• హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రంలో పడవేశాడనీ, అప్పుడు శ్రీహరి వరాహావతారం దాల్చి, భూమిని పైకి లేపి, వాడిని సంహరించాడంటారు కదా, మరి అప్పుడు భూమి ఉన్న ప్రదేశం ఏది?
మనకున్న పధ్నాలుగు లోకాల్లోనూ, ఏ లోకానికి ఆ లోకం కొంత కొంత ప్రాణి సమూహంతోనే ఉంది. మనం ఈలోకానికి చెందినవాళ్లం కాబట్టి భూమిని చుట్టి పడేశాడని చెప్పగానే అసలు భూమే లేదని భావిస్తాం. శ్రీమద్రామాయణంలో సగర పుత్రులు భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకూ వెళ్లారని ఉంది. మరి వాళ్లెక్కడ నిలబడగలిగారు భూమి లేకపోతే?
కాబట్టి ఏ లోకానికి సంబంధించిన ప్రాణులు ఆ లోకంలో తిరుగాడేందుకు వీలుగా అక్కడ కూడా భూమి ఉందన్నమాట.
No comments:
Post a Comment