Thursday, 5 July 2018

శంఖం











పాంచజన్యం
భం భం బోలే!  
సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో శంఖానికి విశేష ప్రాధాన్యం ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మధనం చేసినప్పుడు ఈ శంఖం పుట్టిందని చెబుతారు. అప్పటి నుంచి పాంచజన్యంగా మహావిష్ణువు వామహస్తంలో ఒదిగిపోయింది. శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా భావిస్తారు. 
శంఖం రెండు పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని అర్థం. జలం ఉంచే మంచి కలశమే శంఖం. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. దానిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యం కలుగుతుంది. దీనిని సంపదలకు ప్రతీకగా చెబుతారు.
నవవిధులలో, అష్టసిద్ధులలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, హారతిలో, యజ్ఞాలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎప్పుడూ ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల ఆర్థికవృద్ధి కలుగుతుందని నమ్మకం.
శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలుంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేసి.. సుఖసంతోషాలను కలుగజేస్తుంది. శంఖాలు ముఖ్యంగా మూడు రకాలు.
దక్షిణావృత శంఖం: ఎడమ చేతిలో పట్టుకునేది. వీటిని పూజకు మాత్రమే ఉపయోగిస్తారు.
మధ్యావృత శంఖం: మధ్యలో నోరున్నది.
ఉత్తరావృత శంఖం: కుడి చేతిలో పట్టుకునేది. దీనిని ఊదడానికి వినియోగిస్తారు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం ఉత్తరావృత శంఖాలే.
ఇవీ పేర్లు:  లక్ష్మీ శంఖం, గోముఖం, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ శంఖం ఇలా ఎన్నో పేర్లున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో అనేకరకాల శంఖాలు పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్ర శంఖాన్ని పూరించారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి, ప్రతిష్ఠలకు, లక్ష్మీ ఆగమనాన్ని సూచిస్తుంది. అందుకే మన నిత్యపూజాదికాలలో శంఖాన్ని పూరించడం కూడా ఉంటుంది. శివపూజలో, హారతి సమయంలో, ధార్మిక ఉత్సవాలలో, శుభాశుభ సందర్భాల్లోనూ శంఖం పూరించే సంప్రదాయం ఉంది.
* శని శంఖానికి నోరు పెద్దదిగానూ, పొట్ట చిన్నదిగానూ ఉంటుంది.
* రాహు,కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి
* రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి.
* ముత్యపు శంఖాలు మిలమిల మెరిసిపోతుంటాయి.
* వినాయక శంఖం తొండంతో ఉంటుంది.
* కూర్మ శంఖం తాబేలు ఆకారంలో, వరాహ శంఖం పంది ఆకృతిలో ఉంటాయి.






శంఖం విశిష్టత ఏమిటి?
  భారతీయ సనాతన సంప్రదాయంలో శంఖానికి విశిష్టమైన ప్రాధాన్యత వుంది. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే సమయంలో శంఖాన్ని వూదుతారు. శంఖం నుంచి వెలువడే శ‌బ్దం పలురకాల రుగ్మతలను నివారిస్తుందని పురాతన వైద్యశాస్త్రాలు తెలుపుతున్నాయి. శ్రీమహావిష్ణువు శంఖం పాంచజన్యం ఎంతటి పవిత్రమైందో తెలిసిందే. శంఖం ఆవిర్భావానికి సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ వుంది. శంఖచూడుడనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహంతో కృష్ణకవచాన్ని పొందాడు. ఆపై బ‌ల‌గ‌ర్వంతో స్వర్గంపై దండెత్తగా ఇంద్రుడు పరమేశ్వరుడిని శరణు కోరాడు. శంఖచూడుని పీడ తొలగించేందుకు శివుడు విష్ణువును సంప్రదించాడు. అంత విష్ణువు బ్రాహ్మణ రూపంలో శంఖచూడుని అభిమానాన్ని చూరగొని కృష్ణకవచ ఉపదేశం పొందాడు. అనంతరం శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు.శంఖచూడుని దేహం సముద్రంలో పడిపోగా ఆయన సతీమణి తులసి తన పాతివ్రత్యమహిమతో శంఖంగా మార్చిందని తెలుస్తోంది. శంఖంలో పోసిన నీరు కొద్ది గంటల తరువాత శక్తి గల నీరుగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి వచ్చింది. శంఖాల్లోనూ పలు రకాలున్నాయి. దక్షిణభాగం తెరిచివుంటే దక్షిణావర్తశంఖం అంటారు. ఇది విష్ణువుకి, శివునికి ప్రీతపాత్రమైనది.శంఖాన్ని కిందపెట్టకుండా ఏదైనా పళ్లంలో పెట్టి పూజామందిరంలో వుంచాలి. శంఖాన్ని పవిత్రంగా చూసుకోవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.



శంఖముల రకములు: 
మనం బాగా విన్న కొన్ని శంఖాల గురించి చెప్తా. అవే మన కురుక్షేత్రంలో పూరించిన కొన్ని శంఖాలు అన్నమాట. శ్రీ కృష్ణుడు పూరించిన శంఖం పాంచజన్యం, ధర్మరాజు పూరించిన శంఖం అనంతవిజయం (అంతం లేని విజయాల్ని పొందుతాడుట), భీముడు పూరించిన శంఖం పౌండ్రం, అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం, నకులుడు పూరించిన శంఖం సుఘోష, సహదేవుడు పూరించిన శంఖం మణిపుష్పక, కాశీ రాజు పూరించిన శంఖం శిఖండి, దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు పూరించిన శంఖం సాత్విక. ఇవే కాక మనకి చాలా రకముల శంఖములున్నాయి.  

శంఖములు అన్నిటినీ ముఖ్యముగా మూడు రకములుగా విభజించారు. అవేమిటంటే:

 
౧. దక్షిణావర్త శంఖములు: 
వీటిని తమిళములో వలం పురి అని, కన్నడములో బల మురి అని  సంబోధిస్తుంటారు. దక్షిణము అంటే కుడి చేతి వైపు మరియు ఆవర్తనము అంటే తెరుచుకొనుట. ఇవి కుడిచేతి వైపు తెరచుకుని ఉండుట వలన ఎడమచేతితో పట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. వీటిని పూజలకి మాత్రమే ఉపయోగిస్తారు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వీటిల్లో మళ్ళీ పురుష శంఖాలు, స్త్రీ శంఖములు (వీటినే శంఖిని) అని రెండు రకములున్నాయి. పురుష శంఖములు చాలా గరుకుగా  దళసరిగా ఉంటాయి. స్త్రీ శంఖములు మాత్రం చాలా  సున్నితంగా పలుచగా ఉంటాయి. ఈ స్త్రీ శంఖములయినటువంటి శంఖిని శంఖములు పూజకి, పూరించడానికి కూడా పనికిరావు. లక్ష్మీ శంఖం,శివ శంఖం, పాంచజన్యం దక్షిణావర్త శంఖములకి ఉదాహరణలు. పాంచజన్యం అనే శంఖం మనకి సుపరిచితమే. శ్రీ మహా విష్ణువు శంఖం పేరు పాంచజన్యం. శ్రీ కృష్ణుడు భారత యుద్ధ సమయంలో పూరించిన శంఖం. ఇది పురుష దక్షిణావర్త శంఖము. 


౨. ఉత్తరావర్త లేదా వామావర్త శంఖములు:  
ఉత్తరము లేదా వామ భాగము అంటే ఎడమ చేతి వైపు ఆవర్తనము అంటే తెరుచుకొనుట. ఇవి ఎడమచేతి వైపు తెరుచుకుని ఉండుట వలన కుడి చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇవి చాలా సులభముగా లభ్యమవుతాయి. సముద్రపు ఒడ్డున ఎక్కువగా దొరుకుతాయి. వీటిల్ని ఎక్కువగా పూరించడానికి ఉపయోగిస్తారు. 
౩. మధ్యమావర్త శంఖములు:
మధ్యలో నోరు ఉన్నశంఖములని అన్నిటినీ మధ్యమావర్త శంఖములు అంటారు. అంటే పూరించగలిగే శంఖములు అన్నీ మధ్యమావర్త శంఖములన్నమాట. 








శంఖములు కనిపించు రీతిని బట్టి వాటికి చాలా పేర్లు ఉన్నవి. అవి:
౧. లక్ష్మీ శంఖం:
శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. దీనిని పక్కన ఉన్న మూడు ఉబ్బెత్తు ఆకారాల ద్వారా గుర్తించవచ్చును.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే  అంటూ లక్ష్మీ దేవిని పూజిస్తే కోరినవి ఇస్తుందిట. 








౨. గోముఖ శంఖం:
ఈ శంఖములు గోవు యొక్క ముఖ ఆకారమును పోలి ఉండుట వలన వీటిని గోముఖ శంఖములు అంటారు.










౩. కామధేను శంఖం
౪. దేవ శంఖం

౫. సుఘోష శంఖం: 
సుఘోష అంటే మంచి శబ్దము అని అర్ధం. ఈ శంఖమును నకులుడు మహా భారత యుద్ధ సమయములో పూరించెను. మంచి వాళ్లకి సుమధురముగా, చెడ్డ వాళ్లకి భరించలేని శబ్దము రావడం దీని ప్రత్యేకత అని చెప్తారు.  నాకు దానికి సంబంధించిన చిత్రం దొరకకపోవడం వలన జత చేయుటలేదు. 
౬. గరుడ శంఖం:
ఇవి గరుక్మంతుని ఆకారమును పోలి ఉండుటవలన ఆ పేరు వచ్చినది.




గరుడ శంఖం
౭. మణిపుష్పక శంఖం:
మహాభారత యుద్ధ సమయములో సహదేవుడు పూరించిన శంఖం మణిపుష్పక శంఖం.  నాకు దానికి సంబంధించిన చిత్రం దొరకకపోవడం వలన జత చేయుటలేదు.
రాక్షస శంఖం
౮. రాక్షస శంఖం:
ఈ శంఖాలకి వంటి మీద పెద్ద పెద్ద ముళ్లు ఉండి చూడడానికి భయంకరంగా ఉంటాయి.






శని శంఖం
౯. శని శంఖం:


ఈ రకములయిన శంఖాలకి నోరు పెద్దదిగా, పొట్ట చిన్నదిగా ఉంటుంది. ఒంటి మీద ముళ్లు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని, కంటక శని మొదలయిన శని సంబంధిత దోషాలని నివృత్తి చేయడానికి ఈ శని శంఖాలని పూజిస్తారు. శని శంఖాన్ని పూజించే వారికి పేదరికం, ఆక్సిడెంట్లు దరి చేరవని నమ్మకం. 








సర్పాకార శంఖం




౧౦. రాహు శంఖం మరియు ౧౧. కేతు శంఖం: 
ఈ రాహు కేతు శంఖాలు రెండూ సర్పాకారంలో ఉంటాయి కనుక వాటిని సర్పాకార శంఖాలు అని కూడా అంటారు. వీటిని ఆయా గ్రహాల దోష పరిహారార్ధం ఉపయోగిస్తారు. 




౧౨. కూర్మ శంఖం:
కూర్మ శంఖం

ఇవి తాబేలు రూపంలో ఉండటం వలన వాటికి ఆ పేరు వచ్చింది. ఈ శంఖములని గంగా జలముతోనూ పచ్చి పాలతోనూ శుభ్రపరచి ఇంట్లో పెట్టి పూజిస్తే అన్నిటా విజయులవుతారని నమ్మకం.  











౧౩.వరాహ శంఖం:
ఇవి వరాహమును పోలి ఉండుటవలన వాటికి ఆ పేరు వచ్చింది.


వరాహ శంఖం 















౧౪. ముత్యపు శంఖాలు:




వీటినుండి ముత్యములు వస్తాయి కనుక వీటికి ఆ పేరు వచ్చినది. కొన్ని శంఖములకి బాగా సాన పెట్టడం వలన ముత్యాల్లా మెరుస్తాయి వాటిని కూడా ముత్యపు శంఖములు అనే సంబోధిస్తారు.








౧౫. గణేశ శంఖాలు: 
ఇవి వినాయకుని ఆకృతిని పోలి ఉంటాయి. తొండము బాగా కనిపిస్తూ ఉంటుంది. గణేశ శంఖాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు అని నమ్మకం. వీటి వలన వాస్తు దోషాలు కూడా పోతాయట.



















No comments:

Post a Comment