మానవ జన్మ దుర్లభం
సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది లభించడం చాలా కష్టం అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి. ఒక్కసారి మానవ జన్మలోకి ప్రవేశించాడు అంటే, ఎంతెంతో పుణ్యం, ఎన్నో జన్మల సుకృతం, భగవంతుని యొక్క దయ చేరితే మానవ జన్మ లభిస్తుంది. ఏమిటి మానవ జన్మ యొక్క గొప్పతనం అంటే మళ్ళీ ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలలోకి రాకుండా నేరుగా ఈ మానవ జన్మ నుండి తరించే అవకాశం ఉంది. మిగతా జన్మలలోకి వెళ్తే అట్లా తరించే అవకాశంలేదు, క్రమంగా ఒక్కో మెట్టు ఎక్కి వచ్చినట్లు ఒక్కో జన్మ మారుతూ రావల్సిందే. మిగతా జీవులు ఏకాస్తనైనా తరించాలి అంటే అది మానవుడి అనుగ్రహం వల్ల తప్ప వాటంతట అవి తరించలేవు, ఏమో భగవంతుడు నేరుగా తరింపజేస్తే అది వేరే విషయం.పశుః మనిష్యః పక్షీవా ఏష వైష్ణవ సంశ్రయాః |తేనైవ తేప్రయాస్యంతి తద్విష్ణోపరమంపదం ||ఎప్పుడైతే ఒక వైష్ణవుడిని ఆశ్రయించినప్పుడు, వైష్ణవుడి అభిమానాన్ని పొందినప్పుడు పశువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ విష్ణు లోకమైన పరమపదానికి వెళ్ళగలవు. మానవ జన్మకు ఉత్తమమైన యోగ్యత ఉంది. మననం, ఆ మననానికి తగ్గ కర్మ చేయగలిగేవాడు మానవుడు అంటే. మానవుడు తన స్థితిని, గతిని గురించి మననం చేయగలడు, ఆ చేసినదాన్ని కార్య రూపంలోకి తేగలడు. మిగతా జంతువులు కొంతవరకే ఆలోచన చేయగలుగుతాయి, కేవలం తన శరీరం, శరీర సంరక్షణ వరకు మాత్రమే ఆలోచన సాగుతుంది. శరీరం పెరుగుతూ వస్తుంది, తిరిగి క్షీణిస్తుంది, శరీరం మారుతుంది కానీ మార్పులేని నేను అనేది ఎప్పటికి మార్పుచెందక ఉన్నాను అని గుర్తించగలడు మానవుడు. ఈ పరిణితిని గుర్తించిన వాడిని మరొక్క అడుగు ముందుకు వెళ్ళమని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు "తదాదేహాంతర ప్రాప్తిః ధీరః తత్ర నముహ్యతి" రెండో అధ్యాయంలో. వయసు పెరిగిన కొద్ది శరీరం యొక్క సామర్థ్యం మారుతోంది, ఈ శరీరం పోయి మరొకటి రావడం కూడా ఇట్లానే ఉంటుంది. ఒక చిన్న పిందగా ఉన్నది కాయగా మారుతుంది, ఆకాయ పండుగా అయి రాలి పోతుంది ఒకనాడు. మనం కూడా అట్లానే పక్వంచెంది బయటికి వెళ్ళాలి, ముందే రాలిపోకూడదు. అందుకే పక్వం చెందటానికి ఆలోచించాలి. అది ఆలోచించగలిగితే జరిగే మార్పుల్లో ఏడుపు రాదు. రాలిపోతుంది అంటే కూడా ఏడుపురాదు, వాడిని ధీరః అని అంటారు. 'నముహ్యతి' బుద్దిని అట్లా వాడుకో గలిగిన వాడు మోహంచెందాల్సిన పని లేదు. ఏడిచే పని వానికి రాదు. ఇదే భగవంతుడు చెప్పినది. మనం ఇక్కడ ఉండగా హాయిగా బ్రతికేట్టు చేద్దాం అనేది ఆయన సంకల్పం. అందుకే మనకోసం ఆయన ఇన్ని ఉపదేశాలు చేయడం, మనకే ఎందుకు చేయాలి అంటే గుర్తించగలిగే ప్రాణి మనిషి కనుక. మిగతా జంతువులు గుర్తించలేవు.
మానవ జన్మ ఎక్కువ కాలం ఉండదు. ఉన్న కాలాన్ని సక్రమంగా వాడుకోవాలి. "దుర్లభో మానుషోదేహః" శరీరం లభించడమే చాలా కష్టం, "దేహినాం క్షణ భంగురః" లభించినది ఒక క్షణమంత కూడా ఉండదు. "మిన్నిన్ నిలయిల మన్ను ఇఱాక్కెగళ్" అని చెబుతారు నమ్మాళ్వార్. ఇది మెరుపు కంటే కూడా ప్రమాదకరమైనది. మెరుపు ఎట్లా ఐతే పోయేదో, ఆ వెలుతురును పట్టించుకోం, అట్లానే శరీరం పోయేది అని తెలిసి కూడా దానికోసం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారే! పోయేదే అయినా ఇది పోయేది అని అనుకోనివ్వటం లేదు. కేవలం శరీరంకోసం బ్రతుకుతున్నాం అంటే ఇది ఎంత ప్రమాదమైనదో గుర్తించాలి. తెలియని శత్రువువంటిది అని చెబుతాడు నమ్మాళ్వార్. మెరుపు పోతుందని తెలుసు మనం వాడుకోం, అందుకే ఆ మెరుపే నయం. ఇట్లాంటి స్థితిలో మనం ఎన్నో జన్మలలో ఒక సారు మనిషి అయినప్పుడు దైవాన్ని గురించి ఆలోచించి, ఆ జ్ఞానాన్ని ఇచ్చే మహానుభావులని విశ్వసించి వారికి తగినట్లు బ్రతికగలిగితే, అట్లాంటి జన్మ కోటికి ఒకటైనా ఉంటుందో లేదో అని చెప్పవచ్చు. "తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం" మానవ జన్మలభించడమే గొప్ప అంటే, అట్లాంటి మానవ జన్మలో దైవాన్ని గుర్తించి బ్రతకడం, వైకుంఠ ప్రియులైన వారి దర్శనం లభించడం, వారి అభిమానం పొందటం ఎంత కష్టమో అనేది ఋషివాక్కు!! పరాశర మహర్షి వంటి వారికే అట్లా అనిపిస్తే ఇక మన గురించి ఆలోచించాలి. ఇవన్నీ మనిషికి చెప్పాల్సొచ్చింది, అది చెప్పడానికే రామావతారం.
మానవ జన్మని ఎట్లా వాడుకోవాలో తెలిపేదే రామావతారం
మనిషి బుద్దిని సరిగ్గా వాడుకోవాలంటే కొన్ని స్థాయిలు ఉన్నాయి. మొదట శరీరాన్ని గుర్తించాలి. శరీరానికి తగినట్లు పనిచేయాలి. శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, శరీరాన్ని పోషించుకోవాలి, దానికి తగినట్లు పనిచేయాలి, పనిచేయడానికి వీలయ్యేట్టు ఆలోచించాలి. ఇది ఒక మెట్టు. ఆలోచనలలో ఒక భాగం శరీరం కోసం వాడుకోవాలి, కానీ అక్కడికే సర్వస్వం కాదు, ఇక్కడితోనే ఆగిపోవడం కాదు, ఇది ఒక భాగమే. శ్రీకృష్ణుడు 6వ ఆధ్యాయంలో "యుక్త ఆహార యుక్త విహార యుక్త చేష్టశ్చ్య కర్మసు యుక్త స్వప్న యుక్త అవబోధ", ఇవన్నీ యుక్తంగా ఉండాలి, మానేయాల్సిన అవసరం లేదు. ఆహారం ఏవి ఎంతవరకు అవసరమో తెలుసుకొని తిని. హాయిగా తిరుగు, కానీ ఎవరెవరో తెలుసుకొని తిరుగు. ఏఏపనులు తగివవో ఏవి తగనినో తెలుసుకొని చెయ్యి. ఎంత అవసరమో అంత నిద్ర,ఎంత మెలుకువగా ఉండాలో అంత తప్పవు. శరీరానికి ఒక క్రమం ఉంది, ఆక్రమాన్ని గుర్తించి దాన్ని గౌరవించి జీవిస్తే అప్పుడు శరీర పోషణ తప్పుకాదు.రెండో భాగం, ఈ లోకంలోకి తెచ్చే వ్యవస్థ ప్రకృతి, ఇది మనకు తల్లిగా, తండ్రిని ఇచ్చింది. వారికి వారి తల్లి తండ్రులు, మరికొన్ని కుటుంబాలు ఉన్నాయి. అందులో ఒకనిగా మనం వచ్చాం. మనంతట మనం స్వతంత్రంగా రాలేదు. శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఎంత భాగం ఆలోచిస్తున్నామో, అంత మన కుటుంబ విషయంలో కూడా ఆలోచించాలి. శరీరాన్ని కొంతకు మించి వాడుకోలేము. అట్లానే మనం జన్మించిన కుటుంబం యొక్క నియమాన్ని పాటిస్తూ, అందరిని గౌరవించి బ్రతకాలి. అందులో తల్లి తండ్రులు ఉండొచ్చు, భార్య, భర్త, పిల్లలు, బంధువులు ఉండొచ్చు. హద్దులు తెలుసుకొని ప్రవర్తించాలి. జంతువులు వాటి హద్దులు తెలిసి ప్రవర్తిస్తాయి. తమ పిల్లలను ఎంత వరకు అవసరమో అంతవరకు పెంచుతాయి. మనుషులం కనక ఎంతవరకు చేయాలో చేసి, ఆపై పిల్లలు అడిగితే సలహా ఇవ్వడానికి ఉండాలి తప్ప అన్నింటిని తమపై పూసుకోకూడదు. "వార్ధకే ముని వృత్తినాం" ఒక కాలంలో వృద్దాప్యం వచ్చాక బాధ్యతలు అప్పగించి ప్రశాంతంగా భగవంతుని గురించి ఆలోచించుకొనే వారు. సలహాలు మాత్రం ఇచ్చేవారు. పిల్లలు పాటిస్తున్నారా లేదా అని కూడా ఆలోచించేవారు కాదు. చెప్పడం వరకు పెద్దల బాధ్యత. మాట వినక నష్టపోతుంటే పట్టించుకోనవసరం లేదు. హద్దులు ఉంటాయి అని గుర్తించాలి. అట్లా ఒక భాగం కుటుంబం కోసం ఆలోచించాలి, ఆ ఆలోచనని ఆచరణలోకి తేవాలి. ఇది రెండవ మెట్టు.
మన కుటుంబం చుట్టూ సమాజం ఉంది, కొన్ని కోట్ల సంస్కారాలు కలిగిన సమాజం ఉంది. దాన్ని గుర్తించి, దాన్ని ఇబ్బంది కలిగించకుండా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. ఇది మూడో భాగం. శరీరం, కుటుంబం ఎంత వాస్తవమో సమాజం కూడా అంతే వాస్తవం, దాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఇది మూడో మెట్టు.
సమాజంతో పాటు, రకరకాల ప్రాణికోటి జీవిస్తుంది, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. ప్రతి వస్తువు కూడా మన యొక్క ఉనికికి ఆధారమే. కొన్ని జీవుల ద్వారా మనం ఎక్కువ లాభం పొందవచ్చు, కొన్ని ఉపయోగపడక పోవచ్చు. కానీ వాటి కంటూ ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది, ఈ విశ్వంలోని ప్రతి వస్తువుకి మరొక వస్తువుకి పరస్పర సంబంధం ఉంటుంది. ప్రపంచంలో ఏమూల ఒక గడ్డిపోచ కదిలినా అది ప్రపంచం అంతటిమీదా ప్రభావం ఉంటుంది. ఎంత ఎలా అనేది మనం గుర్తించలేనంతగా ఉంటుందేమో కాని తప్పక ఒక ప్రభావం ఉంటుంది. మన శరీరంలో ఒక భాగంలో నొప్పి అయితే మరొక భాగం ఎందుకు స్పందిస్తుంది. ఈ ప్రపంచంలోని ధూలికణం కదిలినా, గాలి తరంగం వీచినా, చిన్న నీటి బొట్టు కదిలినా ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుకీ స్పందన ఉంటుంది. అట్లా ప్రపంచంలో ఉండే ప్రతి జీవితో మనకు సంబంధం ఉంటుంది. కదిలే జంతువులే కాదు, కదలని చెట్లు, రాల్లు, గాలి అన్నింటితో సంబంధం ఉంటుంది. మన బుద్దిలో ఒక భాగం వాటికి కూడా కెటాయించాలి. మన చుట్టూ ఉండే ప్రాణికోటితో సహా ప్రకృతిలోని నీటితో, నేలతో, గాలితో అట్లానే ప్రవర్తించాలి. అందుకే వేదమంత్రాలలో "ఓం ద్యౌ శాంతిః అంతరిక్షగుం శాంతిః పృథివీ శాంతిః " ఆకాశానికి శాంతి కలుగుగాక, భూమికి శాంతి కలుగుగాక, అంతరిక్షానికి శాంతి కలుగుగాక అని ప్రార్థిస్తారు. ఇదంతా ఏమిటో చాదస్తం అని కొందరి అభిప్రాయం. అది ఎవడెవడికి వాడిదాకా వచ్చినప్పుడు అర్థం అవుతుంది. శరీరం పంచభూతాల కలయిక. ఒక్కో సారి ఒకటి ఎక్కువ, తక్కువ లైతే ఏమవుతుందో మనకు తెలుసు. ఆకాశం తక్కువైటే అంటే ఖాలి తక్కువ అయితే భుక్తాయసం. నీటి శాతం పెరిగితే శరీరం వాచి కష్టమే. ఒక్కో సారి వేడి శాంతం పెరిగి నీరు తగ్గుతుంది, అప్పుడు శరీరంలో నీటిని ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో కూడా అంతే కదా. అది గుర్తించగలిగేవాడు మానవుడు. మన శరీరంలో మట్టి భాగం కానీ, నీటిభాగం కానీ, గాలి భాగం గానీ, అగ్ని భాగం గానీ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసు మనకు. ఎది ఎక్కువైనా, ఏది తక్కువైనా ఇబ్బందే. అట్లానే ప్రకృతిలో ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఇది నాలుగో స్థాయి.
ఈ శరీరాన్ని మనకిచ్చి, వెనకాతల ఉండి నడిపే తత్వం బ్రహ్మ తత్వం. దైవం అంటాం. పరమాత్మ అంటాం. అక్కడి దాకా గుర్తించి, మనకు దైవానికి ఉన్న సంబంధం గుర్తించి మన బుద్దిలో ఒక భాగాన్ని కెటాయించ గలిగితే అది ఐదవ భాగం. ఇది ఐదో మెట్టు.
ఈ ఐదింటికి మన బుద్దిలో ఒక్కో భాగం ఇచ్చి ఆలోచించగలగాలి, దాన్ని కార్య రూపం చేయాలి. ఒకదానితో ఒకటి పరస్పర భేదాలు రాకుండా చూసుకోవాలి. ఒకదానితో ఒకటి పరస్పర సంబంధం కలిగినటువంటివి, ఏదో ఒకదానికే మనం పూర్తిగా కెటాయిస్తే, అది సరికాదు. ఇవన్నింటిని ఆలోచించి బ్రతక గలిగితే మనిషి అంటారు. ఇది మానవ జన్మకు ఉన్న గొప్పతనం. అది గ్రహించి బ్రతికితే వేరే యోగాలు, యాగాలు చేయనవసరం లేదు, ఈ దుఃఖ భూయిష్టమైన జన్మలలోకి రానవసరం లేదు. అది మోక్షం అంటే. శరీరం పోతే మరోక శరీరం వస్తుంది, మనం అది కోరటంలేదు, ఈ కర్మ బంధం తొలగాలి అని కోరుకుంటుంన్నాం. ఆట్లా తొలగించుకొనే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. జీవితాన్ని ఎలా వాడుకోవాలో, మన చుట్టు ఉండే వారి ప్రేమను ఎట్లా పొందగల్గుతామో, అట్లే వారిని ఆనందంగా ఉంచగలమో ఒకరు ఆచరించి చూపితే మనం కొంతనైనా సాధించగలం. ఇవన్నీ ఆచరించి చూపాడు శ్రీరామచంద్రుడు ఒక మానవుడిగా, ఆయన ఎలా ఆచరించాడు, ఎందుకు ఆచరించాడు, ఏమి ఆచరించడం తెలుసుకోవడం విలువలకి తిలోదకాలు ఇచ్చే ఈనాటి మన వంటి వారికి చాలా అవసరం.
మూర్తీభవించిన ఆచరణ - శ్రీరామచంద్రుడు
మనిషికి ప్రధానమైన యోగ్యత కలిగించేది మనస్సు. ప్రతి పూట ఆహారం స్వీకరిస్తాం. ప్రతి రోజు శరీరాన్ని శుభ్రంచేసుకుంటుంటాం, మన శరీరంలోని మలినాలను తొలగించుకుంటుంటాం. అయితే ఒకసారి చేసాం కదా అని వదిలెయ్యం. మళ్ళీ మళ్ళీ చేస్తునే ఉంటాం. అట్లానే మన మనస్సుకు పట్టిన మురికిని మనం శుభ్రం చేసుకోవాలి. మానవునిగా మనస్సును సవ్యంగా వాడుకొని నిరూపించుకోగలగాలి. మనకు ఇంద్రియాలకు మధ్యవర్తిగా ఉంటుందట మనస్సు. కన్ను పనిచేయడానికి కారణం చక్షువు అనే ఇంద్రియం ఒకటి వెనకాతల ఉంటుంది. ఇలా ఇంద్రియాలే మనకు కనిపించవు, వాటి కంటే సూక్ష్మమైనది మనస్సు. మనిషి మాత్రమే గుర్తించగలడు. 'మత్వా కర్మాని సీవ్యతి' మనస్సుని వాడి, తనకు జరిగిన అనుభవాలను గుర్తించి, తన చుట్టూ ఉన్న పరిసరాలను గుర్తించి, తన శక్తిని స్థాయిని దృష్టిలో పెట్టుకొని, ఎవడైతే తనకి తన తోటి సమాజానికి ఇబ్బంది కలగకుండా అల్లుకుంటూ వెళ్ళగలుగుతాడో వాడు మనిషి. మనస్సు చేసే సహకారాన్ని మననం అని అంటారు, ఆ మననం వల్లే మనిషికి ఒక శ్రేష్టం ఏర్పడుతుంది, అదే మనిషిని గుర్తించే చిహ్నం.
శరీరం, కుటుంబం, సమాజం, ప్రకృతిలోని సమస్తప్రాణికోటి మరియూ ఈ విశ్వాన్ని వెనకాతల ఉండి నడిపించే పరమాత్మ ఇలా ఈ ఐదు స్థాయిల వరకు మనం మననం చేయగలగాలి. మననం చేసి అనుభవాలని జోడించి కార్య రూపంలోకి మార్చాలి. మన అనుభవం ఎంత ఉంటుంది, ఈ జీవనం అనే మహా ప్రవాహంలో అది ఎంత, ఒక ఇసుక రేణువంతనైనా ఉండదు. అదే శాశ్వత సత్యం అని స్వీకరించగలమా. మన అనుభవాలు పరిమితమై ఉంటాయి. వాటికి ఒక అవది ఉంటుంది. మన అనుభవంలో లేని మరెన్నో విషయాలు ఉన్నాయి. మనం అనుభవించిన దాన్నే మననం చేయాలంటే, అది చాలా తక్కువ పరిది అవుతుంది. మన పెద్దల అనుభవాన్ని కూడా మనం స్వీకరించాలి. వైజ్ఞానిక పరిశోదనలు కూడా ఇలానే జరుగుతాయి, పూర్వం చేసిన వాటిని ఆధారంగా పెట్టుకొనే కొత్త పరిశోదనలు చేస్తారు. అట్లానే అలౌకిక విషయాలలో కూడా పూర్వుల ఆచరణ మనకు ఆదర్శం అయితే వారిని ఆచార్యులు అని అంటాం. అట్లా గుర్తించి చేసేవాడినే మనిషి అని అంటారు. వారు చేసే ఆచరణనే ధర్మం అని అంటారు. ఇది ప్రతి మనిషి ఆచరించాల్సినది.
ఒక వ్యక్తి కొంతకాలం ఈ భూమిపై జీవించి దేహయాత్ర చాలిస్తాడు, ఈ మనిషి వెళ్ళిపోతాడు కానీ మానవ ప్రవాహం ఆగిపోదు, నదిలో ప్రవహించే నీటి ప్రవాహం వలె. మానవ జాతి ఎప్పుడూ ఉంటుంది. మానవ జాతి ఉన్నంత వరకు మననం ఎట్లా చేయాలి అని చెప్పడం ఎప్పుడూ అవసరమే. కాలం ఏదైనా సూర్యుడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు. అట్లానే సూర్యుని వలె మారని ఆచరణని, మారని ధర్మాన్ని మానవ జాతికి నిరంతరం అందించగలిగే స్వరూపం శ్రీరామచంద్రుడు. అందుకే మారీచుడు శ్రీరాముడిని గూర్చి ఒక మాట చెబుతాడు "రామః విగ్రహవాన్ ధర్మః", కాంతి ఒక విగ్రహాన్ని ధరించింది అంటే ఎట్లా గుర్తించాలి? అది సూర్యుడు అని చెబుతాం, అట్లానే మూర్తీభవించిన ఆచరణ ఎక్కడనైనా చూడాలి అంటే అది శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు మూడు చథుర్యుగాల ముందు ఉన్న త్రేతాయుగంలో ఉన్న వాడు. ఇప్పటి వరకు రామ చరిత మనం మరచిపోలేదు, ఎప్పటికీ మరచిపోం. కాలం మారుతుంది, ప్రతి ఒక్కటీ రేపటికి పాత బడుతుంది కానీ కొన్ని యుగాల ముందు ఉన్న రాముడు పాత బడలేదు. ఆవ్యక్తి యొక్క మాట, కదలిక, ఆచరణ ఇప్పటివరకూ నూతనమే.
ఆదర్శ గుణ భాండాగారం – రామాయణం
రామాయణం పరమపవిత్రమైన కావ్యం. మన ఇతిహాసాలలో రామాయణానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. మానవుని వ్యక్తిగతమైన, సామాజికమైన, సౌశీల్యమైన నిర్మాణంలో ఇది నేటికీ ఆదర్శవంతంగా ఉందనడంలో సందేహం లేదు. తరతరాలు మన సామాజిక, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ ఏమేమి ఆలోచించాలి? ఏది మనం ఆచరించాలి? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
రామాయణం ధర్మాచరణను స్పష్టంగా తెలుపుతుంది. వాల్మీకికి నారద మహర్షి శ్రీరాముని యొక్క పదహారు సద్గుణాలు వర్ణించాడు. అతని చరిత్రను సమగ్రంగా వివరించాడు. శ్రీరాముని భక్తునిగా అతనిని తీర్చిదిద్ది రామాయణ మహాకావ్య రచనకు ప్రోత్సహించాడు. కాలక్రమంలో వాల్మీకి తన ఆశ్రమంలో పుట్టిపెరిగిన కుశలవులకు తాను రచించిన రామాయణాన్ని గానంగా నేర్పాడు. ఆ గానాన్ని వారిచే గానం చేయించి ఆనాటి సమాజంలో రామకథలోని ఔన్నత్యాన్ని చాటుతూ సమాజంలో శీల సంపదను నెలకొల్పడానికి కృషి చేశాడు.
రామాయణంలోని పాత్రలు ఓర్పును, నేర్పును, ఓదార్పును తెలియజేసే విధంగా ఉంటాయి. దశరధుడి పెంపకంలో రామ, లక్ష్మణ, భరత, శతృఘు్నలు, వేదాధ్యయన నిరతులై, పితృ శుశ్రూషణారతులయ్యారు. దశరధుడు సత్యధర్మ పాలకుడై తన కుమారులను ఆ పద్ధతిలోనే పెంచాడు. వశిష్టుడు దశరధుని గూర్చి ‘సాక్షాత్ ధర్మమివా పరః’ అని ప్రశంసించాడు.
అలాంటి తండ్రి శిక్షణలో పెరిగిన రాముడు ‘‘రామో విగ్రహవాన్ ధర్మః’’ అని కొనియాడారు. రామునికి అస్తవ్రిద్యలు, శీల సంపద నేర్పిన విశ్వామిత్రుడు కూడా ధర్మ విగ్రహుడే! కావునే దశరధుడు గుర్వాజ్ఞయే తన ఆజ్ఞగా పాటించవలసింది అని రాముణ్ణి ఆదేశించాడు. ఆ ప్రకారంగానే తాటకాది రాక్షసులను సంహరించాడు. అహల్యను అనుగ్రహించాడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావించాడు. శివధనస్సును విరిచాడు. తండ్రి ఆనతో సీతను వివాహ మాడాడు. అలాగే లక్ష్మణుడు కూడా తల్లి ఆదేశం ప్రకారం అడవినే అయోధ్యగా, సీతారాములనే తల్లిదండ్రులుగా భావించి, తండ్రి మాట కోసం అడవికి వెళ్లిన రాముణ్ణి అనుసరించాడు. వారిని సేవించి, ధన్యుడై, తండ్రి ప్రశంసలను కూడా అందుకున్నాడు.
కౌసల్య రాముణ్ణి వనవాసానికి పంపుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి రాముడికి దైవభక్తిని సంక్రమింపజేసింది. దానితో తన తమ్ముళ్ళు కైకను నిందించకుండా వారిని మందలించేలా శ్రీరాముడు వ్యవహరించాడు. భరతుడు గుహునితో పెద్దన్న తండ్రితో సమానుడు అంటాడు. ఇది అన్నదమ్ముల మధ్య అనుబంధానికి గొప్ప తార్కాణం. రాముడు అహల్యను ఎలా గౌరవించాడో, లక్ష్మణుడు తారనూ, హనుమంతుడు మండోదరిని అలాగే గౌరవించారు. శతృఘు్నడు మంధరను సంహరించాలనుకున్నప్పుడు స్ర్తిలను గౌరవించని వారు రాముడికి ప్రీతి పాత్రులు కారని, భరతుడు మందలిస్తాడు. ఇది రామునికి స్ర్తిలపైగల గౌరవానికిది సంకేతం. స్ర్తిలకు సమాజం ఎలా గౌరవించాలో తెలుపుతుంది రామాయణం.
లక్ష్మణుడు ఒక సందర్భంలో సీతమ్మ ధరించిన ఆభరణాలలో కాలి అందెలు మాత్రమే తెలుసు. దానికి కారణం నిత్యపాదాభివందనం వల్ల అంటాడు. ఇది లక్ష్మణునికి తన తల్లి ఇచ్చిన శిక్షణ. పరాయిస్ర్తి తల్లితో సమానం అని చెప్పడానికి సజీవ సాక్ష్యంగా నేటికీ నిలుస్తుంది. భరద్వాజ మహర్షి, మాతృనింద దోషమని భరతుణ్ణి హెచ్చరించాడు. ఇది మానడం వల్లనే భరతునికి రామ పాదుకలు లభించాయి అని తెలుపుతుంది రామాయణం. ఆంజనేయుడు సుగ్రీవునికి వినయం, సత్యపాలన నేర్పాడు. సీతమ్మను బాధించిన స్ర్తిలను వధించడానికి హనుమంతుడు అనుమతి కోరగా సీతమ్మ వారిపట్ల కరుణ చూపమని కోరింది. రావణుని సంహారానంతరం అన్నగారికి అంతిమ సంస్కారం విభీషణుడు చేయకుంటే నేనే చేస్తానని శ్రీరాముడు అన్నాడు. అప్పుడు రాముని ఔదార్యానికి విభీషణుడు ప్రభావితుడయ్యాడు.
ఇలా రామాయణంలోని ప్రతి పాత్ర ఒక గొప్ప ఆదర్శంగా మానవుడు ఎలా నడిస్తే ఉన్నత మనస్కుడు, గొప్పవాడు అవుతాడో తెలుపుతుంది. సహజీవన ఔన్నత్యాన్ని, కుటుంబ బంధాలని, సమాజసేవని, మానవుడు నేర్వవలసిన సద్గుణాలని, పాటించాల్సిన విధులు, ధర్మాలను సజీవ చిత్రంగా మనకు తెలుపుతుంది రామాయణం. అందుకే ఆదర్శగుణ భాంఢాగారం – రామాయణం అనటమే సముచితం.
బాలకాండ లేదా బాలకాండము రామాయణం కావ్యంలో మొదటి విభాగము. భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.
వీటిలో బాల కాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కధాంశాలు: కధా ప్రారంభము, అయోధ్యా నగర వర్ణన, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము, పరశురామునితో స్పర్ధ..
కావ్యావతరణ
నారదుడు ఒకమారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సర్వోన్నత లక్షణాలున్న పురుషుడెవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కధ చెప్పాడు. రాముడు సత్యధర్మవ్రతుడు. మహావీరుడు. అనితర రూప గుణ సంపన్నుడు. సకల గుణాభిరాముడు. ఆ రాముని చరిత్రం పరమ పవిత్రం,సకల వేద సారం అని చెప్పాడు.
తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానానికి వెళ్ళినపుడు ఒక నిషాదుడు క్రౌంచపక్షిని సంహరించడం చూచాడు. అప్రయత్నంగా వాల్మీకి నోట మానిషాద! ప్రతిష్ఠాం… అనే ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది. అనంతరం బ్రహ్మ వాల్మీకి చెంతకు వచ్చి అటువంటి శ్లోకాలలోనే రామాయణాన్ని రచించమని ఆదేశించాడు. పర్వతాలు, నదులూ ఉన్నంతకాలం లోకంలో సీతారామచరితం నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు.
వాల్మీకి ధ్యానమగ్నుడైనపుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతం అయ్యింది. అపుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్ధాలతోను, గుణార్ధాలతోను మధురంగా రచించాడు. అందులో మొత్తం 24 వేల శ్లోకాఉన్నాయి. 500 సర్గలు (ఉత్తర కాండతో కలిపి) ఉన్నాయి. ఆ రామాయణాన్ని వాల్మీకి నుండి నేర్డి కుశలవులు అందరూ ఆనందించి ప్రశంసించేలా గానం చేశారు.
అయోధ్యాపురం, రాముని జననం
ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరధుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మ పరాయణుడు. సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్యా నగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కాని సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు, గురువుల దీవనలతో యాగం చేయ తలపెట్టాడు. అందుకు తన సోదర సముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత, అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది. తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు.
ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్ధనలను మన్నించి, శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్ధమై తన నాలుగు అంశలతో దశరధ మహారాజునకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు. కనుక నర వానరుల చేత మాత్రమే వాడు మరణించే అవకాశం ఉంది.
యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరధుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకిచ్చాడు. వారు తేజోవతులై గర్భము దాల్చారు. చైత్ర నవమి నాడు, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, గురూదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకకు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం జరిపించాడు. అన్నదమ్ములు నలువురూ సకల గుణ తేజో సంపన్నులై విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ప్రీతిపాత్రులైనారు. అన్నదమ్ములలో రాముడు ప్రత్యేకించి దశరధునకూ, సకల జనులకూ ప్రాణసమానుడై ప్రకాశించాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు.
ఇంద్రాది దేవతలు తమ అంశలతో వానర, భల్లూక వీరులకు జన్మలనిచ్చారు. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, అశ్వినీ దేవతల అంశలతో మైంద ద్వివిదులు, వరుణాంశతో సుషేణుడు, పర్జన్యాంశతో శరభుడు – ఇలా మహావీరులైన వానర భల్లూక సమూహం శ్రీరామునకు రావణ సంహారంలో సహాయపడడానికి వృద్ధి చెందింది. వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి, తేజో వేగ సంపన్నుడు, వజ్ర సదృశ దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు.
రామాయణాన్ని గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా యుగాలు చాలవు. రామాయణం ఇరవైనాలుగు వేల శ్లోకాలుగానే అవతరించింది ఈ లోకంలో, అసలు బ్రహ్మలోకంలో అది శతకోటి ప్రవిస్తరం అంటారు. మనం అంత గ్రహించలేం. ఈ ఇరవైనాలుగు వేల శ్లోకాలనే కొన్ని కాండలుగా విభజించారు. బాలకాండ, అయోధ్య కాండ, అరణ్య కాండ, కిష్కింద కాండ, సుందరకాండ, యుద్ద కాండ మరియూ ఉత్తర కాండ. ఇది ఒక అవది అని కాండాలకి ఒక్కో పేరు పెట్టి ఉన్నారు. బాల కాండ మరియూ సుందర కాండకు ఉన్న పేర్లలో ఎంతో రహస్యం ఉంది.
బాల కాండము అంటే రాముడు బాలుడిగా ఉన్నప్పటి విషయాలను చెప్పినటువంటిది అని అనిపిస్తుంది. కానీ రాముని బాల్యాన్ని గురించి అంతగా ప్రస్తావించదు. 18 వ సర్గలో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు జన్మించిరి అని చెప్పి, వారికి 11 వ రోజున నామకరణం చేసారు, వేద విధ్యలు, బుద్దిమంతులైన ఆ పిల్లలు అస్త్ర శస్త్రాలు నేర్చుకున్నారు, వారికి పెళ్ళి చేయాలని వారి తండ్రి అనుకుంటున్నాడు అంతలోనే విశ్వామిత్రుడు వచ్చాడు అని చెబుతాడు వాల్మీకి. ఒక నాలుగైదు శ్లోకాలు మాత్రమే ఉంటాయి. రాముని బాల్యం గురించి ఇక ప్రస్తావన ఉండదు. తరువాత విశ్వామిత్రుడు తన యజ్ఞ పరిరక్షణకై రాముడిని కోరుతాడు, ముందు దశరథుడు ఒప్పుకోడు, తరువాత వశిష్టులవారు చెబితే అప్పుడు శ్రీరాముడిని ఆయన వెంట పంపుతాడు. ఆ తరువాత రామ లక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రునితో కలిసి అడవిలో ప్రయాణించడమే ఉంటుంది, బాల కాండ ముగిసే సరికి రామచంద్రుడు సీతమ్మను వివాహం ఆడి అయోద్యచేరి 12 సంవత్సరాలు గడుస్తుంది. బాల్యం గురించి ఏమి చెప్పనే లేదు. మనం గుర్తించాల్సిన విషయం ఉంది. ఈ కాండము అంతా విశ్వామిత్రుని గురించి చెప్పడానికి ఉన్నదే.
విశ్వామిత్రుడు బాలుడా ? ఎంతో పెద్ద ఋషి, ఎన్ని పనులుచేసాడు, ఎన్నో సార్లు తను దిగజారి పోయాడు, ఎంతో కష్టపడి తిరిగి పైకి వచ్చాడు. ఆయనా బాలుడంటే ? అని అనిపిస్తుంది. కానీ బాలుడంటే ఆయనే. బాల కాండలో దశరథ మహారాజు రామచంద్రుని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టగానే వారి భవిష్యత్తు తీర్చి దిద్దగలిగేవాడు విశ్వామిత్రుడే కనుక ఆయన గురించే ప్రస్తావించాడు వాల్మీకి. విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడిని తీసుకెళ్ళి రకరకాల అస్త్ర శస్త్రాలను నేర్పించి సీతారాముల కళ్యాణం వరకు మాత్రమే విశ్వామిత్రుడు కనిపిస్తాడు. అయితే ఆయన జీవితం ఒక ఆదర్శం.
యాగ రక్షణ తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనక చక్రవర్తి సభకి తీసుకొస్తాడు. అక్కడ పూర్వ పరాలు విచారించాక అక్క జనక చక్రవర్తి యొక్క మంత్రి శతానందుడు రామ లక్ష్మణులతో విశ్వామిత్రుని గురించి చెబుతాడు. విశ్వామిత్రుడు మీకు గురువు కావడం ఎంతో అదృష్టమయా. ఇతను ఒకప్పుడు ఎలా ఉండే వాడు ఈ నాడు ఎలా అయ్యాడు. లోకంలో తనను తాను ఇంతగా సంస్కరించుకున్న వ్యక్తి మరొకడు లేడు అని వారందరికీ విశ్వామిత్రుని కథని వర్ణిస్తాడు. విశ్వామిత్రుని కథ అంత ఆనంద దాయకంగా ఉండదు. అంత అందంగానూ ఉండదు. అంతకు ముందు ఆయన ఎన్నో సార్లు కామ క్రోదాలను జయించలేక పోయాడు. కానీ సభలో కూర్చోబెట్టి శతానందుడు విశ్వామిత్రుని కథను పిల్లలకు చెబుతుంటే ఎట్లాంటి కోపం రాలేదు, స్పందించలేదు. తను వేరే వారి కథను వింటుంన్నట్టు కుదురుగా కూర్చొని విన్నాడు. ఆస్థితికి పక్వత చెందాడు. సాదకుడిగా తను తపస్సు చేసినప్పుడు కామ క్రోదాలకు బానిస అయ్యాడు, కానీ తన సాధనకి దైవానుగ్రహంగా శ్రీరామచంద్రుడిని జోడుచేసుకొన్నాడు. అట్లా రామాయణంలో ప్రతి అంశం మానవుడు తెలుసుకోవాల్సినవి. ఒక బాలుడి వలె మనస్తత్వం ఆయనలో ఏర్పడింది. పిల్లవాని వలె నిష్కల్మషంగా తయారు అయ్యాడు. కనుకనే బాలకాండ అని పేరు.

విశ్వామిత్రుడు మొదట ఒక రాజు. ఈక్ష్వాకు వంశానికి చెందినవాడే. ఒకనాడు యుద్దం చేసి వస్తూ వశిష్టుల వారి ఆశ్రమాన్ని సందర్శించాడు. వశిష్టుడు వారి కుల గురువు. కావల్సిన సలహాలు తీసుకున్నాడు. ఇక విశ్వామిత్రుడు వెళ్ళిపోయేందుకు సిద్దం అయ్యాడు, అప్పుడు వశిష్టుడు నేను నీకు ఆథిద్యం ఇవ్వాలని అనుకుంటుంన్నాను అని చెప్పాడు. ఇంతమంది సైన్యంతో ఉన్నాడు కనక ఇంత మందికేం ఆథిద్యం ఇవ్వగలరు అని వశిష్టులవారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, కానీ వశిష్టులవారు ఒప్పుకోలేదు. వశిష్టులవారు ఎంత గొప్ప ఋషి అయినా తన గొప్పతనాన్ని చూపించే ప్రయత్నం చేసాడు. తన వద్ద ఉన్న గోవుని పిలిపించి వారికి ఏమేమి కావాలో అవన్నీ ఇవ్వు అని అదేశించాడు. వెంటనే ఆగోవు వారికి కావాల్సిన ఆహార పదార్థాలని ఇచ్చింది.
విశ్వామిత్రుడు చాల మంచివాడే, గురువుగారి మీద భక్తి కలవాడే, కానీ ఇంత ఆదరణ చూసే సరికి ఆయనకీ కొంత మనస్సు మారింది. ఏఏ జాతిలో గొప్పదాన్ని రత్నం అని అంటారు, గోవులన్నింటిలో రత్నమైనది ఇది రాజువద్దే ఉండదగినది అని దాన్ని నావెంట పంపండి అని కోరాడు. అదే నాకు సర్వస్వం అని వశిష్టులవారు కాదన్నారు. అప్పుడు తెలిసింది వశిష్టులవారికి సంపదలు చూపించడానికి తాను చేసిన తప్పేమిటో, సరే ఆయన సాత్వికుడు ఏంచేయలేక పోయాడు. విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకుపోయే ప్రయత్నం చేసాడు.
గోవు దీనంగా చూస్తూ నన్ను వదిలిపెట్టేస్తున్నావా! ఒక్కసారి సరే అను నేను వీరినందరిని తరిమికొడతా అని చెప్పింది. సరే అన్నాడు. ఒక్కసారి హుంకరించింది, తన రోమ కూపాల నుండి మ్లేచ్చులు, యవనులు అని రకరకాల జాతులని పుట్టించింది. వారందరు విశ్వామిత్రుడిని తరిమి తరిమి కొట్టారు. విశ్వామిత్రుడు తన సైన్యాన్ని తీసుకొచ్చాడు కానీ ఏంచేయలేక పోయాడు.
తపస్సు చేసి పరమ శివుడిని ప్రసన్నం చేసుకొని ఎన్నో విధ్యలు, అస్త్ర శస్త్రాలు సాధించాడు. అప్పుడు తిరిగి వశిష్టులవారి పైకి యుద్దానికి వచ్చాడు. వశిష్టులవారి ఆశ్రమాన్ని నాశనం చేసేసాడు. వశిష్టులవారు తన చేతిలోని బ్రహ్మ దండాన్ని వాడి అన్నింటిని స్వాహా చేసేసాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. కానీ ఆబ్రహ్మ దండం క్రింద అవి పనిచేయలేదు. వశిష్టులవారి బుద్ది బలం క్రింద తన కండ బలం ఏం సరిపోదు అని విశ్వామిత్రుడికి అప్పుడనిపించింది. నేను కూడా అట్లాంటి వారిగా కావాలి అని పోటీతో తపస్సు చేయడానికి ఆరంభించాడు.
విశ్వామిత్రుని వద్ద శిష్యరికం
ఒకమారు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, తాను చేసే యాగాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారనీ, వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపమనీ దశరధుని కోరాడు. పదిహేను సంవత్సరాల బాలుడు కౄర రాక్షసును నిలువరించ జాలడనీ, కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగ రక్షణ చేయడానికి అనుమతించమనీ దశరధుడు అర్ధించాడు. విశ్వామిత్రుడు సమ్మతించలేదు. ఇక కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరధుడు రామునీ, లక్ష్మణునీ విశ్వామిత్రునితో పంపాడు.
మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. వాటివలన అలసట, ఆకలిదప్పులు కలుగవు. మువ్వురూ రాత్రి విశ్రమించారు. తెల్లవారి విశ్వామిత్రుడు “కౌసల్య కడుపు చల్లగా ఉండుగాక. రామా. తెల్లవారింది. మేలుకో, ఆహ్నికాలు నెరవేర్చుకో” అని ప్రబోధించాడు.

మనిషి బలహీనతలకు దర్పణం విశ్వామిత్రుని కథ
తను కూడా వశిష్టులవారిగా బ్రహ్మర్షి కావాలి అని పోటీతో తపస్సు చేయడానికి ఆరంభించాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళాడు పదివేల సంవత్సరాలు తన కుటుంబంతో పాటు వెళ్ళి తపస్సు చేసాడు. అప్పుడు తన వంశానికే చెందిన త్రిశంకు అనే రాజు వశిష్టులవారి వద్దకి వచ్చి తనకి ఈ శరీరంతోనే స్వర్గానికి పోవాలని ఉంది అని కోరాడు. అందుకు వశిష్టులవారు అక్కడ తేజో శరీరాలు మాత్రమే ఉంటాయి, మురికి స్రవించే శరీరాలు పనిచెయ్యవు అని కాదని పంపాడు. త్రిశంకు వశిష్టులవారి కుమారులను ప్రార్థించాడు, ఆపై బలవంత పెట్టాడు. వారిరువురికి సంఘర్షణ జరిగింది వారు త్రిశంకుకు శాపం పెట్టారు. ఆయన నల్లగా మారిపోయాడు.
దుఖంతో విశ్వామిత్రునివద్దకు వచ్చాడు. విశ్వామిత్రుడిని ప్రార్థించాడు, వశిష్టులవారు కాదన్న దాన్ని తాను చేస్తానని నిరూపించుకొనే ప్రయత్నం తలపెట్టాడు. ఉగ్రమైన ప్రవృత్తి కల వ్యక్తి విశ్వామిత్రుడు. తనకున్న తపశక్తితో త్రిశంకును అట్లానే స్వర్గానికి పంపాడు. అక్కడికి చేరాక దేవతలు త్రిశంకును తిప్పి పంపారు, అప్పుడు ఆయన జారి పడుతుంటే అక్కడే ఒక స్వర్గాన్ని సృస్టించాడు. అక్కడ గ్రహ మండలాలను తయారుచేసాడు, ఆలోకానికి ఇంద్రునిగా త్రిశంకును నియమించాడు. తపశక్తి అంతా వ్యర్థం అయిపోయింది. తనకు దక్షిణ దిక్కు తనకు అచ్చిరాలేదు అని భావించాడు. ఇది మనుషుల ప్రవృత్తి. మనం చేసుకున్న దానికే మనకు ఏదో కలిసి రాలేదు అని భావిస్తుంటాం. ఇల్లు అచ్చిరాలేదు, ఈ పని అచ్చిరాలేదు చివరికి దేవుడిని కూడా అచ్చిరాలేదు అని భావిస్తుంటారు.
అప్పుడు తిరిగి పశ్చిన దిక్కుకి వెళ్ళాడు. అక్కడ పుష్కర క్షేత్రంలో మరొక పదివేల సంవత్సరాల తపస్సు చేసాడు. అంతలో అంబరీషుడు తను చేసే యజ్ఞానికి సునశ్శేపుడు అనే పిల్లవాడిని తీసుకుపోతూ పుష్కర క్షేతంలో విశ్రాంతికై ఆగారు. ఆపిల్లవాడు విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. ఆపిల్లవాడిని బలి కోసం తీసుకువెళ్తున్నారు అని జాలిపడి ఆపిల్లవాడికి రక్షణ కవచంగా తను రెండు మంత్రాలను ఉపదేశించాడు. ఆపిల్లవాడు రక్షింపబడ్డాడు, కానీ విశ్వామిత్రుని తపశక్తి అయిపోయింది. మళ్ళీ పట్టుతో తపస్సు చేసాడు అప్పుడు మేనక వచ్చి తన తపస్సు భంగం చేసింది. అప్పుడు ఉత్తర దిక్కుకి బయలుదేరాడు.
ఉత్తర దిక్కులో తపస్సు చేయడం ప్రారంభించాడు, అప్పుడు ఇంద్రుడు రంభని పంపాడు. కామాన్ని జయించాడు కానీ కోపంతో ఆమెని శపించాడు. కోపానికి దాసుడనయ్యానే అని భావించి, తూర్పు దిక్కుకి బయలుదేరాడు. తిండి వల్లే కామ క్రోదాలకు ఏర్పడుతున్నాయి అని అక్కడ తిండి మానివేసి కేవలం గాలినే ఆహారంగా స్వీకరించి తపస్సు చేసాడు. అప్పుడు దేవతలు వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ నీవు బ్రహ్మర్షివి అని చెప్పారు. అది వశిష్టుల వారు చెబుతేనే ఒప్పుకుంటా అని చెప్పాడు. ఆయనలో ఇంకా పోటీ తగ్గలేదు. క్రోదాన్ని ఇంకా జయించలేదు ఆయన. ఇవి మనుషులలో ఉండే బలహీనతలు. వశిష్టుడు వచ్చి చెప్పగానే ఆయనలో ఒక మార్పు వచ్చింది. పెద్దలను గౌరవించాలి అని అనుకున్నాడు. మనిషిలో బలహీనతలు ఉండటం తప్పు కాదు, వాటికొరకు దిగజారడం తప్పు. వాటిని అతిక్రమించగలిగితే అప్పుడు మంచి సాదకులం అవుతాం. ఈ విషయాలు ప్రతి మానవునికి తెలియడం అవసరం.
భగవంతుని అనుగ్రహమే అసలు సాధనం
మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.ఈ ‘ఆరు రాత్రుల యాగం’ అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి. ఈ ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.
భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు. అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది.
ధనుర్భంగం-అష్టాక్షరిని సూచిస్తుంది
విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన వెంట మిథిలా నగరానికి తీసుకొచ్చి, ఆ ధనస్సును చూడాలి అనుకుంటున్నారు అని చెప్పాడు. జనకుడు ఆ ధనస్సు యొక్క చరిత్ర చెప్పి, ఇప్పటివరకు దేవతలనుండి మొదలుకొని వీరూ వారు అని ప్రశ్న లేదు ఎందరో వచ్చి కనీసం ఎత్తలేక పోయారు. దాన్ని ఎత్తితే సీతమ్మను వివాహం ఆడాలి అనే శరతు పెట్టి తెప్పించాడు. ఆ ధనస్సుని ఎనిమిది చక్రాల బండిపై ఉంది, దాన్ని ఐదు వేల మంది కండలు తిరిగి బలం కల్గిన వారు తీసుకు వచ్చారు. ఇది అక్కడి సన్నివేశం. ధనస్సు ఉన్న బండికి ఎందుకు ఎనిమిది చక్రాలు ? ఎందుకు దాన్ని ఐదు వేల మంది లాక్కోచ్చారు ? ఈ సన్నివేశం వేదంలోని ఒక రహస్యార్థాన్ని వివరిస్తుంది.
ఎనిమిది చక్రాలు అంటే ఎనిమిది అక్షరాలు కలిగిన, జ్ఞానం ఇవ్వగల నారాయణ అష్టాక్షరి మహామంత్రం. అది ఓంకారపు సారం. ఓంకారాన్ని ధనస్సుతోకానీ, శంఖంతోకానీ పోల్చుతారు. ఎనిమిది అక్షరాల మంత్రం ఓంకారం యొక్క అర్థాన్ని తెలుపుతాయి. ధనస్సు కల్గిన బండిని ఐదువేల మంది మోసుకురావడమే దాని అర్థం యొక్క సాంకేతం. ఓంకారం తెలుపేది ఐదు అర్థాలను. ఓంటికి బలిమి అంటే మనం యముకలు, కండలు గట్టిగా ఉండటం. జ్ఞానానికి బలం అంటే ఏమి ? ఎందరెందరు ఎటు చెబితే అటూ చెప్పినట్టుగా కొట్టుకుపోకుండా, ప్రమాణంతో గట్టిపడి వాడికంటూ ఒక విశ్వాసం చెదరక నిలిస్తే అది సరియైన జ్ఞానం. జ్ఞానం అనేది ఎవడైనా వచ్చి వాడికున్న విశ్వాసాన్ని చెదిర్చే ప్రయత్నం చేస్తే అది కదల ఉండగలగటం ఒక బలం అయితే, ఎదుటివాడికి సరియైన సమాధానం చెప్పగలగడం సరియైన బలం అని చెప్పవచ్చు. ఐదింటికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానం అంటే. అవి నేనెవరు, వాడెవరు, పొందాల్సింది ఏమి, నేను ఎట్లా పొందడం, ఎందుకు పొందలేక పోతున్నాను. ఈ ఐదింటిని స్పష్టంగా చెప్పగలదు ఓంకారం, అందుకే ఐదువేల మంది తోసుకొచ్చిన బండి అని సంకేతంగా చెప్పారు.
శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృష్యం. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆధనస్సు ఎవ్వరికీ వంగలేదు ఒక్క రాముడికే వంగింది. ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. అట్లా పట్టుకొని నిలబడడమే ఒక రహస్యం.
ఓంకారానికి తాత్పర్యమేమి ? ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యం. ఓంకారం అంటే ‘అ’ అనే అక్షరం, ‘మ’ అనే అక్షరం మద్యన ‘ఉ’ అనే అక్షరం ఉంది. ‘అ’ అనేది భగవంతుడి మొదటి నామం. అక్షరానాం అకారోస్మి అని చెప్పుకున్నాడు కృష్ణుడు. ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విరిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు. రెండో ఖండం ‘అ’ తో కలిసి ఉండే జీవుడు, అంటే మనం. ‘మ’ అనేది ‘మన్ జ్ఞానే మన్ అవభోదనే’ జ్ఞానం అనేదే ఆకృతిగా, గుణంగా కలవాడు. అ కి మ కి మధ్యన ఉన్న ఉకారమే ధనస్సు యొక్క రెండు కండాల మధ్య ఉన్న నారి. ఉకారం భగవంతుడికి జీవుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. లోకంలో మనం అనుకునే సంబంధాలు ఒకనాడు ఉంటాయి, ఒకనాడు పోతాయి. జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు. సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది. అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడరానిది అని తెలియజేయడానికి ధనస్సు యొక్క పై ఖండానికి క్రింద ఖండానికి మధ్యన ఉన్న త్రాడు. అది చెప్పడానికే రాముడు పట్టుకొని చూపాడు. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి. ఇది భగవంతుడి ఒక్కడితోనే ఇట్లాంటి సంబంధం. ఇది తరగదు, నశించదు, చెదరదు. ఆ సంబంధాన్ని మనం మరిచాం కానీ ఆయన ఎప్పుడు మరవడు.
తాటక వధ, యాగ పరిరక్షణ
మరొక రాత్రి మన్మధాశ్రమంలో విశ్రమించి, మరునాడు వారు భయంకరమైన తాటకా వనంలో ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు, మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువుఆజ్ఞపై రాముడు తాటకను వాడిబాణంతో సంహరించాడు.
మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి, వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు, వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమం ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ, యాగ సంరక్షణా బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహలు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు మానవాస్త్రంతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞం నిరుపద్రవంగా నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన కౌశికుడు రామలక్ష్మణులను దీవించాడు.
మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిధిలానగరానికి బయలుదేరాడు.
ఇది నిరూపించడం కోసమే ఆనాడు రామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు. అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది, అందుకే వారిరువురిని ఒక చోట చేర్చి సేవించుకొనేందుకు ‘సీతారామ కళ్యాణం’.
రామాయణంలో మొదటి శ్లోకం
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవమ్
రామాయణ మహత్తు గురించి
యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
కావ్యం రామాయణం కృత్స్నమ్, సీతాయాశ్చరితం మహత్
పౌలస్త్య వధమిత్యెవ, చకార చరితవ్రతః
జనకుడు యజ్ఞం కొరకు క్షేత్రాన్ని దున్నటం ప్రారంభించాడు. యజ్ఞం మొదలు పెట్టిన వెంటనే నాగలి చాలులో ఒక పాప లభించింది. నాగలి చాలుని సీత అని అంటారు. ఆ భూదేవి సంతానమైన ఆ పాపకు సీత అని నామకరణం చేసి, తన కుమార్తెగా పెంచాడు. యజ్ఞం తలపెట్టినప్పుడు లభించింది కనక ఆమె సామాన్యురాలు కాదు. మరి ఆమెను ఎవ్వరికి ఇచ్చి వివాహం చేయాలో అర్థం కాలేదు. తన వద్ద ఒక ధనస్సు ఉంది, దాన్ని ఎత్తటానికి ఎవ్వరికీ సాధ్యం అయ్యేది కదు. ఆ ధనస్సును ఎవరైతే సంధిస్తారో వారికి సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తా అని వీర శుల్కం క్రింద ఆమెను పెట్టాడు. దేవతలనుండి మొదలుకొని వీరూ వారు అని ప్రశ్న లేదు ఎందరో వచ్చి కనీసం ఎత్తలేక పోయారు. చివరికి శ్రీరామచంద్రుడు ఆధనస్సును విరిచి సీతమ్మను వివాహమాడాడు. అయితే రామాయణం పైపైకి ఒక అందమైన కథ, అందులో లోనికి వెళ్ళి వెతికితే ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉంటాయి. లోన ఎన్నో రహస్యాలు ఉన్నా, అది జరిగిన చరిత్ర కూడా. అందుకే రామాయణాన్ని ఉత్తమ కావ్యం అని అంటారు. ఎవరు జనకుడు ? ఎవరు సీత ? ఏమిటీ ధనస్సు ? ఎవరు శ్రీరామ చంద్రుడు ? ఇలా ఆలోచిస్తే తెలిసేది ఇది ఒక ఆత్మ కథ అని. దీన్ని మన పూర్వ ఆచార్యులు ఎంతో అందంగా వివరిస్తారు. జీవుడు పరమాత్మని చేరడం ఎట్లా ? చేరితే జీవుడికి లభించే ప్రయోజనం ఏమి ? జీవుడిని పరమాత్మకు అర్పించే విధానం ఏది ? ఇవన్నీ తత్వాన్వేషణ చేసే వ్యక్తికి కలిగే సందేహాలు.
ఆత్మని కల్గి ఉన్నది శరీరం, దాన్ని గుర్తించి మనం పరమాత్మకు అర్పించవచ్చు. ఆత్మని గుర్తించే యోగ్యత మానవ శరీరానికి ఉంది. అట్లా గుర్తించే సాధన చేసి జీవ స్వరూపాన్ని గనక మనం గుర్తిస్తే మనల్ని జనకుడు అనవచ్చు. నేను అన్నప్పుడు మనం నేరుగా ఆత్మని చెప్పినా, మన బుద్ది ఆత్మపై దృష్టి పెట్టి చెప్పదు, శరీరం వరకు నేను అని చెబుతుంటాం. అట్లాంటి వారిమి ఆత్మని గుర్తిస్తే మనకు జనకుడు అని పేరు. ఆ లభించిన ఆత్మకి సీత అని పేరు. సీత అంటే జన్మ లేనిది. మన ఆత్మకు కూడా జన్మ లేనిది కనక సీత అనొచ్చు. జనకుడికి సీత ఎట్లా లభించిందో గమనించాలి. జనకులు అనేది వారి వంశం పేరు. జనకుల వంశంలో శీర ద్వజుడికి సీతా లభించింది. ఆవంశంవారంతా కర్మ యోగులు. అట్లానే ఈ శీర ద్వజుడు అనే జనకుడు కర్మ యోగ నిష్ట కల మహనీయుడు. కర్మయోగం అంటే భాధ్యతలను వదలడం కాదు, ఎంతెంత జ్ఞానం కలిగితే అంతంత భాధ్యతతో చేయడం. మరి తేడా ఎక్కడ అంటే, మామూలు వ్యక్తి పని చేస్తే నేను చేస్తున్నా అని చేస్తాడు, వేదాంత జ్ఞానం కల వ్యక్తి చేసేది నేను కాదు, ఫలితం నాది కాదు, అని కర్మపై పట్టు లేకుండా భగవంతుడికి చెందినట్లు భావిస్తాడు. జనకుడు యజ్ఞం ఆరంభించిన వెంటనే ఫలంగా సీతామ్మను పొందాడు, ఆయన కర్మయోగ నిష్ట అట్లాంటిది. మనం శాస్త్రం చెప్పినదాన్ని వినాలి, మన ఆలోచనలతో మననం చేయాలి. క్రమంగా మనలోని సంశయాలు తొలగి, మన శరీరం ఒక సుక్షేత్రంగా అవుతుంది. ఇదే దున్నడం అంటే. అప్పుడు చేసే ప్రతి పని యజ్ఞమే. అప్పుడు మనలోని జన్మలేని ఆత్మ అనేది లభిస్తుంది. నేను అంటే శరీరం కాదు ఆత్మ అనే విషయం తెలుస్తుంది. అదే సీత అంటే.
ఆత్మ అనే సీతను ఎవ్వరికి ఎవ్వ తగును ? ఆత్మ ఏ తత్వానిపై నిలపదగును. శాస్త్రాల్లో ధనస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అంటారు. “ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతలక్ష్యముచ్చతే ” అని ఉపనిషత్ చెబుతుంది. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికి వంగుతుందో వాడికి ఆత్మను అర్పించ దగును. ఎందరో ప్రయత్నించారు కానీ ఆ ధనస్సుని వంచలేక పోయారు. లోకంలో ఎందరో ఎన్నో దైవాలను చూపిస్తుంటారు, అట్లా ఎవరికో ఒకరికి అని మన ఆత్మని అర్పించవచ్చా ? దానికి సమాధానం ఓంకారం ఎవరిని చెబుతుందో వారికి అర్పించతగును. ధనస్సు వంగింది రాముడికొక్కడికే. ఈ కాలంలో ఓంకారానికి, గాయత్రి మంత్రానికి ఎందరో ఎన్నో స్వరాలు, ఎన్నో అర్థాలు పెట్టి చెబుతున్నారు. ప్రకృతిని నియంత్రించే శక్తి మంత్రం యొక్క స్వరానికి ఉంది, దాని నియమాన్ని గౌరవించక చేస్తే మనం ప్రకృతిని పాడు చేస్తున్నట్లే లెక్క. అందుకే లోకంలో ఎన్నో అరిష్టాలు కలుగుతున్నాయి. ఓంకారం వంగేది రాముడికి మాత్రమే. రాముడు ఎవరు ? “ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాతః మహా ద్యుతిః” అని దశరథుడికి సంతానంగా అవతరించింది విష్ణువే కదా. ఓంకారం ఎవరిని చెబుతుంది అని శాస్త్రానికి ప్రశ్న వేస్తే ఓంకారం కారణ దశలో వెళ్ళి చేరేది అకారంలో. “అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం” అకారం నారాయణుడి యొక్క మొదటి పేరు. ప్రణవం వంగేది నారాయణుడికి. ఆయన ఆత్మను పాలించగల వ్యక్తి, క్షేమం కలిగించగల వ్యక్తి అని శాస్త్రం చెబుతోంది. అందుకే జనకుడు ధనస్సును పెట్టి, ఆధనస్సుని వంచినవాడికి సీతను అర్పించాడు. మనం చెందేది నారాయణునికి మాత్రమే. అట్లా మన ఆత్మని అర్పించదగినవాడు నారాయణుడు మాత్రమే.
అయోధ్యాకాండ లేదా అయోధ్యాకాండము రామాయణం కావ్యంలో రెండవ విభాగము.
భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను ‘’కాండములు’’ అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.
వీటిలో అయోధ్యా కాండ రెండవ కాండము. ఇందులో 119 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కధాంశాలు: శ్రీరాముని పట్టాభిషేక సన్నాహాలు, కైకేయి కోరిక, దశరధుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంభము..
విషయ సూచిక
1 సంక్షిప్త కధ
1.1 శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు
1.2 కైకకు మంధర దుర్బోధ
1.3 కైక కోరికలు
1.4 సీతారామలక్ష్మణుల వనవాస దీక్ష
1.5 వన ప్రయాణం
1.6 గుహుని ఆతిథ్యం
1.7 చిత్రకూట నివాసం
1.8 దశరధుని మరణం
1.9 భరతుని దుఃఖం
1.10 చిత్రకూటానికి భరతుని ప్రయాణం
1.11 పితృవాక్య పాలన
1.12 శ్రీరాముని పాదుకల రాజ్యం
1.13 అత్రి, అనసూయ, సీత
తనకు రాముడూ, భరతుడూ సమానులేనని కైక మంధరతో అనుట
రామో వా భరతోవాహం విశేషం నోపలక్షయే
తస్మాత్తుష్ఠాస్మి యద్రాజా రామం రాజ్యేభిషిక్ష్యతి
అన్ననూ వదిననూ సేవించుకోమని సుమిత్ర లక్ష్మణునితో అనుట
రామం దశరధం విద్ధి మాం విద్ధిం జనకాత్మజాం
అయోధహయా మటవీం విద్ధి గచ్ఛ తాత యధా సుఖమ్
దట్టమైన అడవిలో సీతారామ లక్ష్మణులు ప్రవేశించుట
వనం సభార్యః ప్రవివేశ రాఘవః
సలక్ష్మణ స్సూర్య ఇవాభ్ర మండలమ్

ఎంత గొప్ప కార్యమైనా నాశనం చేయడం సులభం
ఏదైనా మంచి కార్యం జరగాలన్నా, ఒక చెడ్డ కార్యం జరగాలన్నా వెనక ఒక యంత్రాంగం అనేది ఉండాలి. మంచి కలగాలి అంటే ఒక పెద్ద యంత్రాంగం కావాలి, కానీ పాడు చేయడానికి చిన్న మంత్రాంగం చాలు. రాముడికి పట్టాభిషేకం జరుపడానికి దశరథమహా రాజు ఎంత జాగ్రత్తగా ఉపాయం చేసుకున్నా, పాడు చేయడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. నిర్మాణం చేయడానికి ఎంతో కష్టం, కానీ నిర్మూలన చేయడం ఎంతో సులభం.
దశరథ మహారాజు శ్రీరాముని పట్టాభిషేకానికి ఎక్కువ సమయం ఇస్తే ఏక్కడినుండైనా ఆటంకం వచ్చి పడుతుందేమోనని ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా రేపు పుష్యమి నక్షత్రం రోజు బాగుంది అని వెంటనే ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు. రాముడి అంగీకారం కూడా అడగలేదు. అప్పుడు రామచంద్రుడికి కబురు చేసి సభలోకి పిలిచాడు. నేను కాదు నీవు రాజువి కావాలని కోరుకొనేది, ఈ పుడమి తల్లి కోరుకుంటుంది అని చెప్పాడు. రేపే పట్టాభిషేకం అని చెప్పాడు, చేయాల్సిన వైదికమైన కార్యక్రమాలు అచరించమని చెప్పాడు. సభ అయ్యాక తన మందిరానికి వెళ్ళి మళ్ళీ వెంటనే రామచంద్రుడిని పిలిపించాడు. తనకు పాడు కలలు వస్తున్నాయి, నేను గమనించే ఉత్పాతాలని చూస్తే నాకు క్షేమం కాదు అని తెలుస్తుంది, అందుకే వెంటనే నీ పట్టాభిషేకం ఏర్పాటుచేసాను, నీ తమ్ముడైన భరతుడు ప్రక్కన లేడు అని భాద పడకు అని చెప్పాడు. భరతుడు తన మేన మామ వద్ద ఉన్నాడు, ఎందుకో తెలియదు కానీ దశరథుడు అందరికి కబురు చేసాడు ఒక ఆ రాజ్యానికి తప్ప. ఆయనలో ఏదో సంకోచం ఉన్నట్లుంది. అట్లా ముందే అన్ని రక్షణ ఉపాయాలన్ని ఆలోచించినా, ఎదురు చూడని ఒక మూలనుండి ఒక పెద్ద ఉత్పాతం వచ్చిపడింది.
అసలు కైకమ్మ చాలా మంచిది. చక్కటి మనస్సు ఉంది, రాముడిపై చాలా ప్రేమ ఉంది. రాముడు తన తల్లి కౌసల్యమ్మ వద్ద కంటే కైకమ్మ వద్దే ఎక్కువ ప్రేమ చూపేవాడు. రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అంటే ఆనందించింది మొదట కైకమ్మనే. ఆమె దాసి చిన్న మంత్రాంగం నడిపి మొత్తం తలక్రిందులు చేసేసింది. “జ్ఞాతి దాసి ఎతో జాత” అంటాడు వాల్మీకి. అయోధ్యలో పుట్టినవారు ఎవ్వరూ పొరపాటున కూడా రామున్ని కష్ట పెట్టాలని అనుకోనే అనుకోరు. అందుకే ఆ మంథర “ఎతో జాత” ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎలా పుట్టిందో తెలియదు అని అంటాడు. ఆమె కైకమ్మ పుట్టిన చోటి నుండే వచ్చింది, అంతవరకు తెలుసు. అట్లాంటి ఆలోచన చేయడమే కష్టం, అంతే కాదు కైకమ్మ మనస్సులోకి ఎంతో గాడంగా ఎక్కించింది.
మనిషి ఏదో ఒకసారి ఏదో ఒక పరిస్థితులలో ప్రతిజ్ఞచేస్తాడు. కానీ అది నెరవేర్చుకొనేందుకు ఎన్ని కష్టలు పొందాల్సి వస్తుందో ఊహించలేం. దశరథుడు ఎవరికో సహాయం చేద్దామని యుద్దానికి వెళ్ళాడు. తనకు కైక సహకారం చేసింది, సంతోషించి వరాలు ఇచ్చాడు. అమె ఏం వరాలకోసం సహాయం చేయలేదు. తన భర్త కదా అని సహాయం చేసింది. తనకిచ్చిన వరాలని మరచిపోయింది కూడా. ఆవరాలని తిరిగి జ్ఞాపకం చేసి, ఏమేమి కోరాలో ఉపాయలను ఇచ్చి ఆవరాలని కోరిచ్చింది మంథర. రాముడిని వనానికి పంపడంలో,భరతుడికి రాజ్యాన్ని ఇవ్వడంలో ఉపయోగించుకోవాలి అని చెప్పి ఒప్పించింది. అంటే ఎంత ఉత్తమమైన, లోకోపకార కార్యమైనా నాశనం చేయడం అనేది ఎక్కువ శ్రమ అవసరం లేదు.
దశరథుడు నేను చనిపోతాను కైకా నీవిలాంటి కోరిక కోరితే అని అన్నాడు. నీవు ఉంటే ఏంటి పోతే ఏంటి అని ఏమి లెక్క చేయలేదు. “నీ తల్లిగారి బుద్దులు పరిపూర్ణంగా వచ్చాయి” అని మంత్రి సుమంత్రుడు చెబుతాడు. కైకమ్మకు తల్లి ఉండేది. కైకమ్మ తండ్రికి జంతువుల భాషను అర్థం చేసుకొనగలిగేవాడు. కానీ బయటికి చెప్పకూడదు. ఒకసారి ఆయన ఏదో జంతువుల మాటలు విని పక్కున నవ్వాడు, అది తనని చూసి నవ్వాడు అని కైకమ్మ తల్లి సందేహించి అడిగిందట. నిన్ను చూసి కాది ఆ జంతువులని చూసి, అది చెప్పాల్సిందే అని అడిగింది. అది చెబితే నేను బ్రతకను అని చెప్పాడు, అదేం కుదరదు చెప్పాలి అని అడిగిందట. అట్లాంటి తల్లికి పుట్టిన దానివి, నీవు కోరిన కోరిక రాజుగారే కాదు ఈ రాజ్యంలోని వారందరి ప్రాణాలు తీయగలదు, ఇది తగదు అని మంత్రి చెబుతాడు. కానీ ఆమె ఏమాత్రం చలించలేదు. ఒక చిన్ని మంత్రాంగం పట్టాభిషేకం కానివ్వకపోవడమే కాక ఆదేశపు రాజు ప్రాణాలనే తీసేసింది. రాజ్యాన్ని అంతా శోకసాగరలో ముంచి పాడేసింది.
కౌసల్యమ్మ వద్దకి రాముడు వచ్చి తను వనవాసానికి వెళ్ళాలని విషయం చెప్పగానే ఆమె కొట్టిపాడవేడిన అరటిచెట్టు వలె కుప్ప కూలింది. కౌసల్యమ్మ రాముని వెంట వనానికి వస్తా అంటే, రాముడు ఆమెకు దశరథుని భార్యగా ఆమె ధర్మాన్ని చెప్పే విషయం ఎంతో స్పూర్తి దాయకం. కౌసల్యమ్మ దుఖాన్ని చూసి తన ప్రతి అణువు రామచంద్రుని సేవకే, ఎవ్వరు అడ్డు వచ్చినా ధర్మాన్ని లెక్క చేయను అని లక్ష్మణుడు త్రాచుపాములా లేచి మండి పడ్డాడు. రాముడు ఆయనను ఊరుకోబెట్టే క్రమం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ప్రవర్తించే యోగ్యత కల వాడు రామచంద్రుడు. ఒక్కరోజులో అన్ని విషయాలు తల క్రిందులు అవడానికి కారణం తండ్రా ? కైకమ్మానా ? మంథరనా ? కానే కాదు. ఇది దైవం నిర్ణయించినది అని చెప్పాడు, అట్లా దైవానికి స్థానం ఏమిటో తెలిపాడు రామచంద్రుడు. దైవం కనపడనవసరం లేదు, కానీ వెనకాతల ఉండి నడిపిస్తుంది. అది గుర్తించినవాడు మనిషి. అట్లా లక్ష్మణుడిని శాంత పరచాడు. ఎవరి హద్దు వారు మీరక ప్రవర్తించగలిగేట్టు చేసాడు, అటు తండ్రిని, ఇటు తల్లిని, తన సోదరుడిని, ప్రజలని ధార్మికులుగా తీర్చి దిద్దే ప్రయత్నం చేసాడు. తాత్కాలిక ప్రలోభాలకు మనం దిగజారినా రాముడిని ముందర పెట్టుకుంటే మన స్థితిలో మనల్ని నిలవగలిగేట్టు చేస్తాడు. అయోధ్యాకాండలో ధార్మికుడిగా కావడానికి తన చుట్టూ ఉండే లోకాన్ని ఎట్లా పరవశింప చేయాలో తెలుపే విషయాలు ఎన్నో ఉన్నాయి.
అయోధ్యలో ఉండే ప్రతి పాణి, ప్రతి వస్తువు ఇది అది అన్న ప్రశ్న లేదు అందరికి రామునిపై ప్రాణం ఉండేది. మనం ప్రేమిస్తే జంతువులే కాదు, చెట్లు చేమలు కూడా మనపై అభిమానం చూపిస్తాయి. శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో పెరిగినప్పుడు ఆమె ఎంతో ప్రేమతో అక్కడి పక్షులను, చెట్లను పెంచింది. తన మెట్టినింటికి వెళ్ళేప్పుడు ఒక్కో చెట్టు వద్దకు వెళ్ళి నేను వెళ్ళొస్తా అని చెబుతుంటే, చెట్లన్ని స్పందించి వంగి తమ తొఱ్ఱల్లో పక్షులు తెచ్చి దాచుకున్న బంగారు నగలని ఆమె ఒడిలో పోసాయట. వృక్షాదులు స్పందిస్తాయా ? అంటే మనం వాటిపై చూపే ఆదరానికి అవి స్పందిస్తాయి. అట్లా రామచంద్రునికై మొక్కలు, వృక్షాలు స్పందించాయి. రాముడిని వనవాసానికి పంపేప్పుడు అది చైత్రమాసం, అడవుల్లో ఉండే చెట్లన్నీ రాముడి సేవకై తమను తాము సిద్దం చేసుకొని స్వాగతం పలుకుతున్నట్లు కనిపించాయని సుమంత్రుడు చెబుతాడు. తరువాత రాముడిని వదిలిపెట్టి రథాన్ని వెనకకి తీసుకొస్తున్నప్పుడు ఒక ఆకు కానీ, ఒక పువ్వుగానీ, చిగురు కానీ లేక శుష్కించిపోయాయి. నదులలోంచి ఆవిర్లు వస్తున్నాయి. రాముడు వనానికి వెళ్తే “ఉపతప్తోదకా నద్యః పల్వలాని సరాంసిచ అభివృక్షాః పరిమ్లానాః” వృక్షాలు ఎండిపోయాయి, నదులన్నీ మండిపోయాయి. అది రామచంద్రుడు. తన కళ్యాణ గుణాలతో అందరి మనస్సులని దొంగలించి వేసాడు. రాముడి ఎడబాటును సహించలేక. రాముడు పెంచుకున్న ఏనుగు పేరు శత్రంజయం. రాముడు వనవాసం అయిపోయి తిరిగి వచ్చినప్పుడు భరతుడు అన్నీ తిరిగి అప్పజెబుతాడు. కానీ ఈ ఏనుగును ఎట్లా చూపించాలో అని సంకోచం చెందాడట. అది చిక్కి పోయింది. దానికి తిండి లేక కాదు, దానికి రాముని రూపం ఆహారం రాముడి సేవ జలం రాముడి స్పర్శ ప్రాణం. అది దూరమై చిక్కి శల్యమై పోయింది. దాన్ని రాముడు వచ్చి తట్టినప్పుడు అప్పుడు స్వస్థత చెందింది. అట్లా భావనా భావితమైన పట్టణం అయోధ్య. రాముడు తన ప్రేమని లోకంపై అంతగా కురిపించాడు. తన కళ్యాణ గుణాలతో అన్నింటినీ రంజింపజేసాడు. అందుకే ఆయన చూపు పడితే చాలు అని కోరుకొనేవారు. ఎప్పుడో ఒకసారి రాముడిని చూస్తే చాలు, అప్పుడు మేం బ్రతికి ఉన్నట్లు లెక్క అని భావించేది లోకం అంతా.
లోకం మొత్తంచే ప్రేమించబడినవాడు శ్రీరామచంద్రుడు, లోకంలో ద్వేశించినవాడు ఎవ్వరూ లేరు. ఆవ్యక్తి మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, రాక్షసుడు కావచ్చు కానీ అందరూ ప్రేమించారు. రావాణాసురుడి వంటి వారు కూడా ఒక సారి “ఆహా!” అని అనుకోలేక పోయాడు. అది యుద్దకాండలో తెలుస్తుంది. యుద్దం జరుగుతున్న 11వ నాడు రావణాసుడు రాముడియొక్క తీవ్రమైన భాణ ప్రయోగాలని చూస్తూ ఉండి పోయాడు, తను భాణాలను వేయ్యాలనే విషయం మరచిపోయాడు. రాముడు యుద్దం చేసే తీరు, చాకచక్యం చూసి అలానే ఉండిపోయాడు. దానితో రథంలో మూర్చపడి పోయాడు, సారథి రథాన్ని యుద్దరంగంలోంచి బయటికి తీసుకుపోయాడు. రాముడు వెనుతిరిగిన వ్యక్తిని ఏమి చేయడు. రావణాసురుడికి మెలుకువ వచ్చి ఏక్కడ రాముడు అంటూ లేచాడు. ‘పస్యతః యుద్ద లుభ్దోహం’, నేను రాముడిని చూస్తూ ఉండాలే, ఇక్కడెందుకు ఉన్నాను అని అడిగాడు. యుద్దానికి వచ్చింది యుద్దం చేయడానికి కానీ చూడటానికా అని సారథి అడిగాడు. లోకం అంతా రాముడి గురించి చెబుతుంటే విన్నది కానీ ఈ రోజు నేరుగా రంగస్థలంపై చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని శత్రువైన రావణుడంతటి వాడు కూడా రాముడిని స్మరించుకోగలిగాడు. రాముడిని చూడని బ్రతుకు దండగ అని ప్రతి వ్యక్తి అనుకున్నారు.

రాముడే ప్రాణం
ధర్మానికి నిలువుటద్దం - అయోధ్యకాండ
రాముడు అడవికి వెళ్ళిపోయాక దశరథ మహారాజు స్పృహ కోల్పోయాడు. ఆయనని భవనంలోకి తీసుకు వచ్చారు. ఆయన లేచి చూస్తే అది కైకమ్మ భవనం. తనకి కైకేయికి ఎట్లాంటి సంబంధం లేదు, ఆమె కొడుకు పెట్టే తర్పణాలు, పిండాలు కూడా నాకు అందవు అని చెప్పి కౌసల్యమ్మ భవనానికి వచ్చాడు. హే కౌసల్యా నన్ను ఒక్కసారి ముట్టుకో, ఎక్కడున్నావు కనిపించటం లేదు అని ఏడిచాడు. పక్కనే ఉన్నా అని చెప్పింది. "నత్వా పస్యామి కౌశల్యే" నాకు ఏమీ కనిపించడం లేదు అని చెప్పాడు. "రామం మే అనుగతా దృష్టిః" నా చూపు రాముడి వెంటే వెళ్ళి పోయింది. "అత్యాపి ననివర్థతే" ఆ చూపు మళ్ళీ తిరిగి వెనకకు రాలేదు అని చెప్పాడు. అందుకే నిన్ను కూడా చూడలేక పోతున్నాను. రాముడి ఎడబాటుని ఓర్వలేక పోతున్నాను. ప్రాణం ధరించలేక పోతున్నాను. పన్నెండు మాసాలు గర్భంలో పెంచినదానివి నీవు, రాముడి స్పర్శ నీ గర్భానికి ఉంది కనక, అది కలిగిన నీవు నన్ను ఒక్కసారి తాకి నాప్రాణం నిలబెట్టు అని కోరాడు.రాముడు తిరిగి వస్తాడేమో అని ఆశ ఉంది. తండ్రిని భాదపెట్టే వాడే కాదు. రామా అని పిలిస్తే, రాముడు వచ్చేవాడు. కొంత సేపు చూసి వచ్చావా అని చూసి వెళ్ళిరా అని చెప్పేవాడు. ఎందుకు పిలిచావు అని కూడా అడిగేవాడు కాదు. వెళ్తుంటే మళ్ళీ పిలిచేవాడు. కొంత సేపు చూసి వెళ్ళిరా అని చెప్పేవాడు. ఎన్ని సాలు అలా పిలిచినా వచ్చే వాడు, ఎందుకు రమ్మని చెబుతున్నాడో కూడా అడిగేవాడు కాదు. తండ్రిగారు పిలిచారు కనక వచ్చేవాడు. మరి దశరథుడు ఎందుకు అలా పిలిచేవాడు ? అంటే రాముడిని ఎంత చూసినా చూస్తు ఉండాలి అనే కోరిక మాత్రమే దశరథుడికి ఉండేది. రాముడు వస్తుంటే అందం, నమస్కరించడానికి ఒంగుతుంటే అందం, వెనక్కి తిరిగితే ఒక అందం, వెడుతుంటే అందం. నిలబడితే ఒక అందం. కదిలితే ఒక అందం. ఆయనలో 'చతుర్గతి' అంటే నాలుగు రకాలం అందం ఉట్టిపడుతూ ఉంటుంది అని చెబుతారు. ఆయన నడక సౌందర్యం అట్లా ఉండేదట. ఏనుగు నడకలోమి గాంభీర్యం, సూర్యుని తేజస్సు వలె సింహం నడకలోమి తేజస్సు, వృషభం నడకలోమి గర్వం, పులి నడకలోని వేగం ఇలా ఒక్కో సౌందర్యం ఉండేదట. "వా పోగు వా పోగు వా పోగు ఇన్నొరుక్కాళ్ వందు పోగు వా" అని ఆళ్వార్లు చెబుతారు. ఎన్ని సాలు రమ్మన్నా విసుగు చెందక తండ్రి ఆజ్ఞ పాలన చేసేవాడు అంతే మరో ప్రశ్న లేదు. రాముడిని చూస్తుండటమే ఆయన పని, ఆయన ప్రతి భావన రాముడి పరం అయిపోయింది. అందుకే రాముడు వెళ్ళిపోతే ఆయన నేత్రాలు కూడా పనిచేయలేదు.కానీ ఏమో నన్ను అభిమానించే రామచంద్రుడు తనని చూడటానికి తిరిగి రాకపోడా అని ఒక ఆశ. లేదా వెంట సీతమ్మను తీసుకు పోయాడు, ఆసీతమ్మ ఎప్పుడు కష్టం తెలియనిది, ఆమె కష్టాన్ని ఓర్వలేక తిరిగి ఆమెను అయోధ్యలో వదిలివెళ్ళడానికైనా వస్తాడేమో అని ఒక ఆశ. ఆ ఆశతో బ్రతికి ఉన్నాడు దశరథుడు. ఎప్పుడైతే సుమంత్రుడు రామచంద్రుడు రావడం లేదు అని సమాచారం ఇచ్చిన ఉత్తర క్షణానికి ఆయన ప్రాణాన్ని వదిలాడు.
శ్రీరామాయణంలో ని రెండవ కాండ అయోధ్యకాండ. ఎన్నో అద్భుతమైన ధర్మాలని అందిస్తుంది. శ్రీరామచంద్రుడు ఉండే ఆ అయోధ్యా పట్టణం అద్భుతమైనది. ఎన్నో రకాల వసతులు, అద్భుతమైన భవనాలు కల పట్టణమని వాల్మీకి వర్ణిస్తాడు. చదువుకోని వారు ఎవరూ ఉండేవారు కాదట. శాస్త్రాలు అధ్యయనం చేయనివారు లేరట. ఆడినమాట తప్పని వారు. ఆనాడు శాస్త్రం మీద విశ్వాసం ఉన్నవారు ఉండేవారు. పరిపాలించేది ప్రభువే కానీ ప్రజలని కాదని కాదు, నియంతృత్వ పాలన కాదు. అందరి అంగీకారం తీసుకొనే వారు. ఏది నిర్ణయం చేసినా ప్రజల క్షేమం గుర్తించి చేసేవారు. ధర్మం కోసం ప్రాణం త్యాగం చేసిన దశరథుడు పరిపాలించిన రాజ్యం అది. తండ్రి సంకల్పం నెరవేర్చడం కోసం తాను అడవికి వెళ్ళడానికి వెనకాడలేదు. ధర్మం పాటించడం అంటే రెండువైపులా పదను ఉన్న కత్తిపై నడక వంటిది. అది తెలిపేది అయోధ్యకాండ.
మనిషి ఎంత ధార్మికుడైనా తాత్కాలిక ప్రయోజనానికి అప్పుడప్పుడు బానిస అయిపోటాడు. అట్లాంటి బానిసత్వాన్ని ఎట్లా దూరం చేసుకోవాలో రామచంద్రుడు నిరూపిస్తాడు. దశరత చక్రవర్తి వాగ్దానం అయితే చేసాడు కానీ అది చెప్పలేక వివసుడై పడి ఉన్నాడు. రాముడిని విడిచి బ్రతకలేడు అని తెలుసు. రామచంద్రుడు వనానికి వెళ్ళే ముందు, ‘తండ్రీ! నీవిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలని నేను వనానికి వెళ్తున్నా’ అని ఆశీర్వచనానికై తండ్రి వద్దకి వచ్చాడు. నన్ను పక్కకి తొలగించి నీవు సింహాసనంపై కూర్చోవయ్యా అని చెప్పాడు. తన వాగ్దానాన్ని వెనకకు తీసుకుంటా అని చెప్పలేదు. రాముడిని వదులుకోవడం ఇష్టంలేక. తండ్రే కాదు, లోకం మొత్తం ఏడుస్తుంది ఆనాడు, ఎవ్వరూ ఆహారం స్వీకరించలేదట, ఆవులు తమ దూడలకి పాలు కూడా ఇవ్వలేదు. ఇంతమందిని భాదపెట్టే బదులు తన మాటను వదిలిపెడితే లోకానికి శ్రేయస్సు కదా అని అనిపిస్తుంది. కానీ రాముడే ఆపని చేసి ఉంటే మనం ఈనాడు రాముడిని గుర్తుకూడా చేసుకొనేవారిమి కాదేమో!.
రామచంద్రునికి తెలుసు తన తండ్రి తన మాటను వెనకకు తీసుకోలేదు, కానీ రామచంద్రుడు మాట తప్పినా తనకేం భాదలేదు. ప్రజలంతా శోకిస్తున్నారు, వారంతా రామచంద్రుడి రథం వెంట వచ్చారు. తమసానది తీరంలో రాత్రి అందరు పడుకున్నారు. తిండి లేక అలసి ఉన్నారు. ఆసమయంలో రామచంద్రుడు రథాన్ని ఉత్తరమార్గం వైపు నడిపించి, వారికి దారి తెలియకుండా చేసి తిరిగి దక్షిణ దిక్కుకి బయలుదేరారు. వారంతా అయ్యో పాడు నిద్ర మనల్ని రామచంద్రుడి నుండి వేరు చేసింది అని అనుకున్నారు. అందరు తిరిగి వెళ్ళి వారి పనులు వారు చేసుకుంటూ బాగే ఉన్నారు. అసలు భాద పడినవాడు దశరథ చక్రవర్తి ఒక్కడే. ఆయనొక్కడే ప్రాణాలు కోల్పోయింది.
రామచంద్రుడు సరే అంత మంది భాదపడుతున్నారే అని సింహాసనం పై కూర్చుంటే ఆ ప్రజలే తిరిగి ఒక మాట అనేవారు. ఎందుకంటే అగ్నిప్రవేశం చేసిన సీతమ్మేనే ఒక మాట అనడానికి వెనుదిరగని సమాజం. రాముడు సీతని అడవిగి పంపితే ఒక్కరూ ఒక మాట అనలేదు. మానవుల మనస్తత్వం రామునికి తెలుసు. లోకం లోని ప్రజలు మొదట కొంత భాద పడినా తరువాత వారే సర్దుకుంటారు అని రామునికి తెలుసు. చెట్లు, జంతువులు ఏదోషం లేకుండా ప్రేమిస్తాయి, కానీ మనుష్యుల ప్రేమలో కల్మషం ఉంట్డదు అని చెప్పలేం.
రామసోదరులలోని వైచిత్ర్యం
మనిషిని ఒక సమగ్రమైన రూపంలో తీర్చి దిద్దడానికి భగవంతుడు రామావతారంలో నాలుగు రూపాలతో వచ్చాడు. ఒక్కో విషయాన్ని ఒక్కో కోణంలో అందించాడు. మానవుడికి సమగ్రత ఏమిటి? శరీరం పుష్టిగా ఏర్పడి ఏ అంగ వైకల్యం లేకుండా సంపదలతో తులతూగుతున్నంత మాత్రం చేత సమగ్రత అవ్వదు ఎప్పుడూ. సమగ్రత ఏర్పడాలంటే చేయాల్సిన శారీరకమైన, మానసికమైన అన్ని రంగాలను గుర్తించి ప్రవర్తించగలిగితేనే అది పరిపూర్ణత. మానవ జీవితానికి అవసరమైన విలువలను నేర్పటానికి వచ్చిన అవతారమే రామావతారం. అందులో ఆయన లక్ష్మణ భరత శత్రజ్ఞులతో వచ్చాడు. మనిషి ఒక్కడే అయినా విలువలు బహు ముఖంగా ఉంటాయి. మన చుట్టూ ఉండే తల్లి దండ్రులు, సోదరులు, మిత్రులు మరియూ శత్రువులతో ఎట్లా ఉండాలి, కుటుంబంలో మరియూ సమాజంలో భాద్యత తెలుపడానికి రాముడు. రాముడు తన తండ్రితో, తన తల్లితో, తన సోదరులతో, ఋషులతో, తన మిత్రులైన ఆటవికులతో, పక్షులతో, జంతువులతో, రాక్షసులతో ఎట్లా ప్రవర్తించాడు ఇది రాముడిని చూసినప్పుడు గుర్తించాల్సింది. మనిషి అంతవరకే పరిమితం కాదు. ఎన్నో విలువలు ఉంటాయి, ఒక్కో కోణాన్ని తెలుపడానికే లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు ఒక్కో రూపంతో తెలిపాడు. అందుకే లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞులను చూసేప్పుడు శారీరక పరిది దాటి చూడాల్సి ఉంటుంది.
కైకమ్మకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని అనుకున్నాడు దశరథుడు, కానీ రాముడితో చెప్పలేక పోయాడు. కైకమ్మే రాముడితో ఈ విషయం తెలిపింది. తండ్రి నోటితో చెప్పలేదు, తన తల్లి కౌసల్య వెళ్ళవద్దు పిల్లలపై తండ్రికంటే తల్లికే ఎక్కువ హక్కు అని చెప్పింది. సవతి తల్లి మాటకు కూడా ఎంతో గౌరవం ఇచ్చాడు. వెంటనే నాకు వనవాసమే ఇష్టం అని మనస్సుని సిద్దం చేసుకొని చెప్పేసాడు రాముడు. తండ్రిగారి సంకల్పం కోసం రాముడు అట్లా చేస్తే, ఆతండ్రిగారి కొడుకే అయిన లక్ష్మణుడు పూర్తి విరుద్దంగా ప్రవర్తించాడు. రాముని వెంట లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు. వారితో పాటు కొంత దూరం సుమంత్రుడు వచ్చి, తిరిగి వెళ్ళే ముందు తమ తండ్రితో ఎం చెప్పాలో ఒక్కోక్కరిని సందేశం అడిగాడు. సుమంత్రునితో తన తండ్రికి కైకమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం కానీ తన తల్లి కౌసల్యమ్మను మరచిపోవద్దని, ఆమెను భాద పెట్ట వద్దని తన తండ్రికి సందేశం చెప్పాడు రాముడు. సుమంత్రుడు సీతమ్మ వద్దకి వెళ్తే, ఆమె అసలు కష్టం తెలియనిది, ఆమెకు ఏం మాట్లాడాలో కూడా తెలియక తల దించుకొని కూర్చుంది. సుమంత్రుడు లక్ష్మణుడి వద్దకి వెళ్తే నేను అతడిని తండ్రి అనే భావించడం లేదు అని చెప్పేసాడు. నాకు సర్వం రాముడనే చెప్పాడు. ఎంత ఆశ్చర్యం ఒక కుమారుడు తండ్రికోరకు అడవుకే వెళ్ళడానికి సిద్దం అయ్యాడు, కానీ మరొక కుమారుడు తండ్రినే నేను గుర్తించడం లేదు అని చెప్పాడు. భరతుడి విషయంలో మరొక ప్రవర్తన. తండ్రి మరణించగానే రాజ్యం రాజు లేకుండా ఉండకూడదు అని వేంటనే భరతుడు ఉన్న రాజ్యానికి కబురు పంపారు. భరతుడు వచ్చాక తండ్రికి చేయాల్సిన పితృ కార్యాలన్నీ చేసాడు, గురువైన వశిష్టులవారు రాజ్యాన్ని స్వీకరించమని చెప్పగానే భరథుడు ఏడిచాడు సభలో, తమ గురువుని దూషించాడు. నేనే దశరథునికి పుట్టినవాడినైతే రాముడు వదిలేసిన రాజ్యాన్ని నేను ఎట్లా అపహరించగలను అని తన తండ్రిపై ఆదరం చూపించాడు.
ఇక తల్లి విషయంలో చూస్తే రామచంద్రుడు తన తల్లి వద్దని చెప్పినా, సవతి తల్లి కోరిక మేరకు నార వస్త్రాలు ధరించి వనానికి వెళ్ళిపోయాడు. ఎవరి గురించి భాద పడేట్టు మాట్లాడ కూడదు అనేది రాముని ప్రవృత్తి అయితే అదే భరథుడు మరొకలా ప్రవర్తిస్తాడు. భరతుడు తన మేన మామ విరాజిత్తు వద్ద ఉన్నాడు. ఒకనాడు ఆయన మనస్సు అంతా వికలమైపోయింది, ఆయనకు ఏవో దుస్వప్నాలు వస్తున్నాయి. ఎదో ఘోర ఉపద్రవం జరుగుతుందేమోనని భయపడుతూ ఉన్నాడు. అంతలోనే భరతుడిని తీసుకు పోవడానికి అయోధ్య నుండి కొందరు వచ్చారు. వచ్చిన వారితో భరతుడు కుశల ప్రశ్నలు వేసాడు. తన తల్లుల గురించి అడుగుతూ ధార్మికుడైన శ్రీరామచంద్రుడిని కన్న కౌసల్యమ్మ కుశలమే కదా ? పుణ్యాత్ములైన లక్ష్మణ శత్రజ్ఞులని కన్న రెండవ తల్లి సుమిత్రమ్మ కుశలమే కదా? నన్ను కన్న తల్లి మూర్తీభవించిన అహంకారం కలిగిన కైకమ్మ ఎలా ఉంది అని అడిగాడు. దూతలతో అట్లా మాట్లాడాడు. ఆయన ప్రవర్తన అన్ని చోట్లా తన తల్లి గురించి అట్లానే ఉంటుంది. భరద్వాజ మహర్షి వద్దకి భరతుడు వచ్చినప్పుడు తన తల్లులను పరిచయం చేస్తూ కౌసల్యమ్మని, సుమిత్రమ్మని మంచిగా పరిచయం చేసాడు. దశరథుడు చనిపోవడానికి, రాముడు అడవిపాలు కావడానికి, రాజ్యం భ్రష్టం కావడానికి కారకురాలు ఇదిగో అని కైకమ్మను పరిచయం చేసాడు. భరద్వాజ మహర్షి త్రికాలజ్ఞుడు, తల్లిని అలా అనకూడదు అని భరతుడిని శాంత పరచాడు. తన తండ్రి విషయంలో ఎంత గౌరవం కలిగిన భరతుడు తన తల్లి విషయంలో ఎన్నొ మాటలు అన్నాడు. భరతుడు మేన మామ గారి ఇంటివద్ద నుండి వచ్చాక తన తల్లి వద్దకి వచ్చాడు, అంతా శూన్యంగా ఉంది. నాన్న కనిపించడం లేదు అను అడిగాడు. పుట్టిన ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికే వెళ్ళాడు అని ఉదాసీనంగా కైకమ్మ చెప్పింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నవాడే ఎమైంది అని అడిగాడు. రాముడిని వనానికి పంపారు అందుకే మానసిక దిగులుతో రాముడిని, సీతను, లక్ష్మణుడిని తలుచుకుంటూ మరణించాడు అని చెప్పింది. రాముడేమైనా ఇతరులని హింసించేవాడా మరి ఎందుకు వనానికి పంపారు, ఏం దోశం చేసాడని పంపారు అని అడిగాడు భరతుడు. ఆసమయంలో కూడా కైకమ్మ రాముడి గురుంచి చెబుతూ రాముడెక్కడైనా తప్పులు చేస్తాడా? దోశాలు చేస్తాడా ? ఎవరినైనా హింసిస్తాడా ? అట్లా ఎప్పుడూ చేయడు అని చెప్పింది. నీకు రాజ్యం కావాలని, రాముడిని అడవికి పంపించా అని చెప్పింది. వెంటనే కత్తి తీసి ఆమె మెడపై ఉంచి, నీపై ఎప్పుడూ రాముడు ప్రేమనే చూపాడు, నిన్ను చంపితే రాముడు నాతో మాట్లాడడు అందుకే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పాడు. అందుకు కారకురాలైన మంథరపై శత్రజ్ఞుడు కత్తి తీస్తే, ఈవిడపై రాముడు ప్రేమ చూపించేవాడు మనం ఈ పని చేస్తే రాముడు మనల్ని క్షమించడు అని భరతుడు వచ్చి వద్దు అని చెప్పాడు. రాముడు అందరిపై అంత ప్రేమ చూపిస్తే ఆయన సోదరులు వ్యతిరేఖంగా కనిపిస్తారు.
ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రవర్తన కనిపిస్తుంది. లక్ష్మణుడిని, భరతుడిని, శత్రజ్ఞుడిని చూసేప్పుడు మనం కేవలం బయటికి కనిపించే సామాన్య ప్రవృత్తితో చూడకూడదు. అది లోని సంస్కారాన్ని చూడాల్సి ఉంటుంది. సామాన్య ధర్మం ఏది, విశేష ధర్మం ఏది అనే విషయం ఉంటుంది. ఒక వ్యక్తిని కేవలం ఔద్యోగిక స్థాయిని బట్టి గుర్తించడం తగదు. మానవత్వాన్ని అనేక కోణాల్లో చూపడానికే రామాయణం. అప్పుడే పరిపూర్ణత అనేది ఏమితో తెలుస్తుంది. అట్లాంటి విలువలని తెలుపగలదు కనుకనే కొండలు ఎంతవరకు ఉంటాయో, నదులు ఎంతవరకు ఉంటాయో, సాగరం ఎంతవరకు ఉంటుందో అసలు ఈ భుమి ఎంతవరకు ఉంటుందో అంతవరకూ రామకథ ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు. మనిషికి ఆ విలువలని తన సంస్కార రూపంలో పండించుకోవాల్సి ఉంటుంది. రాముడు పైకి కనిపించే జివితం గురించి చూపించాడు. కానీ మనిషికి లోపల ఒక జీవితం ఉంటుంది, దాన్ని తెలుపడానికే రాముని సోదరులు. పైన ఉండే బంధాల వరకే పరిమితం కాకూడదు. ఒక సైనికుడు తన బంధువులని వదలను అని అంటే దేశానికి రక్షణ ఎక్కడ ఉంటుంది. అప్పుడు విశేష ధర్మం ఒకటి ఉంటుంది. అట్లా దైవాన్ని గుర్తించగలిగితే బయటికి కనిపించే ప్రవృత్తులని వదలడానికి వెనకాడలేదు రాముడి సోదరులు. అందుకే వారిని వేలు ఎత్తి చూపించనవసరం లేదు. లక్ష్మణుడు తన సేవ రాముడికే అని తెలిపాడు, ఆ చేయాల్సిన సేవ తాను అనుకున్నట్లు కాక ఆ రాముడు కోరినట్లు చేసి చూపాడు భరతుడు, శత్రజ్ఞుడు తన సేవ రాముడి భక్తులవరకు అని చూపాడు. శరీరం, లోన జ్ఞానం కలిసి నడిస్తే మనవత్వం అంటే. అది నిరూపించడం కోసం రాముడు ఆయన సోదరులు.
నడవడికతో నిరూపించుకోవాలే తప్ప మాటలతోకాదు
కైకమ్మ తన భర్త ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాముడిని అడవికి పంపింది. దశరథుడు మరణించాక భరతుడు వచ్చి జరిగిన ఉపద్రవం తెలుసుకున్నాడు. నీరు త్రాగిన మట్టి పాత్రని మరొక్కసారి తిరిగి వాడని వాడు రాముడు, ఇక నీవు రాజ్యాన్ని పద్నాలుగు సంవత్సరాలు పాలించాక, నీవు పాలించిన రాజ్యాన్ని ఎన్నటికీ తిరిగి తీసుకోడు అని కైకమ్మ భరతుడితో చెప్పింది. అందుకు భరతుడు నేను స్వప్నంలో కూడా రాజ్యాన్ని స్వీకరిస్తానని ఊహించుకోకు, అట్లా చేస్తే నేను రామ సోదరుడిని ఎట్లా అవుతాను, నేను రాముడి దాసుడిగానే ఉంటాను అని ప్రతిజ్ఞచేసాడు. కైకమ్మ చేసిన పనికి పాపం భరతుడిని తిట్టని వారు లేరు. ఆపై కౌసల్యమ్మ వద్దకి భరతుడు వచ్చినప్పుడు రాజ్యాన్ని నిష్కంఠకంగా అనుభవించడానికి మంచి ఉపాయం చేసావు అని అనేసరికి భరతుడు ఎంతో శోకించాడు, ఎన్నో శాపనార్థాలు పెట్టుకున్నాడు. తనని తాను దూషించుకొని స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు కౌసల్యమ్మకు నమ్మకం కలిగి భరతుడిని ఓదార్చింది. అప్పుడు వశిష్టులవారు వచ్చి కొన్ని మాటలు అన్నాడు. పాపం ఏంతప్పు చేయకున్నా అందరు విసుగుకున్న వారే.
భరతుడు రాముడినే రాజు చేయాలని అడవికి వచ్చాడు. ఎందరో ఎన్నో రకాలుగా దూషించారు. ఆటవికుడైన గుగుడు ఏపాపం చేయని రామునికి ఎం చేద్దాం అని ఇంత సైన్యం పట్టుకొని వచ్చవు అని అడిగాడు. భరద్వాజుడు కూడా అట్లానే అడిగాడు. ఒక్క సారి కుప్ప కూలి రోదించాడు. తన నైజాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. మాటకు మాట సమాధానం ఇవ్వలేదు. భరద్వాజుడు తన తపస్సంపద అంతా వాడి ఒక పెద్ద విలాసవంతమైన నగరం సృజించాడు. అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి భరతుడిని సింహాసనం పై కూర్చోమని చెప్పాడు. అందుకు భరతుడు వెళ్ళి సింహాసనంపై రాముడు కూర్చున్నాడని భావిస్తూ వింజామరం ఊపుతూ ఉండిపోయాడు. అప్పుడు భరద్వాజ మహర్షికి తన తపస్సు సార్థకం అయిందని, ఒక మంచి భక్తునికోసం వాడాను అని అనుకున్నాడు. అట్లా అనేక చోట్ల భరతుడు తన ప్రవర్తన చేత నిరూపించుకున్నాడు. కానీ తాను మాటకు మాట అని నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. తన ప్రవర్తన చేత, తన నడవడిక చేత గుర్తించగలిగేట్టు నిరూపించుకున్నాడు. రావణ వధ అనంతరం దేవతలతో పాటు దశరథుడు కూడా వచ్చి రాముడిని కోరిక కోరుకో అని అడిగినప్పుడు భరతుడిని కొడుకుగా భావించను అన్నావు, ఆమాట వెనకకు తీసుకో అని అడిగాడు. అది భరతుని దోశం కాదు, కైకమ్మది కూడా కాదు ఇదంతా దేవతలు చేయించిన పని అని ఇప్పుడు తెలిసింది అని అంటాడు. మనిషిపై నింద వస్తే నడవడికతో నిరూపించుకోవాలి కానీ దెబ్బలాడ కూడదు.
రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మన్నాడు, అందుకు ఒప్పుకోలేదు రాముడు. నీవు రాకుంటే నీ ప్రాతినిద్యం వహించే ఎవరైనా ఒకరు ఉండాలి, నేను పాలించడం జరగదు అని చెప్పాడు. అందుకు బంగారు పాదుకలని తెప్పించి రామచంద్రుడు నిలబడితే, ఇవి లోకాన్ని రక్షించేవి అని సంకల్పం చేసి రాముడు ఇచ్చాడు. పాదుకలే పాలిస్తాయి అని అప్పుడు భరతుడు తీసుకొని రాజ్య పాలన చేసాడు. నందిగ్రామంలో ఉండి, రాముని వలె వనవాసంలో ఉన్నట్లే కందమూలాలను తింటూ, నియమాలని పాటిస్తూ పాలించాడు. అన్న మీద ఉన్న ప్రేమచే పాటించాడు, ధర్మానికి కట్టుబడి ఉండటం ఎలానో నిరూపించుకున్నాడు. రామ పాదుకల యందు ఉంచి తన కార్యక్రమాలని చేసాడు. మానవునిగా అవకాశం ఇచ్చిన దైవాన్ని మరచి ప్రవర్తించ కూడదు అనే విషయం మనకు భరతుడిని చూస్తే తెలుస్తుంది. దైవానికి దాసునిగా బ్రతకాలి అని తెలిపాడు. దాస భావం ధర్మం విషయంలో ఇట్లా ఉండాలి.

భగవంతుడు ప్రేమ కృషీవరుడు
మనుష్యులలో పుట్టుకతో వివిద జాతులు అని కొన్ని తేడాలు, ఒక్కోక్కరి శరీర ఆకృతులలో ఎన్నో తేడాలు ఉన్నాయి, అవి మనం కోరుకొని తెచ్చుకున్నవి కావు. వాటిని చూసి మిడిసి పడటం, ఒకరిని అవహేళన చేయడం కానీ, ఆక్షేపన చేయడం కానీ తగదు. మనకిచ్చిన దానితో మనం వాడుకొని, ప్రక్కవాడిని గౌరవించాలి. ఇది చేయాలంటే మొదట మన మనస్సు వికసించాలి, మానవత్వం పరిమళించాలి. ఎలా వస్తుంది మానవత్వం. మనిషి తప్ప మిగతా ప్రాణులు వేటి మానాన అవి బ్రతుకుతాయి. క్రూర మృగాలు వాటికి అవసరం అయినప్పుడు మాత్రమే హింసిస్తాయి, అవసరం లేనప్పుడు మరో జంతువును కష్టపెట్టవు. అవసరం ఉన్న లేకున్నా ఒకరిని హింసించడం, అవసరానికి మించి దాచుకోవడం ఇవన్నీ అలవాట్లు మనిషికే ఉన్నాయి. అందుకే మనిషికి శాస్త్రాలు అవసరమయ్యాయి. మనిషి కోసమే అవతారాలు వచ్చాయి. మనిషికి శిక్షణ అవసరమైంది. ఇలా చేయి అని ఏ జంతువుకీ పాటాలు అవసరం చెప్పనవసరం లేదు. నియమ బద్దమైన జీవనాన్ని సాగిస్తాయి. నియమాలకు తిలోదకాలు ఇవ్వగలిగే తెలివి మానవుడికి మాత్రమే ఉంది. అందుకే మానవుడికి వెనకాతల నియంత్రణ అవసరమైంది. కట్టుబాటు అనేది అవసరమైంది. మానవత్వాన్ని పరిమళింపజేయడం కోసం ఎందరెందరో మహానుభావులు యుగ యుగాల నుండి అవతరించారు.
ఇన్ని యుగాలుగా మారని వారి కోసం ప్రయత్నాలు ఎందుకు ? అంటే ఇది ఒకే మనిషి అట్లానే ఉంటే అవసరం లేదు, కానీ లోకంలో ఒకే మనిషి ఉండటం లేదు. మానవ జాతి సాగుతుంది. కానీ వ్యక్తులు మారుతున్నారు. వారైనా బాగుపడతారేమోనని భగవంతుడి ఆశ. హిరణ్యకశపుడు మారతాడేమోనని కొన్ని వేల సంవత్సరాలు ప్రయత్నించి చూసాడు. కనీసం ఆయన కుమారుడు పుట్టబోయే ముందు హిరణ్యకశపుడి భార్యను నారదులవారి ఆశ్రయంలో ఉంచి ఆ గర్భంలో ఉన్న శిషువుకు మంచిమాటలు చెప్పించాడు. అందుకే ఈ నాటికీ మనం భక్తులెవరు అంటే ప్రహ్లాదుడు అని ఈనాటికీ మనం తలచుకొనేంత ఎత్తుకు ఎదిగి పోయాడు. నీవు బాగుపడక పోయినా నీ పిల్లవాడైనా బాగు పడతాడేమోనని ఆశ. పంట పండించే రైతు మండుటెండలో మంచు రాత్రుల్లో శ్రమించి మనకు తిండి పెడుతారు. ఒక సారి నీరు లేక, ఒక సారి నీరు ఎక్కువై, ఒక్కోసారి ఒక్కో ఇబ్బంది. రైతు విసుగు చెందక పంట పండించే ప్రయత్నం చేస్తాడు. భగవంతుడు అట్లాంటి కృషీవరుడు అని చెబుతాయి శాస్త్రాలు. భగవంతునికి క్షేత్రజ్ఞుడు అని పేరు.
మన శరీరం ఒక క్షేత్రం, దానిలో ఏదైనా పండించవచ్చు. ఈ శరీరమనే క్షేత్రంలో మంచి గుణాలు పండించవచ్చు, చెడు గుణాలు పండించవచ్చు. నేలలో మొక్కరావాలి అని గింజ నాటితే అసలు పంట కంటే కలుపు ఎక్కువగా వచ్చినట్లే మన శరీరంలో అసురీప్రవృత్తులే ఎక్కువ పైకి వస్తాయు, మంచి దైవీ గుణాలతో కంటే. మంచి గుణాల పంట పండాలి అని మనం కోరుకోవాలి. కానీ జీవుడు చాలా బలహీనుడు, శరీరం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు. మనం ఎట్లా ఈ శరీరమనే క్షేత్రాన్ని ఎట్లా నడుపాలో తెలుపడానికే "అహం ఆత్మా గుణాకేశ సర్వ భూత ఆశయ స్థితః" మన వెంట ఉండి సహకరిస్తూ ఉంటా అని భగవంతుడూ మనతో ఎప్పుడూ ఉంటాడు. కానీ మనకు ఆయనపై భారం వదలాలని అనిపించదు. అన్నీ నేనే చేస్తున్నా అనే అహంకారం మనకు. మనలోని చెడును వదలాలన్నా బెంగనే. భగవంతునిపై భారం పెడితే నేను చెడుని తొలగిస్తా అని చెప్పాడు, కానీ మనం కష్టపడి సంపాదించిన చెడు ఎక్కడైనా పోతుందేమోనని బెంగ. మంచివారిమి అవుతామేమో అని బెంగ. ఇది మానవుడి బలహీనత.
భగవంతుడు నిరాశ చెందలేదు, యుగ యుగాలుగా సాగిస్తున్న ప్రేమ కృషీవరుడు. ఆ మంచి ప్రేమనే భక్తి అని పేరుపెట్టారు. ఈ నాడు మనం దిగజారుతున్న దాన్ని ప్రేమ అని చెబుతున్నాం. ప్రేమ తండ్రి యందు ఉంటే గౌరవం అని పేరు, ఒక పిల్లవాడి యందు ఉంటే అది వాత్సల్యం అని పేరు, తోటివాడి యందు ఉంటే ఆదరం అని అంటాం, సమాన వయస్సు కలవారి యందు ఉంటే అది మైత్రి అని అంటాం. ఇవన్నీ ప్రేమనే. అదే మన వెనకాతల ఉండి నడిపే భగవంతుని యందలి కృతజ్ఞతా భావం ఉంటే దాన్నే భక్తి అని అంటాం. అది ఎంత బాగా పండితే మనమే కాదు మన తోటివారికి కూడా అందివ్వగలం. అట్లా భగవంతుడు మనలో ప్రేమని పండించడానికి పడరాని శ్రమలు పడ్డాడు. నమ్మళ్వార్ చెబుతారు ఒక ప్రబంధంలో "పడాదన పట్టు మనిషర్కా" అని. హే భగవన్! ఈ మనుష్యుల కోసమా నీవు పాట్లు పడ్డావు. అయ్యో చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకోరయ్యా వీళ్ళు. ఇలాంటి వారికోసం నీవు ఈ నాటికీ ఎన్ని పాట్లు పడుతున్నావో అని రామావతారాన్ని తలచుకొని అంటాడు. ఎవడైనా మనిషి మనస్సున్నవాడైతే రామ నామం తప్ప మరొకదాన్ని స్మరిస్తాడా "కర్పాల్ ఇరామ పిరానై అల్లాళ్ మత్తుమ్ కర్పరో" అని సవాలు విసిరాడు నమ్మాళ్వార్. ఎదైనా నేర్వాలి అని ఆరంభంచేసిన వ్యక్తి రామ నామం తప్ప వేరేది నేరుస్తాడా ? ఇది మన సమాజంలో ఎంతో లోతుగా నాటుకున్న విషయం. అక్షరాలు రాయడం రాకున్నా శ్రీరామ అనేది రాయగలిగేవారు. ఎందుకంటే ఈ మనుషుల కోసం పడరాని పాట్లు పడ్డాడు రాముడు.
రామసోదరులలోని వైచిత్ర్యం
మనిషిని ఒక సమగ్రమైన రూపంలో తీర్చి దిద్దడానికి భగవంతుడు రామావతారంలో నాలుగు రూపాలతో వచ్చాడు. ఒక్కో విషయాన్ని ఒక్కో కోణంలో అందించాడు. మానవుడికి సమగ్రత ఏమిటి? శరీరం పుష్టిగా ఏర్పడి ఏ అంగ వైకల్యం లేకుండా సంపదలతో తులతూగుతున్నంత మాత్రం చేత సమగ్రత అవ్వదు ఎప్పుడూ. సమగ్రత ఏర్పడాలంటే చేయాల్సిన శారీరకమైన, మానసికమైన అన్ని రంగాలను గుర్తించి ప్రవర్తించగలిగితేనే అది పరిపూర్ణత. మానవ జీవితానికి అవసరమైన విలువలను నేర్పటానికి వచ్చిన అవతారమే రామావతారం. అందులో ఆయన లక్ష్మణ భరత శత్రజ్ఞులతో వచ్చాడు. మనిషి ఒక్కడే అయినా విలువలు బహు ముఖంగా ఉంటాయి. మన చుట్టూ ఉండే తల్లి దండ్రులు, సోదరులు, మిత్రులు మరియూ శత్రువులతో ఎట్లా ఉండాలి, కుటుంబంలో మరియూ సమాజంలో భాద్యత తెలుపడానికి రాముడు. రాముడు తన తండ్రితో, తన తల్లితో, తన సోదరులతో, ఋషులతో, తన మిత్రులైన ఆటవికులతో, పక్షులతో, జంతువులతో, రాక్షసులతో ఎట్లా ప్రవర్తించాడు ఇది రాముడిని చూసినప్పుడు గుర్తించాల్సింది. మనిషి అంతవరకే పరిమితం కాదు. ఎన్నో విలువలు ఉంటాయి, ఒక్కో కోణాన్ని తెలుపడానికే లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు ఒక్కో రూపంతో తెలిపాడు. అందుకే లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞులను చూసేప్పుడు శారీరక పరిది దాటి చూడాల్సి ఉంటుంది.
కైకమ్మకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని అనుకున్నాడు దశరథుడు, కానీ రాముడితో చెప్పలేక పోయాడు. కైకమ్మే రాముడితో ఈ విషయం తెలిపింది. తండ్రి నోటితో చెప్పలేదు, తన తల్లి కౌసల్య వెళ్ళవద్దు పిల్లలపై తండ్రికంటే తల్లికే ఎక్కువ హక్కు అని చెప్పింది. సవతి తల్లి మాటకు కూడా ఎంతో గౌరవం ఇచ్చాడు. వెంటనే నాకు వనవాసమే ఇష్టం అని మనస్సుని సిద్దం చేసుకొని చెప్పేసాడు రాముడు. తండ్రిగారి సంకల్పం కోసం రాముడు అట్లా చేస్తే, ఆతండ్రిగారి కొడుకే అయిన లక్ష్మణుడు పూర్తి విరుద్దంగా ప్రవర్తించాడు. రాముని వెంట లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు. వారితో పాటు కొంత దూరం సుమంత్రుడు వచ్చి, తిరిగి వెళ్ళే ముందు తమ తండ్రితో ఎం చెప్పాలో ఒక్కోక్కరిని సందేశం అడిగాడు. సుమంత్రునితో తన తండ్రికి కైకమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం కానీ తన తల్లి కౌసల్యమ్మను మరచిపోవద్దని, ఆమెను భాద పెట్ట వద్దని తన తండ్రికి సందేశం చెప్పాడు రాముడు. సుమంత్రుడు సీతమ్మ వద్దకి వెళ్తే, ఆమె అసలు కష్టం తెలియనిది, ఆమెకు ఏం మాట్లాడాలో కూడా తెలియక తల దించుకొని కూర్చుంది. సుమంత్రుడు లక్ష్మణుడి వద్దకి వెళ్తే నేను అతడిని తండ్రి అనే భావించడం లేదు అని చెప్పేసాడు. నాకు సర్వం రాముడనే చెప్పాడు. ఎంత ఆశ్చర్యం ఒక కుమారుడు తండ్రికోరకు అడవుకే వెళ్ళడానికి సిద్దం అయ్యాడు, కానీ మరొక కుమారుడు తండ్రినే నేను గుర్తించడం లేదు అని చెప్పాడు. భరతుడి విషయంలో మరొక ప్రవర్తన. తండ్రి మరణించగానే రాజ్యం రాజు లేకుండా ఉండకూడదు అని వేంటనే భరతుడు ఉన్న రాజ్యానికి కబురు పంపారు. భరతుడు వచ్చాక తండ్రికి చేయాల్సిన పితృ కార్యాలన్నీ చేసాడు, గురువైన వశిష్టులవారు రాజ్యాన్ని స్వీకరించమని చెప్పగానే భరథుడు ఏడిచాడు సభలో, తమ గురువుని దూషించాడు. నేనే దశరథునికి పుట్టినవాడినైతే రాముడు వదిలేసిన రాజ్యాన్ని నేను ఎట్లా అపహరించగలను అని తన తండ్రిపై ఆదరం చూపించాడు.
ఇక తల్లి విషయంలో చూస్తే రామచంద్రుడు తన తల్లి వద్దని చెప్పినా, సవతి తల్లి కోరిక మేరకు నార వస్త్రాలు ధరించి వనానికి వెళ్ళిపోయాడు. ఎవరి గురించి భాద పడేట్టు మాట్లాడ కూడదు అనేది రాముని ప్రవృత్తి అయితే అదే భరథుడు మరొకలా ప్రవర్తిస్తాడు. భరతుడు తన మేన మామ విరాజిత్తు వద్ద ఉన్నాడు. ఒకనాడు ఆయన మనస్సు అంతా వికలమైపోయింది, ఆయనకు ఏవో దుస్వప్నాలు వస్తున్నాయి. ఎదో ఘోర ఉపద్రవం జరుగుతుందేమోనని భయపడుతూ ఉన్నాడు. అంతలోనే భరతుడిని తీసుకు పోవడానికి అయోధ్య నుండి కొందరు వచ్చారు. వచ్చిన వారితో భరతుడు కుశల ప్రశ్నలు వేసాడు. తన తల్లుల గురించి అడుగుతూ ధార్మికుడైన శ్రీరామచంద్రుడిని కన్న కౌసల్యమ్మ కుశలమే కదా ? పుణ్యాత్ములైన లక్ష్మణ శత్రజ్ఞులని కన్న రెండవ తల్లి సుమిత్రమ్మ కుశలమే కదా? నన్ను కన్న తల్లి మూర్తీభవించిన అహంకారం కలిగిన కైకమ్మ ఎలా ఉంది అని అడిగాడు. దూతలతో అట్లా మాట్లాడాడు. ఆయన ప్రవర్తన అన్ని చోట్లా తన తల్లి గురించి అట్లానే ఉంటుంది. భరద్వాజ మహర్షి వద్దకి భరతుడు వచ్చినప్పుడు తన తల్లులను పరిచయం చేస్తూ కౌసల్యమ్మని, సుమిత్రమ్మని మంచిగా పరిచయం చేసాడు. దశరథుడు చనిపోవడానికి, రాముడు అడవిపాలు కావడానికి, రాజ్యం భ్రష్టం కావడానికి కారకురాలు ఇదిగో అని కైకమ్మను పరిచయం చేసాడు. భరద్వాజ మహర్షి త్రికాలజ్ఞుడు, తల్లిని అలా అనకూడదు అని భరతుడిని శాంత పరచాడు. తన తండ్రి విషయంలో ఎంత గౌరవం కలిగిన భరతుడు తన తల్లి విషయంలో ఎన్నొ మాటలు అన్నాడు. భరతుడు మేన మామ గారి ఇంటివద్ద నుండి వచ్చాక తన తల్లి వద్దకి వచ్చాడు, అంతా శూన్యంగా ఉంది. నాన్న కనిపించడం లేదు అను అడిగాడు. పుట్టిన ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడో అక్కడికే వెళ్ళాడు అని ఉదాసీనంగా కైకమ్మ చెప్పింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నవాడే ఎమైంది అని అడిగాడు. రాముడిని వనానికి పంపారు అందుకే మానసిక దిగులుతో రాముడిని, సీతను, లక్ష్మణుడిని తలుచుకుంటూ మరణించాడు అని చెప్పింది. రాముడేమైనా ఇతరులని హింసించేవాడా మరి ఎందుకు వనానికి పంపారు, ఏం దోశం చేసాడని పంపారు అని అడిగాడు భరతుడు. ఆసమయంలో కూడా కైకమ్మ రాముడి గురుంచి చెబుతూ రాముడెక్కడైనా తప్పులు చేస్తాడా? దోశాలు చేస్తాడా ? ఎవరినైనా హింసిస్తాడా ? అట్లా ఎప్పుడూ చేయడు అని చెప్పింది. నీకు రాజ్యం కావాలని, రాముడిని అడవికి పంపించా అని చెప్పింది. వెంటనే కత్తి తీసి ఆమె మెడపై ఉంచి, నీపై ఎప్పుడూ రాముడు ప్రేమనే చూపాడు, నిన్ను చంపితే రాముడు నాతో మాట్లాడడు అందుకే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పాడు. అందుకు కారకురాలైన మంథరపై శత్రజ్ఞుడు కత్తి తీస్తే, ఈవిడపై రాముడు ప్రేమ చూపించేవాడు మనం ఈ పని చేస్తే రాముడు మనల్ని క్షమించడు అని భరతుడు వచ్చి వద్దు అని చెప్పాడు. రాముడు అందరిపై అంత ప్రేమ చూపిస్తే ఆయన సోదరులు వ్యతిరేఖంగా కనిపిస్తారు.
ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రవర్తన కనిపిస్తుంది. లక్ష్మణుడిని, భరతుడిని, శత్రజ్ఞుడిని చూసేప్పుడు మనం కేవలం బయటికి కనిపించే సామాన్య ప్రవృత్తితో చూడకూడదు. అది లోని సంస్కారాన్ని చూడాల్సి ఉంటుంది. సామాన్య ధర్మం ఏది, విశేష ధర్మం ఏది అనే విషయం ఉంటుంది. ఒక వ్యక్తిని కేవలం ఔద్యోగిక స్థాయిని బట్టి గుర్తించడం తగదు. మానవత్వాన్ని అనేక కోణాల్లో చూపడానికే రామాయణం. అప్పుడే పరిపూర్ణత అనేది ఏమితో తెలుస్తుంది. అట్లాంటి విలువలని తెలుపగలదు కనుకనే కొండలు ఎంతవరకు ఉంటాయో, నదులు ఎంతవరకు ఉంటాయో, సాగరం ఎంతవరకు ఉంటుందో అసలు ఈ భుమి ఎంతవరకు ఉంటుందో అంతవరకూ రామకథ ఉంటుంది అని చతుర్ముఖ బ్రహ్మ అన్నాడు. మనిషికి ఆ విలువలని తన సంస్కార రూపంలో పండించుకోవాల్సి ఉంటుంది. రాముడు పైకి కనిపించే జివితం గురించి చూపించాడు. కానీ మనిషికి లోపల ఒక జీవితం ఉంటుంది, దాన్ని తెలుపడానికే రాముని సోదరులు. పైన ఉండే బంధాల వరకే పరిమితం కాకూడదు. ఒక సైనికుడు తన బంధువులని వదలను అని అంటే దేశానికి రక్షణ ఎక్కడ ఉంటుంది. అప్పుడు విశేష ధర్మం ఒకటి ఉంటుంది. అట్లా దైవాన్ని గుర్తించగలిగితే బయటికి కనిపించే ప్రవృత్తులని వదలడానికి వెనకాడలేదు రాముడి సోదరులు. అందుకే వారిని వేలు ఎత్తి చూపించనవసరం లేదు. లక్ష్మణుడు తన సేవ రాముడికే అని తెలిపాడు, ఆ చేయాల్సిన సేవ తాను అనుకున్నట్లు కాక ఆ రాముడు కోరినట్లు చేసి చూపాడు భరతుడు, శత్రజ్ఞుడు తన సేవ రాముడి భక్తులవరకు అని చూపాడు. శరీరం, లోన జ్ఞానం కలిసి నడిస్తే మనవత్వం అంటే. అది నిరూపించడం కోసం రాముడు ఆయన సోదరులు.
నడవడికతో నిరూపించుకోవాలే తప్ప మాటలతోకాదు
కైకమ్మ తన భర్త ప్రాణాలు కూడా లెక్క చేయకుండా రాముడిని అడవికి పంపింది. దశరథుడు మరణించాక భరతుడు వచ్చి జరిగిన ఉపద్రవం తెలుసుకున్నాడు. నీరు త్రాగిన మట్టి పాత్రని మరొక్కసారి తిరిగి వాడని వాడు రాముడు, ఇక నీవు రాజ్యాన్ని పద్నాలుగు సంవత్సరాలు పాలించాక, నీవు పాలించిన రాజ్యాన్ని ఎన్నటికీ తిరిగి తీసుకోడు అని కైకమ్మ భరతుడితో చెప్పింది. అందుకు భరతుడు నేను స్వప్నంలో కూడా రాజ్యాన్ని స్వీకరిస్తానని ఊహించుకోకు, అట్లా చేస్తే నేను రామ సోదరుడిని ఎట్లా అవుతాను, నేను రాముడి దాసుడిగానే ఉంటాను అని ప్రతిజ్ఞచేసాడు. కైకమ్మ చేసిన పనికి పాపం భరతుడిని తిట్టని వారు లేరు. ఆపై కౌసల్యమ్మ వద్దకి భరతుడు వచ్చినప్పుడు రాజ్యాన్ని నిష్కంఠకంగా అనుభవించడానికి మంచి ఉపాయం చేసావు అని అనేసరికి భరతుడు ఎంతో శోకించాడు, ఎన్నో శాపనార్థాలు పెట్టుకున్నాడు. తనని తాను దూషించుకొని స్పృహతప్పి పడిపోయాడు. అప్పుడు కౌసల్యమ్మకు నమ్మకం కలిగి భరతుడిని ఓదార్చింది. అప్పుడు వశిష్టులవారు వచ్చి కొన్ని మాటలు అన్నాడు. పాపం ఏంతప్పు చేయకున్నా అందరు విసుగుకున్న వారే.
భరతుడు రాముడినే రాజు చేయాలని అడవికి వచ్చాడు. ఎందరో ఎన్నో రకాలుగా దూషించారు. ఆటవికుడైన గుగుడు ఏపాపం చేయని రామునికి ఎం చేద్దాం అని ఇంత సైన్యం పట్టుకొని వచ్చవు అని అడిగాడు. భరద్వాజుడు కూడా అట్లానే అడిగాడు. ఒక్క సారి కుప్ప కూలి రోదించాడు. తన నైజాన్ని నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. మాటకు మాట సమాధానం ఇవ్వలేదు. భరద్వాజుడు తన తపస్సంపద అంతా వాడి ఒక పెద్ద విలాసవంతమైన నగరం సృజించాడు. అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి భరతుడిని సింహాసనం పై కూర్చోమని చెప్పాడు. అందుకు భరతుడు వెళ్ళి సింహాసనంపై రాముడు కూర్చున్నాడని భావిస్తూ వింజామరం ఊపుతూ ఉండిపోయాడు. అప్పుడు భరద్వాజ మహర్షికి తన తపస్సు సార్థకం అయిందని, ఒక మంచి భక్తునికోసం వాడాను అని అనుకున్నాడు. అట్లా అనేక చోట్ల భరతుడు తన ప్రవర్తన చేత నిరూపించుకున్నాడు. కానీ తాను మాటకు మాట అని నిరూపించుకొనే ప్రయత్నం చేయలేదు. తన ప్రవర్తన చేత, తన నడవడిక చేత గుర్తించగలిగేట్టు నిరూపించుకున్నాడు. రావణ వధ అనంతరం దేవతలతో పాటు దశరథుడు కూడా వచ్చి రాముడిని కోరిక కోరుకో అని అడిగినప్పుడు భరతుడిని కొడుకుగా భావించను అన్నావు, ఆమాట వెనకకు తీసుకో అని అడిగాడు. అది భరతుని దోశం కాదు, కైకమ్మది కూడా కాదు ఇదంతా దేవతలు చేయించిన పని అని ఇప్పుడు తెలిసింది అని అంటాడు. మనిషిపై నింద వస్తే నడవడికతో నిరూపించుకోవాలి కానీ దెబ్బలాడ కూడదు.
రాముడిని రాజ్యానికి తిరిగి రమ్మన్నాడు, అందుకు ఒప్పుకోలేదు రాముడు. నీవు రాకుంటే నీ ప్రాతినిద్యం వహించే ఎవరైనా ఒకరు ఉండాలి, నేను పాలించడం జరగదు అని చెప్పాడు. అందుకు బంగారు పాదుకలని తెప్పించి రామచంద్రుడు నిలబడితే, ఇవి లోకాన్ని రక్షించేవి అని సంకల్పం చేసి రాముడు ఇచ్చాడు. పాదుకలే పాలిస్తాయి అని అప్పుడు భరతుడు తీసుకొని రాజ్య పాలన చేసాడు. నందిగ్రామంలో ఉండి, రాముని వలె వనవాసంలో ఉన్నట్లే కందమూలాలను తింటూ, నియమాలని పాటిస్తూ పాలించాడు. అన్న మీద ఉన్న ప్రేమచే పాటించాడు, ధర్మానికి కట్టుబడి ఉండటం ఎలానో నిరూపించుకున్నాడు. రామ పాదుకల యందు ఉంచి తన కార్యక్రమాలని చేసాడు. మానవునిగా అవకాశం ఇచ్చిన దైవాన్ని మరచి ప్రవర్తించ కూడదు అనే విషయం మనకు భరతుడిని చూస్తే తెలుస్తుంది. దైవానికి దాసునిగా బ్రతకాలి అని తెలిపాడు. దాస భావం ధర్మం విషయంలో ఇట్లా ఉండాలి.
ప్రేమని ఎట్లా పంచాలో తెలిపేది రామాయణం
రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం. ఎవరికో తోచక వ్రాసిన కథనో లేక నవలనో కాదు. చతుర్ముఖ బ్రహ్మ యుద్దానంతరం జరిగిన సన్నివేశాలని జరిగినవి జరిగినట్లు తెలిసేలా వాల్మీకికి వరం ఇచ్చాడు. ఆదృష్టాన్ని వాడి వాల్మీకి "హసితం భాషితం చైవ గతిర్యాయశ్చ చేష్టితం" ఎవరు నవ్వినా, ఏమి మాట్లాడినా, కదలినా, ఏది అనుకున్నా, ప్రతి స్పందనని ఉన్నది ఉన్నట్టు చూసి జరిగినదాన్ని జరిగినట్లు వ్రాసాడు. అట్లా ఎలా సాధ్యం అని అనిపిస్తుంది, అంటే ఈ నాడు ఏదో చేయ్యి చూసి లేక పుట్టిన సమయం బట్టి జరిగిన విషయాలు చెప్పగలిగేవారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇలాంటి విషయాలని గుర్తించేప్పుడు మనకు తోచినట్లు కొన్నింటిని మనం మనకు ఊహిస్తుంటాం, పొరపాటు అక్కడే వస్తుంది.
ఒకసారి ఇంగ్లీషు దొరవారు ఒక గ్రామాన్ని పరిశీలన చేయడానికి వచ్చాడు, ఒక చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. ప్రక్కనే బట్టలని ఉడికిస్తూ, ఒక్కోటి తీసి బండకేసి కొడుతూ ఉతుకుతున్నాడు. ఇంగ్లీషు దొరవారు కొంతసేపు గమనించి ఒక నిర్ణయానికి వచ్చాడు, అసలు ఈ దేశం వారికి బుద్ది లేదు ఒక బండను పగలగొట్టాలంటే బట్టలతో కొడుతున్నారు, అట్లా పగలక పోతే ఆ బట్టను వేడి చెసి మరీ ప్రయత్నిస్తున్నారు అని తనకు తోచిన అవగాహనకి వచ్చేసాడు. అట్లానే సింధూలోయ నాగరికథని గూర్చి అట్లానే నిర్ణయించి చెప్పారు. సింధూ నది చుట్టు ప్రక్కన చిన్న చిన్న గొడలు కట్టి ఉంటాయి, వాటిని వారు వర్షపు నీరుని ఎక్కడికక్కడ నిలువ చేయడానికి కట్టినవి. కానీ వారు అవి ఆత్మ రక్షణకి ఏర్పాటు చేసుకున్న బంకర్లు అని తేల్చి చెప్పారు. పాశ్చాత్యులకి ఎప్పుడూ అవే ఆలోచనలు, ఎప్పుడు ఒకరిపై దాడిచేద్దామా అని. మన భారతీయమైన సంప్రదాయం అట్లా ఉండదు, అవసరమైతే ఒకరి సుఖం కోసం మన జీవితాన్ని ఇచ్చేసే మానవ మనస్తత్వం. రాక్షస ప్రవృత్తి కాదు. మన దేశంపై దాడి చేసి పాలించిన మొఘలాయీల విషయం తెలుసుకుంటే అర్థం అవుతుంది. రాజ్యం కొరకు తన సోదరుడిని చంపించడానికి వెనకాడలేదు ఔరంగజేబు.
శ్రీరామాయణం మానవత్వం అంటే ఎట్లా ఉండాలో అడుగడుగున నిరూపిస్తుంది. ఎవరెవరు ఏమేమి చేసారో అన్నీ పనులలో మానవత్వం పరిమళిస్తుంది. ఈ జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎట్లా పంచాలో కావాలి. అయోధ్యకాండలో తండ్రి రామచంద్రునికి రాజ్యం ఇవ్వాలని అనుకున్నాడు కానీ తల్లి భరతునికి ఇవ్వాలని కోరింది. ఈ విషయం కైకమ్మ రామచంద్రునితో చెబుతుంటే, తండ్రిగారు అంత సంకోచించాల్సింది ఏముంది, ఇది చెప్పడానికి ఇందులో అంత సందేహించాల్సిన అవసరం ఏముంది కనక, రామా అడవికి వెళ్ళు అని ఒక్క మాట చెబితే చాలు, "రాజ్యంవా వనవాసోవా వనవాసో మహోదయః" నాకు రాజ్యమైతేనేమి వనవాసమైతేనేమి రెండూ తండ్రి గారివే అని సంతోషంతో వనానికి వెళ్తా అని రాముడు చెప్పాడు.
చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు తన వెంట లక్షల మంది సైన్యంతో రాముడిని వెతుకుతూ వస్తున్నాడు. అంత మంది వచ్చేసరికి అడవిలో జంతువులు, పక్షులు చెల్ల చెదురు అవుతున్నాయి. అది గమనించి ఎవరైనా వేటకు వచ్చారా లేక ఏదైన యాత్ర జరుగుతుందా అని రాముడు లక్ష్మణ స్వామిని చెట్టు ఎక్కి చూడమన్నాడు. లక్ష్మణుడు చెట్టు ఎక్కి ద్వజాన్ని చూసి ఇంకేముంది వనవాసం అయ్యాక తిరిగి రాజ్యం ఇవ్వడం ఇష్టంలేక మన పై దాడికి వచ్చాడు భరతుడు, ధనస్సును సిద్దం చేసుకో, సీతమ్మను దాచి పెట్టు అంటూ కేకలు వేసాడు. రాముడు లక్ష్మణుడితో భయం ఎందుకు అని అన్నాడు. ఒక దానిపై అత్యాశ పెంచుకున్నప్పుడు, దాన్ని దూరం చేస్తారేమోనని భయం వేస్తుంది కానీ అసలు ఆశ లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుంది. భరతుని గురించి నాకు తెలుసు, ఒక వేల భరతునికి రాజ్యం కావాలనే ఆశ ఉంది అని నీవు అనుకుంటే ఒక పని చేస్తా, భరతుడు వచ్చాక నాతో పాటు వసవాసానికి భరతుడిని రమ్మంటా, నీవు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. వెంటనే తల దించుకొని నోరు ఎత్తలేదు లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడికి రాజ్యంపై ఆశ కాదు, రాముడిపై ప్రేమాతిశయం. మనం చుట్టూ ఉన్న వారితో ఎట్లా ప్రవర్తించాలో తెలుపుతుంది రామాయణం, అందుకే దాన్ని ఇతిహాస శ్రేష్టం అని అంటారు.
No comments:
Post a Comment