Wednesday, 31 August 2016

వినాయకుడు







వినాయకునికి ఎలక వాహనం ఎందుకు?
“గణపతిది చిన్నపిల్లవాడి మనస్తత్వం. గణాధిపతి, గణాధ్యక్షుడు అని అంటూ ఉంటాం. ప్రమధ గణాధీశుడైనా, అతి పెద్ద జంతువైన గజముఖాన్ని ముఖంగా గలవాడైనా చిట్టి చిన్నబాల గణపతి అమాయకంగా నవ్వుతున్నట్లే ఉంటుంది. (ఇది కేవలం నా భావమే సుమండీ ! మీరు కూడా పరికించి చూడండి.) తమ్ముడితో సమంగా ప్రపంచ ప్రదిక్షణ చెయ్యలేక గెలిచే విధానాన్ని అమ్మనే అడిగి తెలుసుకున్న గడుసు గణపతి మొహం పాలుగారే పసి మోములాగానే ఉంటుంది. గణపతి ముఖం చాలా అమాయకంగా, పసితనంతో ఓడుతున్నట్లు వుంటుంది.”

ఆకాశతత్త్వం - పరమేశ్వరుడు
పృధ్వీతత్త్వం - పార్వతి మాత
జలతత్త్వం - గంగమ్మ

పృధ్విని, జలాన్ని తేజస్సుతో మిళితం చేసింది పరమేశ్వరి. తన శరీరం నుండి చందన గంధ పరిమళాల నలుగుతో సరిపాళ్ళుగా కలిపింది. ఇక్కడితో పృధివి, ఆకాశం, వాయువు, జలం, అగ్ని ఈ అన్ని తత్త్వాల సమాహారంగా మూలపదార్థం సిద్ధమయ్యింది. సంకల్పమాత్రం చేత ప్రాణం తనంతట తానే వచ్చి పార్వతీ పుత్రుణ్ణి ఆశ్రయించుకు కూర్చుంది. అన్ని తత్త్వాలు సమ్మిళితమైనా వినాయకునిలో పృధ్వీతత్త్వం పాళ్ళు ఎక్కువ. అందుకే భూమికి కలుగులు చేసే ఎలుకను తన చెప్పుచేతల్లో వుంచుకున్నాడు భూమి ప్రియుడు.”


ఈ మధ్యన ఒక దేవాలయంలో వినాయకుడికి చీర కట్టారు. అది వందల సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పం !
పార్వతీదేవి పాపాయి ప్రాణం పోసుకోగానే ఆకాశంలో స్త్రీ దేవతల కలకలం మొదలయిందట! ఆ జగన్మాత ఎంతో ఆనందిచిందట. వీరంతా నా బిడ్డకు ఏవేవో మంచి కానుకలే తెచ్చి ఉంటారని ఆశగా చూసేసరికి ఆ వచ్చిన వాళ్ళ గొంతుకకు వెలక్కాయ అడ్డు పడినట్లయ్యింది. వాళ్ళు ఆత్రంగా ఉత్తి చేతులతో, ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా వచ్చారు. అందరికన్న ముందు లక్ష్మీదేవి తేరుకుంది.

ఈశ్వరీ నీ బిడ్డకు నా వైష్ణవీ శక్తిని దత్తం చేస్తున్నాను అని పలికిందట వైష్ణవీ దేవీ పలికిందట. వెంటనే బ్రహ్మదేవుని సతి బ్రాహ్మీణీ బ్రాహ్మ శక్తిని కానుక ఇస్తున్నాను అన్నది. ఇక ఎవ్వరూ తడుముకోలేదు. వారాహి, మహేంద్రి, చాముండి, కౌమారి మొదలైన సప్తమాతృకలు సమస్త దేవతలు వారిలోని శక్తులను కానుక ఇచ్చేసరికి గణపతి శక్తి గణపతి, లక్ష్మీ గణపతి అని అనేక రూపాలతో వారికి కనుపించాడు. అనేక మంది ఋషులకు అనేక మంత్రాలు దర్శనమిచ్చాయి.

No comments:

Post a Comment