Friday, 12 May 2017

సనకసనందాదులు

సనకసనందాదులు లేదా సనత్ కుమారులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు మరియు సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు. ధర్మప్రజాపతి పుత్రులు. వీరితల్లి హింస. సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పం వలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు. సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సు చేస్తూ కాలం గడిపారు. బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు.

భాగవత పురాణం 12 మంది మహా భక్తులు పేర్కొనబడ్డారు. వీరు జీవన్ముక్తులైనా విష్ణువు భక్తులై దేశ సంచారులుగా భగత్సేవచేస్తూ జీవిస్తారు. అందరిలోకి పెద్దవారైనా సనత్ కుమారులు చిన్నపిల్లలుగా సంచరిస్తుంటారు. వీరు హిందూ పురాణాలో విశిష్టమైన పాత్ర పోషించారు.

ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనకసనందాదులు వైకుంఠం చేరుకొనగా వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను "భూలోకంలో అరిషడ్వర్గాలకు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు - శత్రువులు ఆరుగురు) లోనయ్యే జన్మలు పొందుదురు గాక అని శపించారు. జయ విజయులు విషయాన్ని గ్రహించి శాప విమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.

కృతయుగములో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు
త్రేతాయుగములో రావణాసురుడు, కుంభకర్ణుడు
ద్వాపరయుగము
లో మందు శిశుపాలుడు, దంతవక్ర్తుడు

No comments:

Post a Comment