జాజి, జమ్మి, దర్భ, కొండమల్లెలు, మల్లెలు, గన్నేరు, నాగపుష్పాలు, పున్నాగ, అశోక, సంపెంగ, పొగడ, తామర, మారేడు అన్ని దేవుళ్ల పూజకూ ఉపయోగించవచ్చు.
స్త్రీ దేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు∙ ఎర్రమందారాలు మినహా మరే ఇతర ఎర్రనిపూలను పురుష దేవతల పూజకు వాడరాదు∙ విష్ణుమూర్తిని అక్షతలతోనూ, దుర్గను గరికతోనూ, గణపతిని తులసితోనూ, శివుణ్ణి మొగలిపూవులతోనూ పూజించరాదు∙ దేవతార్చనకు వాడే పూలను కడగటం, వాసన చూడటం అపరాధం.
చిరగనివి, పురుగులు లేనివి, తాజాగా ఉన్నవి, తన తోటలో లేదా పెరటిలో పూసినవి, ద్రవ్యం ఇచ్చి కొనుగోలు చేసినవి, ఇంటి యజమాని అనుమతితో కోసిన చెట్టు పూలను మాత్రమే పూజకు ఉపయోగించడం శ్రేష్ఠం.
విష్ణువును మాలతి, జాజి, మొగలి, మల్లె, అశోకం, సంపెంగ, పున్నాగ, పొగడ, కలువ, మల్లె, గన్నేరు, ఉత్తరేణి, గుంటగలగర, చండ్ర, జమ్మి, గరిక, దర్భ పూలతో పూజిస్తే మిక్కిలి ప్రసన్నుడవుతాడు. అదేవిధంగా మరువం, దమనం, తులసి పత్రాలతో పూజించడం ప్రశస్తం.
మామిడిపూల గుత్తులతో పూజించడం మహా ప్రీతికరం.
No comments:
Post a Comment