బర్బరీకులు ఎవరు, ఎక్కడివారు?
మహాభారతంలో ‘బర్బరీకుని’ గురించి వివరించ ప్రార్థన.
వసిష్ఠ మహర్షి దగ్గర వున్న నందినీ ధేనువును విశ్వామిత్రుడు అపహరించ ప్రయత్నించగా, అప్పుడు వసిష్ఠ మహర్షి అనుమతితో ఆత్మరక్షణకోసం నందినీ ధేనువు తన శరీర భాగాలలోంచి రకరకాల ఆటవిక జాతుల్ని సృష్టించేసింది. వారిలో ఆమె పాల నురుగు నుంచి పుట్టినవారు ‘బర్బరులు’ వారంతా కలిసి విశ్వామిత్రుణ్ణి ఓడించటం పూర్తయినాక సృష్టికావించబడిన ఆటవిక జాతిలు వారంతా తలోమూల అటవీ ప్రాంతాలలో ఆటవికులుగా స్థిరపడిపోయారు. ఆ వరుసలో బర్బరులు నివసించిన ప్రాంతానికి బర్బరీక దేశమనే పేరు ఏర్పడింది. ఆ దేశ నాయకుడికి బర్బరీకుడు అనే వ్యవహారం ఏర్పడింది. రాజసూయ యాగ సందర్భంలో పాండవులు బర్బరీకులను జయించినట్లుగా భారతంలో వున్నది.
No comments:
Post a Comment