున్న ఈ తీర్థంలో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. పురజనులు అప్పుడప్పుడు ఇక్కడ వైకుంఠసమారాధన చేస్తూ వుంటారు.

10. శేష తీర్థం : శ్రీహరి దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో వున్న ఈ తీర్థానికి చేరుకోవడం చాలా కష్టం. పర్వతాలను ఎక్కుకుంటూ.. దారిలో వున్న చిన్నచిన్న ప్రవాహాలను చాలా జాగ్రత్తగా దాటాలి. ఈ ప్రవాహాలు కూడా పాచి పట్టి వుంటాయి. ఈ తీర్థంలో ఆదిశేషుడు శిలారూపంలో వుంటాడు. అలాగే కొన్ని ప్రత్యేకమైన నాగపాములు కూడా ఇక్కడ నిత్యం తిరుగుతూనే వుంటాయి. ఈ తీర్థంలో ఒక్కసారి స్నానం చేస్తే వారికి మరోజన్మ వుండదు.
11. సీతమ్మ తీర్థం : పూర్వం సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరిగివున్న కొంత భాగం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఒక బిలం కూడా వుంది. అయితే అందులో వున్న జలం బయటకు కనిపించదు. ఒక పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి ఆ బిలంలో తోడితే.. నీరు ప్రవహిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు భక్తితో ఈ తీర్థంలో స్నానం ఆచరిస్తే ముక్తిని పొందుతారు.

12. యుద్ధగళ తీర్థం : ఈ తీర్థం గురించి రామాయణంలో కూడా వర్ణించబడి వుంది. పూర్వం రాముడు, రావణునిని సంహరించిన తరువాత తాను చేసిన బ్రహ్మహత్య మహాపాతకాన్ని నిర్మూలించుకోవడం కోసం ఇందులో స్నానం చేశాడు.

13. విరజానది : శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహ పాదాల కింద భాగంలో ఈ నది ప్రవహిస్తుంటుంది. ఇది ఒక చిన్న బావిలా కనిపిస్తుంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు వుంటుంది. ఈ తీర్థాన్ని తలపై వేసుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.

14. పద్మసరోవరము : పద్మావతి మందిరం దగ్గరున్న ఈ సరోవరం.. తిరుపతి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఇందులో వున్న జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది. ఈ పద్మసరోవరంలో స్నానం చేసినవారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకండా... భూతప్రేతపిశాచాలు కూడా వదిలిపోతాయి.
కేవలం ఇవి మాత్రమే కాదు... కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఎన్నో ముఖ్యతీర్థాలు తిరుమలలో కొలువై వున్నాయి.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దీనివెనుక ఉన్న వృత్తాంతం ఏమిటో మీకు తెలుసా అయితే ఈ కథనం చదవండి. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యుల వారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు.
ఈ పనిలో అనంతాళ్వార్ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె.. తవ్విన మట్టిని గంపలోతీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ కొడతాడు.

గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమై పోతాడు. తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు. గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు.

సూర్యభగవానుడి దివ్య క్షేత్రం కోణార్క్ దేవాలయం

తన కిరణాలతో జగత్తును కాంతిమయం చేసే సూర్యభగవానుడిని పూజించనివారు ఉండరు. కేవలం హిందూమతం ఆచరణలో ఉన్న ప్రాంతాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సూర్యుని దైవరూపంగా భావించి పూజించేవారున్నారు. అలాంటి సూర్యభగవానుడికోసం నిర్మించబడిన దేవాలయాల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని పేర్కొనవచ్చు.

ఒరిస్సాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయం నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఈ కోణార్క్ ఆలయం నిర్మించబడి ఉంది. సూర్యుని రథాన్ని పోలిన ఆకారంలో ఈ ఆలయం నిర్మించబడి ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తించి యునిసెఫ్ రక్షిస్తోంది.

కోణార్క్ స్థల పురాణం
పురాణ కాలంలో శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డ శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కోణార్క్ దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆసమయంలో చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాన్ని సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించాడు.
అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం కన్పించదు. ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే. ప్రస్తుతం కోణార్క్‌లో ఉన్న ఆలయాన్ని గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్ల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు.

కోణార్క్ ఆలయ విశేషాలు
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికి ఇరువైపులా పన్నెండు జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలు చెక్కబడి ఉంటాయి. ఈ చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు.

సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం. అలాగే ఈ దేవాలయంపై అనేక శృంగారభరిత శిల్పాలు సైతం చెక్కబడి ఉన్నాయి. కోణార్క్ ఆలయంలో మూల విరాట్టు లేకపోవడం కూడా ఓ చెప్పుకోదగ్గ విషయమే. అయితే ప్రతి ఏడాది ఇక్కడ రధసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు.

కోణార్క్‌లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ సమయంలో భక్తులు దేవాలయానికి దగ్గర్లో ఉన్న చంద్రభాగ తీర్థంలో స్నానం చేసి దేవాలయంలో ఉన్న నవగ్రహాలను పూజిస్తారు. అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు


సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి.

అరుణాచలం

మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని ‘‘అన్నామలై’’ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ.. మొత్తంగా ఎర్రని కొండ అని అర్థం. దైవశాస్త్రాల ప్రకారం అ-రుణ అంటే పాపాలను సంహరించేది అని అర్థం. తమిళంలో దీనిని ‘‘తిరుణ్ణాములై’’ అని పిలుస్తారు.

పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో పుణ్య, గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని, శివుడిని భక్తితో స్మరిస్తే.. చేసిన పాపాలన్నీ తొలగిపోయి, విముక్తి లభిస్తుందని వేదపండితులు కూడా నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ, చిదంబరం, తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి, దేవాలయానికి సంబంధించి పురాణాలలో విశిష్టమైన కథలు కూడా తెలుపబడివున్నాయి.

పురాణాల ప్రకారం... పూర్వం శివుడు భూమిపై జరుగుతున్న పాపాలను, దుష్టకార్యాలను, అన్యాయాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు. దాంతో ఆయన విశ్వకర్మను ఈ అరుణాచలం ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుని ఆజ్ఞను శిరసావహించి విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఆ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. స్కాందపురాణంలో అంతర్గతమైన అరుణాలమహాత్యం ప్రకారం.. ఈ ఆలయంలో పూజావిధానం శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని విశదీకరించబడింది.

పురాణాలలో వున్న కథనాల ప్రకారం.. ఈ అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని పేర్కోవడం ద్వారా.. ఈ కొండకు తూర్పు భాగంలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కొండకు అరుణాచలేశ్వరాలయం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా! ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని అగ్ని క్షేత్రమంటారు.
సాక్షాత్తూ పరమశివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ అరుణాచలం చుట్టూ శివునిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణం చేయడం వల్ల.. శివుని అనుగ్రహం లభిస్తుందని, ఏకంగా శివునికే ప్రదక్షిణలు చేసేంత ప్రభావం లభిస్తుందని, పూర్వం మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి, కర్మల నుంచి విముక్తి పొందుతామని అప్పటి మహాత్ములు పేర్కొన్నారు. దీని ప్రాముఖ్యతను నలువైపులా విస్తరించడానికి శ్రీరమణులు కూడా పదేపదే ఉద్ఘోషించారు కూడా! అందువల్ల ఈ ప్రదేశంలో వేలాదిమంది భక్తులు నిత్యం గిరిప్రదక్షిణం చేస్తూ వుంటారు.

రమణాశ్రమం :
అరుణాచలేశ్వర ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే రమణాశ్రమం వుంటుంది. ఈ ఆశ్రమంలో శ్రీరమణుల సమాధులు వున్నాయి. ఇందులో ఇంకా ఆవు, కాకి, శునకం వంటి మొదలైన జంతువుల సమాధులు కూడా చూడవచ్చు. ఈ ఆశ్రమంలో రమణులకు సంబంధించిన పురాణ కథల పుస్తకాలు అందుబాటులో వుంటాయి. ఈ ఆశ్రమంలో ప్రార్థన చేసుకోవడానికి వీలుగా వసతులు, సదుపాయాలు, వాతావరణం అనుకూలంగా వుంటాయి.

శేషాద్రి స్వామి ఆశ్రమం :
ఈ ఆశ్రమం కూడా అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే వుంటుంది. రమణాశ్రమానికి వెళ్లే దారిలోనే శేషాద్రి స్వామివారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇందులో శేషాద్రి స్వామివారి సమాధి వుంటుంది. ఇక్కడ కూడా శివుడిని భక్తితో ప్రార్థించుకోవడానికి వీలుగా వాతావరణం అనుకూలంగా వుంటుంది.


ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం.
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం భక్తీ ప్రదానాయ కృపావతీర్థం టం సోమనాథం శరణం ప్రపద్యే శ్రీశైల శృంగే విబూధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం త మర్దునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో: పరిరక్షణానార్థం వందే మహాకాల మహాసురేశం కావెరికా నర్మదాయో: పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపరే వసంతమోంకార మీశం శివమేకమీడే పూర్వోత్తరే ప్రజ్ఞ్వలైకా నిదానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం టం మహం నమామి యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగై: సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై: సురాసురైర్యక్ష మహోరగాద్వై: కేదారమీశం శివమేకమీడే సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే యద్దర్శనా త్పాటకమశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే సుతాష్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విషఖై రాసంఖ్యై: శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ సదైవ భీమాది పడ ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి పానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే జ్యోతిర్మయ ద్వాదశాలింగకానం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భాజేచ్ఛ జ్యోతిస్వరూపుడైన మహేశుడు
ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి .సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాత తీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్రయంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు), ఇలా మొత్తం పెన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలుపరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుటే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1 బ్రహ్మ, 2 మాయ, 3 జీవుడు, 4 మనస్సు, 5 బుద్ధి, 6 చిత్తము, 7 అహంకారము, 8 పృథ్వి, 9 జలము, 10 తేజస్సు, 11 వాయువు, 12 ఆకాశం ... ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథ లింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలో ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ వుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలో ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.
ద్వాదశ జోతిర్లింగాలు ఎవరిపేర్లపై ఏర్పడ్డాయి ?
శ్రీ సోమనాధేశ్వర జ్యోతిర్లింగం….
లభ్యమైన ఆధారాలను బట్టి ఈ జ్యోతిర్లింగాలయం క్రీపూ. 200 సం.రాల నాటిది. 20వ శాతాబ్దం వరకు ఎన్నో యుద్ధబీభత్సాలకు గురైనా 1957లో పున:ప్రాణ ప్రతిష్ఠను పొందింది.

శ్రీశైలమల్లిఖార్జున జ్యోతిర్లింగం ….
ఏ శిఖర రూపంలో పర్వతుడు అవతరించాడో ఆ శిఖరం మీదే తపస్సు చేస్తున ఒకానొక భక్తురాలుకు శివసాక్షాత్కరం కలిగిన ఆచోటు తన పేరుతో నిలవాలని కోరడం వల్లన ఆ శిఖరం శ్రీశైలంగా పేరొందింది. మూడో శతాబ్దం నుండి ఈ క్షేత్రం ఉనికి కనిపిస్తుంది.

శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ….
ఉజ్జయినిలో ఈ లింగంవుంది. చైనా యాత్రికుడయిన హ్యుయాన్‌ త్సాంగ్‌ తన పర్యటన గ్రంధంలో ఈ క్షేత్రం గూర్చి చక్కగా వర్ణించారు.

శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం …..
చారిత్రక ఆధారమంటూ ఈక్షేత్రం గూర్చి ఏమీ లేదు. ‘మాంధాత’ చేసిన తపస్సు ఫలి తంగా ఓంకారేశ్వడు అవిర్భవించాడు.

శ్రీ వైద్యనాథేశ్వరలింగం ….
మహా బలేశ్వరలింగమే వైద్యనాధేశ్వర లింగంగా ప్రసిద్ది చెందింది లంకేశ్వరుడైన రావణునికోరిక మేరకు సాంబ శివుడు ఈ ఆత్మలింగంను ప్రసాదించాడు.

శ్రీ భీమ శంకర జ్యోతిర్లింగం ….
భీముడు వల్ల వివత్తును తొలిగించి నందువల్ల ఆ జ్యోతిర్లింగం ప్రసిద్ధిచెందింది. దీనికి ఉపలింగం భీమేశ్వరలింగం.

శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం ….
తనని ఆరాధించిన వారికి సర్వ కష్టాలను నివారించి ప్రతిజ్ఞా పూర్వకంగా చెప్పి శివుడు జ్యోతిర్లింగంలోకి నాగేశ్వరుడుగా కలిసి పోతాడు. ఆ జ్యోతిర్లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగము.

శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం ….
వైశ్రమణుని ఘోర తపస్సు వల్ల శివుడు లింగరూపంలో వెలసి ముక్తిని ప్రసాదిస్తాడు. ఆలింగమే విశ్వేశ్వర లింగం.

శ్రీ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం ….
శివుడు మూర్తిమంతమై విష్ణువు, బ్రహ్మలకు జ్ఞాన బోధచేయగా త్రిమూర్తులు ఏకమైన లింగంగా శ్రీత్రియంబకేశ్వర జ్యోతిర్లింగం వెలసింది.

శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం …
ధర్ముడనే మునికి నరనారాయణలనే పేరిట విష్ణూవు ఇద్దరు పుత్రులుగా జన్మిస్తాడు. ఆ ఇద్దరి కోరిక మేరకు శివుడు బదరీ వనంలో ఈ లింగరూపంలో వెలిసాడు.

శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం ….
శ్రీరామాధిత దైవతలింగం గనుక ఆ జ్యోతిర్లింగమే శ్రీరామేశ్వర లింగంగా పేరు పొందింది.

శ్రీ ఘృశ్నేశ్వర జ్యోతిర్లింగం …
ఘ్నశ్నే అనే భక్తురాలు కోరిక మేరకు శివుడు ఈ జ్యోతిర్లింగంగా వెలిసాడు. సంతాన నష్టం, అకాల మరణం నుండి ఈ లింగం తప్పిస్తుందని చెపుతారు.

శివ పార్వతుల నివాసం - మానస సరోవరం
సాక్షాత్తు పరమశివుని నివాసం కైలాసం. బ్రహ్మదేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు మానససరోవరం. భూమండలానికి నాభిస్థానంలో ఉన్నట్లు భావించే కైలాసపర్వతం హిందువులకే కాక, బౌద్ధులకు, జైనులకు, టిబెట్ లో ప్రాచీనమైన 'బొంపో' మతానుయాయులకు కూడా ఇది అతిపవిత్రం, ఆరాధ్యం. మామూలు కళ్ళకు ఇది మట్టిగా కనిపిస్తుంది. కానీ యోగదృష్టితో చూసినవారికి దివ్యశక్తే ఇక్కడ పృథివీ రూపం ధరించిందని తెలుస్తుంది. పరమశివుడు పురుషుడు, పరమేశ్వరి ప్రకృతి అతడు శివుడు, ఆమె శక్తి. ఆ శివశక్తుల భవ్యలీలాక్షేత్రం కైలాసమానససరోవరం. రజకాంతులతో వెలిగిపోయే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు. లలితాదేవి కాలి అందెల రవళులలో ఓంకారం, నటరాజు తాండవంలో ఆత్మసారం ధ్వనిస్తుంది.

కల్పవృక్షం ఇక్కడే ఉంటుందని కుబేరుడి నివాసం కూడా ఇక్కడే అని విష్ణుపాదోద్భవ గంగ కైలాసశిఖిరికి చేరి దానిని ప్రదక్షించి అక్కడి నుంచి నాలుగు నదులుగా మారి ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, కర్మలి నదుల పుట్టుక ఇక్కడే. మానససరోవరంలో మునిగి కైలాసపరిక్రమ చేసినవారికి జన్మరాహిత్యమే అంటారు. శివునిలో లీనమై తామే శివస్వరూపులైపోతారని చెబుతారు. కల్పవృక్షం ఇక్కడే, గంగ భూమిని చేరింది ఇక్కడే ఇటువంటి కైలాస మానస సరోవరం దర్శనం అనేక జన్మల పుణ్యం

భక్త మార్కండేయుడు

మహా శివుడు మంచు పర్వతం వంటి వాడు ... ఆపదలో వున్న తన భక్తులను ప్రవాహమై చేరుకొని ఆదుకుంటాడు. ఈ విషయంలో అయన విధిని సైతం ఎదిరిస్తాడు ... తన భక్తులకు అండగా నిలిచి అనుగ్రహిస్తాడు. మార్కండేయుడి వృత్తాంతమే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పూర్వం మృకండ మహర్షి - మరుద్వతి దంపతులు సంతానం కోసం శివుడి గురించి తపస్సు చేయగా, కైలాసనాథుడు ప్రత్యక్ష మయ్యాడు.

విధవరాలుగా వుండే కూతురు కావాలో ... 16 సంవత్సరాలు మాత్రమే జీవించి వుండే కుమారుడు కావాలో కోరుకోమని అడిగాడు శివుడు. దాంతో తమకి కుమారుడే కావాలని వారు కోరుకున్నారు. ఫలితంగా మరుద్వతికి ఓ మగబిడ్డ జన్మించగా 'మార్కండేయుడు' అని నామకరణం చేసి పెంచి పెద్ద చేశారు. మార్కండేయుడికి 16 వ సంవత్సరం వస్తుండగా, శివుడి మాటలను ఆ దంపతులకు గుర్తుచేశాడు నారద మహర్షి. కాశీ క్షేత్రానికి చేరుకొని శివుడిని ఆరాధించడం వలన ప్రయోజనం ఉండవచ్చని చెప్పాడు.

దాంతో మార్కండేయుడిని వెంటబెట్టుకుని అతని తల్లిదండ్రులు కాశీ చేరుకున్నారు. అక్కడి గంగాతీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని శివయ్యని పూజించసాగారు. మార్కండేయుడి ఆయువు తీరడంతో అతని ప్రాణాలు తీసుకు వెళ్లడానికి యమకింకరులు వచ్చారు. అయితే శివుడి ధ్యానంలో వున్న అతణ్ణి వాళ్లు సమీపించలేకపోయారు. విషయం తెలుసుకుని యమధర్మరాజు రంగంలోకి దిగాడు.

మార్కండేయుడి పైకి యమపాశాన్ని ప్రయోగించాడు. దాంతో మార్కండేయుడు తనని కాపాడమంటూ శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. యమపాశం మార్కండేయుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది. అయినా లెక్క చేయక యమధర్మరాజు యమపాశాన్ని లాగాడు. శివలింగం కదులుతుండగా అందులోనుంచి వచ్చిన శివుడు యమధర్మరాజుని కాలుతో తన్నాడు. ఆవేశంతో అతని పైకి శూలాన్ని ప్రయోగించబోతుండగా దేవతలు అడ్డుకున్నారు.

మార్కండేయుడి తల్లిదండ్రులకి శివుడు ఇచ్చిన వరం గురించి దేవతలు గుర్తుచేశారు. ఏదేవైనా తన భక్తుల విషయంలో కాస్త సహనం పాటించాలని యముడితో చెప్పి శివుడు శాంతం వహించాడు. ముక్కుపచ్చలారని మార్కండేయుడి భక్తి ప్రపత్తులు తన మనసు దోచుకున్నాయంటూ, చిరంజీవిగా వుండమంటూ అతణ్ణి అనుగ్రహించాడు. అలా మార్కండేయుడు ఈ లోకంలోనూ ... చరిత్రలోను చిరంజీవిగా నిలిచిపోయాడు.

మహా మృత్యుంజయ మంత్రం:
"""""""""""""""""""""""""""""""
త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.
ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.
ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.
ఉర్వారుకం – ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,
రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.
మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం

దక్షిణాకాశి ధర్మపురి క్షేత్రం

కరీంనగర్‌ జిల్లాలోని ధర్మపురి క్షేత్రాన్ని దర్శించిన వారికి యమపురి ఉండదు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలోని దక్షిణవాహిగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో మూడు సార్లు మునిగి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటే గత మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి నిత్యం వేలాది మందిభక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, మేధావులు స్వామివారిని తరచూ దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం వార్షిక పండుగ ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ధర్మపురి క్షేత్రానికి తరలివచ్చారు. అశేష భర్త జనావళితో క్షేత్రం కిటకిటలాడుతోంది.

ధర్మపురి క్షేత్రంలో బ్రహ్మ విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైనందున త్రిమూర్తి క్షేత్రంగా, శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణుస్వ రూపుడైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నందున నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నరసింహ క్షేత్రం ప్రాచీన పుణ్యక్షేత్రంగా, చారిత్రాత్మకంగా ప్రసిద్ధి గాంచింది. క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాంగ ణంలో ప్రధాన దేవాలయంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఉగ్ర నరసింహ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేణుగో పాల స్వామి, యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ వినాయక స్వామిల ఆలయాలు ఉన్నాయి. విశాలమైన బ్రహ్మ పుష్కరిణితో పాటు సత్యవతి ఆలయానికి ఇసుక స్తంభం ప్రాశ స్త్యము. క్షేత్రం గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, యమ గుండం, పాల గుండం, చక్ర గుండములు కలవు.

క్షేత్ర మహాత్యం : రాష్ట్రంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లోని నవనారసింహా క్షేత్రాల్లో ధర్మపురి శ్రీ యోగానంద లక్ష్మీనృసిం హాస్వామి వారి క్షేత్రం ఒకటిగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రమును పూర్వం ‘ధర్మవర్మ’ అనే మహారాజు పరిపాలించడం వల్ల ఈ క్షేత్రానికి ధర్మపురి అనే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రం క్రీ.శ 850- 928 సంవత్సరం కంటే పూర్వం అయినప్పటికీ క్రీ.శ 1422-1436 కాలంలో బహుమనీ సుల్తానుల దండ యాత్రలో ధ్వంసమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయం పునరుద్ధరింప బడినట్లు క్షేత్ర చరిత్ర తెలుపుతోంది. ఈ క్షేత్రంలో ప్రధాన మూర్తి అయిన శ్రీ యోగా నంద లక్ష్మీనర సింహాస్వామి సాలగ్రామ శిలగా వెలసియున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవిహస్తోంది. అందుకే ఈ క్షేత్రం దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా పిలువబడుతోంది. స్వామివారి ఆలయ ప్రాంగ ణంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మ రాజు ఆలయం ఉంది.

స్వామి వారిని దర్శించుకునే భక్తులు అనంతరం యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది. ధర్మపురి క్షేత్రం ఆలయాలతో పాటు వేదాలకు ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా పాల్గుణ శుద్ధ ఏకాదశి నుంచి 13 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతాయి. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి వారికి నిత్య కళ్యాణంతో పాటు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి 12 సంవత్సరాలకో సారి వచ్చే గోదావ రి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి.

క్షేత్రంలో ఏడాది పొడుగునా ఉత్సవాలు:
చైత్ర మాసం ః- ఉగాది, శ్రీరామనవమి, చిన్న హన్మాన్‌ జయంతి.
వైశాఖ మాసంః- నరసింహ నవరాత్రోత్సవాలు, పెద్ద హన్మాన్‌ జయంతి ఉత్సవం
జ్యేష్ట మాసంః- పౌర్ణమి – వటసావిత్రి పౌర్ణమి.
ఆషాఢ మాసంః- శుద్ధ ఏకాదశి, గురు పౌర్ణమి ఉత్సవాలు,
శ్రావణమాసంః- శ్రీ కృష్ణాష్ఠమి, మరుసటి రోజున ఉట్ల పండుగ, శుద్ద పౌర్ణమిన శ్రావణ జంధ్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి, శుద్ధ పంచమిన నాగుల చవితి, రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, పొలాల అమావాస్య ఉత్సవాలు,

భాద్రపదం మాసం ః- శుద్ధ చవితిన వినాయకచవితి, శుద్ధ పంచమిన ఋషి పంచమి ఉత్సవాలు.

ఆశ్వీయుజం మాసం ః- దసరా నవ రాత్రోత్సవాలు, దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశిమి, కోజగిరి పౌర్ణమి, పాలలో చంద్ర వీక్షణ, బహుళ త్రయోదశిన ధన త్రయోదశి, చతుర్దశిన నరక చతుర్దశి, అమవాస్య రోజున దీపావళి, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిన పంచసహస్ర దీపాలంకరణ.
మార్గశిర మాసంః- మార్గశిర శుద్ధ పౌర్ణమిన దత్తాత్రేయ జయంతి, పుష్యమాసంః- ఆదివారాలు- పర్వదినాలు.

మాఘమాసంః- శుద్ధపంచమిన వసంత పంచమి, శుద్ధ సప్తమిన రథసప్తమి.
ఫాల్గుణ మాసంః- శుద్ధ ఏకాదశి నుండి 13 రోజుల పాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఏకాదశిన అంకురార్పణ, ద్వాదశిన కల్యాణం, పౌర్ణమిన తెప్పోత్సవము, డోలోత్సవము, బహుళ పంచమిన రథోత్సవము కార్యక్రమా లు నిర్వహిస్తారు.

రవాణా సౌకర్యాలు : ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఈ క్షేత్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మంచిర్యాల రైల్వే స్టేషన్‌, 130 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఉంది. ఆయా స్టేషన్‌లకు రైళ్ల ద్వారా చేరుకుని అక్కడి నుంచి బస్సు సౌకర్యం ద్వారా ధర్మపురికి చేరుకోవచ్చు.

రోజు ఇంట్లో దీపం పెట్టెటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి?

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు.

అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తిన్నేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది.

ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచనట్టు అవుతుంది. క్రింద ఒక చిన్న ఇత్తడి లేక మట్టీ ప్లేట్ లాంటిది పెట్టి, దానిపై ప్రమిద ఉంచాలి. అలాగే దీపారాధన చేసే ముందు రెండు పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట, నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి (చిన్నదైనా సరే), కొద్దిగా పసుపుకుంకుమా చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి, దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి, వేరే చిన్నవత్తిని కానీ, హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో, ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. (ఇవన్నీ రోజు చేయడం కష్టంగా భావిస్తే, రోజు మాములుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి.)

దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చేయకూడదు. అది అశుభసూచకం. కనీసం రెండు వత్తులైనా వేయాలి. రెండు జ్యోతులు వెలిగించాలని చెప్తారు.దీపారాధానకు ఆవునెయి ఉత్తమం, తరువాత నువ్వులనూనె. దీపం వెలిగించాక, ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి, పూలు సమర్పించాలి. సర్వదేవతస్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి.

ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన ఆ ఇంట లక్ష్మీ ఎప్పటికి నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపారస్థలంలో దీపారాధాన చేయడం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో, వారికి ఉన్న గ్రహదోషాలు, పీడలు చాలావరకు దీపారాధన మహిమవల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
తమసోమా జ్యోతిర్గమయా - ఓ పరమాత్మ! మేము తమస్సు (చీకటి) నుంచి వెలుగులోకి వెళ్ళెదము గాకా.

వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి?
ఎలా చేయాలి?

ప్రశాంతతనిచ్చే పూజ గది
ప్రతి కుటుంబానికీ మూల దైవం ఒకరు ఉం టారు. వారికి సంబంధించిన విగ్రహాలను, ఫోటోలను పెట్టి ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలో ఉండటానికే చోటు కరువైన స్థితిలో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదినే కేటాయించడం అన్నది సమస్యగా మారుతున్నది. అయినా దైవభక్తిఅధికంగా ఉన్నవారు దేవుడికి ఒక గదిని ప్రత్యేకంగా కేటాయించాలనే అనుకుంటారు. అటువంటి వారు.. వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? ఎందుకు అన్నది చూద్దాం...

పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశా న్య లేదా తూర్పు లేదా ఉత్తర దిక్కున ఏర్పాటు చేయాలి. దీనికి కారణం తెల్లవారు జామునే సూర్యుడు ఇంటికి ఈశాన్య దిక్కున ఉంటాడు. ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. అంతేకాదు, సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది. పెద్ద స్థలం ఉన్నవారైతే ఇంటి మధ్యలో పూజ గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి మధ్య భాగాన్ని గాలి, వెలుతురు సవ్యంగా పారేందుకు ఖాళీగా ఉంచాలి. ఆ మధ్య ప్రదేశంలో పూజ గది ఏర్పాటు చేసుకోవచ్చు.

పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. సూర్యుడి తొలి కిరణాల వల్ల లబ్ది పొందలేరు. అలాగే పూజ గదిని పై అంతస్థులలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్ద వారు, కదలలేని వారు ఉంటే ఇది సమస్య అవుతుంది.

ఒకవేళ పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి. అయితే పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. దీనికి కారణం దేవుడి వైపు కాళ్ళు పెట్టి పడుకోవడానికో లేక దేవుడు ఉన్నాడనే భావనతోనో నిద్రించలేరు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లేకుండా చూసుకోవాలి. అక్కడి నుంచి వచ్చే శబ్దాలు, వాసనలు వ్యక్తులను డిస్టర్బ్‌ చేస్తాయి.

ఒకవేళ ప్రత్యేకంగా పూజగదినే ఏర్పాటు చేసుకుంటే విగ్రహాలను ఎటు పెట్టుకోవాలన్నది చాలా మంది సందేహం. ఈ విగ్రహాలను ఈశా న్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. దీనికి కారణం ఉదయం సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిక్కు నుంచి ప్రసరిస్తాయి, సాయం వేళల్లో పడమర నుంచి ప్రసరిస్తాయి. కనుక ఇవి విగ్రహాల మీద పడి మరింత భక్తి భావనను కలిగిస్తాయి. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించే వారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూ చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కున, తల ఉత్తరం దిక్కున ఉంటాయి.

దీని వల్ల శరీరoలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే ఐస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి.అలాగే దేవుడి గదిలో విరిగిన విగ్రహాలు లేదా చిరిగిపోయిన బొమ్మలను పెట్టుకోకూడ దు. ఇందుకు కారణం దానిని చూస్తూ దేవుడి మీద మనసును లగ్నం చేయలేం. అలాగే వి గ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే మనం విగ్రహాలను చూసి పూజించాలి తప్ప అవి ఒకదానిని ఒకటి చూసుకోరాదు.

గోడకు ఒక అంగుళం దూరంలో విగ్రహాలు పెట్టాలి. దీని వెనుక ఉన్న కారణం గాలి, అగరొత్తుల పొగ వంటివన్నీ చుట్టుకోకుండా సులభంగా పారడానికే. దేవుడి ముందు దీపా లు వెలిగించేటప్పుడు దానిని విగ్రహం ముం దే పెట్టాలి. అసలు దీపం పెట్టడమే వెలుగు కోసం కనుక విగ్రహం ముందు పెడితే అవి మరింత మెరుగ్గా కనుపిస్తాయి. పూజ సామాన్లను గదిలో ఆగ్నేయ దిక్కున భద్రపరచాలి. దీని వెనుక ఉన్న శాస్ర్తీయ కారణం అవి విగ్రహాలకు, మనం కూచోవడానికి అడ్డం లేకుండా ఉంటాయి. అంతే కాదు, సూర్య కిరణాలు సవ్యంగా ప్రసరించకుండా అడ్డం ఉండవు.

పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగతధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉంటుంది. పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలు పెట్టడం సరికాదు. చాలా మంది పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామనుకుంటారు కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాదు బాధాకరమైన జ్ఞాపకాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నైవేద్యం పెట్టేటప్పుడు దానిని విగ్రహం ఎదురుగా పెట్టాలి తప్ప మన ఎదురుగా ఉంచుకోకూడదు.

పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు. పూజ గది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. కారణం దాని వల్ల గది మరింత కుదురుగా కనుపిస్తుంది.పూజ గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఆ గదికి ఎప్పుడూ రెండు తలుపులు ఉన్న ద్వారాన్నే ఎంచుకోవాలి. అలాగే పూజ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి. అలాగే పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులవవుతుంది.

గుడికి ఎందుకు వెళ్ళాలి

గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.

మనదేశoలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.

భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.


కాకికి అన్నం ఎందుకు పెట్టడం?

కాకి శనైశ్చరుని వాహనం. మనము భోజనం చేసేముందు అన్నము దేవునికి నివేదనం చేసి కాకికి పెట్టమని మన పెద్దలు శాస్త్రము చెపుతున్నది. కాకి శనైశ్చరుని వాహనము మరియు మన పితరులు కూడా కాక స్వరూపములో మనచుట్టూ తిరుగుతూ వుంటారు. కాకి యమలోక ద్వారమందు వుంటూ యమునికి దూతగా వ్యవహరిస్తూ వుంటుంది.

కాకికి అన్నము పెట్టడం ద్వారా యమలోకంలో ఉండే మన పితరులు ఆశ్వాసము చెంది మనకు అసీర్వాదములు ఇస్తారు. కాకి అపర కార్యాడులందు మరియు శ్రాద్ధ దినమందు అన్నము ముట్టకపోతే మన పితరులకు మనపై ఆగ్రహం లేక కోపం వుందనేది పెద్దల మాట. అందువల్లే కాకి అన్నము ముట్టే వరకు తాపత్రయపడి ముట్టిన తర్వాత భోజనం చేస్తారు.

గయలో మనం పిదాడులను వేసే శిలకు పేరు కాక శిల అని పేరు ఆ శిలపై పిందములు వుంచి మన పితరులను ప్రార్తిస్తే కాకి తానొక్కటే భుజించకుండా కావు కావు మని కేకలు వేసి తన వారినందరినీ చేర్చుకొని అన్నము తింటుంది. అంత గొప్ప వివేకము గల ప్రాణి కాకి. గరుడ పురాణం మరియు తదితర పురాణములు మన పితరులు కాక రూపములో భూలోక సంచారం చేస్తూ మనము సమర్పించే అన్నము తింటూ మనలను ఆశీర్వదిస్తారు..

కాకికి అన్నము పెట్టేదాని వలన కుటుంబమున అన్యోన్యత సఖ్యత కలిగి వుంటారు. శని దేవత వాహనం కాకి అందువల్ల మనకు శని అనుగ్రహం కూడా కలుగును. కాకి ఎవ్వరికీ హాని చేయని ప్రాణి మన చుట్టూ వుండే అశుద్దములను తొలగించటంలో మనకు సహాయ పడుతుంది కాబట్టి కాకికి అన్నం పెట్టడం అనే ఆచారం కూడా మన పెద్దలు ఏర్పాటు చేసివుంటారు.