దీపారాధన సనాతన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది. దీపం ప్రాధాన్యాన్ని ఋగ్వేదం ఎంతో గొప్పగా నిర్వచించింది. సృష్టి, స్థితి, లయాలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అందుకే -
‘‘దీపం పరంజ్యోతి కళాది నమో నమో
దీప మంగళ జ్యోతి నమో నమో’’
‘పరంజ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభాలను ఇచ్చే దీపానికి నమస్కారం’ అని ప్రార్థిస్తాం.
‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే
ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్’’
అన్నారు పూర్వ ఋషులు. అంటే ‘ప్రబోధం ’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు.
నర(క) స్వభావం నశించి నారాయణత్వం
దీపావళికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నరకుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించగా, లోకాలన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయనీ, ముల్లోకాలనూ చీకట్లలో నింపిన అసురుని మరణంతో తిరిగి వెలుగులను నింపి చీకట్లను తరిమేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా దీపాలను వెలిగించి, కాంతిని నింపారనీ ఒక కథనం.
నరకుని సంహారాన్ని లోతుగా పరిశీలిస్తే, అతనిలో నరతత్త్వం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రాగ్జ్యోతిషపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అతను పరిపాలించేవాడు. అది నరకుని మనస్తత్త్వానికి దీటైనది. వెలుగు లేనిది. దుర్మార్గాలకు ఆలవాలమైనది. అరిషడ్వర్గాలనూ ఆసరాగా చేసుకొని, స్వార్థచింతనే పరమావధిగా భావించి అతను చేయని అకృత్యం లేదు. ద్వాపరంలో సత్యభామగా అవతరించిన భూదేవి తన కుమారుడి అకృత్యాలను చూడలేక... నరకుడిని వధించాలని తన పతి అయిన శ్రీకృష్ణుడిని కోరింది. నరక సంహారం జరిగింది.
చీకట్లు తొలగేయి. ప్రాగ్జ్యోతిషపురంలో శ్రీకృష్ణుని కారణంగా ఉదయకాంతులు వెల్లివిరిశాయి. ప్రజలందరూ ఆనంద హేలలో దీపాలను వెలిగించి దీపావళి చేసుకున్నారు. నారాయణుడిని నమ్మితే మనలోని నర(క) స్వభావాలు తొలగి, నారాయణత్వం సిద్ధిస్తుంది. దేహభావం నరకుడైతే, ఆత్మభావన నారాయణుడు. శరీరం తాను కాదనీ, అందులో ఉన్న క్షేత్రజ్ఞుడు (ఆత్మ) తాననీ తెలుసుకున్నప్పుడు పొందే అనుభూతే నరక సంహారం. ఇలా దీప ప్రజ్వలనాన్ని ప్రపంచంలో దాదాపు అన్ని మతాలవారూ సంప్రదాయబద్ధంగా ఆచరిస్తారు. సనాతన భారతీయ సంస్కృతికి సంకేతంగా నిలిచిన దీపారాధన - దీపావళి పర్వంగా ప్రాచుర్యం పొందింది.
లక్ష్మి స్థిరంగా ఉండేది అక్కడే!
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భక్తి’ అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం.
కళ్ళలో కనిపించే వెలుగు దాని కాంతి. జ్ఞానాన్ని దీపకాంతిగా, అజ్ఞానాన్ని చీకటిగా సంభావించారు. దీపకాంతి బాహ్యంలో చీకట్లను తొలగించడమే కాక, ఆంతర్యంలో ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా ఉభయ సంధ్యలలో దీపాలు వెలిగించాలి. దీపకాంతులు విరజిమ్మే ఇంటిలో లక్ష్మిసుస్థిరంగా ఉంటుందనీ, ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అశుభాలకు తావు ఉండదనీ శాస్త్రాలు అంటున్నాయి. యజ్ఞరూపమైన దీపారాధనకూ, లక్ష్మీ కృప పొందేందుకూ దీపావళి దోహదకారి అయిన పర్వం. ప్రతి ఇంటి ముంగిట దీపావళి రోజున దీపాల వరుసలు ప్రసరించే వెలుగులు అమవస నిశిని పున్నమి వెన్నెలతో నింపుతాయి. ఎటు చూసినా ఆనంద హేల. ప్రతి ఒక్కరిలో సంతోషాల సంరంభం.
మన పురాణాల్లో... కావ్యాల్లో...
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది.
దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు. సంస్కృత కావ్యాల్లోనే కాదు, పాళీ భాషలో కూడా దీపావళి మహోత్సవ ప్రస్తావన ఉంది. కేవలం హిందువులేకాదు, జైన, బౌద్ధ మతానుయాయులు కూడా దీపావళి పండుగను పాటిస్తారు. క్రైస్తవ, మహమ్మదీయ మతస్థులు వారివారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీపాలను వెలిగించడం కద్దు.

ఎ. సీతారామారావు
హిందువుల ప్రధాన పర్వదినాల్లో ఒకటైన దీపావళి అయిదు రోజుల పండుగ. ఈ వేడుకలు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమవుతాయి. కార్తిక శుద్ధ విదియతో ముగుస్తాయి. వీటిలో ఒక్కో రోజుకూ ఒక విశిష్టత, ఘనమైన పౌరాణిక నేపథ్యం ఉన్నాయి. ధన త్రయోదశి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ‘ధన త్రయోదశి’ అంటారు. దీన్ని సంపత్ప్రదాయకమైన రోజుగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే దినంగా పురాణాలు చెబుతున్నాయి. క్షీర సాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఇదేనని చెబుతారు. కాబట్టి ఈ రోజున లక్ష్మీ దేవినీ, ధనాధిపతి అయిన కుబేరుడినీ పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందంటారు. దీన్ని ‘కుబేర త్రయోదశి’, ‘ఐశ్వర్య త్రయోదశి’ అని కూడా పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఈరోజును ‘ధన్ తేరస్’ అంటారు. ఈ రోజున బంగారం, వెండి కొంటే ఏడాది పొడుగునా లక్ష్మీదేవి ఇంట్లో కొలువవుతుందని విశ్వసిస్తారు. అంతేకాదు, పితృదేవతలు ఈ రోజున తమ వారసుల ఇళ్ళకు వస్తారనే నమ్మిక ఉంది. లక్ష్మీదేవితో పాటు ఆరోగ్యానికి అధిపతి, ఆయుర్వేదానికి మూలపురుషుడు అయిన ధన్వంతరి కూడా క్షీరసాగరం నుంచి అమృత కలశాన్ని చేతబూని ఈ రోజే ఉద్భవించాడని పురాణాలు అంటున్నాయి. అందుకే దీన్ని ‘ధన్వంతరి త్రయోదశి’గా వ్యవహరిస్తారు. ఆయనను స్మరిస్తే ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతుందని విశ్వసిస్తారు. ఈ రోజుకు ‘యమ త్రయోదశి’ అని మరో పేరు ఉంది. ఈ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగిస్తారు. వాటిని ‘యమదీపాలు’ అంటారు. ఆ ఇలా దీపాలు వెలిగిస్తే యముడు ప్రసన్నుడవుతాడనీ, అకాల మృత్యువును నివారిస్తాడనీ పెద్దలు చెబుతారు. నరక చతుర్దశి లోకకంటకుడైన నరకాసురుని వధ జరిగిన రోజు కాబట్టి, ఆశ్వయుజ బహుళ చతుర్దశిని ‘నరక చతుర్దశి’ అంటారు. నరకుని పీడ విరగడైనందుకు సంతోష సూచకంగా కొన్ని చోట్ల గడ్డి, తాకాలువంటి వాటితో నరకాసురుని బొమ్మలు తయారుచేసి దహనం చేస్తారు. చతుర్దశ్యాంతు యే దీపాన్ నరకాయ దదంతి చ తేషాం పితృగణాస్సర్వే నరకాత్ స్వర్గమాప్నుయాత్ నరక చతుర్దశి రోజున దీపాలను వెలిగిస్తే, నరకంలో ఉండే పితృదేవతలందరికీ స్వర్గ లోకం ప్రాప్తిస్తుందని భావం. మహాలయపక్షంలో తమ వారసులు సమర్పించే పిండదానాదులు స్వీకరించడానికి భూలోకానికివచ్చిన పితృదేవతలు తిరిగి వారి లోకాలకు ఈ రోజున బయలుదేరుతారట! వారికి దారి చూపుతూ దీపాలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజును దీపావళిగా ప్రజలు జరుపుకొంటారు. రాష్ట్రాల వారీగా సంప్రదాయాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒకే స్థాయి ఉల్లాస, ఉత్సాహాలతో నిర్వహించే వేడుక ఇది. ఈ రోజు ఏ ఇంట దీపాలు వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందన్న విశ్వాసం ఉంది. అందుకే దీపాల వరుసలతో ఆమెకు స్వాగతం పలుకుతారు. ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఇంట ఆమె కొలువై ఉంటుందని నమ్మకం. సాయంత్రం లక్ష్మీరూపమైన తులసికోట ముందు ముందుగా దీపాలు వెలిగిస్తారు. తరువాత శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు. తరువాత పిల్లలూ, పెద్దలూ బాణాసంచా కాలుస్తూ దీపావళిని జరుపుకొంటారు. బలి పాడ్యమి కార్తిక మాసం తొలిరోజును... అంటే కార్తిక శుద్ధ పాడ్యమిని ‘బలి పాడ్యమి’ అంటారు. ప్రతి సంవత్సరం బలి పాడ్యమి రోజు సాయంత్రం తను పాలించిన భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు బలి చక్రవర్తి పాతాళం నుంచి వస్తాడు. ప్రతి ఇల్లూ దీపాల వెలుగులతో, ముగ్గులతో, అలంకరణలతో వేడుకలు చేసుకోవడం చూసి, అతను ఆనందిస్తాడు. ఆ ఆనందం శాశ్వతం కావాలని కోరుకుంటూ తిరిగి వెళతాడు. పురాణాలు పేర్కొంటున్న కథ ఇది. ఈ రోజు ముగ్గు లేదా బియ్యంతో బలి చక్రవర్తి బొమ్మ తయారు చేసి, పూజించాలని పెద్దలు చెబుతారు. ఈ రోజు తప్పనిసరిగా దానం చేయాలనీ, అలా చేసిన వారికి తరగని సిరిసంపదలు లభిస్తాయనీ నమ్మకం. అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి నందగోకులాన్ని కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు గోవర్ధన పూజ చేసే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇంట్లో ఆవు పేడను కొండ ఆకారంలో తీర్చి, పూజిస్తారు. దానికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో ఉన్న గోవర్ధన గిరి పరిక్రమను ఈ రోజుల్లో చెయ్యడం పవిత్రంగా భావిస్తారు. గోవర్ధన గిరి చుట్టూ సుమారు 23 కి.మీ. మేర సాగే ఈ పరిక్రమలో వేలాది భక్తులు పాల్గొంటారు. గుజరాతీయుల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. వారు దీన్ని ‘బెస్తు వర్ష్’ అంటారు. యమ ద్వితీయ కార్తీక శుద్ధ విదియను ‘యమ విదియ’, ‘యమ ద్వితీయ’, ‘భాతృ విదియ’ అని అంటారు. యమధర్మరాజును ఆయన సోదరి యమీ (యమునా) దేవి ఈ రోజున ఆహ్వానించి, ఆతిథ్యం ఇచ్చిందట. దానికి సంతృప్తుడైన యముడు ఈ రోజున ఎవరు తన సోదరి ఇంట భోజనం చేస్తారో వారికి నరక బాధలు ఉండవని, అంతేకాకుండా వారి సౌభాగ్యం పెరుగుతుందనీ వరం ఇచ్చాడు. అలాగే సోదరి చేతి భోజనం చేసిన సోదరులకు అపమృత్యు దోషం ఉండదని చెప్పాడు. అందుకే ఈ రోజున సోదరి ఇంట భోజనం చేస్తారు. దీన్నే ‘భగినీ హస్త భోజనం’ అని పిలుస్తారు. ఉత్తరాదిన ఈ రోజును ‘భాయ్ దూజ్’గా వ్యవహరిస్తారు. |
దీపావళి అంటేనే దీపాల పండుగ. సకల సంపదలనూ, సౌభాగ్యాన్నీ ప్రసాదించే శ్రీమహాలక్ష్మీ దేవికి వెలుగుల ద్వారా ఆహ్వానం పలికితే ఆమె కటాక్షం లభిస్తుందన్నది పెద్దల మాట. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె వినియోగించాలి. లక్ష్మీదేవి క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది. కాబట్టి పాల నుంచి ఉత్పత్తి అయిన నెయ్యి ఆమెకు ప్రీతికరం. అందుకని నెయ్యితో దీపాలు వెలిగించి, లక్ష్మీదేవిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయని శాస్త్ర వచనం. దీపారాధనకు కొన్ని నియమాలున్నాయి. ఒకసారి వెలిగించిన వత్తిని మరోసారి వాడడం మంచిది కాదు. అలాగే ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించరాదంటారు. అగరువత్తులతోనో, అగ్గిపుల్లలతోనో దీపాన్ని వెలిగించాలి. కొవ్వొత్తుల వాడకం శ్రేష్ఠం కాదు. మట్టి, వెండి, ఇత్తడి, పంచలోహాలతో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో దీపం పెడితే, ఒక ప్రమిద కింద మరో ప్రమిద పెట్టాలి. పూజ చేస్తున్నప్పుడు దీపం కొండెక్కిపోతే ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మళ్ళీ దీపం వెలిగించవచ్చు. దీపాల్లోని ముఖాలను బట్టి, అంటే వాటిలో పెట్టే వీలున్న వత్తుల సంఖ్యను బట్టి కూడా ఫలితాలు ఉంటాయంటోంది శాస్త్రం. దాని ప్రకారం, ఒకే వత్తి ఉండే ఏకముఖి దీపం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. రెండు వత్తుల ద్విముఖ దీపం కుటుంబ ఐక్యతకు దోహదం చేస్తుంది. మూడు వత్తుల త్రిముఖ దీపం ఉత్తమ సంతాన సౌభాగ్యాల్ని చేకూరుస్తుంది. చతుర్ముఖ దీపం పశుసంపదనూ, ధన సంపదనూ పెంచుతుంది. పంచముఖ దీపం సిరిసంపదలను వృద్ధి చేస్తుంది. |
No comments:
Post a Comment