మానవ జన్మలో ఆశ్రమ ధర్మాలు చాలా ముఖ్యమైనవి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సంన్యాస ఆశ్రమాలు మానవ వ్యక్తిగత జీవన పురోగతిని తెలియజేస్తాయి. బ్రహ్మచర్యం- విద్యార్జనకు, గృహస్థాశ్రమం- త్రివిధ బుణాలను తీర్చటానికి, వాన ప్రస్థాశ్రమం- సంసారిక విషయాల నుంచి దూరంగా తొలగి వ్యవహాలను సంతానానికి అప్పచెప్పటానికి, సంన్యాశ్రమము- బ్రహ్మజిజ్ఞాస నిబద్ధులై ఎప్పుడూ పరమాత్మను శ్రవణ, మనన నిధి ధ్యాసనలు చేస్తూ ముక్తిని పొందటానికి ఉద్దేశించారు. ఈ ఆశ్రమాలలో సంన్యాశ్రమము అత్యంత శ్రేష్ఠమైనది. సంన్యాసులయందు పరమహంస సంన్యాసులు అత్యంత శ్రేష్ఠులు. ఈ సంన్యాసాశ్రమాన్ని తృతీయ జన్మముగా భావిస్తారు. దీనిని మనం మరో కోణం నుంచి కూడా చూడవచ్చు. పరమాత్మకు స్థావర, జంగమము అనే రెండు రూపాలుంటాయి. స్థావర స్వరూపము సుందర కేశవాది విగ్రహములు. జంగమ స్వరూపమే సంన్యాసులు. హిందూసంప్రదాయంలో వీరి రక్షణ పోషణ బాధ్యత గృహస్థులదే. శాస్త్ర ప్రకారం ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి. అయితే వానకాలం వచ్చినప్పుడు ఈ సంచారం కష్టమవుతుంది. దీనినే చాతుర్మాస్య వ్రతంగా పిలుస్తాం. ఈ సమయంలో వీరు నియమంతో అనుష్ఠానాలు చేస్తారు. ఆషాఢ(శుద్ధ) శుక్ల పౌర్ణమి నుండి కార్తీక శుక్ల పౌర్ణమి వరకు యత్రీంద్రులందరూ ఈ వ్రతమును ఆచరిస్తారు. ‘‘పక్షా వై శ్రుతి చోదనాత్’’ అనే ఆధారంతో నాలుగు పక్షముల కాలం కూడా నియమంతో ఉంటారు. ఈ దీక్ష కోసం క్షౌర, మృత్తికా స్నానాది ఆశ్రమవిహిత అనుష్ఠానములైన తర్వాత శిష్యుల శ్రేయస్సుకై, తమ అనుష్ఠానమునందు వికల్పం రాకుండా నిత్యం చేసే పూజలయందు, యెడబాటు రాకుండా శ్రీకృష్ణ పంచకం, గణేశ, క్షేత్ర పాలక, దుర్గ, సరస్వతి, అష్టదిక్పాలకులను పూజించి దీక్ష ప్రారంభిస్తారు. సంన్యాసులు చేయు ఈ వ్యాసపూజ సందర్శనము, పాదపూజ, భిక్షావందనము, సేవచేయుట ఈ దీక్షా కాలమందు మహాపుణ్యం. సాధారణంగా వానలు పడినప్పుడు మన చుట్టూ ప్రపంచం పచ్చగా మారుతుంది. భూమి క్రిమికీటకములు, సస్యసమృద్ధులతో నిండి ఉంటుంది. హిందుమతంలో అహింస పరమ ధర్మమే కాదు జీవన విధానం కూడా. అందువల్ల ఈ దీక్షాకాలంలో క్రిమికీటకాదులకు కూడా హాని జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా ఈ చాతుర్మాస దీక్ష కేవలం సంన్యాసులకు మాత్రమే కాదు. గృహస్థులు కూడా చాతుర్మాస దీక్ష చేస్తున్నవారిని దర్శించటం వల్ల ఫలితం ఉంటుంది.
Thursday, 30 July 2015
చాతుర్మాస్య దీక్షా

Labels:
No Category
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment