Sunday, 22 July 2018

రామాయణం క్విజ్ పేరు డు

సంపాతి తమ్ముడి పేరు జటాయువు.

రావణుడి భార్య మండోదరి.

రావణుడికి వానర వీరులు గురించి చెప్పిన వారెవరు?
శరణుడు.
రామదండులో వారధి కట్టగలిగిన నలుని గురించి శ్రీరామునికి వరుణుడు చెప్పారు. నలుడే తన గురించి శ్రీరామునికి "అడగకుండా చెప్పకూడదనే నియమం" చేత చెప్పలేదు.

రమ్య పర్వతం మీద ఉండే వానర వీరుడు రామదండులో ఉన్నాడు. అతని పేరేమిటి?
కుముదుడు.

శాల్వేయ పర్వతం మీద ఉండే వానర వీరుడు రామదండులో ఉన్నాడు. అతని పేరేమిటి?
శరభుడు.

రామాయణంలో భాసకర్ణుని, ప్రభాసుని ఎవరు సంహరించారు?
హనుమంతుడు.

హనుమంతుడు ఎవరి నోటిలోకి వెళ్లి చెవిలో నుంచి ఇవతలకు వచ్చాడు?
సురస.
రావణుడు ఇంకొక స్త్రీని బలాత్కరించిన అతని తల నూరు చెక్కలవుతుందని శపించింది ఎవరు?
బ్రహ్మ.

పుష్పక విమానంలో ఏ దేవి మూర్తిని ఏనుగులు పూజిస్తున్నట్లు బొమ్మలు ఉన్నాయని సుందరకాండ చెబుతుంది?
లక్ష్మీదేవి.

శ్రీరాముడు రాజ్యాభిషేకానికి ధరించిన కిరీటం ఎవరు తయారు చేసింది?
బ్రహ్మ.

ఇది తొలుత ఎవరు ధరించింది?
మనువు.

వాయుదేవుడు సమర్పించిన ముక్తాహారాన్ని శ్రీరాముడు ఎవరికిచ్చాడు?
సీత.

శ్రీరాముని అనుజ్ఞతో ఆ హారాన్ని సీతాదేవి ఎవరికిచ్చింది?
హనుమంతుడు.

No comments:

Post a Comment