వృద్ధ గంగ మన గోదావరి
09-07-2015 20:34:59
పుణ్యనదులలో గోదావరి పరమ పవిత్రమైనది. గంగాస్నానం చేసిన వారు కూడా గోదావరి స్నానం తప్పకుండా చేయాలనీ, అప్పుడే సర్వపాపాలు తొలగిపోతాయని మన పూర్వులు చెబుతూ ఉంటారు. ఒకప్పటి గంగ మన గోదావరి అని భావిస్తారు. అందుకే దీనికి వృద్ధ గంగ అనే పేరు కూడా ఉంది. గౌతముడు తీవ్రమైన తపస్సు ఆచరించడం చేత పరమేశ్వరుని అనుగ్రహంతో భువికి దిగివచ్చిన గంగ- గోదావరిగా అనుగ్రహించింది. గౌతముడి గోహత్యా దోషము పోగొట్టింది కాబట్టి దీనికి ‘గోదావరి’నది అని పేరు వచ్చింది.
పుష్కరాలెందుకు?
‘పోషయతీతి పుష్కరం’- అంటే పోషించునది పుష్కరం అని అర్థం. సర్వాన్ని సృష్టించిన చతుర్ముఖ బ్రహ్మ- మానవులను తరింపజేయడం ఎలా? అని ఆలోచించాడు. జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నా- వీటిని సందర్శించటం కన్నా త్వరగా మానవుడి సర్వపాపాలు తొలిగిపోయేల చేయాలనేది బ్రహ్మకు సంకల్పం. అందుకు బ్రహ్మ మహాదేవుడి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన మహాదేవుడు, బ్రహ్మ కోరిక మేరకు పుష్కరుడిని బ్రహ్మ కమండలంలో నీటిధారగా ఉండేలా అనుగ్రహించాడు. పుణ్యప్రదాత అయిన బ్రహ్మదేవుడు పుష్కరుడిని తన కమండలానికే పరిమితం కాకుండా.. మానవుల పాపాలను తొలగించడానికి భూలోకంలో నిలిచి ఉండమని ఆజ్ఞాపించాడు. మేషం మొదలుకుని మీనం వరకు ఉన్న పన్నెండు రాశుల్లో గురుడు ప్రవేశించినపుడు.. దేవతలందరితో సహా పుష్కరుడు కూడా ఆ రాశి అధిష్ఠాన నదిలోకి ప్రవేశిస్తాడు. ఆ పుష్కరుడు ప్రవేశించే పుణ్యకాలాన్ని పుష్కరకాలంగా భావిస్తారు. గురువు మేషంలోకి ప్రవేశించినపుడు గంగానదికి, వృషభంలోకి వచ్చినపుడు నర్మదా, మిథునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకి, సింహంలో గోదావరికి, కన్యలో కృష్ణానదికి, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరధికి, ధనస్సులో బ్రహ్మపుత్రకి, మకరంలో తుంగభద్రకి, కుంభంలో సింధూనదికి, మీనంలో ప్రణతానదికి పుష్కరకాలమనేది శాస్త్రం. ప్రస్తుతం సింహరాశిలో గురుడు ప్రవేశిస్తుండటంతో జూలై 14 నుంచి 25వరకు 12 రోజుల పాటు పవిత్ర గోదావరి పుష్కరాలుగా భావిస్తారు. వీటిని మహారాష్ట్ర అయితే 30 రోజులు కుంభమేళగా ఘనంగా నిర్వహిస్తారు.
‘జన్మ ప్రభృత యత్పాతం స్త్రియావా పురుషేణవా
పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రనశ్యతి’
మానవుడు పుట్టింది మొదలు చేసే పాపాలు తొలిగిపోవాలంటే త్రికరణ శుద్ధిగా పుష్కరస్నానం చేయాలి అని ఈ శ్లోకార్థం. ఆర్షధర్మానుసారం పుష్కరకాలం పితృకర్మలకు అనువైనది. పుణ్యనదులలో, ముఖ్యంగా గోదావరిలో గతంలో ఎందరో మహనీయులు, యోగులు స్నానం చేశారు. వారి దివ్యతేజస్సు మహిమ వల్ల, క్షేత్ర అధిష్టానదేవతల అనుగ్రహం వల్ల, నదీ స్నానం చేసిన వారికి దైవానుగ్రహం లభిస్తుంది.
- స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి

No comments:
Post a Comment