మనిషికి నిజమైన శత్రువులు వారిలో ఉండే అరిషడ్వర్గాలు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి సామాన్యులను పతనమొందిస్తాయి. మధ్యములను అధములుగా మారుస్తాయి. ఇవే మహాత్ములలో ఉంటే.. లోకకల్యాణానికి కారణమవుతాయి.
ఉదాహరణకు..
పరాశరుడు సత్యవతిని కామించడం వల్ల వ్యాసభగవానుడు జన్మించాడు.
శ్రీరాముని కోపం వల్ల కామాంధుడైన రావణ సంహారం జరిగింది.
విశ్వామిత్రుడు వశిష్ఠుని హోమధేనువు నందినిని లోభించటం వల్ల తాను బ్రహ్మర్షి అయ్యాడు.
పరమశివుడు మోహినిని చూసి మోహించటంవల్ల హరిహరపుత్రుడైన ధర్మశాస్త (అయ్యప్ప) పుట్టాడు.
దక్షప్రజాపతి మదగర్వంవల్ల భక్తలోకాలను అనుగ్రహించే దశ మహా విద్యాధిదేవతలు అవతరించారు.
ఇంద్రుని మాత్సర్యం వల్ల.. గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణుని గొప్పతనం లోకానికి తెలిసింది.
No comments:
Post a Comment