దుర్గా దేవి 9 అలంకరణ రూపాలు
దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలాత్రిపుర సుందరి .. గాయత్రి .. అన్నపూర్ణ .. మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చి అమ్మవారి రూపాలేంటో తెలుసుకుందాం.
చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రునితో కలసి ఉండే నక్షత్రాన్ని బట్టి ఆమాసం పేరు వస్తుంది పౌర్ణమితో కూడిన అశ్వినీ నక్షత్రం గల మాసం ఆశ్వయుజ మాసం. ఇదే శరదృతువుకు లేదా చలికాలానికి ప్రారంభం. ఈ మాసంలో శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు గల నవ రాత్రులను శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అంటారు. దక్షిణాయనంలో ఇది హిందువులకు ఎంతో ప్రాముఖ్యత గల పండుగ ఉపనిషద్వాక్యమైన ‘మాత్రు దేవోభవకు ప్రతిబింబంగా మన సంస్కృతిని పరివారాన్ని సమైక్యతను పరిరక్షించే పవిత్ర స్త్రీ మూర్తిని ఈ శరన్నవరాత్రులలో సర్వ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి రూపంలో శక్తి ప్రదాతయైన దుర్గగా జ్ఞానప్రదాతయైన సరస్వతిగా ఐశ్వర్య ప్రదాతయైన లక్ష్మిగా పూజిస్తాం.
ఎందరో మహా యోగులు నిరూపిస్తూ వస్తున్నట్లు ఈ సృష్టి యందు గల చరాచర వస్తువులన్నింటి యందు మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టియందు గల జ్యోతిర్మండలాలు, గాలి, నిప్పు, నీరు, భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయమే. ఆ శక్తినే మహేశ్వరి శక్తిగానూ, పరాశక్తి గాను, జగన్మాత శక్తిగానూ పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాల్లో ఏ నోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాం.
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని శక్తి రూపమే ‘దుర్గ’ అని ఆదిశంకరాచార్యుల వారు అమృతవాక్కులో పేర్కొన్నారు.
ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమౌతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్య్సపురాణం మనకు తెలియచెప్తోంది. దేవతలు భండాసురుడనే రాక్షసుడి బారి నుంచి రక్షించుకొనుటకు ఆ ఆదిపరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమంది వారి వారి శరీర భాగాలను ఖండించుకొని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సంతసించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టం నెరవేర్చింది. ఒక్కో రాక్షసుడిని వధించసాగింది. ఆ ఆదిశక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా పేరొందాయి.
తొలుత ఈ దేవదేవి ‘శ్రీకృష్ణ పరమాత్మ’ ద్వారా గోకులం, బృందావనంలలో పూజలందుకుంది. మధు కైటభుల బారి నుంచి రక్షణకు బ్రహ్మ ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. త్రిపురాసుర సంహారమందు పరమేశ్వరుడు ఈ జగన్మాతను ఆరాధించి విజయం సాధించాడు. దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలసిపోగా దేవేంద్రుడు ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదలను పొందగలిగాడు.
ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు ద్వారా ఏర్పడిన ఈ మానవులు ఎంతగానో ఆరాధించి ఆ దేవీ కటాక్షానికి పాత్రులవుతున్నారు. ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి, హస్తా నక్షత్రముతో ఉన్న శుభదినాన ఈ దేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతోంది. ఆ రోజు నుంచి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు.
‘‘మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను విడనాడడం, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి’’ అని పెద్దలు చెబుతారు.
నవరాత్రి ఉత్సవాలలో దేవి నవాంశల పూజలు చేస్తారు. రెండేళ్ళ నుంచి పదేళ్ళ బాలిక వరకు అనేక రూపాల్లో వారిని పూజిస్తుంటారు. కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను చేసింది.
ఈ పర్వదినాలను మనం దసరా పండుగగా జరుపుకుంటాము ‘దసరా’ లేదా ‘దశహర’ అంటే దశ (పది)ని హరించడం, అంటే రావణుని పదితలలను హరించి శ్రీరాముడు విజయాన్ని పొందిన రోజు విజయదశమి. అంతేకాదు మహాభారతంలో పాండవులు విరాటుని కొలువులో అజ్ఞాతవాసం చేసే సమయంలో కురుసైన్యం ఉత్తర గోగ్రహణం జరపగా శాపవశాన బృహన్నలగా ఉన్న పాండవ మధ్యముడైన అర్జునుడు శమి వృక్షంపై తాము భద్రంగా దాచిన ఆయుధాలను దించిన రోజిది. ఇదే రోజున గాండివ ధారియై కురుసేనలను చెండాడి, విరాటరాజు గోవులను సంరక్షించి విజయంతో తిరిగి వచ్చినది కూడా విజయదశమి నాడే. అందుకే ఈ విజయదశమి రోజు ఆయుధపూజ చేయడం ఆనవాయితీగా మారింది. కాలక్రమేణా ఆయుధాలకు బదులు వాహనాలకు, తమతమ వృత్తులలో ఉపయోగించే ఉపకరణాలకు లేదా పనిముట్లకు, ఆఖరికి ప్రస్తుత కాలంలో కంప్యూటర్లకు ఆయుధపూజ చేస్తున్నాం.
మనకు దసరాలలో బొమ్మలకొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. కొందరు సంక్రాంతికి పెడతారు. రకరకాల బొమ్మలను కొలువుగా తీర్చిదిద్ది పిల్లలను ముత్తైదువులను పేరంటానికి పిలిచి, రోజుకొక తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదిస్తారు. పాటలతో భజనలతో ప్రార్థనలతో జగదంబను స్తుతిస్తారు.
దసరాలో నవమిని మహానవమి, మహార్నవమి అంటాం. ఇది అత్యంత ప్రధానమైన రోజు. మహార్నవమిరోజు జగదంబను తప్పనిసరిగా పూజించాలి.
దశమినాడు పున్ణ పూజ, ఉద్వాసన జరుపుతారు.
విద్యార్ధులు తదితర చదువరులు మూలనక్షత్రంలో సరస్వతీ పూజ చేయాలి. ఎక్కువగా ఉత్తరభారతీయులు విజయదశమినాడు శమీ పూజ చేస్తారు. ఈ రోజు పురజనులు ఊరి సరిహద్దులు దాటి ఈశాన్యదిక్కుగా ప్రయాణించి శమీపూజ నిర్వహించి వెనక్కి తిరిగి వస్తారు. దీనినే సీమోల్లంఘన అంటారు. అంటే సీమ (సరిహద్దు)ను ఉల్లంఘించడం (దాటడం).
విజయదశమి నాడే షిరిడి సాయిబాబా మహా సమాధి చెందారు.
ఈ దసరా నవరాత్రులు ఎంతో సరదాగా సందడిగా ఉండి మనలో భక్తిని స్నేహాన్ని సౌభ్రాతృత్వాన్ని కలిగిస్తాయి. అనంత నామాలు రూపాలు గల అమ్మవారిని ఏ నామంతోగాని ఏ రూపంతో గాని భక్తి -ప్రపత్తులతో ఆరాధించే వారికి సర్వము మంగళకరము, శుభప్రదము.
1వ రోజు -ఆశ్వయుజ పాడ్యమి – శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి
2వ రోజు – ఆశ్వయుజ విదియ – శ్రీ బాలా త్రిపురసుందరీదేవి
3వ రోజు – ఆశ్వయుజ తదియ – శ్రీ గాయత్రి దేవి
4వ రోజు – ఆశ్వయుజ చవితి – శ్రీ అన్నపూర్ణా దేవి
5వ రోజు – ఆశ్వయుజ పంచమి – శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి – లలిథ పంచమి
6వ రోజు – ఆశ్వయుజ షష్టి – శ్రీ మహా లక్ష్మీ దేవి – మహాషష్టి
7వ రోజు – ఆశ్వయుజ సప్తమి – శ్రీ మహా సరస్వతీ దేవి – మహా సప్తమి
8వ రోజు – ఆశ్వయుజ అష్టమి – శ్రీ దుర్గా దేవి – దుర్గాష్టమి
9వ రోజు – ఆశ్వయుజ మహానవమి – శ్రీ మహిషాసురమర్దిని – మహార్నవమి
10వ రోజు – ఆశ్వయుజ దసమి – శ్రీ రాజరాజేశ్వరి – విజయదశిమి
మొదటి రోజు అమ్మవారి స్వరూపం బాలా త్రిపుర సుందరి. శ్రీశక్తి కౌమారి రూపం “బాల” -. అమ్మవారి మూడు రూపాలలో కనిపిస్తుంది – ఒకటి కుమారిగా బాలత్రిపుర సుందరి, రెండు యవ్వనవతిగా లలితాత్రిపుర సుందరి, మూడు వృధ్ధరూపం త్రిపురభైరవి. బాల త్రిగుణైక శక్తి – సరస్వతి విఙ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్నది. బాల ఆనందప్రదాయిని. బాల్యంలో ఉన్న నిర్మలత్వానికి ప్రతీక.
మనసు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి. అభయహస్తం, అక్శమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి, నిత్యసంతోషం కలుగుతుంది. శ్రీ చక్రంలో మొదటి దేవత బాల. కాబట్టి త్రిపుర సుందరి అనుగ్రహంకోసం ఉపాసకులు ముందు బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల భక్తుల పూజలందుకుంటుంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్ళలోపు బాలికలకు అమ్మవారి స్వరూపంగా పూజ చేసి, కొత్తబట్టలు పెట్టాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందర్యై నమ్ణ” అని నూటా ఎనిమిది సార్లు చదవాలి. అమ్మవారికి ప్రత్యేకంగా పాయస నైవేద్యం పెట్టాలి. త్రిశతి పారాయణం చెయ్యాలి.
హ్రీంకారాసన గర్భితానల శిఖాం స్ణౌక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశాంకుశధరామ్ స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరస్పర కళాం శ్రీచక్ర సంచారిణీం
.
రెండోరోజు: శక్తి అవతారం “గాయత్రి దేవి”రెండో రోజు అమ్మవారిని గాయత్రిదేవిగా అలంకరిస్తారు. గాయత్రి సకల వేద స్వరూపిణి. అన్ని మంత్రాలకు మూల శక్తి. అందుకే గాయత్రి మంత్రం మూలమంత్రం. తల్లి ఐదు ముఖములతో ప్రకాశిస్తూ ఉంటుంది – అవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలలో ప్రకాశిస్తూ ఉంటాయి. చేతులలో శంఖ, చక్ర, గద, అంకుశాదులు ధరించి దర్శనమిస్తుంది. పురాణాల ప్రకారం ఆమె ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపఈ రుద్రుడు ఉంటారు.
అమ్మ ప్రాత్ణకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నకాలంలో సావిత్రిగాను, సాయంసంధ్యలో సరస్వతిగానూ పూజలందుకుంటోంది. గాయత్రీ ధ్యానం అనంత మంత్రశక్తి ప్రదాత. అన్ని కష్టాలు, ఉపద్రవాలు శాంతిస్తాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. ఆది శంకరులవారు గాయత్రీమాతను అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. గాయత్రీ మంత్ర జపం చతుర్వేద (నాలుగువేదాల) పారాయణం అంత ఫలితాన్ని ఇస్తుంది. నవరాత్రులలో ఈ రోజు అమ్మవారిని ఉపాసన చేసి, అల్లపు గారె నివేదన చెయ్యాలి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చెయ్యాలి. గాయత్రి స్తోత్రాలను పారాయణ చెయ్యాలి.
ముక్తా విద్రుమ హేమ నీలధవళచాయై ముఖైస్త్రీ క్షణ్ణైయుక్తా
మిందు నిబద్ధరత్న మకుటామ్ తత్వార్ధ వర్ణాత్మికామ్
గాయత్రీం వరదా భయాంకుశకశాశ్శుభ్రమ్ కపాలం గదామ్
శంఖం చక్రమధార విందం యుగళమ్హసైర్వహం తీం భజే
.
మూడోరోజు: మహాలక్ష్మికమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
“యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
.
నాలుగోరోజు: అన్నపూర్ణఅన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. “హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
ఉర్వీసర్వజయేస్వరీ జయకరీ మాతాకృపా సాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
.
అయిదోరోజు: లలితా త్రిపురసుందరిత్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్య్ర ద్ణుఖాలను తొలిగించి, సకల ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, సంహార రూపిణి.
కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి కుంకుమార్చన చెయ్యాలి. లలితా అష్టోత్తరంతో పూజించాలి. “ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని సార్లు జపించాలి.
ప్రాత్ణస్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృధులమౌక్తిక శోభినామ్
ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్
.
ఆరో రోజు: సరస్వతిశరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది.
అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని “విజయారంభం” అని పిలుస్తారు.
ఘంటాశూల హలాని సంఖమునలే చక్రం ధనుస్సాయకం
హస్తాబ్జేర్దధతీం ఘనాంత విలసిచ్చీతాంశు తుల్య ప్రభాం
గౌరీదేహ సముద్భవాం త్రిజగతామాధారాభూతాం
మహాపూర్వా మాత్ర సరస్వతీ మనుభజే శుంభాది దైత్యార్దినీం
.
ఏడో రోజు: దుర్గాదేవిదుర్గాష్టమిని మహాష్టమి లేక వీరాష్టమి అని కూడా అంటారు.ఈ దినం పూజింపబడే నవదుర్గ మాత “మహాదుర్గ”. కొన్ని చోట్ల అష్టమి రోజున మహాభగళ, నారాయణిదేవిని పూజించడం కద్దు. దుర్గతులను నివారించే మహాశక్తి స్వరూపిణి అమ్మవారు దుర్గాదేవి. ఈ రూపంలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని ఈ మాత అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మని అర్చిస్తే శత్రుబాధలు నశిస్తాయి. విజయం కలుగుతుంది. సకల గ్రహ బాధలు తల్లి నామం జపిస్తే తొలగిపోతాయి. ఆరాధకులకు అమ్మ శీఘ్ర అనుగ్రహకారిణి, ఎర్రని బట్టలు పెట్టి, ఎర్ర అక్షతలు, ఎర్ర పుష్పాలతో అమ్మను పూజించాలి. దుర్గా సూక్తం పారాయణం చెయ్యాలి. “ఓం దుం దుర్గాయైనమ్ణ” అనే మంత్రాన్ని పఠించాలి. పులగాన్నం నివేదనం చెయ్యాలి, దుర్గ, లలిత అష్టోత్తరాలు పఠించాలి.ఈ దినం “ఆయుధ పూజ లేక అస్త్రపూజ” చేస్తారు (కొన్ని చోట్ల నవమి రోజు, మరికొన్ని చోట్ల దశమి రోజు కూడా చేస్తారు). తాము వాడే పనిముట్లని, సామాగ్రిని శుభ్రపరిచి, వాటికి పూజ చేస్తారు.
అలాగే నవరాత్రులలో ప్రతీ దినం “సుహాసినీ పూజ” చెయ్యడానికి అనుకూలమే ఐనా చాలాచోట్ల అష్టమిరోజున ప్రత్యేకంగా సుహాసినీ పూజ చేస్తారు. ఈ పూజలో ముత్తైదువు ఐన స్త్రీని అమ్మవారి స్వరూపంగా పూజించి, దక్షిణ, పండ్లు, కొత్తబట్టలూ సమర్పించి, భోజనం అర్పిస్తారు. తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ పండుగ ఈ రోజున ప్రత్యేకంగా చేస్తారు. ఇది మహాలయ అమావాస్యరోజున మొదలై, అష్టమిరోజు ముగుస్తుంది. గౌరీ దేవిని బతుకమ్మగా కొలుస్తారు. భక్తులు అమ్మవారికి కుండలలో అన్నం వండుకొని, దానికి కుంకుమ కలిపి భక్తితో మెత్తపై పెట్టుకుని అమ్మవారి ఆలయానికి మోసుకుని వెళ్ళి సమర్పిస్తారు.ఈ రోజున ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు పాడుతారు.
విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణం
కన్యాభ్ణి కరవాలఖేటి విలద్దస్తాభిరాసేవితాం
హస్తైశ్చక్రగదాసిఖే విసిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణా మనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే
.
ఎనిమిదో రోజు: మహిషాసుర మర్ధినిఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే “మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది.
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి “ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం (పులి¬ర), గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
మహిష మస్తక నృత్తవినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
జననరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూదిని
.
తొమ్మిదో రోజు (విజయదశిమి): రాజరాజేశ్వరీ దేవిశ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే “దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే… “శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. “రామలీల ఉత్సవాలు”. పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ బొమ్మలను తగులబెడతారు.
శమీపూజ:
సాయంత్రం క్రొత్త బట్టలు కట్టుకుంటారు. గుడికి వెళతారు. . విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. జమ్మి ఆకులను కోసికొని ఇంటికి తిరిగి వస్తారు. కొంతమంది జమ్మి చెట్టు మొదలులో వుండే మట్టిని తీసుకుని ఇంటికి వస్తారు.
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు.అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు.ఇకపోతే.. శ్రీరామచంద్రుడు విజయదశమి, విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం వల్ల ఆ శమీవృక్షము, “రామస్య ప్రియదర్శిని” అయ్యింది. అందుచేత అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా, సర్వదుఖాల నుంచి ఉపశమనం పొందాలన్నా, దారిద్య్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో జీవించాలన్నా నవరాత్రుల్లో ఆ దేవదేవిని పూజించడంతో పాటు శమీపూజ, శ్రీలలితా సహస్రనామ పారాయణలు చేయాలని పురోహితులు అంటున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ, బాసరలో సరస్వతీదేవి, ఇంకా అమ్మవారి శక్తి పీఠాలలో విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు. యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు. కనకదుర్గమ్మకి కృష్ణానదిలో హంస పడవలో మీద మల్లేశ్వరస్వామివారి ఆలయం నుండి తెప్పోత్సవం విశేషంగా జరుగుతుంది. దసరాలలో అమ్మవారిని ఒక్కరోజైనా దర్శనం చేసుకోవడం మహద్భాగ్యంగా భక్తులు భావిస్తారు.
ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది తొమ్మిది రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే ‘దేవీనవరాత్రులు’ అని పిలుస్తారు. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో(ఆవు పేడతో) నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజాసామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా (ఐదు రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు) దూర్వాంకురములు (గరిక పోచలు) తయారుగా ఉంచుకోవాలి.
పూజా విధానము: ఆ తరువాత తెల్లవారుఝామునే లేచి అభ్యంగన స్నానం (తలస్నానం) చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకొని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్రచర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని, ఆసనం పైన వేసి, లేని వారు (పీట మీద) తూర్పు ముఖంగాని, ఉత్తర ముఖంగాని కూర్చోవాలి. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువునూ, పరమాత్మను ప్రార్థించి, పది నిమషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహా సంకల్పం చెప్పవలెను. గృహస్తులైనవారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను.ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తిపుణ్యాహమలు చెప్పవలెను. ఆతరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి తొమ్మిది రోజులు (నవరాత్రి) గాని, ఏడు రోజులు గానీ, హీన పక్షం మూడు రోజులు కానీ, లేదా ఒక్క రాత్రి శాస్త్రానుసారము దీక్ష చేయాలి. పూజాకాలంలో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతమాచరించాలి. తొమ్మిది రోజుల పూజ అయ్యేవరకూ, అఖండ దీపారాదన రాత్రింబగళ్ళు వెలగాలి.
పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి, అగ్నాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాండీవమును దించి కౌరవులతో యుధము చేయటముతో ముగిసినది. విజయదసమి నాడు వారి అగ్నాతవాసము యొక్క గడువుముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది.రాజులకు ఈ నవమి నాదు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికీ ఆయుధ పూజగా చేయబదుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు రాజలాంఛనములు తానెక్కిన వాహనములు గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను.
శమీ శమతే పాపం శమీ శతృ వినాశనం… అని మంత్రంతో శమీ(జమ్మి) వృక్షమును పూజించ వలెను. అపరాజితాదేవిని పూజించి ఊరుపొలిమేరను దాటి సీమోంల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి, అపరాజితా దేవిని ఈ విధముగ పూజించాలి.
మధ్యే అపరాజితాయై నమ్ణ ఇత్యవరాజితామావాహ్య
తద్దక్షిణే క్రియా శ్క్యైనమ్ణ ఇతి జయాం నామత్ణ
ఉమాయైనమ్ణ ఇతి విజయామా వాహ్మ అపరాజితా
యైనమ్ణ జయాయైనమ్ణ విజయాయై నమ్ణ
అపరాజితా దేవిని పూజించి రాజులు పట్టాభిషేకమును విజయదశమి నాడు చేయుదురు. విదేశములు వెళ్ళువారుకూడా ఈ విజయముహూర్తమే శ్రేష్ఠము.
కాని ఏకాదశి స్పర్శ ఉండరాదు
No comments:
Post a Comment