Saturday, 13 October 2018

నవదుర్గామ్‌ నమోస్తుతే!







నవదుర్గామ్‌ నమోస్తుతే!



అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ. నవరాత్రుల్లో అమ్మవారిని రోజుకొక రూపంతో పూజించే సంప్రదాయం - ఆచారం ఉంది. ఈ తొమ్మిది రోజులూ పూజించే దుర్గాదేవి రూపాలను ‘నవదుర్గలు’ అంటారు. ఈ నవరాత్రార్చనలో తొమ్మిది రాత్రులు దేవిని పూజిస్తే సంవత్సరమంతా పూజించిన ఫలం లభిస్తుందని పెద్దల మాట.

1 శైల పుత్రి
పరమ శివుని వివాహమాడిన పర్వతరాజ పుత్రి పార్వతి. శైల పుత్రి. ఈమె వృషభవాహిని. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి.

2 బ్రహ్మచారిణి
పార్వతి శివుని భర్తగా పొందడానికి బ్రహ్మచర్య దీక్షతో కఠిన తపస్సు చేసినందున ‘బ్రహ్మచారిణి’ అనేపేరు వచ్చింది.

3. చంద్రఘంట
శిరసున దాల్చిన అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వల్ల ఈ దేవికి ‘‘చంద్రఘంట’’ అనేపేరు ఏర్పడింది.

4. కూష్మాండ
బ్రహ్మాండాన్ని సృష్టించినది కనుక ఆమెకు ‘కూష్మాండ’ అనే పేరు వచ్చింది. సూర్యుడిలో ఉండి జగత్తుకు వెలుగునిస్తుంది.

5. స్కందమాత
స్కందుడు అంటే కుమారస్వామి. ఆయన తల్లి పార్వతి దేవి అంటే ‘స్కందమాత’. ఆమె ఒడిలో స్కందుడు ఉంటాడు.

6. కాత్యాయని
కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించిన దుర్గావతారం. శ్రీకృష్ణుని పతిగా పొందాలని, గోపికలు అమ్మవారిని ఆరాధించిన రూపం ఇది.

7. కాళరాత్రి
ఈ రూపంలో దేవి శరీరం చీకటిలా నల్లగా ఉంటుంది. అందుకే ‘కాళరాత్రి’ అని పేరు వచ్చింది. భయంకర రూపిణి. అయినా శుభకరి.

8. మహాగౌరి
తెల్లని మేని చాయతో తెల్లని వస్త్రాభరణాలు ధరించిన పార్వతీ రూపమే మహాగౌరి. ఆమె వృషభ వాహిని.

9. సిద్ధిధాత్రి
దేవి చివరి రూపం సిద్ధి ధాత్రి. అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది కాబట్టి ఆమె ‘సిద్ధిధాత్రి’ అయింది.






No comments:

Post a Comment