అద్వైతం అంటే రెండు కానిది, భేదం లేనిది అర్థం. శాంతి, సుఖం, పవిత్రత, ధర్మం, సత్యం, న్యాయం మొదలైన ఏకతా స్వభావములను అద్వైత భావములుగా ఉదహరించవచ్చు. అలాగే ఏకాంతం, ఏకాగ్రత, ఏకోపాసన.. ఈ ఏకతాస్వరూప స్థితిని అద్వైత భావంగా చెప్పవచ్చు. అద్వైత స్థితిని ఆచరించుటకు సూక్ష్మబుద్ధి, దృఢసంకల్పం, నిర్భయం వంటి సద్గుణాలు అవసరం. ఏకతా భావమునకు రెండోది కలిసినపుడు అనగా, శాంతి, అశాంతి, సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు.. మొదలైనవి ద్వైత భావములుగా చెప్పవచ్చు. అశక్తత, అవిద్య, అజ్ఞానం, మాయ మొదలైన అశుభ భావాలు ద్వైత స్థితికి కారణాలు. భారతంలో ఒక సందర్భంలో దుర్యోధనుడు ‘నాకు ధర్మం ఏదో తెలుసు. కానీ, ఆచరించలేను. అధర్మం ఏదో తెలుసు. దాన్ని విడిచిపెట్టలేను. ఏదో అదృశ్యశక్తి నాచే ఇలా చేయిస్తుంది. అదే మాయ’ అని అంటాడు. భగవంతుని శక్తి ముందు మాయ నిలబడలేదు. భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు మనలోని ద్వైత భావాలు.. అద్వైత స్థితికి చేరుకుంటాయి. అద్వైత సిద్ధికి ‘ఈశ్వరీయ జ్ఞానమే’ ఆధారం. కొందరు గుడ్డివాళ్లు ఏనుగును చూడటానికి వెళ్లారు. వారిలో తొండమును తాకినవాడు తాడువలె ఉన్నదని, దంతము పట్టుకున్న వాడు ఇటుకరాయిలా ఉందని, కాలును తాకినవాడు స్తంభంలా ఉందని చెప్పారు. గుడ్డివాళ్లు ఎలాగైతే ఏనుగు సహజరూపాన్ని అనుభవించలేరో.. అల్పజ్ఞులు సైతం పరమాత్ముడిని దర్శించలేరు. అన్ని మతాల బోధనల సారము మానవీయతను మేల్కొల్పుటే. సాటి మనిషిని ప్రేమించమని చెప్పడమే. అన్ని మతాల అభిమతం.. ఆత్మ, పరమాత్మ జ్ఞానం కోసం సత్యాన్వేషణ. ఆది శంకరులు ఉద్బోధిచిన అద్వైతంలో జీవాత్మయే పరమాత్మ. రెండిటికీ భేదం లేదు. సమస్తం బ్రహ్మమే. ఈశ్వరీయ జ్ఞానసాధన ఆచరణ యోగ్యమైందని గ్రహించవచ్చు. విభిన్న ధర్మాలు విభిన్న మార్గాలను సూచించాయి. అయితే ఇందులో ఏది సత్యమో, ఏది ఆచరణయోగ్యమైందో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. మనుషులు స్థాపించిన అన్ని మతములు మిథ్యాజ్ఞాన మాత్రములే. ఈశ్వరీయ జ్ఞానంతోనే సద్గతి కలుగుతుంది. గీతలో చెప్పినట్టు ‘సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః’.. అనగా ‘సర్వదేహ ధర్మాలను పరిత్యజించి నన్ను ఒక్కడినే శరణు వేడుము. నేను సమస్త పాపాల నుంచి విముక్తి చేయగలవాడను’ అని అద్వైతభావార్థాన్ని విశదీకరించారు కృష్ణభగవానుడు. ఇప్పుడు మనందరిది ఒకే అద్వైత భావం. ఒకే మాట, భగవంతుడు ఒక్కడే, విశ్వ పరివారం ఒక్కటే. ఒకే ధర్మం అహింసా పరమో ధర్మః.. ఇదే సదా అద్వైత స్వరూపం. సదాశివుడు ప్రబోధించిన పరమ పవిత్ర భావం.
Tuesday, 12 March 2013
అద్వైతం.. పవిత్ర భావం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment