1. వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు ఏ పర్వతంపై కొన్నాళ్లు నివాసమున్నారు?
చిత్రకూట పర్వతం
2. వాలి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి సుగ్రీవుడు ఏ పర్వతంపై తలదాచుకున్నాడు?
రుష్యమూక పర్వతం
3. సీతాన్వేషణ కోసం లంకకేగిన ఆంజనేయుడు ఏ పర్వతం నుంచి సముద్ర లంఘనం చేశాడు?
మహేంద్రగిరి
4. సముద్రం దాటుతున్న ఆంజనేయుడికి ఆతిథ్యమిచ్చిన పర్వతం ఏది?
మైనాక పర్వతం
5. సముద్రం దాటిన ఆంజనేయుడు లంకలోని ఏ పర్వతంపై మొదట కాలుమోపాడు?
లంబగిరి
ఋష్యమూక పర్వతము
కిష్కింధకు సమీపమునగల ఒక పర్వతము పేరు ఋష్యమూకము. ఋష్యములు అను ఒక జాతి జింకలు మౌనముగా తిరుగుచుండుటచే దానికి ఋష్యమూకము అను పేరు ఏర్పడినది. దీనిపై మతంగమహర్షి తపస్సు చేసుకొనుచుండెడి వాడు. వాలి దుందుభియను రాక్షసుని చంపి అతని శరీరమును ఎగురవేయగా ఆ రక్తము వచ్చి, మతంగ మహర్షి పై బడెను. అందులకు కుపితుడై ఆ మహాముని “వాలి ఈ పర్వతముపై అడుగుపెట్టినచో మృతుడగుగాక!” అని అతనిని శపించెను. కనుక వాలి ఆ కొండ మీదికి రాజాలడు. అందు వలననే వాలికి భయపడిన సుగ్రీవుడు తల దాచుకొనుటకై ఈ పర్వతమును ఆశ్రయించెను.
1. రావణ బ్రహ్మ తండ్రి పేరు?
విశ్రవసు బ్రహ్మ
2. రావణాసురుడి భార్య అయిన మండోదరి తండ్రి ఎవరు?
మయాసురుడు
3. రావణ పుత్రుడైన ఇంద్రజితకు గల మరోపేరు?
మేఘనాథుడు
4. యుద్ధానికి బయల్దేరే ముందు ఇంద్రజిత ఏ హోమం చేసేవాడు?
నికుంభల
5. ఇంద్రజిత భార్య పేరు ఏమిటి?
సులోచన
ప్రత్యంగిరా :
ప్రత్యంగిరా విద్య అనేది త్రిప్పి కొట్టే విద్య. పర ప్రయోగములను త్రిప్పి కొట్టుట కొరకు, శత్రువుల మీద ప్రయోగములు చేయుట కొరకు, భూత, ప్రేత ఇతర అన్ని దుష్ట శక్తులను, మరియు కొన్ని రోగములను పార ద్రోలుటకు దీనిని ప్రయోగించేదరు. దుష్ట గ్రహ, పిశాచ, రోగ భాధా నివారణ కోరకు ప్రత్యంగిరా హోమము చేయ బడును. ఏ శత్రువు ఎంతటి ప్రయోగము చేసినా దానిని నివారించటమే గాక తిరిగి వెళ్లి పంపిన వానినే చంపి వేసే లక్షణం ఈ విద్యలో కలదు.. ఇతర దేవతలను పూజించినట్లు గాదు ఈ దేవత పూజ. దీనికి గాను ప్రత్యేకమైన కల్పము కూడా వున్నది. భాగవతంలో కాశీ రాజు శ్రీకృష్ణుని మీద అభిచారిక హోమము చేయించి, కృత్యను ప్రయోగిస్తాడు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడు అభిచారిక హోమము చేయించి, పాండవుల మీదకు మంత్ర ప్రయోగముతో కృత్యను పంపుతాడు. ఇలా చాలా చోట్ల ఈ ప్రయోగములు వున్నవి. ఉత్తరాదిన హిమాలయాల్లోని మానససరోవరం సమీపంలో 'కృత్య'గానూ దక్షిణాదిన కుంభకోణం (తమిళనాడు)లోని అయ్యావరే అడవిలో నికుంభిలగానూ... ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవి ని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవి ని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి. రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం వెుదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ని జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.ఘంటాక ర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదు ర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందన ి నమ్మిక. నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.
No comments:
Post a Comment