బ్రహ్మోత్సవం
తిరువీధులు గోవిందనామస్మరణతో మారుమోగుతున్న వేళ...
అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందుచేస్తున్న వేళ...
దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్నవేళ...
భూలోకమంతా పండగవాతావరణాన్ని సంతరించుకున్న వేళ...
జరగనున్న తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే, ప్రతి సేవా వైభవోపేతమే.
తిరుమలేశుడి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల సందడి అంబరాన్ని తాకుతుందంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మదేవుడే భక్తుడిగామారి శ్రీనివాసుడికి మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. సృష్టికారకుడే స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో వీటికి బ్రహ్మోత్సవాలని పేరు. మరో కథనం ప్రకారం - నవబ్రహ్మలు తొమ్మిది రోజుల పాటు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ ఎలాంటి సంబంధంలేదనీ మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారనీ ఇంకొందరి భావన.
ప్రతిరోజూ ప్రత్యేకమే..!
తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ ఉత్సవాలకైనా ప్రారంభించే రోజును తిథివారనక్షత్ర యుక్తంగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా బ్రహ్మోత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన చక్రస్నానానికి ముందుగా ముహూర్తం నిర్ణయించి, దానికి అనుగుణంగా మొదటి ఎనిమిది రోజులూ వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయ ధ్వజస్తంభం మీద గరుడకేతాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణం. ఆరోజు రాత్రి నుంచీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వివిధ రూపాల్లో వివిధ వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతాడు. అయితే కొన్ని వాహనాల్లో స్వామి ఒక్కడే తరలివస్తాడు. మరికొన్నింటిలో దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందుడికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా వాహనసేవలు జరుగుతాయి.
మొదటిరోజు రాత్రి పెదశేషవాహనం;
రెండోరోజు చినశేష, హంసవాహనాలూ;
మూడోరోజు సింహవాహనం, ముత్యాలపందిరీ;
నాలుగోరోజు కల్పవృక్షం, సర్వభూపాలవాహనం;
ఐదోరోజు మోహినీ అవతారం, గరుడవాహనం;
ఆరోరోజు హనుమంత, గజవాహనాలూ;
ఏడోరోజు సూర్య, చంద్రప్రభవాహనాలూ;
8వరోజు రథ, అశ్వవాహనాలమీద స్వామి దర్శనమిస్తాడు.
బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన తొమ్మిదోరోజు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు.
దీంతో ఈ ఉత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తమవుతాయి.
అశేష జనవాహిని మధ్య శ్రీనివాసుడు ఊరేగుతూ కనువిందుచేస్తున్న వేళ...
దేవతలే వాహనాలుగా మారి వైకుంఠనాథుడికి బ్రహ్మరథం పడుతున్నవేళ...
భూలోకమంతా పండగవాతావరణాన్ని సంతరించుకున్న వేళ...
జరగనున్న తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో ప్రతి అడుగూ ప్రత్యేకమే, ప్రతి సేవా వైభవోపేతమే.
తిరుమలేశుడి సన్నిధిలో జరిగే బ్రహ్మోత్సవాల సందడి అంబరాన్ని తాకుతుందంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మదేవుడే భక్తుడిగామారి శ్రీనివాసుడికి మొట్టమొదటిసారిగా బ్రహ్మోత్సవాలను నిర్వహించాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. సృష్టికారకుడే స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావడంతో వీటికి బ్రహ్మోత్సవాలని పేరు. మరో కథనం ప్రకారం - నవబ్రహ్మలు తొమ్మిది రోజుల పాటు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ ఎలాంటి సంబంధంలేదనీ మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే ఇవి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అంటారనీ ఇంకొందరి భావన.
ప్రతిరోజూ ప్రత్యేకమే..!
తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఏ ఉత్సవాలకైనా ప్రారంభించే రోజును తిథివారనక్షత్ర యుక్తంగా నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా బ్రహ్మోత్సవాల్లో చిట్టచివరి ఘట్టమైన చక్రస్నానానికి ముందుగా ముహూర్తం నిర్ణయించి, దానికి అనుగుణంగా మొదటి ఎనిమిది రోజులూ వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. సాధారణంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయ ధ్వజస్తంభం మీద గరుడకేతాన్ని ఎగరవేయడమే ధ్వజారోహణం. ఆరోజు రాత్రి నుంచీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వివిధ రూపాల్లో వివిధ వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతాడు. అయితే కొన్ని వాహనాల్లో స్వామి ఒక్కడే తరలివస్తాడు. మరికొన్నింటిలో దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోవిందుడికి ఉదయం, సాయంత్రం రెండు పూటలా వాహనసేవలు జరుగుతాయి.
మొదటిరోజు రాత్రి పెదశేషవాహనం;
రెండోరోజు చినశేష, హంసవాహనాలూ;
మూడోరోజు సింహవాహనం, ముత్యాలపందిరీ;
నాలుగోరోజు కల్పవృక్షం, సర్వభూపాలవాహనం;
ఐదోరోజు మోహినీ అవతారం, గరుడవాహనం;
ఆరోరోజు హనుమంత, గజవాహనాలూ;
ఏడోరోజు సూర్య, చంద్రప్రభవాహనాలూ;
8వరోజు రథ, అశ్వవాహనాలమీద స్వామి దర్శనమిస్తాడు.
బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన తొమ్మిదోరోజు స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు.
దీంతో ఈ ఉత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తమవుతాయి.
ముక్కోటి దేవతలకు ఆహ్వానమే
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు... తిరుమల సప్తగిరులపై వెలసి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న కలియుగ దైవం వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో జరిగే ధ్వజారోహణ ప్రక్రియ పవిత్రమైనది, విశిష్టమైనది, విశేషమైనది. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా ఉత్సవ ఆరంభంలో అంకురార్పణ జరుగుతుంది. ఆ మరుసటిరోజున సాయంకాల శుభ ముహూర్తాన ధ్వజారోహణ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ ధ్వజారోహణ వైభవాన్ని శ్రీవైఖానస భగవత్ శాస్త్ర పురాణాలలో విపులంగా వివరించారు.
ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే...
‘‘జయం కరోతి దేవానం ధ్వం సయిత్యా సురానా ధ్వం సనాశ్చ జయౖశ్చైవ ధ్వజమిత్యభిధీయతే’’
సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలందరినీ ఆహ్వానించే నేపథ్యంలో కార్పాసం (నూలు)తో చేసి, 14, 15, 16 హస్తాల పొడవు, 3, 4, 5 జానల వెడల్పుతో లేదా స్వామివారి పాదాలు, గర్భాలయ ద్వారానికి సమంగా 5, 3 హస్తాల వెడల్పుతో ఉండేటట్లు ఒక వస్త్రాన్ని తీసుకుని నీటితో శుభ్రం చేస్తారు. ఈ వస్త్రంలో గరుత్మంతుడు ఆకాశానికి ఎగురుతున్నట్లు చిత్రిస్తారు. అనంతరం అగ్నిగుండం ముందు వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఆచరిస్తారు. అంగ హోమం చేసి పంచద్రవ్యం, క్షీరం, జలంతో ప్రోక్షణ చేసి గరుత్మంతుడున్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి, అమ్మవార్లకు వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణధారణ గావించి గరుడ, విష్వక్సేన చక్రాలను అర్చిస్తారు. ఆ తరువాత డోలు వాద్యకారుని భేరీపూజతో భేరీ తాడనం చేయిస్తారు. స్వామివారిని ఉభయ దేవేరులతో నవసంధి బలిప్రకరణం కోసం ఉత్సవం చేసేందుకు తిరుచ్చిపై ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేన, చక్రసహితంగా గరుడ పటాన్ని ఊరేగింపునకు స్వామివారికి, అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆచార్యులు, రుత్వికులు బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక పాత్రలో బలిని(అన్నమును) సంగ్రహించి స్వామివారి గర్భాలయం మొదలుకొని మొదటి సంపంగి ప్రాకరణం, రెండవ ప్రాకరణలలో బలిహరణ గావిస్తారు. మహా ద్వారం నుండి బయటకు వచ్చి ప్రాకరణములలో ఉన్న బ్రహ్మాది అష్ట దిక్పాలకులను గద్య, పద్య, వాద్య, తాళ, గీతాలతో ఆవాహన గావించి బలిహరణ సమర్పిస్తారు. తర్వాత కొలతలు ధ్వజస్తంభానికి రెండింతలు ఉండేలా నూలు పగ్గాన్ని తీసుకుని వస్త్రంపై లిఖించిన గరుడ పటాన్ని స్వామివారి శేషమాలతో బంధిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి దగ్గరగా ధ్వజ పటాన్ని ఉంచుతారు. ముందుగా ధ్వజస్తంభాన్ని జయ, అత్యుచ్ఛ్రిత, ధన్య, ధ్వజ అనే నాలుగు నామాలతో ఆవాహన చేసి అర్చిస్తారు. తదనంతరం పటలిఖిత గరుత్మంతునిలో ‘గరుడ పక్షిరాజ సువర్ణపక్ష ఖగాధిప’ అనే నాలుగు నామాలతో మంత్రోచ్చారణ మధ్య అర్చిస్తారు. ముద్గాన్నం (కట్టె పొంగలి) నివేదన చేసి యజమానిచే సంకల్పం ఆచరించి ఆచార్యులు యాత్రాదానం స్వీకరిస్తారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయజయధ్వానాలు, మంగళవాద్య, వేదఘోషలు పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.
ధ్వజారోహణ దర్శనం సంతానప్రాప్తికి మార్గం
సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతాన యోగం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమై తొమ్మిదవ రోజు చేపట్టే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక వాహనాల్లో స్వామివారు విహరిస్తూ భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరగా చక్రస్నానం ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైఖానస ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ‘‘వైఖానసార్య దివ్యాజ్ఞావర్థతా మభివర్థతాం’’
– డాక్టర్ తూమాటి బ్రహ్మాచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం
ధ్వజారోహణం ఎందుకు చేస్తారంటే...
‘‘జయం కరోతి దేవానం ధ్వం సయిత్యా సురానా ధ్వం సనాశ్చ జయౖశ్చైవ ధ్వజమిత్యభిధీయతే’’
సకల దేవతలకు జయం కలిగించి అసురులను నాశనం చేయాలనే సంకల్పంతో ధ్వజాన్ని ఏర్పాటు చేస్తారు. బ్రహ్మోత్సవాలకు దేవతలందరినీ ఆహ్వానించే నేపథ్యంలో కార్పాసం (నూలు)తో చేసి, 14, 15, 16 హస్తాల పొడవు, 3, 4, 5 జానల వెడల్పుతో లేదా స్వామివారి పాదాలు, గర్భాలయ ద్వారానికి సమంగా 5, 3 హస్తాల వెడల్పుతో ఉండేటట్లు ఒక వస్త్రాన్ని తీసుకుని నీటితో శుభ్రం చేస్తారు. ఈ వస్త్రంలో గరుత్మంతుడు ఆకాశానికి ఎగురుతున్నట్లు చిత్రిస్తారు. అనంతరం అగ్నిగుండం ముందు వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఆచరిస్తారు. అంగ హోమం చేసి పంచద్రవ్యం, క్షీరం, జలంతో ప్రోక్షణ చేసి గరుత్మంతుడున్న వస్త్రధ్వజాన్ని మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠిస్తారు. స్వామివారికి, అమ్మవార్లకు వస్త్రంపై లిఖించిన గరుత్మంతునికి కంకణధారణ గావించి గరుడ, విష్వక్సేన చక్రాలను అర్చిస్తారు. ఆ తరువాత డోలు వాద్యకారుని భేరీపూజతో భేరీ తాడనం చేయిస్తారు. స్వామివారిని ఉభయ దేవేరులతో నవసంధి బలిప్రకరణం కోసం ఉత్సవం చేసేందుకు తిరుచ్చిపై ప్రతిష్ఠిస్తారు. విష్వక్సేన, చక్రసహితంగా గరుడ పటాన్ని ఊరేగింపునకు స్వామివారికి, అభిముఖంగా ఉండేలా ప్రతిష్ఠిస్తారు. అనంతరం ఆచార్యులు, రుత్వికులు బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఒక పాత్రలో బలిని(అన్నమును) సంగ్రహించి స్వామివారి గర్భాలయం మొదలుకొని మొదటి సంపంగి ప్రాకరణం, రెండవ ప్రాకరణలలో బలిహరణ గావిస్తారు. మహా ద్వారం నుండి బయటకు వచ్చి ప్రాకరణములలో ఉన్న బ్రహ్మాది అష్ట దిక్పాలకులను గద్య, పద్య, వాద్య, తాళ, గీతాలతో ఆవాహన గావించి బలిహరణ సమర్పిస్తారు. తర్వాత కొలతలు ధ్వజస్తంభానికి రెండింతలు ఉండేలా నూలు పగ్గాన్ని తీసుకుని వస్త్రంపై లిఖించిన గరుడ పటాన్ని స్వామివారి శేషమాలతో బంధిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి దగ్గరగా ధ్వజ పటాన్ని ఉంచుతారు. ముందుగా ధ్వజస్తంభాన్ని జయ, అత్యుచ్ఛ్రిత, ధన్య, ధ్వజ అనే నాలుగు నామాలతో ఆవాహన చేసి అర్చిస్తారు. తదనంతరం పటలిఖిత గరుత్మంతునిలో ‘గరుడ పక్షిరాజ సువర్ణపక్ష ఖగాధిప’ అనే నాలుగు నామాలతో మంత్రోచ్చారణ మధ్య అర్చిస్తారు. ముద్గాన్నం (కట్టె పొంగలి) నివేదన చేసి యజమానిచే సంకల్పం ఆచరించి ఆచార్యులు యాత్రాదానం స్వీకరిస్తారు. ఆ సుముహూర్తాన స్వామివారి బ్రహ్మోత్సవ సంబరాలకు ముక్కోటి దేవతలందరినీ ఆహ్వానించేందుకు జయజయధ్వానాలు, మంగళవాద్య, వేదఘోషలు పఠిస్తూ గరుత్మంతుని ధ్వజస్తంభం పైకి ఎగురవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు.
ధ్వజారోహణ దర్శనం సంతానప్రాప్తికి మార్గం
సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతాన యోగం కలుగుతుందని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవ సంరంభం ప్రారంభమై తొమ్మిదవ రోజు చేపట్టే ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల ప్రారంభం నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అనేక వాహనాల్లో స్వామివారు విహరిస్తూ భక్తకోటికి దర్శనభాగ్యం కలిగిస్తారు. ఈ ఉత్సవాల్లో చివరగా చక్రస్నానం ఆచరిస్తారు. ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో ఎవరైతే వాహనాలపై విహరిస్తున్న స్వామివారిని వీక్షిస్తారో వారికి పునర్జన్మ ఉండదని వైఖానస ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ‘‘వైఖానసార్య దివ్యాజ్ఞావర్థతా మభివర్థతాం’’
– డాక్టర్ తూమాటి బ్రహ్మాచార్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం
శ్రీవారి మెట్టు మార్గం... శ్రీపద్మావతీ దేవి, వేంకటేశ్వరస్వామి నడయాడిన దివ్యమార్గంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల క్షేత్రానికి కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలారవాలతో ప్రతిధ్వనిస్తూ వింత సోయగాలతో మైమరపించే ప్రకృతి రమణీయత ఉట్టిపడే దివ్యధామంగా విరాజిల్లుతుంది ఈ మార్గం. జగత్కల్యాణ మూర్తులైన శ్రీపద్మావతీ, శ్రీనివాసులు చెట్ట్టపట్టాలేసుకుని నడిచిన ఈ శ్రీవారిమెట్టు మార్గం గుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అడుగడుగు దండాలసామిని స్మరిస్తూ గోవింద నామ స్మరణతో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వెళ్తుంటారు. అయితే ఈ ప్రాంతం కొన్ని దశాబ్దాల క్రితం స్వర్ణముఖి, కల్యాణి నదుల ఉద్ధృతమైన వరదల తాకిడికి గురైంది. ఈ వరదల వల్ల ఇతర గ్రామాలతోపాటు శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరాలయం కూడా శిథిలమైంది. అప్పటి నుంచి భక్తుల రాకపోకలు సన్నగిల్లాయి. కానీ చంద్రగిరి, మంగాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మాత్రం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమలకు వెళ్లి భక్తులకు అవసరమైన కూరగాయలు, పాలు, పెరుగు, నెయ్యి వంటి వాటిని అమ్ముకునేవారు.
సాక్షాత్తు తిరుమలేశుడు నడయాడిన ఈ దివ్యమార్గాన్ని పునరుద్ధరించేందుకు నాటి టీటీడీ ఈవో కేవీ రమణాచారి సంకల్పించారు. ఆయన పట్టుదలతో సడలని దీక్షతో శ్రీవారి మెట్టు మార్గం పునరుద్ధరింపబడింది. రాళ్లురప్పలతో కూడి దుర్గమంగా తయారైన ఈ మార్గాన్ని రూ.6 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రానైటు రాళ్లతో 2,388 మెట్లను ఎండ తగలకుండా, వానకు తడవకుండా ఆ మెట్లపై చక్కని షెడ్లను నిర్మించారు. దారి వెంబడి నడిచే భక్తుల కోసం మంచినీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, భద్రత వంటి విస్తృత సౌకర్యాలతో శ్రీవారి మెట్టు మార్గాన్ని పునర్నిర్మించారు. రూ.38 లక్షలతో మొదటి మెట్టు వద్ద శ్రీవారి పాదాల మండపం ఆలయాన్ని ప్రతిష్ఠించారు. సౌకర్యాలు పెరగడంతో శ్రీవారి మెట్టు నుంచి స్వామి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య పెరిగింది. మామూలు రోజుల్లో రోజుకు 5 నుంచి 10 వేల మంది భక్తులు వెళితే, పండుగలు, సెలవులు, ఉత్సవాల సమయాల్లో 20 వేల వరకు వెళ్తుంటారు. తిరుపతి ‘శ్రీనివాసం’ నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.
కలియుగ దైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వతంత్ర లక్ష్మిగా పూజలందుకుంటోంది. తన పతిౖయెన శ్రీవారి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ, నిత్యకల్యాణం... పచ్చ తోరణంలా భాసిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో రెండు ఉపాలయాలున్నాయి. ఒకటి శ్రీ కృష్ణ బలరామ ఆలయం, రెండవది శ్రీసుందరరాజ స్వామి ఆలయం. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధి చివర్లో అప్పట్లో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో నిర్వహించే వారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పుర వీధుల్లో నిర్వహించేవారని వినికిడి.
పద్మపురాణం, వేంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం, స్కందపురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ వివరాలు వివరించి ఉంది. వాటిలోని సారాంశం... తాను నివాసముండే విష్ణు వక్షస్థలంపై భృగుమహర్షి తన్నినా విష్ణువు అతన్ని క్షమించడాన్ని జీర్ణించుకోలేక శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. అలా శ్రీమహాలక్ష్మి ముందుగా కొల్హాపురం (మహారాష్ట్రలోని కొల్హాపూర్) చేరుకుంటుంది. లక్ష్మీ విరహితుడైన స్వామి వారు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుంటాడు. ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించదు. ఆ సమయంలోనే స్వర్ణముఖి నదీ తీరంలో కొలను తవ్వి, అందులో తామర పుష్పాలు వేసి పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే మహాలక్ష్మి కటాక్షిస్తుందని అశరీరవాణి పలుకుతుంది. దీంతో స్వామివారు ఇప్పుడున్న పుష్కరిణిని కుంతాయుధంతో తవ్వి బంగారు తామర పుష్పాలను వేసి, తామర పుష్పాలు విచ్చుకోవడానికి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి 12 ఏళ్లు తపస్సు ఆచరిస్తాడు. స్వామి వారి తపస్సుకు మెచ్చిన శ్రీమహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి, శుక్రవారం రోజున బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది. పద్మం నుంచి ఆవిర్భవించడంతో పద్మావతీదేవి అయ్యింది. శ్రీనివాసుని హృదయేశ్వరిగా ఉంటూ శుకమహర్షి ప్రార్థన మేరకు శ్రీపద్మావతి అమ్మవారు పద్మాసనంపై భక్తులను అనుగ్రహిస్తోంది.
గ్రామం ఏర్పడక మునుపే శ్రీపద్మావతి అమ్మవారు వెలియడంతో స్వతంత్రలక్ష్మి అయింది. గ్రామం ఏర్పడక మునుపు ఆలయం నిర్మితమైతే అది స్వతంత్ర గ్రామం ఏర్పడిన తరువాత ఆలయ నిర్మాణమైతే అది పరతంత్ర అని పురాణాలు చెబుతున్నాయి. ఈ లెక్కన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారు స్వతంత్రలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారు వెలసిన తరువాత నిత్య ధూపదీప నైవేద్యాల కోసం శుకమహర్షి అగ్రహారాన్ని నిర్మించి, వంద వైష్ణవ కుటుంబాలకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుకమహర్షి పేరుతో అప్పట్లో తిరుశుకనూరుగా పిలిచేవారు. అదే తిరుచానూరుగా మార్పు చెందింది. స్వతంత్ర లక్ష్మి అయిన శ్రీపద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోను ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఏటా వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కల్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి సోమవారం అష్టదళ పాద పద్మారాధన, ప్రతి నెల మొదటి బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం ఉదయం మూలమూర్తికి అభిషేకం, మధ్యాహ్నం ఉద్యానవనంలో ఉత్సవవర్లకు అభిషేకం, సాయంత్రం వీధోత్సవం, శనివారం పుష్పాంజలి సేవ జరుగుతాయి.
కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పద్మ సరోవరం(పుష్కరిణి)లో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహిస్తారు. పంచమీతీర్థం రోజున పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తన పట్టపురాణి పద్మావతి అమ్మవారికి నిర్వహించే చక్రస్నానానికి తిరుమల నుంచి ముల్తైదువు సారెను శ్రీవారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది.
కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లోక కల్యాణార్థం అష్టోత్తర శత నామావళిని లక్ష మార్లు స్తుతిస్తూ కుంకుమతో అమ్మవారిని ఆలయ అర్చకులు, వేద పండితులు అర్చిస్తారు. అలాగే బ్రహ్మోత్సవాల్లో అలిసిన అలమేలు మంగమ్మను సేదదీర్చడానికి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు సాయంత్రం ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం సాంప్రదాయం.
శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించింది కలియుగంలో. అంతకు మునుపే శుకమహర్షి అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు యోగముద్రలో ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వలన కలిగిన పాపాలను పోగొట్టుకోవడానికి కలియుగ ప్రారంభంలో బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు తీర్థయాత్రలు చేస్తుంటారు. అలా స్వర్ణముఖి నది సమీపంలో మునులు తపస్సు చేసుకుంటున్న (నేడు ముండ్లపూడి) ప్రాంతంలో వారితో కలిసి తపస్సు చేస్తాడు. ఇది తెలుసుకున్న శుకమహర్షి లోక కల్యాణార్థం తిరుశుకపురం (తిరుచానూరు)లో శిలారూపంలో కొలువుతీరాలని శ్రీకృష్ణుడిని అభ్యర్థిస్తాడు. మహర్షి కోరిక మేరకు బలరామునితో కలిసి యోగముద్రలో శ్రీకృష్ణుడు శిలగా మారి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తరువాత శుకమహర్షి... ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించాడని, ఆ తరువాతి కాలంలో శ్రీపద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దాదాపు 106 ఏళ్ల కిందట మహంతుల కాలంలో శ్రీసుందరరాజ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు 18వ శతాబ్దంలో ముష్కరులు భారతదేశంలోని హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరుమాళగన్‌జోలై అనే గ్రామంలో ఉన్న శ్రీసుందరరాజస్వామి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి ఉత్సవవర్లను శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి భద్రపరిచారు. తరువాత కాలంలో మహంతుల పరిపాలనలో స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి భూదేవి సమేతంగా మూల మూర్తులను ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం, స్వామివారి నక్షత్రం ఉత్తరాభాద్రకు ముగిసేలా మూడురోజులపాటు శ్రీసుందరరాజ స్వామి వారికి అవతారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
రాష్ట్రంలో అరసవల్లి, తిరుచానూరులో మాత్రమే సూర్యదేవాలయాలు ఉన్నాయి. తిరుచానూరులో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారిని సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రతిష్టించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. తిరుచానూరులోని సూర్యదేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణికి అభిముఖంగా ఉంది. ఇక్కడి నిలువెత్తు సూర్యనారాయణస్వామి మూలవిరాట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒకప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారని వినికిడి. దీనికి కారణం... తిరుమల గిరులు అరణ్యంతో నిండి ఉండేవి. క్రూరమృగాలు అధికంగా ఉండేవి. దీనికితోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులో నిర్వహించే వారని పెద్దలు చెబుతున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా అప్పట్లో వరదరాజస్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారని, అయితే ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం మాత్రమే చేసి, వాహన సేవలన్నీ ఇక్కడే నిర్వహించేవారు. అయితే వెయ్యేళ్ల కిందట భగవద్రామానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటి నుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏ ఆలయానికి వెళ్లినా మొదటిగా అక్కడున్న అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే స్వామిని దర్శించుకోవాలి. ఇది మన సంప్రదాయం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో ఈ సంప్రదాయమే కనబడుతుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలోనూ ముందుగా మహాలక్ష్మిని ఆరాధించిన తరువాతే స్వామిని సేవించాలని ఉంది. ఇలా ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవాలన్నది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇలా కొనసాగిస్తే సంప్రదాయ పరిరక్షణ అవుతుంది. తల్లిని సేవించిన తరువాతే తండ్రి, ఇతర పరివార దేవతలను సేవించడం ఉత్తమోత్తమం. తిరుచానూరులోనూ ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. పురాణ, ఇతిహాసాలలో పేర్కొన్నట్లు తిరుమల శ్రీవారి దర్శనార్థం దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలామంది ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళతారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మ ముందుగా భక్తుడి ఆవేదనను అయ్యవారికి తెలియజేస్తుందన్నది భక్తుల విశ్వాసం.
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు, పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీవారి హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారికి మాత్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, భద్రాచలం, శ్రీకూర్మం, సింహాచలం, తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం (కంచి), కుంభకోణం, మన్నార్‌గుడి, కర్ణాటకలోని తిరునారాయణపురం వంటి పలు ఆలయాలలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి.
శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దశాబ్దకాలంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఐదారు వేల మంది దర్శించుకునేవారు. ఈ సంఖ్య నేడు సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వేల వరకు, పర్వదినాల్లో 30 నుంచి 40 వేల వరకు పెరిగింది. ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు వార్షిక ఆదాయం రూ.1 కోటి నుంచి 2 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.25 కోట్లకు చేరింది.
తిరుమల తరహాలో తిరుచానూరులో టీటీడీకి సంబంధించి చెప్పుకోదగ్గ వసతి సముదాయం లేదు. దీంతో దాదాపు రెండేళ్ల క్రితం పూతలపట్టు – నాయుడుపేట రహదారిలోని తిరుచానూరు సమీపంలో టీటీడీకి ప్రభుత్వం ఒక ఎకరం స్థలాన్ని అప్పగించింది. ఈ స్థలంలో... తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం తరహాలో రూ.75 కోట్లతో వసతి సముదాయ భవన నిర్మాణం చేపడుతున్నారు. సెల్లార్‌లో కార్ పార్కింగ్, పై అంతస్తులో క్యాంటీన్, ఆ పై అంతస్తులో డార్మిటరీ, ఇక మిగిలిన 5 అంతస్తుల్లో 200 గదులను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చెన్నై, నెల్లూరు వైపు నుంచి వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు తిరుమలలో రద్దీ సమయంలో గదుల కొరతను అధిగమించేందుకు ఈ భవనం దోహదపడనుంది.
శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తరహాలో అన్నదానం చేసేందుకు దాతల సహకారంతో సుమారు పదేళ్ల క్రితం అన్నదానం క్యాంటీన్‌ను ప్రారంభించారు. మొదట్లో ప్రైవేటు బస్టాండు దగ్గర ఉన్న టీటీడీకి చెందిన కల్యాణమండపంలో అన్నదానం క్యాంటీన్‌ను నిర్వహించేవారు. ఆ తరువాత ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం కిందకు మార్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్నదానం క్యాంటీన్‌ను అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. సుమారు రూ.7 కోట్లతో తోళప గార్డెన్‌లో భవన నిర్మాణ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఒకేసారి 400 మంది భోజనం చేసేలా విశాలమైన డైనింగ్ హాల్, ఆధునిక వసతులతో కిచెన్ ఏర్పాటు చేశారు.
– ఎస్. శశికుమార్ తిరుపతి.
‘ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా గోవిందా!’ అని నోరారా అంటే అదొక ఆనందం. చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. ఇక స్వామి వారి చరిత్ర పరమాద్భుతం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. ఆ కొండల మధ్య వింతగా వెలుగులీనుతున్న బంగారు మేడ ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయాన్ని చూస్తే భక్తులకు ఎక్కడలేని పరమానందం. ఆ మేడలోని అతిలోక సుందర మోహనాకారుడు శ్రీవేంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఉవ్విళ్లూరతారు.
అతిలోక సుందరుడు శ్రీనివాసుడు శ్రీవేంకటేశమతి సుందర మోహనాంగంశ్రీభూమికాంతమరవింద దళాయతాక్షమ్‌ఆనందనిలయుడు, అందరినీ సమ్మోహనపరచే ఆతిలోక సుందరుడు... ఇంతటి సుకుమారమైన దేవుడు ‘నేను వైకుంఠాన్నయినా విడిచి ఉంటాను గాని, నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను’ అంటూ శ్రీవైకుంఠం నుంచి దిగివచ్చి భూలోకంలోని వేంకటాచలంలో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా వక్షస్థల శ్రీమహాలక్ష్మితో స్వయం వ్యక్తరూపంలో ఆవిర్భవించారు. వక్ష స్థల లక్ష్మి వల్లే ఆ స్వామి ‘శ్రీ’నివాసుడయ్యాడు.
శిరస్సున కిరీటం, యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖచక్రాలను ధరించి, కింద కుడిచేతిని వరదముద్రలో ఉంచి తన పాద ద్వయాన్ని శరణు వేడుమన్నట్లుగా చూపిస్తుంటాడు. కింది ఎడమ చేతిని నడుముపై ఉంచి కటి హస్తంతో మోకాళ్లను చూపుతున్నాడు. విచిత్రమైన ఈ భంగిమలో తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం, తన పాదాలను శరణు వేడితే చాలు. ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానంటూ కటి హస్తంతో, కోరిన వరాలన్నీ ఇస్తానంటూ వరద హస్తంతో సొంపైన భంగిమలో నిలిచి ఉన్న సుందరమూర్తి శ్రీనివాసుడు.
ఆనందనిలయ గర్భాలయంలో సాలగ్రామ శిలామూర్తి అయిన మూలవిరాట్టుతో పాటు శ్రీనివాసునికి మరో నాలుగు రకాల ఉత్సవమూర్తులు ఉన్నాయి. వీటిని మూలమూర్తితో కలిపి పంచబేరాలు అంటారు. మూలవిరాట్టు స్థిరంగా 8 అడుగుల ఎత్తు సాలగ్రామ శిలామూర్తిని ‘ధ్రువబేరం’ అంటారు. ఈ స్వామివారి దర్శనం కోసమే భక్తులు యాత్రకు వస్తుంటారు. ఈ మూలవిరాట్టుకే ప్రతిరోజు ప్రధానంగా సుప్రభాతం, రెండు పర్యాయాలు తోమాలసేవ అనే పుష్పాలంకరణ సేవ, ఉదయం సహస్ర నామార్చన, మధ్యాహ్నం సాయంత్రం అష్టోత్తర శతనామార్చనలు, మూడు పూటలా నివేదనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, గురువారం తిరుప్పావడ సేవ, నేత్ర దర్శనం, రాత్రి పూలంగి సేవ, శుక్రవారం ఉదయం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది. శ్రీస్వామివారికి అర్చనలు, నివేదనలు జరిగిన వెంటనే వక్షస్థలంలోని ‘వ్యూహలక్ష్మి’కి జరుపుతారు.
రెండవబేరం ‘శ్రీభోగ శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు వెండి ప్రతిమ అయిన ఈయననే ‘మనవాళ పెరుమాళ్’ అంటారు. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉన్న ఈ వెండి మూర్తికి ప్రతిరోజు ఉదయం ఆకాశగంగా తీర్థాభిషేకం రాత్రి పవళింపు సేవ, ఏకాంతసేవ జరుగుతుంది. ఈ స్వామివారికి ప్రతి బుధవారం బంగారు వాకిలి వద్ద సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మూడవ బేరం ‘కొలువు శ్రీనివాసమూర్తి’. మూలమూర్తికి నకలు పంచలోహ ప్రతిమ. ఒకటిన్నర అడుగుల ఎత్తు ఉండే ఈ మూర్తి బంగారువాకిలి లోపల ‘బంగారు సింహాసనం’లో కొలువుదీరగా, ప్రతిరోజూదర్బారు జరుగుతుంది. పంచాంగ శ్రవణం తరువాత ఆదాయ వ్యయాల లెక్కలన్నీ వినే స్వామి ఈ కొలువుమూర్తి. నాల్గవ బేరం ‘ఉగ్ర శ్రీనివాసమూర్తి’. శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న ఈ ఉగ్రమూర్తికి పూర్వం ఉత్సవాలు జరిగేవి. ప్రస్తుతం జరగడం లేదు. కార్తీక కైశిక ద్వాదశి రోజున మాత్రమే తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే ఉత్సవం పూర్తి చేసుకుని ఆలయంలోకి వెళ్తారు. ఐదవ బేరం ‘ఉత్సవ శ్రీనివాసమూర్తి’. వీరే మలయప్పస్వామి. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్న ఉత్సవమూర్తి. మలయప్పకోనలో దొరికాడట. అందుకే మలయప్పస్వామిగా పిలువబడుతూ, ఆలయం బయట అన్ని ఉత్సవాల్లో పాల్గొంటూ, భక్తులకు సన్నిహితంగా దర్శనమిస్తుంటాడు.వీరు కాకుండా ఆనందనిలయ గర్భాలయంలో ‘సుదర్శన చక్రత్తాళ్వార్, అనంతుడు, శ్రీసీతారామలక్ష్మణులు, రుక్మిణీ శ్రీకృష్ణులు, సుగ్రీవహనుమంతులు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు’తదితర ఉత్సవమూర్తులు ఆయా వేళల్లో ఊరేగింపుల్లో పాల్గొంటుంటారు. వీరిలో కొన్నింటిని ప్రస్తుతం తీర్థం ఇచ్చే అరలో చూడవచ్చు.
తిరుమలేశుడికి అనేక నామాలు ఉన్నాయి. అవన్నీ విచిత్రమైన పేర్లు. అవన్నీ ఆ స్వామివారి సొంత పేర్లా అంటే అదీ చెప్పలేం అంటున్నారు శ్రీజూలకంటి బాలసుబ్రహ్మణ్యం. కాని అన్ని పేర్లు భక్తులు ప్రియంగా... ఇష్టంగా పిలుచుకుంటున్నవే. వాటిలో ప్రసిద్దమైనది ‘ఏడుకొండలవాడా’. శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, వృషాద్రి, వృషభాద్రి, అంజనాద్రి అనే ఏడుకొండల్లో ఉన్న స్వామి కనుక ఏడుకొండలవాడయ్యాడు. అదేవిధంగా వేం – పాపాలను, కట – పోగొడుతాడు కనుకే ‘వేంకటపతి’ అనీ, తిరుమలేశుడని, స్థలాన్ని బట్టి, చేసే పనినిబట్టి పిలువబడుతున్న స్వామే శ్రీనివాసుడు. అన్ని పేర్ల కంటే మరో విచిత్రమైన పేరు ఉంది. భార్య పేరుతో పిలుచుకోవడం. అదే ‘శ్రీ’నివాసుడు. ఆయన వక్షస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ భక్తుల కోరికలను తీర్చడంలో, స్వామికి చెప్పి సిఫారసు చేస్తుంటారట. ఆమె ‘వాత్సల్య గుణోజ్జ్వలాం’ కనుక భక్తుల మీద ప్రేమ ఎక్కువ. ఆ తల్లి వల్లే ‘శ్రీ’నివాసుడు’ అని పిలువబడుతున్నాడు. అసలు నీ పేరేమయ్యా? అంటే చెప్పరు కానీ ‘అడుగడుగు దండాలవాడా’ అని పిలిచినా పలుకుతాడు. ‘ఆపద్బాంధవా’ అని పిలిచినా పలుకుతాడు. ఇలా ఏ పేరుతో పిలిచినా పలుకుతూ మన కోరికలు తీరుస్తూనే ఉన్న వింత వింత పెట్టుడు పేర్ల దేవుడే వేంకటేశుడు.
తిరుమలేశునికి ఉత్సవాల దేవుడు అనే పేరుంది. ఈ స్వామికి సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలు, కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఏకాంత సేవ వంటి నిత్యోత్సవాలతో పాటు విశేషపూజ, అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం మొదలైన వారోత్సవాలు, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, శ్రవణం, పున్నమి గరుడసేవ వంటి మాసోత్సవాలు, ఉగాది ఆస్థానం, ఆణివర ఆస్థానం, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పుష్పయాగం వంటి వార్షికోత్సవాల్లో శ్రీవేంకటేశుడి వైభవం వర్ణనాతీతం.
ఆనందనిలయుడు అలంకారప్రియుడు. అంతకంటే భోజనప్రియుడు. వాటన్నిటికంటే భక్తప్రియుడు. భక్తుల కోసమే ఎన్నెన్నో కమ్మగా ఉండే లడ్డూలు, వడలు, దోసెలు, అప్పాలు, క్షీరాన్నం, పాయసం, కదంబం, పులిహోర, పొంగలి, సీరా, కేసరి తదితర అన్నప్రసాదాలను సుష్టుగా ఆరగిస్తాడు. భోజన ప్రియుడైన శ్రీనివాసుడు నిత్యం ‘తోమని పళ్లాల్లో’ ఆరగిస్తారట. ఒకసారి భోజనం చేసిన పళ్లాన్ని శుభ్రం చేయకుండా పడవేస్తారు. భోజనానికి మళ్లీ కొత్త పళ్లెం ఉపయోగిస్తారు. ఇంకా విచిత్రమేమంటే.. మట్టికుండ అది కూడా సగం పగిలిన మట్టికుండ, అదే ఓటి కుండ లేదా ఓడు అంటారు. ప్రతి రోజు ‘ఓడు’లో మాత్రమే ఆరగించే ఆనందనిలయుని వైభోగం ఇదా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇలా ఏది తిన్నా తన భుక్తశేషాన్ని మళ్లీ భక్తులకే ప్రసాదిస్తాడు. వాటిని తిన్న భక్తులకు తుష్టీ, పుష్టీ, సంతుష్టితో పాటు సంపూర్ణ ఆరోగ్యం, సమస్త కోరికలు తీరుతున్నాయి.
ప్రతిరోజు రాత్రి చివరగా తిరుమలేశునికి ‘ఏకాంతసేవ’ అనే పవళింపుసేవ జరుగుతుంది. ఈ సేవలో సన్నిధిగొల్ల పట్టుపాన్పును వేసి దీపజ్యోతులు వెలిగిస్తారు. శ్రీవారు యోగనిద్రకు ఉపక్రమిస్తూ తూగుటుయ్యాలలో మెల్లగా ఊగుతుంటాడు. ఆ సమయంలో అన్నమయ్య జోలపాట పాడుతుండగా తరిగొండ వెంగమాంబ పేరుతో ముత్యాలు పేర్చిన వెండిపళ్లెంలో కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పిస్తారు. తరిగొండ నుంచి చిన్నప్పుడే వచ్చి తిరుమల సన్నిధిలో స్థిరపడిన పరమభక్తురాలు వెంగమాంబ. ఈమె సమర్పించే ముత్యాలహారతే చివరి హారతి. అందుకే శ్రీవారి ఆలయంలో ‘తాళ్లపాకవారి లాలి, తరిగొండవారి హారతి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది. ఆ తరువాత దర్శనాలు, హారతులు ఉండవు. ఆ తరువాత శ్రీవారి ఆలయం బంగారువాకిళ్లు మూసివేస్తారు.
తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి.
వేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే ‘శ్వేత వరాహస్వామి’ అంటారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజ, తొలి నైవేద్యం, తొలి దర్శనం జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తరువాత శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించడం శ్రేçష్ఠం. అలా చేస్తేనే శ్రీవారికి ఇష్టమని, యాత్ర సఫలం అవుతుందని చెబుతారు.
శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు సాక్షాత్తు పరమశివుడు. ఆయనే ఈ క్షేత్రంలో ‘రుద్రుడు’గా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్ర పాలకుడు, గోగర్భంలో ఉంటూ మహాశివరాత్రికి అభిషేకాలు జరుపుకుంటున్నాడు.
భక్త వరదుడైన తిరుమలేశునికి బంగారు వాకిళ్లు తెరవక ముందే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో (2.30 – 3 గంటలు) బ్రహ్మదేవుడు తొలిపూజ చేస్తాడు. అందుకోసమే ఆలయంలో బ్రహ్మపూజ కోసం ‘పెద్ద బంగారు గిన్నె’లో జలాన్ని, పళ్లెంలో చందనాన్ని ఉంచుతారు. ఆ తరువాత దాన్నే ‘బ్రహ్మతీర్థం’గా భక్తులకు ఇస్తారు. ప్రత్యేకంగా కన్యామాసంలో బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు.
శ్రీవారి సుప్రభాతానంతరం స్వామివారికి మహంతు బావాజీవారి ‘నవనీత హారతి’ తొలిగా సమర్పిస్తారు. శ్రీస్వామివారితో పాచికలాడిన పరమభక్తుడే ఈ మహంతు బావాజీ.
ప్రతిరోజు శ్రీవారి సుప్రభాతంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు బంగారు వాకిళ్ల దగ్గర నేటికీ మేల్కొలుపు పాటలు పాడుతూ స్వామివారిని మేల్కొలుపుతారు. అలాగే రాత్రి ఏకాంత సేవలో ‘జోలపాట’ పాడుతూ స్వామివారి పవళింపు సేవలో పాల్గొంటున్నారు. నిత్యం జరిగే ‘కళ్యాణోత్సవం’లో తాళ్లపాక వారు నిత్య కన్యాదాతలుగా సత్కారం పొందుతున్నారు.
శ్రీనివాసుడు పుష్పప్రియుడు. కొండ మీది పూలన్నీ స్వామివారి పూజకు మాత్రమే. ఇతరులు పుష్పాలు ఉపయోగించరాదు. అందుకే తిరుమలకు ‘పుష్కర మండపం’ అని పేరు. వెయ్యేళ్లకు పూర్వం నుంచి ఆనందాళ్వారు శ్రీనివాసుని పుష్ప కైంకర్యంలో పాల్గొంటున్నారు. వీరు భగవద్రామానుజాచార్యులవారి శిష్యులు.
ప్రతిరోజు శ్రీవారి భోగశ్రీనివాసమూర్తికి, ప్రతి శుక్రవారం మూలమూర్తికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం జరుగుతుంది. తిరుమలలోని ఆకాశగంగ తీర్థ జలాలను తెచ్చే కైంకర్యంలో సుమారు వెయ్యేళ్లుగా తిరుమలనంబి అనే వైష్ణవాచార్యుల వంశీయులు పాల్గొంటున్నారు. వీరు శ్రీరామానుజుల వారికి గురువులు. స్వయానా మేనమామ కూడా. శ్రీనివాసుడు వీరిని ఒక సందర్భంలో తాతా.. తాతా అన్నాడట. అందువల్లే తిరుమలనంబికి ‘తిరుమల తాతాచార్యులు’ అనే పేరు వచ్చింది.
ఘనవేంకటేశునికి పాదాది శిరస్సు వరకు ఎన్నో దివ్యాభరణాలు, మణిహారాలతో అలంకృతుడై భక్తులను అబ్బురపరుస్తుంటాడు.
బంగారు పద్మపీఠం, బంగారు పాద కవచం, స్వర్ణ పీతాంబరం, బంగారు నందకఖడ్గం, వజ్రాలు తాపడం చేసిన సూర్యకఠారి, వైకుంఠ హస్తం (వరదహస్తం), కటిహస్తం, బంగారు కవచాలు, సాలగ్రామ హారాలు శంఖుచక్రాల బంగారు కవచాలు, నవరత్నాలు తాపడం చేసినవి, లక్ష్మీహారం, నాలుగు పేటల సహస్రనామ మాలలు, వజ్ర కిరీటాలు, మకర తోరణంతో పాటు శ్రీవారికి ఆపాదమస్తకం ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలను ఆయా విశేష సందర్భాల్లో స్వామికి అలంకరిస్తారు. ఇవన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? అంటే కోరికలు తీరిన భక్తులు ఇచ్చి ఉంటారు. స్వామి వారు ఎంతమందికి మాట ఇచ్చారో, మాట నిలబెట్టారో, ఎందరికి కడుపును పండించారో, ఎందరికి కడుపు నింపారో, ఎందరికి చేతులు, కాళ్లు, కన్నులిచ్చారో... ఎవరికి తెలుసు. అలా కోరికలు తీరిన భక్తులే స్వామివారికి మణులిచ్చారు. అలంకారాలిచ్చారు. ఆ భక్తులు ఇచ్చిన వాటినే శ్రీనివాసుడు మురిపెంగా అలంకరించుకుంటూ భక్తులను మురిపిస్తున్నారు.
భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ఈసారి అక్టోబర్ 10 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవేంకటేశ్వరస్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారం నుంచి లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్తికా సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో (కుండలు)– శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలైన నవ ధాన్యాలను పోసి ఆ మట్టితో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను అర్పింపచేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు.
న భూతో న భవిష్యత్ అనేలా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. ఈ పటాన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్టదిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండ మీదే ఉంటూ ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు విశదీకరిస్తున్నాయి.
ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరిన ప్రదేశం శేషాద్రి, ధరించేది శేష వస్త్రం, పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలి రోజు ఆ వాహనం మీదే ఊరేగుతారు.
రెండోరోజు ఉదయం స్వామి తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాడు. పెద్ద శేషవాహనం ‘ఆదిశేషుడి’గా, చిన్న శేషవాహనం ‘వాసుకి’గా భావించవచ్చు. శుద్ధ సత్వానికి ప్రతీక అయిన పరమశివుని హస్తాభరణంగా, గళాభరణంగా విరాజిల్లే వాసుకి శ్రీనివాసుని సేవలో తరిస్తున్నారు.
రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్ళు వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా హంస వాహనం అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందువల్ల తుచ్ఛమైన కోర్కెలు అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని ఈ వాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటుతారని ఐతిహ్యం.
బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహ వాహనమెక్కి వేంకటనా«థుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహనాన్ని గమనశక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు కనువిందు చేస్తారని ఆర్యోక్తి.
మూడోరోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి జరిగే సుకుమార సేవగా ముత్యపుపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తాడు.
కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు వేంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యం ప్రసాదిస్తాడు. నాలుగో రోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై వెంకన్న సర్వాలంకార భూషితుడై ఊరేగుతారు.
లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుతీరుతాడు. సర్వభూపాల వాహన సేవ... జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది.
బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదో రోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కారమిస్తారు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయం నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా అనుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీధుల్లో విహరిస్తారు.
తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఐదో రోజు రాత్రి ఊరేగుతాడు. స్వామివారి మూల మూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తాడు. వేంకటేశ్వరుడిని అనేక విధాల కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాల, నూతన గొడుగులు గరుడవాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. గరుడునితో స్వామికి గల అనుబంధాన్ని ఈ సేవ చాటి చెబుతుంది.
ఆరో రోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు.
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన స్వర్ణ రథోత్సవం ద్వారా తెలియజేస్తాడు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతాడు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.
బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసార«థిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగుతాడు. ప్రపంచానికి వెలుగు ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతాడు.
ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తాడు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తాడు.
గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామివారు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు ఉదయం రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య గోవిందుడు ఈ ఉత్సవంలో ఊరేగుతాడు.
ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతాడు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.
ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వార్‌ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
ఉదయం చక్రస్నానం నిర్వహించిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.
– తిరుమల రవిరెడ్డి, తిరుపతి
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు మూలపురుషుడు బ్రహ్మదేవుడు. దేవదేవుని బ్రçహ్మోత్సవాలు ఈనాటివి కాదు... యుగయుగాల నుంచి ఆచరిస్తున్నవే. ఆ ఉత్సవాల గురించి ‘వరాహపురాణం’ మొదటి భాగంలో చక్కగా వివరించారు. కృతయుగ ప్రారంభంలో తిరుమల క్షేత్రంలో రాక్షసుల అరాచకాలను తట్టుకోలేక బ్రహ్మాది దేవతలు శ్రీమహావిష్ణువును శరణు కోరారు. ముక్కోటిదేవతల మొర ఆలకించి శ్రీమహావిష్ణువు తన పంచాయుధాలలో ఒకటైన ‘సుదర్శన చక్రాన్ని పంపించారు. వేయి చేతులు కలిగిన మానవాకృతిలో సుదర్శన చక్రం రాక్షస సంహారం చేస్తుంది. శత్రుపీడ వదలడంతో ఆనందోత్సాహంతో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీమహావిష్ణువుకి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు జరిపించాడు. బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కావడంతో అవి బ్రహ్మోత్సవాలుగా వాసికెక్కాయి. ఈ ఉత్సవాల అనంతరం ముక్కోటి దేవతల కోరికను మన్నించి భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకు మహావిష్ణువు స్వయంభువుగా తిరుమలలో వెలిశారు.దీంతో సమాధిస్థితిలో ఉండే యోగులకు సైతం కనిపించని స్వామివారు వేంకటాద్రిపై ‘శ్రీనివాసుని’గా నిలచి అందరికీ తన దర్శనభాగ్యాన్ని కల్పించారు స్వామి.వేంకటాద్రిపై ఉత్సవాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సమస్త భక్తులకు కావలసిన వసతి, ఆహారపానీయాది సౌకర్యాలను కల్పించే బాధ్యతను దేవతా వాస్తుశిల్పిౖయెన విశ్వకర్మకు అప్పగించాడు. విశ్వకర్మ స్వామివారికి దివ్య విమానాన్ని ఆలయం పైభాగంలో నిర్మించాడు.
∙బ్రçహ్మోత్సవ సమయంలో బ్రహ్మదేవుడు స్వామివారికి రకరకాలైన రుచులలో ఆహార ‡పదార్థాలను నివేదిస్తూ స్వామివారిని అశ్వం, ఏనుగు, శేషుడు, గరుడుడు... ఇలా వివిధ వాహనాలలో ఊరేగిస్తూ, ఇరుపక్కల కళాకారులతో సంగీతం, వేదఘోష, నాట్యాలు, మేలు జాతి గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు ముందు, వెనుక, పక్కల నడుస్తుండగా స్వామివారు తేజోవంతంగా తమ దివ్య భవ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు యాగశాలను నిర్మించి యజ్ఞాలను కూడా నిర్వహించాడు. ఈ ఉత్సవాలలో ఎనిమిదవరోజు వేంకటేశ్వర స్వామి రత్నఖచిత మణిమయ భూషిత అలంకారాదులతో, శ్రీదేవి, భూదేవి సమేతుడై సకల ఆభరణ ధారుడై నాలుగు పార్శా్వలు కలిగిన దారు (కొయ్య) రథంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్త జన సంద్రానికి దర్శన భాగ్యాన్ని కల్గించి తిరిగి దేవాలయంలోని స్వర్ణమయమైన ఆస్థాన మండపానికి వేంచేస్తాడు. ఆస్థాన మండపంలో స్వామివారు బ్రహ్మను పిలిచి భక్తితో, అత్యంత ప్రేమానురాగాలతో, వినమ్రతతో నిర్వహించిన ఈ ఉత్సవాలు మమ్ములను మంత్రముగ్ధులను చేశాయని, ఎవరైతే ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కన్యామాసంలో నిర్వహిస్తారో వారు ప్రాపంచిక ఆనందాన్ని పొంది బ్రహ్మలోక సాయుజ్యాన్ని పొందుతారని సెలవిచ్చారు. వేంకటాద్రికి వేంచేసి ఎవరైతే ఈ మహోత్సవాలను కనులవిందుగా తిలకిస్తారో వారికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పలికారు. ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తజనావళికి రాజులు (పరిపాలకులు) సకల సౌకర్యాలను కల్పిసారని సెలవిచ్చారు. భక్తులకు ఎవరైతే అన్నప్రసాదాలను అందిస్తారో వారికి సంతానప్రాప్తి కలిగి స్వర్గప్రాప్తి పొంది పరమపదాన్ని చేరుకొంటారని చెప్పారు. ఎవరైతే బ్రçహ్మోత్సవాలకు వచ్చే మూగ, చెవిటి, కనుచూపులేని భక్తులకు సహాయసహకారాలను అందిస్తారో వారికి నా కరుణాకటాక్షాలు కలకాలం ఉంటాయని, ఎవరైతే నా పర్వత సానువుల్లో నివసిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని ప్రబోధించారు. అలాగే ఎవరైతే ఈ ఏడుకొండలమీద దానధర్మాలను నిర్వహిస్తారో వారు ముల్లోకాలలో కీర్తి పొందటమేకాక, దివ్యత్వం కలిగి స్వర్గం ప్రాప్తిస్తుందని బ్రహ్మాదిదేవతలకు తెలియజేశారు. అనంతరం ఆనందనిలయంలోనికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేశారు.
∙ఉత్సవాలలో శ్రవణా నక్షత్రయుక్తమైన తొమ్మిదోరోజు ఉదయం శ్రీభూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌తో కూడా శ్రీవరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, ‘పంచామృత స్నపన తిరుమంజనం’ నిర్వహిస్తారు.తర్వాత సుదర్శన చక్రాన్ని శ్రీస్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. శ్రీ సుదర్శన చక్రస్నానం వల్ల అత్యంత పవిత్రతనొందిన శ్రీస్వామి పుష్కరిణీ జలాలలో అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి ద్విమూర్తుల శక్తీ, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణీ జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. కనుక అవభృత స్నానమనేది తెలిసీ తెలియకచేసే దోషపరిహారం కోసమై చేసే విశిష్ట ప్రక్రియ. అవభృత కార్యక్రమానంతరం యావత్ దేవతాగణం సుగంధ పరిమళాలు వెదజల్లే వివిధరకాల పుష్పాలతో, మంత్రపఠనం గావిస్తూ భక్తిశ్రద్ధలతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ విధంగా బ్రహ్మ చేసిన మహోత్సవాలకు మంత్రముగ్ధుడైన శ్రీవారు బ్రహ్మతో–
‘‘బ్రహ్మా! నేను నీకు ఏవిధంగా ప్రతిఫలాన్ని ఇవ్వగలను! నేను నీకు ఒకటే చెల్లించగలను. అది... ‘‘నేనే నీవు నీవే నేను’’ అని పలుకగా, బ్రహ్మ మహానందాన్ని పొందినవాడై ‘‘స్వామీ మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మాపై, మానవాళిపై ఉండాలంటే మీరు ఈ విమాన గోపురంలో శాశ్వతంగా ఉండాలి’’ అని కోరగా శ్రీమన్నారాయణుడు ‘తథాస్తు’ అని పలికాడు. బ్రహ్మ సత్యలోకానికి వెళ్లి, తన నియత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతించాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా పేర్కొనే శ్రీనివాసుడు యుగయుగాలకు భగవంతుడు. వారికి బ్రçహ్మోత్సవ క్రతువును నిర్వహించిన యజ్ఞకర్త సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మయే. అందుకే స్వామికి జరిగే బ్రçహ్మోత్సవ సమయంలో వివిధ వాహనాలకు ముందుగా బ్రహ్మరథం తిరగడం సాక్షాత్తు... విధాత, సృష్టికర్త అయిన బ్రహ్మకు సంకేతమే.
– పోగూరి చంద్రబాబు తిరుపతి
పరిస్థితుల ప్రభావానికి, కాలగతికి ఎవరూ, ఏమీ అతీతులు కారనడానికి రూపురేఖలు కోల్పోయి, ఓనాటి వైభవానికి నిదర్శనంగా మిగిలిన ఈ ఆలయమే నిదర్శనం. కోట్లకు అధిపతి అయిన బిడ్డ ప్రపంచంలోనే అతి సంపన్న దేవుడిగా ఎదిగినా, తల్లి మాత్రం పూరిగుడిసెలో ఉంటుందనటానికి ఉదాహరణ ఆ ఆలయం. శతాబ్దాల తరబడి ధూప, దీప నైవేద్యాలకు, కనీసం భక్తులు దర్శించుకునేందుకు, ఆలన పాలనకు నోచుకోని దుస్థితిలో ఉన్న ఆలయం ఎవరిదో అనే కదా మీ సంశయం. ఇది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి తల్లి వకుళామాత ఆలయం. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి కూతవేటు దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయానికి పూర్వవైభవాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుకుగా కావాలని తలంచింది. తన భర్తౖయెన కశ్యప ప్రజాపతితో కలిసి వేల సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితిదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లవాడిగా పుట్టి బలి చక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్నకొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి ‘పుట్టడంతోనే అలా వెళ్లిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు. ఇదేనా నా తపఃఫలితం’ అని బాధపడింది. దీంతో ‘అమ్మా... అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తా’ అని వామనుడు మాట ఇచ్చాడు.
త్రేతాయుగంలో రామావతారంలో అదితి, శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురు చూస్తుంది. రాముడు శబరి మాత ఇచ్చిన పళ్లు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో ‘కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా...’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు ‘తల్లీ, నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను’ అంటూ బయలుదేరుతాడు.
ద్వాపర యుగంలో అదితి, యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంత కాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరకే వచ్చారు శ్రీకృష్ణుల వారు. కానీ ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. అష్టభార్యలను కట్టుకున్నా, అవేమీ తన సమక్షంలో జరగలేదన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాటిస్తాడు.
కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా అవతారం ఎత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తన ఆధ్వర్యంలో జరిపించి యుగ యుగాల తన కోరిక తీర్చుకుంది.
మన పూర్వీకులు నిర్మించిన...ప్రతిష్ట కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైనే ఉంది. ఈ ఆలయం నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించి ఉంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులు ఇక్కడ సేదతీరి, అన్నం తిని, నిద్రచేసి కొండకు వెళ్లేవారని చెబుతుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతింది. కానీ తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలా మంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. స్థానికులు ఎన్ని సార్లు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని టీటీడీని వేడుకున్నా పట్టించుకోలేదు.
తల్లి ప్రేమకు ప్రతీకగా ఉన్న వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. భక్తి పోరాటం చేశారు. న్యాయ స్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ రూ.2 కోట్లను మంజూరు చేసింది. 2017 మార్చి 5న ఆలయ జీర్ణోద్ధరణ పనులను స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా ప్రారంభించారు.
పనులు ప్రారంభించిన నాటి నుంచి శరవేగంగా సాగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న కొండకు క్రమపద్ధతిలో ఘాట్ రోడ్డును నిర్మిస్తున్నారు. తర్వాత దశల వారీగా ఇక్కడ నామకరణం, అన్నప్రాçశన, అక్షరాభ్యాసం వంటి సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలివేలు మంగాపురం తరహాలో త్వరలోనే ఇదో దివ్యధామంగా తీర్చిదిద్దనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
– సౌపాటి ప్రకాష్‌బాబు, తిరుపతి
ఆతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
కనకరత్న కవాట కాంతులిరుగడ గంటి
అనుపమ మణియమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలు గంటి
అరుదైన శంఖుచక్రాదులి వరుగడ గంటి
సరిలేని అభయ హస్తమును గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
అంటూ ఐదు వందల ఏళ్ల క్రితం శ్రీవేంకటేశ్వర సాక్షాత్కారం పొందిన అన్నమయ్య తన్మయత్వంతో స్వామివారిని వర్ణించిన తీరు ఇది. నాటి నుంచి నేటి వరకు స్వామి దివ్యమంగళమూర్తి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేధ పుష్యరాగాది నానా రత్నఖచితాభరణాలతో కోటి సూర్యప్రభల వెలుగులతో అలరారుతోంది. భక్తులకు వెన్నెల వరాలను ప్రసాదిస్తూ నయనానందకరమై వర్ధిల్లుతోంది. తిరుమల శ్రీవెంకటేశ్వరునికి ఎన్ని కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయో దేవస్థానం వద్దే లెక్కలు లేవు. ఉన్న వాటికి వెలకట్టలేని పరిస్థితి. శ్రీవారికి ఉన్న ఆభరణాల విషయానికొస్తే భక్తులకు వెంటనే గుర్తు వచ్చేది వజ్రకిరీటం. అయితే గత కొన్ని వందల సంవత్సరాలుగా రాజుల నుంచి సామాన్యుల వరకు స్వామి వారిని సందర్శించి కనకాభిషేకం చేస్తున్నారు. ఆ విశేషాలు శ్రీవారి భక్తుల కోసం ప్రత్యేకం.కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామికి భక్తులు విలువైన కానుకలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. కోరిన కోరికలు తీర్చే ఆపదమొక్కుల వాడికి భక్తులు నిలువుదోపిడీ సమర్పించుకుంటారు. మరికొందరు అపురూపమైన, విలువైన కానుకలను హుండీలో వేస్తుంటారు. వందల ఏళ్ల కిందట కొందరు రాజులు విలువైన మాన్యాలను స్వామి సేవకు కైంకర్యం చేసిన సందర్భాలు ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. ఎటువంటి ప్రయాణ సౌకర్యాలు లేని ఆరు వందల ఏళ్ళ నాడే దేశ, విదేశాల నుండి భక్తులు వందల వేల మైళ్ళు నడిచి తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకునేవారు.
విజయనగర సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు 1513–1524 సంవత్సరాల మధ్య కాలంలో తన దేవేరులైన చిన్నాదేవి, తిరుమలాదేవిలతో అనేకసార్లు స్వామిని సందర్శించి అమూల్య రత్నఖచిత ఆభరణాలను స్వామికి సమర్పించారు. కృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన కానుకల వివరాలకు సంబంధించి ఆలయంలో యాభై శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి సమర్పించిన ఆభరణాలలో మకరకంటి ప్రధానమైనది. నాటి స్వర్ణకారుల కళా కౌశలానికి నిదర్శనంగా నిలిచే ఈ ఆభరణానికి వెలకట్టే సాహసం ఎవరూ చేయలేదు. కళింగసామ్రాజ్యాన్ని జయించిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళుతూ 1515 అక్టోబర్ 25న శ్రీకృష్ణదేవరాయలు అరుదైన, అపురూపమైన మకరకంటిని స్వామివారికి కానుకగా సమర్పించారు. ఈ ఆభరణం బరువు 31,124 యూనిట్లుగా శాసనాలలో ఉంది. ఈ ఆభరణంలో 10,994 కెంపులు, 754 మణులు, 530 నీలాలు, 930 వజ్రాలు, 3,933 ముత్యాలు, నాలుగు పెద్ద మణులు, వందల సంఖ్యలో పచ్చలు, వైఢూర్యాలు 45, ఎగేట్‌లు 74, టోపాజ్‌లు పొదిగించి తయారు చేయించారు.
1513 ఫిబ్రవరి 10న కృష్ణదేవరాయలు తిరుమలను దర్శించిన సమయంలో 3308 క్యారెట్ల నవరత్న కిరీటాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చారు. ఈ కిరీటంలో 1076 యూనిట్ల బంగారం వాడారు. దీనితో పాటు 61 క్యారెట్ల పచ్చ, ముత్యాలు, మణులు, నీలాలు పొదిగిన మూడుపేటల కంఠహారాన్ని కూడా స్వామివారికి కానుకగా సమర్పించారు. రాణి చిన్నాదేవి 374 క్యారెట్లు గల రెండు బంగారు పాత్రలను స్వామివారి ఏకాంత సేవలో పాలు ఇచ్చేందుకు కానుకగా సమర్పించారు. తిరిగి 1513 మే 2న, జూన్ 13న కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించి ఉడుదార అనే పేరు గల విలువైన ఆభరణాన్ని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు. ఐదు వజ్రాలతో, 17 అడ్డకేసుల ముత్యాలు, కెంపులు, నీలాలు పొదిగిన ఆభరణం అది. ఉత్సవ మూర్తులకు మూడు మణిమయ కిరీటాలు ఇచ్చారు. కృష్ణదేవరాయలు పలు విలువైన ఆభరణాలను స్వామి వారికి సమర్పించినట్టు శాసనం వుంది.
* వజ్రాలు, కెంపులు, నీలాలు, రత్నాలు, ముత్యాలతో పొదిగిన 326 యూనిట్ల బరువు గల బంగారు కత్తి.
* కెంపులలో పొదిగిన 132 యూనిట్ల బరువు కలిగిన మరో కత్తి
* ముత్యాలు పొదిగిన మరో చిన్న కత్తి
* ముత్యాలు – కెంపులు, వజ్రాలు పొదిగిన పొది
* 87 క్యారెట్ల వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు ఆభరణం
* వజ్రాలు, కెంపులు, ముత్యాలు, పచ్చలు పొదిగిన 573 యూనిట్ల భుజకీర్తులు
* ప్రతిరోజూ విగ్రహానికి అలంకరించేందుకు మరో మూడు భుజకీర్తులు
* వజ్రాలు, ముత్యాలు, పచ్చలు, రత్నాలు పొదిగిన మరో రెండు బంగారు కంఠహారాలు బరువు 481 యూనిట్లు
vఉత్సవమూర్తులకు వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన మూడు బంగారు కిరీటాలు.
ఈ కానుకలన్నీ కృష్ణదేవరాయలు ఒక్కరోజులోనే శ్రీవారికి బహూకరించారు.
* 1514 జూలై 6న కృష్ణదేవరాయలు ప్రతాపరుద్ర గజపతిని ఓడించి ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకొని తన రాజ్యానికి తిరిగి వెళుతూ తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ముప్పయివేల బంగారు వరహాలతో స్వామివారికి కనకాభిషేకం చేశారు.
* ముత్యాలు, కెంపులు పొదిగిన 250 యూనిట్ల బంగారు హారాన్ని, ఒక జత బంగారు కడియాలను బహూకరించి, తలిలవమా అనే గ్రామాన్ని స్వామి నిత్యసేవకు కానుకగా ఇచ్చారు.
* రాణి చిన్నాదేవి కూడా అదే రోజు వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన ఒక బంగారుహారాన్ని, రాణీ తిరుమలదేవి వజ్రాలు, కెంపులు, ముత్యాలు పొదిగిన 225.5 యూనిట్ల బరువుగల మరో కంఠాహారాన్ని స్వామివారికి కానుకలుగా ఇచ్చారు. స్వామి నిత్యసేవకు ముదియారు అనే గ్రామాన్ని కూడా ఆమె కానుకగా ఇచ్చారు.
* కళింగదేశాన్ని జయించి సింహాద్రి పాట్నూరులో విజయçస్తంభం నాటించి తిరిగి వస్తూ కృష్ణదేవరాయలు తిరుమలను సందర్శించారు. ఆ సమయంలో రెండు పెద్ద బంగారుహారాలను కానుకగా ఇచ్చి, ఆలయ విమానం బంగారు పూత కోసం మరో 30 వేల బంగారు వరహాలను ఇచ్చారు.
* 1521 ఫిబ్రవరి 17న∙రాణి తిరుమలదేవి, తిరుమలకు వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు తొమ్మిది రకాల మణులతో కూడిన పీతాంబర వస్త్రాన్ని, ముత్యాలు, కెంపులు, పచ్చలు పొదిగిన తలపాగా, నవరత్నాలు పొదిగిన మరో హారాన్ని, ఒక పెద్ద బంగారు హారాన్ని, పదివేల బంగారు వరహాలను కానుకగా సమర్పించారు. ఇవే కాకుండా కృష్ణదేవరాయలు తిరుమల వేంకటేశ్వరునికి కోట్లు విలువ చేసే ఆభరణాలెన్నో కానుకలుగా సమర్పించారు. వందల ఏళ్ళనాటి ఆభరణాలలో కొన్ని ఈనాటికీ స్వామి సన్నిధిలోనే ఉన్నాయి.
* 1740 సంవత్సరంలో మరాఠా రాజు రాఘోజీ భోంస్లే చిత్తూరు జిల్లాలోని దామల్ చెరువు వద్ద నవాబ్ దోస్త్ అలీని ఓడించి చంపేశాడు. ఆ సమయంలో మరాఠా రాజు భోంస్లే తిరుమలలో ఆలయాన్ని సందర్శించి అప్పట్లోనే రూ.33వేలు విలువ చేసే కెంపులు పొదిగిన బంగారుహారాన్ని, రూ. 56వేలు విలువ చేసే రెండు ముత్యాల హారాలను, రూ.8,500 విలువ చేసే కలికి తురాయిని, రూ.45వేలు విలువ చేసే వజ్రాలతో కూడిన ఐదు వరసల ముత్యాల దండను స్వామి వారికి కానుకగా ఇచ్చారు. ఈ కానుకలు ఇప్పటికీ ఆలయంలోని ‘రాఘోజీవారి పెట్టె’లో భద్రపరచినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం ఈ ఆభరణాల విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. హిందూ రాజులే కాకుండా, 1820–27 సంవత్సరాల మధ్య మద్రాసు గవర్నర్‌గా ఉన్న లార్డ్ థామస్ మన్రో కూడా స్వామి వారి నిత్యాన్న సేవకు భూమిని కానుకగా ఇచ్చారు. స్వామి మన్రోకు ఒకరోజు కలలో కనిపించడంతో ఆయన కాలినడకన తిరుమలకు వెళ్ళి స్వామిని సేవించి ధన్యుడయ్యాడు. అలా ప్రాంతాలకు, మతాలకు అతీతంగా అందరూ తరతరాలుగా స్వామివారిని సేవించి తరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం స్వామివారికున్న ఆభరణాలు విలువ లెక్కగట్టే సాహసమే ఎవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. స్వామివారికి ఉన్న ఆభరణాలు, ఆ ఆభరణాలలో పొదిగిన అమూల్యమైన రాళ్ళు ఎన్ని కోట్లు చేస్తాయన్నది ఈ నాటికీ దేవస్థానం దగ్గర లెక్కలు లేవు.
తిరుమల శ్రీవారికి గల ఆభరణాలలో కలికితురాయి ‘‘వజ్ర కిరీటం’’. శ్రీవారికి ఏదైనా ఒక పెద్ద ఆభరణం చేయించాలనే ఆలోచనలతో టీటీడీ ఈ వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ప్రపంచమంతా తిరిగి వేలాది వజ్రాలు పరిశీలించి చివరికి బ్రెజిల్, ఆస్ట్రియా వంటి దేశాలలో వజ్రాలు సేకరించింది. అప్పట్లో అరున్నర కోట్ల ఖరీదు చేసిన ఈ వజ్రకిరీటం తయారీకి సుమారు సంవత్సరకాలం పట్టింది. కాగా ఈ వజ్రకిరీటాన్ని అప్పట్లో హడావుడిగా తయారు చేయించడంతో కొన్ని వజ్రాలు సరిగా తాపడం అవలేదు. ఆ కారణంగా ఈ వజ్రకిరీటంలోని కొన్ని వజ్రాలు రాలేందుకు సిద్ధంగా ఉండటంతో 1990 జనవరి నుంచి శ్రీవారికి వజ్రకిరీటం అలంకరించలేదు. అదే ఏడాది సెప్టెంబర్ 22 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావటంతో శ్రీవారి వజ్రకిరీటానికి లోపలి వైపు బంగారు రేకు తయారు చేయించి, వజ్రాలు రాలకుండా ఏర్పాటు చేశారు. ఈ వజ్రకిరీటాన్ని తిరిగి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన రోజున శ్రీవారికి అలంకరించారు. ప్రస్తుతం కిరీటం ఖరీదు సుమారు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. వజ్రకవచధారి అయిన శ్రీవారు ఈ కిరీటధారణతో వజ్రకిరీటధారిగా తన దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల మలయప్ప పెళ్లికొడుకై త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి కలియుగంలో పద్మావతి అమ్మవారిని వివాహమాడి, నడయాడిన క్షేత్రంగా చిత్తూరుజిల్లా నారాయణవనం భాసిల్లుతోంది. వేదవతీ (పద్మావతి), గోదాదేవి(అలివేలు మంగమ్మ)ల సమేతుడై కొలువుదీరిన పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి భక్తులకు ముఖ్యంగా పెళ్లి కాని యువతకు కోర్కెలు తీర్చే కల్యాణ ప్రదాతగా దర్శనమిస్తున్నారు. మూడు ప్రాకారాలలో 120 అడుగుల ఎతై ్తన రాజగోపురంతో 14వ శతాబ్దంలో శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించిన ఆలయంలో ఎడమచేతిలో హస్తం, కుడిచేతికి కల్యాణ కంకణం, వక్షస్థలంలో లక్ష్మి, దశావతార వడ్యాణం, సాలిగ్రామ హారంతో నిత్య నేత్రదర్శనంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిత్యకల్యాణంతో వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలతో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలను అందుకొంటున్న వేంకటేశ్వరుడు ఇద్దరు తాయార్లతోపాటు కొలువుదీరిన ఏకైక క్షేత్రం.
త్రేతాయుగంలో వేదవతికి రాముడు ఇచ్చిన వరంతో కలియుగంలో పద్మావతి అమ్మవారిగా అవతరించి వేంకటేశ్వరుడు వివాహమాడటానికి నారాయణవనం వచ్చారని వరాహపురాణం పేర్కొంటోంది. అమ్మవారి వివాహ సందర్భంగా నలుగుపిండిని తయారు చేయడానికి వినియోగించిన తిరగలిని కూడా ఆలయంలో చూడవచ్చు.
ఆకాశరాజు కుమార్తె పద్మావతీ అమ్మవారు చెలికత్తెలతో నారాయణపురం సమీపంలోని వనంలో విహరిస్తుండగా మదించిన ఏనుగు వెంబడించింది. లక్ష్మిని వెతుకుతూ వచ్చిన వేంకటేశ్వరుడు ఏనుగు బారి నుండి పద్మావతీదేవిని రక్షించాడు. సుందర, సుకుమార, కోమలాంగి అయిన పద్మావతీదేవిని మొదటి చూపుతోనే మోహించిన వేంకటేశ్వరుడు వివాహమాడదలిచాడు. రాజమాత ధరణీదేవిని ఒప్పించడానికి వెంకన్నకు ఎరుకలసానిగా ఆకాశరాజు రాజప్రాసాదానికి చేరుకుని సోది చెపుతానమ్మ.. సోది చెబుతానంటూ.. పద్మావతీదేవి జన్మరహస్యాన్ని చెప్పి సరైన వరుడు మలయప్పగా వివరించగా ఆకాశరాజు, ధరణీదేవీలు మలయప్పకు ఆశ్రయాన్ని కల్పించిన వకుళమాత సమ్మతితో విళంబి నామ సంవత్సరం తమిళ పంగుణి శుద్ధ ఉత్తర నక్షత్రయుక్త శుభ ఘడియల్లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.పద్మావతి, వెంకన్నల వివాహవేదికపై ఆకాశరాజు నిర్మించిన ఆలయమే నేడు పద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంగా భాసిల్లుతోంది.
పద్మావతీ, గోదాదేవిలు ఇద్దరూ మహావిష్ణువును వివాహమాడాలన్న తలంపుతో వరం పొందినవారే. వీరిరువురిని వివాహమాడి కల్యాణ వేంకటేశ్వరస్వామిగా నారాయణవనంలో కొలువై ఉన్నారు. ఆలయ ప్రాకారంలో హైందవ వైవాహిక సాంప్రదాయానుసారం స్వామి వారి గర్భాలయానికి వెనుకగా కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడమవైపున గోదాదేవి కొలువై ఉన్న ఆలయంలో అన్నీ ప్రత్యేకతలే... తిరుమలతో సహా అన్ని వైష్ణవాలయాల్లో ఉత్సవ మూర్తికి శ్రీదేవీ, భూదేవి సమేతంగా ఆర్జిత కల్యాణాన్ని నిర్వహిస్తుంటారు. అయితే నారాయణవనంలో ఉభయ నాంచారులతో పాటు పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకటేశ్వరస్వామికి నిత్యకల్యాణం చేయడం ఇతిహాస గా«థకు దర్పణం పడుతుంది. కల్యాణోత్సవంలో పాల్గొన్న అవివాహ యువతీయువకులు కంకణాన్ని ధరిస్తే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం.
ధనుర్మాస శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) రోజున వైష్ణవాలయాల్లో ఉత్తరముఖ ద్వార ప్రవేశాన్ని భక్తులకు కల్పిస్తారు. అయితే నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో ద్వాదశి రోజున ద్వారప్రవేశ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సాంప్రదాయాన్ని తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి అలయంతో పాటు నారాయణవనం కల్యాణ వెంకన్న ఆలయంలో మాత్రమే నిర్వహిస్తారు.విళంబినామ సంవత్సరం తమిళ పంగుణి నెల ఉత్తరా నక్షత్రయుక్త శుభ ఘడియల్లో పద్మావతీ అమ్మవారిని కల్యాణ వెంకన్న వివాహమాడారు. ఏటా అదేరోజున వెంకన్న ఆలయంలో పంగుణోత్తర ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రతిరోజూ సుప్రభాత, ఏకాంత సేవలను అందుకునే భోగశ్రీనివాసుడు పంగుణోత్తరం రోజులలో పద్మావతీ అమ్మవారి సన్నిధిలో అమ్మవారితో కలిసి ఏకాంత, సుప్రభాత సేవల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాన్ని ఒక్క నారాయణవనంలో మాత్రమే జరుపుతారు. పంగుణోత్తర ఉత్సవాన్ని ప్రతిబింబించే విధంగా చాంద్రమానం ఆధారంతో ఫాల్గుణ మాసంలో నారాయణగిరి ప్రాంతంలో పద్మావతీ పరిణయోత్సవాలను నిర్వహిస్తారు.
పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు కులదైవమైన ఆమ్నాయాక్షి(అవనాక్షమ్మ) ఆలయం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుండి రెండు కిలోమీటర్ల దూరంలోని సముదాయం గ్రామ శివారుల్లో వెలసి ఉంది.వేదాలను అపహరించిన సోమకాసురుడిని సంహరించడానికి పార్వతీదేవి కాళికగా అవతారమెత్తింది. సోమకాసురుడిని చంపి వేదాలను సంరక్షించిన అమ్మవారిని ఆమ్నాయాక్షిగా (ఆమ్న అంటే వేదాలను, అక్షి అంటే కన్నులుగా గల) ఆకాశరాజు కొలిచాడు. వివాహానికి ముందు పద్మావతీ అమ్మవారు గౌరీపూజను ఆమ్నాయాక్షి ఆలయంలో చేశారని, వివాహానంతరం నవదంపతులైన పద్మావతీ, కల్యాణ వేంకటేశ్వరస్వామివారలు అమ్మవారిని కొలిచినట్లు వరాహ పురాణం పేర్కొంది. ఆలయానికి పైభాగాన రాజధాని నగరం నారాయణపురం పూర్తిగా శి«థిలమైపోయింది. భిన్న స్థితిలోని ఆమ్నాయాక్షి ఆలయాన్ని 4వ శతాబ్దంలో చోళరాజులు మళ్లీ నిర్మించారు. టీటీడీ ఈ ఆలయాన్ని 1967లో స్వాధీనం చేసుకుని నిత్యపూజలను నిర్వహిస్తోంది.
శ్రీమన్నారాయుణుడి అంశ అయిన వేంకటేశ్వరస్వామి తిరుగాడి, పద్మావతీ అమ్మవారితో వివాహం చేసుకున్న క్షేత్రం నారాయణవనంగా పిలువబడుతోంది. వేటకై వచ్చిన వెంకన్న వరుడై అమ్మవారిని వివాహం చేసుకోవడంతో నారాయణవరంగా కూడా పిలవబడుతోంది. కాలక్రమంలో నారాయణపురం శిథిలమై, అరుణానది తీరాన పద్మావతీ, వెంకన్నల వివాహ చిహ్నంగా ఆకాశరాజు నిర్మించిన ఆలయం చుట్టూ ఏర్పడిన గ్రామమే నారాయణవనంగాను, నారాయణవరంగాను పిలవబడుతోంది.
విమానంలో వచ్చే వారు తిరుపతి విమానాశ్రయం చేరుకుని వాహనంపై సుమారు 24 కిలోమీటర్ల మేరకు పుత్తూరు మీదుగా ప్రయాణించి నారాయణవనం చేరుకోవచ్చు. రైలుప్రయాణంలో తిరుపతి, రేణిగుంట, పుత్తూరు రైల్వే స్టేషన్లకు చేరుకుని నారాయణవనం రావచ్చు. బస్సులో తిరుపతి, చెన్నైల నుండి నారాయణవనం చేరుకోవచ్చు.
ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవలో మేల్కొన్న స్వామిని నిత్య పూజాకైంకర్యాల అనంతరం రాత్రి 8 గంటల వరకు దర్శించుకొనవచ్చు. ప్రతి మంగళవారం ఉదయం 10.30 గంటలకు అష్టదళ పద్మారాధన సేవ, శుక్రవారం ఉదయం 7.30 గంటలకు వెంకన్న, పద్మావతీ అమ్మవార్లకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊంజల్ సేవ, శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వెంకన్నకు ఊంజల్‌సేవను నిర్వహిస్తారు. 500 రూపాయలు చెల్లించి, ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు ఉభయ నాంచారుల సమేత పద్మావతీ అమ్మవారితో కల్యాణ వెంకన్నకి నిర్వహించే ఆర్జిత కల్యాణంలో పాల్గొనవచ్చు.
– ఎ. శ్రీధర్, నారాయణవనం
తరిగొండ వెంగమాంబ కవయిత్రి, సాంఘిక దురాచారాలను ఎదిరించిన ధీరవనిత. చిన్నతనం నుంచే శ్రీ వేంకటేశ్వర స్వామిని తన సర్వస్వంగా భావించిన మహాభక్తురాలు. తిరుమలలో స్వామివారి సన్నిధికి విచ్చేసే భక్తులకు తొలిసారిగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన వితరణ శీలి.
క్రీ.శ 17వ శతాబ్దంలో చిత్తూరుజిల్లా తరిగొండలో నియోగి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కానాడ కృష్ణమూర్తి, అచ్చమాంబ దంపతులకు వెంగమాంబ జన్మించింది. బాల్యం నుంచే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని తన భర్తగా భావించి నిరంతరం ధ్యానముద్రలో గడిపేది. ఈమె ప్రవర్తనతో తల్లడిల్లిన తల్లిదండ్రులు మదనపల్లె పట్టణం శ్రీయోగభోగేశ్వరస్వామి ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యదీక్షితులు వద్దకు తీసుకెళ్లారు. ఆమెలోని దైవచింతనను గమనించిన స్వామీజీ ఆమెకు తారకనామం ఉపదేశించారు.
శ్రీ వేంకటేశ్వరస్వామిపై అనురక్తితో వెంగమాంబ అనేక రచనలకు శ్రీకారం చుట్టారు. తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని స్మరిస్తూ శ్రీనరసింహ శతకాన్ని రచించింది. ఇంకా శ్రీకృష్ణపారిజాతం, ముక్తకాంతా విలాసం వంటి కావ్యాలను రచించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మీద సుమారు రెండువేల కీర్తనలను తాళపత్రాలపై రచించింది.
వెంగమాంబను ఆధ్యాత్మిక చింతన, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన నుంచి తప్పించడానికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే తిరుపతికి సమీపంలోని బాకరాపేటకు చెందిన ఇంజేటి వెంకటాచలపతితో వెంగమాంబ వివాహం జరిపించారు. అయితే దురదృష్టవశాత్తు భర్త ఆమె చిన్నతనంలోనే గతించాడు. అప్పటి సమాజంలో ముఖ్యంగా శ్రోత్రియ కుటుంబాలలో సనాతన సంప్రదాయాలు ఎక్కువగా పాటించేవారు. బ్రాహ్మణ స్త్రీకి భర్త మరణిస్తే శిరో ముండనం చేయించి బొట్టు, గాజు, మెట్టెలు తొలగించి ఇళ్లలోనే ఉంచేవారు. అయితే శ్రీనివాసుణ్ణే తన భర్తగా భావించిన వెంగమాంబ ఈ సాంప్రదాయాలను తిరస్కరించిందన్న భక్తుల ఫిర్యాదు మేరకు పుష్పగిరి పీఠాధిపతి తరిగొండకు చేరుకొని వెంగమాంబకు హితబోధ చేశారు. ఆమె తిరస్కరించడంతో అపరాధంగా భావించిన పెద్దలు పీఠాధిపతికి సాష్టాంగ నమస్కారం చేసి తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అయితే వెంగమాంబ పీఠాధిపతికి బదులుగా గురుపీఠానికి నమస్కారం చేయడంతో గురుపీఠం దగ్ధమైంది. ఆగ్రహించిన పెద్దలు ఆమెకు బలవంతంగా శిరోముండనం చేయించి తరిగొండ నరసింహస్వామి కొలనులో స్నానం చేయించారు. స్నానం చేసిన తరువాత వెంగమాంబ తలపై శిరోజాలు మునుపటిలాగే దర్శనమిచ్చాయి. దీంతో వెంగమాంబకు గ్రామబహిష్కారం విధించారు.
గ్రామ బహిష్కారానికి గురైన శ్రీ వెంగమాంబకు తరిగొండలో అప్పటి సూఫీమత బోధకుడు హజరత్ సయ్యద్ మురాద్‌షావలీ ఆశ్రయం కల్పించాడు. అనంతరం వెంగమాంబ తరిగొండకు సమీపంలోని మారెళ్ల గెవి(గుహ)కి చేరుకొంది, ప్రతిరోజు ఆమె సాధనకు అవసరమైన సామగ్రిని, కందమూలాలను మురాద్‌షావలీ స్వయంగా సమకూర్చేవాడు. కుపితులైన కొందరు అక్కడా ఆమె సాధనను సాగనివ్వలేదు.
వెంగమాంబకు శ్రీనివాసుడు తన వద్దకు చేరుకోవాలని సూచించి తిరుమలకు మార్గం కూడా చూపించాడు. ప్రస్తుతం తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీఆంజనేయస్వామి విగ్రహం వెనకవైపు ఉన్న సొరంగ మార్గం గుండా ఆమె తిరుమలకు చేరుకొంది. అక్కడ తుంబుర తీర్థంలోని శ్రీవెంగమాంబ గుహగా పిలువబడే పర్వతశ్రేణిలో తన సాధనను కొనసాగించింది. అక్కడే కొన్ని గ్రంథాలు, కీర్తనలు రచించింది.
తిరుమలలోనూ ఛాందసుల నుంచి ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి. ఒకరోజు వెంగమాంబ గుహలో శ్రీ శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఉండటం కొందరు గమనించి వెంగమాంబ మహత్యాన్ని తెలుసుకొని తమ తప్పులు క్షమించమని వేడుకొన్నారు. అప్పటినుంచి కొండపైన అన్నమయ్య వారసులకు కల్పించిన సౌకర్యాలను ఈమెకూ కల్పించారు. ఉండటానికి నివాసం, ఇతర సౌకర్యాలతోపాటు ఆలయంలో ఉదయం అన్నమయ్య మేలుకొలుపు తరువాత రాత్రి స్వామివారి జోలపాట ముత్యాలహారతి ఇచ్చే భాగ్యాన్ని వెంగమాంబకు కల్పించారు.
తిరుమలలో నేటికీ కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబే. క్రీ.శ 1812–15 మధ్య కాలంలో తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ తన నివాసంలోనే భోజనాలు తయారు చేసి వడ్డించడం ప్రారంభించింది. నిత్యం వందలాది మంది భక్తుల ఆకలిని తీర్చేది. టీటీడీ వారు నేటికీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొండపై వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న నిత్యాన్నదాన సత్రానికి శ్రీ వెంగమాంబ పేరు పెట్టడం గమనార్హం.
తరిగొండ ప్రాంతంలో శ్రీ వెంగమాంబకు బహుళ ప్రచారం కల్పించారు. తరిగొండ గ్రామ బస్టాండులో పెద్ద మండపం నిర్మించి అందులో శ్రీ వెంగమాంబ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇక్కడ ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
– కె. మురళీకృష్ణ గుర్రంకొండ
వెంగమాంబ బాటలో ఎందరో భక్తులు శ్రీవారి సేవలో తరించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. తిరుపతిలో శ్రీవారి పరమ భక్తురాళ్లు కోమలమ్మ, పొన్నమ్మ, రేబాల సుబ్బమ్మ చాటిన భక్తి అనన్యమైంది. శ్రీవారికి పుష్పకైంకర్యాలు నిర్వహించాలని, తమ నివాస ప్రాంతంలో కొలువు తీర్పించాలని వారు తపించారు. దట్టమైన కొండల్లో వెలసిన స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన ఆర్త జనులకు అంతగా సౌకర్యాలేవీ లేని రోజుల్లో ఇతోధికంగా సేవలు అందించారు. అన్నదాన సత్రాలను ఏర్పాటు చేసి, భక్తుల ఆకలిని తీర్చారు. సుదూర ప్రాంతాల నుంచి కొండకు నడచి వచ్చిన వారికి విశ్రాంతి తీసుకునే వసతి సౌకర్యాలను కల్పించారు. ప్రస్తుత విపణిలో కోట్లాది రూపాయల విలువ చేసే విస్తారమైన స్థలాలను, అందులోని పూదోటలను శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. తరాలు గడచినా ఆ పుణ్య కార్యాలే వారిని కీర్తించేలా చేస్తున్నాయి.
రామానుజాచార్యుల సంకల్పంతో తిరుమల పాదాల చెంత కొత్తూరు పేరిట కుగ్రామంగా వెలసిన నేటి తిరుçపతిలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండే రోజులవి. దట్టమైన చెట్లతో నిండిన కొండకు కాలిబాటన నడిచి వెళ్లాంటే భక్తులు భయపడాల్సి వచ్చేది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసేవారికి సమయానికి ఇంత అన్నం దొరికేది కాదు. కాస్త విశ్రాంతి కావాలన్నా ఇబ్బందిగా ఉండేది. శ్రీవారి భక్తులు పడుతున్న కష్టాలను చూసిన రాఘవశెట్టి భార్య కోమలమ్మ తపించిపోయారు. అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చిన వారి ఆకలి దప్పికలను తీర్చారు. అక్కడే విశ్రాంతి తీసుకున్నాక భక్తులు తిరుమలకు పయనమయ్యేవారు. ఆమె చివరి రోజుల్లో శ్రీవారిని తన ఇలాకాలో ఏడాదికి ఓసారైనా కొలువు దీర్చాలని వేడుకుంది. నిత్య పుష్పకైంకర్యాల కోసం తానే పుష్పాలను ఇవ్వాలని తపించింది. తాను అనుకున్నట్టే ప్రస్తుత తిరుపతిలో నడిబొడ్డునే ఉన్న విస్తారమైన స్థలాన్ని, అందులోని పూదోటలను, అన్నదాన సత్రాన్ని దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోర్కె ప్రకారం ఏడాదిలో ఒకసారి అదే స్థలంలో దేవస్థానం శ్రీవారి కొలువును నిర్వహిస్తోంది. తిరుచానూరులో వెలసిన శ్రీవారి దేవేరి పద్మావతీదేవి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే పంచమీతీర్థం రోజున కోమలమ్మ సత్రంలో వేడుకను నిర్వహించే సంప్రదాయాన్ని దేవస్థానం నేటికీ కొనసాగిస్తోంది. ప్రస్తుత పాత మెటర్నిటీ ఆసుపత్రి కూడలి వద్ద ఉన్న కోమలమ్మ సత్రం నుంచే తన దేవేరి పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారెను ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చి, పంచమీతీర్థం రోజున సమర్పిస్తుంటారు. కోమలమ్మ భక్తికి మరో గౌరవం దక్కింది. తిరుమల శ్రీవారి కాలినడక దారిలో అలిపిరి పాదాల మండపం వద్ద కోమలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
శ్రీవారికి పొన్నమ్మ పరమ భక్తురాలు. స్వామివారి ఆరాధనకు మించినది లేదని భావించేది. సువిశాల స్థలంలో పూల తోటలను పెంచి, అందులోని పుష్పాలను శ్రీవారి కైంకర్యాలకు వినియోగించేది. కొన్నాళ్లకు తాను కాలు కదల్చలేని స్థితిలో పూలతోటలతో సహా తన స్థలాన్ని శ్రీవారి పుష్పకైంకర్యాల కోసం సమర్పించింది. ప్రతిఫలంగా ఆమె ఏడాదిలో కనీసం ఒక్క రోజైనా తాను సమర్పించిన స్థలంలో శ్రీవారి క్రతువును నిర్వహించాలని వేడుకుంది. ప్రస్తుత టీటీడీ పరిపాలన భవనం ఎదురుగానే పొన్నమ్మ పూదోట ఉండేది. ఆ స్థలంలో గోవిందరాజస్వామి పాఠశాలతో పాటు, అదే ఆవరణలో టీటీడీ ఓ మండపాన్ని కూడా నిర్మించింది. ఈ మండపం పొన్నమ్మ మండపంగా గుర్తింపు పొందింది. ఏటా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల ముగింపునకు సూచనగా కపిలతీర్థంలో నిర్వహించే చక్రస్నాన ఘట్టానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పొన్నమ్మ మండపంలోనే నిర్వహిస్తారు. పొన్నమ్మ కోరిక ఇలా నెరవేరుతోంది.
శ్రీవారి భక్తిలో తరించిన మరో భక్తురాలు రేబాల సుబ్బమ్మ. తనకున్న విస్తారమైన స్థలంలో పూదోటలను పెంచుతూ, అందులోని పుష్పాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలకు సమర్పించేది. తన తర్వాత కూడా తను పెంచిన పూదోటల్లో శ్రీవారికి ఏడాదిలో ఓ రోజైనా కొలువు జరిపించాలని తపించేది. తను తలచిన విధంగానే ఆ పూదోటలను, స్థలాలతో పాటు దేవస్థానానికి కానుకగా సమర్పించింది. ఆమె కోరికను నెరవేర్చేందుకే తిరుపతి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక రోజంతా సీతారామలక్ష్మణ సమేత హనుమంతునికి రేబాల సుబ్బమ్మ తోటలోనే టీటీడీ కొలువు దీరుస్తోంది. నాటి రేబాల సుబ్బమ్మ తోట ఉన్న ప్రాంతమే ప్రస్తుతం తిరుపతిలో రేబాల సుబ్బమ్మ గార్డెన్– ఆర్‌ఎస్‌గార్డెన్‌గా ప్రాచుర్యం పొందింది.
– జె.భాస్కరరెడ్డి తిరుపతి
అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. ముప్పైమూడేళ్ల కిందట ప్రతి నిత్యం కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో రూ. 5 లక్షల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుని ప్రతిరోజూ లక్షల మందికి కడుపు నింపుతోంది.
నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద çపథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టీటీడీ. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మొదట్లో తిరుమలలోని స్ధానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏప్రిల్ 6న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ. 5 లక్షల విరాళంతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే రూ. 60 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఆ తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింతగా ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో దానం అనే పదాన్ని అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ. భక్తులు ఇస్తున్న కానుకలు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అన్నప్రసాద ట్రస్టుకు భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది.
మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించిన టీటీడీ 2007 సంవత్సరం నుంచి టోకెన్లతో నిమిత్తం లేకుండా ఎవరికైనా భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో ప్రతిరోజూ దాదాపు లక్షమందికి, ఇతర చోట్ల పది నుంచి పదిహేను వేలమంది వరకు భక్తులకు అన్నప్రసాదం లభిస్తోంది.నానాటికీ పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదాన భవనం చాలక పోవడంతో టీటీడీ ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద ప్రాంగణాన్ని రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించింది. నాలుగువేల మంది భక్తులు ఏకకాలంలో భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా నిర్మించిన ఈ నూతన భవనాన్ని 2011లో ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. టీటీడీ సిబ్బందితో పాటూ శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రదేశాల్లోనూ టీటీడీ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాలలో కూడా అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. మూడేళ్ల కిందట తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా అన్నప్రసాదం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తిరుపతిలోని వసతిగృహ సముదాయాలకు అన్నప్రసాదం పథకాన్ని విస్తరించింది. తిరుమలతో పాటు పలుచోట్ల మొబైల్ çఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా ఆహార వితరణ ప్రారంభించింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాల్లోను, కాలినడక మార్గాల్లోను భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తోంది.
ఇటీవలి కాలంలో అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్ స్కీములను టీటీడీ ప్రవేశ పెట్టింది. వీటిలో భాగంగా రూ.6 లక్షలు విరాళం ఇస్తే ఆ దాత పేరుతో ఒకపూట అల్పాహారాన్ని భక్తులకు అందజేస్తారు. రూ.10 లక్షలు విరాళం ఇస్తే దాత పేరిట ఒకపూట అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. రూ. 25 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరిట ఒక రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇలా టీటీడీ అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు భక్తులు టీటీడీకి నిత్యం దాదాపు ఏడు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపుతూ కొంతవరకు భారాన్ని తగ్గిస్తున్నారు. మిగిలిన అదనపు వ్యయాన్ని టీటీడీ హుండీ ఆదాయం ద్వారా వచ్చే నిధుల నుంచి భర్తీ చేస్తోంది.
నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద çపథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్ వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టీటీడీ. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మొదట్లో తిరుమలలోని స్ధానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏప్రిల్ 6న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ. 5 లక్షల విరాళంతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే రూ. 60 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఆ తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింతగా ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో దానం అనే పదాన్ని అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ. భక్తులు ఇస్తున్న కానుకలు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అన్నప్రసాద ట్రస్టుకు భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది.
మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించిన టీటీడీ 2007 సంవత్సరం నుంచి టోకెన్లతో నిమిత్తం లేకుండా ఎవరికైనా భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో ప్రతిరోజూ దాదాపు లక్షమందికి, ఇతర చోట్ల పది నుంచి పదిహేను వేలమంది వరకు భక్తులకు అన్నప్రసాదం లభిస్తోంది.నానాటికీ పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదాన భవనం చాలక పోవడంతో టీటీడీ ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద ప్రాంగణాన్ని రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించింది. నాలుగువేల మంది భక్తులు ఏకకాలంలో భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా నిర్మించిన ఈ నూతన భవనాన్ని 2011లో ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. టీటీడీ సిబ్బందితో పాటూ శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రదేశాల్లోనూ టీటీడీ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాలలో కూడా అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. మూడేళ్ల కిందట తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా అన్నప్రసాదం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తిరుపతిలోని వసతిగృహ సముదాయాలకు అన్నప్రసాదం పథకాన్ని విస్తరించింది. తిరుమలతో పాటు పలుచోట్ల మొబైల్ çఫుడ్ కౌంటర్ల ద్వారా కూడా ఆహార వితరణ ప్రారంభించింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాల్లోను, కాలినడక మార్గాల్లోను భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తోంది.
ఇటీవలి కాలంలో అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్ స్కీములను టీటీడీ ప్రవేశ పెట్టింది. వీటిలో భాగంగా రూ.6 లక్షలు విరాళం ఇస్తే ఆ దాత పేరుతో ఒకపూట అల్పాహారాన్ని భక్తులకు అందజేస్తారు. రూ.10 లక్షలు విరాళం ఇస్తే దాత పేరిట ఒకపూట అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. రూ. 25 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరిట ఒక రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇలా టీటీడీ అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు భక్తులు టీటీడీకి నిత్యం దాదాపు ఏడు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపుతూ కొంతవరకు భారాన్ని తగ్గిస్తున్నారు. మిగిలిన అదనపు వ్యయాన్ని టీటీడీ హుండీ ఆదాయం ద్వారా వచ్చే నిధుల నుంచి భర్తీ చేస్తోంది.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తరలి వచ్చే భక్తులతో 365 రోజులూ తిరుమలకొండ కిటకిటలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల యాత్ర చేయాల్సిన భక్తులు తప్పనిసరిగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తిరుమలలో బస, శ్రీవారి దర్శన విషయాల్లో రిజర్వేషన్లు్ల తప్పనిసరి. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
* ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు తిరుమలలోని బస, శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, ఆర్జిత సేవలు ముందస్తుగా రిజర్వ్ చేసుకునే సౌకర్యం ఉంది. దేశవిదేశాల్లో ఎక్కడున్నా సరే ఇంటర్‌నెట్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది.
* ఇంటర్‌నెట్ ద్వారా సాధారణ సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు భక్తులు సులభంగా పొందవచ్చు. ఇక అతిముఖ్యమైన శ్రీవారి సుప్రభాతసేవ, అర్చన, తోమాలసేవ, విశేషపూజ, అష్ట దళ పాదపద్మారాధనసేవ, నిజపాద దర్శనం తదితర సేవలు బుక్ చేసుకునే సౌకర్యం కూడా టీటీడీ కల్పించింది. దీనికి సంబంధించిన కోటాను ప్రతి నెలా మొదటి శుక్రవారం కోటా విడుదల చేస్తారు. టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం పాస్‌వర్డ్‌తో ఒకరికి ఒక టికెట్టు చొప్పున కేటాయిస్తారు.
మన రాష్ట్రంతోపాటు చెన్నయ్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, ఇతర ముఖ్యనగరాల్లో మొత్తం 86 ఈ– దర్శన్ కేంద్రాలు టీటీడీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఫోటోమెట్రిక్ పద్ధతిలో భక్తుడి వేలిముద్ర, ఫోటో ద్వారా స్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదులు రిజర్వేషన్ చేసుకోవచ్చు.
* తిరుమలలో నిత్యం భక్తులకు 7 వేల వరకు అద్దె గదులు కేటాయిస్తుంటారు. ఇందులో పద్మావతి అతిథి గృహాల పరిధిలో మొత్తం 2 వేల గదులున్నాయి. రూ.500 నుంచి 6 వేల వరకు అద్దె కలిగిన గదులు కేటాయిస్తారు.
ఫోన్ నెంబరు 877–2263731
* గదులు కావాలంటే ఆధార్‌కార్డు / ఓటరు కార్డు/ పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది
* రూ.100 నుంచి రూ.7100 (జీఎస్‌టీతో కలిపి) వరకు అద్దెగదుల్లో అవసరమైన గదిని పొందవచ్చు
* సీఆర్‌వో విచారణ కార్యాలయ పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదులు మంజూరు చేస్తారు. వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు. సిఫారసు లేఖలపై కూడా భక్తులకు ఇక్కడే గదులు కేటాయిస్తారు.
ఫోన్ నెంబరు– 0822–2263492
* ఎంబీసీ–34లో పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి.
ఫోన్ నెంబరు : 0877–2263929, 2263523.
భక్తులకు గదులు లభించకపోతే కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం టీటీడీ ప్రత్యేకంగా నాలుగు ఉచిత యాత్రి సదన్లు నిర్మించింది. ఇందులో లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఉచిత భోజన సౌకర్యం, కళ్యాణకట్టలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి నగదు చెల్లించకుండానే అన్ని సౌకర్యాలు ఉచితంగా పొందవచ్చు.
* రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు.
* ఆ కోటాలో రోజూ కేటాయించే 26 వేల టికెట్లను ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తున్నారు. టీటీడీ యాప్ ద్వారా కూడా భక్తులు తమ సెల్‌ఫోన్ల నుండి టికెట్లు పొందవచ్చు.
* ఓ కుటుంబంలోని భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాలి. మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు సులభంగా లడ్డూలు పొందే అవకాశం ఉంది.
* ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ–దర్శన్ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని సుమారు 2500 పోస్టాఫీసులకు విస్తరించింది. రోజుకు 5 వేల టికెట్ల వరకు భక్తులు పోస్టాఫీసుల ద్వారా పొందే అవకాశం ఉంది.
* తిరుమలేశునికి నిర్వహించే తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం అరుదైన సేవల్లో సామాన్య భక్తులు స్వామిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది.
* ఆయా ఆర్జిత సేవలకు ముందు రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు తిరుమలలోని విజయాబ్యాంకు కౌంటర్‌లో తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్ నెంబర్ కంప్యూటర్‌లో నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. నమోదు చేసుకున్నవారిలో కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జితసేవా టికెట్లు కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుడి సెల్ నెంబరుకు సమాచారం అందజేస్తారు.
* వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తుల్లో ఒకరికి రాయితీ ధరపై రూ.20కి రెండు లడ్డూలు ఇస్తారు. మరో రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు. ఒక్కొక్కరు నాలుగు లడ్డూలు పొందవచ్చు.
* వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే కాలిబాటలో వచ్చిన భక్తుల్లో ఒకరికి ఒక ఉచిత లడ్డూ, రూ.20కి రెండు రాయితీ లడ్డూలు, రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తారు. అంటే ఒకరికి ఐదు లడ్డూలు లభిస్తాయి.
* రూ.300 టికెట్ల భక్తులకు టికెట్టుపై రెండు లడ్డూలతోపాటు అదనంగా రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు
* ఇక టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, జేఈవో సిఫారసులతో రూ.500 వీఐపీ టికెట్ల భక్తులు కూడా టికెట్టు తీసుకునే సందర్భంలో కనిష్ఠంగా రూ.50కి రెండు లడ్డూలు, రూ.150కి ఆరు లడ్డూలు అందజేస్తున్నారు.
*ఈ ఏడాది నుండి కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు టైమ్ స్లాట్ విధానం అమలు చేశారు. రోజుకు 20 వేల చొప్పున టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టికెట్లు ఇస్తున్నారు.
రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 31 కంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. దర్శన సమయం ఎక్కువ గంటలు పడుతుంటే లోనికి వెళ్లిన భక్తులు సులభంగా బయటకు వెళ్లి రావటానికి యాక్సెస్ కార్డులు ప్రవేశ పెట్టారు. ఫొటోమెట్రిక్ విధానంతో కూడిన కార్డులు పొందిన భక్తులు అందులో నిర్ణయించిన దర్శన సమయానికి తిరిగి వచ్చే అవకాశం టీటీడీ కల్పించింది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని పొందుతూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
* వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉచిత టెలిఫోన్ సౌకర్యం కల్పించారు. దీని ద్వారా భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్ల నుండే ఉచితంగా మాట్లాడవచ్చు. ఇక్కడే భక్తులకు దర్శన సమయం తెలిపేందుకు వీలుగా శ్రీవారి సేవకులతో హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు.
* శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది.కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్‌లైన్ టికెట్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా విధిగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలన్న నిబంధన ఉంది.
పురుషులు: ధోవతి–ఉత్తరీయం, కుర్తా –పైజామా
మహిళలు: చీర–రవిక, లంగా–ఓణి, చున్నీ/ పంజాబీ దుస్తులు, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది.
టీటీడీ కాల్‌సెంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877–22 33333, 2277777, 2264252
టీటీడీ వెబ్‌సైట్ :www.tirumala.org
ఈ–మెయిల్:www.tirupati.org
టీటీడీ కాల్‌సెంటర్: webmaster@.tirumala.org
సేవలు, వసతి ఆన్‌లైన్ బుకింగ్:www.ttdsevaonline.com
టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877–2263472
*ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు
*ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో 0877–2263261 ఫోన్ చేసి నేరుగా కార్యనిర్వహణాధికారితో భక్తులు మాట్లాడవచ్చు. టీటీడీ పరిధిలో తమకు ఎదురైన సమస్యలు, సంఘటనలపై ఫిర్యాదులు, పరిష్కార మార్గాలపై సూచనలు చేయవచ్చు.
అసౌకర్యానికి గురైన భక్తులు తమ ఫిర్యాదులను యంత్రాంగానికి తెలియజేసేలా కూడా టీటీడీ చర్యలు చేపట్టింది.
*వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజీ విచారణ కార్యాలయాల వద్ద ఈ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు
*ఎక్కడైనా ఉచిత సేవలకు, ఇతర కార్యక్రమాలకు డబ్బులు అడిగితే విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు.
*ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో నేరుగా కార్యనిర్వహణాధికారికి భక్తులు ఫిర్యాదులను, సలహాలను అందజేసే సౌకర్యం కూడా ఉంది.
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలను టీటీడీ అందజేస్తోంది. దాతలకు పాస్ పుస్తకాలు ఇస్తారు. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం... 087722–63472, 2263727కు సంప్రదించవచ్చు.
అన్నప్రసాదాల తయారీ కోసం రోజూ టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాల కోసం 0877–226458 నెంబరుకు సంప్రదించవచ్చు.
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆ పైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర సత్కారాలను టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్:087722–63472, 2263727 నంబర్లకు సంప్రదించవచ్చు.
తిరుమలలోని టీటీడీ పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
*భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి
*వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు గుర్తింపు కార్డులు చూపాలి
*ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు, ఓటరు కార్డు .. వంటి వాటిల్లో ఫొటోతో ఉన్న వాటిని అందజేయాలి.
No comments:
Post a Comment