భగినీహస్త భోజనమంటే..
యమ ద్వితీయ అంటే ఏమిటి?
ఆ రోజు అన్నదమ్ములు.. సోదరి ఇంట భోజనం చేయాలంటారు ఎందుకు?
దీపావళి పండగ తర్వాత రెండు రోజులకు వచ్చే కార్తీక శుద్ధ విదియను యమద్వితీయగా చేసుకుంటారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పండగ. పురాణ కథలను అనుసరించి యముడికి ఒక సోదరి ఉన్నది. ఆమె పేరు యమి. సోదరి మనసులోని కూడని ఆలోచనలను పోగొట్టి యముడు ఆమెకు ధర్మాన్ని తెలియజెప్పిన రోజు ఇదేనని అంటారు. ఆనాడు యముడు తన సోదరి ఇంట భోజనం చేశాడని కథ ప్రచారంలో ఉంది. నాటి నుంచి యమద్వితీయ పండగగా వాడుకలోకి వచ్చింది. ఆనాడు భగినీ (సోదరి)హస్త భోజనం ఒక ఆచారంగా స్థిరపడింది. అన్నదమ్ములు సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని.. అక్కడ భోజనం చేసే ఈ ఆచారం సామాజికంగా, కుటుంబపరంగా చాలా ప్రయోజనకరమైనది. తోడబుట్టిన వారి మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో.. సంవత్సరంలో ఒక్కనాడైనా సోదరి యోగక్షేమాలు విచారించాలని ఈ పండగ గుర్తు చేస్తోంది.
- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

No comments:
Post a Comment