Friday, 16 March 2018

దిగంబర స్నానం మహాదోషం!

దిగంబర స్నానం మహాదోషం!

ఒంటిమీద బట్టలు లేకుండా స్నానం చేస్తే, నీటికి అధిదేవత అయిన వరుణిడికి ఆగ్రహం కలుగుతుంది. పుష్కర స్నానానికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఈ విషయం భాగవతం దశమస్కంధంలో ఆవిష్కృతమవుతుంది. గోపికలందరూ కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించటానికి నదీ స్నానానికి వెళ్తారు. అక్కడ వివస్త్రలై స్నానాలు చేస్తారు. ఈ విషయాన్ని గ్రహించిన కృష్ణుడు.. గోపికల బట్టలను తీసుకొని ఒక చెట్టుకొమ్మపై కూర్చుంటాడు. అప్పుడు గోపికలు, తమ బట్టలను తిరిగి ఇవ్వమని కృష్ణుడిని వేడుకుంటారు. అప్పుడు కృష్ణుడు.. ‘గొపికల్లారా! మీకు తెలియకుండా ఒక తప్పు చేశారు. వివస్త్రలై నదీ స్నానం చేసి వరుణుడికి కోపం తెప్పించారు. వరుణుడి ఆగ్రహం పోతే తప్ప మీ వ్రతానికి ఫలితం ఉండదు. ఫలితం దక్కకపోవటం వల్ల మీరు దైవనింద చేసినా ఉపయోగం ఉండదు. దీనికి ప్రాయశ్చితం దైవాన్ని చేతులు ఎత్తి ప్రార్థించటమే..’ అని వివరిస్తాడు. అప్పుడు గోపికలు రెండు చేతులు నుదుటికి తాకించి కృష్ణుడిని ప్రార్థించి నమస్కరిస్తారు. దీనితో వారికి ఆ దోషం తొలగిపోతుంది.

No comments:

Post a Comment