చెడుపై మంచి గెలిచిన రోజు..
అధర్మాన్ని ధర్మం ఓడించిన రోజు..
అజ్ఞానంపై జ్ఞానం పైచేయిగా నిలిచిన రోజు..
అసత్యంపై సత్యం విజయం పొందిన రోజు..
దుఖం, దుర్భుర్ది, దురాశ, దుర్మార్గం, దుర్నీతి వంటి దుర్గతులన్నింటినీ దుర్గాదేవి తుదముట్టించిన రోజు..
విజయదశమి.
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జగన్మాత ధరించిన తొమ్మిది అవతారాల పరమార్థాన్ని మానవాళికి బోధిస్తుంది దసరా. కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను జయించి, నూతన జీవన మార్గాన్వేషణ కోసం శోధించమనే సందేశాన్ని చాటుతుంది దసరా. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఎవరెలా జరుపుకున్నా అమ్మ ఆరాధనే వాటన్నింటి అంతరార్థం!
దుర్గామాతగా పూజించినా.. భవానీగా పిలుచుకున్నా.. బతుకమ్మగా కొలిచినా... కాళీమాత అన్నా, దేశ మంతటా ఆ లోకపావని స్మరణే! అందుకే దసరా దేశవాళి పండుగ!
విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. ఎన్నో ప్రాంతాల సంగమం భాగ్యనగరం. మరి మన నగరంలో దసరా పండుగను ఎవరు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం!
దసరా రోజు సంధ్యావేళ పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందని తెలుగు ప్రజల విశ్వాసం. దుర్గామాత పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకుంటారు. భాగ్యనగరంలో పాలపిట్ట కనిపించడం కష్టమే! అందుకే చాలా మంది శమీ పూజతోనే సరిపెట్టుకుంటున్నారు.
అంటూ జమ్మి చెట్టు లేక కొమ్మకైనా పూజచేస్తారు. శమీ పత్రం శత్రువుల్ని నాశనం చేస్తుంది. అర్జునుడిని ధనుర్ధారిని చేసింది.
శ్రీరామచంద్రుడికి ఇష్టమైనది జమ్మి చెట్టు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా రోజు పూజ చేసిన జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారు. ఆ బంగారాన్ని బంధు, మిత్రులు, ఇరుగుపొరుగు వారందరికీ పంచుతూ, ఆలింగనం చేసుకుంటారు. దాన్నే అలయ్-బలయ్ అంటారు. ఇది తెలంగాణ సంస్కృతిలో ఉట్టిపడే ఐక్యతారాగం.
కన్నడిగుల ఘట ప్రతిష్టాపన
దసరాను భాగ్యనగర కన్నడిగులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే రోజున ఘట ప్రతిష్టాపన చేస్తారు. అంటే కొత్త మట్టి మూకుడులో మట్టిపోస్తారు. దుర్గాదేవి ప్రతిమను ప్రతిష్టించడంతోపాటు ఆ మట్టిలో నవధాన్యాలను చల్లుతారు. ఆ 9రోజుల పాటు అమ్మను కొలుస్తూ, నిత్యం ఉదయం, సాయంత్రం పూజలో భాగంగా ఆ మూకుడులో నీళ్లు పోస్తారు. మొలకెత్తిన ఆ విత్తులు 9వ రోజుకి మొక్కలవుతాయి. 10వ రోజు దర్గాదేవి ఆరాధనచేసి, ఆ ఘటాన్ని(మూకుడు) గుడిలో వదిలొస్తారు. జీవిత సత్యాలను బోధించే జానపద గీతాలతో భవానీమాతను కొలుస్తారు.
గుజరాతీల నృత్య కొలుపు
గుజరాతీ నవరాత్రి ఉత్సవాలు ప్రత్యేకం! శరన్నవరాత్రుల్లో మొదటిరోజు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను కొలిచి, దుర్గామాత ప్రతిమను ప్రతిష్టిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం అమ్మను కొలుస్తారు. గానం, గీతం అమ్మకు ప్రీతికరం. అవి పూజలో అంతర్భాగం కూడా! అందుకే తొమ్మిదిరోజుల పాటు రోజూ సాయంత్రం 9గంటల నుంచి తెల్లవారుజాము 4గంటల వరకు గార్భా, దాండియా నృత్యాలతో అమ్మను ఆరాధిస్తారు. 10వ రోజు వ్యాపారస్తులు దుకాణాల్లో, వృత్తిదారులు తమ పనిమట్లకు, వాహనాలకు పూజచేస్తారు. దసరారోజు అమ్మను కొలిచి, వెళ్లిరావమ్మా అంటూ దుర్గామాత ప్రతిమలను గంగ ఒడికి చేరుస్తారు.
మలయాళీల వాగ్దేవి ఆరాధన
పండుగ, పూజాధికాల్లో దక్షిణ భారతదేశంలో కేరళ ప్రత్యేకమైంది. దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని కొలుస్తారు. విజయదశమి రోజున కేరళీయులు ప్రత్యేకంగా విద్యాపూజచేస్తారు. పిల్లలందరిచేత దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తారు. నగరంలో 4లక్షల మందికిపైగా కేరళీయులు నివసిస్తున్నారని మలయాళీ అసోసియేషన్, హైదరాబాద్ నిర్వాహకులు చెబుతున్నారు. దసరా నాడు బొల్లారంలోని అయ్యప్ప దేవాలయం, రామాంతపూర్‌లోని అయ్యప్ప క్షేత్రానికి పెద్ద ఎత్తున నగర కేరళీయులంతా విచ్చేసి, సరస్వతీ పూజ చేస్తారు.
రావణ దహనమే దసరా వేడుక
రావణుణ్ణి రాముడు దసరా రోజున సంహరించాడనేది ఈశాన్య భారతీయుల విశ్వాసం. విజయదశమి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా వాసులు రావణప్రతిమను దహనం చేస్తారు. ఢిల్లీలోని రామలీల మైదానంలో పెద్ద ఎత్తున రావణ దహనం కార్యక్రమం చేస్తారు. అలాగే భాగ్యనగరంలో స్థిరపడిన ఉత్తరభారతీయులు ఆ ఆచారాన్ని నిర్వహిస్తారు. రావణుడి ప్రతిమ కాలుతుంటే, హర్షధ్వానాలతో ఆనందంతో నోరుతీపి చేసుకుంటారు. ఉత్తర భారతదేశానికి చెందిన అగర్వాల్ కుటుంబీకులు ఇంటి గోడలు, వంటగదిలో ప్రత్యేక శక్తిమాట గుర్తులు వేసి, పూజిస్తారు. మట్టికుండలో నవధాన్యాల విత్తనాలు వేసి, ఆరాధిస్తారు. దశమినాడు ఆ మొలకలను చెవిలో, తలపాగాలో ఉంచుకొని పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు.
బెంగాలీల దుర్గా పూజ
శరన్నవరాత్రుల ఉత్సవాలు అనగానే వెంటనే గుర్తొచ్చేది బెంగాలీ దుర్గాపూజ. పశ్చిమ బంగా ప్రజలకి అత్యంత ప్రీతికరమైన పండుగ దసరా. నవరాత్రుల సమయంలో కలకత్తా కాళీపూజ దేశవ్యాప్తంగా పేరు. నగరంలో స్థిరపడ్డ బెంగాలీలు 9రోజులు, 5రోజులు, 3 రోజులు... దుర్గామాతను ప్రతిష్టించి, పూజలు చేస్తారు. మొదటి మూడు రోజులు అమ్మవారిని పూలు, ఫలాలతో పూజిస్తారు. బెంగాల్‌లో అమ్మవారికి జంతుబలి ఇస్తారు. అయితే, నగరంలో నివసిస్తున్న బెంగాలీలు మాత్రం జంతుబలికి బదులుగా గుమ్మడి, కొబ్బరికాయ వంటి వాటిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. విజయదశమి రోజున నిమజ్జనం చేస్తారు.
దశమి నాటి నుంచి పూజ ప్రారంభం
ఒరిస్సా వాసులకు అత్యంత పెద్ద పండుగ దసర. దేశమంతటా విజయదశమి పది రోజుల ముందు నుంచి దేవీ పూజ మొదలవుతుంది. కానీ ఒరిస్సా వారు మాత్రం విజయదశమి నుంచి 10 రోజుల పాటు అపరాజితాదేవి పూజ చేస్తారు. వీరు తమిళనాడు కేలండర్‌ను అనుసరిస్తారు. అమావాస్యను వీరు పవిత్రమైన రోజుగా భావిస్తారు. దేవీ పూజలో వచ్చే అమావస్యనాడు ప్రత్యేక ఆరాధన చే స్తారు. దుర్గాపూజ 10రోజులూ రోజుకి 10రకాల నైవేధ్యాలతో మాతను కొలుస్తారు.
మరాఠీల దసరా వేడుకలు
నగరంలో స్థిరపడ్డ మహరాష్ట్రీలు నవ చండీ పూజను ఘనంగా జరుపుతారు. ఆశ్వీయుజ మాసం తొలిరోజున ఘన ప్రతిష్ఠాపన చేస్తారు. అమ్మప్రతిమను నెలకొల్పుతారు. అమ్మరూపు ముందు షోఢసోపచార పూజతో పవిత్ర కలశం పెట్టి, దాని చుట్టూ మట్టిపోస్తారు. అందులో గోధుమ, వరి, జొన్న గింజలు చల్లుతారు. అదే ఘట ప్రతిష్టాపన. తొమ్మిదిరోజుల పాటు నిత్యం ఆరాధిస్తారు. తొమ్మిదవ రోజున హోమం చేస్తారు. 10వ రోజు శస్త్రపూజ(ఆయుధ పూజ) నిర్వహిస్తారు. విజయదశమి నాడు సీమోల్లంఘన చేస్తారు. అనగా అమ్మవారి ఘటాన్ని జరిపి, వచ్చిన మొలకలతో మాతను పూజిస్తారు. పూజ అనంతరం అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేయడంతో మహరాష్ట్రీయుల దసరా వేడుక ముగుస్తుంది.
బొమ్మల కొలువు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల వారు విజయదశమి రోజున బొమ్మల కొలువు నిర్వహిస్తారు. రామాయణగాథ, దక్షయజ్ఞం వంటి పురాణ, ఇతిహాస కథలను వివరించేవిధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. రకరకాల పింగాణీ, మట్టి బొమ్మలను అమరుస్తారు. అందునా గౌరీ, పార్వతీ ప్రతిమలనూ ఉంచుతారు. అలా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువుకి పలువురు పేరంటాళ్లను, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానిస్తారు. మహిళలు, అమ్మాయిలు, యువతులంతా చేరి రామాయణ, భారత కథలను చెప్పుకుంటారు. గౌరీ, ఆదిశక్తి పాటలను పాడతారు. వచ్చిన పేరంటాళ్లకు తాంబూలం ఇచ్చి పాద నమస్కారం చేస్తారు.
అంతా ఒక్కటై..
ఒకే నగరంలో.. ఒక పండుగను ఎన్ని విధాలుగా జరుపుకుంటున్నారో కదా! ఎవరు ఎలా జరుపుకున్నా, ఆ పండుగ పరమార్థం మాత్రం ఒక్కటే ఆదిశక్తి ఆరాధన. నలుగురితో కలిసి మెలగమని, నలుగురికి మంచి పంచమని, నలుగురితో నడవమని చెప్పడమే విజయదశమి అంతరార్థం. ఆ మాటకొస్తే ప్రతి పండుగ పరమార్థం కూడా. సృష్టిలయత్వాన్ని, ప్రకృతి అంతర్లీనతనూ అర్థంచేసుకొని, తద్వారా తమను తాము తీర్చిదిద్దుకోమని బోధించడమే దసరా సందేశం.
దసరా సంగతులు
చిన్న, పెద్ద, ఆడ,మగ అన్న తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ దసరా. సామాజిక సందేశంతో పాటు, స్త్రీత్వాన్ని ఇముడ్చుకున్న పండుగ విజయదశమి. మరి కొందరు సినీ నటీమణులు, గాయకులు, కళాకారులు దసరాను ఎలా జరుపుకుంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం!

‘‘శమీ శమయితే పాపం..శమీ శత్రు వినాశినీ | అర్జునస్య ధనుర్థారీ..రామస్య ప్రియదర్శినీ’’

No comments:
Post a Comment